17, సెప్టెంబర్ 2017, ఆదివారం

సమస్య - 2466 (కనుల రెప్ప లకట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కనుల రెప్ప లకట కత్తు లాయె"
(లేదా...)
"కన్నుల రెప్పలే యకట కత్తులుగా ననుఁ జీల్చె నిల్వునన్"
(బి.వి.వి.హెచ్.బి. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

62 కామెంట్‌లు:

  1. కాంత కోరినట్టి కనకంపు హారము
    కాంతుడివ్వలేక కలతపడగ
    క్రోధదుఃఖ భరిత కామిని యెరుపైన
    కనులరెప్ప లకట కత్తులాయె!

    రిప్లయితొలగించండి
  2. అతివ!వేరు గలరె?యన్నులమిన్ననీ
    కన్న నెన్న గలనె? కాన రావె
    నిదుర పోక నిచట నీకైయెదురుజూడ
    "కనుల రెప్పలకట కత్తు లాయె"

    రిప్లయితొలగించండి
  3. భగదత్తుడు ఉవాచ:

    కనుల రెప్పలకట కావలి కాయక
    కనులు తెరవ లేక గంత నెత్తి
    పోరుచుండ నేను కౌరవ పక్షాన
    కనుల రెప్ప లకట కత్తు లాయె!

    రిప్లయితొలగించండి


  4. పటపట పటయనుచు పద పడి జంపాడ
    కనుల రెప్ప లకట, కత్తు లాయె
    పలుకులట జిలేబి, పదతాడనమ్ముల
    సత్యభామ సరళి చక్కగాను !

    జిలేబు

    రిప్లయితొలగించండి

  5. ధైర్యమైనవారె తథ్యసఖ్యంబున్న
    తెలిసొ లేకొ ముప్పుతేవఁగలరు
    కర్ణు నమ్మినట్టి కౌరవుల్ మడిసిరి
    కనుల రెప్పలకట కత్తులాయె

    రిప్లయితొలగించండి

  6. రోడ్ సైడ్ రోమియో మొర !

    అన్నుల మిన్నగాంచితిని యచ్చెరు వుల్లట చేరి పాఱగన్
    కన్నుల రెప్పలే యకట కత్తులుగా ననుఁ జీల్చె నిల్వునన్,
    పెన్నిధి యై పదంపడుచు పేరడ గించెను మిత్రమా భళా
    తన్నులు తప్పె చక్షువులు తామరకంటిని జూడనౌ సుమా

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. ఒంటివాని బ్రతుకు ఓమాను నందున
    గుబులు పుట్టెనమ్మ గుర్తుకొచ్చి
    ఏడ్చి ఏడ్చి గుండె ఏరాయె తడిసిన
    కనుల రెప్ప లకట కత్తు లాయె

    రిప్లయితొలగించండి
  8. వసియె వాడని పసి బాలల మనసుల
    కసిని జూపి విషపు కాటువేయ
    మనిషి సిద్దపడుట మానుష మేయౌనె
    కనుల రెప్ప లకట కత్తులాయె

    (పసి వారిపై ఆయాలు,అటెండర్ల అకృత్యాలపై)

    రిప్లయితొలగించండి
  9. వసియె వాడని పసి బాలల మనసుల
    కసిని జూపి విషపు కాటువేయ
    మనిషి సిద్దపడుట మానుష మేయౌనె
    కనుల రెప్ప లకట కత్తులాయె

    (పసి వారిపై ఆయాలు,అటెండర్ల అకృత్యాలపై)

    రిప్లయితొలగించండి
  10. ఆ.వె. ప్రజల సొమ్ము దినెడి ప్రతినిధు లొకవంక
    కన్న బిడ్డ జంపు గన్న దండ్రి
    దండనమ్ము వేయు దక్షత లేమితో
    కనుల రెప్ప లకట కత్తు లాయె
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  11. కరుణ కాలవాల మగునట్టి కన్నులు
    కామమోహిత మగు కన్నుజూడ
    కదనరంగమందు కాలునిదలపింప
    కనులరెప్ప లకట కత్తులాయె!

    రిప్లయితొలగించండి
  12. ఎదురు చూచు చుండ నెంత కు రాడాయె
    పతి యటంచు చెలియ భంగ పడి యె
    నిద్ర లేమి వల్ల నిప్పు కణము లౌచు
    కనుల రెప్ప ల క ట కత్తులా యె

    రిప్లయితొలగించండి
  13. విడిన కురులు వేయిపడగల నాగులై
    బుసలుకొట్ట , కనులు విసము గ్రక్క ,
    రాజరాజుఁ జూచు ద్రౌపది విచ్చిన
    కనుల రెప్పలకట! కత్తులాయె !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  14. రక్ష సేయు వారె భక్షింప నెంచిన
    నెంత వార లైన నేమి జేతు
    రిందిరమ్మ జూడ నీతీరె హతమయ్యె
    "కనుల రెప్ప లకట కత్తు లాయె"

    రిప్లయితొలగించండి
  15. అన్నులమిన్న యందమది అద్భుతమై తలపింప వేడుకన్
    మున్నొక చక్కనైన యువపుంగవమూర్తి తదేకదృష్టితో
    కన్నులు వాల్చకుండ కనగా నపుడా జవరాలు తల్చెనే
    "కన్నుల రెప్పలే యకట కత్తులుగా ననుఁ జీల్చె నిల్వునన్"

    రిప్లయితొలగించండి
  16. గురువు గారికి నమస్సులు. నా పూరణ లోని లోపాలను ఎత్తి చూపుడు.
    ఆo బరమున కేగు నతివల కీనాడు
    ఇ ల్లు వదల కుం డు నింట నిప్పు
    నట్లు వగచి పోవ రమణి వేణి మ ది న
    క నుల రెప్పల నకట కత్తి లాయె.
    వందనములు.

    రిప్లయితొలగించండి
  17. అన్నుల మిన్నగాదలచి అమ్మయు నాన్నయు నప్పగించగా
    సున్నిత భావనన్ విడిచి క్షోభను జూపుచు కర్కశంబుతో
    వన్నెలు చిందు బుగ్గలను వాడిగ జీల్చుచు హింస జూపగా
    కన్నుల రెప్పలే యకట కత్తులుగా ననుజీల్చె నిల్వునన్

    రిప్లయితొలగించండి
  18. కార్యమెద్దియైన కాసుల నివ్వక
    కాలు కదపదాయె కవిల కట్ట
    కట్టుబాటులేని కార్యాలయము జూడ
    కనులరెప్ప లకట కత్తులాయె!

    రిప్లయితొలగించండి
  19. తనను మోసగించి దనదు రూపమ్మున
    సంగ మించి నట్టి జంభ బేధి
    చెంత నున్న సతిని గౌతముడు గనగన్
    "కనుల రెప్ప లకట కత్తు లాయె

    రిప్లయితొలగించండి
  20. అన్నుల మిన్నగాదలచి అమ్మయు నాన్నయు నప్పగించగా
    సున్నిత భావనన్ విడిచి క్షోభను జూపుచు కర్కశంబుతో
    వన్నెలు చిందు బుగ్గలను వాడిగ జీల్చుచు హింస జూపగా
    కన్నుల రెప్పలే యకట కత్తులుగా ననుజీల్చె నిల్వునన్

    రిప్లయితొలగించండి
  21. దుష్టుడైనవాడు దూరానగనుపించె
    కలికి తిట్టుకొనుచు కనులలోన
    వానిబొమ్మదలచి వరుసరెప్పలగొట్టె
    కనుల రెప్ప లకట కత్తులాయె.

    రిప్లయితొలగించండి

  22. బాపుబొమ్మ బోలు బహురూప సుందరి
    వాలు చూపుతోను బంధమేయ
    మాటకందని తన మధుర వీక్షణముల
    కనులరెప్ప లకట కత్తులాయె!

    రిప్లయితొలగించండి
  23. అన్నులమిన్న!సత్య!మది నంతగ గుందగ నీకు నేటికిన్?
    జెన్నుగ బారిజాతమును జెంతనె నీవును రాగ స్వర్గమున్
    గ్రన్నన జేరి యుద్ధమున గ్రందుగ నింద్రు నెదిర్చిదెత్తు;నీ
    కన్నులరెప్పలే యకట!కత్తులుగా నను జీల్చె నిల్వునన్.

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. అద్భుతమైన పూరణలటో నలరించిన కవిమిత్రునికి అభినందనలు. ప్రతిదినము మీపూరణలతో మేలుకొలపవసినదిగా కోరుచున్నాను.

      తొలగించండి
  25. పొరుగుగృహపు యింతి ధరియించ తొడవుల
    తనకులేవటంచు తలచితలచి
    నగలకొరకు కనలి నాట్యమాడ వధువు
    కనుల రెప్పలకట కత్తులాయె

    రిప్లయితొలగించండి
  26. కుంభజ కృతవర్మ ఘోర శకుని శల్య
    కర్ణ ముఖ్య యోధ కాయ మోర్చ
    నాయుధమ్ము లయ్యె నభిమన్య వీరున
    కనుల రెప్ప లకట కత్తు లాయె

    [వీరునకు + అనుల = వీరునకనుల; అని = యుద్ధము]


    త్రినేత్రుని నయనాగ్నికి నాహుతి యగుటకు నొక్క క్షణము ముందు మన్మథుని మనోగతము:

    అన్నుల మిన్నఁ గల్పగను నన్నగ సూనను బంచ నన్ను వే
    కన్నుల దేవ సన్నుత వికాసిత కౌశికుఁ డిద్ద చిత్తుఁ డా
    పన్న సురాళిఁ గావగ విపన్నుఁడ నైతిని యన్న శంభు చేఁ
    గన్నుల రెప్పలే యకట కత్తులుగా ననుఁ జీల్చె నిల్వునన్

    రిప్లయితొలగించండి
  27. వెన్నెల మిన్నునన్ గురియ వెచ్చగ జేరగ నీదు కౌగిలిన్
    తిన్నగ వచ్చినట్టినను తిట్టకు జాగయెనంచునోచెలీ
    యన్నుల మిన్న నీ కనుల నాగ్రహమింతగనేల చెప్పుమా
    కన్నుల రెప్పలే యకట కత్తులుగా ననుఁ జీల్చె నిల్వునన్

    రిప్లయితొలగించండి
  28. క్రొవ్విడి వెంకట రాజారావు:
    దుర్విదగ్థుడైన దుష్ట కీచకుడట
    ద్రౌపది పస గాంచి తమకమొంది
    వెంబడించు నంత వేండ్రపడిన యామె
    కనుల రెప్ప లకట! కత్తులాయె

    రిప్లయితొలగించండి
  29. అన్నులమిన్ననీదుకసి యగ్గలమై నను కాల్చుచుండె నీ
    కన్నుల రెప్పలే యకట కత్తులుగా ననుఁ జీల్చె నిల్వునన్
    వెన్నుడుసత్యదాసుడని ప్రేయసి! యీజగమెల్ల యెంచెడిన్
    పన్నుగ నీదుకౌగిలిడి వల్లభ! కాచుము నాదుతాపమున్

    రిప్లయితొలగించండి
  30. కోరినట్టి ధనముగొడుకునకీయని
    కారణంబునసుతుడలుగనతని
    కన్నురెప్పలకట కత్తులాయెనుజూడు
    తండ్రి చర్యలెటుల యుండునొనిక

    రిప్లయితొలగించండి
  31. కలువ దళ ము వంటి కనులు న్న పడుచుకు
    కళ్ళ కల క వచ్చి కలత రేప
    కనులు కెంపులౌచు క ణ క ణ మండ గా
    కనుల రెప్ప లకట కత్తులాయె

    రిప్లయితొలగించండి
  32. పద్మనాభు డిడెను పారిజాత సుమము
    రుక్మిణీ సతి కని రోషమొంద
    నారదుండు దెల్ప నా సత్యభామ కు
    కనుల రెప్ప లకట కత్తు లాయె

    నిన్నటి సమస్యకి నా పూరణ

    సత్కర్మ నిరతులమవన్
    సత్కార్యమ్ములె మన కపజయ కారణముల్
    తాత్కాలిక మది గాగ వి
    పత్కాలము నందు జయము బ్రహ్మ లిఖితమే

    రిప్లయితొలగించండి
  33. సుమగణంబు లొక్కచోట నుంచినయట్టి
    ఐంద్రజాలికుండు హస్త మూపి
    వాని జూచి యేమొ పఠియించి మూయంగ
    కనుల రెప్ప, లకట కత్తు లాయె.

    హ.వేం.స.న.మూర్తి.

    రిప్లయితొలగించండి
  34. అన్నువతోగనంబడుచునానన మందున లేతనవ్వుల
    న్మిన్నగ గానిపించుచును మేదిని యందున వెల్గులీనునా
    నున్ననిపాప బుగ్గలను నోటినిబట్టుచు ముద్దులీయగా
    కన్నుల రెప్పలేయకట కత్తులుగాననుజీల్చెనిల్వునన్

    రిప్లయితొలగించండి
  35. .శోభ శోభనాన “లాభంబు లాశించి
    అల్లుడలిగియుండ”?యాలిమనసు
    మల్లెపూల పరుపు ముల్లెపానుపుగాగ?
    కనులరెప్ప లకట కత్తులాయె|
    2.నమ్ముకున్న జడలపూలు నవ్వుచుండెగంధమై|
    “నమ్మికొన్నవాడు” రాక” నాటిరాత్రి పగలుగా
    సొమ్ము,షోకు వీడి మనసుసొమ్మసిల్లె వింతగా|
    కమ్మ,కనులరెప్పలకట కత్తులాయె నందుకే|

    రిప్లయితొలగించండి
  36. …………………………………………………………గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    నలిగి పోవ కుచగిరులు - హత్తుకొనె బ్రియున్ |

    వాలిపోయి మిగుల పరవశి౦చు

    రసిక యొక్క మదన రసికతార్ద్ర మయిన

    కనుల రెప్ప లకట కత్తు లాయె

    రిప్లయితొలగించండి
  37. అన్నులమిన్న నవ్వు ,పరిహాసపు మాటలమీటు జూపులున్
    పున్నమి వెన్నెలంతటను బోయగ| ప్రేమయొకింత జేరగా?
    వన్నెలచీర,వాల్జడకు వాడని పువ్వులగంధబంధపున్
    కన్నులు రెప్పలేయ?కట|కత్తులు గానను-జీల్చె నిల్వునన్|{కట=అకట}

    రిప్లయితొలగించండి
  38. అన్నులమిన్న భూమిసుత నంబుజ నేత్రిని దెచ్చి లంకయం
    దున్న నశోక వాటికను ధూర్తదనంబున నిల్పినంత నా
    పన్నము నున్న దన్వి శుభ వారిజ నేత్రియు నేడ్చుచుండ నా
    కన్నుల రెప్పలే యకట కత్తులుగా ననుఁ జీల్చె నిల్వునన్

    రిప్లయితొలగించండి
  39. రిప్లయిలు
    1. పద్మ సరళి రణము పన్నంగ కౌరవుల్
      యుత్తర మగఁడురికి చిత్తు జేసి
      దొరుక నొంటరగుచు దుష్టుల సైగతో
      కనుల రెప్ప లకట కత్తు లాయె!

      తొలగించండి
    2. పద్మ సరళి రణము పన్నంగ కౌరవుల్
      యుత్తర మగఁడురికి చిత్తు జేసి
      దొరుక నొంటరగుచు దుష్టుల సైగతో
      కనుల రెప్ప లకట కత్తు లాయె!

      తొలగించండి
    3. పద్మ సరళి రణము పన్నంగ కౌరవుల్
      యుత్తర మగఁడురికి చిత్తు జేసి
      దొరుక నొంటరగుచు దుష్టుల సైగతో
      కనుల రెప్ప లకట కత్తు లాయె!

      తొలగించండి
  40. మాట వినని భర్త మాయ మాటలు జెప్పి
    క్లబ్బు లందు దిరుగు కాలు డనగ
    నిల్లు పట్ట కుండ నింతులతో గూడె
    కనులు రెప లకట కత్తు లాయె

    రిప్లయితొలగించండి
  41. దూరదర్శన్ హైదరాబాద్ వారు
    ఈ సమస్య నిచ్చి నట్లు జ్ఞాపకము
    నాపూరణ
    గుండె కొలిమి లోన కోరికలన్నియు
    మింటికెగసి మిణుకు మిణుకు మనగ
    ఆస చావకేను గాసిలి చూడంగ
    కనుల రెప్ప లకట కత్తులాయె
    .





    రిప్లయితొలగించండి
  42. శ్రీగురుభ్యోనమః

    అన్నమొ రామచంద్రయని యార్తిగ వేడిన వాని జూచి నే
    మిన్నకయుంటి గాని తృణమైనను సాయము జేయనైతి నా
    కొన్నను శక్తిలేక తనకున్న దరిద్రమునెంచి చూడ యా
    కన్నుల రెప్పలే యకట కత్తులుగా ననుఁ జీల్చె నిల్వునన్

    రిప్లయితొలగించండి
  43. ఆడ శిశువు జనియించె ననుచు,వగచి
    కన్న తలి దండ్రులే పూని కఠినులయ్యి
    కరుణ యొక్కింత లేకయే కావరమున
    పార వేయుట న్యాయమే బయలు లోన?
    కనుల రెప్ప లకటకట ! కత్తులయ్యె !


    రిప్లయితొలగించండి
  44. ప్రవరాఖ్యుని జూచి వరూధిని మాటలు..........

    సన్నుతవర్య మీదు కనుసన్నల నిల్చినఁ జాలు నన్ను న
    త్యున్నత సౌఖ్య కేళికి నియోగముఁ జేయ వదేమి చోద్యమో
    మున్నిది గాంచనైతి ముని ముఖ్య తపోధను చెంతనైన నీ
    కన్నుల రెప్పలే యకట కత్తులుగా ననుఁ జీల్చె నిల్వున

    రిప్లయితొలగించండి
  45. మాట వినని భర్త మాయ మాటలు జెప్పి
    క్లబ్బు లందు దిరుగు కాలు డనగ
    నిల్లు పట్ట కుండ నింతులతో గూడె
    కనుల రెప్ప లకట కత్తు లాయె

    రిప్లయితొలగించండి
  46. ఎర్రబారెరంగ! యేలకోమరినీదు
    కన్నురెప్పల,కటకత్తులాయె
    నేమిమాయజేసెనేమొయాకర్రలు
    మాయలాడిచేతిమహిమవలన

    రిప్లయితొలగించండి


  47. 1.రామచంద్రు విడిచి రావణు పత్నిగా

    రమ్మటంచు పల్క రావణుండు

    క్రోధమూని సీత కుత్సితు నటజూడ

    కనుల రెప్ప లకట కత్తు లాయె.


    2.ఒంటిగాను సాగు నువిదను గాంచుచు

    మతియు లేని యట్టి మాట లాడు

    చుండ నాగ్రహించి చూచిన యాసతి

    కనుల రెప్ప లకట కత్తు లాయె.


    3.నిండు కొలువులోన నీచుడైనట్టి యా

    దుస్స సేను డీడ్వ ద్రుపద దుహిత

    యొక్క కురుల నపుడె యురిమి చూసిన నాతి

    కనుల రెప్ప లకట కత్తు లాయె.

    4.నరకు డేసినట్టి నారాచముల ధాటి

    కొర్వ లేక పతియు కూలబడగ

    కనలి నట్టి సత్య కరమందు విలుదాల్చ
    కనుల రెప్ప లకట కత్తు లాయె.

    రిప్లయితొలగించండి
  48. కవిమిత్రులకు నమస్కృతులు!
    జ్వరం కారణంగా ఈరోజు మీ పూరణలను సమీక్షించలేకపోయాను. మన్నించండి.
    ఈనాటి సమస్యకు చక్కని పూరణలను అందించిన
    గుఱ్ఱం సీతాదేవి గారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారికి,
    జిలేబీ గారికి,
    గన్నవరం లలిత్ గారికి,
    తంగిరాల రఘురామ్ గారికి,
    చేపూరి శ్రీరామారావు గారికి,
    కొరుప్రోలు రాధాకృష్ణారావు గారికి,
    రాజేశ్వర రావు గారికి,
    మైలవరపు మురళీకృష్ణ గారికి,
    గుఱ్ఱం జనార్దన రావు గారికి,
    నేమాని సోమయాజులు గారికి,
    పoచరత్నo వెంకట నారాయణ రావు గారికి,
    పూసపాటి కృష్ణ సూర్య కుమార్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    జంధ్యాల జె.కె. బాపూజీ గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    పోచిరాజు కామేశ్వర రావు గారికి,
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    క్రొవ్విడి వెంకట రాజారావు గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    భాగవతుల కృష్ణారావు గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి,
    గురుమూర్తి ఆచారి గారికి,
    ఫణి కుమార్ తాతా గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    అక్కయ్య గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    శ్రీపతి శాస్త్రి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    డా. బల్లూరి ఉమాదేవి గారికి
    .................... అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  49. సార్! ఒక్క ఫోన్ కాల్ దూరములో ఉన్నాను. నమస్సులు!

    రిప్లయితొలగించండి
  50. ద్రౌపది భీమసేనునితో :

    అన్నయె జూదమాడి నను నందున నోడఁగ దుస్ససేనుడున్
    మన్ననలేక నీడ్చ సభ మానితులెల్లరు మిన్నకుండినన్
    కన్నుల రెప్పలే యకట కత్తులుగా ననుఁ జీల్చె నిల్వునన్
    వెన్నుడు బ్రోచి చీరలను పేర్మినొసంగ భయమ్ము వీడితిన్

    రిప్లయితొలగించండి
  51. కన్నులు వేయి యుండినను కత్తులు కావుర కేకి రెప్పలే
    కన్నులు వేయి యుండినను కత్తులు కావుర శక్రు రెప్పలే
    కన్నది మూసి తెర్వగను కన్నియ యోహొ! "ప్రియమ్మ వారియర్"
    కన్నుల రెప్పలే యకట కత్తులుగా ననుఁ జీల్చె నిల్వునన్!

    రిప్లయితొలగించండి