20, సెప్టెంబర్ 2017, బుధవారం

సమస్య - 2469 (విజ్ఞత లేనట్టి నరుఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"విజ్ఞత లేనట్టి నరుఁడె విజయము నందున్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

69 కామెంట్‌లు:

  1. యజ్ఞము హృదినిన్ జేయుచు
    నజ్ఞానము తీర గోరి యాదృచ్ఛికమౌ
    ప్రజ్ఞను నమ్మి ధనార్జన
    విజ్ఞత లేనట్టి నరుఁడె విజయము నందున్

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞానుండన బడుగద
    విజ్ఞత లేనట్టి నరుడె ;విజయము నొందున్!
    ప్రజ్ఞానంబ్రహ్మయనెడి
    సుజ్ఞానము గలిగినట్టి సుజనుం డిలలో!

    రిప్లయితొలగించండి
  3. యజ్ఞేశ్వరుని యగడును
    విజ్ఞత లేనట్టినరుడె,విజయము నందున్
    ప్రాజ్ఞుడుసతతము నిలలో
    యజ్ఞము జేయుచు ఘనముగ యద్భుత మిడగన్

    రిప్లయితొలగించండి
  4. ప్రాజ్ఞుడ ననిమురియును కడు
    విజ్ఞత లేనట్టి నరుఁడె , విజయము నందున్
    యజ్ఞము జేసిన మనుజుడె
    నజ్ఞానము మదిని వీడి యానందించున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మనుజుడె యజ్ఞానము..." అనండి.

      తొలగించండి
    2. ప్రాజ్ఞుడ ననిమురియును కడు
      విజ్ఞత లేనట్టి నరుఁడె , విజయము నందున్
      యజ్ఞము జేసిన మనుజుడె
      యజ్ఞానము మదిని వీడి యానందించున్

      తొలగించండి
  5. అజ్ఞత నొందున పజయము
    విజ్ఞత లేనట్టి నరుఁడె; విజయము నందున్
    ప్రజ్ఞను జూపుచు కార్యపు
    విజ్ఞాన మరసి చరించు విజ్ఞుడె పుడిలన్.

    రిప్లయితొలగించండి
  6. సుజ్ఞాన రహిత పౌరులె
    యజ్ఞానమ్మావహింప నలసత్వముతో
    నజ్ఞతతో నెన్నుకొనిన
    విజ్ఞత లేనట్టి నరుడె విజయము నందున్.

    రిప్లయితొలగించండి
  7. విజ్ఞాన సంపదయును ర
    సజ్ఞతమీఱంగ సకలసద్గుణరాశుల్
    ప్రజ్ఞను మెండుగ కలిగి య
    విజ్ఞత లేనట్టి నరుఁడె విజయము నందున్

    రిప్లయితొలగించండి
  8. "ప్రజ్ఞా!విజితుం డెవ్వడు?
    జిజ్ఞాసువు జీవితతటి జేరంగలడా?"
    "యజ్ఞంబంతటి ప్రశ్నము!
    విజ్ఞత లేనట్టి నరుడె ; విజయము నందున్."

    రిప్లయితొలగించండి
  9. అజ్ఞాన తాడితుండయి
    ప్రజ్ఞాలేశంబు గనక బడుగౌ ననుచున్
    విజ్ఞాను లనరె యేవిధి
    విజ్ఞత లేనట్టి నరుఁడె విజయము నందున్?

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి


  10. ఆజ్ఞా పాలన జేయడు
    విజ్ఞత లేనట్టి నరుఁడె; విజయము నందున్
    ప్రజ్ఞా నముతో, మనుజుడు
    జిజ్ఞాసువుడై జిలేబి జివ్వాడగనన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. ప్రజ్ఞను చూపని మూర్ఖుడు
    విజ్ఞతలేనట్టినరుడె;విజయమునందున్ సుజ్ఞాన మార్గ గామిగ
    విజ్ఞాన సుధార్ణవంబు ప్రీతిన్ దోగన్

    రిప్లయితొలగించండి
  12. గురువు గారికి నమస్సులు. నా పూరణ లోని లోపాలను ఎత్తి చూపుడు.
    ప్రజ్ఞా భార తి యo దున
    జిజ్ఞాసువు పొం ద గ కవి జిష్ణూ ప్రశస్తిన్
    య జ్ఞా క్రతువున కామపు
    విజ్ఞత లేనట్టి న రుడు విజయము నo దున్
    వందనములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "జిష్ణూ ప్రశస్తిన్ యజ్ఞా క్రతువున..." అర్థం కాలేదు.

      తొలగించండి
  13. జిజ్ఞాసా రాహిత్యం
    బజ్ఞానము మనుజకోటి నణచును భువిలో
    ప్రజ్ఞకునై తన్నాశమె
    విజ్ఞత, లేనట్టి నరుఁడె విజయము నందున్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  14. యజ్ఞము లెన్నియొ జేయుచు
    ప్రాజ్ఞుల నిల గారవించి పండిత విభుల
    న్నాజ్ఞల మీఱక నుండు న
    విజ్ఞత లేనట్టి నరుఁడె విజయము నందున్

    రిప్లయితొలగించండి
  15. ప్రాజ్ఞుల పల్కుల వినుచున్
    ప్రజ్ఞానముకోరినట్టి ప్రజ్ఞానిధియై
    అజ్ఞానిపరిషదుక్తకు
    విజ్ఞత లేనట్టినరుడె విజయమునందున్

    రిప్లయితొలగించండి
  16. అజ్ఞానము తో నోడు ను
    విజ్ఞత లేనట్టీ నరుడే;విజయ ము నందు న్
    ప్రజ్ఞా పాట వ ము లు గల
    సు జ్ఞాని యె నన్ని చోట్ల సులువు గ నె పుడు న్

    రిప్లయితొలగించండి
  17. శ్రీకృష్ణుడు:

    పార్థా!

    ప్రజ్ఞ గలుఁగు వీరుడవై
    సుజ్ఙానము తోడ వెన్ను జూపకుమయ్యా!
    యజ్ఞమె రణమన ! వీడు మ
    విజ్ఞత! లేనట్టి నరుఁడె విజయము నందున్

    రిప్లయితొలగించండి
  18. అఙ్ఞానుల యోటు (ఓటు) గొనుచు

    విఙ్ఞత లేనట్టి నరుడె విజయము న౦దున్ |

    ప్రఙ్ఞా పటిమను గల ధ

    ర్మఙ్ఞానికి రాణి౦పు లేదు రాజ్యము న౦దున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి


    2. విజ్ఞత నన్నియు నేర్చుచు

      నజ్ఞానమునెల్లవీడి  నాదరమొప్పన్

      సుజ్ఞాని యగుచు వసుధ న

      విజ్ఞత లేనట్టి నరుడె విజయము పొందున్.


      ప్రజ్ఞయు శూన్యంబైనను

      విజ్ఞాని ననుచు తిరుగక విశ్వమునందున్

      యజ్ఞాదులు నేర్చుకొని య

      విజ్ఞత లేనట్టి నరుడె విజయము పొందున్.

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  19. ప్రాజ్ఞుఁ డవజ్ఞా దూరుఁ డ
    భిజ్ఞ కృతజ్ఞులు నుపజ్ఞ విషయాధిక త
    త్వజ్ఞులతోఁ బర తంత్రా
    విజ్ఞత లేనట్టి నరుఁడె విజయము నందున్

    [పర తంత్ర + అవిజ్ఞత = పరతంత్రావిజ్ఞత: శత్రువుల తంత్రములను తెలుసుకొన లేక పోవుట; అభిజ్ఞుఁడు = స్మరణము కల వాఁడు; ఉపజ్ఞుఁడు = స్వయముగా తెలుసుకొను వాఁడు; అవజ్ఞ = తిరస్కారము]

    రిప్లయితొలగించండి
  20. ప్రజ్ఞను గలిగియు నుంటయె
    విజ్ఞత, లేనట్టినరుడె విజయమునందున్
    సుజ్ఞాను దరికి జేరక
    యజ్ఞానపు రక్కసె పుడు నాతని దరినిన్

    రిప్లయితొలగించండి
  21. విజ్ఞత ప్రజ్ఞత సుజ్ఞత
    లజ్ఞానపు మెట్టులవియ యార్యా ! తలపన్
    విజ్ఞత యుండిన జాలదు
    విజ్ఞత లేనట్టి నరుడె విజయము నందున్

    రిప్లయితొలగించండి
  22. జిజ్ఞాస గోగ్రహణమున
    అజ్ఞానుల యావుమందలదలించుటచే
    ప్రజ్ఞగ పార్థుడు”యుత్తర
    విజ్ఞత లేనట్టి”నరుడె|విజయమునందున్| {ఉత్తర=ఉత్తరుడు}

    రిప్లయితొలగించండి

  23. పిన్నక నాగేశ్వరరావు.

    విజ్ఞానము నార్జించుచు

    ప్రజ్ఞా పాటవము తోడ పదుగురు
    మెచ్చన్
    సుజ్ఞానిగ వెలుగొంది య

    విజ్ఞత లేనట్టి నరుడు విజయము
    నందున్.

    రిప్లయితొలగించండి
  24. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సంజ్ఞానమ్మును నేర్చుచు
    ప్రాజ్ఞత గూడిన తెఱగున పఱగెడి పవిదిన్
    విజ్ఞానిగ చెన్నొందు య
    విజ్ఞత లేనట్టి నరుడె విజయము నందున్

    క్రొవ్విడి వెంకట రాజారావు:

    సంజ్ఞానమ్మును నేర్చుచు
    ప్రాజ్ఞత గూడిన తెఱగున పఱగెడి పవిదిన్
    విజ్ఞానిగ చెన్నొందు య
    విజ్ఞత లేనట్టి నరుడె విజయము నందున్







    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో ప్రాస తప్పింది. సవరించండి.

      తొలగించండి
  25. అఙ్ఞాని యనంగ నిలను
    విఙ్ఞత లేనట్టి నరుడె! విజయము నందన్
    విఙ్ఞాన మొకటె చాలదు
    ప్రఙ్ఞను జోడించ వలయు పాటవములకున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర్ గారూ! సమస్య "విజయము నందున్" కదా!

      తొలగించండి
    2. పొరపాటును చూపినందుకు కృతఙ్ఞతలు సీతాదేవి గారూ, సరి యైన సమస్యతో పూరణను సవరించాను.
      ధన్యవాదాలు.
      గురువు గారికి నమస్సులు, ధన్యవాదాలు.
      అఙ్ఞాని యనంగ నిలను
      విఙ్ఞత లేనట్టి నరుడె! విజయము నందున్
      విఙ్ఞానమునకు తోడుత
      ప్రఙ్ఞను జోడించి నడచు పద్ధతి నేర్వన్!

      తొలగించండి
  26. గురువు గారు పూరణ కాస్త సవరించినాను.
    కవి జిష్ణూన్ పొగ డెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన పద్యం మొత్తం ఇస్తే బాగుండేది. 'జిష్ణున్' అని కదా ఉండాలి!

      తొలగించండి
  27. విజ్ఞానముతోడుత ర
    సజ్ఞతను బడచి పుడమిని సాగెడి ఘనుడౌ
    ప్రజ్ఞావంతుడు క్షయమౌ
    విజ్ఞత లేనట్టి నరుడే విజయము నందున్

    రిప్లయితొలగించండి
  28. శ్రీగురుభ్యోనమః
    విజ్ఞానపు టెల్లలకై
    ప్రజ్ఞా భాస్కరుని వోలె ప్రభవించుచు తాన్
    జిజ్ఞాసన్ కృషి సల్పు కు
    విజ్ఞత లేనట్టి నరుఁడె విజయము నందున్

    రిప్లయితొలగించండి
  29. ప్రజ్ఞతను కోలుపోవును
    విజ్ఞత లేనట్టి నరుడె, విజయము నందున్
    విజ్ఞానముతో తనలో
    ప్రజ్ఞను తావెలికితీయు ప్రజ్ఞాలుడిలన్!!!

    రిప్లయితొలగించండి