28, సెప్టెంబర్ 2017, గురువారం

సమస్య - 2477 (చద్దుల బ్రతుకమ్మ...)

కవిమిత్రులారా,
సద్దుల బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు!

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్"

60 కామెంట్‌లు:

  1. పద్దెము పాటలు పాడుచు
    హద్దులు లేనట్టి వాణి హైదరబాదున్
    ప్రొద్దుట దినమున రాత్రియు
    చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్


    షంషాద్ బేగం (హిందీ సినిమా గాయని)

    రిప్లయితొలగించండి
  2. ముద్దకు సంస్కృతి గలిగిన
    నొద్దిక తెలగాణ భువిని నొయ్యారంబౌ
    విద్దెల గని పరవశయై
    చద్దుల బ్రతుకమ్మ నాడే షంషాద్బేగమ్.

    రిప్లయితొలగించండి
  3. హద్దులు లేకయె పండుగ
    నొద్దికగా కలిసి మెలిసి యూరి జనమ్ముల్
    ముద్దుగ నాడుట సహజము
    "చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్"

    రిప్లయితొలగించండి
  4. రద్దయె బానిస బతుకులు
    మొద్దులవలె నిదురలేల?పూజకురండీ!
    పెద్దలు దీవింపంగన్.
    చద్దుల బ్రతుకమ్మనాడె షంషాద్ బేగమ్

    రిప్లయితొలగించండి
  5. హద్దులు మీరిన హర్షం
    బద్దిన ముఖ సీమతోడ నతివలు ఘనులై
    ముద్దుగ నాడెడు వేళగు
    చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్!


    రిప్లయితొలగించండి
  6. వద్దనక సంతసంబున
    పద్దెనిమిదిమంది పొరుగు వారలతోడన్
    ముద్దగు మతసహనముతో
    చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్.

    రిప్లయితొలగించండి


  7. ముద్దుల లరారు మోరము
    తద్దయు మించారు నగవు, తరుణంబననౌ,
    నొద్దిక గా పుట్టెనుగద
    చద్దుల బ్రతుకమ్మ నాడె, షంషాద్ బేగమ్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఇరువురుకీ నెనర్లు !

      Ignorance is bliss !

      చద్దుల బతుకమ్మ అంటే ఏమిటో తెలియక పదాల పేర్పంతే !

      చద్దుల బతుకమ్మ అంటే ఏమిటి ?

      జిలేబి

      తొలగించండి
    2. తెలంగాణాలో దేవీనవరాత్రులలో చక్కగా తట్టలలో పూవులను పేర్చి వాటిచుట్టూ తిరుగుతూ అమ్మవారి పాటలు పాడుతూ స్త్రీలందరూ సంబరంగా జరుపుకునే పండుగ! ఆంధ్ర్రలో సంక్రాంతికి గొబ్బెమ్మల పండుగ వలె!
      తెలంగాణ వారు యింకా వివరంగా తెలుపగలరు!

      తొలగించండి
    3. జిలేబీ గారికి అంకితం:

      కద్దుగ 'పూవుల' 'బియ్యము'
      ముద్దుగ 'అటుకుల' 'అలిగిన'
      'ముద్దల' 'అట్టుల్'
      కొద్దిగ 'వేపల' 'వెన్నల'
      'చద్దుల' బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్

      నవరాత్రుల బతుకమ్మ:

      1. ఎంగిలి పూల బతుకమ్మ
      2. అటుకుల బతుకమ్మ
      3. ముద్దపప్పు బతుకమ్మ
      4. నానే బియ్యం బతుకమ్మ
      5. అట్ల బతుకమ్మ
      6. అలిగిన బతుకమ్మ
      7. వేపకాయల బతుకమ్మ
      8. వెన్నముద్దల బతుకమ్మ
      9. చద్దుల బతుకమ్మ

      తొలగించండి

    4. జీపీయెస్ వారు

      నమో నమః

      జిలేబి

      తొలగించండి
    5. బతుకమ్మలన్నింటిని కందంలో యిమిడ్చిన సొగసు బహు బాగున్నది!👏👏👏👏

      తొలగించండి
  8. సిద్ధయ్య పెండ్లి యాడెను
    సద్దాము తనయను మెచ్చి, సంతోషముతో
    పెద్దలు ప్రోత్సాహ పరచ
    చద్దుల బ్రపుకమ్మ నాడె షంషాద్ బేగమ్

    రిప్లయితొలగించండి
  9. సిద్ధయ్య పెండ్లి యాడెను
    సద్దాము తనయను మెచ్చి, సంతోషముతో
    పెద్దలు ప్రోత్సాహ పరచ
    చద్దుల బ్రపుకమ్మ నాడె షంషాద్ బేగమ్

    రిప్లయితొలగించండి
  10. శ్రద్ధగ పూజలు జేయుచు
    హద్దులు మీరక మనుగడ హాయి యటంచున్
    బుద్ధిగ పదుగురి చెలిమిని
    చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగం

    రిప్లయితొలగించండి
  11. ముద్దని పరమత సహనము
    హద్దులనుచెరిపి కరమగు నానందముతో
    నొద్దికగ హిందువులతో
    చద్దుల బ్రతుకమ్మ నాడే షంషాద్ బేగమ్

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా
    "గద్దరె""యాద్గిరి కేగెన్
    వద్దని బురఖాల బ్రతుకు బాసిరి వనితల్
    ఖుద్దుగ "సిద్దీపేట"న
    చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్!

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టా
    ఆర్యా, "షిర్డీపేట"యె "సిద్దిపేట"గా మారిందేమో.మీ సమస్యకు సిద్ధి లభించిన స్థానమది.చాలా అద్భుత సమస్య యిది.ధన్యవాదములు!

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా
    గద్దర్ గారి ఆత్మ కథను ఆంగ్లంలోని కనువదించి ప్రచురించాను.వీరి యింటిలో దేవుళ్ళ పటాలు లేకుంటే తన తల్లి మానసిక పూజ చేసినట్లు వ్రాసుకున్న పాటల రాజు యాదగిరిని సందర్శించినట్లు వార్తలలో చదివినాను.

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా
    "ఖుద్దు"ఖద్ అనే ఉర్దూ పదం T.S.లో "స్వయంగా"అనే stress ను తెలిపే పదము.Thanks.

    రిప్లయితొలగించండి
  16. మైలవరపు వారి పూరణ:

    ఇద్దరికిని మతపరిమితి
    కద్దని మన కల్వకుంట్ల కవితయె దెల్పన్
    ముద్దుగ ముసుగుల తోడనె
    చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  17. డా.పిట్టా
    ఆర్యా}
    బే.గమ్ అంటే దుఃఖమెరుగనిది. రాణి అనే గౌరవ వాచకము.ఈ యెంపిక T.S పాలనను గుర్తు చేస్తున్నది.స్త్రీలకు , సర్వ జాతులకు మేలు చేకూర్చే పతకాల స్రష్టకు (కేసియార్ కు) అభినందనలు.మీ పేరు యెంపిక సరస్వతీ కటాక్షమే.

    రిప్లయితొలగించండి
  18. దద్దరిలుగొంతుతోడన
    చద్దులబ్రతుకమ్మనాడెషంషాద్ బేగమ్
    ముద్దులగుమ్మలుబాడగ
    దద్దయువినసొంపుగలుగదానునుబాడెన్

    రిప్లయితొలగించండి
  19. అందరికీ సద్దుల బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు.
    ఒద్దికగా రాగమ్ముల
    నద్దుచు నేపథ్యగాన మందించమన
    న్నద్దైవమె కరుణించఁగ
    చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్
    (గాయనియైన షంషాద్ బేగమ్)

    రిప్లయితొలగించండి
  20. ఒద్దిక హిందూ ముస్లిం
    ముద్దియలు చెలిమిని గూడి మోదముమీరన్
    మద్దతు తెలుపుతు మెలగగ
    చద్దుల బతకమ్మ నాడె షంషాద్ బేగమ్!

    రిప్లయితొలగించండి
  21. *ఒద్దికగా మతసమరస*
    *బుద్దిని జూపించి నాడు బోనము నెత్తెన్*
    *ముద్దుగ బూవుల బేర్చుచు*
    *చద్దుల బతుకమ్మ నాడె షంషాద్ బేగం*

    రిప్లయితొలగించండి
  22. మిద్దెనుగట్టించుక తా
    ముద్దుగ జొచ్చుటకు మంచి మూర్తంబడగన్
    పెద్దలుజెప్పగ జేరెను
    చద్దుల బ్రతుకమ్మ నాడె, షంషాద్ బేగమ్.

    రిప్లయితొలగించండి
  23. డా.బల్లూరి ఉమాదేవి. 28/9/17
    28, సెప్టెంబర్ 2017, గురువారం

    *"చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్"*

    నిద్దుర మానుచు సుదతియు
    చద్దుల బ్రతుకమ్మ నాడె, షంషాద్ బేగమ్
    యద్దమ రేయిన సడివిని
    సద్దును చేయక గబగబ సాగెను చూడన్.

    హద్దుల నెంచక చెలితో
    చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్
    నొద్దికగానచ్చోటనె
    ముద్దుగ నెల్లర కనుచును మురిపెము తోడన్.

    ఇద్ధరలో జనులందరు
    నొద్దికతో కలసి మెలసి యుండగ వలెస
    ద్బుద్ది నటంచును ముదమున
    చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్.

    రిప్లయితొలగించండి
  24. గురువు గారికి నమస్సులు. నా పూరణ లోని లోపాలను ఎత్తి చూపుడు.కవి మిత్రులందరికి దేవీ నవరాత్రుల పండుగ రోజున శుభాభినందనలు.
    ముద్దులొలికే డి దంపత
    లిద్దరు దరహసమున ప లి కి రట!నదిగో
    నొద్ది క , పరమత సహనము
    చద్దుల బ్రతుకమ్మ నా డే షం షా ద్ బేగం.
    వందనము.

    రిప్లయితొలగించండి
  25. ఇద్దినపుశుభాకాంక్షలు
    నద్దిరబ్రతుకమ్మపర్వమగుటనువలన
    న్నిద్దినముపూజజేసియు
    చద్దన్నమునాహరింపసంతసమొందున్

    రిప్లయితొలగించండి
  26. అందరికీ సద్దుల బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు.
    ఒద్దికగా రాగమ్ముల
    నద్దుచు నేపథ్యగాన మందించమన
    న్నద్దైవమె కరుణించఁగ
    చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్
    (గాయనియైన షంషాద్ బేగమ్)

    రిప్లయితొలగించండి
  27. అద్దుకొన మదిని బల్లను
    గ్రుద్ది నటుల నా నెలఁతుక కుల మత తతులన్
    ముద్దుగ భేదము వలదని
    చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 22 Oct. 2015 నాటి నా సంపూర్ణ బతుకమ్మ పాట:

      ద్విపద మాలిక :
      శ్రీగౌరి బ్రతుకమ్మ సిరులీయ రావె
      మాగౌరి వోయమ్మ మన్నింపు మమ్మ

      ఇంపార మాయింటి యిలవేల్పు వమ్మ
      సొంపార సక్కఁగ జూడఁగ రావె

      వెతలన్ని బాపఁగ వేగంబ రావె
      బ్రతుకమ్మ బ్రతుకమ్మ బంగారు తల్లి

      మాయమ్మ దుర్గమ్మ మము గన్న తల్లి
      యాయమ్మ బ్రతుకమ్మ నర్చింప రమ్మ

      తంగేడు గుమ్మడి తామర సుమలు
      బంగారు గునుగును వామనె విరులు

      కమనీయ గరికలు కనువిందు కట్ల
      రమణీయ దోసలు లావణ్య బీర

      చేమంతి పూబంతి చెంగల్వ పూలు
      భామ లందరు జేరి వాలుగ పేర్చి

      పసుపు గౌరినిఁ జేసి వాటిపై నుంచి
      వసుధను తంబల ప్రభల నీయంగ

      నెలత లందరు గూడి నృత్యమ్ము లాడి
      పలుమారు కీర్తించి పాటలు పాడ

      కతలన్ని వింటిమి కారుణ్య మూర్తి
      బ్రతుకమ్మ సద్దుల బ్రతుకమ్మ బ్రతుకు

      కుదురుఁగ నిత్యమ్ము కొలుతుము నిన్ను
      కదలిరా బ్రతుకమ్మ కాపాడ మమ్ము.

      తొలగించండి
    2. శ్రీయుతులు కామేశ్వర రావు గారూ:

      బహు బాగున్నది మీ ద్విపద మాలిక. కొన్నాళ్ళ క్రితం మీ ద్విపద కావ్యం: "పద్మావతీ శ్రీనివాసం" పది ప్రింట్లు తీసి మా బంధుమిత్రులకు పంపియుంటిని. సీతా దేవికి కూడా.

      నమస్సులు!

      తొలగించండి
    3. శాస్త్రి గారు నమస్సులు. ధన్యవాదములు. అవునం డీ విషయమున నాకు మహదానందము.

      తొలగించండి
    4. వ్యాకరణ వివరణ:
      కమనీయ గరికలు, రమణీయ దోసలు, లావణ్య బీర సమాసములందు గరిక, దోస , బీర లు లతల నామములు గనుక యథా పదము గ్రహించి సిద్ధ సమాసముగా చేసితిని.

      తొలగించండి
  28. బ్రతుకమ్మపాటజదువగ
    బ్రతుకమ్మే వచ్చినటుల భావంబయ్యె
    న్నతులితమగు నీకవితకు
    సతతముకామేశ!యిచ్చుశంభుడు సిరులన్

    రిప్లయితొలగించండి
  29. మిత్రులకు నమస్కారములు పై సమస్య నాకు అర్ధం కాలేదు ఇది తెలంగాణ రాష్ట్ర సంబందితమని కొంత గోచరము అగుచున్నది. కొద్దిగా వివరించ గలరు.

    రిప్లయితొలగించండి
  30. బతుకమ్మ పండగ యని గూగుల్ లో వికిమీడియా లో చూడండి

    రిప్లయితొలగించండి
  31. దేవ్యవతారములవలెను
    నవ్యముగాదెలిసికొంటినవబతుకమ్మ
    ల్భవ్యులుమీమూలంబున
    సవ్యముగాబూజజేయశాస్త్రీ! సిరులే.
    -----
    ఏకవచన సంబోధనకు క్షంతవ్యుడను

    రిప్లయితొలగించండి
  32. ఒద్దిక నెల్లరు కులమత
    హద్దుల విడనాడి మనెడు హైద్రాబాదున్
    కద్దగు నీ గతి సందడి
    చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్.

    రిప్లయితొలగించండి
  33. బ్రతుకమ్మ దశపద సీసమాలిక
    నవబతుకమ్మలతో
    ఉల్లాన మ్రొక్కెద చల్లంగ చూడు “యెం
    గిలిపూల బతుకమ్మ” గింజ పండ
    ఆటుపోటులనున్న ఆదాయ మార్గమ్ము
    “అటుకుల బతుకమ్మ” అందజేయ
    పిల్లపా పలతోడ నిల్లుండ “ముద్దప
    ప్పుబతుకమ్మ” యిడుము పుణ్య మాత
    చదవగ నుచదువు సందెలు “నానబి
    య్యంబతుకమ్మ” ఇయ్యమ్మ యెపుడు
    గొడ్లెల్ల పాలిచ్చి గోదాము నిండంగ
    మా “అట్ల బతుకమ్మ” మాకునిమ్ము
    అల్లన లుకదీర్చ బెల్లపు బస్తాలు
    “అలిగిన బతుకమ్మ” కందజేతు
    ఆనంద జీవిత మందజే యుచు”వేప
    కాయల బతుకమ్మ” కాచుమమ్మ
    స్వాగతిం తుమునిన్ను వాకిళ్ళ నో “వెన్న
    ముద్దల బతుకమ్మ” ముగ్గు లేసి
    ఊరూర నూరేగ ఉత్సవ ముల తోడ
    “ సద్దుల బతుకమ్మ” సద్దుజేసి
    గౌరమ్మ కాపాడు కలకాల ముండంగ
    చల్లంగ దీవించు జనుల నెపుడు
    తే.గీ. ఆయు రారోగ్య భాగ్యాల నంద జేసి
    శాంతి సౌఖ్యాల వర్థిల్ల సంతతమ్ము
    పాడి పంటల తోనెప్డు పరగుచుండ
    కరుణ జూపుచు బ్రతుకమ్మ కావుమమ్మ

    రిప్లయితొలగించండి
  34. ముద్దులనొలుకెడుపూవుల
    నొద్దికతోకూర్చిపేర్చినుత్సాహములో
    హద్దులుముదితలకేలని
    చద్దులబ్రతుకమ్మనాడెషంషాద్ బేగమ్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "నొద్దికతోకూర్చిపేర్చినుత్సాహముతో" అంటే చివరి రెండు పాదాలకి కూడా అన్వయించి బాగుంటుందేమో.

      తొలగించండి
  35. రిప్లయిలు
    1. నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” ద్వాత్రింశ సర్గమున నేటి పద్యములలో నొకటి.

      గాలిపట్టిఁ దెలివరుల మేలిమి నెఱి
      మేటి నోటి వానిని మేని మెఱపు వాని
      కోతి గమికాని మాటల చేతకాని
      సామవాయికునిని చూచె లేమ సీత

      మూలము:
      సా వీక్షమాణా పృథుభుగ్నవక్త్రం
      శాఖామృగేన్ద్రస్య యథోక్తకారమ్.
      దదర్శ పిఙ్గాధిపతే రమాత్యం
      వాతాత్మజం బుద్ధిమతాం వరిష్ఠమ్৷৷5.32.7৷৷

      తొలగించండి
    2. చక్కని సరళమైన యనివాదము! 🙏🙏🙏🙏🙏🙏

      తొలగించండి
    3. డా. సీతా దేవి గారు ధన్యవాదములు. వీలైనపుఁ డచ్చ తెనుగు సమాసములను వాడుచున్నాను.

      తొలగించండి
  36. సాహితీ సభలు, కవితా గోష్ఠులు, పుస్తకావిష్కరణలు,దగ్గరి ప్రాంతాల్లో ఎక్కడ జరిగినా వాటికి వెళ్ళటం (తెలిపినా తెలుపకున్నా,పిలిచినా పిలువకున్నా తెలిస్తేచాలు)నా కలవాటు.31-10-2013 న రిటైర్ అయ్యాక ఇవి కొంచెం ఎక్కువయ్యాయి. (సుమారు నలభై) చాలా చోట్ల శ్రోతలకు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.అది గమనించి నేను వ్రాసుకున్న పద్యంఇది.
    కం. నా డన్నము కొరకు కవులు
    వాడిగ వ్రాసిరి కవితలు వాసిగ నేర్పున్
    నేడన్నము పెట్టించుట
    వాడుక కవులకు కవితలు వాకొన నకటా !

    రిప్లయితొలగించండి
  37. చాల చక్కని నిజం చెప్పారు! నాడు పద్యాలు , కావ్యాలు వ్రాయించుకుని స్వీకరించి దక్షిణలు యిచ్చేవారు. నేడు దక్షణలిచ్చి పద్యాలు, కవితలు వినిపిస్తున్నారు!

    రిప్లయితొలగించండి
  38. చాల చక్కని నిజం చెప్పారు! నాడు పద్యాలు , కావ్యాలు వ్రాయించుకుని స్వీకరించి దక్షిణలు యిచ్చేవారు. నేడు దక్షణలిచ్చి పద్యాలు, కవితలు వినిపిస్తున్నారు!

    రిప్లయితొలగించండి