1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

చతురంగ బంధ పార్వతీ ప్రార్ధన

చతురంగ బంధ సీస పార్వతీ ప్రార్ధన

నగజాత, యాదవి, నగనందిని, గిరిజ,
                 అంబిక, అద్రిజ ,యమున, నాగ
హారుని దేవేరి,ఆదిశక్తి, అనంత,
          మలయ నివాసిని ,మాత ,సౌమ్య,
చేతన సఖి,గట్టుధీత, నగపు సూన,
          శరవణ భవమాత, సర్వలోక
సేవితా ,శారదా, శివసత్తి, మాలినీ,
          దక్ష తనూభవ, దాక్షి, సింహ
యాన, శ్రీ నీల లోహిత ,అగజ ,హిమజ
అజిత సాప్తపదీన జాయజితి  సహిత,
వాజస సహధర్మ చరిణీ, భవ్య, శ్రీ గ
జాన నోల్లఘనంబుగా సంతు గోరి
(సింహ వాహినీ నీ సేవ  చేసినాము)

                             రచన  పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 

6 కామెంట్‌లు:

  1. చతురంగబంధసీసము
    చతురతతోవ్రాసినట్టిసత్కవివర్యా!
    సతియగుశాంభవి మిమ్ముల
    సతతముగాపాడుగాక! సకలము నొసగీ

    రిప్లయితొలగించండి
  2. చతురంగ సీస బంధపు
    ప్రతినిధిగా పూసపాటి ప్రతిభా శక్తిన్
    హితముగ కవితా భారతి
    సతతము మీయుక్తి రక్తిసాగించుసదా|

    రిప్లయితొలగించండి
  3. గురువు గారికి నమస్సులు. మీకు మరో మారు ఆ భి న o ద న లు చాలా రోజుల క్రితం మీకు ప్రశంసా పూర్వక పద్యము పంపాలని కోరిక. కానీ నేను సమయాభావ ము తో పంపలేక పోయాను.
    సహజమౌ భక్తి మీలోన జాలు వారు
    సహణమున వ్రాసితి రి గ దా చతుర బంధ
    మహిమ కాంత వర్ణన భక్త మాన్య ధీర
    శారద మ తి కృప తమకు శాశ్వత మ గు.
    వందనములు.

    రిప్లయితొలగించండి