8, ఫిబ్రవరి 2018, గురువారం

సమస్య - 2591 (అక్కా యిటు రమ్మని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్"
(లేదా...)
"అక్కరో యిటు రాగదే యని యాలిఁ బిల్చెను భర్తయే"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

137 కామెంట్‌లు:



  1. చక్కా బోవన్ కుదురదు
    పక్కకు రావే జిలేబి పసదనముల నే
    మక్కువగ గూర్తునే బో
    డక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చక్కా' అన్నది వ్యావహారికం కదా! "చక్కగ బోవన్ గుదురదు" అనండి.

      తొలగించండి
    2. అప్పారావు స్వయంవరపు
      విశాఖపట్నం నుంచి

      తొలగించండి
    3. చక్కనిదానవటంచును
      మక్కువతోనేముఱియుచు మనువాడంగా
      చక్కనిముద్దులమరదలి
      అక్కారమ్మనుచుమగడాలిన్ బిలిచెన్

      స్వయంవరపు అప్పారావు
      విశాఖపట్నం

      తొలగించండి
    4. అప్పారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మనువాడంగా' అనడం వ్యావహారికం. అక్కడ "మనువాడంగన్" అనండి.

      తొలగించండి
  2. నక్కా వెంకన్న భరణి
    చుక్కను ప్రొద్దున్న గాంచి చూపుట కొరకై
    "గ్రుక్కను చాలించవె! సు
    బ్బక్కా! యిటు రమ్మని" మగఁ డాలిన్ బిలిచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ప్రొద్దుననె కాంచి..." అనండి.

      తొలగించండి
    2. 🙏🙏🙏

      పద్యమంతా మా ముత్తుకూరి భాషలో నడిచింది సార్!

      తొలగించండి
    3. అభినందనలు ! ముత్తుకూరు అన్నారు. ఏ ముత్తుకూరు ?మా ఊరి (పలమనేరు,చిత్తూరు జిల్లా) సమీపంలో ఓ ముత్తుకూరున్నది.

      తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ



    ముక్కున కోపము వలదే!
    చక్కని చుక్కా! విశాల సారసనేత్రా !
    మక్కువ గల నా మరదలి..
    యక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్" !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. వారికి అభినందనలు.

      తొలగించండి
    2. *పెళ్లైన కొత్తలో... బెల్లం*

      చుక్కవే ! జలజాక్షిరో ! నిను జూడ మోహము గల్గెడిన్!
      నిక్కువమ్మిది ! యందమన్నది నీకు సొంతము భామినీ !
      చక్కనౌ చిరు సొట్టబుగ్గల చందమున్ గన నా *త్రిషా*
      *కక్కరో* ! యిటు రాగదే యని యాలిఁ బిల్చెను భర్తయే !

      *కొంతకాలం తరువాత.. అల్లం*

      ముక్కలయ్యెను స్వప్నముల్ నిను పొందినప్పుడె ! రేయిలో
      పక్కఁజేరవు ! తిక్క మానవు ! పక్కవారన గిట్టదే !
      నిక్కువమ్మిది పెండ్లి పేరున నెత్తికెక్కిన లచ్చి పె...
      ద్దక్కరో యిటు రాగదే యని యాలిఁ బిల్చెను భర్తయే !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. బొమ్మ బొరులవంటి మైలవరపు వారి రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. మక్కువన్ బిరియాని వండెను , మాకు మాంసపుముక్కలన్ ,
      చక్కగా జతగూడ నీవును సంతసమ్మగు , విందుకై
      అక్కరో ! యిటు రాగదే యని ., యాలిఁ బిల్చెను భర్తయే
      అక్క వచ్చెను , పళ్లెరమ్ములనన్ని తెమ్మని పల్కుచున్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

    5. మైలవరపు గారే ! బిరియాని మాంసమ్మే !

      కృష్ణ కృష్ణా :)


      జిలేబి

      తొలగించండి
    6. మైలవరపు వారి తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    7. మైలవరపు వారి తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  4. పక్క మీదట దొర్లుచుండగ పాటపాడుచు భామయున్
    మిక్కుటమ్ముగ పేర్మిగాన సమీరమైన సుమమ్ములన్
    చక్కగా మది తూగుచుండగ చాటుమాటుగ జూడ నా
    యక్కరో, యిటు రాగదే యని యాలిఁ బిల్చెను భర్తయే

    జిలేబి
    పరార్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సమీరమైన సుమమ్ములన్'...?

      తొలగించండి
  5. చుక్కను మించిన యందము
    మక్కువతో పెండ్లి యడె మానిని నిన్నే
    నిక్కము దరిజే రగరమ
    ణక్కా యిటు రమ్మని మగఁడాలిని బిలిచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ రమణక్క పూరణ బాగున్నది. అభినందనలు.
      "మక్కువఁ బెండ్లాడినాఁడ మానిని..." అనండి.

      తొలగించండి
    2. చుక్కను మించిన యందము
      మక్కువ పెండ్లాడి నాడ మానిని నిన్నే
      నిక్కము దరిజే రగరమ
      ణక్కా యిటు రమ్మని మగఁడాలిని బిలిచెన్

      తొలగించండి

  6. (ఆలుమగల కలహాల నాపమంటున్నఅత్తమామలతో,అక్కబావలతో కుటుంబరావు)


    "ఎక్కసక్కెపు మాటలాడకు మింకచాలును అత్తరో!
    ముక్కచెక్కలు కాములే యిక ముద్దుగుందుము మామరో!
    చక్కగుందుము బుద్ధివచ్చెను చల్లగుందుము బావరో!
    అక్కరో!""యిటు రాగదే"యని యాలిబిల్చెను భర్తయే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చాలును+అత్తరో' అన్నపుడు సంధి నిత్యం కదా! మీరు విసంధిగా వ్రాశారు. "మాటలాడకు మింక మానవె యత్తరో" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  7. కంటి ఆపరేషన్ అయి వారం అయింది కనుక మిత్రులెవరూ చీవాట్లు పెట్టరనే నమ్మకం!

    రిప్లయితొలగించండి
  8. డా.ఎన్.వి.ఎన్.చారి
    చక్కని సతి శిల్పంబును
    చెక్కెదనని దల్చి భర్త సిద్ధమ్మగుచున్
    మిక్కిలి ప్రేమం బున రా
    మక్కా యిటు రమ్మని మగడాలిని బిలిచెన్

    రిప్లయితొలగించండి
  9. చక్కని చుక్కవు నీవని
    చెక్కిలిపైచేయివేసి చెన్నుగ చెలిమిన్
    చుక్కల వేళన రంభకు
    అక్కాయిటు రమ్మని మగడాలిని బిలిచెన్

    రిప్లయితొలగించండి
  10. మక్కువన్ మదినిండ జూపుచు మానసమ్మున జిక్కకన్
    చిక్కుబెట్టుచు,చింతపెంచుచు,చెంతజేరక చెల్వమున్
    యెక్కడెక్కడ దాసినావొకొ?నిష్టపూర్తిగ!రంభకున్
    అక్కరో యిటురాగదేయని యాలి బిల్చెను భర్తయే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో "చుక్కల వేళను..." అనండి.
      రెండవ పూరణలో సవరణలు వాట్సప్ సమూహంలో సూచించాను.

      తొలగించండి
  11. కందం
    ముక్కెర నుగాది కిచ్చెద
    నక్కా! యిటు రమ్మని, మగఁ డాలిన్ బిలిచెన్
    మక్కువతోఁ దా తెచ్చిన
    చక్కని చీరను వదినకు సారెగ నీయన్

    రిప్లయితొలగించండి
  12. చుక్కలు వెలిగెడి వేళను
    పక్కను పరువగ బయలున పందిరి క్రిందన్
    మిక్కుటమౌ మక్కువ నెం
    చక్కా యిటురమ్మని మగడాలిని బిలిచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు నమస్సులు! మీ బ్లాగుకు మీకు పునఃస్వాగతం! 😆😊🙏🙏

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఎంచక్కా' అనడం వ్యావహారికం.

      తొలగించండి
    3. నెంచక్కాయనునది గ్రామ్యమయినచో
      శశికక్కా గా చదువ ప్రార్ధన! లక్ష్మి యని భావన! యింతకూ చంద్రునకు లక్ష్మి అక్కా, చెల్లెలా? ధర్మసందేహము!!

      తొలగించండి
    4. క్షీరసముద్ర మథనములోరత్నాకరమందు సుధాకరుఁ డుద్భవించిన పిదప చెలువంబుల మొదలి టెంకి సిరి నిండు జవ్వనమునఁ బుట్టెను.
      అందుచేత చంద్రుఁడు లక్ష్మీ దేవికి నగ్రజుండు.
      ఆశ్చర్య కరమైన మఱియొక విశేష మేమి టన భారతీ దేవి యప్పుడే పుట్టిన తన యత్త గారికి ముత్యాల హారమును సమర్పించ బ్రహ్మ గారు తన తల్లి గారికి హస్త భూషిత మైన కమలమును ప్రసాదించెను.
      అదే విష్ణు మాయ!!! ... భాగ. అష్టమ స్కంధము.

      తొలగించండి
    5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ కంటికి పూర్తి స్వస్థత చేకూరినట్లు భావిస్తాను.

      తొలగించండి
    6. పూజ్యులు కామేశ్వరరావుగారికి ధన్యవాదములు, నమస్సులు! 🙏🙏🙏

      తొలగించండి
  13. ఒక (చాదస్తపు?) పండితుని ఆవేదన....

    తుక్కాయెనురా ధర్మపు
    తక్కెడ, గతిచెడెనకట! గతదినఘనత,ఇం
    కెక్కడి వావివరుసలోయ్...
    అక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటేశ్ ప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదాలు సార్.. ఐ డ్రాప్స్, మాత్రలు గట్రా టైం కి వేసుకోండి సార్.. ఆల్ ది బెస్ట్....

      తొలగించండి

  14. గదిలో పెనిమిటి గానరాలె !

    చక్కనమ్మలు ద్రోయుచుండిరి చాటువుల్ మజ బల్కిరే!
    యక్కరో! యిటురాగదేయని యాలి బిల్చెను, భర్తయే
    పక్కనన్ గది లోనగానక; భారమయ్యె మనస్సటన్
    బిక్కచచ్చెను సిగ్గుతో సయి భీతిగానటు జూచుచున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2591
    సమస్య :: *అక్కరో ! యిటు రాగదే యని యాలిఁ బిల్చెను భర్తయే.*
    భార్యను అక్కా! యిటు రా అని పిలవడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    ఛందస్సు :: *మత్తకోకిల వృత్తము*
    సందర్భం :: దక్షప్రజాపతికి సతి , మేధ మొదలైన డెబ్భైమంది కుమార్తెలు , హర్యశ్వుడు మొదలైన ఎంతోమంది కుమారులు ఉండినారు. అల్లుడైన శివుడు తనను చూచి నిలబడటంలేదని , తనను గౌరవించడం లేదని అనుకొన్న దక్షుడు ఈశ్వరుని పిలవకుండా నిరీశ్వర యాగం మొదలుపెట్టినాడు. దక్షునికి పెద్దకుమార్తె , శివునికి భార్య అయిన సతీదేవి తన భర్త తోడుగా రాకపోయినా ఒంటరిగా నైనా సరే ఆ యాగాన్ని చూచేందుకు పుట్టింటికి వెళ్లాలని నిర్ణయించుకొన్నది. సర్వజ్ఞుడైన శివుడు తన భార్య దక్షయజ్ఞంలో అగౌరవింపబడి యోగాగ్నిని కల్పించుకొని తన శరీరాన్ని దహింపజేసికొంటుందని గ్రహించి ఆమెను చివరిసారిగా చూడగోరి మేధకు అక్కవైన ఓ సతీదేవీ! ఇటు రా అని పిలిచే సందర్భం.

    అక్కటా ! యనగా నిరీశ్వర యాగమే జరుగంగ తా
    నొక్క టైనను బోవ నెంచెడి యూహ నా సతి యుండెగా ,
    దక్క దింక యటంచు రుద్రుడు తా సతిన్ గన బిల్చె , ‘’ ని
    న్నొక్క సారి గనంగ నా మది నుండె మేధకు చూడగా
    *అక్కరో ! యిటు రాగదే ‘’ యని , యాలి బిల్చెను భర్తయే.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (8-2-2018)

    రిప్లయితొలగించండి
  16. ఎక్కడి కి వెళ్ళి నావో
    మక్కువ తో నన్ను జేర మరులు గ రా వే
    గ్రక్కున కరుణింప గ రా
    మక్కా యిటు రమ్మని మగ డాలి ని బిలిచె న్

    రిప్లయితొలగించండి
  17. "మిక్కిలి యుత్సాహమ్మున
    మక్కువతో మాటలాడి మఱిపంపితివా
    చక్కని యబ్జనయన నీ
    కక్కా? " యిటు రమ్మని మగడాలిని బిలిచెన్
    ******
    ఆ వాడలో లెక్కకు మిక్కిలిగా చుట్టాలే!ఎవరి కెవరే మౌతారో గుర్తుంచు కోలేని గందరగోళ పరిస్థితి !ఒక ఇల్లాలు తలవాకిట ఒకాపెతో ఎంతో ప్రియంగా మాట్లాడి పంపిస్తుంటే లోపలి గదిలో నున్న భర్థ సతిని పిలుస్తూ అన్న మాట !
    ********
    ఒక్క రోజున విందు భోజన మోర్పుతో సతి వండగా
    మక్కువన్ బతి మెక్కుచుండగ మధ్య మధ్యన నక్కటా!
    వెక్కిలెక్కుడు వేయసాగెను వెంటవెంటనె నీరదెం
    "తక్కరో ? యిటు రాగదే యని యాలిఁ బిల్చెను భర్తయే"
    *******
    ఆవురావురని విందు భోజన మారగిస్తున్న భర్తకు వెక్కిళ్ళు రాగా వెంటనే నీరెంత అక్కర పడిందో ? అలా పిలిచినాడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  18. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

    [ సారా త్రాగి వచ్చి మగడు పెండ్లామును అ‌నుమానించి తిట్టుట. ]
    -----------------------------------------------------------------------------------------------

    చుక్కను వేసిన మగ డనె =

    " పక్కిం టాతని గుడిసెకు పరుగిడ నేలా ?

    పక్క లిరుగ తన్నెద నీ

    యక్కా ! యిటు రమ్మని మగ డాలిని బిలిచెన్ "

    పక్క = ప్రక్క యొక్క రూపాంతరమము

    రిప్లయితొలగించండి
  19. చిక్కులన్నియు మాయమై తగు చిత్తశాంతి లభించుగా.
    ప్రక్కదారులు త్రొక్కనేల?శుభంబులిచ్చెడు దేవునిన్
    మ్రొక్కుమా మరదీ!సహోదర!మోదమందుచు నమ్మరో!
    అక్కరో!యిటు రాగదే_యని యాలిఁబిల్చెను భర్తయే.

    రిప్లయితొలగించండి
  20. ముక్కున కోపమ్మేలనె
    ముక్కెరనే దెత్తునీకు ముడవకె మూతిన్
    మక్కువ దీర్చగ రా ! రమ
    ణక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్.

    రిప్లయితొలగించండి
  21. కం.
    చక్కని రూపము నీదే!
    చిక్కని చిరునవ్వును మరచి మనగలుగుదే!
    యెక్కడ నుంటివి మరదలి
    యక్కాయిటు రమ్మని మగడాలిని బిలిచెన్ .

    రిప్లయితొలగించండి
  22. రవీందర్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. నిక్కరుతో యూరంతయు
    మక్కువతో తిరుగుచుండు మతిహీనుండౌ
    తిక్కల నా బావమరిది
    కక్కా! యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్

    రిప్లయితొలగించండి
  24. మిత్రులందఱకు నమస్సులు!

    (ఎండాకాలపు నీటి యెద్దడిచే సమ్మక్క యను పడతి, కొళాయివద్ద నీరముఁ దేఁబోవుౘుండఁగ, మగఁ డాలస్యము చేయకుండ, తొందరఁగ రమ్మని హెౘ్చరించిన సందర్భము)

    ౘుక్కయు నీరును లేదని,
    ౘక్కంగఁ గొళాయిఁ జేరి, జలముం దేఁబోన్,
    "ౙుక్కలు మొలువక మును, స
    మ్మక్కా! యిటు ర" మ్మని మగఁ డాలిన్ బిలిచెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      మీ పూరణ మధురంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

    2. మ , డా లకు యతి సరిపోతుందాండి ?


      జిలేబి

      తొలగించండి
    3. సంధిగతమున వచ్చిన యచ్చులకు స్వరయతి వేయఁబడినది. గమనింపుఁడు...
      సమ్మ+క్కా....మగఁడు+లిన్...

      తొలగించండి
  25. "చిలకా కాదు... సిలకా సిలకా!"

    సుక్కలందున సందమావవు సుక్క బుగ్గన సక్కదే
    ముక్కుపుడ్కలు దద్దరిల్లును ముద్దుగా నువు నవ్వితే
    రుక్కిణమ్మవు సత్తిబామవు రొక్క మిత్తును నమ్ము! సు
    బ్బక్కరో యిటు రాగదే యని యాలిఁ బిల్చెను భర్తయే

    రిప్లయితొలగించండి
  26. బాబు చదువుకు చాలా ధన మవసరం. బంగారు ధర చుక్కలంటింది. గాజులిప్పుడు కొనలేను ముక్కెర మాత్రము కొనమని సతికి పతి డబ్బిచ్చే సందర్భం.

    మత్తకోకిల

    చుక్కలంటెను స్వర్ణమిప్పుడు చూడగా గొన గాజులన్
    బక్కచిక్కితి, నీకుఁ దోచదె బాబుకై ధనమెంత నా
    కక్కరో? యిటు రాగదే యని యాలిఁ బిల్చెను భర్తయే 
    ముక్కెరొక్కటి తెచ్చుకొమ్మని ముద్దుగా ధనమిచ్చుచున్

    రిప్లయితొలగించండి
  27. కం:-
    చక్కనిమల్లెలుఁజేకొని
    మక్కువతో మాటలాడి మగువకుదొడగన్
    ఎక్కసకెము ధోరణితో
    యక్కా యిటురమ్మని మగఁడాలిన్ బిలిచెన్!!

    @ మీ పాండురంగడు*
    ౦౮/౦౨/౨౦౧౮

    రిప్లయితొలగించండి
  28. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,

    నిన్నటి దత్తపది పూరణ.

    పారుచు నున్న యేరు మన పల్లె దరిన్ బ్రవహించు చుండగా

    నేరుపడున్ బురోగమన మెంతయు | చక్కగ దేశమందునన్

    బైరుల వృద్ధి యున్నపుడె పౌర జనాళి సుఖించు | గాన నూ

    రూరును దాకుచున్ నడచు చుండు విధంబున > బంటకాలువల్

    తీరిచి దిద్ది , నీటి వసతిన్ సమకూర్చుచు ,‌ దేశ దుస్థితిన్

    మారుచ ముఖ్యమౌను సుమ నాయకు లెల్లరు -- వీడి స్వార్థమున్

    రిప్లయితొలగించండి
  29. మిత్రులందఱకు నమస్సులు!
    (2)
    (ఎండాకాలపు నీటి యెద్దడిచే, సమ్మక్క యను పడతి, కొళాయి యొద్ద నీరముఁ దేఁబోవుౘుండఁగ, మగఁ "డాలస్యము చేయకుండ, తొందరఁగ ర" మ్మని హెౘ్చరించిన సందర్భము)

    "ౘుక్కయైనను నీరు లే" దనుౘుం గొళాయినిఁ జేరియుం
    ౙక్కఁగా జలముం గొనంగను సాఁగిపోవుౘునుండఁగాఁ,
    "ౙుక్క మొల్వక ముందె, నేరుపుఁ ౙూపి, నీరము తోడ, స
    మ్మక్కరో, యిటు రాగదే!" యని యాలిఁ బిల్చెను భర్తయే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      అద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములండీ శంకరయ్య గారూ!

      నాల్గవ పాదమున (...రాఁగదే...) అని పఠింౘఁగలరు.

      తొలగించండి
  30. అక్కటా యొకడల్జిమర్సుకు నాహుతయ్యెను డెందమం
    దొక్కరైనను గుర్తులేరిక నొప్పుగా సతి బ్రేముడిన్
    మిక్కుటమ్ముగ శోక వల్లరి మిన్ను దాకగ జేరగా
    నక్కరో!యిటు రాగదే_యని యాలిఁబిల్చెను భర్తయే.

    రిప్లయితొలగించండి
  31. చక్కని చుక్కా మనమెం
    చక్కా యిపుడేగ వలెను సాలూరుకు రా
    మక్కా యనలేను రమ్మనె
    నక్కా యిటురమ్మని మగఁడాలిన్ బిలిచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో 'ఎంచక్కా' అనడం వ్యావహారికం. మూడవపాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  32. చక్కని చుక్కవు మక్కువ
    మిక్కుట మక్కజము నీకు మీరగ నలుకే
    వెక్కస మైతినె నే నిట
    నక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్

    [అక్క = ఔర]


    మక్కు వయ్యెను నిన్ను జూడఁగ మానసమ్మున నెన్నడుం
    జిక్క వైతివి సుద్దు లెల్ల వచింప నింపుగ నింతలో
    నక్కజమ్ముగ వచ్చి యింటికి నంతలోననఁ బోదువే
    యక్కరో యిటు రాగదే యని యాలిఁ బిల్చెను భర్తయే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  33. చక్కగా కనుపించు చుండెను సాగిపోవుచు వర్షమున్
    దిక్కునా కెవ రంచు నేడ్చుచు దీనమౌ వదనమ్ముతో
    నిక్క చేరెను బాధతోడను నీరసమ్ముగ చూడు మే
    మక్కరో ? యిటు రాగదే యని యాలిఁ బిల్చెను భర్తయే

    అక్కర: అవసరము

    రిప్లయితొలగించండి
  34. రిప్లయిలు
    1. ధన్యవాదములండీ. అక్కఱ - కు బండి "ఱ" ఉంటుంది. సమస్యలో మాములు "ర" ఉన్నది. అందుకే పండితు లెవ్వరూ ప్రయోగించలేదు.

      తొలగించండి
    2. నిజమే... అయితే సాధు శకట రేఫ విభేదాన్ని కొందరు గొప్ప కవులు కూడా పాటించలేదు. అందుకే ర-ఱ ప్రాస సాధువయింది.

      తొలగించండి
  35. ప్రక్క జేరిన పండు వెన్నెల పాడుబుద్దిని బెంచగా
    నిక్కమే యనిమల్లెపువ్వులు నిన్నుజేరియు నవ్వగా
    మక్కువన్నడి మాటువేసెను మంచమున్ దరిజేరుమా
    అక్కరో యిటురాగ దేయని యాలి బిల్చను భర్త యే!

    రిప్లయితొలగించండి
  36. మక్కువతో నే బంగరు
    ముక్కెర కొనితెచ్చినాడ ముద్దుల గుమ్మా
    నొక్కులజుట్టున్న మరిది
    కక్కా యిటురమ్మని మగఁ డాలిన్ బిలిచెన్


    ప్రక్కకు రమ్మని కోరితి
    నిక్కడ మనకుండదయ్యె యేకాంతమ్మే
    యక్కడ యున్నది గదనా
    యక్కా, యుటురమ్మని మగఁ డాలిని బిలిచెన్


    ముక్కెరెందుకు గాజులెందుకు మోజుదీర్చెడు వేళలో
    పక్కపైగన మల్లెలుండెను భామరో చను దెంచవే
    అక్కడున్నది వద్దనంచును హద్దుమీరకు మంచు నా
    యక్కరో! యిటు రాగదే యని యాలిఁ బిల్చెను భర్తయే.

    రిప్లయితొలగించండి
  37. మొక్కలు బెంచుము ముంగిట
    అక్కా !యిటురమ్మని మగడాలిని బిలిచెన్
    చక్కటి ననుకూలంబిది
    ప్రక్కన జేరంగ రమ్ము బాద్యత చేతన్

    రిప్లయితొలగించండి
  38. ఇక్కడె యుండిరిపిల్లలు
    నెక్కడనికవెదు కవలదునిప్పుడు,నీవిపు
    డెక్కడయుంటివి యోరమ
    ణక్కా!యిటురమ్మని మగడాలిన్బిలిచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర తప్పక గురువుండాలి. "...పిల్లలె। యెక్కడ వెదుకంగ బోదు నిపుడీ విధిగా। యెక్కడ..." ఆనండి.

      తొలగించండి
  39. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చొక్కగ నల్లటి కురులను
    రెక్కొలిపెడి తైలమివ్వ రెచ్చిన సొరమున్
    చక్కని చుక్కా! సుమతికి
    యక్కా! యిటురమ్మని మగడాలిని బిలిచెన్
    (చొక్కగ=మనోహరముగా)

    రిప్లయితొలగించండి


  40. చక్కని చుక్కవు నీవని
    మక్కువ తోడ వలచి నిను మనువాడితినే
    ముక్కెర యిదిగో మరదలి
    యక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్.

    మక్కువతో కోరగా సతి
    నెక్కుడు ప్రేమని లో జూన్ నెంచుచు మదిలో
    చెక్కిలిములు దెచ్చి యోసీ
    తక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్.

    ముక్కెర దెచ్చుటకై నే
    మక్కువ తోనంగడికిని మానుగ నేగన్
    ఠక్కున దొరికె నిదియు రమ
    ణక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్.

    చక్కదనం బుధ వెలిగెడు
    చక్కని చుక్కను మనమున సతిగా గొనుచు
    న్నక్కజమున గాంచుచు ద
    మ్మక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్.

    చెక్కిలి పై వేలుంచిన
    చక్కని చుక్క నట గాంచి సంబర పడుచున్
    ఠక్కున పెండ్లాడుచురా
    ధక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో "కోరగ సతి" అనండి. లేకుంటే గణదోషం. 'లో జూన్ నెంచుచు'...? మూడవ పాదంలో గణదోషం.
      నాల్గవ పూరణలో 'చక్కదనంబున వెలిగెడు' అనవలసింది టైపాటు అనుకుంటాను.

      తొలగించండి
  41. చక్కనిదానవటంచును
    మక్కువతోనేముఱియుచు మనువాడంగా
    చక్కని ముద్దులమరదలి
    యాక్కా రమ్మనుచు మగడాలింబిలిచెన్



    రిప్లయితొలగించండి
  42. గురువు గారికి నమస్సులు.మీ ఆరోగ్యము ఎలా ఉంది?
    మక్కువ ధి కంబయ్యెన్ నా
    చక్కని కళత్ర సరసరసాస్వాదనమే
    దక్కిన విద్యని వరసీ
    తక్కా యిటు రమ్మని మగడాలిని బిలిచెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. మక్కువ+అధికంబు అన్నపుడు సంధి లేదు. "మక్కువ యధికంబయ్యెన్" అనండి.

      తొలగించండి
  43. చక్కని కన్నియ వరమున
    చిక్కి ముదమ్మునను చేరె చెంతకు సతియై
    దిక్కులు చూచుట గని చం
    ద్రక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్

    రిప్లయితొలగించండి
  44. శ్రీయుతులు "పద్యహర్ష" తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష గారికి

    ప్రభాకర శాస్త్రి నమో నమః:


    ముక్కలందున మోహమున్ మరి ముగ్ధలందున ప్రీతియున్
    చుక్కలందున దాహమున్ మరి చుట్టలందున తీపియున్
    ముక్కునందున నస్యమున్ మరి ముద్దులందున "హర్షమున్"
    గ్రుక్కతిప్పని పద్యమందున క్రుక్కియుండిన లాఘవమ్
    అక్కరో! యిటు రాగదే యని యాలిఁ బిల్చెను భర్తయే

    అక్కర = అవశ్యము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష ఉవాచ:

      🙂
      *చుక్కతాకను ముక్కముట్టను చుట్ట జూడగలేదునే*
      *మక్కువయ్యరొ యావు పాలవి మంచినేతి మిఠాయిలున్*
      *చిక్కెనాకొక చక్కనమ్మయె జీవితానికి చాలదే*
      *పుక్కిలింతును పెక్కుమాటలు వూసుబోకనె నవ్వుకై*
      *దక్కెదానికి మంచి పేరది దైవమా యిది న్యాయమా*
      *వెక్కిరించెను భాగ్యమక్కట పెద్దవారి కలమ్ములై*

      తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      "లాఘవం। బక్కరో..." అనండి.
      *****
      మీ యిద్దరి సరస పద్యభాషణం మనోరంజకంగా ఉంది. స్వస్తి!

      తొలగించండి

  45. చిక్కులన్నియు దీరిపోయెను సీత
    చక్కని భామరో
    చుక్కలందగు పిల్లలిద్దరు చక్కగాస్ధిరమొందగా
    మొక్కులెన్నియొ దీర్చగా వలె మోపిదేవికి బోదుమే
    యక్కరో యిటురాగదే యనియాలి బిలిచెను భర్తయే

    రిప్లయితొలగించండి
  46. కం.
    పక్కా సాయంత్రమ్మున
    చుక్కను కొట్టెనలవాటు సోదరి సతితోన్
    మక్కువ తమ్ముడు బిలిచె
    న్నక్కా! యిటు రమ్మని, మగడాలిని బిలిచెన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పక్కా' అనడం వ్యావహారికం. "కొట్టు నలవాటు" ఆనండి.

      తొలగించండి
  47. .....🤷🏻‍♂సమస్య.
    అక్కరో యిటు రాగదే యని
    యాలిఁ బిల్చెను భర్తయే

    సందర్భము: సంకీర్తనాచార్యులైన తాళ్ళపాక అన్నమాచార్యుల వారు తన భార్య తిమ్మక్కతో పొద్దున్నే అంటున్న మాట లివి.
    " వేకువనే వెళ్ళి రక రకాల పూలు బోలెడన్ని తీసుకొచ్చాను. త్వరగా రా తిమ్మక్కా! మన స్వామికి ప్రేమతో మాల లల్లాలి. శ్రీనివాసుడు అలంకార ప్రియుడు గదా!"
    (తాళ్ళపాక తిమ్మక్క తేట తెలుగులో సుభద్రా పరిణయ మనే ద్విపద కావ్యాన్ని రచించింది. ప్రథమ ఆంధ్ర కవయిత్రిగా పేరు పొందింది.)
    ~~~~~
    "చక్కగా మరు మల్లె, మొల్లలు,
    సన్న జాజులు, బంతులున్

    మిక్కిలిన్ వడి తెచ్చినాడను-
    మేలుకో ద్విపద ప్రియా!

    మక్కువన్ మన శ్రీనివాసుని
    మాల లల్లగ వేగ-- తి

    మ్మక్కరో! యిటు రాగదే!" యని
    యాలిఁ బిల్చెను భర్తయే..

    ~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి

  48. ........సమస్య
    అక్కరో యిటు రాగదే యని
    యాలిఁ బిల్చెను భర్తయే

    సందర్భము: మహాదేవి బసవేశ్వరుని సమకాలికురాలు. మహా శివ భక్తురాలు. మల్లేశ్వరుడే తన భర్త యని దృఢంగా విశ్వసించింది.
    కౌశికు డనే రాజు తనను పెళ్ళాడకపోతే చంపేస్తా నన్నాడు. తల్లి దండ్రులూ కి మ్మనలేదు. పెండ్లి జరిగింది. మహాదేవి 3 నెలలు నాకు దీక్ష వుంది, తాకరా దన్నది. తాకితే వెళ్ళి పోతా నన్నది.
    కాని మోహాంధు డైన భర్త మధ్యలో భంగపరుచబోతాడు. ఆ సందర్భ మిది.
    (అందరూ అక్కా.. అని పిలువగా ఆమె 'అక్క మహా దేవి'గా ప్రసిద్ధురా లైంది. శ్రీ శైలం చేరుకొని శివునిలో లీనమైంది.)
    ~~~~~
    'అక్క'గా పిలిపించుకొన్న మ
    హా తపస్విని యామె; తా

    "నొక్క శంభుడె నాకు భర్తగ
    నొప్పు" నన్నది; మూర్ఖుడై

    "తిక్క నీమము లేల సుందరి!
    దేహ తాపము బాపునా!

    అక్కరో! యిటు రాగదే!" యని
    యాలిఁ బిల్చెను భర్తయే..

    ~డా.వెలుదండ సత్య నారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  49. అక్కయు,నాలియు నిరవురు నొక్క రకపు దుస్తులందు నుండగో నొకచో గ్రక్కున దానే పొరబడి యకక్కా యిటు రమ్మని మగడాలిని బిలిచెన్.

    రిప్లయితొలగించండి

  50. అక్కయు,నాలియు నిరువురు
    నొక్క రకపు దుస్తులందు నుండగ నొకచో గ్రక్కున దానే పొరబడి యక్కా యిటు రమ్మని మగడాలిని బిలిచెన్.

    రిప్లయితొలగించండి
  51. డా!! మూలె.రామముని రెడ్డి. విశ్రాఃత తెలుగు పండితులు.

    తిక్క ముదిరి న యొక భర్త

    దిక్కులు తెలియక తిరిగెను దెసలన్; మరలెన్

    గ్రక్కున నింటికి; పత్నిని

    అక్కా! యిటు రమ్మని మగడాలిని బలిచెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామముని రెడ్డి గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో మూడవ గణం జగణమయింది. అక్కడ "తిక్క ముదిరిన యొక మగడు" అనండి.

      తొలగించండి