22, ఫిబ్రవరి 2018, గురువారం

సమస్య - 2605 (లెక్క యెక్కువైన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"లెక్క యెక్కువైన లేదు సుఖము"
(లేదా...)
"లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

172 కామెంట్‌లు:

  1. ఎంత మంది వలయు సంతు గాంధారికి?
    ఒక్క కూతురున్న చక్కనమ్మ
    వంద కొడుకులున్న నందము లేకున్న
    లెక్క యెక్కువైన లేదు సుఖము...

    రిప్లయితొలగించండి


  2. జాకు పాటు గొట్ట జక్కి పాడి నరయ
    లెక్క యెక్కు వైన లేదు సుఖము
    నాట వెలది గట్ట నాడి తెలియవలె
    లెక్క తక్కు వైన లేదు గణము :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదం ఉత్తరార్ధం అర్థం కాలేదు.

      తొలగించండి


    2. సవరణ

      జాకు పాటు గొట్ట జక్కి పాడి నరయ
      లెక్క యెక్కు వైన లేదు సుఖము
      నాట వెలది గట్ట నాడి తెలియవలె
      లెక్క తక్కు వైన లేదు పటిమ


      జిలేబి

      తొలగించండి


  3. తరిచి చూడ తెలియు ధరణి యందు ధనపు
    లెక్క యెక్కువైన లేదు సుఖము
    దొంగలొచ్చి ధనము దొంగలించుదురని
    కంటి నిద్ర తనకు కరువు కాద?

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    అవసరమునకు దగినంత సంపద చాలు !
    కోట్లు కూడబెట్టుకొనగనేల ?
    మితియె లేనిదెల్ల వెతలందజేయును !
    లెక్క యెక్కువైన లేదు సుఖము !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. చక్కని చుక్క యొక్కతియె చాలును స్వర్గసుఖంబులీయగన్ ,
      పెక్కురు గల్గినన్ వెతలు వేదన దక్క సుఖంబు సున్నయౌ !
      చిక్కని పాలు గ్రుక్కెడు రుచించును , చేర్చెడు నీటిచుక్కలన్
      లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి


  5. మిక్కిలి వేగమేల కవి ? మీదగు రీతి జిలేబులన్ గనన్
    లెక్కయె; యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్
    చక్కగ రాక మానసపు ఛాయను చూపక బోవ నిందల
    న్నెక్కువ తెచ్చు నీకు సయి నెమ్మది బోవు కవీశ్వరా !వినన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నెమ్మది బొమ్ము' అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  6. ధనము తక్కు వైన దరిరావు ఇక్కట్లు
    కోరి నట్టి బ్రతుకు కూడ దంట
    శిరిని వలచి నంత చెడిపోయి శిధిలమౌ
    లెక్క యెక్కు వైన లేదు సుఖము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దరిరావు+ఇక్కట్లు = దరిరా విక్కట్లు' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు. అక్కడ "దరికి రా విక్కట్లు" అనండి. 'సిరి'ని 'శిరి' అన్నారు.

      తొలగించండి
    2. ధనము తక్కు వైన దరికిరా విక్కట్లు
      కోరి నట్టి బ్రతుకు కూడ దంట
      సిరిని వలచి నంత చెడిపోయి శిధిలమౌ
      లెక్క యెక్కు వైన లేదు సుఖము

      తొలగించండి
  7. అక్కర దాటుచుండ మరి యైదుగురార్గురు బిడ్డలేలొకో
    చెక్కిటచేయి జేర్చుచును చింతలువంతలు పొందనేటికో
    ముక్కున వేలునుంచుకొని మూగగనందరు వెక్కిరించరే
    లెక్కయె యెక్కువైనపుడు లేదుగదా సుఖమెంతమాత్రమున్ .

    రిప్లయితొలగించండి
  8. ఆ.వె.
    ధనము ధనమనుచును ధనార్జనే గాని
    మనసు శాంతి లేక మనుగడేల?
    సర్దుబాటు లేక సాగునే యీ బండి
    లెక్క యెక్కువైన లేదు సుఖము .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "ధనసంచయమె కాని" అనండి.

      తొలగించండి

  9. కక్కురితిన్ జిలేబులగు కాంతల పొన్నుల నెల్ల గోరుచున్
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్
    గ్రక్కున వీడు నాశలను, కాంక్షగ నీశుని సన్నిధానమున్
    టక్కున బట్టు నేర్పు గను టంకము లేల జనార్ధనా! వినన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పుండరీకు బతుకు పూసగుచ్చునటుల
      పూరణమ్ము జేసెపో! జిలేబి!!
      పండరీపురాధిపతిని మదిన గొల్వు
      పాండురంగడె కద పరమగురుడు

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      విట్టుబాబు గారూ,
      'మదిని గొల్వు' అనండి.

      తొలగించండి

    3. కందివారికి విట్టుబాబు గారికి
      నమో నమః !

      విట్టుబాబు గారు మరో జిలేబీయమై పోతున్నారు :) జెకె :)


      చీర్స్
      జిలేబి

      తొలగించండి



  10. అప్పుచేయుటిపుడు తప్పదు నరులకు
    అప్పు కొంచమున్న తప్పు కాదు
    అప్పుచేయ వలదు నవసరానికి మీఱి
    లెక్క యెక్కు వైన లేదు సుఖము

    రిప్లయితొలగించండి


  11. చక్క పెండ్లి యాడి చంకన బిడ్డల
    గంపె డంత బెట్టి గట్టి నిదుర
    బోవ నేల మగడ ! లేవర లేవర !
    లెక్క యెక్కువైన లేదు సుఖము

    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. తక్కువ యున్ననే టికిని తాహతు లేకను బాధలం దునన్
    మిక్కిలి యెక్కువైన మితి మీరిన బాధ్యత లెల్లభా రమౌ
    చక్కని జీవితమ్ము నెటు సాగిన దుర్భర మేయటం చునే
    లెక్కయె యెక్కువై నపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్

    రిప్లయితొలగించండి
  13. లెక్కలేని ధనము నక్కర లేదురా!
    లెక్క యెక్కు వైన లేదు సుఖము
    దినము గడుప ధనము దిగులిడదు కదరా!
    సౌఖ్యమిచ్చు నదియె సత్యమయ్య!

    రిప్లయితొలగించండి
  14. చక్కగ విద్యలం గరపి సక్రమమార్గములందుఁ బెంచగా
    నొక్కరినిద్దరిన్ గనిన నున్నతసంతతి నొప్పు, నట్లుగన్
    బొక్కసమందుఁ గష్టమున భూరిధనమ్ములఁ గూడఁ బెట్టగన్,
    లెక్కయె యెక్కువైనపుడు లేదుగదా సుఖమెంతమాత్రమున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవపాదం చివరిపదం నట్లుగన్ బదులుగ "లేనిచో" యని
      మూడవపాదంలోని గూడ బెట్టగన్ అను పదాలకు బదులుగ "గూర్చ నట్లుగా" అని భావించ ప్రార్థన.

      తొలగించండి
    2. రామాచార్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. బాగుగనున్నది పూరణ
      వాగర్థశుభగపటిమా భాషాభూషా

      తొలగించండి
  15. *అక్కరలేనికార్యముల హద్దునుగానకజేయుచుండగా*
    *లెక్కలురాయువాడొకడు లీలగ పైనగలండు చూడుమా*
    *తొక్కిన తప్పునిప్పులను తొందరనార్పుము,తప్పుతప్పుకున్*
    *లెక్కయె యెక్కువైనపుడు లేదుగదా సుఖమెంత మాత్రమున్*

    రిప్లయితొలగించండి
  16. ధనము కూడబెట్టి దాచుకొని న వేళ
    దాని రక్ష సేయ ధరణి యందు
    కష్ట మగును గాన కలి కాల మందు న
    లెక్క యెక్కువ యి న లేదు సుఖము

    రిప్లయితొలగించండి
  17. మిక్కుటముగ బుద్ధి చక్కదనము గల్గి
    యక్కరమున మనకు ప్రక్కనుండు
    నొక్కరైనఁజాలు పెక్కు సంతతియేల
    లెక్కయెక్కువైన లేదుసుఖము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అక్కరమున' అంటే 'అక్షరానికి' అని అర్థం. అక్కడ "అక్కరకును" అనండి.

      తొలగించండి
  18. లెక్కకు మించి యార్జనము లెక్కలు వేయుచు దాచియుంచినన్,
    అక్కరలేని భేషజములందున వానిని వట్టి జేసినన్,
    చక్కనిదైన జీవితము శాంతము లేక గతించుచుండినన్,
    లెక్కయె యెక్కువైనపుడు లేదుగదా సుఖమెంతమాత్రమున్!

    రిప్లయితొలగించండి
  19. ఆటవెలది
    కలిగినంత లోన గాళ్లు జాపుట మేలు
    పరుల సొమ్ము కొరకు ప్రాకులాడి
    వసుధ నన్య జనుల వంచించు పాపాల
    లెక్క యెక్కువైన లేదు సుఖము

    రిప్లయితొలగించండి

  20. సంకటముల నిడు నసంఖ్యమైన జనాభ
    దేశ ప్రగతి మిగుల నాశనమగు
    కొంచమున్న కలుగు కొల్లగ నభివృద్ధి
    లెక్క యెక్కు వైన లేదు సుఖము

    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘వనపర్తి☘

    రిప్లయితొలగించండి
  21. సంతు కంతు లేక పంతా న గనుచుండ
    కూడు గుడ్డ నీడ కొదువ గాదె
    జనులు తెలివి గలిగి జాగ్రత్త పడ కున్న
    లెక్క యెక్కు వైన లేదు సుఖము

    రిప్లయితొలగించండి
  22. మక్కువైన జనుల మదిని దోచునటుల
    చక్కనైన బతుకు జాడ లేక
    పెక్కు సంపదలను పెంచుకొనుట యేల
    "లెక్క యెక్కువైన లేదు సుఖము"

    రిప్లయితొలగించండి
  23. ప్రక్కన వచ్చిచేరినది బాపడు తెచ్చిన ప్రేమలేఖతో
    మక్కువ మీరవచ్చినది మానిక మిచ్చిన భల్లమొప్పగా
    చక్కని భామరో దొరకె సత్యము దెల్పగ కట్నమంచునో...
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్

    రిప్లయితొలగించండి
  24. ఆ.వె.
    మందు త్రాగినంత మనసెంతొ హాయి హాయ్
    పరిధి దాటకుంటె ప్రశ్న లేదు
    ముద్దొకటవ పెగ్గు వద్దు రెండవ మారు
    లెక్క యెక్కువైన లేదు సుఖము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హాయ్... అవ' అన్నవి సాధువులు కావు. "మనసెంతొ హాయియౌ... ముద్దొకటిగ పెగ్గు..." అనండి.

      తొలగించండి
  25. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2605
    సమస్య :: *లెక్కయె యెక్కువై నపుడు లేదు గదా సుఖ మెంత మాత్రమున్.*
    లెక్క అంటే డబ్బు (ధనము) ఎక్కువగా ఉంటే సుఖము ఎంతమాత్రమూ ఉండదు కదా అని చెప్పడం ఈ సమస్యలోని విశేషం.

    సందర్భం :: లోకంలో ప్రస్తుత కాలంలో డబ్బు లేకపోతే ఏ పనీ జరగడంలేదు. *ధన మూల మిదం జగత్* అని కూడా వింటున్నాము. ఐతే ఈ ధనాన్ని సంపాదించేటప్పుడు కష్టపడాలి. సంపాదించిన ధనాన్ని రక్షించాలంటే కష్టపడాలి. ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కూడా కష్టపడాలి. ఈ ధనం అన్ని సమయాల్లోనూ కష్టాన్నే కలిగిస్తున్నది కదా! అంటూ మనుస్మృతి అనే ధర్మశాస్త్రం లో ఇలా చెప్పియున్నారు.
    *అర్థానా మార్జనే దుఃఖం , ఆర్జితానాం చ రక్షణే ।ఆయే దుఃఖం వ్యయే దుఃఖం , ధిగర్థం దుఃఖభాజనమ్ ।।* కాబట్టి ధనం అవసరానికి మించి ఉంటే , ఆ డబ్బు (ఆ లెక్క ) వలన సుఖం ఎంతమాత్రమూ ఉండదు కదా అని విశదీకరించే సందర్భం.

    నొక్కి వచించె ధర్మము మనుస్మృతి , యర్థము దుఃఖ భాజన
    మ్మక్కట ! యార్జవమ్మున , వ్యయమ్మున , సంచిత రక్షణమ్మునం ,
    దక్కర యున్న మేర ధన మందుకొనంగ సుఖమ్ము గల్గెడిన్ ,
    *లెక్కయె యెక్కువై నపుడు లేదు గదా సుఖ మెంత మాత్రమున్.*
    { లెక్క = డబ్బు , ధనము }
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (22-2-2018)

    రిప్లయితొలగించండి
  26. ఆ.వె.
    మందు త్రాగినంత మనసెంతొ హాయి హాయ్
    పరిధి దాటకుంటె ప్రశ్న లేదు
    ముద్దొకటవ పెగ్గు వద్దు రెండవ మారు
    లెక్క యెక్కువైన లేదు సుఖము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను ఒకేసారి పోస్టు చేశాను పొరపాటున వచ్చింంది మన్నింంచంండి

      తొలగించండి
    2. నేను ఒకేసారి పోస్టు చేశాను పొరపాటున వచ్చింంది మన్నింంచంండి

      తొలగించండి
  27. చక్కగ నొక్కరిన్ గనిన చాలును ముద్దగు నేటికాలమున్
    నిక్కము యిద్దరిన్ గనిన నిప్పుల కుంపటి గేహమంతయున్
    చిక్కలు వీడవెన్నడును చింతలు దీరవు పెక్కురున్నచో
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిక్కము+ఇద్దరిన్ = నిక్క మిద్దరిన్' అవుతుంది. యడాగమం రాదు. "నిక్కమె యిద్దరిన్..." అనండి. 'చిక్కులు' టైపాటు వల్ల 'చిక్కలు' అయింది.

      తొలగించండి
    2. గురువర్యా ధన్యవాదాలు.. సరణతో
      చక్కగ నొక్కరిన్ గనిన చాలును ముద్దగు నేటికాలమున్
      నిక్కమె యిద్దరిన్ గనిన నిప్పుల కుంపటి గేహమంతయున్
      చిక్కులు వీడవెన్నడును చింతలు దీరవు పెక్కురున్నచో
      లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్

      తొలగించండి
  28. నిక్కమిద్ది కొద్ది చక్కెర వాడుట.
    చక్క దిద్దు"షుగరు"చిక్కులన్ని
    మిక్కుటంబునైన మిగులును దుఃఖము
    లక్కయెక్ఖువైన లేదు సుఖము

    రిప్లయితొలగించండి
  29. వలసినట్టి కొన్ని వస్తువుల్ చేబూని
    ధైర్యవంతులౌచు తన్మయమున
    యరుగవలయునెపుడు తరుసంఘములు గిరు
    లెక్క, యెక్కువైన లేదు సుఖము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా బాగున్నది. అభినందనలు.
      "తన్మయమున। నరుగవలయు" అని కదా ఉండాలి.

      తొలగించండి
  30. వాన లేని నాడు వరుస కరువులుండు
    వాన లెక్కు డైన వరద ఫముంచు
    మితమె యన్ని వేళ లమిత సుఖము గూర్చు
    "లెక్క యెక్కువైన లేదు సుఖము" (లెక్క = డబ్బు ; ధనము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో ఫ టైపాటు!

      తొలగించండి
  31. వెక్కి రించ మోడి, చిక్కులందు బడెను
    చంద్ర బాబు, ప్రక్క జగను పోరు,
    పార్ల మెంటు లోన పారునా యస్త్రము,
    లెక్క యెక్కువైన లేదు సుఖము

    రిప్లయితొలగించండి
  32. పిక్కల పైకి డ్రెస్సులను పిచ్చిగ వేసెడి పిల్లలీధరన్
    పెక్కురు మించిపోయిరిగ ఫేషను పేరిట వెర్రివారలై
    రక్కును పిచ్చికుక్కలవి రద్దిక జేయుడు! పిచ్చివేశముల్
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి


  33. కోట్లు కోట్లు కోట్లు కోటాను కోట్లు ! "ప
    రపతి పత్ర" కథల రభస గాన
    నీరవుడ! సెబాసు ! నీకథ జూడగ
    లెక్క యెక్కు వైన లేదు సుఖము !

    *letter of credit- పరపతి పత్రము

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      నీరవ్ మోడీని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  34. 1.
    అంచె లంచల పని నెంచుకొని సలుప
    ఫలము బొంద వచ్చు సులభముగను
    అధిక ధనము కొరకు నర్థితోడ, శ్రమించు
    లెక్క యెక్కువైన లేదు సుఖము

    రిప్లయితొలగించండి
  35. చుక్కలు జూపుచుండెనుగ, శోకము నొక్కటె తక్కువాయె, మ్యా
    జిక్కుల దోడ నా యరుణ జెట్టిలి జూపెను మొండిచేయి, లా
    జిక్కులు జూపినా ధనము జేరదు బాబుకు, మార్గ మేమిటో

    "లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్"

    రిప్లయితొలగించండి
  36. పార్లమెంటులో తగిన సంఖ్యా బలమున్నను కేంద్రము నుండి ధనము (ప్యాకేజి) పొందలేని మన ముఖ్య మంత్రి గారి మదిలోన బాధ

    రిప్లయితొలగించండి
  37. శిశుపాలుడు దమఘోషుడు, సాత్వతికి పుట్టాడు. పుట్టుకతోనే నాలుగు భుజాలతో, నొసటి మీద కంటితో, గార్దభ స్వరంతో పుట్టాడు. తల్లితండ్రులు ఆ బాలుని చూసి కలత చెందారు. అప్పుడు అశరీరవాణి ఈ బాలుడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతాడో అతని చేతిలో ఇతడు హతుడు కాగలడు " అని పలికింది. అప్పటి నుండి ఆ బాలుని ఇంటికి ఎవరు వచ్చినా చేతికి ఇవ్వసాగారు. ఒకరోజు బలరామ కృష్ణులు ఆ బాలుని చూడటానికి వచ్చారు. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలునికి మామూలు రూపం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తధ్యమని భావించిన సాత్వతి శ్రీకృష్ణుని చూసి " కృష్ణా ! నీ మరిది అయిన శిశుపాలుని రక్షించు " అని కోరింది. అలాగే అన్నాడు కృష్ణుడు. ఇతని నూరు తప్పులు సహిస్తాను అవి పూర్తికాగానే నా చేతిలో హౌతుడౌతాడు " అని శ్రీకృష్ణుడు చెప్పు సందర్భం:

    ఉత్పలమాల
    చక్కని రూపమందగను సాత్వతి పుత్రుడు కృష్ణు స్పర్శచే
    దిక్కిక నీవెనయ్య మరిదిన్ శిశుపాలుని గావు మంచనన్
    నిక్కుచు నూరు తప్పులను నీల్గుచు దాటిన సంహరింతనెన్
    లెక్కలు యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీ విట్టుబాబు గారికి ధన్యవాదాలు.

      చిరు సవరణతో..

      ఉత్పలమాల
      చక్కని రూపమందగను సాత్వతి పుత్రుడు కృష్ణు స్పర్శచే
      దిక్కిక నీవెనయ్య మరిదిన్ శిశుపాలుని గావు మంచనన్
      నిక్కుచు నూరు తప్పులను నీల్గుచు దాటిన నంతమౌననెన్
      లెక్కలు యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్


      తొలగించండి
  38. పరిమితి కలదిలను పరిశుభ్రతకు నైన
    తనను మరచు మంచి తనము కైన
    కడుపు నింపు తిండి కైన కలదు హద్దు
    లెక్క యెక్కుబైన లేదు సుఖము!

    రిప్లయితొలగించండి
  39. మంది ఎక్కు వైన మజ్జిగ పలుచన
    యగును, సంత తొక్క టైన చాలు
    పేర్మి తోడ పెంచి పెద్ద జేయగ, పిల్ల
    లెక్క యెక్కు వైన లేదు సుఖము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సంతతి + ఒక్కటి' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ "సంతతి యొకటైన చాలు" అనండి. అలాగే "పెద్ద జేయ సుతుల। లెక్క యెక్కువైన.." అనండి.

      తొలగించండి
  40. మొదటి పానిపట్టు యుద్ధములో (1526) బాబరు కేవలము 12 వేల సైన్యముతోనే చక్కని వ్యూహంతో ఇబ్రహీం లోడీ యొక్క లక్ష సైన్యంపై విజయం సాధించినాడని చరిత్ర కారులు చెబుతున్నారు.
    ***)()(***
    ఎక్కువ తక్కువల్ తరచి యెందున జూచిన మధ్య మార్గమే
    మిక్కిలి మేలు గూర్చు గద!మేదిని నెప్పుడు నెట్టి వారికిన్
    తక్కువ దండు తోడుతనె తానును బాబరు గెల్వ లేదొకో?
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదాసుఖ మెంతమాత్రమున్
    ==***==

    రిప్లయితొలగించండి
  41. సంధి మేలు సేయు శత్రు వధికుఁ డైనఁ
    బోరు నందు గెలువ వీరుఁ డింకఁ
    దలఁప వలయు బలము తనదు శక్తికి మించి
    లెక్క యెక్కువైన లేదు సుఖము

    [లెక్క =లక్ష్యము]


    దక్కదు నిద్ర చక్కగను దక్కును నమ్మిక ప్రక్క వారిపై
    దిక్క రయంగ దుర్లభము తెక్కలి కానికి చిక్క నిద్ధరన్
    మక్కువ యేల నిక్క మిది మానవ లెక్కలు పిక్కటిల్లగన్
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  42. అక్కట యేమి భార్య యిది యాలియెకాదు పిశాచి యివ్విధిన్
    మిక్కుటమైన కోరికలు మించి వచింపుచు మాటి మాటికిన్
    చిక్కుల బెట్టుచున్నది యిసీ నగలెన్నియు చాలవీమెకున్
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదాసుఖ మెంతమాత్రమున్

    రిప్లయితొలగించండి
  43. ధనము లేకయున్న మనుజుండు నిర్భీతి
    నిదురబోవు చింత మదిని లేక
    దొంగలొచ్చి సొమ్ము దోచుకొందురొ యేమొ
    లెక్క యెక్కువైన లేదు సుఖము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'దొంగలొచ్చి' అన్నపుడు 'ఒచ్చి' అనడం సాధువు కాదు. "దొంగ వచ్చి సొమ్ము దోచుకొనునొ యేమొ" అనండి.

      తొలగించండి
  44. గురువుగారూ, నా పూరణ ప్రచురింపబడింది. ఇప్పుడెందుకో కనిపించడం లేదు.
    అందుకే మళ్ళీ పెడుతున్నాను.
    --
    చక్కటి భావధారయును, శబ్దపు మాధురితోడ నింపుగా,
    పెక్కు సుభాషితమ్ములకు పేరిమి నిచ్చెడు అర్థ సంపదన్,
    మిక్కిలి నేర్చు పెద్దలును మెచ్చగ వ్రాయుము. ప్రాసకై సదా
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖమెంతమాత్రమున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీదేవి గారూ,
      నిజమే. మీ పూరణ 10.53 కు ప్రకటింపబడినట్లు నా మెయిల్లో ఉన్నది. మరి ఎందుకు తొలగిపోయిందో అర్థం కావడం లేదు.
      మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువుగారూ, ధన్యవాదాలు.
      కొంచెం అన్వయాన్ని మెఱుగు పెడదామని తోచి సవరిస్తున్నాను.

      చక్కటి భావధారయును, శబ్దపు మాధురితోడ నింపుగా,
      పెక్కు సుభాషితమ్ములను పేరిమిఁ గూర్చుచు, నర్థ సంపదన్,
      మిక్కిలి విజ్ఞతన్ పొదిగి మేలుగ వ్రాయుము. ప్రాసకై సదా
      లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖమెంతమాత్రమున్.

      తొలగించండి
  45. "మురళీకృష్ణ గారూ,
    మీ రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు."


    చక్కని పూరణమ్మనుచు శంకరులెప్పుడు మెచ్చుచుండగన్
    మిక్కిలి యద్భుతమ్మనుచు మిమ్ములనెప్పుడు కాగలించగన్
    గ్రక్కున పద్యముల్ వలికి గారవ మొందవధానులారయా!
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్ 🌹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ శాస్త్రి గారికి నమస్సులు🙏🙏

      ఎక్కువమార్లు మీరు రచియింతురుగా తొలిపూరణమ్ము ! మీ
      ప్రక్కనె మాది యుండు , ననురాగము మీ పయి మెండు వారికిన్ !
      చక్కని కైత మీదని ప్రశంసయు దక్కును మీకు ! దేవుడా !
      లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. అవధాని వారికి, అప్రస్తుత ప్రశంసకులకు 'లింకు' బాగానే కుదిరినట్టుంది. ఇద్దరికీ నమస్సులు!

      తొలగించండి
    3. విన్నకోట వారి ప్రశ్న:

      "..."శంకరాభరణం" బ్లాగ్ సమస్యా పూరణల్లో మీరు తరచుగా "మైలవరపు వారి పూరణ" అంటూ చివర్లో "మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి" అని వ్రాస్తుంటారు కదా...అలా ఎందుకు? అని నా సందేహం..."

      విన్నకోట వారికి అప్పటికప్పుడు నాకు తోచిన సమాధానం ఇచ్చాను.

      సత్యంవధ చేయకుండా నిజం చెప్పాలంటే:

      "నేను మైలవరపు వారి పంఖాను కాబట్టి"

      పంఖా = fan

      "పంఖానైతిని నేను శంకరవరా! ప్రారబ్ధపుణ్యమ్మునన్"

      తొలగించండి


    4. నీ మున్నాలె పోనా నా పిన్నాలె వారె :)



      శంఖమ్మయ్యెగ శంకరాభరణ కాసారమ్ము !మేల్గాంచగన్
      తంఖీహ్లన్గని సారమొప్పు పదముల్ తట్టంచు వేయన్నిటన్,
      పుంఖాపుంఖముగాను పద్యములనే పూరింప నేర్చానయా
      పంఖానైతిని నేను శంకరవరా! ప్రారబ్ధపుణ్యమ్మునన్!


      జిలేబి

      తొలగించండి
    5. శ్రీ శాస్త్రి గారూ... 🙏🙏

      శంఖంబూదియు శంకరాభరణ సౌజన్యమ్ముతో మద్యశో
      రింఖాదర్శనమందజేయుచును శాస్త్రీ ! గట్టి మేల్ సేయగా
      పుంఖంబుల్ గనుపట్టె కీర్తిశరసత్పుష్పాళికిన్ !గాంచుచో
      పంఖాలైతిరి మీరు మత్కృతులకున్ ప్రారబ్ధపుణ్యమ్మునన్ !!

      రింఖా.... నాట్యము
      పుంఖము... బాణపు ఈకల ప్రోవు

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  46. ధనము గూడబెట్టి దాచుకున్నను గాని
    ఫలితమేమి గలదు వసుధలోన
    దొరలె దొంగలగుచు దోచుకు పోతుంటె
    లెక్క యెక్కువైన లేదు సుఖము!!!.

    ఇలను జూడ నేడు నింటిల్లు పాదియు
    బ్రతుకు దెరువుకొరకుపాటు బడిన
    పెరుగు ధరలుజూడ విన్నును తాకగ
    లెక్కయెక్కువైన లేదు సుఖము!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పోతుంటె' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. "దొంగ లగుచు దోపిడి చేయగా" అందామా?

      తొలగించండి
  47. బొక్కసమద్ది నింపగను బోలెడు కృత్యము లెన్నొ జేయుచున్
    మిక్కిలి యాశ తోడ తన మేలిమి బంధువు లెంత జెప్పినన్
    లెక్కను జేయ నెంచకను లీలలు జూపుచు దోచుటేలకో
    "లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్"

    రిప్లయితొలగించండి
  48. ముక్తినిచ్చు వాని ముక్కంటిని మరచి
    చిక్కి యింద్రియముల జిత్తజునికి
    విత్తమందె ప్రీతి విషయ వాంఛలదీర్చు
    లెక్క యెక్కువైన లేదు సుఖము

    రిప్లయితొలగించండి
  49. చాలినంత ధనము సమకూర్చు కొనినచో
    బ్రదుక వచ్చు సుఖపు బ్రదుకె యిలను
    లెక్క యెక్కువైన లేదుసు ఖమనుట
    యక్షరాల నిజమె యార్య! యదియ

    రిప్లయితొలగించండి
  50. పెళ్ళి కెళ్ళహాయి పేరుకుమాత్రమే
    మందిపెఱిగినపుడు మజ్జిగ పల
    చనను నానుడెపుడు వినగనిజము గాన?
    లెక్క యెక్కువైన లేదు సుఖము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పెండ్లి కేగ హాయి... మజ్జిగ పలు।చన యనెడు జనోక్తి వినగ..." అంటే బాగుంటుంది.

      తొలగించండి
  51. మితిని మించి ధనము మిద్దెల దాచినన్
    దోచు కొనుదురనుచు కాచు కొనుట ;
    దాచ బ్యాంకులున్న తప్పదు ట్యాక్సులు!
    లెక్క యెక్కువైన లేదు సుఖము

    నిన్నటి సమస్యకు నా పూరణ

    నేత్రములు విడక నొకడున్
    సత్రము లో బ్రతుక లేని క్షణమున నొక డే
    మాత్రము స్మృతి నెరుగ కెటుల
    పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్ ?

    పుత్రులె లేక , నొకం డే
    మాత్రము స్మృతి లేక మరణ మందు నొకండున్ ;
    చిత్రము గాదే సమస్య ?
    పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మూడవ పూరణ మూడవ పాదంలో మూడవ గణంగా జగణం వేశారు.

      తొలగించండి
  52. మిత్రులందఱకు నమస్సులు!

    (...వాయి కట్టి కడుపు కట్టి ధనము గడించువాఁడు పరులకయి మోపు మోయువానియట్లు క్లేశమునకు మాత్రము పాత్రము....)

    చుక్కల చందమౌ ధనముఁ జొక్కుచు సోలుచుఁ గూడఁబెట్టి, తా
    నొక్కఱి కీక, మెక్కక, మహోగ్రముగా రుజ నొంది, లాలసన్
    మిక్కిలియైన సొమ్ములను మెప్పుగ లెక్కిడుచుండు నిత్య; మా
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్!

    రిప్లయితొలగించండి
  53. చక్కటి చుక్క|భార్యమనసందుననుంచక నన్యకాంతలే
    మక్కువటంచు నెంచగల-“మానవదానవ లక్ష్య సాధనా
    కుక్కకునక్కకున్ మనసు కూర్పుల, నేర్పులయెక్కువైనదౌ
    లెక్కయె” యెక్కువైనపుడు లేదుగదాసుఖ మెంత మాత్రమున్

    రిప్లయితొలగించండి
  54. మిక్కిలి సొమ్ము పొంద మితిమీరిన స్వార్థముతో చరించినన్
    దక్కదు శాంతినిక్కముగ, తద్దయ కష్టము సంభవించెడిన్
    చక్కగ సాగ జీవితము సల్పవలెన్ తగు నార్జనమ్మిలన్
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్

    రిప్లయితొలగించండి
  55. చెక్కిలి కిన్ని నొక్కు లను, చెంతకు జేరగ కౌగిలింతలో
    లెక్కిడు నిన్ని మాత్రలని, లిప్తల నెంచును ముద్దు బెట్టగన్
    లెక్కల యొజ్జతో మనువు లెక్కలె జీవిత మెల్ల వింటిరే
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్.

    రిప్లయితొలగించండి
  56. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

    రెక్కలు ముక్కలై చనగ రేయిబవళ్ళు శ్రమించి , కార్మికుల్

    చక్కని జీవితమ్మున బ్రశాంతిని పొందుచు నున్నవార | లా

    టక్కరి మార్గ మెంచుకొని డబ్బును కోట్లను కూడబెట్టినన్‌ ,

    దక్కునె శాంతి ? శాంతి లేనపుడు‌ తక్కిన భోగము లెన్ని యుండినన్

    దక్కువ కాదె ? యక్రమ పథంబున సొమ్ము గడించి వైచినన్ ,

    చిక్కునె గౌరవమ్ము ? ప్రజ ఛీ యని రోసిన జన్మ , జన్మయే ?

    లెక్కయె యెక్కు వైనపుడు లేదు గదా ‌ సుఖ మెంత మాత్రమున్ ! ! !



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నాల్గవ పాదంలో గణదోషం. "దక్కునె శాంతి? లేనపుడు..." అనవచ్చు కదా?

      తొలగించండి
  57. ఒక్క రుండ వీవు పెక్కు మందికి సాటి
    యేల మాకును పది వేల మంది?"
    యనుచు పల్కె గాదె యర్జును డానాడు?
    లెక్క యెక్కు వైన లేదు సుఖము!

    రిప్లయితొలగించండి
  58. పెక్కు లున్న నేమి లెక్కకు మిక్కిలి
    చుక్కలు విను వీధి లెక్క లేక
    చంద్ర బింబ మిడదె చల్లని వెన్నెల?
    లెక్క యెక్కు వైన లేదు సుఖము!

    రిప్లయితొలగించండి
  59. ధన్యవాదాలండీ.
    సవరణలతో
    ఆ‌.వె:ఉన్నయంతలోన నొద్దిక గానుండ

            బ్రతుకు  పండు నెపుడు వసుధ యందు

              అప్పు చేయుచున్న తిప్పలు తప్పవు

               లెక్క యెక్కు వైన లేదు సుఖము.


    ఆ.వె:పిల్ల లెక్కువైన విశ్వమందెప్పుడు

             కడుపు నింపు లేక గతులు మారు

             బ్రతుకు బండి లాగ బాధ లధికమౌను

              లెక్క యెక్కు వైన  లేదు సుఖము


    ఆ.వె: బహు రుచికర మనుచు బాగుగా తినుచున్న

            తనువు చెడును గనుము ధరణి యందు

            మితముగాను తిన్న మేలగు మేనుకు

            లెక్క యెక్కు వైన లేదు సుఖము



    ఆ.వె:ధనమదెక్కు వైన ధరణిలో జనులలో

           విచ్చలవిడి తనము పెరుగు చుండు

          ననెడి మాట నిజము ననవరతమటండ్రు

          లెక్క యెక్కు వైన లేదు సుఖము.

    రిప్లయితొలగించండి
  60. అక్కర లేకపోయినను నర్ధము జూడగ బిచ్చిచేష్టలు
    న్నెక్కువగా గనంబడును నెల్లజనాళిహృదంతరాళలో
    చిక్కులుగల్గుచున్మదికిచేటును హానిని గల్గజేయునే
    లెక్కయె యెక్కువైనపుడులేదుగదాసుఖమెంతమాత్రమున్

    రిప్లయితొలగించండి
  61. చక్కె రదియె లేక చప్పన కాఫియే
    చక్కె రెక్కు డైన చవికి చేటు
    మితమ దెప్పు డైన హితము గూర్చుచు నుండు
    లెక్క యెక్కు వైన లేదు సుఖము

    రిప్లయితొలగించండి
  62. (2)

    పక్కన నున్నయట్టి యొక పల్లెకుఁ బోయితిఁ గార్యసిద్ధికై
    యొక్కదినాన నేను! పనియున్ నెఱవేరక యొక్క యింట నే
    నొక్కెడఁ గుక్కిమంచమున నొందితి నిద్దుర! యందు నల్లులే
    లెక్కకు మిక్కిలిన్ గలవు! లెక్కిడుచుంటిని, చంపుచుంటి! నా
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఆహా ! అంత లెక్కల గట్టినా నిదుర రాలేదా :)


      అదురహో నల్లోపాఖ్యానం !


      జిలేబి

      తొలగించండి

    2. :)

      ఉద్గంశమ్ముల గాంచితి
      ఉద్గంధి భరింప లేక నురికితి చంపన్!
      మద్గణిత మత్కుణమ్ములు
      సద్గతి నివ్వవలె నిదుర చక్కగ బోవన్!

      జిలేబి

      తొలగించండి
  63. మక్కువొకింత లేక యనుమానము పెచ్చరిలంగ దోషముల్
    పెక్కులుగా గనంగ నొక వీసమునైనను తృప్తిలేని ఈ
    ప్రక్కని వారి గూర్చి వివరంబుల సేకరణంబు జేయు నా
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్

    రిప్లయితొలగించండి
  64. "లోకంబులు లోకేశులు
    లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
    జీకటి కవ్వల నెవ్వం
    డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్"

    చుక్కలు కోటికోట్లవగ చుక్కల రేండ్లును లక్షలక్షలై
    దిక్కులు తెన్నులన్ గనక తీరని శోకపు రీతులెన్నియో
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రము...
    న్నొక్కటి వీనియావలన నున్నది గాంచగ నందమౌనహా!

    రిప్లయితొలగించండి

  65. (3)
    చిక్కియుఁ బీదపుట్టువున, జేనెడు పొట్టకుఁ గూడులేని యా
    బక్క కుచేలు భార్య, ప్రసవమ్మున బండెడు పిల్లలం గనెన్;
    లెక్కకు మిక్కిలిం గలుగు లేఁబసిపాపల క్షుత్తులాఱునే?
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవ పాదాంతాన...
      "...పిల్లలం గనన్" అనియు...

      మూఁడవ పాదాంతాన....

      "...క్షుత్తు లాఱెనే?" అని యుండవలెను.

      సవరించిన తదుపరి:
      చిక్కియుఁ బీదపుట్టువున, జేనెడు పొట్టకుఁ గూడులేని యా
      బక్క కుచేలు భార్య, ప్రసవమ్మున బండెడు పిల్లలం గనన్,
      లెక్కకు మిక్కిలిం గలుగు లేఁబసిపాపల క్షుత్తులాఱెనే?
      లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్!

      తొలగించండి
  66. మొత్తానికి మనందరిలోనూ లెక్కల పండితుడు లోన దాగియున్నాడనమాట!!
    😁🤣

    రిప్లయితొలగించండి
  67. ఆ.వె. లెక్కలేని ధనము చిక్కుల మూలము
    చూపకున్న లెక్క చోరుడంద్రు
    చూపి యున్న లెక్క చోరులు వత్తురు
    "లెక్క యెక్కువైన లేదు సుఖము"

    రిప్లయితొలగించండి



  68. శ్రీరామా నేను కావగ

    రా రమ్మని పిలిచె సీత., రాధాలోలున్

    చేరగ యమునా తటమున

    కూరిమి తోడను తిరిగెను గోపిక తమితో

    రిప్లయితొలగించండి
  69. ..............సమస్య
    లెక్కయె యెక్కువైనపుడు
    లేదు గదా సుఖ మెంత మాత్రమున్

    సందర్భము... శ్రీమహా విష్ణువు యొక్క ద్వార పాలకులు జయ విజయులు. సనక సనందనాదులు శ్రీ హరి దర్శనార్థమై రాగా అభ్యంతరం తెలిపినారు. వారు జయ విజయులను శపించినారు. విష్ణు మూర్తి వారిని సమాధానపరచినాడు.
    "మిత్రులై ఏడు జన్మలలో నా దరికి చేరుకుంటారా! లేక శత్రువులై మూడు జన్మలలో చేరుకుంటారా!" అన్నాడు.
    వారు "స్వామీ! మూడు జన్మలే అనుగ్ర హించండి. మీ సన్నిధానాన్ని వదలి మే ముండలేము." అన్నారు. ఆ సంభాషణ మిది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "మక్కువ మీర మిత్రు లయి
    మా దరిఁ జేరుదు రేడు జన్మలన్...
    నిక్కిన శత్రులై యెదుట
    నిల్తురు వత్తురు మూడు జన్మలన్..
    మిక్కిలిఁ బ్రీతి యేది?" యన
    "మీ దరిఁ జేరగ మూడు జన్మలే
    చక్కగఁ జాలు లె" మ్మనిరి
    శౌరి కడన్ గల ద్వార పాలకుల్..
    లెక్కయె యెక్కువైనపుడు
    లేదు గదా సుఖ మెంత మాత్రమున్!

    2 వ పూరణము:

    సందర్భము... శ్రీ కృష్ణుని చేతిలో తన కుమారుని మరణం తప్ప దని తెలుసుకున్న శ్రీ కృష్ణుని మేనత్త తన కుమారుడైన శిశుపాలుని రక్షించు మని ప్రాధేయపడింది.
    అప్పుడు కృష్ణు డామెతో అతడు చేసిన నూరు తప్పులను మాత్రం సహిస్తాను. అదీ నీ కోసం. అంతకంటె ఒక్కటి యెక్కువయిందా! అతణ్ణి సంహరించడం మాత్రం తప్పదు. అంటున్న సందర్భ మిది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    " మిక్కిలి యైన ద్వేషమున
    మేరలు మీరును నీ సుపుత్రు; డేఁ
    జక్కగ నూరు తప్పులను
    సైపుదు నత్తరొ! 'ముందె చెప్ప లే
    దొక్కొ!' యనంగఁ బోకు సుమ!
    యొక్కటి యెక్కువ యైన వాని నే
    నుక్కడగింతు; తథ్య మిది;
    యోర్పునకున్ మితి యన్న దుండదా!
    లెక్కయె యెక్కువైనపుడు
    లేదు గదా సుఖ మెంత మాత్రమున్!"

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  70. .........సమస్య
    లెక్క యెక్కువైన లేదు సుఖము

    సందర్భము... సులభం.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "ఆయ"మందు "వ్యయము" నల తీసివేసిన
    "మిగత" యనగ మనకు మిగులు నెపుడు,
    కాని "నగదు" లేక.. కాగితములమీద
    లెక్క యెక్కువైన లేదు సుఖము

    మిగత= balance

    2 వ పూరణము:

    సందర్భము... కాగితాలమీద "మిగతా.." అనేది ఎక్కువగా చూపించబడుతూ మన వద్ద తక్కువగా "నగదు" కనిపిస్తుందంటే ఖర్చు పెట్టాము కాని చెప్పలేక పోతున్నా మని యర్థం. అప్పుడు "మిగతా" లోనుంచి "నగదు"ను తీసివేసి వచ్చిన దాన్ని "మరచిపోయిన ఖర్చు" లేదా "లెక్క తెలియని ఖర్చు" అని వ్రాయాలి. వెంటనే లెక్క సమన్వయం (ట్యాలీ) ఔతుంది. పై విధంగా వ్రాసుకోలేక పోయినట్టైతే ఏం ఖర్చు పెట్టామో తెలియక అదే పనిగా మథన పడిపోతూవుంటాం కదా!
    లెక్క వ్రాసుకునే అలవా టుండి, తనకు తానే అధికారి (బాసు) యైన సందర్భంలో ఈ పద్ధతి సర్వదా ఆమోద యోగ్యమైనది.
    అప్పుడు "లెక్క యెక్కువైన లేదు సుఖము.." అనలేము కదా!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "మిగత" సరిగ లేదొ "మిగతన్" "నగదు" తీసి
    వేసి, వ్రాయవలయు వేగ నిటుల..
    "మరచినట్టి వ్యయము"..
    మరి యనలే మిట్లు..
    "లెక్క యెక్కువైన లేదు సుఖము"

    మిగత= balance

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    22.2.18

    రిప్లయితొలగించండి


  71. జీపీయెస్ వారు మీకోసం ఓ శార్దూల సమస్యా పాదం


    ఏనాడైనను దిక్కు దేవుడుగదా యెవ్వారికైనన్ హరీ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  72. ఒక్కతె చెల్లెలుండగను నొప్పుచు నొల్లుచు ముచ్చటౌనుగా
    చక్కని రాఖి గట్టగను జంకక నిచ్చుచు వేయి రూప్యముల్...
    మిక్కిలి భగ్నులుండగను మీసము వ్రాలగ మోసమౌనుగా...
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్

    రిప్లయితొలగించండి