గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2612 సమస్య :: *మసిఁ జేసెన్ దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే.* సందర్భం :: తారకాసురుని చంపగలవాడు శివకుమారుడు ఒక్కడే అని , శివునికి సేవ చేసేందుకు పార్వతి వచ్చిన సమయంలో , ఆ పార్వతిపై శివునికి మనసు లగ్నమయ్యేటట్లు చేయాలని అనుకొన్నాడు మన్మథుడు. *ఉన్మాదనః శోషణశ్చ తాపనస్తమ్భనస్తదా।* *సమ్మోహనశ్చ పఞ్చైతే విఖ్యాతాః కామ శాయకాః।। * అంటూ మన్మథుని ఐదు పూల బాణాలను గురించి చెబుతారు. మన్మథుడు ఆ పూలబాణాలను ప్రయోగించగా పరమశివుని ఏకాగ్రతకు భంగం కలిగింది. ఆ సమయంలో మన్మథుడు తాపసి యైన శివుని తామసిగా చేసినాడు అని ఒక వ్యక్తి పలికే సందర్భం.
కవిమిత్రులారా నమస్కృతులు. విశాఖ ఎక్స్ ప్రెస్ లో కొత్తవలస వెళ్తున్నాను. రేపు అక్కడ తరుణ్ చెరుకూరి గారి రిసెప్షన్ ఉంది. ఎల్లుండి బయలుదేరి 4 న హైదరాబాద్ చేరుకుంటాను. అంతవరకు నాకు సెలవు ఇవ్వవలసిందిగా మనవి.
సందర్భము... జీవు లందరి హృదయాలలోను శంకరుడు మరియు మన్మథుడు వుంటారు. మనసును గెలువ గలిగినప్పుడు స్మరుడు (మన్మథుడు)... గెలువ లేకపోతే (లొంగిపోతే) శంకరుడు మసియై పోతూనే వుంటారు. సీతను చూడగానే దశకంఠుని (రావణాసురుని) హృదయంలో కాముడు విజృభించాడు. శంకరుణ్ణి (శంకరు డంటే శుభం కలిగించే వాడు) మసి చేసివేశాడు. ఎక్కడ.. అంటే ఆతని హృదయ క్షేత్రంలో... ~~~~~~~~~~~~~~~~~~~~~~~ సకల జీవుల హృదయాల శంకరుండు మన్మథుండును నుందురు; మనసు గెలువ స్మరుడు... లేకున్న హరుడును మసి యగుదురు... సీతఁ గనినంత దశకంఠు చేతమందు మసి యొనర్చెను శంకరున్ మన్మథుండు
2 వ పూరణము:--
సందర్భము... జీవు లందరి హృదయాలలోను శంకరుడు మరియు మన్మథుడు వుంటారు. శంకరుడు ఆత్మ స్వరూపుడు. శాశ్వత సుఖ ప్రదుడు. మన్మథుడు మనసుకు ప్రతీక. క్షణిక సుఖాభిలాషను ప్రేరేపిస్తాడు. ఆత్మ విచారం కల వివేకులలో పరమేశ్వరుడు క్రమంగా స్థిరపడుతూ వుంటాడు. మనసు చెప్పినట్టు నడుచుకునే వాళ్ళ హృదయాలలో మన్మథుడు విజృంభిస్తూ వుంటాడు. అంత గొప్ప శివ భక్తు డైనప్పటికీ రావణుడు సీత అందాన్ని చూడగానే కాముకుడై వివేకం కోల్పోయాడు. తాను శివ భక్తు ణ్ణన్న సంగతీ మరచిపోయాడు. శివుణ్ణీ విస్మరించాడు. మనసు ననుసరిస్తున్నాడు కాబట్టి కాముడు వెంటనే చెలరేగి శంకరుణ్ణి మసి చేసివేసినాడు. తప్పు త్రోవ పట్టించినాడు. మనసును గెలువ గలిగినప్పుడు మన్మథుడు... గెలువ లేకపోతే (లొంగిపోతే) శంకరుడు మసియై పోతూనే వుంటారు అన్నది గమనింతురు గాక! కాముడు విజృభించి శంకరుణ్ణి (శంకరు డంటే శుభం కలిగించే వాడు) మసి చేసివేయకుండా జాగ్రత్తగా చూచుకోవడం మనిషికి అవశ్య కర్తవ్యం అన్నది గమనింతురుగాక! ~~~~~~~~ అన్ని జీవుల హృదయాల శాశ్వత సుఖై కాత్మగా శంకరుం డలరుచుండు మన్మథుండును నుండు మనసుకు ప్రతీకగా క్షణిక సుఖైకంపు సాధకుండు నాత్మ ననుసరించు ననఘాళి హృదయాల పరమేశ్వరుడు దృఢపడుచునుండు మనసు ననుసరించు జన హృదయాలలో పొంచి స్మరుడు విజృభించుచుండు
రావణుడు శివభక్తి విరాజితుండు నయ్యు.. కాముకుండై సీత యందములనుఁ గాంచె; మది కాముడే మేలుకాంచె, మించె.. మసి యొనర్చెను శంకరున్ మన్మథుండు
పూల బాణములను వేయ మాల వోలె
రిప్లయితొలగించండికామ మోహము లోర్వక కండ్లు తెరచి
భామ పార్వతి జూచుచు ప్రేమ మీర
మసి యొనర్చెను శంకరున్ మన్మథుండు!
నా భావన:
తొలగించండిశంకరుడు ప్రేమతో "మసి" అయ్యాడు అని... "ఐసయ్యాడు" లా :)
అన్వయం "మసి" ఐనదనుకోండి :)
ప్రభాకర శాస్త్రి
*************************
మైలవరపు వారి స్పందన; సవరణ:
🙂🙏మీరు దోషజ్ఞులు.. విద్వాన్... విపశ్చిత్... దోషజ్ఞః... ఇత్యమరః...
మీ భావం ఇలా సమన్వయమౌతుంది... చూడండి...
పూల బాణములను వేయ మాల వోలె
కామ మోహమ్ములును గల్గ కనులు తెరిచి
పార్వతిని జూడ జేసిన వాడు గాన
మసి యొనర్చెను శంకరున్ మన్మథుండు!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి సవరణ పూవుకు తావిని గూర్చినట్లుంది.
🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఅతనుడు ! అనంగుడు!అజుడు ! అంగ జుండు !
పుష్ప ధన్వుడు! రుద్రుడు పొడుము గాంచి
మసి యొనర్చెను; శంకరున్ మన్మథుండు
కామపు వికారము మదిని కలుగ జేయ!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని 'అతనుడు + అనంగుడు + అజుడు + అంగజుడు = అతను డనంగు డజు డంగజుడు' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు కదా!
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఫాలనేత్రాగ్నిలో శలభమును భంగి
మసి యొనర్చెను , శంకరున్ మన్మథుండు
విరులబాణాల విసిగింప విసిగి యతడు !
బ్రతిమిలాడగ రతి మనోభవుని జేసె !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిఅద్భుతః ! అవధాని అవధాని యే :)
జిలేబి
ధన్యవాదాలండీ ఉభయకవిమిత్రులకు 🙏🙏
తొలగించండిమైలవరపు మురళీకృష్ణ
కోపం రాజసమే..... కాని యెదుటివారిని దగ్ధం చేయగలిగినంతదైతే తామసమే అనే భావన తో.... (నేను కాదు... ఎవరో.. అతడనెన్ )
తొలగించండిఅసమానమ్మగు ధ్యాననిష్ఠ స్థిమితుండైయున్న రుద్రుండు దా
మసిఁ జేసెన్ దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే
విసిగింపన్ గనుమన్న నే ., నతడనెన్ భిన్నముగా గాదు "తా...
మసిఁ జేసెన్ దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే" !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
డిటో:
తొలగించండితామసి : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
2. (colloquial) an angry, passionate or irascible person.
👌🏻🙏🏻
తొలగించండిపై పద్యమే.... విరామచిహ్నాలతో..... 🙏
తొలగించండికోపం రాజసమే..... కాని యెదుటివారిని దగ్ధం చేయగలిగినంతదైతే తామసమే అనే భావన తో.... (నేను కాదు... ఎవరో.. అతడనెన్ )
అసమానమ్మగు ధ్యాననిష్ఠ స్థిమితుండైయున్న రుద్రుండు దా
మసిఁ జేసెన్., దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే
విసిగింపన్ గనుమన్న నే ., నతడనెన్ భిన్నముగా ., గాదు "తా...
మసిఁ జేసెన్ దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే" !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికపోలకల్పితం...
తొలగించండిశ్వసనాధ్యాసితచిత్తవృత్తి ముని విశ్వామిత్ర దీక్షారతిన్
మసిజేసెన్ , సురనాథునిన్ మునిసతీమానమ్ము దోచంగ నీ
కుసుమాస్త్రుండొక హేతువంచితడు మాకున్ ద్రోహి యంచెంచిరో !
వెస గర్వమ్మున రెచ్చగొట్టిరొకొ పూ విల్తున్ పురారాతిపై !
కసి హింసింప ., హరుండు మంటనుడుకంగా జేసి తద్దేహమున్
మసిఁ జేసెన్ , దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే
విసిగించెన్ ! దన శక్తియుక్తులను సంవీక్షించి భద్రమ్ము నా...
రసి పోరాడిన శ్రేయమబ్బు ! సకలార్థశ్రేణి సిద్ధించెడిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిమసి యొనర్చెను, శంకరున్ మన్మథుండు
కామపు వికారము మదిని కలుగ జేయ,
అతనుని,కమనుని,అజుని, అంగజుడిని,
పుష్ప ధన్వుని ,మారుని , పొడుము గాను!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వలపు వలవేసి మారుడు కలత బెట్ట
రిప్లయితొలగించండిఆగ్ర హించిన శంభుడు నుగ్రు డగుచు
మసి యొనర్చెను , శంకరున్ మన్మ ధుండు
కసిని పెంచుకు నున్మత్త కాము డనగ
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపసివాడాతడు లక్ష్మిపుత్రుడటవే ! పంచేషువాతండటే !
పసిమిన్ జూచుచు ముద్దు జేయను గదా భార్యన్గనన్నార్యుడే
మసిఁ జేసెన్ దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే!
నుసియాయెన్గద నంతకాంత కుని కన్నుల్ జూడ విప్పార్చగన్ !
జిలేబి
తొలగించండినుసియాయెన్గద నంతకాంతకుని కన్నుల్ జూడ విప్పార్చగన్ !
పసివాడాతడు లక్ష్మిపుత్రుడటవే ! పంచేషువాతండటే !
పసిమిన్ జూచుచు ముద్దు జేయను గదా భార్యన్గనన్నార్యుడే
మసిఁ జేసెన్ దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే!
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివుడునేకాగ్ర ధ్యానంబు జేయునపుడు
రిప్లయితొలగించండిపుష్పబాణముల వేధించు పూల రేని
మసియొనర్చెను; శంకరున్ మన్మధుండు
వేడి కైలాసమున జేరె వేడ్క మీర
వామన కుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. "పుష్పబాణాల వేదించు..." అనండి.
కసితో మారుడు నీసునిన్ దలచి గంగాదేవి తోనెత్తి పై
రిప్లయితొలగించండివెసదీ రంగసు ఖాశ్రయం బనుచు వేవేలౌ గణంబుల్ నినున్
కొసకీ రీతిగ తాండవం బునను కాకోల్లాస మున్ బొంద గా
మసిఁ జేసెన్ దన పుస్ఫబాణములతో మారుండు ముక్కంటినే
అక్కయ్యా,
తొలగించండిపద్యం బాగుంది. కాని పూరణ భావం అర్థం కాలేదు.
కనలి మూడు పురమ్ముల కాటిరేడు
రిప్లయితొలగించండిమసి యొనర్చెను, శంకరున్ మన్మథుండు
పూవు తూపులఁ బడవేయ మోహమునను
నీఱు గావించె వానిని నీల గళుడు
అన్నపరెడ్డి వారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తే.గీ.
రిప్లయితొలగించండిమదనుడేయ బాణము,వాని మదము గనుచు/
నిప్పులొలుకు చూపులనా త్రినేత్ర ధారి/
"మసి యొనర్చెను;శంకరున్ మన్మథుండు"/
దలచె సామాన్య సురుడని! తప్పు గాదె?.
నరసరాజు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపసిమిన్ జూచుచు ముద్దు జేయనుగదా భస్మాంగునిన్ప్రేమతో
మసిఁ జేసెన్ దన పుష్పబాణములతో మారుండు ?ముక్కంటినే,
నుసిజేతున్నజునిన్నటంచు తన కన్నుల్కోపమున్జేయుటే?
పసివాడాతడు లక్ష్మిపుత్రుడటవే! పంచేషువాతండటే !
జిలేబి
అహో! ఏమా పద్య శర విన్యాసము...
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2612
సమస్య :: *మసిఁ జేసెన్ దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే.*
సందర్భం :: తారకాసురుని చంపగలవాడు శివకుమారుడు ఒక్కడే అని , శివునికి సేవ చేసేందుకు పార్వతి వచ్చిన సమయంలో , ఆ పార్వతిపై శివునికి మనసు లగ్నమయ్యేటట్లు చేయాలని అనుకొన్నాడు మన్మథుడు.
*ఉన్మాదనః శోషణశ్చ తాపనస్తమ్భనస్తదా।*
*సమ్మోహనశ్చ పఞ్చైతే విఖ్యాతాః కామ శాయకాః।। * అంటూ మన్మథుని ఐదు పూల బాణాలను గురించి చెబుతారు. మన్మథుడు ఆ పూలబాణాలను ప్రయోగించగా పరమశివుని ఏకాగ్రతకు భంగం కలిగింది. ఆ సమయంలో మన్మథుడు తాపసి యైన శివుని తామసిగా చేసినాడు అని ఒక వ్యక్తి పలికే సందర్భం.
అసురున్ తారకు జంపగా , శివసుతుం డావశ్యకమ్మంచు , సం
తస మొప్పారగ గౌరి యీశు గొలువన్గా జేరు కాలమ్మునన్ ,
వెస నున్మాదన , తాపనమ్ములను బంపెన్ శోషణ , స్తంభనా
ల సుసమ్మోహన నామకమ్ముల సుమాలన్ గర్వితుం డౌచు , దా
*మసిఁ జేసెన్ దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (1-3-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండి।మనసు చలి యింప జేసిన మరుని గాంచి
రిప్లయితొలగించండిక న లి ముక్కoటిమంట తో కాల్చి తనను
మసి యో న ర్చే ను ; శంకరు న్ మన్మథుoడు
పెండ్లి కొడుకు గ మార్చియు విజయ మందె
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అసమానంబగు దీక్షతో,జపముతో,నద్రిన్ తపోనిష్ఠునిన్
రిప్లయితొలగించండిమసిఁజేసెన్ తన పుష్ప బాణములతో మారుండు ముక్కంటినే!
వెస కామోద్రిక్తత పార్వతిన్ గదియగా,వీరుండు జన్మింపగా,
కసితో తారకుఁజంపి దేవతలకున్ కామ్యంబు సిద్ధింపగన్
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"తపోనిష్ఠుఁ దా।మసిఁ జేసెన్..." అనండి. బాగుంటుంది.
ధన్యవాదములు
తొలగించండిడా.ఎన్.వి.ఎన్.చారి 9966610429
రిప్లయితొలగించండివిషకంఠుండుతపమ్ము తోడ హృదయా వేశంబు నావేదనన్
రసహీనంబుగ జేయుచున్ హిమ గిరీంద్రాసీనుడౌ వేళలన్
వసుధన్ శోభలు నింపనెంచుచును సద్భావంబు నిండార, తా
మసి జేసెన్ దన పుష్ప బాణములతో మారుండు ముక్కంటినే
చారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూల విల్లును చక్కగా బూని చేత
రిప్లయితొలగించండిబీరమాడుచు బాణముల్ వేయగ్ నతని
మసి యొనర్చెను, శంకరున్ మన్మథుండు
లొంగదీయుట గలదటే లోకమందు.
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వేయ నతని'
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పూలబాణుని ,గోపాన పురహరుండు
రిప్లయితొలగించండిమసియొనర్చెను,శంకరున్ మన్మధుండు
విరహ వంతుని జేసెను వేసి శరము
నంగ హీనుని ధాటికి నాగ గలరె?
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రసరించెన్ మధుమాస సోయగములాపాతమ్ముగన్ వెన్నెలల్
రిప్లయితొలగించండిముసిరెన్నాపయి శంకరుండు గిరిజన్ మోహమ్ముతో చూడగన్
విసిరెన్ చల్లగ మారుతమ్ము త్రుటిలో విల్లెత్తి బింకమ్మునున్
మసిఁ జేసెన్ దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే
చక్కని పూరణ రవీందర్ గారూ! అభినందనలు!!
రిప్లయితొలగించండిదేవి పార్వతి యాకాంక్ష తీరు నట్లు
రిప్లయితొలగించండిదివ్య సుమ బాణ సంతతి దేవదేవు
త్రినయను ఘన మోహితునిగ, దేవతల క
మసి, యొనర్చెను శంకరున్ మన్మథుండు
[అమయు =ఉపయుక్తమగు]
అసురాత్మీయుఁడు శూలపాణి పురసంహారుండు కాలాంతకుం
డు సువర్ణాక్షుఁడు భూతరాట్టు హరిదంష్ట్రుండున్ జటాజూటుఁ డా
యసితగ్రీవుని దేవ కార్యమున నత్యావేశ సంరంభి తా
మసిఁ జేసెం దన పుష్ప బాణములతో మారుండు ముక్కంటినే
[తామసి = తమోగుణము కలవాఁడు]
కార్తికేయుని పుట్టుక గలుగజేయ
రిప్లయితొలగించండిమన్మధుని సాహసంబెంచ?మంటలందు
మసి యనర్చేను!శంకరున్ మన్మథుండు
రక్ష గూర్చేను మరల తా దక్షుడనుచు!
కార్తికేయుని జననము కల్గజేయ
రిప్లయితొలగించండిధ్యానమగ్నుని కోపాగ్ని దగ్ధమగుచు
మసియొనర్చెను శంకరున్ మన్మధుండ
చలుని మదిలోన వలపులు సందడించ!
నగజ కాటుకకన్నుల సొగసు గాంచి
రిప్లయితొలగించండిపుష్పబాణము లామెచూపులను గలిపి
తెలుపు నిండిన స్వామియె నలుపు కాగ
మసి యొనర్చెను శంకరున్ మన్మథుండు .
కసితో మూడుపురమ్ములన్ శివుడుతా కార్కశ్య భావమ్ముతో
రిప్లయితొలగించండిమసిఁ జేసెన్, దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే
వెసఁ ద్రోయన్ తమకమ్మునన్ కనలి యావేశమ్ముతోచెచ్చెరన్
కుసుమస్త్రున్ తునుమాడి తాను తుదకున్ కోరెన్ సతిన్ శాంకరిన్
కుసుమాస్త్రున్
రిప్లయితొలగించండిమసిగావించెను శాంతమున్ వడిగ ప్రేమావేశ మోదమ్ముతో
రిప్లయితొలగించండినుసిగావించెను దాంతమున్ భళిగ మున్నూరైన రాగాలతో
బుసిగావించెను ధ్యానమున్ తుదకు హా! మోహాగ్ని తాపమ్ములో
మసిఁ జేసెన్ దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమైలవరపు వారి స్పందన:
తొలగించండి"మొత్తానికి సాధించారు.. చారుగణగుణశోభితమైనది మీ పద్యం
👌👌🙏"
తొలగించండికందిచారుగణగుణశోభితమైనది :)
జిలేబి
యురేకా! సాధించా!!
రిప్లయితొలగించండిచదువు చెప్పే గురువులు కామానికి లొంగి విద్యార్ధినులను వేధించే వార్తలు వింటూనే ఉన్నాంగా....
శుభమగు చదువు జెప్పుచు శోభను వెలు..
గు మదిఁ కామపుటూహలు గూర్చినాడె
ధీయుతుడ నిటుల హతవిధీ! యిదేమి
"మసి యొనర్చెను శంకరున్ మన్మథుండు"
శం కరుడు = శుభము కలుగజేసేవాడు
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండికసి యున్నాయుధ పంక్తి హింసల కనుల్ గంభీర ముక్కంటికిన్
పొసగెన్నాయుధ హీన సూనశర "బాపూ" బాణ హస్తుండుగాన్
వెసనందించెను గ్రద్ద గూటి బ్రిటనున్ విశ్వంబె వీక్షించగా
మసి జేసెన్ దన పుష్ప బాణముతో మారుండు ముక్కంటినిన్
డా.పిట్టా
రిప్లయితొలగించండివివిధ యోగ సద్దీప్తికి విశ్వమందు
పేరు పొందిన యోగి నధీరు జేయు
విహిత యవధూత భంగపు వ్రేటు గనడె?!
మసి యొనర్చును శంకరున్ మన్మథుండు
సవరణతో : **** క్రుద్ధు డగుచు మారుని తాను క్రూరముగను
రిప్లయితొలగించండిమసి యొనర్చెను ; శంకరున్ మన్మథుండు
మోహ పరవశు జేయంగ ముందు కేగ
సురల పనుపున నానాడు చోద్యముగను.
****)()(****
అసిధారా వ్రత దీక్ష బోలు తనదౌ యానాటి బింకమ్మునే
వెస తోడన్ సడలింప బూను మరునిన్ వేగమ్మె కోపించుచున్
మసి జేసెన్ గద ; పుష్ప బాణములతో మారుండు ముక్కంటినే
పస గల్పింపగ యత్న మూను నపుడున్,ఫాలాగ్ని వర్షించుచున్.
తేటగీతి
రిప్లయితొలగించండిభీష్మ తపమున నుండెడు విశ్వనాథు
నయ్యపర్ణ వైపున్ జూడ నమ్మిడి కసి
మసి యొనర్చెను శంకరున్ మన్మథుండు
భస్మ మౌచు వారికి జేసె పరిణయమ్ము.
( కసిమసి = తొట్రపాటు, కలత )
కవిమిత్రులారా నమస్కృతులు. విశాఖ ఎక్స్ ప్రెస్ లో కొత్తవలస వెళ్తున్నాను. రేపు అక్కడ తరుణ్ చెరుకూరి గారి రిసెప్షన్ ఉంది. ఎల్లుండి బయలుదేరి 4 న హైదరాబాద్ చేరుకుంటాను. అంతవరకు నాకు సెలవు ఇవ్వవలసిందిగా మనవి.
రిప్లయితొలగించండి
తొలగించండిGranted :)
జిలేబి
మిత్రులందఱకు హోళీ పర్వదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిఅసమాక్షున్ గిరిజన్ స్వకీయ మహిమన్ హర్షమ్మునం గూర్పఁ దా
మసిఁ జేసెన్ దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే!
వెసఁ బింగాక్షమహోగ్రవీక్షితదృగాభీలాగ్నికీలోష్ణతన్
మసిగాఁ మాఱెను దానె సాహసమునన్ మారుండు ధీశాలియై!!
మత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండికుసుమాస్త్రున్ సురలెల్ల వేడ సతిగా గోపాలునిన్ జేరఁ దా
మసిఁ జేసెన్! దన పుష్పబాణములతోమారుండు ముక్కంటినే
మసిగా మారుచుఁ బెళ్లి వేది వరుడైమారంగఁ జేసెన్గదా!
వసుధన్ గొందరుఁ గొందరిన్ గలుపఁ చావైనన్ దమాయించరే ?
( గోపాలుడు = శివుడు ; తామసి = పార్వతి )
రిప్లయితొలగించండివలపు తూపులు విడుచుచు భావజుండు
మసి యొనర్చెను శంకరున్ ,మన్మథుండు
శివునికల్యాణమును చేయ సిద్ధుడగుచు
తనురహితుడయ్యె నీతడు ధరణి యందు.
రిప్లయితొలగించండి..........సమస్య.
*మసి యొనర్చెను శంకరున్ మన్మథుండు*
సందర్భము... జీవు లందరి
హృదయాలలోను శంకరుడు మరియు మన్మథుడు వుంటారు. మనసును గెలువ గలిగినప్పుడు స్మరుడు (మన్మథుడు)... గెలువ లేకపోతే (లొంగిపోతే) శంకరుడు మసియై పోతూనే వుంటారు.
సీతను చూడగానే దశకంఠుని (రావణాసురుని) హృదయంలో కాముడు విజృభించాడు. శంకరుణ్ణి (శంకరు డంటే శుభం కలిగించే వాడు) మసి చేసివేశాడు.
ఎక్కడ.. అంటే ఆతని హృదయ క్షేత్రంలో...
~~~~~~~~~~~~~~~~~~~~~~~
సకల జీవుల హృదయాల శంకరుండు
మన్మథుండును నుందురు; మనసు గెలువ
స్మరుడు... లేకున్న హరుడును
మసి యగుదురు...
సీతఁ గనినంత దశకంఠు చేతమందు
మసి యొనర్చెను శంకరున్ మన్మథుండు
2 వ పూరణము:--
సందర్భము... జీవు లందరి
హృదయాలలోను శంకరుడు మరియు మన్మథుడు వుంటారు.
శంకరుడు ఆత్మ స్వరూపుడు. శాశ్వత సుఖ ప్రదుడు. మన్మథుడు మనసుకు ప్రతీక. క్షణిక సుఖాభిలాషను ప్రేరేపిస్తాడు.
ఆత్మ విచారం కల వివేకులలో పరమేశ్వరుడు క్రమంగా స్థిరపడుతూ వుంటాడు. మనసు చెప్పినట్టు నడుచుకునే వాళ్ళ హృదయాలలో మన్మథుడు విజృంభిస్తూ వుంటాడు.
అంత గొప్ప శివ భక్తు డైనప్పటికీ రావణుడు సీత అందాన్ని చూడగానే కాముకుడై వివేకం కోల్పోయాడు. తాను శివ భక్తు ణ్ణన్న సంగతీ మరచిపోయాడు. శివుణ్ణీ విస్మరించాడు. మనసు ననుసరిస్తున్నాడు కాబట్టి కాముడు వెంటనే చెలరేగి శంకరుణ్ణి మసి చేసివేసినాడు. తప్పు త్రోవ పట్టించినాడు.
మనసును గెలువ గలిగినప్పుడు మన్మథుడు... గెలువ లేకపోతే (లొంగిపోతే) శంకరుడు మసియై పోతూనే వుంటారు అన్నది గమనింతురు గాక!
కాముడు విజృభించి శంకరుణ్ణి (శంకరు డంటే శుభం కలిగించే వాడు) మసి చేసివేయకుండా జాగ్రత్తగా చూచుకోవడం మనిషికి అవశ్య కర్తవ్యం అన్నది గమనింతురుగాక!
~~~~~~~~
అన్ని జీవుల హృదయాల శాశ్వత సుఖై
కాత్మగా శంకరుం డలరుచుండు
మన్మథుండును నుండు మనసుకు ప్రతీకగా
క్షణిక సుఖైకంపు సాధకుండు
నాత్మ ననుసరించు ననఘాళి హృదయాల
పరమేశ్వరుడు దృఢపడుచునుండు
మనసు ననుసరించు జన హృదయాలలో
పొంచి స్మరుడు విజృభించుచుండు
రావణుడు శివభక్తి విరాజితుండు
నయ్యు.. కాముకుండై సీత యందములనుఁ
గాంచె; మది కాముడే మేలుకాంచె, మించె..
మసి యొనర్చెను శంకరున్ మన్మథుండు
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా. వెలుదండ వారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికసితో మూడవ నేత్రమున్ తెరచుచున్ కాట్రేడు కందర్పునున్
రిప్లయితొలగించండిమసిఁ జేసెన్ దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే
విసిగించంగను కన్నులన్ తెరచుచున్ వీక్షించు శర్వాణినన్;...
నుసిజేతున్ నిను పృచ్ఛకుండ! నువునన్ నోరార వాగించగన్