2, మార్చి 2018, శుక్రవారం

సమస్య - 2613 (అల్లుఁడు మగఁడయ్యె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అల్లుఁడు మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే"
(లేదా...)
"అల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె చిత్రమే"

92 కామెంట్‌లు:

  1. నెల్లూర్ చెల్లాయికి, కో
    కొల్లల మనువుల వెదకగ, కోరగ తానే,
    పిల్లడు, ముద్దుగ, తల్లికి
    యల్లుఁడు, మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే!

    రిప్లయితొలగించండి
  2. పిల్లయె మెచ్చిన దంచును
    తల్లియె తనయన్న కొడుకు తగునని చెప్పన్
    అల్లరి వాడమ్మకు మే
    నల్లుడు మగడయ్యె నొకడె యది చిత్రంబే.

    రిప్లయితొలగించండి


  3. పిల్లకటన్నబ్బాయిని
    మెల్లిగ వెతుకగ లభించె మేనరికమ్మై
    చెల్లాగణపతియే మే
    నల్లుఁడు మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే?

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. పిల్లకు పెండిలి చేయగ
    చెల్లెలి కొడుకుండె నంచు చెప్పెను సతికిన్
    ఇల్లరిక మడుగ మనకుమే
    నల్లుఁడు మగడయ్యె నొకఁడె యది చిత్రంబే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "ఇల్లరిక మది మనకు మే" అనండి.

      తొలగించండి
    2. పిల్లకు పెండిలి చేయగ
      చెల్లెలి కొడుకుండె నంచు చెప్పెను సతికిన్
      ఇల్లరిక మది మనకుమే
      నల్లుఁడు మగడయ్యె నొకఁడె యది చిత్రంబే

      తొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    విల్లును దాల్చ రామునిగ , వేణువు బట్టిన కృష్ణమూర్తిగా
    నుల్లము కొల్లగొట్టిన మహోన్నతుడౌ మన నందమూరియున్
    పిల్లలు జవ్వనుల్ కడకు వృద్ధులు మెచ్చ విభిన్న పాత్రలం....
    దల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె చిత్రమే"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మైలవరపు వారి స్పందన:

      శ్రీ జిలేబీ గారికి నమోవాకములు..
      జీతము లేనట్టి కొలు విసీ యనకుండా అనునిత్యం నా పద్యాలు బ్లాగ్ లో ప్రచురించుచున్న ఆత్మీయులైన మీకు లెక్కలేనన్ని 🙏

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ ఉత్కృష్టంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. భావుకులైన మైలవరపువారమైలవరపువారి అద్భుత పద్యమునకూ
      వాహకులైన జీపీయస్‌ వారికీ 'అభినందన' 'వంద''నములు'
      👌🏻🙏🏻

      తొలగించండి
    4. పిల్లలు లేరటంచు విలపింపగనేలనె ? యీశ్వరేచ్ఛచే
      దల్లితనమ్ము దక్కును గదా !
      హరుఁ గొల్చుచునుందమంతలో
      నల్లుడనౌదు , నాత్మజుడనౌదును నీకని భర్త పల్కగా
      నల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె చిత్రమే"!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి


  6. అల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె చిత్రమే
    వెళ్ళెద నూరికిన్నిదియె ఫెళ్లను కైపద మయ్యలారహో
    చల్లగ పూరణమ్ము లిట చక్కగ నిల్పి పరస్పరమ్ము మీ
    రెల్ల విచారణల్ గనుడు! రేపటి కొచ్చెద చూచెదన్ సుమా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అల్లరి పిల్లలందరిని హైదరబాదున చెవ్వు పిండెదన్ :)

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      తప్పించుకొని వెక్కిరిస్తున్నారు. పూరణలో ఇదీ ఒక పద్ధతియే. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
    3. గురువు గారిని ఇరికించే ప్రయత్నమే!!
      ☺️

      తొలగించండి
  7. కందం
    విల్లును స్వయంవరమ్మునఁ
    బెల్లున ద్రుంచుచు నవనిజ పెనిమిటి యౌచు
    న్నెల్లరెరుఁగ భూదేవికి
    యల్లుడు మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే!

    రిప్లయితొలగించండి
  8. తల్లడపరచ జనమ్ముల
    ప్రల్లదులౌ దైత్యులు భువి, పరిమర్చంగన్
    నల్లనివాడు రసాసతి
    యల్లుఁడు, మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే?

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2613
    సమస్య :: అల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె, చిత్రమే ?
    ఒకే వ్యక్తి అల్లుడయ్యాడు, కొడుకయ్యాడు, భర్త కూడా అయ్యాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: విష్ణు భగవానుడు దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం ఈ భూలోకంలో శ్రీ రాముడుగా అవతరించాడు. ఆ రామభద్రుడు మిథిలాధిపతి యైన జనక మహారాజుకు అల్లుడయ్యాడు. ఆ రామమూర్తి యే కోసలదేశాధిపతియైన దశరథ మహారాజునకు సుపుత్రు డయ్యాడు. ఆ రామచంద్రుడే లోకకల్యాణం చేసేందుకోసం శివధనుస్సును ఎక్కుపెట్టి సీతాదేవికి మగడు అయ్యాడు. ఇలా తన జీవితంలో ఒకే వ్యక్తి ఎన్నో పాత్రలను ధరించడం చిత్రమేమీ కాదు. అని విశదీకరించే సందర్భం.

    అల్లన రామచంద్ర వరు, డా మిథిలేశున కల్లు డయ్యెగా,
    యెల్లెడ పాత్రుడౌ దశరథేశున కెన్న సుపుత్రు డయ్యెగా,
    ఫుల్ల సరోజ నేత్ర యగు భూమిజకున్ మగడై , క్రమమ్ముగా
    *నల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె, చిత్రమే ?*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (2-3-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. అద్భుతమైన పూరణ అవధాని గారూ! అభినందనలు!🙏🙏🙏

      తొలగించండి
    3. అద్భుత పూరణ చేసిన 'కవిరాజ'శేఖరా!
      ప్రణామములు
      🙏🏻🙏🏻🙏🏻🙏🏻

      తొలగించండి

  10. పిల్ల? జిలేబి యీవిడ! గుభిల్లిరి పుత్రుని తండ్రి తాతలున్
    మెల్లగ చూచె తల్లి మన మేనరికమ్మిది వీడకూడదే !
    చల్లగ కట్టి బెట్టె సయి చాకువలెన్ సరసంపు బల్కి ; మే
    న్నల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె చిత్రమే!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,


    " గురుభ్యో నమః " ‌నిన్నటి పూరణ స్వీకరింప మనవి
    .................................................................................



    అసమానుండు , మహానుభావుడును , దివ్యారాధితాకారు డా

    అసమాక్షుండు హిమాచలమ్మున తపస్యాదీక్ష‌లో‌ నుండగా ,

    గుసుమారాముఖు డూర కుండ కతి మూర్ఖుం డై ప్రవర్తించె | దా

    మసి జేసెన్‌ దన పుష్ప బాణములతో > మారుండు ముక్కంటినిన్ |

    మసిజేసెన్ శివు డాతనిన్ | బిదప నా మారుం డనంగుం డయెన్ |


    { తపస్య = తపశ్చర్య‌ ; తామసి = తమోగుణము గలవాడు }

    రిప్లయితొలగించండి

  12. పిల్లన గ్రోవిని నూదుచు
    చల్లని చూడ్కుల నొడలను ఝల్లుల నింపెన్
    చెల్లెనుగా రాధకు మే
    నల్లుడు మగడయ్యె నొకడె యది చిత్రంబే

    రాధాదేవికి శ్రీకృష్ణుడు మేనల్లుడనే ఒకానొక వాదము ఆధారముగా..

    రిప్లయితొలగించండి
  13. విల్లు విఱిచి ధరణిజ గొని
    యల్లుడయె ధరణికి హరియె;యాతండేగా
    తొల్లి కృతయుగమున మగడు
    "అల్లుఁడు మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే"

    రిప్లయితొలగించండి
  14. ఉల్లము గోరిన కోర్కెలు
    వెల్లువ లెత్తగ షరతుల వెర్రెక్కించన్
    తల్లడమయ్యెడు మామకు
    నల్లుడు మగడయ్యె నొకడె యది చిత్రంబే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శశిరేఖా పరిణయము

      తల్లియు దండ్రియు నొప్పరు
      కల్లలె కలలన్ని యనుచు కలవర పడగన్
      చల్లని దైవము కృష్ణుని
      యల్లుడె మగడయ్యె నొకడె యదిచిత్రంబే!

      తొలగించండి
    2. మామ కి మొగుడు.. 🤣
      👌🏻 సీతాదేవిగారూ!

      తొలగించండి
    3. ధన్యవాదములు విట్టుబాబుగారూ!!😊😊😊

      తొలగించండి
  15. ఉల్లమునను బ్రేమించిన
    పిల్లను చేపట్టి తాను పెండిలి యాడన్
    దల్లీ కూతుళ్ళ కతడు
    నల్లుఁడు మగడయ్యె నొకఁడె యది చిత్రంబే

    రిప్లయితొలగించండి
  16. అల్లుడు విష్ణు స్వరూపుడె
    అల్లన పాలుండతడెగ నా పతి రూపున్
    ఉల్లము నిండిన హరి తా
    "నల్లుఁడు మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విష్ణు రూపముగా ఊహించే కూతురు పెళ్ళిలో అల్లుడి కాళ్ళు కడుగుతారుగా ☺️

      తొలగించండి
  17. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    అల్లరి గోపబాలకుని యద్భుత లీలల నెన్నసాధ్యమే
    అల్లుడు కంసరాజునకు నాత్మజుడా వసుదేవుకున్,మనో
    వల్లభు డయ్యె రుక్మిణికి వన్నెల చంద్రు డు నొక్కడేయనన
    న్నల్లుడు పుత్రుడున్మగడు దానొకరుండె చిత్రమే??

    రిప్లయితొలగించండి
  18. మిత్రులందఱకు నమస్సులు!

    తల్లియునయ్యె సీత కిల ధారుణి! యామెకు రాముఁ డేమియౌ?
    నుల్లమెలర్పఁ బంక్తిరథు కుర్వర భార్యయె! రాముఁ డేమియౌ?
    నల్ల మధూహనుండె యొడయం డిల! కావున, రాముఁ డుర్వికి
    న్నల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె! చిత్రమే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణ:

      తల్లియునయ్యె సీత కిల ధారుణి! యామెకు రాముఁ డేమియౌ?
      నుల్లమెలర్పఁ బంక్తిరథు కుర్వర భార్యయె! రాముఁ డేమియౌ?
      నల్ల మధూహనుండె యొడయం డిలకుం! గన, రాముఁ డుర్వికి
      న్నల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె! చిత్రమే?

      తొలగించండి
    2. కవి పుంగవులు మధుసూదన్ గారికి నమస్సులు. “పంక్తి రథు కుర్వర” నొక్క సారి పరిశీలించండి. ఇందు నాకు సందేహము కలుగు చున్నది.

      తొలగించండి
    3. మీ సందేహము శబ్దం విషయంలోనా, అర్థం విషయంలోనా అని నాకును సందేహము కలిగినది. అయినను...

      పంక్తి రథునకు + ఉర్వర అని నా భావన. పంక్తిరథున కుర్వర అంటే గణభంగం అవుతుంది. అందుకే పంక్తి రథు కుర్వర

      అన్నాను. రాజునకు అనే బదులు రాజుకు అన్నట్లుగా... ఇది శబ్దం విషయంలో.

      ఇఁక అర్థం విషయంలో... దశరథుఁడు భూమీశుఁడు గావున భూమికి నాతని కొమరుఁడుఁ గూడ కొడుకే యగును గదా!

      తొలగించండి
    4. నా సందేహము శబ్ద వ్యాకరణ విషయము లోనే.

      ఇక్కడ న గామ మగు నన్నప్పుడు నిత్యము కదా. ”రాముకు, వధువుకు” ఇత్యాదిగా నుండుట లక్షణ విరుద్ధము కదా. రాజుకు కూడా యంతే యని నా యభిప్రాయము.

      తొలగించండి
    5. "కువర్ణకంబు పరంబగునపు డుకార ఋకారంబులకు నగాగమం బగు" నను చిన్నయసూరి సూత్రమున్నను."కువర్ణకంబు పరంబగునపుడు కవిత్రయంబువారి ప్రయోగంబులం దక్కఁ దక్కిన మహాకవి ప్రయోగంబులందునుం గొన్ని యెడల నగాగమంబు చూపట్టదు" అని ప్రౌఢ వ్యాకర్త సూత్రించారు.

      ఉదా.:-
      సీ.
      సంగరంబునకు నుత్సవము కేఁగెడు క్రియ
      సొలవక చనియెడు శూరులార (ఉత్తర హరివంశము)

      ఉ.
      లాలసఁ గ్రొత్త బెబ్బులి కళాసము వెట్టిరి యాసనంబుగా,
      గోలయు సాధువైన యొక కోమటికిన్ నిషధేంద్రు బచ్చుకున్ (శృంగార నైషధం)

      ఇలాంటి ప్రయోగాలున్నాయి.

      తొలగించండి
    6. అన్నమాటేమిటి...ఉన్నమాటేనండీ జిలేబిగారూ! :)

      సుకవి మిత్రులు కామేశ్వర రావుగారూ ... మీ సందేహం తీఱినట్లేనని భావిస్తున్నానండీ! సంతోషం!

      తొలగించండి

    7. రేపట్నించి వరస బెట్టి వుపయోగించేస్తా :)


      జిలేబి

      తొలగించండి
    8. కవి పుంగవులు మధుసూదన్ గారు తీరినదండి.
      ఈ సందేహముతోనే నా పూరణమున “క్షితి భర్తకు” నాశ్రయించ వలసి వచ్చినది.

      తొలగించండి
    9. చాలా సంతోషమండీ మీకు ఉపయోగపడినందులకు! నమస్సులు!

      తొలగించండి
  19. ఎల్లలు లేనట్టి వలపు
    నల్లన తన సుతకు పుట్ట నా తెర గేరుగన్
    చెల్లెలి సు తుం డను చు మే
    నల్లుడు మగ డ య్యే నొక డె యది చిత్రం బే !

    రిప్లయితొలగించండి
  20. విల్లునె పెళ్ళునన్ విఱిచి వేగిరమే జన చక్రవంతుకున్,
    జల్లని పాలనన్ సలుపు చక్కని భూపతి శంబరారికిన్,
    యల్ల మహీజకున్; బ్రభువు; యావరుసన్ గణియించి చూడగన్"అల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె చిత్రమే"
    (క్రమాలంకారము = జనకునికి,దశరథునకు,జానకికి విభుడు రాముడు వరుసగా అల్లుడు,పుత్రుడు, మగడు అవుతాడు.
    శ్లేషాలంకారము : వరుస = వరుసక్రమము ; బంధుత్వము)

    రిప్లయితొలగించండి
  21. చల్లగ కృష్ణమోహనుని చక్కని రుక్మిణి పెండ్లియాడగా
    చెల్లెలు పారిపోయెనని చెన్నుగ రుక్మియు గుండుజూపగా....
    తల్లికి, మామకున్, తనకు, తందన తానగ తీరుతెన్నుగా
    నల్లుఁడు, పుత్రుఁడున్, మగఁడు, నయ్యెను దా నొకరుండె చిత్రమే :)


    రుక్మిణి = నా భార్య పేరు
    కృష్ణమోహనుడు = నేను (నల్లని వాడను...)
    గుండు జూపుచు = నా పెండ్లి తిరుపతిలో (1979)
    తీరుతెన్నుగా = క్రమాలంకారములో

    రిప్లయితొలగించండి
  22. చెల్లెను దివిలో విద్దెల
    దల్లికి పెండిలి తనదగు తండిరి తోడన్
    యెల్లర కువలదు వేదన
    "అల్లుఁడు మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే
    సరస్వతికి తన తండ్రితో పేలీ జరిగినది గదా !

    రిప్లయితొలగించండి
  23. పల్లవగాత్రి రుక్మిణిని పంకజనాభుడు బెండ్లియాడగా
    నెల్లరు మెచ్చిరప్పుడు పునీతుడు కృష్ణుడు బెండ్లికూతుకున్
    వల్లభుడాయె తల్లికిని వాసిగ సూనుడు నత్తకల్లుడౌ
    *నల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె, చిత్రమే ?*

    రిప్లయితొలగించండి
  24. తల్లి యొకతె చెలికి ననె
    న్నల్లుడె యిట వచ్చుచుండె నధికారిగ నో
    చెల్లీ! విధినేమందునె?
    యల్లుడు మగడయ్యె నొకడె యది చిత్రంబే !
    (ఇక్కడ ; మగడు = బాస్)
    (చవరి పదం 'చిత్రంబే' యన్నది Assertive tone లో;Interrogative tone లో కాదని మనవి)

    రిప్లయితొలగించండి
  25. అల్లదె నొక్క పురమ్మున
    పిల్లాడిని వెదకి తనకు బెండ్లిని సేయన్
    తెల్లముగ తనదు తల్లికి
    యల్లుడు మగడయ్యె నొకడె యది చిత్రంబే !

    రిప్లయితొలగించండి
  26. కంద పద్యపు భావమే ఉత్పలమాల రూపంలో కూడా!!

    అల్లుని కాళ్ళు కడ్గిరిగ నచ్చట పెళ్ళిన విష్ణురూపునే!
    బుల్లి సుపుత్రునిన్ నిదురపుచ్చెగ విష్ణుగ జోల పాటలన్!
    అల్లన పాలన మ్మఱయ నంతట నాపతి విష్ణురూపమే!
    "అల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె చిత్రమే!!"

    రిప్లయితొలగించండి
  27. వెల్లువగఁ బ్రేమ కురియ గ
    నుల్లము వికసించఁ బాండ రోత్పలము వలెం
    జల్లఁగఁ దనదు సుతకు మే
    నల్లుఁడు మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే?


    చల్లగ నుండి మానవులు చక్కగ వర్ధిలి సంచరింతురే
    కల్ల యనంగ రాదు భువిఁ గాంతుము చుట్టరికమ్ములన్ నిజం
    బెల్లయు రాఘవుండు మిధిలేశునకున్ క్షితి భర్త కుర్వికి
    న్నల్లుఁడు, పుత్రుఁడున్, మగఁడు నయ్యెను దా నొకరుండె చిత్రమే?

    [మగఁడు = రాజు; “చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్” ]

    రిప్లయితొలగించండి

  28. చల్లగ భూదేవికి తా
    నల్లుడుత్రేతాయుగమున నారాముండే
    అల్లనభూదేవికి తా
    యల్లుడు,మగడయ్యె నొకడె యది చిత్రంబే.

    రిప్లయితొలగించండి
  29. పాశ్చాత్యదేశాల సంబంధాలు!!

    పిల్లల తల్లినిన్ పితయె పెండిలియాడగ సంతసంబునన్
    తెల్లము గాకయే వరుస తీరుగ మారుటి తల్లిపుత్రికన్
    చల్లగ బెండ్లియాడగను చక్కగ నౌనుగ
    తండ్రి, కూతుకు
    న్నల్లుడు పుత్రుడున్, మగడు నయ్యను దానొకరుండు చిత్రమే?

    రిప్లయితొలగించండి
  30. కల్లయు గాదిది నిజమే
    ఎల్లరి కిది విధితమేగయెంచగ సినిమా
    అల్లరి నరేషు నవ్వుల
    కల్లుడు,మగడయ్యె నొకడె యది చిత్రంబే ,

    రిప్లయితొలగించండి
  31. ఉల్లము నందుండిన మే
    నల్లుడుమగడయ్యె, నొకడె యది చిత్రంబే
    యల్లా యాశిసు లిచ్చెను
    నల్లరి మల్లరిగదిరుగు నామనిచెలికిన్

    రిప్లయితొలగించండి
  32. అల్లదె సోమరాజుగృహమందునబంధముజూడరాశికి
    న్నల్లుడు పుత్రుడున్మగడు నయ్యెను దానొకరుండె చిత్రమే
    యుల్లము సంతసం బడగ నూరునువాడయు దద్దరిల్లగా
    నెల్లరుజూచుచుండగనునిద్దరునొక్కటి యయ్యెరేసుమా

    రిప్లయితొలగించండి
  33. తల్లియు దండ్రియున్ గురువు తానె సఖుండుగ నాత్మబంధువై
    యెల్లరి యుల్లమున్నిలిచె డీశుడు చక్రధరుండు శ్రీ రమా
    వల్లభుడాతడే హరియు వారిధి వాసిని యౌ ధరిత్రికి
    న్నల్లుడు పుత్రుడున్ మగదు నయ్యెను దానొకరుండు చిత్రమే.

    రిప్లయితొలగించండి
  34. అల్లరి కృష్ణుడు పల్లెను
    తల్లీ కూతుళ్ళ కవ్వ!తమకము తోడన్
    సల్లాపమ్ములు జరుపుచు
    “యల్లుఁడు మగఁడయ్యె నొకఁడె, యది చిత్రంబే"

    రిప్లయితొలగించండి
  35. గు రు మూర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

    కొల్ల ప్రవర్తనన్ గలిగి కోమలితో సరియైన కాపురం

    బల్లన సేయకుండ విటుడాయె నొకం డొక వేశ్యకొంపకున్ |

    బల్లవి కుండునే వరుస వావియు ? | నాతని సొమ్ము లాగగన్ ,

    దల్లియు - గూతురున్ - స్నుషయు దక్కువ కాని సుఖాల బంచగా

    నల్లుడు - పుత్రుడున్ - మగడు నయ్యెను తా నొకరుండె , చిత్రమే ! ! !


    { పల్లవి = వేశ్య ; స్నుష = కోడలు }

    రిప్లయితొలగించండి
  36. తల్లికి మేనగోడలు, తల్లియుఁ, దానును, వేశ్యలై చనన్
    మెల్లన జేరె వారి దరి మోహవశుండు విటుండు,వాని యా
    యుల్లము వావియున్ వరుస లొల్లక నీతిని వీడి కాంచగా
    నల్లుడు పుత్రుడున్ మగడు నయ్యెను దానొకరుండు చిత్రమే?

    రిప్లయితొలగించండి
  37. శ్రీ కామేశ్వరరావు గారు! నమస్తే! మీ రెండు పూరణలు చాలా చక్కగా కుదిరాయి.పద్యాలు రమ్యంగా వచ్చాయి్అభినందనలు !💐👍👌💐

    రిప్లయితొలగించండి

  38. చల్లని భూదేవికి తా
    నల్లుడు త్రేతా యుగమున,నారాముండే
    చల్లగ యాభూదేవికి
    అల్లుఁడు మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే.

    మెల్లగు కన్నులుగల నామే
    నల్లుని కూతురె వరించ నాతని పదవిన్
    చల్లగ నెంచుచు నివ్వగ
    అల్లుఁడు మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే.

    అల్లరిగా తిరిగెడి మే
    నల్లుని మదిలో వరించ నాలస్యములే
    కెల్లయు సిద్ధము కాగా
    అల్లుఁడు మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే.


    విల్లును ద్రుంచినట్టి రఘువీరుడు ధారుణికయ్యెతా వడిన్
    నుల్లము నందుపుత్రులను నొప్పుగ కోరిన కోసలేంద్రుకున్
    విల్లును ద్రుంచగన్ జనులుభేషన మైథిలి కిన్ ముదంబునన్
    అల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె చిత్రమే

    రిప్లయితొలగించండి
  39. డా.పిట్టాసత్యనారాయణ
    పెల్లుబికెన్ మరో గ్రహము పేర్మిని బొందెను యాస్తి పుత్రుడై
    చెల్లని రూకలో విలువ జేయని పుత్రుని వైఖరిన్ గనెన్
    వల్లె యటంచు వృద్ధులను బాయక సాకెడు రాజు యల్లుడే
    అల్లుడు పుత్రుడున్ మగడు(భరించువాడు) నయ్యెను దానొకరుండు చిత్రమే
    మల్లెల వవోలె జూచుకొనె మౌనులె యా తలి దండ్రు లాయెడన్!

    రిప్లయితొలగించండి
  40. డా.పిట్టా
    కల్లలతో వ్యాజ్యంబున
    బల్లిదుడౌ యల్లుడొకడు బాగుగ ద్రిప్పెన్
    పిల్లకు మగడే ,మామకు
    నల్లుడు "మగడ"య్యె నొకడె
    యది చిత్రంబే!

    రిప్లయితొలగించండి
  41. శ్రీ కామేశ్వరరావు గారు! మీ చర్చ వల్ల నా సందేహమొకటి తీరినది.నాపద్యంలో 'చక్రవంతుకున్'అనన్నాను. నగాగమ నియమం ప్రకారం 'చక్రవంతునకున్ ' అనాలి. 'చక్రవర్తికిన్' అనియుంటే సరిపోయేది కదా అననుకున్నాను.ఏదేమైనా నా సందేహం తీరింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్ఖాలిత్యాలుగా కొన్ని ప్రయోగాలు పెద్దకవుల నుండి కూడా కనబడవచ్చును. అవి మార్గదర్శకాలుగా స్వీకరించి అలాగే వ్రాస్తామంటే చేసేది యేమీ లేదు. కానీ అలా వ్రాయకుండా ఉండటమే సరైన విధానం.మాయిష్ఠం అంటారా - మంచిది, మీ యిష్ఠమేను!

      తొలగించండి


    2. 'ఇష్ఠం ' అన్నారు అప్పుతచ్చాండి ?


      జిలేబి

      తొలగించండి
    3. జనార్దన రావు గారు శ్యామల రావు గారు చెప్పినది యాచరణీయమని నేను భావిస్తున్నాను.
      చక్రవంతుకున్ వినడానికి కూడా బాగా లేదు.

      తొలగించండి


  42. ఓ గృహిణి తన స్నేహితురాలితో ...
    ఉత్పలమాల
    మెల్లగ సెల్ఫిఁ దీసితిని మేలుగ నమ్మను, నత్తనున్, ననున్
    దొల్లిగ! నిందు నా మగడు తుష్టిని వారికిఁ జూడ సర్వదా! 
    యల్లుఁడు పుత్రుఁడున్ మగఁడునయ్యెను దా నొకరుండె! చిత్రమే 
    కళ్లు జిగేలనన్ గుదిరె కర్రకు నీ చరవాణి నుంచినన్

    రిప్లయితొలగించండి
  43. నల్లని వాడు పృథ్విపతి నమ్మిన భక్తులఁ బ్రోవ భూమికిన్
    వల్లభుడైన కోసల నృపాలుని పుత్రునిగా జనించియున్
    విల్లును ద్రుంచి రాఘవుఁడు వేడుక భూజను బెండ్లియాడగా
    నల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె చిత్రమే

    భూమికి భర్త యైన విష్ణువు భూకాంతునికి పుట్టుటవలన భూమికి పుత్రుడై భూజాతను పెండ్లి యాడుట వలన భూమికి అల్లుడు అయ్యాడు.

    రిప్లయితొలగించండి

  44. అల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను
    దా నొకరుండె చిత్రమే

    సందర్భము... ఏకం సత్ విప్రా బహుధా వదంతి.. అన్నారు ప్రాజ్ఞులు. సత్తు (సత్యము లేదా బ్రహ్మము) ఒక్కటే! కాని దానినే రకరకాలుగా చెబుతూ వుంటారు పండితులు.
    అలాగే భాగవతంలోని భీష్మ స్తుతిలో..
    "ఒక సూర్యుండు సమస్త జీవులకు తా నొక్కొక్కడై తోచు పోలిక.." పరమాత్ముడు కూడ అందరికి అన్ని విధాలుగా గోచరించి తృప్తి పరుస్తూ వుంటాడు అని చెప్పబడింది.
    "నా కిలా కనిపిస్తున్నందుకు తృప్తి కలుగుతున్నది. అందువల్ల నీకు కూడా ఇలా కనిపిస్తేనే తృప్తి కలుగుతుంది." అని (భగవద్విషయంలో) నిర్బంధం పనికిరాదు.
    అందువల్ల నరుడొక్కడే యైనా తాత తండ్రి అల్లుడు కొడుకు మగడు మొదలైన వన్నీ.. సందర్భా న్ననుసరించి, వ్యక్తులతోడి సంబంధా న్ననుసరించి తానే ఔతున్నాడు. ఇందులో విప్రతిపత్తి అనేది లేదు.
    అట్లే దేవుడు కూడ రాముడు కృష్ణుడు శివుడు ఏసు అల్లా మొదలైన రూపాల్లో అలరారుతూ వుండడంవల్లనే అందరినీ తృప్తి పరుచగలుగుతూ వున్నాడు. మానవు లనేకులు కదా! అందుకని రూపాలూ అనేకమే కావాలి. అదీ విచిత్రం!!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఎల్ల బుధుల్ వచింతు రట!
    ఏకము సత్తునె వేరు వేరుగా..
    అల్లదె యొక్క సూర్యుడు స
    మస్త జనాలకు నొక్క డొక్కడై
    యుల్లము రంజిలన్ వెలుగ
    డో! నరు డట్టులె.. తాత తండ్రి తా
    నల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు
    నయ్యెను దా నొకరుండె! చిత్రమే!

    2 వ పూరణము:-

    సందర్భము: జీవితం ఒక నాటకం అన్నారు. నాటక మన్నప్పుడే యనేక పాత్ర లుంటాయి కదా! మానవు డీ జీవిత నాటకంలో తాత, తండ్రి, అల్లుడు, కొడుకు, మగడు మొదలైన యెన్నో పాత్రలను ధరించాల్సి వుంటుంది.
    అహంకార మమకారాలను ఈర్ష్యాసూయలను పక్కన పెట్టి అన్ని పాత్రలకూ న్యాయం చేయాల్సిందే! చేయలేకపోయినా అందుకోసం ప్రయత్నించాల్సిందే!
    అప్పుడే దైవానుగ్రహానికి నోచుకోగలడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    చెల్లును నాటకం బనుట
    జీవిత మియ్యది, నాటకం బనన్
    చెల్లు ననేక పాత్ర లవి
    చేరుట, తాతయుఁ దండ్రియున్ నరుం
    డల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు
    నయ్యెను దా నొకరుండె! చిత్రమే!.
    ఎల్లపు డన్ని పాత్రలకు
    నిద్ధర న్యాయముఁ జేయగా వలెన్..

    3 వ పూరణము:-

    సందర్భము: కమలాసనుడు
    *(కమల హాసన్)* దశావతారాల నెత్తి నట్టుగా
    ( *"దశావతారాలు"* అనే సినిమాలో పాత్రధారణ చేసినట్టుగా) జీవుడు కూడ కి మ్మనకుండా యెత్తాల్సిందే!
    ఐతే పాత్రలలో లీనం కారాదు. లీనమైనట్టు కనిపించాలి.ఇది తీసుకోదగిన జాగ్రత్త. తాను నటుడ ననే విషయం గుర్తు పెట్టుకోవలసిందే!
    (తన్ను తాను గుర్తు పెట్టుకోవడ మంటే తా నాత్మ స్వరూపు ణ్ణని గుర్తుంచుకోవడం)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    అల్ల "దశావతారముల" నా
    "కమలాసను" డెత్తినట్టుగా
    జి ల్లనకుండ నెత్తవలె
    జీవుడు; పాత్రల లీనమైన య
    ట్లెల్లరుఁ జూడగా వలయు;
    నెన్నడు మర్వగ రాదు తన్ను తా...
    నల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు
    నయ్యెను దా నొకరుండె; చిత్రమే!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  45. గుల్లను జేయ నా ధనము గుట్టుగ నాకడ నల్లుడాయె తా
    గుల్లను జేయ నా మనము గుట్టుగ నాకడ పుత్రుడాయె తా
    గుల్లను జేయ మానమును గుట్టుగ నాకడ నా మగండె తా
    నల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె చిత్రమే!

    రిప్లయితొలగించండి