కవిమిత్రులారా,
అంశము - తెలుఁగు పద్యకవితా వైభవము.
నిషిద్ధాక్షరములు - వర్గ ద్వితీయ చతుర్థాక్షరములు. (ఖ,ఘ,ఛ,ఝ,ఠ,ఢ,థ,ధ,ఫ,భ)
ఛందస్సు - మీ ఇష్టము.
అంశము - తెలుఁగు పద్యకవితా వైభవము.
నిషిద్ధాక్షరములు - వర్గ ద్వితీయ చతుర్థాక్షరములు. (ఖ,ఘ,ఛ,ఝ,ఠ,ఢ,థ,ధ,ఫ,భ)
ఛందస్సు - మీ ఇష్టము.
నాటి కవుల నుండి నేటి వరకునైన
రిప్లయితొలగించండితెలుగు పద్యమొకటె తేజ మలరు
పద్యమున్న చోట పరమేశ్వరీ వాణి
నృత్య మాడు నదియె నిజము సుమ్ము
నెమ్మి నిచ్చునదియె నిజముసుమ్ము
తొలగించండినెమ్మి=ఆనందము, సుఖము
ధన్యోస్మి
తొలగించండిమోవి తాకిపలుకుచుండు ముదము తోడ
రిప్లయితొలగించండినొకటి , మోవిని తగులక పొరలు చుండు
నొకటి, మదినుంచి నడరుచు నుండు నొకటి,
గణయతి ప్రాసనియమము గలవి మనతె
లుంగు పద్యముల్, సతము వెలుగుచు నుండు
చండ కరుడున్న వరకు నీ జగతిలోన
ఆర్యా, ఈ పద్యము యొక్క ఛందస్సు ఏమిటో తెలుపగోరుచున్నాను.
తొలగించండితేటగీతి గదా 1 సూర్య గానము ౨ ఇంద్ర గణములు ౨ సూర్య గణములు తేటగీతి ఎన్ని పాదాలైన వ్రాయవచ్చు
తొలగించండిఈ పద్యం నాది కాదు :)
రిప్లయితొలగించండిఅచ్చపు దెనుగున నెల్లరు
మెచ్చుకొనెడు నటుల నలరు మేలిమి తలపుల్
ముచ్చటలిడు పలుకులతో
చెచ్చెర పద్దెములు వ్రాసి చెలగెద వేడ్కన్
మనదే!
తొలగించండిఈ పద్యాన్ని ఎవరు వ్రాసారు? ఈ పద్యం నాది కాదు, మనదే అని అనుటలో అర్థమేమిటి?
తొలగించండిhttp://kandishankaraiah.blogspot.in/2013/08/450.html?m=1
తొలగించండినన్నయ తిక్కన మున్నగు
రిప్లయితొలగించండివన్నెల కవులంత వ్రాసె వాల్ల భ్యమున
నెన్నగ తెనుగను భాషను
విన్నంతనె మదిని మెండు వెలుగులు మెరయున్
రాజేశ్వరి గారు:
తొలగించండిరెండవ పాదాంతమున "భ" ...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅక్కయ్య గారూ భ నిషిద్దము
తొలగించండిబాస అంటే సరిగా ?
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅవునుకదా మర్చిపోతున్నాను .మీకు GPS . వారికి ధన్య వాదములు
తొలగించండి--------------------------
నన్నయ తిక్కన పోతన
మున్నగు కవులంత వ్రాసె ముదమల రంగా
నెన్నగ తెనుగున సొగసుల
విన్నంతనె మదిని మెండు వెలుగులు విరియన్
నన్నపార్యుని శబ్దనందనోద్యానంపు
రిప్లయితొలగించండిపరిమళలహరినే పంచుకొనుచు
బమ్మెర పోతన్న పసిడిపదమ్ముల
మెత్తందనమ్మునే మెత్తుకొనుచు
పెద్దన కవిరాజు పేరైన కావ్యంపు
జిగిబిగిసొగసుల జేర్చుకొనుచు
చేమకూర కవీంద్రు జిల్లనిపించెడు
చతురచమత్కార మందుకొనుచు
అడుగుజాడల గురజాడ ననుసరించి
రమ్యమైన రాయప్రోలు రచన జూచి
సత్యనారాయణ సుకవి చవుల నెరిగి
తెలుగు పద్య కవిత్వమ్ము వెలుగు నెపుడు.
రాగయుక్తంబౌచు రసరమ్య జగతిలో
తొలగించండినోలలాడించు వినోదమిచ్చు,
తెల్గువారికి సొత్తు,తెలివితో కసరత్తు,
పదముల గారడీ,పలుకు కులుకు,
చదువుల తల్లికి సంప్రీతీ హారతి
తనివారనిచ్చు సంతత విలాసి,
నన్నయాదులలోన నయగారమునుఁజూపి,
వెలుగులఁజిమ్ముచు వినుతికెక్కి,
తెలుఁగు పద్యంబు హృద్యమై తేనెలొలుకు
తెలుఁగు పద్యంబు తీయనై దివ్యమగును.
తెలుఁగు పద్యంబు కెదురేది?తిరుగులేదు,
తెలుఁగు పద్యంబు సర్వదా తేజరిల్లు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండితెలుగు పద్యంబు హృద్యంబు తియ్యగుండు.
తొలగించండిచేమకూర కవీంద్రు జిల్లనిపించు చ
రిప్లయితొలగించండిమత్కారచతురతన్ మలచుకొనుచు-అని చదువమనవి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం. తెలుగను తేనె రసంబులు
రిప్లయితొలగించండితెలుగిళ్లను తేజరిల్లు తీరుల జూడన్
వేలుగును మన తెలుగు కవిత
నలుదిశలను - యనుచు మనకు నమ్మకమౌగా !
కం. సజలములను యూరించెడు
కజరపు రుచివంటి తెలుగు కావ్యములందున్
విజరపు కవితా పటిమలు
విజయము కలిగించు మనకు వీరకుమారా !
తే.గీ. మనుజులందరు ప్రేమతో మనుట కొఱకు
జనులు వీలుగనంతటా జనుట కొఱకు
ఉత్తమోత్తమ యుత్పత్తులొందుటకును
తెలుగు కవితయె మార్గంబు తెలియరయ్య !
ఆ.వె. చిక్కనైన వెన్న చిలికించు చందాన
అక్కజంపు బాసనొక్క కవిత
చక్కిలాల రుచిని చవిజూపు రీతిని
దిక్కులందు వెలుగు తెలుగు కవిత !
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండినేటి అంశము :: నిషిద్ధాక్షరి {వర్గ ద్వితీయ, చతుర్థాక్షరములు అనగా ఖఛఠథఫ ఘఝఢధభ అనే అక్షరాలు నిషిద్ధములు}
ఛందస్సు :: ఏ ఛందస్సులోనైనా పద్యం వ్రాయవచ్చు.
విషయం :: *తెలుఁగు పద్య కవితా వైభవము.*
సందర్భం :: తెలుగు భాషకు ఒక వరంగా అలరారుతూ ఉన్న మన పద్యం హృద్యంగా ఉంటుంది. విశేషమైన గణములతో యతులతో ప్రాసలతో లయబద్ధంగా ఉంటుంది. పాడుకోవడానికి అనువైనదిగా మన సంస్కృతికి నిలయంగా పండిత పామర రంజకంగా లోక పూజితంగా విరాజిల్లే మన తెలుగు పద్యం ఆచంద్రార్కంగా శాశ్వతంగా ఉంటుంది అని ఆశిస్తున్న సందర్భం.
పద్యము రమ్యమౌ యతుల, ప్రాసల, సద్గణ రాశులన్ సదా,
పద్యము రాగ రంజితము, పాత్రము, సంస్కృతి కాలవాలమున్,
పద్యము తెల్గుకే వరము, పండిత పామర రంజకమ్మునౌ,
పద్యము లోకపూజితము, పద్యము హృద్యము శాశ్వతమ్మునౌ.
ఈ నా పద్యానికి శ్రీ చిటితోటి విజయకుమార్ గారిచే రచింపబడిన సంస్కృత అనువాద శ్లోకం కూడా ఇక్కడ పొందుపరచబడింది.
*యతి ప్రాస గణోపేతం*
*పద్యం శ్రీరాగరంజితమ్* ।
*సంస్కృతేరాస్పదం హృద్యం*
*శాశ్వతం లోకపూజితమ్* ॥
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (16-3-2018)
నీతిపద్యములను నేర్పుగా రచియించి
రిప్లయితొలగించండివేమనార్యుఁడవనిఁ బేరుఁ బొందె
తెలుఁగు వారి నోట పలుకుచు సతతమ్ము
వెలుఁగులీను చుండు తెలుఁగు పుడమి
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిచెరువు గట్టున విన్న శ్రీకృష్ణ రాయబా...
రంపు పద్యము మనకింపు గూర్ప ,
పసుల కాపరి కూడ పాడు హరిశ్చంద్ర
పద్యమ్ము చెవులలో బడుచునుండ ,
చింతామణీ సుబ్బిశెట్టుల పద్యాలు
పండించు రైతులు పాడుచుండ,
రామాంజనేయంపు రమ్యంపు పద్యమ్ము
తెలుగువాడల నినదించుచుండ
తేనె వానలు నిరతము తెలుగునేల
కురియుచుండును ! రండు సంకోచమేల !
పాడుడీ వ్రాయుడీ తెన్గు పద్యతతులు!
శాశ్వతానందదములు విశాల జగతి !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తెలుగు పద్య మరయ తేనియ చవు లూ ర
రిప్లయితొలగించండికమ్మ నైన రుచి ని కలుగ జేయు
పూర్వ కవుల పద్య పో హ ణ న్ జూడం గ
మో ద మల రు చుండు డెంద మందు
పో హ ణ =నేర్పు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి'తెలుగు' మకుటంతో నే వ్రాసిన యాభైకి పై పద్యాలలో రెండు 😇
రిప్లయితొలగించండితే.గీ
పోతనామాత్యుని పెరటి పొదయు తెలుగు
పాల్కురికి సోముని రగడ పల్కు తెలుగు
ఆదికవి నన్నయ కృతిని హాయి తెలుగు
తిక్కనెర్రనల కవన తేట తెలుగు
తే.గీ.
యోగి వేమన శతకాన నొప్పు తెలుగు
కృష్ణ శతకపు నరసింహు కృషియె తెలుగు
బద్దెనామాత్యుని సుమతి బాట తెలుగు
శతకకారుల పలుకులో చవియె తెలుగు
జయహో
తొలగించండిధన్యవాదాలండీ.
తొలగించండి🙏🏻
*యోగి వేమన శతకాన యొప్పు తెలుగు*
రిప్లయితొలగించండిపద్యమన్న నదొక హృద్యంపుగీతమే
రిప్లయితొలగించండితేటతెలుగు నందు తీపినింపి
యెన్నలేని గరిమ నెంతజెప్పినదృప్తి?
విశ్వమంతనిండ శాశ్వతముగ!
ఈ రోజు అందరి పద్యసుమములు ద్రాక్షాపాకమున
రిప్లయితొలగించండిముంచి తేల్చుతున్నవి! వత్తు అక్షరాలను పరిహరించి గురువుగారు తేటతెలుగు నావిష్కరించారు! వారికి వందన శతములు!!🙏🙏🙏🙏
కందం
రిప్లయితొలగించండిమాటను మంత్రము జేసెడు
వాటము దెలిసిన తెనుగున పద్యము పాడన్
తాటంకయుగలి రవిశశి
నోటను విని పలుకుఁజెలి వినోదమునందున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికంది శంకరయ్యగారెపుడు వ్యస్తులే
రిప్లయితొలగించండితెలుగు పద్య కవిత తేనెయందు
గాన,ఇక్కడున్న కవులందరున్నేడు
సద్విమర్శలిచట సలుపగలరె !
హృద్యము మీ పద్య రచన హృదినిటు తాకెన్.
రిప్లయితొలగించండి🙏🙏🙏
అమ్మ నాన్న నేర్పు నమృతమె తెలుగన్న
రిప్లయితొలగించండివిశ్వమందు జూడ వెలుగు తెలుగు
మనుజు లందు నున్నమమతయే తెలుగన్న
తెలుసు కొనుము బాల !తెలుగు సొగసు!!!
తేనియ లూరును తీయని తెలుగు
మాయని మమతల గేయము తెలుగు
కోయిల పాటల కుహుకుహు తెలుగు
నెమలికి నడకలు నేర్పిన తెలుగు!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికుసుమమ్ము లన్నిటిఁగూర్చగ నింపుగ నందంపు మాలయౌ డెంద మలర
తొలగించండిశిలవోలె కనిపించనల సాన పట్టిన రంజిల్లి కాంతుల రత్న మగును
బంగరు తీగను బన్నుగఁ గరగించి తీరుగ మలచిన హార మగును
మట్టి యిటుక లెల్ల గట్టి సున్నమునఁ గూర్పంగ సుందర గృహ రాజ మగును
శబ్ద కుసుమములను జక్కఁగఁ గూర్చుచు
శిలల వోలె నుండఁ గలయిక లట
నలరఁ జేయ మనము నల నలంకార మా
లలను బద్య కవన మలరు పుడమి
మీ పద్యము రసరంజితము. అభివందనములు నా పద్యమునందలి దోషములను తెలియజేయమనవి.
తొలగించండిసహదేవుడు గారు నమస్సులు. ధన్యవాదములు.మంచి భావము తో మీ పద్య మలరారు చున్నది.
తొలగించండితాటంక యుగళి రవి శశుల నోళ్ళ యని యుండ నగును. లేదా తాటంకయుగళ రవిశశి వక్త్రముల యని తత్సమము సమసించ నగును.
తాటంక రవిశశి యగళి నోటను విని యన్న సరి.
యుగళి యేక వచనము కదా.
పాడం / దాటంక అనండి.
తొలగించండిఇలా సవరించితే సరిపోతుందంటారా?
తొలగించండికందం
మాటను మంత్రము జేసెడు
వాటము దెలిసిన తెనుగున పద్యము పాడన్
దాటంకముల రవిశశులు
మీటదె విని వీణ వాణి మృదు గమకములన్
kaameswara rao gaaru adbhutamu
రిప్లయితొలగించండిధన్యవాదము లండి కృష్ణ సూర్య కుమార్ గారు.
తొలగించండిసీ. నన్నయ్య స్పర్శతో నాణ్యముగ నడిచె
రిప్లయితొలగించండితిక్కన్న కలములో చిక్కనాయె
సీసమై కవిరాజు చెలిమితోడ వెలిగె
బమ్మెరార్యు గనెను బగితి నిండ
ఆ కృష్ణ రాయల నష్ట దిగ్గజములు
వన్నెయైరి తెనుగు పద్యమునకు
శ్రీశ్రీ కలము సిరిసిరి మువ్వ శతకంబు
నెఱ్ఱ సిరుల గూడ యింపొనర్చె
తే.గీ. పద్య మందె తీపి రుచులు పండు ననుచు
నేటి శంకరార్యు లిలను సాటి లేని
వానిగా తీర్చి దిద్దిరి పద్య కవిని ,
వాసియును రాశి బెంచిరి పద్దెమునకు!
కచటతపలు మఱియు గజడదబలతోనె
రిప్లయితొలగించండికవిత వ్రాయ మనిన కలుగు వెతయె
తెలుగు పద్య కవిత వెలుగుల వర్ణింప
చావు వచ్చె నయ్య శంకరార్య!
***)()(***
(శంకరయ్య అనలేక శంకరార్య అన్నాను.కరెక్టేనా?)
ఉత్పలమాలయై యొయ్యార మొలికించు
రిప్లయితొలగించండి.....చంపకమాలయై చవుల జూపు
శార్దూల రాజమై చయ్యన గాండ్రించు
.....మదగజమై వచ్చు నదను జూచి
మత్తకోకిలయగు మత్తిల్లి పాడుచో
.....తరలమై నటియించు సరళముగను
సీసమై యరుదెంచి చిందులు ద్రొక్కును
.....కందమై కవితకే యంద మగును
వృత్తగతి లోన నడచు సద్వృత్త యగుచు
జాతి యుపజాతులను గూడి సరస మాడు
ద్విపద మాత్రాగణమ్ముల తేలియాడు
తెలుగు పద్యాల సొగ సిది దివ్యచరిత.
మిస్సన్నగారి పద్యసుమమాల తెలుగు పరిమళాలతో గుబాళిస్తున్నది!! 💐💐💐💐
తొలగించండిసీసము లో నందె వేసిన చేయి మీరు మిస్సన్న గారు!
తొలగించండిధన్యవాదాలు సీతాదేవి గారూ
తొలగించండిమీ అభిమానం కామేశ్వర రావు గారూ.
తొలగించండిడా.బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండి16/3/18
1.కం:హృద్యంబైనది యిలలో
పద్యంబేననినిరతము పండితులెల్లన్
విద్యల రాణిని కొలుచుచు
పద్యపు గరిమను విడువక పాడిరి గనుమా.
2.ఆ.వె:తెలుగుపద్యములను తేలిక చేసినా
నూరకుండ బోకు నుర్వి యందు
తెలుగు వాడినంచు దీటుగా స్పందించు
తెలుగు పద్యగరిమ తేట పరచు.
3.ఆ.వె:తెలుగు తల్లి మెడను తీరైన హారమై
వెలుగు చున్నదిదియె జిలుగు తోడ
తీయనైనబాస తెలుగటంచుజనుల
మెప్పు బడసె గనుము మేదినందు.
4.ఆ.వె:జాతులైననుప జాతి బద్యము లైన
మదికిహాయి గూర్చు మహిని నిజము
:వృత్తమేది యైన విన్నంతనే చాలు
మరల మరల వినగ మనసు పుట్టు.
5.ఆ.వె:తేనె లొలుకునట్టి తీయని పద్యముల్
వినని వారు గలరె విశ్వమందు
నన్నయాదికవులు నవ్యరీతులతోడ
హృద్యముగరచించి యాద్యులైరి
6.ఆ.వె:పట్టు బట్టి నేర్వ పద్యరచనమిల
నేర్వ వచ్చు గాదె నెమ్మితోడ
పద్య మందె జనులు పలుకాడు చుండగా
వినగ హాయి కలుగు వీనులకును.
7:ఆ.వె:పద్యరచన యన్నబ్రహ్మ విద్యయుకాదు
పట్టు బట్టి నేర్వ పట్టుబడును
వల్లె వేయుటకివి వాసిగా నుండును
చదువుచున్నకొలది జ్ఞాన మబ్బు.
లలిత లలితమైన లావణ్య మొలుకుచు
రిప్లయితొలగించండితెలుగు తల్లి మ్రోల తేజరిల్లి
మనము కొల్లగొట్టి మంత్ర ముగ్ధుల చేయు
వాణి కరుణ చూపవాక్కు నందు
"ముగ్ధుల"
తొలగించండికదులు చుండు కాగితానకలము హలమునేర్పునన్
రిప్లయితొలగించండిపదము పదము విత్తగానె పద్యపంట బండగా?
మెదలుచుండుకళ్ళయందుమేటియూహవింతగా|
చదువగానె?సంతసంబు సాకబూను సంస్కృతుల్
సారవంతము కావ్యమంజరి సాహితీవన మందునన్
రిప్లయితొలగించండిమేరలేని కవిత్వసంపద మేటిపండితు
లెందరో
వారసత్వపుటాస్తి గాగను వాసిగాంచు
చరిత్రలే
కూరిమిన్ దగకూర్చినారుగ క్రొత్తసోకుల
మేలుగన్
తేటతెల్గున పోతనార్యుని తేనెలూరెడు పద్యముల్
మాటనేర్పిన నన్నయార్యుల
మాననీయపు మార్గముల్
నాటకమ్మగు తీరువ్రాసిన నాటి మంత్రులు రీతులే
సాటిలేని తెలుంగు పద్యపు సంతకమ్ములు గావహో!
👌👌👌
తొలగించండిధన్యవాదములన్నయ్యా!
తొలగించండి🙏🙏🙏🙏🙏
పద్యము తెలుగున కొక నై
రిప్లయితొలగించండివేద్యముగా దలచి కవులు ,విశ్వము మెచ్చ
న్నుద్యమముగ రచన సలుప
పద్యమునకు సాటి లేదు ప్రక్రియలందున్
ఎన్నడొ పద్య విద్యమన కింపునొసంగె నటంచెరుంగుచు
న్నన్నయ్య తిక్కనాదులును, నాచన, సూరన, పెద్దనార్యులు
నెన్నగ జంట పద్యకవులే మన కిచ్చినదంచు దల్చుచున్
పిన్నలు పెద్దలందరును ప్రీతిని నేర్చిన పేరు గాంచరే !
రిప్లయితొలగించండి........నిషిద్ధాక్షరి
తెలుగు పద్య కవితా వైభవము
(మహా ప్రాణాలు లేకుండా)
*శ్రీ లు*
సందర్భము: సంపదలు.... రసముతో నిండిన నీతితో కూడిన శబ్దము లనే సంపదలు,
దివ్యమైన ఆనందంతో కూడిన జీవిత సమూహా లనే సంపదలు,
అందమైన పద్యా లనే సంపదలు ప్రతి తెలుగింట యెల్లప్పుడు చిందులు వేస్తాయి గాక!
~~~~~~~~~~~~~~~~~~~~~~~
శ్రీలున్, రసమయ నయ వాక్
శ్రీలున్, దివ్య ప్రమోద జీవన నికర
శ్రీలున్, సురుచిర పద్య
శ్రీలున్ దెలుగింట సతము
చిందులు వేయున్
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు ఉదయం చిక్కడపల్లిలో ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుండి నేరుగా చందానగర్ వచ్చి కవిసమ్మేళనంలో పాల్గొని ఇంతకు ముందే నెలవు చేరాను. అందువల్ల మీ పూరణలను సమీక్షించడం వీలు కాలేదు
రిప్లయితొలగించండిఒక్కటి మాత్రం నిర్ద్వందంగా చెప్తాను. ఈనాటి దత్తపది పూరణలలో అందరూ తమ సృజనాత్మకతను స్పష్టం చేస్తూ చక్కని పద్యాలు చెప్పారు. అందరికీ అభినందనలు, ధన్యవాదములు.
కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు ఉదయం చిక్కడపల్లిలో ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుండి నేరుగా చందానగర్ వచ్చి కవిసమ్మేళనంలో పాల్గొని ఇంతకు ముందే నెలవు చేరాను. అందువల్ల మీ పూరణలను సమీక్షించడం వీలు కాలేదు
రిప్లయితొలగించండిఒక్కటి మాత్రం నిర్ద్వందంగా చెప్తాను. ఈనాటి దత్తపది పూరణలలో అందరూ తమ సృజనాత్మకతను స్పష్టం చేస్తూ చక్కని పద్యాలు చెప్పారు. అందరికీ అభినందనలు, ధన్యవాదములు.