గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2635 సమస్య :: *పతి గళ మందు కట్టె నొక భామిని తాళిని మోదమందుచున్.* భార్య భర్త మెడలో తాళిని కట్టింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: కాశీరాజు యొక్క కుమార్తెలైన అంబ అంబిక అంబాలికలను భీష్ముడు తన పరాక్రమంతో గెలిచి నాడు కానీ వివాహం చేసికొనలేదు. అంబ ఎంతో బాధపడి పరమశివుని వరంతో మరు జన్మలో భీష్ముని చంపదలచింది. ద్రుపద మహారాజునకు కుమార్తెగా పుట్టి కుమారుడుగా పెంచబడింది. దశార్ణ దేశానికి రాజైన హేమవర్ణుని కుమార్తెను సూర్య భగవానుని సాక్షిగా వివాహమాడింది. అప్పుడు ఆమె పెండ్లికుమార్తె మెడలో తాళిని కట్టింది అని విశదీకరించే సందర్భం.
చితియె దహింప, నంబ తన చింత దొలంగ, శిఖండి పేరునన్ సుతగ జనించియున్ , ద్రుపద సూనుడుగా నిల వృద్ధి జెంది , సు వ్రతను దశార్ణ రాజ సుత పాణిఁ గ్రహించుచు సాక్షిగా నహ *ర్పతి , గళ మందు గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్.* *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (28-3-2018)
కృష్ణ సూర్యకుమార్ గారూ, కందపాదాన్ని తేటగీతిలో ఇమిడ్చే మీ ప్రయత్నం ప్రశంసనీయమే. కాని సమస్యలో లేని 'నొక్క' అన్న పదాన్ని చేర్చడం సంప్రదాయం కాదు. కనుక కందపద్యాన్నే ప్రయత్నించండి.
ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా "జంబలకిడిపంబ" చిత్రంలో మగవారు ఆడువారిలాగ ఆడువారు మగవారు లాగ వ్యవహరిస్తారు. ఆచిత్రంలో పెళ్ళికూతురు పెళ్ళికొడుక్కి తాళి కడుతుంది. 🤣
సందర్భము: ఒక పెండ్లి ఘనంగా జరుగుతున్నది. పుట్టింటివారు ఒక పెద్ద అద్దాన్ని (డ్రెసింగ్ టేబుల్) వధువుకు బహూకరించారు. ఇ దేమి టన్నాడు వరుడు. పెండ్లి కూతురు చెల్లెలు పరిహాస మాడుతూ " ఆఁ! ఏమీ లేదు బావా! ఈ అద్దంలో భర్త మెడలో ఒక భామ తాళి కట్టుతూ వున్నట్టు కనిపిస్తుం దంతే!" అన్నది. అద్దంలో తారుమారుగా కనిపించడం సర్వ సామాన్యం. కాని ఈ అద్దంలో ఇంకా విశేష మే మంటే ఇలా కూడా కనిపిస్తుం దని, ఆమాత్రం తెలియదా! అని.. ఆ చిన్నారి అంతరంగం. ~~~~~~~~~~~~~~~~~~~~ అతులితమైన పెండ్లి నొక యద్దము పెద్దది పుట్టినింటి వా
అతి జాతులు,తెగలు గల భ
రిప్లయితొలగించండిరతావనిన గల యొక తెగ లలనయె తెగ ప
ద్ధతి ననుసరించి పెండ్లిన
పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భరతావనిని... పెండ్లిని..." అనండి.
రిప్లయితొలగించండిఅతికతము జిలేబిని గని
పతి, గళమునఁ దాళిఁ గట్టె, భామ ముదమునన్
సతియై రంపుమునన్ రా
చి తిరిపరిగ మార్చెనంట చెకుముకి యనుచున్ :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అతకతము'...? 'రంపమునన్' టైపాటు.
తొలగించండిఅతకతము - అతిసమీపము
తొలగించండిఅతికతతము అని వుండాలనుకుంటా :)
అతి విప్లవ భావాల సు
రిప్లయితొలగించండిమతి తమ యాచారములను మరి ప్రక్కకు నె
ట్టి తెగించి పెండ్లి తంతున
పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
అస్వస్థతతో నున్న భర్త ను సముదాయిస్తూ
రిప్లయితొలగించండివెతలనుఁదీర్చెడు పతకం
బతులిత సౌభాగ్యమిచ్చు హాయినిఁగూర్చున్
రతనములెందుకు మనకని
పతి గళమున తాళిఁగట్టె భామ ముదమునన్.
తాళి=హార విశేషము శబ్ద రత్నాకరము
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండివ్రతతిగ గోముగా ముదిత, వాంఛిత రాణిని గాంచి సంతసిం
చి తిరుగగా సదా వెనుక, చిక్కెను జాలము లో గదా మగా
డు తిరిప జోగి తస్సదియ డుంటక డుంటక యే యికన్! రమా
పతి గళమందుఁ గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిక్షమించాలి. మీ పూరణ అర్థం కాలేదు.
మితిమీరి నసరస మునరఘు
రిప్లయితొలగించండిపతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
జతకూడె ననిమురి పెంబున
వెతలను మైమరచి తాను వేడుక నొందెన్
అక్కయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి, మూడవ పాదాలలో గణదోషం. "మితిమీరు సరసమున రఘు... జతగూడె నని మురిపెమున..." అనండి.
మితిమీరు సరసమున రఘు
తొలగించండిపతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
జతకూడె ననిమురి పెమున
వెతలను మైమరచి తాను వేడుక నొందెన్
----------------------
[పిలుపులో ఈమార్పు ?????????????????
శితికంఠుడు లలితో శ్రీ
రిప్లయితొలగించండిపతి గళమునఁ దాళిఁ గట్టె, భామ ముదమునన్
సతిపతిని గూడ వారికి
సుతుడయ్యప్ప జనియించె సుందర రూపున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"భామ ముదమునన్। పతితో గూడగ వారికి..." ఆనండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిపతికొక వ్యాధిసోకి పలు బాధల క్రుంగుచునుండ , పొంది తా...
యెతు నొకదాని , భక్తి మదినెంచుచు దేవుని ., స్వాస్థ్యమందగా
పతి గళమందుఁ గట్టె నొక భామిని ., తాళిని మోదమందుచున్
గతి యిదె యంచు మ్రొక్కుకొని కళ్లకునద్దుకొనెన్ శుభంబుగా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ విరుపుతో మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2635
సమస్య :: *పతి గళ మందు కట్టె నొక భామిని తాళిని మోదమందుచున్.*
భార్య భర్త మెడలో తాళిని కట్టింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: కాశీరాజు యొక్క కుమార్తెలైన అంబ అంబిక అంబాలికలను భీష్ముడు తన పరాక్రమంతో గెలిచి నాడు కానీ వివాహం చేసికొనలేదు. అంబ ఎంతో బాధపడి పరమశివుని వరంతో మరు జన్మలో భీష్ముని చంపదలచింది. ద్రుపద మహారాజునకు కుమార్తెగా పుట్టి కుమారుడుగా పెంచబడింది. దశార్ణ దేశానికి రాజైన హేమవర్ణుని కుమార్తెను సూర్య భగవానుని సాక్షిగా వివాహమాడింది. అప్పుడు ఆమె పెండ్లికుమార్తె మెడలో తాళిని కట్టింది అని విశదీకరించే సందర్భం.
చితియె దహింప, నంబ తన చింత దొలంగ, శిఖండి పేరునన్
సుతగ జనించియున్ , ద్రుపద సూనుడుగా నిల వృద్ధి జెంది , సు
వ్రతను దశార్ణ రాజ సుత పాణిఁ గ్రహించుచు సాక్షిగా నహ
*ర్పతి , గళ మందు గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (28-3-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిశిఖండి పరిణయ వృత్తాంతంతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
"సతతము మాపై నురుముచు
రిప్లయితొలగించండిమితమనునది లేక పొగరు మీరి చరింపన్
గతమది ; సములము మే " మని
పతి గళమున దాళి గట్టె భామ ముదమునన్ .
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమహిళా మండలి జిందాబాద్ :)
సతతము మగరాయుండ్లే
నతివలకది కట్టుటేల ! నప్పదు మాకోయ్ !
లతకూనలు పిలుపివ్వగ
పతి గళమున దాళి గట్టె భామ ముదమునన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమహిళల తిరుగుబాటుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మగరాయులె తా। మతివల కది..." అనండి.
ప్రతినిధియౌచున్ సీతా
రిప్లయితొలగించండిపతి,గళమున దాళిగట్టె భామ ముదమునన్
సతిసీతకు, సతులెల్లరు
రతిమీరగ జేయురమ్య ప్రతిమల
పెండ్లిన్!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రతిఁ బోలిని వధువును గని
రిప్లయితొలగించండిపతి, గళమున తాళిఁ గట్టె, భామ ముదమునన్
పతి యందముగనుచు మురిసె
నతివైభవమందు వేడ్క లంబర మంటెన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"రతిఁ బోలిన" ... టైపాటు.
అతివకు కుజదోషమ్మని
రిప్లయితొలగించండిమతిపోయిన పండితుండు మంత్రమ్ములతో
ప్రతిమను వరునిగ జేయగ
పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండివెత! స్వస కగ్రేదిధిషూ
పతి గళమునఁ దాళిఁ గట్టె; భామ ముదమునన్
పతిని వెతుక! జీవితమున
సతతము మనదైన రీతి సాధ్యంబగునే !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిక్షమించాలి. పూరణ పూర్వార్ధం అర్థం కాలేదు.
తొలగించండిఈ రోజేదో అయ్యింది :)
అగ్రేదిధిషూపతి - చెల్లెలి మొగుడు
స్వస - చెల్లి
అప్ప కై భర్తను వెతుకుచుండగ వచ్చిన వాడు చెల్లిని పెండ్లియాడి అగ్రేదిధిషూపతి అయితే వెత యే కదా !
జిలేబి నీ పద్యాలకు నీవే భాష్యం రాసుకోవాల్సిన రోజులు దాపుల్లోనే వున్నాయి :)
జిలేబి
వ్రతముగ చేయనెంచుచు సువాసిను లెల్లరు దైవ కార్యమౌ
రిప్లయితొలగించండిప్రతిమల పెండ్లి సేసిరట భక్తిగ కోవెల లోన, వేసెనే
యతిరథు లెల్ల గాంచుతరి యర్చకు లిచ్చిన మాలఁ జానకీ
పతి గళమందు, గట్టెనొక భామిని తాళిని మోదమందుచున్
సతియగు సీతకంఠమున, చక్కగ సాగగ మెచ్చి రెల్లరుల్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిపతి సతు "లథిలెట్ల"వ్వన్
సతి గళమును వంచలేక సయ్యాటాడ
న్నతి వేగమె గెలిచిన సతి
పతి గళమున దాళి గట్టె భామ ముదమునన్!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. "హిత మెంచగ కష్టమాయె..." అందామా? "పతి యస్వస్థత" టైపాటు.
పతికట్ట ప్రేమ తాళిని
తొలగించండిహిత మెంచగ కష్టమాయె హితులే మెచ్చన్
పతి యస్వస్థత బాగవ
పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
పతికట్ట ప్రేమ తాళిని
తొలగించండిహిత మెంచగ కష్టమాయె హితులే మెచ్చన్
పతి యస్వస్థత బాగవ
పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
పతికట్ట ప్రేమ తాళిని
తొలగించండిహిత మెంచగ కష్టమాయె హితులే మెచ్చన్
పతి యస్వస్థత బాగవ
పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
ఆకాశవాణి పూరణ తెలుపగలరు
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండిచితిలో సైతము తోడనె
పతి గళమునఁ! దాళిఁ గట్టె, భామ ముదమున
న్నితఁడే తనకున్ సరిపడు
జతగాడని దనరుచు కనుసైగల మ్రొక్కెన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅతికతతము రమణిని గని
పతి, గళమునఁ దాళిఁ గట్టె, భామ ముదమునన్
సతియై రంపమునన్ రా
చి తిరిపరిగ మార్చెనంట చెకుముకి యనుచున్ :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండి'అతికతతము'...?
తొలగించండిఈరోజేదో అయ్యింది :)
అతికతతము - అతి సమీపము
సతి పతి భేద భావము లు సన్మతు లై విడనాడి దంపతుల్
రిప్లయితొలగించండిసతత ము నొ oడొ రు ల్ వలపు సఖ్యము నన్ సరసాన మె ల్గుచు న్
చతుర త మీర ప ల్కుచు ను జాణ గ పెక్కగు చేష్టల దు తా
పతి గళ మం దు కట్టె నొక భామిని తాళి ని మో ద మం దు చు న్
మూడవ పాదం లో చేష్టల oదుఅని సవరణ గా చదవాలి
తొలగించండిరాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండి"అతి చరితవ్యమంట"నని హాయిగ బల్కి వరావధానియే
శ్రుతి గతి దప్పి దిర్గగ సుశోభితుడాయెను షష్టి పూర్తినిన్
జతనపు మాల మార్పులను జార్చిన యా సతి తాళిబొట్టునే
వెత నటు గట్టె భర్తనెటు వెళ్ళక నాపగ;సంతు జూడగా
పతి గళమందు గట్టెనొక భామిని తాళిని మోదమందుచున్!!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జాతకమున గలిగిన దోషమును బాప
రిప్లయితొలగించండిగ నజపతిగళమునఁ దాళిఁ గట్టె నొక్క
భామ ముదమునన్ తనయొక్క భర్త మేలు
గోరుచు మనువుకు మునుపు కూర్మి తోడ
జాతక దోష నివ్రత్తి కొరకు కొన్న ప్రాంతములలో మగవానిచేత అరటి చెట్టుకు పెండ్లి మగ మేకకు ఆడ వారిచేత పెండ్లి జరుపు సంప్రదాయము కలదు
రిప్లయితొలగించండికృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండికందపాదాన్ని తేటగీతిలో ఇమిడ్చే మీ ప్రయత్నం ప్రశంసనీయమే. కాని సమస్యలో లేని 'నొక్క' అన్న పదాన్ని చేర్చడం సంప్రదాయం కాదు. కనుక కందపద్యాన్నే ప్రయత్నించండి.
Nokia tappu ayinadi. Khsa minchndi. Padanni alage unchi purimchatamu tappu kadu gada
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి"అతివ గళమ్మునన్ మగఁ డహమ్మునఁ దాళినిఁ గట్టు నెప్పు, డా
పతుల కరమ్మునన్ ఘన శుభమ్మిడు పుస్తియ యుండనౌనె? మా
సతులకు లేదె హక్కు, జన సమ్మత మందుచుఁ దాళిఁ గట్ట? నె
న్నితి నిదె యీ దినమ్ముననె నిక్కముగాఁ గదియింతు" నంచు నా
పతి గళమందుఁ గట్టె నొక భామిని తాళిని మోద మందుచున్!
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండిసతిపతుల పథములమరగ
రిప్లయితొలగించండిపతి గళమునఁదాళిఁగట్టె, భామముదమునన్
పతినట చూచెను ప్రేమగ
సతిపతులముదమున జనులు శాంతిని పొందెన్
తోపెల్ల వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కర్తృపదం జనులు బహువచనం. క్రియాపదం పొందెన్ ఏకవచనం. అక్కడ "జనులు శాంతి గని రటన్" అందామా?
స్తుతమతి విద్యాధిక భూ
రిప్లయితొలగించండిపతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
నత శిరయై భాసిల్లఁగ
నతి సుందరముగ వరుండె యానందమునన్
సతతము ప్రీతి పాత్రమగు చక్కని పల్కులఁ గారవించెడిన్
వితరణ శీలియై జనుల ప్రేమకుఁ బాత్రతఁ బొంది నట్టి యీ
యతులిత సుందరుండు పతి యౌట మదీయ సుభాగ్య మంచుఁ దా
పతి గళమందుఁ గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్
[తాళి = హారము]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఅతియోగ్యుం డుత్తముడు న
రిప్లయితొలగించండిపతి గళమునఁ దాళిఁ గట్టె! భామ ముదమునం
దతనిని తోడ్కొని జనె తిరు
పతి వేంకటనాథుని కడు భక్తిగ చూడన్ ౹౹
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'న పతి'...?
అపతి = విధవ
తొలగించండిఅతి కుతుకముతో సీతా
రిప్లయితొలగించండిపతి గళమున తాళిగట్టె ; భామ మదమునన్,
గతి తప్పగ గుండె లయయె,
మితి మీరిన హర్షమొందె మేన్పులకింపన్
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ చాల బాగున్నది. అభినందనలు.
మతిచెడినట్టి యింతి ముదమారగ బెండ్లిని జూచు వేడుకన్
రిప్లయితొలగించండికుతుకము తోడ చేరెను ప్రకోపము చెందిన వ్యాధి తీవ్రతన్
సతమతమౌచు పీఠమున చక్కగనున్న వరుండు వీరభూ
పతి గళమందు, గట్టెనొక భామిని తాళిని మోదమందుచున్
అతులితముగ నచటి తెగల
రిప్లయితొలగించండినతివయె మగవాని మెడను యందరుమెచ్చన్
కుతుకమున పుస్తె కట్టగ
పతి గళమున తాళిగట్టె ; భామ మదమునన్,
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'మెడను + అందరు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.
అతులిత బలధాముడు శ్రీ
రిప్లయితొలగించండిపతి గళమున తాళిఁ గట్టె, భామయె ముదమున్
శితికంఠుఁ ధనువు విరిచిన
క్షితినాథునిగాంచి సీత సిగ్గిలె నపుడున్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికం.
సతి వేసె పురుష వేషము
పతియే మారెను వధువుగ పరిణయ మందున్
అతి చేయు జబర్దస్తున్
పతి గళమున దాళి గట్టె
భామ ముదమునన్ .
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పరిణయమున దా। మతి సేయు..." అనండి.
సార్! నిన్నటి సమస్యకు నా బెంగాలీయుల పూరణ:
రిప్లయితొలగించండిరంగుల పండుగ దినమున
భంగును త్రాగుచు ముదమున వాచాలుండై
గంగోపాధ్యాయుడనియె
నంగదుఁ డనిలోనఁ జంపె నశ్వత్థామన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండి👏👏👏👏👏
తొలగించండిరవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
జాతకమున గలిగిన దోషమును బాప
రిప్లయితొలగించండిగ నజపతి గళమున తాళి గట్టె భామ
ముదము గన్ పెండ్లి మంటపమున మనువుకు
మునుపు బంధు జనుల బృందము గనుచుండ
గురువు గారు మార్చి వ్రాశాను సలహా ఇవ్వండి
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ చాల బాగుంది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅతివేలము నామెకు నా
పతి గళమున తాళిగట్టె; భామ ముదమునన్
పతి తీర్చిన యాపుస్తిని
నుతించి తన కండ్ల కద్దె నుత్సాహముతో
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మతిలేని సతి గ నొక్క తె
రిప్లయితొలగించండిసతత ము తను తోచిన ట్లు సైపని పనుల న్
సు తి మెత్త గ నొ న రించు చు
పతి గళ ము న తాళి కట్టె భామ ముద ము న న్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా "జంబలకిడిపంబ" చిత్రంలో మగవారు ఆడువారిలాగ ఆడువారు మగవారు లాగ వ్యవహరిస్తారు. ఆచిత్రంలో పెళ్ళికూతురు పెళ్ళికొడుక్కి తాళి కడుతుంది. 🤣
రిప్లయితొలగించండిమితిలేదుగ హాస్యమునకు
పతి సతియౌ జంబలకిడిపంబను పటము
న్నతిశయమున చిత్రముగను
"పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్"
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కదా' అనే అర్థంలో 'గ' ప్రయోగం సాధువు కాదు. "మితి లేదట హాస్యమునకు" అనండి.
రిప్లయితొలగించండిఅతిహితమున సభలో రఘు
పతి గళమునఁ దాళిఁ గట్టె ,భామ ముదమునన్
రతిపతి పితను తలంచుచు
.నతిహితముగ పతికి మ్రొక్కె నతులిత ప్రేమన్
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"అతిగా వరకట్న మిడుట
రిప్లయితొలగించండిపతిగళమున తాళి"!"గట్టెభార్యముదమునన్
శ్రుతి మెత్తగ నత్త,మగని
మితిమీరిన వారినోరు"మింగుడుబడకన్*
మతిలేనిదాని కొక్కడు
రిప్లయితొలగించండిపతిగా పెళ్ళాడ నెంచ?పందిటయందే
నితరులు జూచుచు నండగ
పతిగళమున తాళిగట్టె భార్య ముదమునన్*
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అతివనట దేవ దాసిగ
రిప్లయితొలగించండిపతితగ మార్చెడు కుతంత్ర పర్వము నందున్
క్రతువగు పెండ్లిన యుండడు
పతి, గళమున తాళిఁ గట్టె భామయె ముదమున్
విరించి గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
చంపకమాల
రిప్లయితొలగించండివెతలు భరించలేననుచు వేడుక లేదని జీవితమ్మునన్
సతి విలపించ భర్త తన సాధ్విని ప్రేమగ వేంకటాద్రికిన్
జతగొనె షష్టి పూర్తికని, స్వామి పవిత్ర నగంపు వేదిపై
పతి గళమందుఁ గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్
తాళి = హారం
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*28-3-18*..సమస్య
రిప్లయితొలగించండిపతి గళమునఁ దాళిఁ గట్టె భామ
ముదమునన్
*శ్రీ సీతారామ కళ్యాణం*
సందర్భము: సులభ పూరణము.
శుభ ప్రారంభము
~~~~~~~~~~~~~~~~~~~~~~~
నుత గుణ సీతను గని రఘు
పతి గళమునఁ దాళిఁ గట్టె..
భామ ముదమునన్
బతి పాద కమలములకును
నతి ప్రేమను దండ మిడియె నందరు చూడన్
2 వ పూరణము:--
...........సమస్య
పతి గళమందుఁ గట్టె నొక
భామిని తాళిని మోదమందుచున్
*అంతా తారుమారే*
సందర్భము: ఒక పెండ్లి ఘనంగా జరుగుతున్నది. పుట్టింటివారు ఒక పెద్ద అద్దాన్ని (డ్రెసింగ్ టేబుల్) వధువుకు బహూకరించారు. ఇ దేమి టన్నాడు వరుడు.
పెండ్లి కూతురు చెల్లెలు పరిహాస మాడుతూ " ఆఁ! ఏమీ లేదు బావా! ఈ అద్దంలో భర్త మెడలో ఒక భామ తాళి కట్టుతూ వున్నట్టు కనిపిస్తుం దంతే!" అన్నది.
అద్దంలో తారుమారుగా కనిపించడం సర్వ సామాన్యం. కాని ఈ అద్దంలో ఇంకా విశేష మే మంటే ఇలా కూడా కనిపిస్తుం దని, ఆమాత్రం తెలియదా! అని.. ఆ చిన్నారి అంతరంగం.
~~~~~~~~~~~~~~~~~~~~
అతులితమైన పెండ్లి నొక
యద్దము పెద్దది పుట్టినింటి వా
రతి ప్రియమారగా నొసగి,
రంత వరుం "డిది యేమి" టన్న నం
చితముగ నిట్లనెన్ వధువు
చెల్లి.. " కనంబడు బావ! దీనిలో
పతి గళమందుఁ గట్టె నొక
భామిని తాళిని మోద మందుచున్ "
3 వ పూరణము:--
*మంగళ సూత్రం*
సందర్భము: వధూ వరుల మధ్య పవిత్రమైన బంధాన్ని పాదుకొలిపేది మంగళ సూత్రమే అంటే అతిశయోక్తి కాదు. భార్యా భర్తల నడుమ జీవన బంధాన్ని పట్టి నిలిపేది మంగళ సూత్రమే అంటే సత్యదూరం కాదు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
సతికిని కొత్తతీరుగను
చక్కిలిగింతలు గల్గ తాళి నా
పతి గళమందుఁ గట్టె ;... నొక
భామిని తాళిని మోద మందుచున్
కుతుకము మీర కన్నుగవ
కున్ నను మెత్తగ నద్దుకొన్న... దీ
పతి సతి మధ్య నేర్పడిన
పావన బంధము తాళి వల్లనే!...
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణలన్నీ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
అతివయె త్రాగి మద్యమును హాయిగ తీయగ నాటలాడుచున్
రిప్లయితొలగించండిమతి తొలగించి భర్తకును మంగళ సూత్రము తీసివేయుచున్
కితకితలొల్లి మంచమున క్రిందను మీదను దొర్లుచుండగా
పతి గళమందుఁ గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్