బాపూజీ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'అంగదుడు' శబ్దానికి మీరిచ్చిన అర్థం ఏ నిఘంటువులోనూ లేదు. 'అంగదము కలవాడు' అని చూసిన అంగదమంటే క్రోధం అనే అర్థం లేదు. కేయూరం, దండకడియం అనే అర్థాలున్నవి.
అన్నపరెడ్డి వారూ, చావు లేని అశ్వత్థామను మానసికంగా చంపడం అన్న భావనతో మీ పూరణ చాల బాగున్నది. రెండవ పాదంలో గణదోషం. కంద పాదాన్ని తేటగీతిలో ఇమిడ్చే మీ పయత్నం ప్రశంసనీయం. కాని ఎన్ని విధాలుగా చూసినా అది సాధ్యం అయ్యే విధంగా లేదు.
వరలక్ష్మి గారూ, మీ ప్రయత్నం ప్రశంసనీయం. కొంత అన్వయలోపం ఉన్నది. 'సింగగతి' అన్న సమాసం సాధువు కాదు. "సింగపు గతి నరిని..." అనవచ్చు. 'అంగదుడు' ఏ అర్థంలో ప్రయోగించారు?
అర్జునుడు అశ్వత్థామను చంపబోవునపుడు శ్రీకృష్ణుడు వారించి ఇతని తలగొరిగిన తలను ఖండించినట్లవుతుంది అదియే అతనిని చంపిన దానితో సమానమన అర్జునుడు ఆవిధంగా తలగొరిగి వదలి వేయు సందర్భం.
అర్జునుడు అశ్వత్థామను చంపబోవునపుడు శ్రీకృష్ణుడు వారించి ఇతని తలగొరిగిన తలను ఖండించినట్లవుతుంది అదియే అతనిని చంపిన దానితో సమానమన అర్జునుడు ఆవిధంగా తలగొరిగి వదలి వేయు సందర్భం.
డా. పిట్టా వారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఆము శబ్దానికి గర్వం, మదం అన్న అర్థాలున్నవి. మోద మన్న అర్థం లేదు. అయినా అది వైకృతం. దానిని అశ్వత్థ అన్న సంస్కృత శబ్దంతో సంధి ఎలా చేస్తారు?
గురువు గారికి నమస్కారములు క్షమించాలి నేను పండితుడను కాను రిటైర్డ్ MPDO ను ఛంధస్సు తో నాకు పరిచయం లేదు అయినను సాహిత్యమన్న మిక్కిలి మక్కువ అందుకే నా ఈ ప్రయత్నం
రమేశ్ గారూ, మీ సాహిత్యాభిరుచి ప్రశంసనీయం. సంతోషం. మీరు వ్రాసిన కవితలో మాత్రాగణనం కూడా సరిగా లేదు. ముందుగా పోతన, కరుణశ్రీ, జాషువా, వేమన మొదలైనవారి పద్యాలు చదవండి. బ్లాగులో కవిమిత్రుల పూరణలను పరిశీలించండి. ఛందస్సు తెలుసుకొనండి. పద్యరచనా ప్రయత్నం చేయండి. దారి చూపడానికి నేను, కవిమిత్రులం ఉండనే ఉన్నాం. స్వస్తి!
పూజ్యులు శంకరయ్య గారికి విజ్ఞులు శ్యామల రావు గారికి వందనములు. సింధువు, సముద్రము నందు పుట్టిన వాఁడు , చంద్రుఁ డని ప్రయోగించితిని. ఇక్ష్వాకు కులమును కూడా సముద్రముతో బోల్చితిని కదా యని. మీరన్నట్లుగా ధారా భంగముగనే తోచుచున్నది. గురువు గారి సూచన చక్కగా నమరినది. దానినే గ్రహించు చున్నాను. ధన్యవాదములు.
ఇక్కడ సమస్యాపూరణలు చేస్తున్నవారికున్నంత విద్వత్తు నాకు లేదు. అర్జునుడు అశ్వత్థామ ని చంపే బదులు తల గొరిగాడని కొంతమంది ఇక్కడ వ్రాసారు. మహాభారత కథ గురించి నాకు గుర్తున్నంత వరకు అటువంటిది జరగలేదు. చంపే బదులు అతని శిరోమణి ని తీసుకుంటాడు అర్జునుడు పెద్దల సలహాననుసరించి. అందువలన ఈ సమస్యాపూరణానికై ఆ అన్వయింపు సరికాదేమోనని నా మనవి. (తల / మీసం గొరగడం జరిగినది రుక్మి, జయద్రధుడు (సైంధవుడు) విషయంలో)
పొరబడుతున్నారు. భారతపద్యంలో శిరోజములు తరగుట శిరోరత్నాన్ని గ్రహించుటకే కాని శిరోముండనం లేదక్కడ. ఉందని అనుకోవటానికి అవకాశం పద్యం నుండి పిండవచ్చును. కాని కథలో శిరోరత్నపరిగ్రహణం స్పష్టంగానే ఉన్నది.
రాజశేఖర్ గారి పూరణలో అంగరాజ్యాన్నిచ్చినవాడు కనుక దుర్యోధనుడు అంగదు డయ్యా డని చెప్పడం వైవిధ్యంగా ఉంది. పూరణ ప్రశస్తంగా ఉన్నది. శ్యామలీయం గారన్నట్టు మొదటి, రెండవ పాదాలలో యతి తప్పింది. 'కురురా జా యంగదుం డౌను... రాజ్యమును ప్రాశస్త్యంబుగా నిచ్చుటన్..." అంటే ఎలా ఉంటుంది? ***** శ్యామలీయం గారూ, ధన్యవాదాలు.
సహృదయులు అగు శ్రీ శ్యామలీయం గారికి భక్తిపూర్వక ప్రణామాలు. ఆర్యా! తమరి సందేశాన్ని చూచినానండీ. మీరన్నట్లుగానే నా పద్యంలో మొదటి రెండవ పాదాలలో యతి మైత్రి తప్పింది. *కురురాజౌ నంగదుం డన్న* అని *రాజ్యము బ్రశంసన్* అని మార్పు చేయదలచినానండీ. సవరణతో చదువవలసినదిగా ప్రార్థన. భవదీయుడు కోట రాజశేఖర్.
సందర్భము: ఉప పాండవుల నతి కర్కశంగా నిద్రలోనే రూపుమాపిన అశ్వత్థామను గూర్చి 'మనిషికి గౌరవ భంగమే మృత్యు' వన్నాడు కృష్ణుడు. అర్జును డా విధంగానే అశ్వత్థామను చంపినాడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ అంగుగ "మనిషికి గౌరవ
భంగంబే మృత్యు" వనుచు పలికిన హరి మో
ముం గని, యటులే నరుడు స
దంగదుఁ డనిలోనఁ జంపె నశ్వత్థామన్
2 వ పూరణము:--
సందర్భము: ఉప పాండవుల నతి కర్కశంగా నిద్రలోనే రూపుమాపిన అశ్వత్థామను గూర్చి 'తల కొరిగితే చంపినట్టే' అన్నాడు కృష్ణుడు. అర్జును డా పద్ధతిలోనే అశ్వత్థామను చంపినాడు. రుక్మ.. అంగదుడు=బంగారు భుజ కీర్తులు గలవాడు.. అర్జునుడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ అంగుగ కృష్ణుడు తల గొరు
గంగను చంపినటులె యనె.. కౌంతేయుండున్
బొంగుచు నబ్భంగిని రు
క్మాంగదుఁ డనిలోనఁ జంపె నశ్వత్థామన్..
3 వ పూరణము:--
సందర్భము: ఉప పాండవుల నతి కర్కశంగా నిద్రలోనే రూపుమాపిన అశ్వత్థామను అర్జునుడు మానసికంగా వధించినాడు. ( శారీరకముగా కా దని భావము) గౌరవ భంగమే మృత్యువు కదా! రత్న.. అంగదుడు=రత్నాలు పొదిగిన భుజ కీర్తులు గలవాడు.. అర్జునుడు. ఈ పూరణములకు ప్రేరణ శ్రీ జివిఎస్ సహదేవుడు గారు. వారికి ధన్యవాదాలు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ అంగుగ నా పార్థుడు ర
(భీముడు అశ్వత్థామ అనే ఏనుగును చంపటం )
రిప్లయితొలగించండిఅంగలు వేయుచు భీముడు
సింగము బోలె న్నురుకుచు శీఘ్రమె గజమున్
జెంగున మోదుచు గదతో
నంగదు డనిలోన జంపె నశ్వత్థామన్ .
(అంగదుడు -క్రోధముతో నున్నవాడు )
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అంగదుడు' శబ్దానికి మీరిచ్చిన అర్థం ఏ నిఘంటువులోనూ లేదు. 'అంగదము కలవాడు' అని చూసిన అంగదమంటే క్రోధం అనే అర్థం లేదు. కేయూరం, దండకడియం అనే అర్థాలున్నవి.
శంకరార్యులకు నమస్సులు.బహుజనపల్లివారి శబ్దరత్నాకరంలో,ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడెమివారి తెలుగునిఘంటువులో
తొలగించండిఅంగద శబ్దానికి ఆకలి,ఆపద,ఉత్సాహం,ఉపద్రవం,కోపం అనేఅర్థాలు ఇచ్చారండీ.
నిజమే... అయితే మీరిచ్చిన అర్థాలతో అది దేశ్యం. దానికి అంగద కలవాడు అంగదుడు అన్న రూపం రాదు. సంస్కృత శబ్దం 'అంగద'కు దక్షిణ దిక్కున గల ఆడేనుగు అని అర్థం.
తొలగించండి
రిప్లయితొలగించండిబెంగ పడకే జిలేబీ !
డంగగు రీతిని శకారు డతడే గలడే !
చెంగట బిల్వంగ బలుకు
నంగదుఁ డనిలోనఁ జంపె నశ్వత్థామన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిదిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు మనకు సమస్యాపూరణాలలో శకారుడే దిక్కవుతాడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిగురవు శిష్యునితో......
విశ్వాసమ్మది లేదొ ! భారత కథావిశ్వమ్మునందెన్నగా
నాశ్వాసమ్ములు కాండలున్ గలవు స్కంధాదుల్ , పరీక్షించుచో
శశ్వత్ జ్ఞానము గల్గు, నల్పమతివై సాధింపగా, *నందువీ*...
*వశ్వత్థామను* జంపె నంగదుఁడు క్రూరాత్ముండునై పోరునన్" !!
( అందువు +ఈవు(నీవు)+అశ్వత్థామను)
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
టైపాటు కు మన్నించండి... గురువు శిష్యునితో.. అని ఉండాలి 🙏
తొలగించండిమైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగాంగేయుడెట్లు చంపెనొ
తొలగించండియంగదుని రణమ్మునందునంటివొ, యటులే
రంగా ! పరికింపుమురా!
అంగదుఁ డనిలోనఁ జంపె నశ్వత్థామన్"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిరారమ్మా !శకారా ! రారా :)
ఆశ్వాసమ్మతడే జిలేబి వినుమా ఆగాత్యమే మేలహో !
విశ్వాసమ్ము గొనమ్మ దుష్టుడయినన్ వేంచేపు చేయన్ దగున్
విశ్వంబంతయు నమ్ము రీతి పలుకున్ వేణీ శకారుండహో !
"అశ్వత్థామను జంపె నంగదుఁడు క్రూరాత్ముండునై పోరునన్"
చీర్స్
సావేజిత
జిలేబి
మీకు శకారుడు భలే దొరికాడండీ!!🤣
తొలగించండి🙏🏻
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వేంచేపు.... వేణీ"...?
బాగున్నది
తొలగించండిలొంగిన సేనను బలిమిన్
రిప్లయితొలగించండిఅంగదుడనిలోనఁజంపె;నశ్వత్థామన్
పొంగుచు ద్రోణుడు పిలిచెన్
సంగరమున్ వీర!ధీర!సల్పుమటంచున్
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బలిమిన్ + అంగదుడు = బలిమి నంగదుడు' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు. "సేనలను బలిమి। నంగదు డనిలోన..." అనండి.
ధన్యవాదములు
తొలగించండిగంగా! యుధిష్ఠిరుడపుడు
రిప్లయితొలగించండిసింగము వలె దూకి భీమ సేనుండచటన్
శృంగిని వధింప గపలికె
నంగదుడనిలో న జంపె నశ్వత్థామన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇక్కడ 'అంగదుడు' ఏ అర్థంతో గ్రహించారు?
రూఢిగా మహాకాయుని రూపడంచె
రిప్లయితొలగించండినంగదుఁ డనిలోనఁ, జంపె నశ్వత్థామన్
మానసికముగా పాండవ మధ్యముండు
పంచ పాండవులను చంప వంచనమది
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిచావు లేని అశ్వత్థామను మానసికంగా చంపడం అన్న భావనతో మీ పూరణ చాల బాగున్నది.
రెండవ పాదంలో గణదోషం. కంద పాదాన్ని తేటగీతిలో ఇమిడ్చే మీ పయత్నం ప్రశంసనీయం. కాని ఎన్ని విధాలుగా చూసినా అది సాధ్యం అయ్యే విధంగా లేదు.
ప్రయత్నం కాదు. పొరపాటు. మన్నించండి. తేటగీతి యనుకున్నాను. సరిగా చూడకుండా.
తొలగించండికంగుదిన, మహాకాయుని
నంగదుఁ డనిలోనఁ జంపె, నశ్వత్థామన్
ముంగురులు తునిమి చెచ్చెర
భంగము చేసెను మదమును పార్థుడు కసితో
పొంగి న రక్కసి మూకల
రిప్లయితొలగించండినం గ దుడని లోన జంపె ;న శ్వత్థామ న్
ముంగురులను ఖండిoచియు
భంగ ము తో సిగ్గు పడగ పార్థు డు వదలె న్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భృంగివలె నరాంతకునా
రిప్లయితొలగించండియంగదు డనిలోన జంపె; నశ్వత్ధామన్
శృంగము గొరుగగ పార్థుడు
భంగపరచె వానిసిగ్గు ప్రాణము గొనకన్!
సీతాదేవి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండిసింగము వోలె నసురులను
రిప్లయితొలగించండిఅంగదుడనిలోన జంపె,అశ్వద్దామన్
సింగమ్మై దుమికి కదన
రంగమున రిపులను జంపి రమ్మని బంపెన్
లంకలో రావణ సేనను అంగదుడ సింహమై చంపె.
రారాజు ద్రోణ సుతుని శత్రు మూకను చెండాడి రమ్మని పంపెను
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ద్వితీయార్ధంలో కర్తృపదం లేదు. "రిపులను జంప రారాజంపెన్" అనండి.
బాగున్నది
తొలగించండిఅంగన తారా సుతుడే;
రిప్లయితొలగించండిగాంగేయుని యర్జునుండు;ఘన ఫల్గుణుడే
సంగరమున బంధించెనె
"యంగదుఁ; డనిలోనఁ జంపె; నశ్వత్థామన్"
***)()(***
(ఆర్యా ! అన్వయము పొసగినదా?)
జనార్దన రావు గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"గాంగేయుని నర్జునుండు..." ఆనండి.
పొంగగ కోపము పోరున
రిప్లయితొలగించండిసింగగతిని అరిని భీమసేనుడు బట్టన్
రంగము గురుసుతు డైనను
అంగదుఁ డనిలోనఁ జంపె నశ్వత్థామన్
Dr H Varalakshmi
Bangalore
వరలక్ష్మి గారూ,
తొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం.
కొంత అన్వయలోపం ఉన్నది. 'సింగగతి' అన్న సమాసం సాధువు కాదు. "సింగపు గతి నరిని..." అనవచ్చు. 'అంగదుడు' ఏ అర్థంలో ప్రయోగించారు?
సింగము వలె రక్కసులను
రిప్లయితొలగించండియంగదు డనిలోన జంపె; నశ్వత్థామ
న్నింగిత రహితుని, బట్టియు
నంగన ముందు నిలిపె గద యర్జును డపుడున్.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రక్కసులను + అంగదుడు = రక్కసుల నంగదుడు' అవుతుంది. యడాగమం రాదు. "రక్కసులనె యంగదు..." అనవచ్చు.
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిపొంగుచునంబేడ్కరునిన్
అంగకు నొక విగ్రహమున హడలగ నిల్పన్
ఖంగు దినెన్ బ్రిటనెట్లన
అంగదు డనిలోన జంపె నశ్వత్థామన్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణలో కొంత సమన్వయం లోపించినట్లుంది. 'అంబేడ్కరునిన్ అంగకు' అని విసంధిగా వ్రాయరాదు కదా! ".... నంబేడ్కరునే। యంగకు..." అనండి.
డా.పిట్టానుండి}
తొలగించండిఆర్యా
మీ గ్రామర్ సలహాలను స్వీకరిస్తూ
బ్రిటనువారు గాంధీ,నెహ్రూ వంటి ఆనాటికి పోరాడిన సమర యోధుల విగ్రహాలుంటాయని ఆశించారు.కాని గూగుల్ మ్యాప్ లో అంబేడ్కర్ వియే కన్పించగా ఆశ్చర్య చకీతులైన విధంబెట్టిదనిన"(ఈ సమస్యా వాక్యము వలె పొంతనలేనిది,)ఆర్యా,
కందం
రిప్లయితొలగించండిభంగమొనర తలఁ గొరగ వ
రాంగము ఖండించినట్టులన హరి, నరుడా
సంగతి విలు విద్యా పా
రంగదుఁ డని లోన జంపె నశ్వత్థామన్!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పారంగతుడు' శబ్దం ఉంది. కాని 'పారంగదుడు' లేదు.
సవరించిస పూరణ పరిశీలించ ప్రార్థన
తొలగించండికందం
భంగమొనర తలఁ గొరగ వ
రాంగము ఖండించినట్టులన హరి, నరుడు
న్నంగీకరించి రగిలుచు
నంగదుఁ డని లోన జంపె నశ్వత్థామన్!
అంగద = కోపము
మీరు చెప్పిన అర్థంలో 'అంగద' తెలుగు పదం. దానితో అంగదుడు అన్న రూపం రాదు. తొందర కలవాడు తొందరుడు అన్న రూపం లేదు కదా! ఇదీ అంతే...
తొలగించండిఅంగద = కీడు
తొలగించండిగగురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన
తొలగించండిఅర్జునుడు అశ్వత్థామను చంపబోవునపుడు శ్రీకృష్ణుడు వారించి ఇతని తలగొరిగిన తలను ఖండించినట్లవుతుంది అదియే అతనిని చంపిన దానితో సమానమన అర్జునుడు ఆవిధంగా తలగొరిగి వదలి వేయు సందర్భం.
కందం
భంగమొనర తలఁ గొరగ, త
దంగము ఖండించినట్టు లదె చంపుటనన్
చెంగున నటులె నరుఁడు ర
త్నాంగదుఁ డని లోన జంపెనశ్వత్థామన్!
సహదేవుడు గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. రత్నాలు పొదిగిన అంగదము (భుజకీర్తి) కలవాడు అనే అర్థంలో చక్కగా సరిపోయింది. అభినందనలు.
శ్రీవెలుదండ వారి విలువైన సూచనలతో సవరించిన పూరణ :
తొలగించండిఅర్జునుడు అశ్వత్థామను చంపబోవునపుడు శ్రీకృష్ణుడు వారించి ఇతని తలగొరిగిన తలను ఖండించినట్లవుతుంది అదియే అతనిని చంపిన దానితో సమానమన అర్జునుడు ఆవిధంగా తలగొరిగి వదలి వేయు సందర్భం.
కందం
భంగమొనర తలఁ గొరగ, త
దంగము ఖండించినట్టు లదె చావను కృ
ష్ణుంగని యటులె నరుఁడు ర
త్నాంగదుఁ డని లోన జంపెనశ్వత్థామన్!
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిఅశ్వత్థామును(ఆము॥మోదము)గోతి జంపె ననుటన్ హా!పండితుండందుకో
నశ్వత్థంబను రావి కూలెనట "యయ్యా!"యంచు గార్హస్థ్యపుం
విశ్వద్భాసిత దేవ వృక్ష మణగన్ వేదార్థమే మ్రగ్గదే
అశ్వత్థామను జంపె నంగదుడు క్రూరాత్ముండునై పోరునన్?!(అవ్హ,అవ్హ!)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆము శబ్దానికి గర్వం, మదం అన్న అర్థాలున్నవి. మోద మన్న అర్థం లేదు. అయినా అది వైకృతం. దానిని అశ్వత్థ అన్న సంస్కృత శబ్దంతో సంధి ఎలా చేస్తారు?
డా.పిట్టానుండి}
తొలగించండిఆర్యా
ఆమిక॥ఆము,ముదము అని శ.ర.లో.దుష్ట సమాసాన్ని సవరించి సూచన నివ్వగలరు
మీరు సరిగా గమనించలేదు. ఆమిక శబ్దానికి ఆము, మదము అని అర్థాలిచ్చారు శ.ర.లో. ముదము కాదు.
తొలగించండికంగుదిన, మహాకాయుని
రిప్లయితొలగించండినంగదుఁ డనిలోనఁ జంపె, నశ్వత్థామన్
ముంగురులు తునిమి చెచ్చెర
భంగము చేసెను మదమును పార్థుడు కసితో
ఆర్యా! ముంగురుల ప్రయోగము చాలమంది చేసినారు! ముంగురలన నలకలు గదా! అశ్వద్ధామకు తలమొత్తం గొరిగినాడు గదా పార్ధుడు! పరిశీలింప మనవి!
తొలగించండిఅన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
సీతాదేవి గారూ,
మీరన్నది నిజమే. అయితే చాలమంది ప్రయోగించారని మీరే అన్నారు కనుక ఈసారికి ఇలా కానిద్దాం! "నలుగురితో నారాయణ!"
విశ్వామిత్రుని జంపె యుద్ధమున తా విద్యాధరుండక్కటన్
రిప్లయితొలగించండివిశ్వంబందున కాశ్యపేయుడట చంపెన్ రాహువున్ క్రూరుడై
*యశ్వత్థామను జంపె నంగదుఁడు క్రూరాత్ముండునై పోరునన్*
వే శ్వానమ్మును పిల్లి చంపెనకటా వింతల్ గదా స్వప్నముల్
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
శ్రీహర్ష గారూ,
తొలగించండిమీ స్వాప్నిక పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువు గారికి నమస్కారములు
రిప్లయితొలగించండిక్షమించాలి
నేను పండితుడను కాను రిటైర్డ్ MPDO ను
ఛంధస్సు తో నాకు పరిచయం లేదు
అయినను సాహిత్యమన్న మిక్కిలి మక్కువ
అందుకే నా ఈ ప్రయత్నం
"రాముడి సమరం తానది ధర్మముతో సాగినది
కురుసంగ్రామమది చూడ అధర్మమై ఊగినది
బండలు విసిరి అసురుల అంగదుడనిలోన జంపె
నశ్వథ్థామన్ బంపె రాజు చీకటి బరి తెగింపె "
(మాత్రా గణనము - అంత్య ప్రాస మాత్రమే )
రమేశ్ గారూ,
తొలగించండిమీ సాహిత్యాభిరుచి ప్రశంసనీయం. సంతోషం.
మీరు వ్రాసిన కవితలో మాత్రాగణనం కూడా సరిగా లేదు.
ముందుగా పోతన, కరుణశ్రీ, జాషువా, వేమన మొదలైనవారి పద్యాలు చదవండి. బ్లాగులో కవిమిత్రుల పూరణలను పరిశీలించండి. ఛందస్సు తెలుసుకొనండి. పద్యరచనా ప్రయత్నం చేయండి. దారి చూపడానికి నేను, కవిమిత్రులం ఉండనే ఉన్నాం. స్వస్తి!
అంగన నవమానించ వ
రిప్లయితొలగించండిరాంగ సహస్ర బల భీముఁ డాగ్రహ మది పా
రంగఁగఁ గీచకుఁడు సువ
ర్ణాంగదుఁ డ,నిలోనఁ జంపె, నశ్వత్థామన్
[అశ్వత్థామ = అశ్వ తుల్య బల సంపన్నుఁడు, సింహబలుడు , అశ్వ సింహములు శ్రేష్ఠ వాచకములుగా]
ఆశ్వాసమ్మును నీయ రాజునకు దుష్టానీక సాహాయ్యమున్
విశ్వాసమ్మున సిగ్గు వీడి కొని తా భీతిల్లి ఘోరమ్ముగన్
విశ్వం బెల్ల వెఱంగుఁ జెంద ఘనుఁ డా వీరాభిమన్యున్ సహ
శ్రాశ్వత్థామను జంపె నంగదుఁడు క్రూరాత్ముండునై పోరునన్
[అశ్వత్థామ = అశ్వ తుల్య బల సంపన్నుఁడు; అంగదుఁడు = అంగములను (సాంగ జనిత కవచ కుండలములు) దాన మిచ్చిన వాఁడు, కర్ణుఁడు]
పూజ్యులు శంకరయ్య గారికి విజ్ఞులు శ్యామల రావు గారికి వందనములు.
తొలగించండిసింధువు, సముద్రము నందు పుట్టిన వాఁడు , చంద్రుఁ డని ప్రయోగించితిని. ఇక్ష్వాకు కులమును కూడా సముద్రముతో బోల్చితిని కదా యని.
మీరన్నట్లుగా ధారా భంగముగనే తోచుచున్నది.
గురువు గారి సూచన చక్కగా నమరినది. దానినే గ్రహించు చున్నాను. ధన్యవాదములు.
ఇక్ష్వాకు ప్రవ రాబ్ధి పూర్ణ శశి దైత్యేంద్రక్షయార్థైక జ
న్మ క్ష్వేడా స్వన సత్య వాక్చతుర సంభావ్యుండు ధానుష్కుఁడున్
సక్ష్వింక వ్రజ భాను సూన సఖుఁడున్ సద్ధర్మసత్పాలుఁడున్
సుక్ష్వేళాత్త గళాంబికా పతి దయాంశు శ్రేణి లబ్ధుండు ప్రా
ప్త క్ష్వేళి ద్విష పుంగ వానురతినిం బ్రార్థింతు సీతాపతిన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
నా సవరణను స్వీకరించినందుకు ధన్యవాదాలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅంగజ మొందిన దనుజుల
నంగదు డనిలోన జంపె; నశ్వత్థామన్
భంగపఱచె బీభత్సుడు
సంగర మందున శరముల సంధానముతో
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"అంగజము గ్రోలు దనుజుల..." అంటే బాగుంటుందేమో?
రంగంబందున శత్రుని
రిప్లయితొలగించండిఅంగదుడనిలోన జంపె!నశ్వత్థామన్
బంగ పడంగనుపార్థుడు
సంగారపు కురులు దరిగె సిగ్గుబడంగన్!
దయచేసిచివరిపాదం మొదటసింగారపుకురులుఅనిచదువకోరుచున్నాను
రిప్లయితొలగించండిఈశ్వరప్ప గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"శత్రువు । నంగదు డనిలోన... భంగపడంగను..." అనండి.
ఇక్కడ సమస్యాపూరణలు చేస్తున్నవారికున్నంత విద్వత్తు నాకు లేదు. అర్జునుడు అశ్వత్థామ ని చంపే బదులు తల గొరిగాడని కొంతమంది ఇక్కడ వ్రాసారు. మహాభారత కథ గురించి నాకు గుర్తున్నంత వరకు అటువంటిది జరగలేదు. చంపే బదులు అతని శిరోమణి ని తీసుకుంటాడు అర్జునుడు పెద్దల సలహాననుసరించి. అందువలన ఈ సమస్యాపూరణానికై ఆ అన్వయింపు సరికాదేమోనని నా మనవి.
రిప్లయితొలగించండి(తల / మీసం గొరగడం జరిగినది రుక్మి, జయద్రధుడు (సైంధవుడు) విషయంలో)
నరసింహా రావు గారు నమస్సులు. ఈ వృత్తాంతము శ్రీమదాంధ్ర మహా భాగవతములో నున్నది. ఈ పద్యమును తిలకించండి.
తొలగించండివిశ్వస్తుత్యుఁడు శక్ర సూనుఁడు మహా వీరుండు ఘోరాసిచే
నశ్వత్థామ శిరోజముల్ దఱిఁగి చూడాంతర్మహారత్నమున్
శశ్వత్కీర్తి వెలుంగఁ బుచ్చుకొని పాశవ్రాత బంధంబులన్
విశ్వాసంబున నూడ్చి త్రోచె శిబి రోర్వీ భాగముం బాసి పోన్
భారతమున నర్జునుఁడు ద్రోణ సూనుని పరిభూతుని చేసెనని క్లుప్తముగా భీముఁడు ద్రౌపదికి చెప్పెను సౌప్తిక పర్వములో.
కామేశ్వర రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
పొరబడుతున్నారు. భారతపద్యంలో శిరోజములు తరగుట శిరోరత్నాన్ని గ్రహించుటకే కాని శిరోముండనం లేదక్కడ. ఉందని అనుకోవటానికి అవకాశం పద్యం నుండి పిండవచ్చును. కాని కథలో శిరోరత్నపరిగ్రహణం స్పష్టంగానే ఉన్నది.
తొలగించండిశ్యామలరావు గారూ, ధన్యవాదాలు.
తొలగించండిపైన సౌప్తికపర్వం ప్రసక్తి వచ్చింది కాబట్టి :-
(కవిత్రయ) మహాభారతం సౌప్తిక పర్వం లోనే ద్వితీయాశ్వాసంలో 75 వచనంలో -
“..... ధర్మంబున జయంబు గొన నోపిన యిప్పార్థుండును బ్రీతుండై చనవలయు; భవదీయ శిరోమణి యీతని కిమ్మట్లయిన నితండ కా(డు, పాండవులందఱును నీ దగు జీవనంబు నపహరించినంతయ సంతసిల్లుదు రిది సమీచీనంబయిన సంధిప్రకారం బిట్లు సేయుట మేలు .....”
అని వ్యాసుడు అశ్వత్థామతో అన్నాడని తెలుస్తోంది.
తరువాత 88 వచనంలో -
“ ..... యశ్వత్థామ ..... తన శిరోమణి పాండవుల కిచ్చి తపోవనంబునకుం జనియె”
అనిన్నీ తెలుస్తోంది.
కామేశ్వరరావు గారికి నమస్కారం. మీరన్నట్లు, తరువాత 95 లో భీముడు ద్రౌపదితో ఇలా అంటాడు 👇
క. గురుతనయు( డగుట( బ్రాణము । హరియింప(గ( జొరక విజయు( డశ్వత్థామం
బరిభూతు( జేసి యాయుధ । పరిగ్రహము తోడ( లజ్జ( బాయం జేసెన్.
అంటే మీరన్నట్లు అవమానం చేసి పంపించాడు, కానీ శిరోముండనం జరిగినట్లనిపించదు 🙏.
“.. వాని శిరమున్ ఖండించి నేఁ దెత్తుఁ దచ్ఛిరముం ద్రొక్కి జలంబు లాడు మిచటన్ శీతాంశు బింబాననా” యని యర్జునుఁడు ద్రౌపదికి శపథము చేసెను.
తొలగించండి"ద్రౌపదికి నాకు భీమ సేనునకు సమ్మతంబుగ మున్న నీ చేసిన ప్రతిజ్ఞయు సిద్ధించు నట్లు నా పంపు సేయుమని" శ్రీకృష్ణుఁడు చెప్పగా నర్జునుఁ డట్లు చేసెను.
ధనము గొనుట యొండె దలఁ గొఱుగుట యొండె... అన్న తదుపరి పద్యము.
ప్రతిజ్ఞ నెఱవేఱ వలెనన శిరోఖండనము గాని తత్సమమైన శిరోముండనము గాని జరుగా వలెను కదా.
భారత భాగవత పాఠములలో భేదములు కనిపించును. భారతములో నశ్వత్థామ స్వయముగా నర్జునునకు రత్నము నిచ్చును. భాగవతములో నర్జునుఁడే బలిమిని తీసుకొనును.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి(యాదవకులమున ముసలము పుట్టిన వృత్తాంతము నొక్క గొల్లఁడు, నరకలోకమందు, యమధర్మరాజునకు విన్నవించుచున్న సందర్బము)
"శశ్వత్కీర్తివిశిష్టులైన యజపుల్ సయ్యాటలాడంగఁ, ద
ద్విశ్వామిత్రవశిష్ఠకణ్వభృగుసద్బృందమ్ము, కోపోగ్రతన్,
విశ్వాభీరకులక్షయాభిలషితాభీలాభిశాపమ్మిడన్,
విశ్వాసమ్ము తలిర్పలేని ముసలంబే పుట్టఁగాఁ, జంపె వీఁ
డశ్వత్థామను; జంపె నన్ గదుఁడు క్రూరాత్ముండునై పోరునన్!"
మధుసూదన్ గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
కాని సమస్యలోని గదుడుకు పూర్వమున్న అనుస్వారాన్ని ద్రుతంగా మార్చడం విషయంలోనే సందేహం.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ! నాకును ఈ విషయంలో ఇప్పుడు సందేహం కలుగుతున్నది. పరిశీలించవలసియున్నది.
తొలగించండిశార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించండివిశ్వాసమ్మున ద్రోణుఁ గూల్చు కతనన్భీముండు కాళింగమౌ
యశ్వత్థామను జంపె! నంగదుఁడు క్రూరాత్ముండునై పోరునన్
విశ్వాసమ్మున రాముఁ గూడి దునిమెన్ వీరున్ మహాకాయునే!
విశ్వంబందునఁ జేయ లేని పనులే? విశ్వాసమాత్రంబునన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా 🙏
తొలగించండిరవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భ్రాతానతి' అనడం సాధువు కాదు. అక్కడ "భ్రాత పనుపునన్" అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి👇ఈ పద్యము శ్రీ రాజశేఖరావధాని గారు రచించి... వారికి ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడంతో నన్ను పంపుమనిరి... అవధరించండి...
తొలగించండిఅశ్వత్థామ యనంగ హస్తి , కురురాజే యంగదుండౌను , దా
శశ్వత్కీర్తుల నంగ రాజ్యము ప్రశస్తిన్ దానమున్ జేయుటన్ !
విశ్వాసింపు, మతండు
జంపె కరి , నా వృత్తాంతమున్ గాంచుచో
నశ్వత్థామను జంపె నంగదుఁడు క్రూరాత్ముండునై పోరునన్ !
శ్రీ కోట రాజశేఖర్ నెల్లూరు
పైపద్యంలో యతిమైత్రుల గురించి ఆలోచించాలి.
తొలగించండిరాజశేఖర్ గారి పూరణలో అంగరాజ్యాన్నిచ్చినవాడు కనుక దుర్యోధనుడు అంగదు డయ్యా డని చెప్పడం వైవిధ్యంగా ఉంది. పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిశ్యామలీయం గారన్నట్టు మొదటి, రెండవ పాదాలలో యతి తప్పింది. 'కురురా జా యంగదుం డౌను... రాజ్యమును ప్రాశస్త్యంబుగా నిచ్చుటన్..." అంటే ఎలా ఉంటుంది?
*****
శ్యామలీయం గారూ,
ధన్యవాదాలు.
👇ఈ పద్యము శ్రీ రాజశేఖరావధాని గారు రచించి... వారికి ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడంతో నన్ను పంపుమనిరి... అవధరించండి...
తొలగించండిఅశ్వత్థామ యనంగ హస్తి ,కురురాజౌనంగదుండన్న , దా
శశ్వత్కీర్తుల నంగ రాజ్యము ప్రశస్తిన్ దానమున్ జేయుటన్ !
విశ్వాసింపు, మతండు
జంపె కరి , నా వృత్తాంతమున్ గాంచుచో
నశ్వత్థామను జంపె నంగదుఁడు క్రూరాత్ముండునై పోరునన్ !
శ్రీ కోట రాజశేఖర్ నెల్లూరు
రిప్లయితొలగించండిసింగమువలె తా రక్కసు
నంగదుడనిలోన జంపె,నశ్వత్థామన్
సంగరమందున పార్థుడు
భంగపరుపనెంచె తాను భార్యయు కోరన్.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సహృదయులు అగు శ్రీ శ్యామలీయం గారికి భక్తిపూర్వక ప్రణామాలు. ఆర్యా! తమరి సందేశాన్ని చూచినానండీ. మీరన్నట్లుగానే నా పద్యంలో మొదటి రెండవ పాదాలలో యతి మైత్రి తప్పింది. *కురురాజౌ నంగదుం డన్న* అని *రాజ్యము బ్రశంసన్* అని మార్పు చేయదలచినానండీ. సవరణతో చదువవలసినదిగా ప్రార్థన. భవదీయుడు కోట రాజశేఖర్.
రిప్లయితొలగించండిఅవధాని మైలవరపు మురళీకృష్ణ గారికి భక్తిపూర్వక ప్రణామాలు.
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గురువర్యులకు భక్తిపూర్వక ప్రణామాలు.
రిప్లయితొలగించండి*27-3-18*...సమస్య
రిప్లయితొలగించండి*"అంగదుఁ డనిలోనఁ జంపె నశ్వత్థామన్"*
సందర్భము: ఉప పాండవుల నతి కర్కశంగా నిద్రలోనే రూపుమాపిన అశ్వత్థామను గూర్చి 'మనిషికి గౌరవ భంగమే మృత్యు' వన్నాడు కృష్ణుడు. అర్జును డా విధంగానే అశ్వత్థామను చంపినాడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
అంగుగ "మనిషికి గౌరవ
భంగంబే మృత్యు" వనుచు పలికిన హరి మో
ముం గని, యటులే నరుడు స
దంగదుఁ డనిలోనఁ జంపె నశ్వత్థామన్
2 వ పూరణము:--
సందర్భము: ఉప పాండవుల నతి కర్కశంగా నిద్రలోనే రూపుమాపిన అశ్వత్థామను గూర్చి 'తల కొరిగితే చంపినట్టే' అన్నాడు కృష్ణుడు. అర్జును డా పద్ధతిలోనే అశ్వత్థామను చంపినాడు.
రుక్మ.. అంగదుడు=బంగారు భుజ కీర్తులు గలవాడు.. అర్జునుడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
అంగుగ కృష్ణుడు తల గొరు
గంగను చంపినటులె యనె.. కౌంతేయుండున్
బొంగుచు నబ్భంగిని రు
క్మాంగదుఁ డనిలోనఁ జంపె నశ్వత్థామన్..
3 వ పూరణము:--
సందర్భము: ఉప పాండవుల నతి కర్కశంగా నిద్రలోనే రూపుమాపిన అశ్వత్థామను అర్జునుడు మానసికంగా వధించినాడు. ( శారీరకముగా కా దని భావము) గౌరవ భంగమే మృత్యువు కదా!
రత్న.. అంగదుడు=రత్నాలు పొదిగిన భుజ కీర్తులు గలవాడు.. అర్జునుడు.
ఈ పూరణములకు ప్రేరణ శ్రీ జివిఎస్ సహదేవుడు గారు. వారికి ధన్యవాదాలు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
అంగుగ నా పార్థుడు ర
త్నాంగదుఁ డనిలోనఁ జంపె నశ్వత్థామన్
రంగుగ మానసికమ్ముగ...
భంగం బయినట్టి గౌరవము మృత్యు వగున్
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు.
కోట రాజశేఖర్ - సమస్యాపూరణ
రిప్లయితొలగించండిఅశ్వత్థామ యనంగ హస్తి , కురురా జౌ నంగదుం డన్న , దా
శశ్వత్కీర్తుల నంగ రాజ్యముఁ బ్రశస్తిన్ దానముం జేయుటన్,
విశ్వాసింపు మతండు జంపె కరి , నా వృత్తాంతమున్ గాంచుచో
*నశ్వత్థామను జంపె నంగదుడు దుష్టాత్ముండునై పోరునన్.*
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (27.3.2018)
విశ్వంబంతయు నొప్ప నర్జునుడు తా వేధించి బోడించెరా
రిప్లయితొలగించండియశ్వత్థామను;...జంపె నంగదుఁడు క్రూరాత్ముండునై పోరునన్
శశ్వత్కీర్తి గడించ రాక్షసులనా చక్కన్ని శ్రీలంకలో...
నిశ్వాసమ్ములు వచ్చెనా కికనిటన్ నిద్రించు వేళాయెగా