19, మార్చి 2018, సోమవారం

కోకిలా చిత్ర సర్వ లఘు బంధ తేటగీతి మాలిక

అనిముకము  తనివి తొడరి ఘన  కరకపు
              పతన నయపు విటపములను కతికి కుతిక
              తెరచి మధుర పదములును తెలచి   వనజ
              హితునకు ఘనముగ పలికె నుతులు మహిని
 అర్ధములు
అనిముకము =కోకిల ,తనివి =తృప్తిగా,    తొడరి =పొంది ,   కరకపు = మామిడి,  పతన =    ఆకులు,
నయపు =సుకుమారపు  , విటపము=   చిగురు ,  కతికి = తిని,  కుతిక =   గొంతు,    పదములను =        పాటలను,  తెలచి =  వర్ణింఛి  ,వనజ హితునకు =  సూర్యునకు   నుతులు = స్తోత్రములు  పలికే

కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 

11 కామెంట్‌లు:

 1. చక్కని వర్ణన,చిత్రీకరణ పూసపాటివారూ! అభినందనలు! 💐💐💐

  రిప్లయితొలగించండి
 2. అర్ధ సహితపు పద్యమ్ము జదువ దెలిసె
  తెలియ నటువంటి పదములుచాలయుండె
  మారు మూలనగలయట్టి మాండలికపు
  పదముల నేనేరితెచ్చు మహితుడవుగదా

  రిప్లయితొలగించండి
 3. కృష్ణ సూర్య కుమార్ గారు మీ కోకిలా చిత్ర సర్వ లఘు బంధ తేటగీతి బాగుంది.
  అనిమకము. ముద్రణ దోషము.
  రెండవ పాదములో గణ దోషము దాని వలన యతి భంగము.
  సుకుమార మను నర్థమున “నయము” దేశ్య పదము. పతన నయపు దుష్ట సమాసము.
  పరిశీలించండి.

  రిప్లయితొలగించండి
 4. నమస్కారములు
  చక్కని కోకిల చిత్రముతో తేనె లొలుకు తేట గీతి అద్భుతముగా నున్నది . అభినందనలు

  రిప్లయితొలగించండి