30, మార్చి 2018, శుక్రవారం

దత్తపది - 136 (అమ్మ-అయ్య-అన్న-అక్క)

అమ్మ - అయ్య - అన్న - అక్క
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

50 కామెంట్‌లు:

 1. తండ్రి మాటను రామయ్య తలను దాల్చె
  భర్త తోడనె సీతమ్మ భాగ్యమనియె
  అన్న వెంటనె లక్ష్మన్న యడవి జనియె
  ధరణి నిలిచేరు నక్కర ధర్మపరులు.

  రిప్లయితొలగించండి
 2. రాము నమ్మది తగిలిన రక్కసుండు
  బొంకదలచుచు నయ్యకళంకు నెదుట
  "హాహ లక్ష్మణ!లక్ష్మణా!"యన్న కేక
  నక్కజమ్ముగ విని సీత యంపె మరది.

  రిప్లయితొలగించండి
 3. వలజ సీతమ్మయె యశోక వనమునందు
  నన్నపానములు తినక నలిగె నామె !
  అక్కడికి కోసలేశు రామయ్య వెడలి
  దుష్ట రావణుని యనిన దునిమె నతడు!

  రిప్లయితొలగించండి

 4. విభీషణుడు శరణుకోరగ లంకను గెలువక మునుపే ధారవోసిన రాఘవుడు

  అభయమ్మాతడు కోరగ
  శుభముగ రాజ్యంబతనికి శూకముతో ని
  చ్చె భవుడు రాఘవుడయ్యా!
  సభయచ్చెరువక్కడయ్యె సఖుడన్నరయన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. దత్త పదాలను అన్యార్థంలో ప్రయోగించాలి. రామయ్య, సీతమ్మ, రామన్న అంటే స్వార్థంలో ప్రయోగించినట్లే. గమనించ మనవి.

  రిప్లయితొలగించండి
 6. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  నేటి అంశము::దత్తపది (136)
  ఇచ్చిన పదాలు :: అమ్మ అయ్య అన్న అక్క (అన్యార్థంలో)
  విషయము :: రామాయణార్థం
  ఛందస్సు :: ఏ ఛందస్సులోనైనా పద్యం వ్రాయవచ్చు.
  సందర్భం :: అన్నయైన శ్రీ రామునితో అడవికి వెళ్లేందుకు సిద్ధమై మాతృదీవెన కోసం వచ్చిన లక్ష్మణునికి సుమిత్రమ్మ ఆశీస్సుల నందజేస్తూ కుమారా! లక్ష్మణా! సంతోషంగా అన్నకు తోడుగా అడవికి వెళ్లు. అక్కడ మీ అన్నయైన శ్రీ రాముని నీ తండ్రియైన దశరధ మహారాజుగా భావించి సేవించు. మీ వదినయైన సీతమ్మను నీకు తల్లినైన నన్నుగా భావించి రక్షించు. ఆ దండకారణ్యాన్ని అయోధ్యగా భావించి పరిపాలించు అని హితోపదేశం చేసిన సందర్భం.
  ఈ విషయము వాల్మీకి రామాయణంలోని అయోధ్యాకాండలో 40 వ సర్గలో 9 వ శ్లోకంలో ఈ క్రిందివిధంగా చెప్పబడింది.
  * రామం దశరథం విద్ధి ,
  మాం విద్ధి జనకాత్మజామ్ ।
  అయోధ్యామ్ అటవీం విద్ధి ,
  గచ్ఛ తాత! యథాసుఖమ్ ।।*
  దత్తపది పూరణ
  *అమ్మ* నుజాధిపున్ దశరథాధిపుగా గనుమయ్య రాము , నీ
  కమ్మగ జెప్పుచుంటి గను *మ య్య* టవీస్థలినే యయోధ్యగా,
  నమ్మగ జూడు లక్ష్మణ సుతా! జనకాత్మజ *నన్న* దా సుమి
  త్రమ్మ కుమారు తోడ, విన *నక్క* జమౌ, నటు కాన కంపెగా.
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (30-3-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆదర్శమైన పద్యము
   మోదం బిడునట్టి పద్యమును నియ్యదియే!
   వాదంబు వీడి చూచిన
   నీ దత్తపదికి తగినది యీ పద్యంబే!
   ~వెలుదండ సత్యనారాయణ

   తొలగించండి
 7. గురువు గారు మీ సూచనలమేరకు మార్చితిని...పరిశీలించగలరు..


  తే.గీ

  అయ్యవనిజ లంకాపురినందున మరి

  అన్నపానములు తినక నలిగె నామె !

  అమ్మనోహరు రఘురాముడక్కడ చని

  దుష్ట రావణుని యనిన దునిమె నతడు!

  🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
  ☘ వనపర్తి☘

  రిప్లయితొలగించండి
 8. రిప్లయిలు

  1. “అన్న”పానములడగని,యలుపులేని
   విద్య “నమ్మ“హాముని నేర్పె ప్రీతితోడ
   “నక్క“రగునని మున్ముందు నెక్కడైన
   రామలక్ష్మణుల కచట రక్షగాను
   “నయ్య“తిబలాబలమ్ముల నయ్యె జయము!

   తొలగించండి
 9. మైలవరపు వారి పూరణ


  అయ్య రామయ్య భర్త యయ్యవనిజకిల
  అమ్మ సీతమ్మ జూడగా నమ్మహీజ !
  అన్న హనుమన్న యన్న మాకాప్తుడతడె !
  అక్కపీంద్రుడు తోడు మాకక్కజముగ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అయ్యనిలజుడు దా నయ్యనలమ్మున
   నంటించి మేడలనందె ముదము!
   అమ్మరుత్సూనుండు నమ్మహీజమ్ముల
   గెంతుచు బొందెను సంతసమ్ము !
   అన్నర్తనముఁ జేసి యన్నటరాట్తాండ
   వమ్ముగా భావించి బడసె దృప్తి !
   అక్కపీంద్రుడు లంకనక్కజమ్ముగ గాల్చి
   నవ్వుల దేలి యానందమందె !

   అమ్మ సీతమ్మ జేరి దానంజలించి
   అయ్య రామయ్యముద్రికనందజేసి
   అన్నవవ్యాకరణపండితాగ్రణి జని
   అక్కజమ్ముగ రామకార్యమ్ము దీర్చె !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. శ్రీ లక్ష్మీకాంత రాజారావు గారికి ధన్యవాదాలు..... ఏమరుపాటునకు మన్నించండి...🙏

   అయ్యనిలజుడు దా నయ్యనలమ్మున
   నంటించి మేడలనందె ముదము!
   అమ్మరుత్సూనుండు నమ్మహీజమ్ముల
   గెంతుచు బొందెను సంతసమ్ము !
   అన్నర్తనముఁ జేసి యన్నటరాట్తాండ
   వమ్ముగా భావించి పడసె దృప్తి !
   అక్కపీంద్రుడు లంకనక్కజమ్ముగ గాల్చి
   నవ్వుల దేలి యానందమందె !

   అమ్మ సీతమ్మ జేరి దానంజలించి
   అయ్య రామయ్యముద్రికనందజేసి
   అన్నవవ్యాకరణపండితాగ్రణి జని
   అక్కజమ్ముగ రామకార్యమ్ము దీర్చె !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 10. సీత జాడ చెప్పమని రాముడు చెట్లని పుట్టలనీ వేడుకొనే సందర్భం :-
  ఆ.వె.
  అమ్మహీసుతనెవరపహరణముచేసె
  నయ్యదిఁ దెలిసి వనమందునెవరు
  నోరువిప్పరేల? మీరన్న తరులార
  యక్కరకునురారె నిక్కనేల?

  రిప్లయితొలగించండి
 11. అన్నరపతి చేరె ను లంక నాడ్య ముగను
  ధీరుల గు కపులయ్యని తి ర ము గాగ
  సాయ మందిoచ నమ్మ హా సంగరము న
  జంపె రావణు నక్క డే శక్తి జూపి

  రిప్లయితొలగించండి
 12. అక్కసన్నది రావణ మక్కువనుచు
  లంక జేర్చెను సీతమ్మ !"సంకటాన
  యుండ?హనుమన్న గనుగొనియోర్చుకొమ్ము
  రామచంద్రయ్య రావణున్ రయముజేయు:

  రిప్లయితొలగించండి
 13. యాగము జేయగా నన్నకోష్ఠకుడు కౌసల్యకు జన్మించె,సవతి కైక
  తన యమ్మడుగలను దాశరధి మెడలో వాత్సల్య మొంది సవత్ని సుతున
  కొసగి గారవముగన్ కొమరుని కన్న మిన్నగ బెంచె, నక్కటా నాతి మనము
  న యనుంగు నెచ్చెలి నాటిన విష బీజము పెరిగి పెద్దదై ముద్దు బిడ్డ

  భరతునికి రాజ్య మిమ్మని భర్త నడిగి
  వనికి నయ్య న్నను వడిగన్ యనచ మనుచు
  గోరె, తండ్రి మాటను దీర్చ కొమురుని విధి
  యని దలచి రాముడు సతితో వనికి వెడలె

  అన్నకోష్ఠకుఁడు : ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
  1 విష్ణువు.2. సూర్యుఁడు.
  అమ్మడుగులు : శబ్దార్థ దీపిక (ముసునూరి వేంకటశాస్త్రి) 1956
  దే.వి.
  • ఒకవిధమగు కంఠహారము.
  అయ్యన్న : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 గ్రంథసంకేత వివరణ పట్టిక
  వి.
  • అయోధ్యారాముడు.

  రిప్లయితొలగించండి
 14. అమ్మయుతనయ దశకంఠు కపుడు జెప్పె
  నయ్యసురపతియె విడువ నాజనకజ
  నక్కజమ్మగు నీమాటలనుచు నతడె
  అన్నరుండేమి జేయులే యనెను మిడిసి.

  రిప్లయితొలగించండి
 15. అమ్మహీపతి సభలోని కరిగి వేగ
  యయ్యవసరమున నిలిచి యందరు గన
  యక్కజముగను విలుద్రుంచి యక్కడున్న
  యన్నళినలోచనను శౌరి యందు కొనియె

  రిప్లయితొలగించండి
 16. కందం
  అమ్నన్యువుఁ గాపాడియు
  నెమ్మది వని నయ్యహల్య నేరముఁ ద్రొక్కెన్
  సమ్మోహనుడన్న ప్రభువు
  యమ్మదనారి విలుఁ ద్రుంచె నక్కజుఁడగుచున్ !

  రిప్లయితొలగించండి


 17. *ఆ.వె**

  *అన్న* పానియాల *అమ్మ* కమ్ములు లేవు
  ఐకమత్య భావ *మక్క* డంత
  *అయ్య* దేనురాజ్యమంటేనని పొరగు
  రాజ్య స్తుతని వేగు రామునితోచెప్పె
  ..............✍చక్రి

  రిప్లయితొలగించండి
 18. అమ్మయ్య!!! అక్కరన్నది
  ముమ్మాటికి లేదు నాకు ముచ్చట తీరెన్
  కమ్మగ లంకను కాల్చితి
  వమ్మయె రావణుని వనము వాలము వలనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అమ్మ ప్లస్ అయ్య ..... అమ్మయ్య అగునని నాతలపు

   అగునెడ అన్న్యార్థ నిబంధన నతిక్రమించినట్లు కాదా

   ...భట్టారం రాధాకృష్ణయ్య

   తొలగించండి
  2. అమ్మయ్య! ఒకటే పదము. దాని అర్ధము అమ్మకు అయ్య (తాత) కాదు. విరుపు కోసం మాత్రమే (అమ్మ + అయ్య)

   ...ప్రభాకర శాస్త్రి

   తొలగించండి

  3. జీపీయెస్ వారు మీకో సమస్య :)

   సాంత్వంబును విడువు మమ్మ చక్కని చుక్కా !


   జిలేబి

   తొలగించండి
 19. రిప్లయిలు
  1. అమ్మనుజేంద్ర తనయ సతి
   నమ్మానవతీ లలామ నయ్యవనిజనే
   యమ్మనుజాన్న గణ ధవుఁడు
   నమ్మాయావియు హరించె నక్కపటి వనిన్

   తొలగించండి
 20. మిత్రులందఱకు నమస్సులు!

  అమ్మహారణ్యమందున నధివసించె
  నయ్యసుర సమూహమ్ముల నణఁచి యణఁచి,
  యన్నరుఁడు రాముఁ డతివ సీతమ్మతోడ,
  నక్కజముగ సేవించు లక్ష్మన్నతోడ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మాన్యులు చక్రాలవారి సూచన ననుసరించి, మొదటి పాదమునఁ జిన్న మార్పునుఁ జేసి ప్రకటించుచున్నాను.

   చక్రాల వారికి మనఃపూర్వక ధన్యవాదములు!

   అమ్మహారణ్యమందుఁ దా నధివసించె
   నయ్యసుర సమూహమ్ముల నణఁచి యణఁచి,
   యన్నరుఁడు రాముఁ డతివ సీతమ్మతోడ,
   నక్కజముగ సేవించు లక్ష్మన్నతోడ!

   తొలగించండి
 21. అమ్మకచెల్లా రాఘవు
  డమ్మో విల్లెక్కు బెట్టె నయ్యయొ విరిగింది
  దమ్మా చూడుం డక్కలి
  కిమ్ముగ వరియించు నిప్పుడే రామన్నన్.

  రిప్లయితొలగించండి
 22. తండ్రి రామయ్య తల్లి సీతమ్మ సతము
  తోడుగానుండు లక్ష్మన్న వేడుకొందు
  నక్కరలు దీర్చి మమ్ముల నాదు కొనగ
  స్వర్గమునకు తోడ్కొని పోవ సత్వరముగ

  రిప్లయితొలగించండి
 23. అమ్మహాముని సైగను హరుని ధనువు
  నయ్యవనిజనులు బొగడ నందరెదుట
  నక్కజముగ ద్రుంచిన రాము డాదరమున
  నన్నళిననదళ నయన నందుకొనియె!

  రిప్లయితొలగించండి
 24. డా.పిట్టాసత్యనారాయణ
  "అక్క"ట "సీతగాథ" యన "నయ్య"దె వృత్తము"రాము" బేరునన్
  నిక్కముగా బ్రచారమున నేరుపుగా మనుపన్ విచిత్రమౌ
  అక్కజ మాయె నారులకు "నమ్మ"హితాత్ముడె యగ్ని దేల్చగా
  దిక్కెవ"రన్న" భూమిజొరె ధీరత నాతిని నిల్ప జేతగన్!

  రిప్లయితొలగించండి
 25. నమ్మకము కోలు పోవగ నారి సీత
  సవన మెట్లయ్య జేయును సతియె [సవతి]లేక
  అక్కజము గాదె విన్నంత మిక్కు టముగ
  దారి తప్పుట గాదన్న ధరణి వినగ

  రిప్లయితొలగించండి
 26. ఫాలనేత్రుని విల్లునక్కట వంచి ద్రుంచగ రాముడే
  లీల గాంచిన సీత యన్నన!లేత సిగ్గుల మొగ్గయై
  మాలవైచెను కంఠమందున మాన్య రాముని కయ్యరో
  పూలు జల్లిరి సంతసమ్మది పొంగిపోవగ దేవతల్

  రిప్లయితొలగించండి
 27. అమ్మలక్కలునయ్యలు నన్నలు మరి
  మెప్పు కలుగగ వారలు మెలగుటకును
  విలువ కలిగిన రీతులు విశదపరచె
  రామచంద్రుని కథ కన రమ్యరీతి

  రిప్లయితొలగించండి
 28. అమ్మగ సీతనే మరియు రాముని అయ్యగ భావనా సదా
  అమ్మ గ అయ్యగా తలతు అన్న గ రాముని లక్ష్మణున్ కదా
  తమ్మునిగా నిరంతరము తారక రాముని అన్నగా మరీ
  సమ్మతమేకదా తలతు సంతస అక్కయు చెల్లెలేకదా
  ఊర్మిళసీతయూ మదిని ఊహలు కల్గును ఆదరం బుగా

  రిప్లయితొలగించండి
 29. *30-3-18* దత్తపది
  *అమ్మ - అయ్య - అన్న - అక్క*
  పై పదాలను అన్యార్థంలో
  రామాయణార్థంలో
  నచ్చిన ఛందస్సులో

  సందర్భము: ఒక సేవకు డున్నా డంటే ఇంట్లో అక్కరకు రానివి అమ్ముకొని రమ్మంటే రాడు. సేవకుడు ముందు మనను ప్రసన్నం చేసుకోవాలి. అతడు అసలు నమస్కరించకనేపోతే అతని వినయ విధేయతలు ప్రశ్నార్థకములే!
  తల్లి (మనకు కాదు.) ముందుగా తన పిల్లలకు అన్నం పెట్టుకోవాలి. అలా పెట్టుకోకుండా గాలికి వదిలేసే వా ళ్ళుంటారు. అంతే కాదు. వాళ్ళు తినక ముందే తినేసే తల్లులూ వుంటారు. తమ పిల్లలకే అన్నం పెట్టుకోలేని తల్లులు మన కేం పెట్టగలరు?
  ఇట్లాంటి చోట ఎడరు (ప్రమాదం) జరుగగలదు. అందువల్ల తప్పనిసరిగా సీతమ్మను (ఆమె జగన్మాత కదా!) రామయ్యను స్మరించుకుంటాను అంటున్నాడు కవి.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  అక్కరకు రాని *వమ్మ* డు,

  మ్రొక్కడు సేవకుడు, *నన్న* మును పెట్టదు త,

  ల్లెక్కడఁ గల *ర య్య* ది యెడ,

  *రక్క* డ సీతమ్మఁ దలతు నా రామయ్యన్

  ఎడరు= ప్రమాదము

  2 వ పూరణము:--

  సందర్భము: సులభం. అతిథి సత్కారాలు బాగా సాగుతూవుండే యింటి యజమాని స్వగతం. సరుకు లన్నీ ఖరీదైపోతున్న వని వాపోతున్నాడు.
  ప్రియము=పిరము.. హెచ్చు వెల గలది.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  *అక్క* రకు రాని చదువులు

  పెక్కులు; *నమ్మ* గఁ గొనంగఁ బ్రియ; *మ య్య* తిథుల్

  చక్కగఁ దిన *నన్న* మెదీ?

  మ్రొక్కెద సీతమ్మ నెల్లపుడు రామయ్యన్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 30. *30-3-18* దత్తపది
  *అమ్మ - అయ్య - అన్న - అక్క*
  పై పదాలను అన్యార్థంలో
  రామాయణార్థంలో
  నచ్చిన ఛందస్సులో

  *హనుమత్ స్తుతి*

  సందర్భము: అనుష్టుప్ ఛందస్సు..
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  అ మ్మహా శైలమే యెత్తె

  న య్యనంత పరాక్రముం,

  డ క్కళా మూర్తినే గొల్తు

  న న్నరేంద్రుని దూతనే.. 1

  అ మ్మహాత్ముండు ధీరుండు,

  న య్యనామయ దేహుడౌ

  న క్కపీశ్వరునిం గొల్తు

  న న్నగేంద్ర ధరున్, గపిన్ 2

  సందర్భము: అనుష్టుప్ ఛందస్సు.. ప్రాసతో.. (మాన్యశ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజా రావుగారి అభిమతం మేరకు..)
  ~~~~~~~~~~~~
  కన్ను లారగ *న య్య* ప్ప,

  *న న్న* ఖాయుధుఁ జూతునో..

  యెన్నడో *య మ్మ* హోదారున్

  సన్నుతించుట *య క్క* పిన్ 3

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 31. అమ్మ- అయ్య-అక్క-అన్న
  అ క్కరకు వింటిని బట్టి యక్కజముగ
  ఫెళ ఫెళా యన్న శబ్దమ్ము భీతి గొలుప
  భిన్న మొనరింప రామయ్య య న్నగరపు
  మగువ లెల్ల కీర్తించి ర మ్మగతనమును

  రిప్లయితొలగించండి
 32. మన్నించండి. సవరించిన పూరణ ఇది.

  అ క్కరకు వింటి జేబట్టి యక్కజముగ
  ఫెళ ఫెళా యన్న శబ్దమ్ము భీతి గొలుప
  భిన్న మొనరింప రామయ్య య న్నగరపు
  మగువ లెల్ల కీర్తించి ర మ్మగతనమును

  రిప్లయితొలగించండి