విరించి గారూ, ఏప్రిల్ రెండు వరకు సమస్యలను పది రోజుల క్రితమే షెడ్యూల్ చేశాను. అప్పుడు కందపాదమే ఇచ్చాను. తీరా రేపటి సమస్య ఏమిటా అని నిన్న రాత్రి పరిశీలిస్తే కందపాద సమస్య "గ్రీష్మమ్మునఁ బైటఁ దీసి కోడలు పిలిచెన్" అని ఉంది. ఇందులో యతి తప్పిన విషయాన్ని గుర్తించి వెంటనే దానిని తేటగీతికి మార్చాను. (దీనితో మిత్రులకు 'ష్మ' ప్రాసతో కందం వ్రాసే ఇబ్బంది తొలగింది!). అయితే సమస్య ప్రక్కన కుండలీకరణంలో ఉన్న కందపాద సమస్యను మార్చలేదు. అక్కయ్య అది చూసి కందమే అనుకొని పూరణ చేసారు. ఇప్పుడు అక్కడ కూడా మార్చాను. ధన్యవాదాలు.
కవిమిత్రులారా, నమస్కృతులు! ఈరోజు కర్నూలు వెళ్ళి రాత్రి అక్కడే ఉండి రేపు నంద్యాల వెళ్తాను. అక్కడ ఆముదాల మురళి గారి అవధానంలో పృచ్ఛకుడిగా పాల్గొని రేపు యాగంటి, ఎల్లుండి అహోబిలం దర్శించుకుని ఏప్రిల్ ఫస్ట్ నాడు హైదరాబాద్ చేరుకుంటాను. అప్పటి వరకు బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2636 సమస్య :: *గ్రీష్మము నందు బైట తొలగించియుఁ గోడలు గన్ను గీటెరా.* కోడలు మామను పిలిచింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం. గ్రీష్మ ఋతువు రాగా, వాయువు యొక్క కోడలు, భీమసేనుని భార్య అగు హిడింబ ఉక్కపోత భరించలేక గాలిని కోరుకొన్నది అని చెప్పే సందర్భం.
- "కోడలు మామను" పిలిచింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
సంస్కృత శ్లోకంలో ఆ వాక్యం పాదాంతంలో వున్నా తెలుగు లో పైన యిచ్చిన సమస్య లో మామ అన్నది ప్రస్ఫుటంగా లేదు ; ఆ ఊహ కు కారణం ( తెలుగు సమస్య ను మాత్రం చూస్తే) may be human morbidity to juxtapose daughter in law with finlaw?
సహృదయులు జిలేబి గారికి ప్రణామాలు. నేటి సమస్యను చూడగానే *హిడింబా భీమదయితా....* అనే శ్లోకం గుర్తుకు వచ్చింది. అందువలన అలా ఊహించి వ్రాశాను. అంతకంటే వేరే ఎటువంటి ఉద్దేశమూ లేదు. తమరి అభిప్రాయమును తెలియబరచినందులకు ధన్యవాదాలండీ. కోట రాజశేఖర్
శ్రీ కావ్య కంఠ గణపతి ముని శ్లోకాన్ని ప్రస్తావించడం మెచ్చదగినది. పద్యం సాగినతీరు పరమానందం. 🌺🙏🏼👌👌🙏🏼🌺 ఏమీ యద్భుత పద్యము?! మామను కోరునది కోరె మామను.. మగనిన్ ప్రేమను గని కన్గీటెను.. ధీమాలో మరి.. హిడింబ దీ టెవరు ధరన్?...
ఎండాకాలంలో మధ్యహ్న వేళ ఇంటిలో అందరూ కాసేపు మేనువాల్చి యుంటారని తనపని సులభంగా అవుతుందని ఒక చోరుడు దొంగలించడానికి దూరినంతలో మెలుకువగా నున్న అత్తతో కోడలు(రష్మి) కన్నుగీటి త్రాడు దెమ్మని సైగ జేస్తూ తన పైట దీసి దొంగ తలకు చుట్టింది. ఆశ్చర్యపోతూ అత్త తెచ్చిచ్చిన తాడుతో వాని చేతులు వీపుకు మడచి కట్టింది. ఆ దొంగను కొడుకుకు చూపిస్తూ ఆ తల్లి చెప్పే సందర్భం:
సందర్భము: "ఈ కావు(ఉక్క) భరించలేను. కట్టుకున్న బట్టలుకూడా బంధాలు (తాళ్ళు)గా తయారవుతున్నాయే!" అని ఒక వృద్ధురాలైన అత్తమ్మ భావిస్తూ గ్రీష్మంలో (గాలికోసం) పైట తొలగించి *హాయిగా* పడుకున్నది. ఇక కోడలు సంగతి చూద్దాం! కొత్తగా కాపురానికి వచ్చింది. నూత్న దంపతులు వారు. "గ్రీష్మం మా కేమిటి అడ్డు?" అంటూ భర్తను *హాయిగా* కన్ను గీటింది. ఎవరి హాయి వారిది?!?
రిప్లయితొలగించండివిన్న కోట వారు ఈ సమస్య ని చూసేరంటే ఏమంటా రో !
నారదా ! త్వర గా రావయ్యా !
జిలేబి
అమ్మా జిలేబీ గారూ,
తొలగించండిదయచేసి ఈ బ్లాగులో 'కెలుకుడు పార్టీ' పెట్టకమ్మా! మీకు శతకోటి వందనాలు!
ఊష్మా గమమున జనులకు
రిప్లయితొలగించండిరేష్మీ దుస్తులు ధరింప లీలా వతియౌ
సూష్మమ్ముగ పతిముంగిట
గ్రీష్మమునఁ బైటఁ దీసి కన్గీటె స్నుషయె
-----------------------
రేష్మీ = పట్టుతో చేసినవి
అక్కయ్యా సమస్య పాదం తేటగీతిలో ...........
తొలగించండివిరించి గారూ,
తొలగించండిఏప్రిల్ రెండు వరకు సమస్యలను పది రోజుల క్రితమే షెడ్యూల్ చేశాను. అప్పుడు కందపాదమే ఇచ్చాను. తీరా రేపటి సమస్య ఏమిటా అని నిన్న రాత్రి పరిశీలిస్తే కందపాద సమస్య "గ్రీష్మమ్మునఁ బైటఁ దీసి కోడలు పిలిచెన్" అని ఉంది. ఇందులో యతి తప్పిన విషయాన్ని గుర్తించి వెంటనే దానిని తేటగీతికి మార్చాను. (దీనితో మిత్రులకు 'ష్మ' ప్రాసతో కందం వ్రాసే ఇబ్బంది తొలగింది!). అయితే సమస్య ప్రక్కన కుండలీకరణంలో ఉన్న కందపాద సమస్యను మార్చలేదు. అక్కయ్య అది చూసి కందమే అనుకొని పూరణ చేసారు. ఇప్పుడు అక్కడ కూడా మార్చాను. ధన్యవాదాలు.
అవునుకదా గమనించలేదు క్షమించాలి
తొలగించండిధన్య వాదములు
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండినమస్కృతులు!
ఈరోజు కర్నూలు వెళ్ళి రాత్రి అక్కడే ఉండి రేపు నంద్యాల వెళ్తాను. అక్కడ ఆముదాల మురళి గారి అవధానంలో పృచ్ఛకుడిగా పాల్గొని రేపు యాగంటి, ఎల్లుండి అహోబిలం దర్శించుకుని ఏప్రిల్ ఫస్ట్ నాడు హైదరాబాద్ చేరుకుంటాను. అప్పటి వరకు బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.
నమస్కారములు
తొలగించండిఅవధాన సరస్వతికి అభినందన మందారములు . ఆశీర్వదించి అక్క
డా.పిట్టాసత్యనారాయణ
తొలగించండిసందర్భం..వరి పంటను తూర్పార బట్టుట,వేసవి లో
మామ, కోడళ్ళు తూర్పార మనగనచట
కంట నలుసు, నొడిని జేరె కరకు"తాలు"(బరువు లేని వరి గింజలు)
చేత చేట,జారిన పైట జెలుప లేక
గ్రీష్మమున బైట దీసి కన్గీటె స్నుషయె!
గురువర్యా!..అవధానంలో తమరు పృచ్ఛకుడిగా అడిగిన ప్రశ్నలూ,వాటికి పండితాగ్రజులవారు ఇచ్చిన సమాధానాలను తెలుసుకొనవలెనని మిక్కిలి కుతూహలముగనున్నది. వీలయితే పంచుకోగలరని ఆకాంక్ష.
తొలగించండి
రిప్లయితొలగించండిఆకసమ్మున తారల ప్రకృతి చూప
గ్రీష్మమునఁ బైటఁ దీసి, కన్గీటె స్నుషయె,
రమ్మనుచు వాటిని సయి మరలు గొలుపగ !
సూక్ష్మ మిదియేను కవివర సుబ్బ రాయ !
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి. "ఆకసమ్మునఁ దారల రాకఁ జూచి" అంటే ఎలా ఉంటుంది?
వావి వరుసలు లేనట్టి వారకాంత
రిప్లయితొలగించండియెండ లింతంత నంతంత యెక్కువైన
"మామ! రమ్ము ; కోరితి నిన్నె మదిని" నంచు
గ్రీష్మమున బైట దీసి కన్ గీటె స్నుషయె .
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తేటగీతి
రిప్లయితొలగించండివాయునందను డొడిలోన వ్రాలియుండి
యుక్కపోత యన హిడింబి యూప నెంచి
గ్రీష్మమునఁ బైటఁ దీసి కన్గీటె! స్నుషయె
పవన మాశించెనని వీచె వాయువపుడు.
తొలగించండిఅదురహో గుండావారి పూరణ
జిలేబి
జిలేబి గారికి ధన్యవాదాలు
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశివగామి బాహుబలిని కొడుకుగా భావించి 👇ఇలా అంటోంది.....
ఊష్మపు ధాటి యౌవనపుటూహల ద్రుంచగలేదు , వేచె మా...
హిష్మతిఁ నిన్ను గోరి గనవేమి యనుష్క , సకామ , యెంచదా..
ముష్మికమిప్డు , బాహుబలి ! మోహము గ్రమ్మినవేళనేలరా !
గ్రీష్మమునందుఁ బైటఁ దొలగించియుఁ గోడలు గన్నుగీటెరా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఒక అత్త... కోడలికి బొమ్మ చూపిస్తూ..👇 ఇలా అంటోంది
తొలగించండిమత్తు గలిగింపగా బొండు మల్లెపూలు
గ్రీష్మమునఁ , బైటఁ దీసి కన్గీటె , స్నుష ! యె...
వరనుకొంటివొ? రాధ గోపాలునెంచి !.,
యింత చక్కగ యెవరొ చిత్రించినారు !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మేన గోడలి తోడను మేలమాడి
రిప్లయితొలగించండిపొలము పనులలో మామయ్య మునిగి యుండ
కంది చేనులో కనుగొని ముందుకేగి
గ్రీష్మమునఁ బైటఁ దీసి కన్గీటె స్నుషయె
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2636
సమస్య :: *గ్రీష్మము నందు బైట తొలగించియుఁ గోడలు గన్ను గీటెరా.*
కోడలు మామను పిలిచింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
గ్రీష్మ ఋతువు రాగా, వాయువు యొక్క కోడలు, భీమసేనుని భార్య అగు హిడింబ ఉక్కపోత భరించలేక గాలిని కోరుకొన్నది అని చెప్పే సందర్భం.
గ్రీష్మము రాగ, *భీము సతి* గేహమునన్ వసియింపలేక, తా
నూష్మము సైపలేక, యెద నున్న పటమ్మును దీసె, తాపమే
భీష్మము గాగ, గోరినది వేగమె మామను వాయుదేవునిన్,
*గ్రీష్మము నందుఁ బైట దొలగించియుఁ గోడలు ; గన్ను గీటెరా*
భీష్మబలున్ వృకోదరుని ప్రేమగ చెంతకు బిల్చుచుండెరా.
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (29-3-2018)
ఇటువంటి సమస్యకు శ్రీ కావ్యకంఠ గణపతి ముని యొక్క పూరణ
తొలగించండి(ప్రాచీన శ్లోకం)
హిడింహా భీమదయితా
నిదాఘే ఘర్మపీడితా ।
స్తన వస్త్రం పరిత్యజ్య
వధూః స్వశురమిచ్ఛతి ।।
తొలగించండిఏమండీ రాజశేఖర్ గారు
- "కోడలు మామను" పిలిచింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
సంస్కృత శ్లోకంలో ఆ వాక్యం పాదాంతంలో వున్నా తెలుగు లో పైన యిచ్చిన సమస్య లో మామ అన్నది ప్రస్ఫుటంగా లేదు ; ఆ ఊహ కు కారణం ( తెలుగు సమస్య ను మాత్రం చూస్తే) may be human morbidity to juxtapose daughter in law with finlaw?
ఏమంటారు ?
జిలేబి
సహృదయులు జిలేబి గారికి ప్రణామాలు.
తొలగించండినేటి సమస్యను చూడగానే
*హిడింబా భీమదయితా....* అనే శ్లోకం గుర్తుకు వచ్చింది. అందువలన అలా ఊహించి వ్రాశాను. అంతకంటే వేరే ఎటువంటి ఉద్దేశమూ లేదు. తమరి అభిప్రాయమును తెలియబరచినందులకు ధన్యవాదాలండీ. కోట రాజశేఖర్
గణపతిముని సంస్కృత పూ
తొలగించండిరణమునకనువాదపగిది రచనములో ల
క్షణముగ పూరించితిరే
ప్రణతులు కవిరాజశేఖరార్యాద్యులకై 🙏
గౌరీభట్ల బాలముకుందశర్మ
శ్రీ కావ్య కంఠ గణపతి ముని శ్లోకాన్ని ప్రస్తావించడం మెచ్చదగినది. పద్యం సాగినతీరు పరమానందం.
తొలగించండి🌺🙏🏼👌👌🙏🏼🌺
ఏమీ యద్భుత పద్యము?!
మామను కోరునది కోరె మామను.. మగనిన్
ప్రేమను గని కన్గీటెను..
ధీమాలో మరి.. హిడింబ దీ టెవరు ధరన్?...
~వెలుదండ సత్యనారాయణ
29-3-18
అభినందించేంత అనుభవంలేదు
తొలగించండిప్రశంసించేంత పాండిత్యంలేదు
వారేహ్వ అనేంత వయసుకాదు
*బాగుందని* మాత్రం చెప్పగల
బాలుణ్ణి .👌🏿🙏🏻
బాగుంది *గురుతుల్యా*
సుధాకర గౌడ
భర్త దే శాంత ర ము నుండి వచ్చె ననుచు
రిప్లయితొలగించండిపరుగు పరుగున బయటికి నరుగు దె oచి
మురిసి పోవు చు లోలోన మోదమంది
గ్రీష్మ ము న బైట దీసి కన్ గీ టే న్నుష యె
మాన మర్యాద లుంచదు మండుటెండ
రిప్లయితొలగించండిఅర్దనజ్ఞత లాసించు నధిక వేడి
కారు చున్నట్టిచమటకు దారిజూప
గ్రీష్మమున బైటదీసె కన్గీటి స్నుషయె!
చూత మేకాల మందున చూత ఫలమె?
రిప్లయితొలగించండియింతి కాంతుని కవ్వింప నేమి జేసె?
పాండు రాజున కేమౌను పడతి కృష్ణ?
"గ్రీష్మమునఁ; బైటఁ దీసి కన్గీటె; స్నుషయె!"
సవరణ: "చూతు మేకాల....."
తొలగించండిడా.పిట్టానుండి}
రిప్లయితొలగించండిఈ స్థలంలో ప్రచురించక పొరపాటున అక్కయ్య పూరణ క్రింద వచ్చింది.,ఆర్యా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదర్శకేంద్రుని కోడలే తా తనూజ
రిప్లయితొలగించండి"సీను" నొక్కటి పండింప జేయు మనగ
ఒక్క "టేకున" నటననే యొప్పజేసె
"గ్రీష్మమునఁ బైటఁ దీసి కన్గీటె స్నుషయె".
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిఊష్మపు చల్లగాలి వలె నూదిన పృచ్ఛకు వాక్య మెంచె తా
"గ్రీష్మము నందు బైట దొలగించియు గోడలు గన్ను గీటెరా!"
చష్మ(సులలోచనాలు)ను దీసి భార్య కపచారము జేయ"తలాఖ"టంచనెన్
భీష్మ బ్రతిజ్ఞ జేయగ గభీరత నోచని శ్రోత యా సభన్!
పైటనారవేసిన యుష దీటుగాను
రిప్లయితొలగించండితీగపైనున్న పైటను తీయదలచి
చీమ కుట్టగ కంటిపై చిందులాడి
గ్రీష్మమునఁ బైటఁ దీసి కన్గీటె నుషయె!
గ్రీష్మమునఁ బైటఁ దీసి కన్గీఁటె స్నుష యె
రిప్లయితొలగించండివరని రిట్లూఢ యగుఁ గోడలు రమణీ ల
లామ కాదు భేదము గను భామ లందు
భ్రాంతిఁ జిత్త మందు వదలి శాంతిఁ బొందు
ఇష్మపు టాగమమ్మును వరేందు నిభాస్యల వాలు చూపులున్
శ్లేష్మము నందు నీగలను జేయును ధీరుల నైన నక్కటా
యుష్మము తాళ లేకయె ముదోద్భవ మంచు నిజేష్ట భర్తకున్,
గ్రీష్మమునందుఁ బైటఁ దొలగించియుఁ, గోడలు గన్నుగీఁటెరా
ఊష్మముతోడచేర నిజ యుగ్మలి చెంతకు మేనమామ తా
రిప్లయితొలగించండిగ్రీష్మమునందుఁ బైటఁ దొలగించియుఁ గోడలు గన్నుగీటెరా
సుష్మము బోలు వాలుజడ సుందర దేహము పైన త్రిప్పుచున్
భీష్మ బలమ్మునన్ వరుడు పేరిన తాపము నార్ప వ్రాలెతాన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిక్రమాలంకారమున నా పూరణ
*తే.గీ**
ఎండలును మెండుగుండెడిదెపుడు దెలుపు?
విటుకులాడి యెలాపిల్చె విటుని జూచి?
సుతుని పెండ్లాము యేమగు సూచనిమ్ము?
"1.గ్రీష్మమున; 2.పైటఁ దీసి కన్గీటె; 3.స్నుషయె
.............✍చక్రి
స్నుష = కోడలు
రిప్లయితొలగించండిఎండ లెప్పుడుహేచ్చన నీజగతిన
గ్రీష్మమునఁ బైటఁ దీసి కన్గీటె స్నుషయె
మామను గనిముదంబున మరులు గొనుచు
నిదురరాక లేపె పతిని నెమ్మి తోడ.
ఎండాకాలంలో మధ్యహ్న వేళ ఇంటిలో అందరూ కాసేపు మేనువాల్చి యుంటారని తనపని సులభంగా అవుతుందని ఒక చోరుడు దొంగలించడానికి దూరినంతలో మెలుకువగా నున్న అత్తతో కోడలు(రష్మి) కన్నుగీటి త్రాడు దెమ్మని సైగ జేస్తూ తన పైట దీసి దొంగ తలకు చుట్టింది. ఆశ్చర్యపోతూ అత్త తెచ్చిచ్చిన తాడుతో వాని చేతులు వీపుకు మడచి కట్టింది. ఆ దొంగను కొడుకుకు చూపిస్తూ ఆ తల్లి చెప్పే సందర్భం:
రిప్లయితొలగించండిఉత్పలమాల(పంచపాది)
యుష్మపు వేళనింట నొక డూఁపున దూరెను తస్కరించగన్
గ్రీష్మమునందుఁ, బైటఁ దొలగించియుఁ గోడలు గన్నుగీటెరా
సుష్మముఁ దెమ్మనంచు నను జూచుచు! వాని శిరంబుఁ జుట్టెరా!
విస్మయ మందుచున్ నొసఁగ వీపుకుఁ జేతులఁ గట్టి వైచెరా!
రష్మియె నీదు భార్యఁ గనరా! ఘనకార్యముఁ జేసె మెచ్చగన్!
తొలగించండిచాలా బాగుందండి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిజిలేబి గారికి ధన్యవాదాలు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండికంది వారు సెలవు లో వెళ్ళడానికి పథకము వేసుకుని మన కంద రి కి ఎండా కాలపు రుచి చూపిస్తున్నట్లు :)
నే "ష్మ" ను ప్రాసగా జొనిపి నేరుగ బోయెద పృచ్ఛ కుండనై
సుష్మమిదేను మీకు మజ సొంపుగ కాలము వెళ్ళబుచ్చగన్
నూష్మము తాళ లేక సయి నొప్పగు పూరణ లెట్లుజేతురో
గ్రీష్మమునందుఁ, బైఁటఁ దొలఁగించియుఁ, గోడలుఁ గన్నుగీఁటెరా!
జిలేబి
హమ్మయ్య ఉత్పల మాల కిట్టించా :)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి(1)
ఊష్మముఁ దాళలేక, "యుహుహూ" యని వేఁగెడు రేష్మఁ జూచి, "యో
రేష్మ, యిదేమి? రమ్ము, సెగలే రగిలించు గదిం ద్యజించి! యా
శుష్మము నోర్వనేల? వెలిఁ జూడు" మనన్, గని చంద్రు, గాలికై
గ్రీష్మమునందుఁ, బైఁటఁ దొలఁగించియుఁ, గోడలుఁ గన్నుగీఁటెరా!
(2)
ఊష్మము నోర్వలేక, "యుహుహూ" యని యూర్చి, హిడింబి శీఘ్రమే
భీష్మపు రూపుఁడౌ మగఁడు భీమునకున్ బితయౌ ప్రభంజనున్,
శుష్మముఁ దీర్పఁ బిల్చె "ననుఁ జూచియుఁ బొ" మ్మని, గాలికోస మా
గ్రీష్మమునందుఁ, బైఁటఁ దొలఁగించియుఁ, గోడలుఁ గన్నుగీఁటెరా!
రిప్లయితొలగించండిఓయీ బుచికీ
ఏదో కంద పాదాన్నో తేటగీతినో పూరించేసి కందివారి చేత జిలేబి అనిపించుకోవటము కాదోయ్
రా దిగి రా నేటిఉత్పలమాల పూరించుమా చూసెదన్ !
సవాలే సవాలు
జిలేబి
రిప్లయితొలగించండిగాలి గోరుకొందురుగదా కాంత లంత
గ్రీష్మమున పైట దీసి: కన్గీటె సుష్మయె
మామ తోనున్న పతి బిల్వ మర్మగతిని
మండుటెండలందువిచిత్రమౌర గతులు
[29/03, 17:44] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి
శ్లేష్మము తోడబాధ పడు లేకిడి బుద్ధి యొకండు రోతగా
భీష్మ ప్రగల్భముల్ మరియు విస్మయ వార్తలు తెల్పు నీవిధిన్
భీష్మునిజంపెయుద్ధమున భీముడు కౄరుడు గుండె జీల్చుచున్
గ్రీష్మమునందు పైట దొలగించియు గోడలు గన్నుగీటెరా
మరదలు చిలిపి నగవుల మామ జూడ
రిప్లయితొలగించండిప్రేమను దెలుప సిగ్గన బ్రేమతోన
అత్తకు తెలియునంచు నతడుభయపడ
గ్రీష్మమునఁ బైటఁ దీసి కన్గీటె ! స్నుషయె
De H Varalakshmi
Bangalore
28 Mar 18
.......సమస్య
రిప్లయితొలగించండి*"గ్రీష్మమునందుఁ బైటఁ దొలగించియుఁ*
*గోడలు గన్నుగీటెరా"*
*అత్తా కోడండ్రు*
సందర్భము: "ఈ కావు(ఉక్క) భరించలేను. కట్టుకున్న బట్టలుకూడా బంధాలు (తాళ్ళు)గా తయారవుతున్నాయే!" అని ఒక వృద్ధురాలైన అత్తమ్మ భావిస్తూ గ్రీష్మంలో (గాలికోసం) పైట తొలగించి *హాయిగా* పడుకున్నది.
ఇక కోడలు సంగతి చూద్దాం! కొత్తగా కాపురానికి వచ్చింది. నూత్న దంపతులు వారు. "గ్రీష్మం మా కేమిటి అడ్డు?" అంటూ భర్తను *హాయిగా* కన్ను గీటింది.
ఎవరి హాయి వారిది?!?
ఊష్మము, ఊష్మకము=ఉక్క, వేడిమి
(కావు.. గద్వాల కర్నూలు ప్రాంతాల్లో)
సుష్మము=తాడు, రజ్జువు
స్రుక్కు= దుఃఖించు, చింతించు
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఊష్మకమున్ భరించుటకు
నోపని యత్తమ వృద్ధురా "లయో
సుష్మము లాయె బట్ట లివి!
స్రుక్కుట యే?" లని యెంచి పండెఁ దా
గ్రీష్మమునందుఁ బైటఁ దొల
గించియుఁ...గోడలు గన్ను గీటెరా
"గ్రీష్మము నూత్న దంపతుల
కేమిటి యడ్డ?" మటంచుఁ బెన్మిటిన్..
మరొక పూరణము:--
....సమస్య
*"గ్రీష్మమునఁ బైటఁ దీసి కన్గీటె స్నుషయె"*
*కాకి..కోకిల*
సందర్భము: "కావు కావు.." అని అత్తమ్మ కాకిలాగా అరుస్తూనే వున్నది. కావు.. అంటే రక్షించు.. అనే కాదు. తీవ్రంగా ఉక్క పోయడం. వేడిమి. (గద్వాల కర్నూలు ప్రాంతాల్లో వాడుక.) ఆమె మగని తిడుతూ ఆ గ్రీష్మంలో గాలి ఆడడం కోసం పైట తీసివేసి పడుకున్నది.
కోడలుమాత్రం కన్ను గీటింది. మగడు లేవలేదు. కోకిల స్వరాన తీయగా "లేవు లే" వని పిలిచింది. ఎదుట నిలిచింది.
గ్రీష్మ తాపం కాస్తా మదన తాపమై పోయింది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"కావు కా" వంచు నత్తమ్మ కాకి వోలె
మగని దిట్టుచు బండె *గ్రీష్మమునఁ బైటఁ*
*దీసి... క న్గీటె స్నుషయె...* తాఁ దీయనైన
కోకిల స్వరానఁ బ్రియమారఁ గోరి పిలిచె...
"లేవు లే" వంచు మగనిని లేపి, నిలిచె....
మదన తాపమై పోయె గ్రీష్మంపు తపన..
🖋~డా.వెలుదండ సత్యనారాయణ