12, మార్చి 2018, సోమవారం

సమస్య - 2623 (రావణుఁడే రాముఁ డగుచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రావణుఁడే రాముఁ డగుచు రావణుఁ జంపెన్"
(లేదా...)
"రావణుఁ డంత రాముఁడయి రావణుఁ జంపె రణమ్మునందునన్"
(డా॥ జి.యం. రామశర్మ గారి 'శతావధాన వైజయంతి' గ్రంథం నుండి)

87 కామెంట్‌లు:

  1. త్రోవలు దప్పిన మనుజుడు
    నేవములను వదలి వేసి - ఈశ్వర భక్తిన్
    ప్రోవిడిచి దుష్ట మార్గము
    రావణుడే రాముడగుచు రావణు జంపెన్.
    ( ఈశ్వర భక్తి వలన తనలోని రావణ తత్వాన్ని చంపివేసెను - అని భావము)

    రిప్లయితొలగించండి
  2. కావరము నెత్తి కెక్కగ
    శీవము వలె బుసలు కొట్టి చెడుపను లందున్
    భావము మారగ కుములుచు
    రావణుఁ డే , రాముఁ డగుచు రావణుఁ జంపెన్

    రిప్లయితొలగించండి
  3. దేవతలను మానవులను
    గావగ నారాయణుండు కరుణామయుడా
    శ్రీవిభుడు దైత్యజనవి
    ద్రావణుఁడే రాముఁ డగుచు రావణుఁ జంపెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  4. సేవకులను సజ్జనులను
    గావగ పురుషోత్తముండు కరుణాలయుడా
    గోవిందుడు దుష్టులకును
    రావణుఁడే రాముఁ డగుచు రావణుఁ జంపెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2623
    సమస్య :: *రావణు డంత రాముడయి రావణుఁ జంపె రణమ్మునందునన్.*
    రావణుడు రాముడుగా మారి రావణుని చంపినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: సాధువులను పరిరక్షించేందుకోసం, దుష్కృత్యములను చేసే వారిని నశింపజేసేందుకోసం, ధర్మ సంస్థాపన చేసేందుకోసం విష్ణుభగవానుడు ప్రతి యుగము లోనూ ఈ భూమిపై అవతరిస్తూ ఉంటాడు.
    *పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతామ్ ।*
    *ధర్మ సంస్థాపనార్థాయ, సంభవామి యుగే యుగే ।।* అనే శ్లోకాన్ని మనం విటుూనే ఉన్నాం కదండీ.
    ఆ విష్ణుమూర్తియే త్రేతాయుగంలో శ్రీ రాముడుగా అవతరించాడు. సాధ్వియైన సీతాదేవిని చెఱపట్టి, లంకలో పెట్టిన దుష్ట రావణాసురుని యుద్ధరంగంలో సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు అని విశదీకరించే సందర్భం.

    దైవము విష్ణుమూర్తి యవతారము నందును సాధువర్గమున్
    గావగ, దుష్టులన్ దునుమగా, నిల స్థాపన జేయు ధర్మమున్ ;
    పావన సీతఁ గోరి చెఱపట్టగ, పెట్టగ లంకలోపలన్
    రావణు , డంత రాము డయి రావణుఁ జంపె రణమ్ము నందునన్.
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (12-03-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      విలక్షణమైన విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. (చిన్న మార్పు గమనించ ప్రార్థన)
      దైవము విష్ణుమూర్తి యవతారము నెత్తును సాధువర్గమున్
      గావగ, దుష్టులన్ దునుమగా, నిల స్థాపన జేయ ధర్మమున్ ;
      పావన సీతఁ గోరి చెఱపట్టగ, పెట్టగ లంకలోపలన్
      రావణు , డంత రాము డయి రావణుఁ జంపె రణమ్ము నందునన్.

      తొలగించండి

  6. [12/03, 06:45] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    పావని సీత గోరి చెఱ బట్టుచు లంకను బెట్టగా
    శ్రావణమేఘమై హృదయ శాంతము కన్నుల నీరవ
    న్నా వని సాధుమూర్తులకు నండగ నుండిన ఘోర దుఃఖ వి
    ద్రావణు డంత రాముడయి రావణుజంపె రణమ్మునందునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎన్.వి.ఎన్. చారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, రెండవ పాదాలలో గణదోషం. 'నీరు + అవన్'... అవన్ అన్నది సాధువు కాదు. సవరించండి.

      తొలగించండి
  7. పావన శ్రీహరి నరుడయి
    చేవనుఁజూపించి యసుర సింహుల చెనకన్.
    ప్రోవన్ సుజనుల,నరి వి
    ద్రావణుడే రాముడగుచు రావణుఁజంపెన్

    రిప్లయితొలగించండి
  8. తావిధి జేతనే నిలను తామస రాక్షస జన్మమొందెగా
    తావులు దప్పుచున్ చెరను ధారుణి పుత్రిని హింస జేయగా
    "రావణుఁ; డంత రాముఁడయి రావణుఁ జంపె రణమ్మునందునన్"
    శ్రీవిభుడే శివాంశజుడు శ్రీహనుమంతుని తానె తోడ్కొనిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తోడ్కొనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "శ్రీహనుమంతుడు నుండ తోడుగా" అందామా?

      తొలగించండి
  9. కావగ సుర లను శిష్టు ల
    పావన పుటి న కుల మందు వసు ధాధి పుడై
    చేవ గ దుష్ట నసుర వి
    ద్రావణుడే రాము డ గు చు రావణు జంపె న్

    రిప్లయితొలగించండి
  10. పావని సీతను లంక క
    వివేకమునను తరలించి విపినమునుంచన్
    బవరములో కంటక వి
    ద్రావణుఁడే రాముఁ డగుచు రావణుఁ జంపెన్

    రిప్లయితొలగించండి
  11. కోవిదుడైనా ఖలుడా
    "రావణుఁడే; రాముఁ డగుచు రావణుఁ జంపెన్"
    శ్రీవిభుడే మానవుడిగ
    నా వానరసేన కూడి యాలము నందున్

    రిప్లయితొలగించండి
  12. ఆవరణలు విడిపోవగ
    పావనమౌ నాత్మనందు పరవశమౌచున్
    లావగు మనస్సహములను
    రావణుడే రాముడయ్యి రావణు జంపెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
    3. డా. సీతా దేవి గారు నమస్సులు. మీ పూరణ చక్కగ నున్నది.
      “మనస్సహములను” మీ యభిప్రాయమును వివరించి తెలుప గోర్తాను.

      తొలగించండి
    4. పూజ్యులు కామేశ్వరరావుగారికి ధన్యవాదములు, నమస్సులు!

      మనిషిని బంధించేవి మనస్సు , అహంకారములని, అవి నశించినపుడు ఆత్మసాక్షాత్కారమయి, జీవ పరమాత్మ్యైక్యత
      కలిగి రావణుడే రాముడవుతాడని భావన!

      మీ అమూల్యమైన అభిప్రాయము తెలియగోరెదను!🙏🙏🙏

      తొలగించండి
    5. పావనమైన మేదిని నవాంఛిత రీతిని
      ధర్మహానియౌ
      తావున బ్రోవగన్ సుజను తామరనాభుడు దానెవచ్చునే!
      యావులగాచెడిన్ ప్రభువు , యాతనబెట్టగ జానకమ్మనే
      రావణు, డంత రాముడయి రావణు జంపె రణమ్మునందునన్!

      గోవులు =వేదములు (ధర్మములు)

      తొలగించండి
    6. నా పూరణ లోని భావన మీ పూరణ లోని భావన కైక్యతకు సంతసించి నిర్ధారణము కొఱకు నడిగితిని.
      మరియొక విశేషము:
      మనస్సు+అహములు = మనస్సహములు,
      మనః+ అహములు = మనో౽హములు

      తొలగించండి
    7. ధన్యవాదములార్యా! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
    8. సీతాదేవి గారూ,
      మీ వృత్త పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    9. ధన్యవాదములాచార్యా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
  13. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. రిప్లయిలు
    1. “మేదిని మండనమ్ములగు మెండుగ నిండుగ మండుటెండలే”

      ఆకాశవాణి సమస్య

      తొలగించండి
  15. భూవరుడై జనించి భువి పుత్రిక సీతతొ కాన కేగి తా
    నా విధి పత్ని గోల్పడిన యట్టి ముకుందుడు వానరాళితో
    పావనితోడ నేగి రిపు పంక్తిని దున్మి ప్రియా వియోగ భా
    "రావణుఁ; డంత రాముఁడయి రావణుఁ జంపె రణమ్మునందునన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ పద్యం బాగుంది. అభినందనలు.
      కాని "భారావణుడు"....?

      తొలగించండి
    2. 'సీతతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా వాడరాదు. "భువిపుత్రిక తోడను కానకేగి..." అనవచ్చు.

      తొలగించండి
  16. జీవాత్మయుఁ బరమాత్మయుఁ
    గావే యొక టని సతము నిగమము లనంగన్
    నే వచియింతును దృఢముగ
    రావణుఁడే రాముఁ డగుచు రావణుఁ జంపెన్


    కావుము లోక సంతతినిఁ గంటకుఁ డా దశకంఠ దైత్య వి
    ద్రావిత సంయమీంద్రులకు రక్షణ మిమ్మన, దైవకోటికిన్
    దైవమ, ప్రీతి నెత్తి యవతారముఁ, జిక్కులనీయ మిక్కిలిన్
    రావణుఁ, డంత రాముఁడయి రావణుఁ జంపె రణమ్మునందునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  17. భావమునందున పరసతి
    తా విలసిల వలెను భువిని తల్లిగ మదిలో
    నా విధి వ్యామోహపు మై
    రావణుడే రాముడయ్యి రావణు జంపెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ పద్యం బాగున్నది. అభినందనలు.
      'వ్యామోహపు మైరావణుడు'...?

      తొలగించండి
  18. ఆవనవాసికిశత్రువు
    రావణుడే,రాముడగుచు రావణుజంపెన్
    శ్రీవిభుడేనరుడైభువి
    బావని యాసీతకొరకు ప్రమదులు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  19. సేవకుడగు జయుడన్నను
    రావణుడే, రాముడగుచు రావణు జంపె
    న్నా విష్ణుమూర్తి యవనిని
    పావని జానకి నెపమున భండన మందున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చంపెన్ + ఆ' అన్నపుడు సాధ్యమైనంత వరకు ద్విత్వ నకార ప్రయోగాన్ని వర్జించండి. అక్కడ "రావణు జంపెన్। శ్రీవిష్ణుమూర్తి..." అనవచ్చు.

      తొలగించండి
  20. ఆవెన్నుని బంటేగద! ;
    యావిధికృత శాప వశము నపరాజితుడే
    తావిధి నెరవేర్చె నెటుల?
    "రావణుఁడే ; రాముఁ డగుచు రావణుఁ జంపెన్"

    రిప్లయితొలగించండి
  21. సార్! మీ హార్దిక పరామర్శ తరువాత స్ఫూర్తి వచ్చినది (దుస్సమాసమును మన్నింపుడు:):



    పావని!! చెపుమా నీవే!
    రావణవధ గాంచితీవు;...
    రాముడగుచు నే
    రావణుడే రావణు డే
    రావణుఁడే రాముఁ డగుచు రావణుఁ జంపెన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ జ్వరం నెమ్మదించినందుకు సంతోషం. విశ్రాంతి తీసుకొనండి.

      తొలగించండి
  22. మైలవరపు వారి పూరణ

    శ్రీ వనితా మనోహరుని సేవకుడైన జయుండు శప్తుడై
    రావణుడయ్యె , భూమిజను రాక్షసవృత్తి హరించె , నుగ్రుడై
    పావనుడైన శ్రీ హరియె భక్తునకివ్వగ మోక్షమున్, ద్విష..
    ద్రావణుడంత రాముడయి రావణుఁ జంపె రణమ్మునందునన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ద్విషద్రావణునితో మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గగనం గగనాకారం సాగస్సాగరోపమః
      రామరావణయోర్యుద్ధం
      రామరావణయోరివ ।।


      ధీవర ! యాకసమ్మునకదే యగు పోలిక, యంబురాశికిన్
      లావణ సాగరమ్మనుచు లాక్షణికుల్ వచియించినారిలన్ !
      రావణ రామ యుద్ధమున రావణ రాములె తుల్యయోధులౌ !
      రావణుడంత రాముడయి రావణు జంపె రణాంగణమ్మునన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. సేవకుడైన జయుండే
      రావణుడై వధ్యుడయ్యె రాజసవృత్తిన్ !
      పావనుడౌ హరి ధిక్కృత
      రావణుడే రాముడగుచు రావణుఁ జంపెన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

  23. .......సమస్య
    రావణు డంత రాముడయి రావణుఁ జంపె
    రణంబునందునన్

    *రాముని రూప మకామము*

    సందర్భము: మండోదరి యొకసారి రావణునితో అన్నది కదా!
    "సీత అంటే నీ కింత ఆరాట మైతే నీ వెట్లాగూ కామరూపుడవే కదా! రాముని రూపం ధరించి ఆమె యెదురుగా నిలబడు.
    సరిపోతుంది." అని..
    అప్పుడు రావణుడు " ఓసీ! పిచ్చిదానా! నేనే గనుక రాముని రూపం ధరిస్తే నాలో కామ మెక్క డుంటుంది? రాము డంటేనే కామం లేని వాడు. రావణు డంటేనే కాముకుడు. శాప విమోచనంకోసం ఈ జన్మలో నేను ప్రవర్తించవలసిన విధాన మిదే!"
    వైకుంఠంలోని విష్ణు మూర్తి ద్వార పాలకులైన జయ విజయులు శాపగ్రస్తులై రావణ కుంభకర్ణులుగా జన్మించినారు. విష్ణ్వవతారమైన రామునిచేత సంహరింప బడవలసి యున్నది. రావణుని కా విషయం తెలుసు.
    రావణు డన్న మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ మండోదరి " 'రావణుని రాముడు యుద్ధంలో వధించనా' డని పదే పదే నా ఊహలో మెదలుతూ వున్నదే!" అని విచారిస్తూ వున్నది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    రావణు డన్న కామ మగు;
    రాము డకామము; కామ మారదే

    కావర మన్నదే విడక
    కామపు రూపుడు సీత జేరినన్

    రావణు డంత రాము డయి;
    "రావణుఁ జంపె రణమ్మునందునన్

    ధీవరుడైన రాము" డని
    తేపకు నూహ జనించెడిన్ మదిన్..

    రిప్లయితొలగించండి
  24. 80ల దాకా వచ్చిన చాలా తెలుగు ఆమాటకొస్తే భారతీయ గ్రామీణ కథా చిత్రాల్లో ప్రతినాయకుడిలాంటి వాడితను...అందుకే రావణుడితో పోల్చాను...😊

    ఈ వివరము గనుఁ డింకను
    భూ విభుడా యూరి నందు భూషణుడతడే!
    ఆ విజయదశమి దినమున
    "రావణుఁడే రాముఁ డగుచు రావణుఁ జంపెన్"

    రిప్లయితొలగించండి
  25. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కావరులైన వారి కెపుడు
    రావణుడే; రాముడగుచు రావణు జంపెన్
    శ్రీవత్సుడు సీతయెనగు
    పావని లక్ష్మిని పఱిగొని పాఱిన నపుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. సవరించండి. 'పాఱిన యపుడున్' అనండి.

      తొలగించండి



  26. పావనిని దాచె వనిలో

    రావణుఁడే ,రాముఁ డగుచు రావణుఁ జంపె

    న్నావిష్ణువె భువి యందున

    పావని కావంగ తాను భరతాగ్రజుడై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చంపెన్ + ఆ' అన్నపుడు సాధ్యమైనంత వరకు ద్విత్వ నకార ప్రయోగాన్ని వర్జించండి. అక్కడ "రావణు జంపెన్। శ్రీవిష్ణువె..." అనవచ్చు.

      తొలగించండి
  27. పావని జానకమ్మఁ జెర పట్టి వనమ్మున బంధి సేసెనా
    రావణు డంత, రాముడయి రావణు జంపె రణమ్మునందునన్
    శ్రీవిభుఁ జేరి జేవతలు క్షేమము గూర్చుమనంచు వేడగా
    తా వసుధన్ గదా దశరథాత్మజుడై జనియించి చక్రియే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దేవతలు'..టైపాటు. "..గూర్చు మటంచు" అనండి.

      తొలగించండి
  28. కందం
    పావని సీతను తాకక
    జీవన గమ్యము నెరుగుచు చేరగ ప్రభువున్
    దావైరి గ హరిఁ గొలువన్
    రావణుఁడే, రాముఁడగుచు రావణుఁ జంపెన్

    రిప్లయితొలగించండి
  29. పావనియైనసీతనటపాపుడుక్రూరుడునెత్తుబోయెనా
    రావణుడంతరాముడయిరావణుజంపెరణమ్మునందునన్
    బావనమైనవంశమునబ్రాభవమొందియుమేరువీరుగన్
    బేర్వడిభూతలంబునలవేయివిధంబుల గీర్తినొందెగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొన్ని లోపాలున్నవి. "పాపియు క్రూరుడు దొంగిలించె నా... మేరుధీరుడన్ ।బేర్వడి..." ఆనండి.

      తొలగించండి
  30. ఉత్పలమాల
    పావని సీతఁ దెచ్చి తను వైరిగ భక్తిని చాట నెంచుచున్
    జీవన గమ్యమున్ దెలిసి సేమము జెప్పిన నాలు తమ్ములన్
    ద్రోవకు నడ్డుగా నెఱిగి దుష్టుడుగా హరిఁ జేరఁ జూచినన్
    రావణుఁ డంత, రాముఁడయి రావణుఁ జంపె రణమ్మునందునన్
    గణ

    రిప్లయితొలగించండి
  31. జీవన మందున యాశా
    భావనరావణుడు గాగ?భక్తియు చేతన్
    దీవెన రాముడు నొసగగ ?
    రావణు డేరాముడగుచు రావణు జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "..మందున నాశా..." అనండి.

      తొలగించండి
  32. మిత్రులందఱకు నమస్సులు!

    భూవరుఁ డయ్యకై తనును, భూజయుఁ, దమ్ముఁడుఁ గాన కేఁగఁగాఁ
    గావరమంది శూర్పణఖ, కారణ జన్ముఁడు రామమూర్తితోఁ
    బూవిలుకాని రంతు సొగపుం గొన నేఁగి, ముకుంజెవుల్ దెగన్,
    బావని సీత రావణుని బంధన మందునఁ జిక్క, యుద్ధ మే
    ఘావృత సంస్థితుల్ వెలయ, నట్టెడఁ గట్టిన రాఘవేంద్రు తో
    డ్తో విటపప్రచారవితతుల్ గని, రావణుఁ డన్నదమ్ములన్
    బో విడ నాగలోకమునఁ, బోయి ప్రభంజన సూనుఁ డా యధో
    భూవరుఁ జంపఁగా, వడిని బోడిక లా మరణమ్ముఁ దెల్పఁగా,
    రావణుఁ డంత, "రాముఁ ’డయిరావణు’ జంపె రణమ్మునందునన్
    సేవకులార రం" డనుచుఁ జివ్వయొనర్పఁగఁ బిల్చె నందఱన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. దశాస్యునితో మొదలైన సమస్యకై దశపాదముల నాశ్రయించితిని!

      తొలగించండి
    3. సుకవి మిత్రులు గుండా వారికి నమస్సులు!

      హనుమంతుఁడు రాముని సేవకుఁడు కాఁబట్టి, యతఁడు సంపినను, రాముఁడే యైరావణుఁ జంపెనని తలఁచి, రావణుఁడు యుద్ధసన్నద్ధుఁడు కావడమే యిందలి విశేషము! నిజమునకు అహిరావణుఁడను దానిని ఐరావణుఁ డనెడి లోక వ్యవహార ముండుటచే నిది సాధ్యమైనది.

      రాముఁడు + అయి, రావణున్ + చంపెన్ ... అనెడి యర్థము వచ్చుదానిని...
      రాముఁడు + అయిరావణున్ + చంపెన్ ... అను నర్థము వచ్చునట్లుగాఁ గూర్చుటయే యిందలి విఱుపులోని మెఱుపు!
      స్వస్తి!

      తొలగించండి