సార్! ఇది ఒక సామెత..అడివికి మంటలు చెలరేగినప్పుడు అన్ని జంతువులూ పారి పోతాయి. దుప్పి తప్ప. దాని కొమ్ములు చెట్ల తీగలలో ఇరుక్కొని. మామూలుగా అయితే దుప్పి తన బింబాన్ని నీటిలో చూసి మురిసిపోతుందట
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2625 సమస్య :: *అందము నాశనమ్మయిన దంచు కడున్ ముద మందె నాతియే.* ఒక యువతి తన అందం నాశనమైపోయిందని చాలా సంతోషపడింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: బలరాముడు కృష్ణుడు ఇద్దరూ అక్రూరుని వెంట వెళ్తూ మధురానగరంలో ప్రవేశించినప్పుడు మరుగుజ్జు రూపంలో అందవిహీనగా ఉన్న కుబ్జ కనిపించింది. కంసునికి దాసి, సుగంధ లేపన విద్యలో ఆరితేరినది అగు ఆమె బలరామ కృష్ణులను చూచి, సంతోషించి వారికి తన దగ్గఱ ఉన్న లేపనాలను ఇచ్చింది. అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ కుబ్జను తాకి ఆమెను అందమైన స్త్రీ గా మార్చినాడు. ఆ సమయంలో కుబ్జయొక్క సంతోషాన్ని ఆమె మాటలలోనే వివరించే సందర్భం.
సీతాదేవి గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. ***** విట్టుబాబు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. "...యవనీస్థలిపై। యాడియు... తనపతి। నాడించుట..." అనండి.
సందర్భము: విరాటరాజు కొలువులో ఒక యేడాది అజ్ఞాత వాసం చేసే ముందు ధర్మరాజు నీ వెలాంటి కొలువు చేస్తా వని అర్జునుణ్ణి అడిగాడు. అత డిలా చెప్పాడు " నే నొకసారి దేవలోకం వెళితే ఊర్వశి నన్ను కామించింది.నేను తిరస్కరించాను. ఆమె నపుంసకుడివి కమ్మని శపించింది. దేవేంద్రుడు "అజ్ఞాత వాసంలో ఆ శాపా" న్ననుభవించు. అన్నాడు. నేను పేడి రూపంలో విరాటుని కొలువులో ప్రవేశిస్తాను. అంతఃపురంలో ఆడపిల్లలకు నాట్యం నేర్పుతాను. ఇంతకుముందు ద్రౌపది వద్ద నాట్యాచార్యునిగా వున్నా నని చెబుతాను." ఈ (అజ్ఞాత వాస) సమయంలో నీవు అలా వుండిపోవడమే మంచి దన్నది భార్య ద్రౌపది. (ఎవరూ గుర్తు పట్టలే రని ఉద్దేశ్యం) ~~~~~~~~~~~~~~~~~~~~~~~ అందము చిందు వా డయిన యర్జును గాంచెను; మోహ మందె నా సుందరి యైన యూర్వశియు; చొక్కడు; "పేడివి గమ్ము పొ" మ్మనెన్ సుందరి; "మంచి ద ట్లగుట సు మ్మిపు" డన్నది భార్య; వానిదౌ నందము నాశన మ్మయిన దంచుఁ గడున్ ముద మందె నాతియే
సందర్భము: ఈ మధ్య ఆడవాళ్ళకు జడ వేసుకోకుండా జుట్టు పూర్తిగా విరబోసుకోవడం బాగా అలవాటైపోయింది. అదేదో ఆధునికత అనుకోవడం బలిసిపోయింది. సంప్రదాయం అంటే అసలే పట్టదు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ అంద మిది యంచు కేశము
కందము వ్రాయగ మది పద
రిప్లయితొలగించండిమందము చెడిపోయె ననుచు, నతివయె మురిసెన్
పొందిక కుదిరిన పిమ్మట
మందస్మిత వదన మాయె మహిళా మణికిన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అందము మగవాని రిపువు...
రిప్లయితొలగించండిచందము మృగమునకు కొమ్ము జ్వాలలయందున్ ...
మందుడు వ్యభిచారి మగని
యందము చెడిపోయె ననుచు నతివయె మురిసెన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జ్వాలలయందున్' అన్నదానికి అన్వయం?
సార్! ఇది ఒక సామెత..అడివికి మంటలు చెలరేగినప్పుడు అన్ని జంతువులూ పారి పోతాయి. దుప్పి తప్ప. దాని కొమ్ములు చెట్ల తీగలలో ఇరుక్కొని. మామూలుగా అయితే దుప్పి తన బింబాన్ని నీటిలో చూసి మురిసిపోతుందట
తొలగించండి(తమిళభక్తకవయిత్రి అవ్వయార్ గణపతిని ప్రార్థించి వృద్ధాప్యం కోరుకుంది)
రిప్లయితొలగించండిఎందరొ పూరుషుల్ గనుచు నెంతయొ మోహము నందుచుండగా
సుందరి అవ్వయారు తన సోయగమంతయు మార్చి వృద్దతన్
బొంద ననుగ్రహింపుమని బొజ్జగణాధిపు గోరి వృద్ధయై
యందము నాశనమ్మయినదంచు గడున్ ముదమందె నాతియే.
బాపూజీ గారూ..
తొలగించండిపాదానికి తగినట్టు అర్థం మారకుండా అద్భుతంగా పూరించారు.
🙏🏻💐
ధన్యవాదాలు విట్టుబాబు గారూ !
తొలగించండిబాపూజీ గారూ! చక్కని సన్నివేశాన్ని యెంచుకున్నారండీ! అభినందనలు! 🙏🙏🙏
తొలగించండిధన్యవాదాలు సీతాదేవిగారూ !
తొలగించండిబాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
శంకరార్యులకు ధన్యవాదాలు .
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిపొందిక మంథరావచనముల్ వినుటన్ దగ నీసు నొందుటన్ ,
ముందుగ పొందినట్టి వరమున్ బతిఁ గోరగ నెంచి కైకయున్
జిందరవందరౌనటులు చేసెను దీపములార్పి గీము , నా
క్రందిత చిత్తవృత్తి తిలకమ్మును దుడ్చియు, పూలు ద్రెంపి, దా
నందము నాశన మ్మయిన దంచుఁ గడున్ ముదమందె నాతియే !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపువారూ!
తొలగించండినమోన్నమః
🙏🏻
ధన్యవాదాలండీ శ్రీ విట్టు బాబు గారికి.. శ్రీ శాస్త్రి గారికి కూడా 🙏
తొలగించండిమైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅందరును మెచ్చుకొన దన
తొలగించండియందమునకు దిష్టి తగులునని జడ పాయన్
ముందుకు లాగి బిగించుచు
నందము చెడిపోయెనంచు నతివయె మురిసెన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
కొందఱు భైరవాశ్వములు, కొందఱు పార్థుని తేరి టెక్కెముల్,
రిప్లయితొలగించండికొందఱు ప్రాక్కిటీశ్వరులు కొందఱు కాలుని యెక్కిరింతలున్,
కొందఱు కృష్ణజన్మమున కూసిన వారల బోలుచుండగా
నిందరి సంతతిన్ గలిగి యింతియె చాలిక చాలుచాలని
న్నందము నాశన మ్మయిన దంచుఁ గడున్ ముదమందె నాతియే
ఆహా...మీ పదవిన్యాసం అమోఘం.
తొలగించండి👌🏻🙏🏻💐
నాది కాదు... కవి సార్వభౌమ శ్రీనాథునిది...నాది చౌర్యమే చాలా వరకు
తొలగించండిసవరణ:
తొలగించండినిందరు సంతతిన్ గలిగి ...
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిశ్రీనాథుని చాటువును చక్కగా వినియోగించుకున్నారు. చక్కని పూరణ. అభినందనలు.
"చాలిక చాలు చాలటం। చందము..." అనండి.
సుందరమగు పలు సామ్ముల
రిప్లయితొలగించండినెందుకు కొని రారటంచు నేడ్చుచు పతితో
చిందరవందర చేయుచు
నందము చెడిపోయెననుచు నతివయె మురిసెన్
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2625
సమస్య :: *అందము నాశనమ్మయిన దంచు కడున్ ముద మందె నాతియే.*
ఒక యువతి తన అందం నాశనమైపోయిందని చాలా సంతోషపడింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: బలరాముడు కృష్ణుడు ఇద్దరూ అక్రూరుని వెంట వెళ్తూ మధురానగరంలో ప్రవేశించినప్పుడు మరుగుజ్జు రూపంలో అందవిహీనగా ఉన్న కుబ్జ కనిపించింది. కంసునికి దాసి, సుగంధ లేపన విద్యలో ఆరితేరినది అగు ఆమె బలరామ కృష్ణులను చూచి, సంతోషించి వారికి తన దగ్గఱ ఉన్న లేపనాలను ఇచ్చింది. అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ కుబ్జను తాకి ఆమెను అందమైన స్త్రీ గా మార్చినాడు. ఆ సమయంలో కుబ్జయొక్క సంతోషాన్ని ఆమె మాటలలోనే వివరించే సందర్భం.
నందసుతుండు నన్ను గనినాడు, సుగంధము నందినాడు, నా
కందము నిచ్చినాడు, ముద మందుచు నన్ స్పృశియించినాడు గో
విందుడు, చూడు నేడు కనువిందగు ; నాదగు కుబ్జరూపమే
*మందము ? నాశన మ్మయిన దంచు కడున్ ముద మందె నాతియే.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (14-3-2018)
ఆర్యా!
తొలగించండిపురాణాల్లో మీకు దొఱకని సందర్భమంటూ ఉండదేమో!!
🙏🏻💐
🙏🙏🙏👏👏👏👌👌👌
తొలగించండిసహృదయులు శ్రీ Ps Rao విట్టు బాబు గారికి హృదయపూర్వక ప్రణామాలు.
తొలగించండిసహృదయులు
తొలగించండిశ్రీ గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారికి భక్తిపూర్వక ప్రణామాలు.
కోట రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
సుందర దేహము గనుగొని
రిప్లయితొలగించండిపొందుచు స్వర్గము మదనుని పోరాటములో
చిందర చేయ విభుడు తన
యందము చెడిపోయె ననుచు నతివయె మురిసెన్
మీ సరస శృంగార పూరణ సూపరు. మీ భావాన్నే కాపీ కొట్టా...
తొలగించండి🙏🏻💐
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిసరసమైన మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.
సుందరిమిగులన్వగచెను
రిప్లయితొలగించండినందముచెడిపోయెననుచు,నతివయెమురిసె
న్నందముగలదాననగుచు
నందమెకదమనిషిమిగులనాకర్షింపన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"సుందరి మిగుల వగచె దన। యందము..." అనండి.
కుందెను మదిలో నెంతయు
రిప్లయితొలగించండినందము చెడిపోయె ననుచు; యతివయె మురిసెన్
కుందనపు హారము గొనుచు
విందుకు తరలంగ నెంతొ విభవముతోడన్!
👌👌👌
తొలగించండిజిలేబి గారు మాయమైపోయారు 😌
🙏🙏🙏🙏
తొలగించండిసూపరు సీతాదేవిగారూ...
తొలగించండిఅతిశయోక్తి అనుకోకపోతే మీకన్నా బాగా దీన్నింకెవరూ పూరించలేరు
ఎంతయినా ఆడువారు అందురు గానీ..కాదు వారు అడించెడివారే!!
🙏🏻💐
అన్యధా భావించవలదు. చతురోక్తి మాత్రమే!! 🤣
తొలగించండిఆడుట వారికె సొత్తగు
నాడించుట వారి కెఱుక యవనీ తలమున్!
ఆడియు నాడక మగడిని
యాడించుట నాడువారి యశమది గనుమా!!
జీపీయస్‌వారూ...
తొలగించండినేనూ అదే చూస్తున్నా...జిలేబీవారి జిలుగులు వెలుగులు కనిపించలేదేమిటా యని...
ధన్యవాదములు విట్టుబాబుగారూ!
తొలగించండి“ శివ శ్శక్త్యాయుక్తో యదిభనతి శక్తః “
యని శంకరులు చెప్పినదే గదా!
🙏🙏🙏🙏
భవతి
తొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
*****
విట్టుబాబు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
"...యవనీస్థలిపై। యాడియు... తనపతి। నాడించుట..." అనండి.
నతివయె మురిసెన్
రిప్లయితొలగించండివదనమున మొటిమలు జేర వగచె నంట
రిప్లయితొలగించండివనిత యందము చెడిపోయె ననుచు నతివ
యెమురిసెన్ సరి యగులేపనమొకటి పతి
పేరిమిన గొని తెచ్చిన ప్రేమనుగని.
విరించి గారూ,
తొలగించండికందపాదాన్ని తేటగీతిలో ఇమిడ్చి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పేరిమిని" అనండి.
ముందుగ నేడ్చె మొటిమగని
రిప్లయితొలగించండియందము చెడిపోయె ననుచు నతివయె, మురిసెన్
చందురునికి మచ్చయె కను
విందనుచును తెలుప భర్త విజ్ఞత తోడన్
విరించి గారూ,
తొలగించండిసవ్యసాచు లనిపించుకున్నారు. మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఆకాశవాణి,హైదరాబాదు కేంద్రం వారి
రిప్లయితొలగించండి10-03-2018 నాటి సమస్యకు పూరణ :
******)(******
సమస్య:
"మేదిని మండనమ్ములగు మెండుగ నిండుగ ; మండటెండలే"
పూరణ:
ఏదని యెంచి చూడగనె యింతికి బొట్టె విభూషణమ్మగున్
కాదన లేని సత్యమిది కమ్మని సూక్తులె యెల్ల వేళలన్
మేదిని మండనమ్ములగు మెండుగ నిండుగ ; మండటెండలే
వాదుకు తావు లేదుకద!వందుఱు జేయును సర్వ జనాళినిన్.
బాగుంది.
తొలగించండిచందురు బోలునట్టి సతి చక్కని భూషనముల్ దరించి తా
రిప్లయితొలగించండిపందిరి మంచమందు కడు పాటన మొప్పగ చెంగలించగా
చిందరవందరల్ సలిప చెన్నగు నాథుడు, పొంగి పల్కె నా
యందము నాశన మ్మయిన దంచుఁ గడున్ ముదమందె నాతియే
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
"భూషణముల్ ధరించి... పాటవ మొప్పగ...సలిపె..." అనండి.
సుందరియేడ్వసాగెనటజోరుగవచ్చినశీతలంబుచే
రిప్లయితొలగించండినందమునాశనమ్మయినదంచు,గడున్ముదమందెనాతియే
యందముదానుగాదనకుసంభవమౌటకునెంతయోమది
న్నందమె కాదెయింతులకునాహ్లదమొందగ జేయునీనిలన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆహ్లద' మనడం సాధువు కాదు. పదాల మధ్య ఎడం ఉంచండి.
అందరు మెచ్చగా నతివ యందము గొప్పని పొంగిపోయెతా
రిప్లయితొలగించండిసుందరమైన కోమలిని చూడగ నొక్కెడ వళ్ళుమండగా
పొందుగ స్నేహమున్ నెరపి బోలెడు నాసివి మందులీయగా
అందము నాశనమ్మయిన దంచుఁ గడున్ ముదమందె నాతియే
(అందంగా ఉన్న ఇంకో స్త్రీకి నాసిరకపు మందులనిచ్చి యామె అందము చెడిపోవగా సంతసించెను అన్న భావంతో)
వెంకటప్పయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వళ్ళు' అనడం గ్రామ్యం.
సుందర వదన లు కొందరు
రిప్లయితొలగించండిపందెము లో గెలువ నెంచి పాల్గొన నందు న్
తొందర పడు పక్కా వి డ
అందము చెడి పోయె ననుచు న తి వ యె మురిసె న్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సుందర రూపమే మిగుల శోభను గూర్చును వాస్తవమ్ముగన్
రిప్లయితొలగించండికొందఱు సుంద రాంగులకు కొంపలు ముంచును పైని యందమే !
సుందరియౌ నొకావిడయె సొంపఱి,తృప్తిగ నుల్లసిల్లెగా !
"అందము నాశన మ్మయిన దంచుఁ గడున్ ముదమందె నాతియే"
****)()(****
(సొంపఱు = అందము చెడిపోవు)
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*14-3-18*
రిప్లయితొలగించండి...........సమస్య
అందము చెడిపోయె ననుచు
నతివయె మురిసెన్
సందర్భము:
ఆంజనేయుడు లంకలోని యశోకవనంలో సీతను దర్శించినాడు. అశాంతిగా వున్న సీత మనసు చాలావరకు శాంతిని పొందింది.
పావని యింక వన విధ్వంసానికి శ్రీ కారం చుట్టినాడు.
ఇదం విధ్వంసయిష్యామి
శుష్కం వన మి వానలః
సుం.కాం.స.41శ్లో.11
(ఎండిన వనాన్ని అగ్ని దహించినట్టు కాల్చివేస్తాను.)
శింశుపావృక్షం కింద ఆసీనురాలైన సీత పరిసరా లన్నీ సురక్షితాలుగా వుంచినాడు.
చారు పల్లవ పుష్పాఢ్యం
యం సీతా స్వయమాస్థితా
ప్రవృద్ధః శింశుపా వృక్షః
స చ తేనాభిరక్షితః
సుం.కాం. స.42-19 శ్లో.
అతని చేతిలో తక్కిన అశోక వన మంతా అందం చెడిపోవడం మొదలయింది. సీత సంతోషించింది.
~~~~~~~~~~~~~~~
సుందరు డగు పావని దగు
చందము నూహించి సీత శాంతినిఁ జెందెన్..
ముందరనె యశోకవనపు
టందము చెడిపోయె ననుచు
నతివయె మురిసెన్.
-------------------------
..........సమస్య
అందము నాశన మ్మయిన దంచుఁ గడున్
ముద మందె నాతియున్
సందర్భము: ఆంజనేయుడు లంకలోని యశోకవనంలో సీతను దర్శించాడు. వన విధ్వంసానికి శ్రీ కారం చుట్టినాడు.
మరిన్ని వివరాలకు నా "సుందరు డగు..." అనే పద్య సందర్భాన్ని పరిశీలించవచ్చు.
~~~~~~~~~~~~~~~~
సుందరుడైన పావని వి
శుద్ధ మనస్కను జానకిన్ గనెన్
సుందరి; "నింక విక్రమము
చూపెదఁ, దోటను బాడు చేయగా
గందరగోళ మౌను, సమ
కట్టెద" నంచుఁ దలంచె; తోటదౌ
నందము నాశన మ్మయిన
దంచుఁ గడున్ ముద మందె నాతియే..
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండికందం
సుందరి యనుష్క నటనయె
పందెమ్మని 'భాగమతి' గ వ్రణ వదనముతో
పొందెడు పేరునకున్ దగ
నందము చెడిపోయె ననుచు నతివయె మురిసెన్!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందఱుఁ దనకుం దానన
తొలగించండితందాన యన వలయు నను దనకు సవతి యీ
సుందరి గర్వము, ఘోరపు
టందము, చెడిపోయె ననుచు నతివయె మురిసెన్
[అందము = విధము; గర్వము ఘోరపుటందము = ఘోరపు టందపు గర్వము]
అందఱుఁ జేరి యొక్క యెడ నంగన లప్పుడు హాస్య కేళిలోఁ
బందెము లాడు చుండఁగ నపారపుఁ బూనికి వే చెలంగ నా
చందము వాదు లాటలు ప్రశాంతము వీగఁగ నట్టి పోరులో
నందము నాశన మ్మయిన దంచుఁ గడున్ ముదమందె నాతియే
[అందము = అలంకారము]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండివెలుదండ వారికి కృతజ్ఞతలతో
రిప్లయితొలగించండిసుందరుడా వాయుసుతుం
డందమ్మగు లంకగాల్చి యంజలి నిడగన్
మందస్మిత యగుచు పగతు
నందము చెడిపోయెననుచు యతివయె మురిసెన్!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ముందుగ సీత జాడగని మోదమునందిన వాయుపుత్రుడే
రిప్లయితొలగించండిసుందరమౌ వనమ్ముఁగల క్షోజములన్ పెకిలించుచున్నటన్
జిందులు వేసి దానవుని చిక్కులు బెంచుచు లంకగాల్చగ
న్నందము నాశనమ్మయినదంచు గడున్ ముదమందెనాతియే.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"క్షోణిజముల్ పెకలించి యచ్చటన్... లంగ గాల్చగా। నందము..." అనండి.
అందవిహీనుడైన తననందరు హేళనచేయుచుండగా
రిప్లయితొలగించండికుందుచు నుండు భర్తకును కోమలి ధైర్యము చెప్పుచుండునీ
చందము కాలమేగనొక జామున నామ్లము పోసిరామెపై
నందము నాశన మ్మయిన దంచుఁ గడున్ ముదమందె నాతియే
సుందరియగు సవతిని గని
రిప్లయితొలగించండికుందుచు నుండంగ సొగసు కోల్పడెతను యా
చందము గని ప్రత్యర్థికి
నందము చెడిపోయెననుచు యతివయె మురిసెన్!
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో 'తను' అనడం సాధువు కాదు. "కోల్పడె దా నా। చందము..." ఆనండి.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,
ముందు జనించె నీరసము ; ముద్దియ పుట్టె గదా , యనంతరం
బందురు | శౌరి భీష్మసుత కంబుజ మివ్వగ గోపరూపయై ,
చిందులు వేసి నల్లనగు చీర ధరించి నిరస్త భూషయై ,
చిందర మోముతోడ నిక జేరెను కోప గృహంబు నందు | దా
నందము నాశనం బయిన దంచు గడున్ ముద మందె || నాతియే
మందుని జేసివేయు నిజ మానస వల్లభునిన్ , క్షణాన | గో
విందుడు పాద తాడనము బ్రీతి దలిర్పగ స్వీకరింపడే ?
{ ఈరసము = అసూయ }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురుమూర్తి ఆచారి
తొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,
ధ న్య వా ద ము లు గు రు దే వా !
అం త యు మీ ఆ శీ ర్వా ద బ ల మే ! మీ ప్రో త్సా హ మే !
కొందరి కీర్ష్యాద్వేషము
రిప్లయితొలగించండిలందున సంతోష మబ్బు! నదియొక జబ్బే
నిందలచే సుమ హృదయా
నందము చెడిపోయె ననుచు నతివయె మురిసెన్ !
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సుందర రూపుడైన పతి శూర్పణఖన్ గని సంచలించునో
రిప్లయితొలగించండివందితు డాతనిన్ వనిత వంచన చేత వశీకరించునో
కుందిన జానకమ్మగని కోయగ నాసిక
లక్ష్మణుండటన్
యందము నాశనమ్మయినదంచు గడున్ ముదమందె నాతియే!
రామాయణంలో ఉందోలేదో! నా కల్పన!
తొలగించండి🙏🙏🙏🙏
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
"లక్ష్మణుండె యా। యందము..." అనండి.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏🙏
తొలగించండిసుందర రూపుడైన పతి శూర్పణఖన్ గని సంచలించునో
తొలగించండివందితు డాతనిన్ వనిత వంచన చేత వశీకరించునో
కుందగ జానకమ్మ గని కోయగ నాసిక
లక్ష్మణుండె యా
యందము నాశనమ్మయినదంచు గడున్ ముదమందె నాతియే!
అందమునే చెఱుప దలచి
రిప్లయితొలగించండియందని దని మూర్ఖు డొకడె యామ్లము బోయన్
క్రుందెను తన పయిననె బడి
"అందము చెడిపోయె ననుచు నతివయె మురిసెన్"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'క్రుందెను' కాదు.... "కుందెను" అనండి.
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,
ప్రియుడు కౌగిలింపగనె , " నా అందము చెదరి పోయిం " దని
ప్రేయసి విచారించింది . అంతలోనె అతని మధుర మైన కౌగిలి లో
స్వర్గము కనిపించగా మురిసిపోయినది .
అందము చెడిపోయినదని వగచిన అతివయె ప్రియుని కవుగిలి లోని
స్వర్గము చవి చూచి మురిసినది .
మ ధ్యా క్క ర
---------------------
మందముగా పౌడ రద్ది , మల్లియల్ సిగలోన దురిమి ,
యందముగా నుండు చెలిని హత్తు కొన - వగచె , " నాదు
నందము చెడిపోయె " ననుచు || అతివయె మురిసెన్ = మధురపు
సందిట నామె బ్రియుండు స్వర్గము జూపించ గానె
గురుమూర్తి గారూ,
తొలగించండిమీ మధ్యాక్కరా పూరణ బాగున్నది. అభినందనలు.
గురుమూర్తి ఆచారి
తొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,
ధ న్య వా ద ము లు •••••• గు రు వ ర్యా !
ఉత్పలమాల
రిప్లయితొలగించండిఅందరుఁ జూచుచుండ నడయాడుచు వెల్గి మనోహరమ్ముగ
న్నైందరొ కన్యకామణులు నింపుగ వేదిక పైన నిల్వగన్
సుందరి పీఠమందె నొక శోభన! యన్యుల మోము వాడుచు
న్నందము నాశనమ్మయిన దంచు గడున్ ముదమందె నాతియే!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మనోహరమ్ముగా। నెందరొ... వాడగా। నందము..." అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
తొలగించండిఉత్పలమాల
అందరుఁ జూచుచుండ నడయాడుచు వెల్గి మనోహరమ్ముగా
నెందరొ కన్యకామణులు నింపుగ వేదిక పైన నిల్వగన్
సుందరి పీఠమందె నొక శోభన! యన్యుల మోము వాడగా
నందము నాశనమ్మయిన దంచు గడున్ ముదమందె నాతియే!
అందము గల్గినట్టిపరునాలినిఁ గాంచిన నొక్కకాంతకున్
రిప్లయితొలగించండిడెందము దల్లడిల్లి వికటించుచు నీర్ష్య నసూయనొంద త
త్సుందరి సోయగమ్ములవి తొల్గెను "యాసిడు"దాడి కట్లుగా
అందము నాశనమ్మయిన దంచుఁ గడున్ ముదమొందె నాతియే
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఈర్ష్య, అసూయ' రెండూ ఒకటే కదా? "తొల్గగ నాసిడు దాడి..." అనండి.
శంకరయ్యగారికి నమస్సులు
తొలగించండిఈర్ష్య అసూయ అర్ధాలు ఒకటి కావు
"అక్షాంతి రీర్ష్యా సూయా దోషారోపో గుణేష్వపి"
అని అమరకోశం
ఈర్ష్య ఈసు ఓర్చలేని గుణం,
అసూయ సుగుణములందు దోషారోపణం.
అని భావార్థం.
వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిచందుగ మెఱిసెడి నెచ్చెలి
బిందము పాలై క్షతములు పీడించు వడిన్
చందము చెడగా నప్పుడు
యందము చెడిపోయె ననుచు నతివయె మురిసెన్
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అప్పుడు + అందము = అప్పు డందము' అవుతుంది. యడాగమం రాదు. "చెడగా నప్పుడె। యందము..." అనండి.
తనకన్నా ప్రక్క యింటి సుందరి అందముగా వుందన్న అసూయతో విషమ్ము (ACID) జల్లినదనే భావనతో........
రిప్లయితొలగించండిసందియమేల నాతికి ప్రశస్తముగా యొక నాతి శత్రువై
చిందులు త్రొక్కి నాశనము చేయును గాదె విచిత్ర రీతులన్
సుందరి నన్ను మించెనని చూపులకోక విషమ్ము జిమ్మి యా
యందము నాశన మ్మయిన దంచుఁ గడున్ ముదమందె నాతియే
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ప్రశస్తముగా నొక.." అనండి.
సవరిస్తాను గురువర్యా.
తొలగించండిధన్యోస్మి
ఎందుల కింత పొంగు పరమేశుని సత్కృప తోటికోడ లీ
రిప్లయితొలగించండియందము చిందు బిడ్డడిని హాయిగ గన్నదనా యన న్నుహూ
సుందరి నంచు దాని కతి సోకులు బిడ్దకు పాల నిచ్చె దా
నందము నాశన మ్మయిన దంచుఁ గడున్ ముదమందె నాతియే.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీయుతులు ఎ.సత్యనారాయణరెడ్డి గారికి కృతజ్ఞతలతో
రిప్లయితొలగించండిడెందములో యానందపు
విందయ్యెను మదనకేళిఁ విభుడను గూడన్
చందమ్ముగ శృంగారముఁ
"నందము చెడిపోయె ననుచు నతివయె మురిసెన్"
🙏🏻
తొలగించండివిట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"డెందములో నానందపు.." అనండి.
పద్యంలో మీరు ప్రయోగించిన రెండు అరసున్నాలు దోషాలే. వాటిని ప్రయోగించకండి.
ధన్యవాదాలు గురువుగారూ
తొలగించండి🙏🏻
..సమస్య
రిప్లయితొలగించండిఅందము నాశన మ్మయిన దంచుఁ గడున్
ముద మందె నాతియున్
సందర్భము: విరాటరాజు కొలువులో ఒక యేడాది అజ్ఞాత వాసం చేసే ముందు ధర్మరాజు నీ వెలాంటి కొలువు చేస్తా వని అర్జునుణ్ణి అడిగాడు. అత డిలా చెప్పాడు
" నే నొకసారి దేవలోకం వెళితే ఊర్వశి నన్ను కామించింది.నేను తిరస్కరించాను. ఆమె నపుంసకుడివి కమ్మని శపించింది. దేవేంద్రుడు "అజ్ఞాత వాసంలో ఆ శాపా" న్ననుభవించు. అన్నాడు. నేను పేడి రూపంలో విరాటుని కొలువులో ప్రవేశిస్తాను. అంతఃపురంలో ఆడపిల్లలకు నాట్యం నేర్పుతాను. ఇంతకుముందు ద్రౌపది వద్ద నాట్యాచార్యునిగా వున్నా నని చెబుతాను."
ఈ (అజ్ఞాత వాస) సమయంలో నీవు అలా వుండిపోవడమే మంచి దన్నది భార్య ద్రౌపది. (ఎవరూ గుర్తు పట్టలే రని ఉద్దేశ్యం)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
అందము చిందు వా డయిన
యర్జును గాంచెను; మోహ మందె నా
సుందరి యైన యూర్వశియు;
చొక్కడు; "పేడివి గమ్ము పొ" మ్మనెన్
సుందరి; "మంచి ద ట్లగుట
సు మ్మిపు" డన్నది భార్య; వానిదౌ
నందము నాశన మ్మయిన
దంచుఁ గడున్ ముద మందె నాతియే
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాని దైనట్టి యను భావమున “వానిదౌ యందము” సాధు వనుకుంటాను.
తొలగించండిఇక్కడ “వానిదౌను- అందము” కాదు కదా!
రావించిన యీయపరాధము భార. ఆది. 5. 21.
నీ చెప్పిన యన్నియు భార. స్త్రీ. 1. 161.
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిసుందరమగు వదనంబున
నందవిహీనమునుచేయ నలతయు కలుగన్
ఛందములేనట్టి సతి యా
అందము చెడిపోయె ననుచు నతివయె మురిసెన్"*
రిప్లయితొలగించండికుబ్జ తనమదిలో
పొందితి నేముదమును,గో
విందుని కరుణయు కలిగెను వేదన తొలగెన్
ఛందంబేమాత్రము లే
నందము చెడిపోయె ననుచు నతివయె మురిసెన్.
రిప్లయితొలగించండి............సమస్య
అందము చెడిపోయె ననుచు
నతివయె మురిసెన్
సందర్భము: ఈ మధ్య ఆడవాళ్ళకు జడ వేసుకోకుండా జుట్టు పూర్తిగా విరబోసుకోవడం బాగా అలవాటైపోయింది. అదేదో ఆధునికత అనుకోవడం బలిసిపోయింది. సంప్రదాయం అంటే అసలే పట్టదు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
అంద మిది యంచు కేశము
లం దగ విరబోసికొని విలాసము చూపన్
ముందు నిలుచు కూతును గని
యందము చెడిపోయె ననుచు
నతివయె మురిసెన్
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
అందపు ప్రాణనాథునహ హాయిగ పొందుచు పొంగిపొర్లగా
రిప్లయితొలగించండిపొందును నాతనిన్ బడయ పోకిరి కన్నెలు కన్నుగీటగా
ముందుగ జుత్తులూడుచును ముందర పండ్లనురాల భర్తదౌ
యందము నాశనమ్మయిన దంచుఁ గడున్ ముదమందె నాతియే