గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2622 సమస్య :: ......... *దుష్ట కురురాజు రణంబున జంపె భీమునిన్.* (ఛందోగోపనము అనే విశేషం ఈ సమస్యలో ఉంది) దుర్యోధనుడు భీముని చంపినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: చిన్నతనం నుండి తనకు ప్రత్యర్థి గా ఉన్న భీముని చంపాలనే ఆలోచనతో ఉన్న దుర్యోధనుడు భీముని బంధించి గంగలో పడవేయించినాడు. పాములచేత కఱపించినాడు. అతనిచే విషాన్నం తినిపించినాడు. లక్కయింట ఉంచి నిప్పు పెట్టించినాడు. భీముని చంపే విషయంలో తన ఆలోచనలు బలము వృథా అవుతున్నాయని అనుకొంటూ నిద్రించినటువంటి రారాజు ఐన కురురాజు కలగన్నాడు. ఆ కలలో దుర్యోధనుడు భీముని చంపినాడు అని తెలియజెప్పే సందర్భం.
నా జము డీతడే యనుచు నాశము జేయగ నెంచి , నేరుగా నాజిని జంప జాలక , విషాన్నము బెట్టితి , గంగ ద్రోసితిన్, నా జవ సత్త్వ రాశియు గనన్ వృథ యంచును స్వప్న మందు రా *రాజుగ నున్న దుష్ట కురురాజు రణంబున జంపె భీమునిన్.* *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (11-3-2018)
శంకరార్యా ! ధన్యవాదములు ! ఈ పద్యంతొ శంకరాభరణం - బ్లాగుకు సంబంధించినంత వరకూ ఈ 2018 సంవత్సరానికి Life Certificate submit చేసేసినట్టే మీరు ఆమోద ముద్ర వెయ్యడమే తరువాయి
నా ఆరోగ్యం "నానాటికీ తీసికట్టు నాగంబొట్లూ" అన్నట్లుంది నాలుగడుగులు నడవలేను కాళ్ళ నొప్పులు (SCIATICA) కుదురుగా కూర్చోలేను వంగో లేను నిలబడనూ లేను నడుము నొప్పి (DISC COMPRESSION) వేగంగా మెడా చేతులూ కదపలేను మెడ నొప్పి (SPODILITIS)
అనేకానేక మానసిక సమస్యలు(MENTAL DEPRESSION)
నడుముకూ కాళ్ళకూ రక్తప్రసరణ బాగా తగ్గిపోయిందని ABDOMEN లో చెరొక ప్రక్కనా రెండు STENTS కూడా వేయించు కున్నాను ప్రయోజనం శూన్యం
LATEST DEVELOPEMENT ఏమిటంటే CARERACTS బాగా వృద్ధి చెంది కళ్ళు కనబడడం లేదు భూతద్దం పెట్టుకొని అక్షరం అక్షరం చదవ వలసిన పరిస్థితి
OPERATION చేయించుకుందామంటే వీలులేని స్థితి విపరీతమైన SUGAR FASTING BLOOD SUGAR > 300 POST LUNCH BLOOD SUGAR 450-600
రోజుకు 100 యూనిట్లు INSULIN తీసుకున్నా CONTROL కావడం లేదు
ఈ రోజెందుకో మీతో నాలుగు ముక్కలు పంచుకోవాలనిపించింది వీలైనప్పుడు మళ్ళీ కలుస్తా
రిప్లయితొలగించండిఅమలిన కంటకమ్మకట! ఆరని మంటయు !పంచపాండవుల్
సమసిన మేలు! సొమ్మ సిలి సంలయనమ్మున స్వప్నమందునన్,
రమణి జిలేబి, దుష్ట కురురాజు, రణంబునఁ జంపె భీమునిన్
తమసపు విష్ణుమాయ గద దాటతరమ్మగునే జనాళికిన్!
జిలేబి
శిష్టు జూడలేని దుష్టుడా కురురాజు
రిప్లయితొలగించండిభీకరముగ జంపె భీమసేను ;
పగటికలలలోన పారవశ్యము నంది
తమ్ములంత కలసి తలలనూప .
శిష్టు జూడలేని దుష్టుడా కురురాజు
రిప్లయితొలగించండిభీకరముగ జంపె భీమసేను ;
పగటికలలలోన పారవశ్యము నంది
తమ్ములంత కలసి తలలనూప .
దుర్మదాంధు డట్లె దుష్టుఁ డా కురురాజు,
రిప్లయితొలగించండిభీకరముగఁ జంపె భీమసేను
డత నిఁ బ్రతిన బూని యనిలోన నలనాడు
ద్రుపద రాజ పుత్రి తుష్టి నంద.
దుమ్ములాడె ననిన దుష్టుఁ డా కురురాజు
రిప్లయితొలగించండిభీకరముగఁ ,జంపె భీమసేను
తొడను గొట్టి నీచ దుర్యోధనుని; భీమ
సేనుడయ్యెను కద జిత్వరుండు
దొమ్ములాడె ..
తొలగించండితొడలు విరిగి చచ్చె దుష్టుడా కురురాజు
రిప్లయితొలగించండిభీకరముగఁ జంపె భీమసేను
డతనిఁ దొమ్మిలోన యలనాడు సభలోన
పంతమూనిన విధి వాయుసుతుడు.
తొడలు విరిగి చచ్చె దుష్టుడా కురురాజు
రిప్లయితొలగించండిభీకరముగఁ జంపె భీమసేను
డతనిఁ దొమ్మిలోన యలనాడు సభలోన
పంతమూనిన విధి వాయుసుతుడు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిదుండ గమ్ము జేయు దుష్టుఁ డాకురు రాజు
నడచ కృష్ణు డచట నాంది బల్క
భండిలుడివలెను ప్రబలమును గాంచుచు
భీకరముగ జంపె భీమసేను
జిలేబి
శిష్టులైన జనుల దుష్టుడా కురురాజు
రిప్లయితొలగించండిభీకరముగ జంపె; భీమసేను
డదియు దెలిసి దలచె " పాపపు కర్మము
లవని జేయువానినసురుడంద్రు!"
రిప్లయితొలగించండిఒ ఓ :)
దుండ గమ్ము జేయ దుష్టుఁ డాకురు రాజు,
భీకరముగ జంపె భీమసేను,
భండిలుడివలెను ప్రబలమును గాంచుచు
నడచ కృష్ణు డచట నాంది బల్క!
జిలేబి
రిప్లయితొలగించండిభండిలుడివలెను ప్రబలమును గాంచుచు
నడచ కృష్ణు డచట నాంది బల్క,
దుండ గమ్ము జేయ దుష్టుఁ డాకురు రాజు,
భీకరముగ జంపె భీమసేను!
విదురుడు ధర్మరాజు తో
రిప్లయితొలగించండిబెరసు, దుష్టుడా కురురాజు, భీకరముగఁ
జంపె భీమసేనుడు వాని సమరమందు
ధరణి నీవశమయ్యెను ధర్మరాజ!
ఏలు కొమ్మీ కరిపురమును మేలుగాను
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2622
సమస్య :: ......... *దుష్ట కురురాజు రణంబున జంపె భీమునిన్.*
(ఛందోగోపనము అనే విశేషం ఈ సమస్యలో ఉంది)
దుర్యోధనుడు భీముని చంపినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: చిన్నతనం నుండి తనకు ప్రత్యర్థి గా ఉన్న భీముని చంపాలనే ఆలోచనతో ఉన్న దుర్యోధనుడు భీముని బంధించి గంగలో పడవేయించినాడు. పాములచేత కఱపించినాడు. అతనిచే విషాన్నం తినిపించినాడు. లక్కయింట ఉంచి నిప్పు పెట్టించినాడు. భీముని చంపే విషయంలో తన ఆలోచనలు బలము వృథా అవుతున్నాయని అనుకొంటూ నిద్రించినటువంటి రారాజు ఐన కురురాజు కలగన్నాడు. ఆ కలలో దుర్యోధనుడు భీముని చంపినాడు అని తెలియజెప్పే సందర్భం.
నా జము డీతడే యనుచు నాశము జేయగ నెంచి , నేరుగా
నాజిని జంప జాలక , విషాన్నము బెట్టితి , గంగ ద్రోసితిన్,
నా జవ సత్త్వ రాశియు గనన్ వృథ యంచును స్వప్న మందు రా
*రాజుగ నున్న దుష్ట కురురాజు రణంబున జంపె భీమునిన్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (11-3-2018)
క్రమాలంకార పూరణ :
రిప్లయితొలగించండి======
పగను బూని తుదకు పతన మొందెను తానె;
యని వృకోదరుండె యరులను బహు;
కోరుకొనె హిడింబ;దుష్టుఁ డా కురురాజు
భీకరముగఁ జంపె భీమసేను"
***)()(***
అన్వయము :
పగను బూని తుదకు పతన మొందెను తానె దుష్టుఁ డా కురురాజు ; యని వృకోదరుండె యరులను బహు భీకరముగఁ జంపె ; కోరుకొనె హిడింబ భీమసేను.
***)()(***
రిప్లయితొలగించండి[11/03, 08:12] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
మమతయు మానవత్వమునుమర్చి
సుతుండభిమన్యు ముట్టి కౄ
ర మనము తోడ దుష్ట కురురాజు రణంబున జంపె, భీమునిన్
ప్రముఖులు ధర్మజాదులనువాడొక హీనుడు సైంధవుండహో
విముఖత నడ్డె నొంటిగనె విక్రముడౌచు వరంబు నొందగా
రిప్లయితొలగించండి[11/03, 08:12] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
మమతయు మానవత్వమునుమర్చి
సుతుండభిమన్యు ముట్టి కౄ
ర మనము తోడ దుష్ట కురురాజు రణంబున జంపె, భీమునిన్
ప్రముఖులు ధర్మజాదులనువాడొక హీనుడు సైంధవుండహో
విముఖత నడ్డె నొంటిగనె విక్రముడౌచు వరంబు నొందగా
దు రి త చిత్తు డు గద దుష్ టు డా కురు రాజు
రిప్లయితొలగించండిభీకర ము గ జంపె భీమ సేను
డ త ని తొడలు విరిచి యని లోన చేసిన
ప్రతిన తీరు నట్లు పంతమూని
దు రి త చిత్తు డు గద దుష్ టు డా కురు రాజు
రిప్లయితొలగించండిభీకర ము గ జంపె భీమ సేను
డ త ని తొడలు విరిచి యని లోన చేసిన
ప్రతిన తీరు నట్లు పంతమూని
తోయజాక్షి!వినుము దుష్టుడా కురురాజు
రిప్లయితొలగించండిభీకరముగజంపెభీమసేను
ననుచుగలను గంటి యచ్చెరు వాయెను
నెట్లువచ్చెనట్లు నిద్దినమున
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండితుష్టిలేనివాడు దుష్టుడా కురురాజు;
తొలగించండిభీకరముగ జంపె భీమసేను
వాని తొడలు విరచి పూనిక నెరవేర్చె
నతివ సంతసిల్ల నమితముగను!
తుచ్ఛ చింతనమున దుష్టుడా కురురాజు
భీకరముగ జంపె భీమసేను
ప్రేమమీర బిల్చి పెక్కుమాటలు బల్కి
క్రోడమీయ నినుప కుంతిపుత్రు!
క్రోడము = కౌగిలింత
సీతా దేవిగారూ... రెండో పద్యం బ్రహ్మాణ్డమ్.
తొలగించండినేను పొద్దున్న సమస్య చూడగానే ఇదే భావాన్ని రాయాలనుకున్నా! కాని ఇల్లు మారే క్రమంలో తీరిక చిక్కలేదు.
☺️
ధన్యవాదములు విట్టుబాబుగారూ!
తొలగించండిపద్యం నాదైనా ఆలోచన మా అన్నయ్యగారిది! మీ అభినందన ఆయనకే చెందుతుంది!😊😊😊
పుట్టుగ్రుడ్డి యైన బుద్ధివీడిన తండ్రి
తొలగించండికౌగిలించ బొమ్మ గాఢముగను
దోషమెన్నలేని దుష్టుఁ డా కురురాజు
భీకరముగఁ జంపె భీమసేను
పౌర వాన్వ యో ద్భవ క్షాత్ర వంతుఁడు
రిప్లయితొలగించండిశత్రు పక్ష వీర సంచయమ్ముఁ
దోరముఁ గొలుచుచు, నదుష్టుఁ డా కురురాజు
భీకరముగఁ జంపె, భీమసేను
[కురువు = కురుమహారాజు, కౌరవ వంశ మూల పురుషుడు; భీమ సేనుఁడు = శంకరుఁడు]
ఓజము వీడి క్రూరుఁ డల యుద్ధపు నీతిని నెన్నకుండగన్
రాజస మించు కేనియును రంజిల నీయక మత్త చిత్తుఁడై
యోజన సేసి వెక్కసపు టుగ్రుఁడు, నెల్లరు దల్చి రివ్విధిన్,
రాజు యొసంగి దుష్ట కురురాజు రణంబునఁ జంపె భీమునిన్
[దుష్ట కురురాజు = దుష్టాన్న శ్రేష్ఠము / మహా దుష్టాన్నము ; కురువు = అన్నము; రణంబున భీమునిన్ = యుద్ధములో భయంకరుని]
ఆజిని కౌరవుల్మరియుపాండవులెల్లరు మార్కొనంగగా
రిప్లయితొలగించండిరాజుగనొప్పుదుష్టకురురాజు రణంబునజంపె భీమునిన్
మాజవరాలులేపగ నుమాపటివేళనుగన్నయీకలన్
శ్రీజకుజెప్పగావినుచుజెప్పుమ యింకను వింతలన్ననెన్
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పూర్వము మీ సమీక్షణలను
రిప్లయితొలగించండివీక్షించుటకు నెదురు చూచెడి వారము. ఇప్పుడు మా పూరణములను బరికించుటకే యెదురు చూస్తున్నాము.
భీతిలి సైనికుండొకడు భీష్ముడు ద్రోణకృపాది వీరుల
రిప్లయితొలగించండిన్నేతరి గెల్తురో? పుడమి నెవ్విధి యేలెదరంచు శంకతో
నాతడు ఖిన్నుడయ్యెనట, యంతట గాంచెను స్వప్నమొక్కటిన్
రాతిరి వేళ, దుష్ట కురురాజు రణంబున జంపె భీమునిన్.
కావునటనకు
రిప్లయితొలగించండికావునటంచుగర్వమున కర్ణుని తోడుగ యుద్ధ రంగ మున్
భావనలేనిభాద్యతగ బంధువినాశనమెంచి సైన్యమున్
రావణుడట్లుదుష్టకురురాజు రణంబునజంపె !భీమునిన్
జీవముదీయ నెంచగనె?చిత్రముగా బలినాయె వింతగా !
ఎందుకు
రిప్లయితొలగించండిసార్
రిప్లయితొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
*"...దుష్టుఁ డా కురురాజు భీకరముగఁ*
*జంపె భీమసేను"*(ఛందో గోపనము)
సందర్భము: సులభము
~~~~~~~~~~~~~~~~~~~~~~~
దు ష్పథానువర్తి, దుష్టుఁ డా కురురాజు...
భీకరముగఁ జంపె భీమసేను
డతని, తన ప్రతిజ్ఞ నమలుఁ జేసె, రణాన
తొడలు విరుగగొట్టి త్రోసి వేసె
2 వ పూరణము:--
*ప్రమదావనం*
సందర్భము: భీముడు దుర్యోధనుని భీకరంగా వధించినాడు. అతని తొడలు విరిగిపడినవి.
ఆంజనేయునిచేత లంకా నగరంలోని ప్రమదావనంలో గొప్పగొప్ప వృక్షాలు విరిగిపడలేదా! (అదే విధంగా)
సీతా సందర్శనం తర్వాత...
*తతస్తు హనుమాన్ వీరో*
*బభఞ్జ ప్రమదావనమ్...*
(సుందర కాండ స 41 శ్లో 15)
అప్పుడు హనుమంతుడు ప్రమదావనమును విరిచివేసెను. (ధ్వంసం చేసెను)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
తొడలు విరిగి పడియె! దుష్టుఁ డా కురురాజు
భీకరముగఁ జంపె భీమసేను;
డాంజనేయుచేత నా ప్రమదావన
మ్మున మహా మహీజములు విరుగవె!
..............సమస్య
(ఛందో గోపనము)
*"...దుష్ట కురురాజు రణంబునఁ జంపె*
*భీమునిన్"*
సందర్భము: ఒక యోధుడు దుర్యోధన వధానంతరం భీమునితో అంటున్నాడు..
"అంతటి రారాజై యుండి యల్పులను మాత్రమే వధించ గలిగినాడు. ఓ భీమసేనా! నిన్ను వధించలేక యిలా భయంకరంగా కన్ను మూసినాడు."
~~~~~~~~~~~
మోజు, లశాశ్వతంపు సుఖ
ముల్, మదిఁ గోరుటె పెద్ద త ప్పగున్..
తేజము లేని వారలను
దీటుగ నల్పులఁ బట్టి, రాజు తా
రాజుల కెల్ల, దుష్ట కురు
రాజు రణంబునఁ జంపె; భీము, ని
న్నాజి వధింప జాలక భ
యావహ రీతిని కన్ను మూసెడిన్
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
.....సమస్య
రిప్లయితొలగించండి*"...దుష్టుఁ డా కురురాజు భీకరముగఁ*
*జంపె భీమసేను"*(ఛందో గోపనము)
సందర్భము: సులభము
~~~~~~~~~~~~~~~~~~~~~~~
దు ష్పథానువర్తి, దుష్టుఁ డా కురురాజు...
భీకరముగఁ జంపె భీమసేను
డతని, తన ప్రతిజ్ఞ నమలుఁ జేసె, రణాన
తొడలు విరుగగొట్టి త్రోసి వేసె
2 వ పూరణము:--
*ప్రమదావనం*
సందర్భము: భీముడు దుర్యోధనుని భీకరంగా వధించినాడు. అతని తొడలు విరిగిపడినవి.
ఆంజనేయునిచేత లంకా నగరంలోని ప్రమదావనంలో గొప్పగొప్ప వృక్షాలు విరిగిపడలేదా! (అదే విధంగా)
సీతా సందర్శనం తర్వాత...
*తతస్తు హనుమాన్ వీరో*
*బభఞ్జ ప్రమదావనమ్...*
(సుందర కాండ స 41 శ్లో 15)
అప్పుడు హనుమంతుడు ప్రమదావనమును విరిచివేసెను. (ధ్వంసం చేసెను)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
తొడలు విరిగి పడియె! దుష్టుఁ డా కురురాజు
భీకరముగఁ జంపె భీమసేను;
డాంజనేయుచేత నా ప్రమదావన
మ్మున మహా మహీజములు విరుగవె!
..............సమస్య
(ఛందో గోపనము)
*"...దుష్ట కురురాజు రణంబునఁ జంపె*
*భీమునిన్"*
సందర్భము: ఒక యోధుడు దుర్యోధన వధానంతరం భీమునితో అంటున్నాడు..
"అంతటి రారాజై యుండి యల్పులను మాత్రమే వధించ గలిగినాడు. ఓ భీమసేనా! నిన్ను వధించలేక యిలా భయంకరంగా కన్ను మూసినాడు."
~~~~~~~~~~~
మోజు, లశాశ్వతంపు సుఖ
ముల్, మదిఁ గోరుటె పెద్ద త ప్పగున్..
తేజము లేని వారలను
దీటుగ నల్పులఁ బట్టి, రాజు తా
రాజుల కెల్ల, దుష్ట కురు
రాజు రణంబునఁ జంపె; భీము, ని
న్నాజి వధింప జాలక భ
యావహ రీతిని కన్ను మూసెడిన్
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
sar
రిప్లయితొలగించండిసవరణతో: ********* క్రమాలంకార పూరణ :
రిప్లయితొలగించండి======
పగను బూని తుదకు పతన మొందెను తానె;
యని వృకోదరుండె యరులను బహు;
యిష్టపడె హిడింబ;దుష్టుఁ డా కురురాజు
భీకరముగఁ జంపె; భీమసేను"
***)()(***
అన్వయము :
పగను బూని తుదకు పతన మొందెను తానె దుష్టుఁ డా కురురాజు ; యని వృకోదరుండె యరులను బహు భీకరముగఁ జంపె ; కోరుకొనె హిడింబ భీమసేను.
***)()(***
(శ్రీ నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలతో)
ఈ వారం ఆకాశవాణి వారి సమస్య తెలుప గలరు
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఆ.వె.
ద్రుఘుణ మెత్తి వచ్చె దుష్టుడా కురురాజు
భీకరముగ; జంపె భీమసేను
డతని తొడలు విఱిచి నాహవమందున
ప్రతిన తనది చక్కబఱచు కొనుచు
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఆ.వె.
ద్రుఘుణ మెత్తి వచ్చె దుష్టుడా కురురాజు
భీకరముగ; జంపె భీమసేను
డతని తొడలు విఱిచి నాహవమందున
ప్రతిన తనది చక్కబఱచు కొనుచు
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
పరీక్ష గదిలో తడబాటు - జవాబు పత్రంలో పొరపాటు :
01)
____________________________
"భీకరముగ జచ్చె - భీము జేత"
వ్రాయబోయి యొకడు - వ్రాసె నిటుల
"ధుర్మదాంధుడైన - దుష్టుడా కురురాజు
భీకరముగ జంపె - భీమ సేను"
____________________________
రిప్లయితొలగించండిదుష్ట బుద్ధి జూపు తులువయౌ కురురాజు
భీకరముగఁ జంపె భీమసేను
డతని తొడలు పట్టి యదుముచు నాజిలో
ప్రతిన దీర్చుకొనియె పట్టు బట్టి.
భారత రణమందు బలముతో కురురాజు
భీకరముగఁ జంపె భీమసేను
మడుగులోన దాగ మర్మభేదములగు
పలుకులాడి యతని బయట పిలిచె.
"దుర్మదాంధు డతడు దుష్టుఁ డా కురురాజు,
రిప్లయితొలగించండిభీకరముగఁ జంపె భీమసేను
డతని తొడలు విరిచి; ఆజిలోన గెలుపు
నందె పాండు పుత్రు లా క్షణమ్ము!
ఆటవెలది
రిప్లయితొలగించండితొందర పడి రగిలి దుష్టుడా కురురాజు
భీకరముగఁ జంపె భీమసేను
ప్రతిమఁ గౌగిటఁ గొని సుతుఁ గూల్చె నని నొచ్చి
సూత్రధారిగ హరి శుభము నొసగ.
(కురురాజు = ధృతరాష్ట్రుడు)
"దుర్మదాంధు డతడు దుష్టుఁ డా కురురాజు,
రిప్లయితొలగించండిభీకరముగఁ జంపె భీమసేను
డతని తొడలు విరిచి; ఆజిలోన గెలుపు
నందె పాండు పుత్రు లా క్షణమ్ము!
మొదటి పాదంలో గణదోషం
రిప్లయితొలగించండిఔను గదూ - గమనించ లేదు
మిత్రమా
ధన్యవాదములు !
సవరణతో
పరీక్ష గదిలో తడబాటు - జవాబు పత్రంలో పొరపాటు :
01అ)
____________________________
"భీకరముగ జచ్చె - బీమసేనుని చేత"
వ్రాయబోయి యొకడు - వ్రాసె నిటుల
"ధుర్మదాంధుడైన - దుష్టుడా కురురాజు
భీకరముగ జంపె - భీమ సేను"
____________________________
కవులూరు రమేష్(వసంత కిశోర్)
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిఈ పద్యంతొ
శంకరాభరణం - బ్లాగుకు సంబంధించినంత వరకూ
ఈ 2018 సంవత్సరానికి
Life Certificate submit చేసేసినట్టే
మీరు ఆమోద ముద్ర వెయ్యడమే తరువాయి
నా ఆరోగ్యం
"నానాటికీ తీసికట్టు నాగంబొట్లూ"
అన్నట్లుంది
నాలుగడుగులు నడవలేను
కాళ్ళ నొప్పులు (SCIATICA)
కుదురుగా కూర్చోలేను వంగో లేను నిలబడనూ లేను
నడుము నొప్పి (DISC COMPRESSION)
వేగంగా మెడా చేతులూ కదపలేను
మెడ నొప్పి (SPODILITIS)
అనేకానేక మానసిక సమస్యలు(MENTAL DEPRESSION)
నడుముకూ కాళ్ళకూ రక్తప్రసరణ బాగా తగ్గిపోయిందని
ABDOMEN లో చెరొక ప్రక్కనా
రెండు STENTS కూడా వేయించు కున్నాను
ప్రయోజనం శూన్యం
LATEST DEVELOPEMENT ఏమిటంటే
CARERACTS బాగా వృద్ధి చెంది కళ్ళు కనబడడం లేదు
భూతద్దం పెట్టుకొని అక్షరం అక్షరం చదవ వలసిన పరిస్థితి
OPERATION చేయించుకుందామంటే వీలులేని స్థితి
విపరీతమైన SUGAR
FASTING BLOOD SUGAR > 300
POST LUNCH BLOOD SUGAR 450-600
రోజుకు 100 యూనిట్లు INSULIN తీసుకున్నా
CONTROL కావడం లేదు
ఈ రోజెందుకో మీతో నాలుగు ముక్కలు పంచుకోవాలనిపించింది
వీలైనప్పుడు మళ్ళీ కలుస్తా
not careracts - cateracts
రిప్లయితొలగించండిధర్మరాజు - దుస్వప్నం - కలత - తేరుకొనుట :
రిప్లయితొలగించండి02)
____________________________
క్షుద్రపు స్వప్నమందు గని - క్రుంగగ గుండెలు ధర్మజుం, " డనిన్
రుద్ర సమానుడై గదను - రువ్వగ భీముడు రాజు యూరువున్
ఛిద్రము జేయగా దలచి; - చిత్రముగా మరి త్రిప్పి మోదుచున్
రౌద్రముతోడ దుష్ట కురు - రాజు రణంబున జంపె భీమునిన్ ! "
భద్రము భీమసేనుడను - పార్థుని పల్కుల శ్రాంతుడయ్యెడున్ !
____________________________
కవులూరు రమేష్(వసంత కిశోర్)
వసంత కిశోర్ గారు మీ యారోగ్యము కుదుట పడి యూఱట కలుగ వలెనని భగవంతుని బ్రార్థించు చున్నాను.
తొలగించండికామేశ్వర రావు గారూ ! ధన్యవాదములు !
తొలగించండిధర్మరాజు - దుస్వప్నం - కలత - తేరుకొనుట :
రిప్లయితొలగించండి02)
____________________________
క్షుద్రపు స్వప్నమందు గని - క్రుంగగ గుండెలు ధర్మజుం, " డనిన్
రుద్ర సమానుడై గదను - రువ్వగ భీముడు రాజు యూరువున్
ఛిద్రము జేయగా దలచి; - చిత్రముగా మరి త్రిప్పి మోదుచున్
రౌద్రముతోడ దుష్ట కురు - రాజు రణంబున జంపె భీమునిన్ ! "
భద్రము భీమసేనుడను - పార్థుని పల్కుల శ్రాంతుడయ్యెడున్ !
____________________________
కవులూరు రమేష్(వసంత కిశోర్)
శంకరార్యా మోడరేషన్ పెట్టారా ? ఎందుకని ?
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండితొందర పడి రగిలి దుష్టుడా కురురాజు
భీకరముగఁ జంపె భీమసేను
ప్రతిమఁ గౌగిటఁ గొని సుతుఁ గూల్చె నని నొచ్చి
సూత్రధారిగ హరి శుభము నొసగ.
(కురురాజు = ధృతరాష్ట్రుడు)
ఉత్పలమాల
రిప్లయితొలగించండిచేటు గలుంగు వాయుసుతుఁ జిక్క సుయోధను కంచు నమ్మియున్
గోటను వీడలేని తను గ్రుడ్డిగ సంజయు మాధ్యమాన పో
రాటము జూచి స్వప్నమున రంజిల నెంచుచు పుత్రవత్స లా
రాటము తోడ దుష్ట కురురాజు రణంబునఁ జంపె భీమునిన్!
కురురాజు = ధృతరాష్ట్రుడు
తొలగించండి