25, మార్చి 2018, ఆదివారం

సమస్య - 2633 (వృశ్చికపుచ్ఛంబుమీఁద...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వృశ్చికపుచ్ఛంబుమీఁద వృషభము నిలిచెన్"
(లేదా...)
"వృషభము వచ్చి నిల్చినది వృశ్చికపుచ్ఛము మీఁదఁ జూడుమా"
(శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారి 'అవధాన సరస్వతి' గ్రంథం నుండి)

ఒక విన్నపం... కవిమిత్రులు తమ పూరణ పద్యాలలో కందంలో శకార చకార సంయుక్తాక్షరాన్ని, వృత్తంలో షకారాన్ని మాత్రమే ప్రాసాక్షరాలుగా ప్రయోగించండి. విశేష ప్రాసలను ప్రయోగించకండి.

68 కామెంట్‌లు:

 1. ఆశ్చర్యమ్మిది మామా!
  పశ్చిమ మేఘములనెల్ల పరికించంగా
  నిశ్చయమౌ రూపమ్మిది:
  వృశ్చికపుచ్ఛంబుమీఁద వృషభము నిలిచెన్!

  రిప్లయితొలగించండి
 2. నిశ్చయమది విషముం డును
  వృశ్చిక పుచ్చంబు మీఁద , వృషభము నిలిచెన్
  పచ్చిక బయలుల పైనను
  మచ్చిక గామేయు చుండు మనము ప్పొంగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   చివరి రెండు పాదాల్లో ప్రాస తప్పింది. సవరించండి.

   తొలగించండి
  2. నిశ్చయమది విషముం డును
   వృశ్చిక పుచ్చంబు మీఁద , వృషభము నిలిచెన్
   నిశ్చయముగ శివు నియెదుట
   యాశ్చర్యము గాదు నిజమ్ము యందరు మెచ్చన్

   తొలగించండి
 3. నిశ్చయముగ శాంకరియున్
  ప్రశ్చోదకుడైన'మహిషు'- పద ఘట్టనతో
  నిశ్చింతగ చెడు బాపెను
  వృశ్చిక పృచ్ఛంబుమీద వృషభము నిలిచెన్

  రిప్లయితొలగించండి
 4. ఆశ్చర్యముగ వెడలె అకు
  తశ్చిద్భయుఁడు విరటుని సదమ్మునకు మనో
  నిశ్చల తోడన్, యకటా
  "వృశ్చికపుచ్ఛంబుమీఁద వృషభము నిలిచెన్

  ధర్మ రాజు తమ్ములతో కలసి విధి వక్రించ విరాటు కొలువున జేరేనుగదా యను భావన

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారు
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. మైలవరపు వారి పూరణ

  భషణము జేయుచుంటివిట శ్వానము భంగి , త్వదీయ శక్తినిన్
  చషకము పట్టి పాయసము చక్కగ ద్రాగిన రీతి బీల్చెదన్ !
  శషభిషలాపుమా యనుచు శాంకరి నిల్వగ మాహిషాంఘ్రిపై
  వృషభము వచ్చి నిల్చినది వృశ్చికపుచ్ఛము మీఁదఁ జూడుమా" !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 6. కందం
  వృశ్చిక మమ్మాయిది తాఁ
  బిచ్చిగ వృషభంపు రాశి భీముని వలచన్
  ముచ్చట గని జనులనిరిటు
  వృశ్చికపుచ్ఛంబుమీఁద వృషభము నిలిచెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుదేవులకు ప్రణామములు. పైన వాడిన ప్రాసను చంధస్సు సాఫ్టువేరు సరియేనన్నది. కూడదంటారా, పద్యము తొలగించగలవాడను.

   తొలగించండి
  2. మిత్రమా గురువు గారు శకార చకార సంయుక్తాక్షరమును అడిగినట్లున్నారు పరిశీలించండి

   తొలగించండి
  3. సవరించిన పూరణ :

   కందం
   వృశ్చిక రాశినిఁ బుట్టిన
   నిశ్చల తా వృషభ రాశి నేస్తుని వలచన్
   నిశ్చయమున జనులనిరిటు
   వృశ్చికపుచ్ఛంబుమీఁద వృషభము నిలిచెన్

   తొలగించండి
  4. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారు
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2633
  సమస్య :: *వృషభము వచ్చి నిల్చినది వృశ్చిక పుచ్ఛము మీద చూడగన్.*
  ఒక వృషభము తేలుయొక్క తోకమీద (కొండెమీద) నిలబడింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: కర్ణుడు వీరులలో వృషభం లాంటి వాడు. దుర్యోధనుడు వృశ్చికం లాంటి వాడు. ఎల్లప్పుడూ స్వయంకృషితో ప్రకాశించే కర్ణుడు స్నేహంకోసం దుష్టుడైన దుర్యోధనుని పక్షంలో నిలిచినాడు. ఇది ఎలా ఉందంటే వృషభం వృశ్చికం తోకపై (కొండెపై) నిలబడినట్లు ఉంది అని విశదీకరించే సందర్భం.

  వృషభము వంటి వాడగును వీరులలో గన కర్ణు, డెల్లెడన్
  విషమతియౌ సుయోధనుడు వృశ్చికతుల్యుడు, సర్వదా స్వయం
  కృషి దనరారు కర్ణు డపకీర్తుల నిల్చెను దుష్టమైత్రితో,
  *వృషభము వచ్చి నిల్చినది వృశ్చిక పుచ్ఛము మీద జూడుమా !*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (25-3-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవధాని కోటరాజశేఖర్ గారు
   మీ పూరణ అద్భుతముగా వున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. నిశ్చయమిదిగాంచినచో
  పశ్చిమ దేశాన నొక్క పత్రిక లోన
  న్నాశ్చర్యము గొలుపు పటము
  వృశ్చిక పుచ్ఛంబు మీద వృషభము నిలిచెన్

  రిప్లయితొలగించండి
 9. నిశ్చయ మయ్యె వివాహము
  వృశ్చిక రాశియె వరుడట వృషభమె వధువౌ
  యాశ్చర్యముతో పలికిరి
  వృశ్చిక పుచ్ఛంబుమీద వృషభము నిలిచెన్

  రిప్లయితొలగించండి
 10. వృశ్చిక మొకవిల నుగ నొక
  పాశ్చాత్యుడు చిత్రమొకటి వాసిగ తీయన్
  దుశ్చర్యల ఖండించుచు
  వృశ్చిక పుచ్ఛంబు మీద వృషభము నిలిచెన్

  రిప్లయితొలగించండి
 11. నిశ్చయముగ నుండువిషము
  వృశ్చిక పుచ్ఛంబు మీద; వృషభము నిలిచెన్
  నిశ్చలుడై శంభునెదుట
  నిశ్చింతగ నందిరూపు నిరతముగొల్వన్!

  రిప్లయితొలగించండి
 12. డా.పిట్టా సత్యనారాయణ
  పశ్చిమ శాస్త్రజ్ఞులు వే
  దుశ్చ్యవనులు శాస్త్రమందు దొరలిన బొమ్మన్
  ఆశ్చర్య గరిమనాభిని
  వృశ్చిక పుచ్ఛంబు మీద వృషభము నిలిచెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా వారు
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   దుశ్చ్యవనులు ?

   తొలగించండి
  2. డా.పిట్టాసత్యనారాయణనుండి
   ఆర్యా' దుశ్చ్యవనుడు, ఇంద్రుడు. (శ.ర)

   తొలగించండి
 13. ఆర్యా,
  "దొరలిన బొమ్మల్"అని చదువ గలరు.డా}.పిట్టానుండి}

  రిప్లయితొలగించండి

 14. ఆశ్చర్య మేమి ? "మాతం
  గాశ్చర్యంతి కరశాఖ కమలే ! కర్ణాం
  తేశ్చర్యంతి మృగేంద్రాః"
  వృశ్చిక పుచ్ఛంబు మీద వృషభము నిలిచెన్!

  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 15. కవిమిత్రులారా, నమస్కృతులు. సంగారెడ్డి సభకు బయలుదేరాను. ప్రయాణంలో ఉన్నాను. మీ పూరణలపై వెంట వెంటనే స్పందించలేను. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 16. దుశ్చింతనాక్రమించగ
  పాశ్చాత్యులు భారతమ్ము పావనగాంధీ
  నిశ్చితుడై గెల్వననిని
  వృశ్చిక పుచ్ఛంబు మీద వృషభము నిలిచెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువర్యులకు, కవిమిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు! 💐💐💐

   తొలగించండి
  2. సీతాదేవి గారు
   మీ రెండవ పూరణ బాగున్నది అభినందనలు.

   తొలగించండి
  3. ధన్యవాదములు! యెవరీ రేసుగుర్రము గారు? తెలుసుకోవచ్చా?

   తొలగించండి
  4. అవునా?
   జిలేబిగారూ! నిజంగా మీరు రేసుగుర్రమే!
   మీ పునర్దర్శనంతో మళ్ళీ రోజూ ఆంధ్రభారతిని దర్శించవలసి వస్తోంది! 🙏🙏🙏

   తొలగించండి
 17. పశ్చిమ దిక్కున న భ మున
  నాశ్చ ర్యము గొలుపునట్టు ల ద్భు త రీతి న్
  నిశ్చయ రూప ము కనబడె
  వృశ్చిక పుచ్చంబు మీద వృషభ ము నిలిచె న్

  రిప్లయితొలగించండి
 18. డా.పిట్టాసత్యనారాయణ
  కృషకుని బాల నాట నొలికించె సిరా నది భూమినింకగా
  మృషలగు యూహలన్ బెనగి మేల్మిని బొమ్మల జూచె నందునన్
  ఝషములు దేళ్ళు గన్పడగ జల్లెను నీళ్ళను గొల్కుంందు తా
  వృషభము వచ్చి నిల్చినది వృశ్చిక పుచ్ఛము మీద జూడుమా!

  రిప్లయితొలగించండి

 19. శషబిష లేల జాతకము చక్కగ నుండె జిలేబి! తీరుగా
  వృషభము వచ్చి నిల్చినది వృశ్చికపుచ్ఛము మీఁదఁ జూడుమా
  కషణము లేల వీడుమిక కాంక్షల ధామము ;నేర్పుగానుచున్
  పషిణిగ మార్చు నీ బతుకు బంధము లెల్లతొలంగు నీకికన్!


  శ్రీరామనవమి శుభాకాంక్షలతో

  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. 👌👌👌 పషిణి జిలేబికివె పండుగ శుభాకాంక్షలు!

  రిప్లయితొలగించండి
 21. విషయ మెఱంగుమంటి నిది విజ్ఞత బెంచును భారతీయుడా
  విషధరుడైన శంకరుని విస్తృత భక్తిని చూపనెంచుచున్
  వృషభము వచ్చి నిల్చినది, వృశ్చిక పుచ్ఛము మీదజూడుమా
  విషమును దాచుకున్నదది వేదన బెట్టెడు వారిఁ గుట్టగా.

  రిప్లయితొలగించండి
 22. పశ్చిమమునందు మాయల
  మశ్చీంద్రుడు వృషభరాశి మగువను వలచెన్
  వృశ్చికము తనదియెన్నగ
  వృశ్చిక పుచ్చంబు మీద వృషభ ము నిలిచె న్

  రిప్లయితొలగించండి
 23. వీటూరి భాస్కరమ్మమార్చి 25, 2018 11:01 AM
  శషభిషలేల జాతకము చక్కగ నప్పెను వీరికొప్పుగన్
  మిషలిడ తావులేదికను మేలుగ సాగును జీవితమ్ము శే
  ముషి వెస బొందగల్గుదురు మోదముతోడను రాశి చూడగన్
  వృషభము వచ్చి నిల్చినది వృశ్చికపుచ్ఛము మీఁదఁ జూడుమా" !!

  రిప్లయితొలగించండి
 24. రిప్లయిలు
  1. దుశ్చర్యఁ జలుప కాకము
   పశ్చిమమున రాఘవుండు బ్రహ్మాస్త్రమునే
   యాశ్చర్యమ్ముగ నేసెను
   వృశ్చికపుచ్ఛంబుమీఁద వృషభము నిలిచెన్


   ఋషి వరులైన సైచుదురె యీ మశకంపుఁ బ్రహార బాధఁ బ్ర
   త్యుషమున నిల్వఁ గర్ణమున దోమయె, తా విదలించ వేగ నా
   వృషభము, వచ్చి నిల్చినది వృశ్చిక పుచ్ఛము మీఁదఁ జూడుమా
   విషమును గ్రక్కు కీట మని భీతి యొకింతయుఁ జెందకుండగన్

   తొలగించండి
 25. డా.పిట్టా సత్యనారాయణ
  "జల్లెను నీళ్ళను గొల్కులందు"గాచదువఢలరు.మూడవ పాదంలో

  రిప్లయితొలగించండి
 26. రిప్లయిలు
  1. సమస్య : -
   "వృశ్చికపుచ్ఛంబుమీఁద వృషభము నిలిచెన్

   *కందము**

   పశ్చిమ దిక్కున బాలుని
   నిశ్చయముగను కుడుతుందని గ్రహించినదై
   నాశ్చర్య వేగ పడుతూ
   వృశ్చికపుచ్ఛంబుమీఁద వృషభము నిలిచెన్"

   తొలగించండి
 27. పశ్చిమ మేషుని చంపగ
  నిశ్చిత మదిని హిమసుతయు నీచుని బట్టన్
  ఖశ్చిత కావఁగ లోకుల
  వృశ్చికపుచ్ఛంబుమీఁద వృషభము నిలిచెన్


  Dr H Varalakshmi
  Bangalore

  రిప్లయితొలగించండి
 28. పశ్చిమ దిక్కున జూడగ
  నిశ్చితయాకృతి జలదము నింగిని పొందెన్
  యాశ్చర్యచకితులై కన
  వృశ్చిక పుచ్ఛంబు మీఁద వృషభము నిలిచెన్

  రిప్లయితొలగించండి
 29. నిశ్చల! మీటును కాలిడ
  వృశ్చికపుచ్ఛంబుమీఁద, వృషభము నిలిచెన్
  నిశ్చింతగా పొలములో
  నిశ్చలమగు ప్రకృతిలోన నివసన ముండన్

  రిప్లయితొలగించండి
 30. క్వశ్చను జేయుచు నడిగెద
  పశ్చిమ దేశము నయున్న ప్రాగ్దిశ జనులన్
  నిశ్చయమే మీవాసము
  "వృశ్చికపుచ్ఛంబుమీఁద వృషభము నిలిచెన్"

  రిప్లయితొలగించండి
 31. ఉషయను పాప వేయ తనయూహను
  నెద్దుపటమ్ము నొక్కటిన్,
  విషమును జిమ్ము తేలును వివేకముతోడ సువర్ణకాంతితో
  మిషయవ ఫానుతోడగు సమీరము నాట్యము జేయ చిత్రముల్
  వృషభము వచ్చినిల్చినది వృశ్చికపుచ్ఛము మీద జూడుమా!

  రిప్లయితొలగించండి
 32. నిశ్చయముగ భస్మాసుర
  నిశ్చితమోహినియు రచన నేర్పున జంపెన్
  నిశ్చేతన నియమాలకు
  వృశ్చిక పుచ్ఛంబుమీద వృషభము నిలచెన్,

  రిప్లయితొలగించండి
 33. చంపకమాల
  ఇషణము తీవ్రమై వరుస లెంచని కీచకుఁ డార్తి జెందెడున్
  విషయము దెల్ప భీమునకు వేదన ద్రౌపది బాసె నంతలో
  విషమతిఁ ద్రుంచు వ్యూహమున వేదిక నర్తనశాల జేయగన్
  వృషభము వచ్చి నిల్చినది వృశ్చికపుచ్ఛము మీఁదఁ జూడుమా!

  రిప్లయితొలగించండి
 34. కృషినటఁజేసి చేలను స్వకీయగృహంబులఁ గోష్టమందున్
  వృషభము వచ్చి నిల్చినది, వృశ్చికపుచ్చము మీదఁజూడు మా
  వృషభము కాలుమోప నట గ్రాసము మేయుచు వాలమూపుచున్,
  విషమును గోలుపోయె, నికఁబింకపుఁదేలుకు నెట్టికష్టమౌ.

  రిప్లయితొలగించండి


 35. కం:ఆశ్చర్యంబిది గనుమా
  నిశ్చయముగ కాటువేయ నెంచగ తేలున్
  నిశ్చితముగ దానినణచి
  వృశ్చికపుచ్ఛంబు మీద వృషభము నిలిచెన్.

  రిప్లయితొలగించండి


 36. ఆశ్చర్యంబుగ బాలుడు
  నిశ్చలుడై బొమ్మగీచె నెవ్వెర పడగన్
  పశ్చిమ కుడ్యము పైనను
  వృశ్చిక పుచ్చంబు మీద వృషభము నిలిచెన్.

  రిప్లయితొలగించండి
 37. *25-3-18*.సమస్య
  "వృశ్చిక పుచ్ఛంబుమీఁద
  వృషభము నిలిచెన్"

  *అసలైన దక్షత*

  సందర్భము: శ్రీ నీలకంఠ జటాజూట సంభవుడైన వీరభద్రుని పురస్కరించుకొని దక్షాధ్వర ధ్వంసానికి మహా సంరంభంతో బయలు దేరినారు ప్రమథ గణాలు నందీశ్వరుడు మున్నగువారు.
  అప్పుడు నిశ్చలుడైన పరమేశ్వరుడు వినయ వినమి తోత్తమాంగుండై చేతులు జోడించి యెదుట నిలిచిన నందీశ్వరునితో పలుకుతూ వున్నాడు.
  "వృశ్చికము మంచిదే సుమా! దాని తోకలోనే వున్నది దుశ్చరిత మంతా... దాన్ని తొలగిస్తే సరిపోతుంది. అట్లే దక్ష ప్రజాపతి మంచివాడే! నిరీశ్వరమైన యజ్ఞాన్ని గావించా లనే సంకల్పమే విష పూరితం (లోక కంటకం). దాన్ని తొలగించాలి. అది త ప్పని నిరూపించబడాలి. అంతే కాని యెవరినీ ద్వేషించరాదు. అందరివల్లా లోకోపకారం జరుగాల్సిందే కదా!"
  అసలైన దక్షత యేదో అర్థమై నందీశ్వరుని (మనస్సు) వృశ్చిక పుచ్ఛము మీద నిలిచింది.
  ~~~~~~~~~~
  "వృశ్చికము మంచిదే సుమ!

  దుశ్చరితము పుచ్ఛమందె,

  తొలగవలె" ననెన్

  నిశ్చలుడు శివుడు నందిని..

  "వృశ్చిక పుచ్ఛంబుమీఁద

  వృషభము నిలిచెన్"

  2 వ పూరణము:--

  *బొమ్మ లాట*

  సందర్భము: బొమ్మ లాట ఆడుకుంటున్న ఒక చిన్నారి ఎంతో సంబరపడిపోతూ వాళ్ళమ్మతో ఇలా అంటున్నది.
  ~~~~~~~~~~~~
  "వృశ్చిక మేమో పే...ద్దది..

  యాశ్చర్యం బెద్దు బొమ్మ

  యది బు...ల్లిదిలే!

  నిశ్చలముగ నిదె యమ్మా!"

  వృశ్చిక పుచ్ఛంబుమీఁద

  వృషభము నిలిచెన్

  3 వ పూరణము:--

  *తేలుకొండి మీసం*

  సందర్భము: తేలు వంటి వాడు రుక్మి. కొండి వంటిది అతని మీసం.. అనే భావన దీనికి మూలం.
  రుక్మిణిని కృష్ణుడు తీసుకొని వెళుతూ వుంటే ఆమె సోదరుడైన రుక్మి అడ్డు వచ్చినాడు. కృష్ణుడు చంపబోతే రుక్మిణి వారించినది. కృష్ణుడు అతని నవమానించిన చాలు నని తల కొరిగి, *తేలుకొండివంటి మీసము* నొకదానిని తీసివేసినాడు.

  కావున ఛురికతోఁ దల నునుపుగా నొనరిచి నిగారమౌ
  బావ మొగమున మీసము నొకటి పా డొనరిచి ప్రచండమౌ
  కావరము విడదీసి ఘనవర కట్నముగఁ గొనెదన్ ద్వదీ
  యావరణ మృదుశీల ధన మిభయాన! మురిపెపుఁ గౌగిటన్.. (తృ.ఆ.117ప)

  రుక్మిణీ కల్యాణము.. శ్రీ విద్వాన్ చక్రాల లక్ష్మీ కాంత రాజా రావు గారి గ్రంథంనుంచి
  (మనోహరమైన కరి బృంహిత వృత్తంలో వారు దీన్ని వర్ణించడం జరిగింది.)

  తేలు ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా దాని తోక మాత్రం తొలగించినట్టు కృష్ణుడు రుక్మిని చంపకుండా అవమానంమాత్రమే చేసినాడు. కృష్ణుడు వృషభంలాంటి వా డని భావన. ఆతడు పాదం మోపితే నిజానికి తేలు కొండిమాత్రమే కాదు తేలే లేకుండా పోతుంది. కాని ఆతడు కరుణించినాడు. రుక్మికి ప్రాణాలు దక్కినవి.
  ~~~~~~~~~~~
  వృశ్చిక వాలము మీసము

  దుశ్చరితుడు రుక్మి దగును తొలగించె గదా

  ఆశ్చర్యముగా కృష్ణుడు!...

  "వృశ్చిక పుచ్ఛంబుమీఁద

  వృషభము నిలిచెన్"

  ............సమస్య
  వృషభము వచ్చి నిల్చినది
  వృశ్చికపుచ్ఛము మీఁదఁ జూడుమా!

  *భరత వృషభం*

  సందర్భము: భరతుడు వృషభంలాంటి వాడు. మంధరయొక్క విష పూరిత వచనమే వృశ్చికంయొక్క పుచ్ఛం.
  మంధర మాట విష భరితము గాన వెంటనే కైకకు తల కెక్కినది.
  కాని ఆ విషం కైక పుత్రుడైన భరతునికి మాత్రం తల కెక్కలేదు. అత డొకరకంగా ఋషి తుల్యుడే!
  ~~~~~~~~
  కృషి యెది లేక రాజ్య రమ
  కి మ్మనకుండ వరించు నంచు తా

  విషమతియై వచింప చెలి..
  వింతగ నమ్మెను కైక, పుత్రుడో

  ఋషి యనదగ్గ వాడు, రుచి
  యించునె! పౌరులు నిట్లు వల్కిరే!

  "వృషభము వచ్చి నిల్చినది
  వృశ్చిక పుచ్ఛము మీఁదఁ జూడుమా!"

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 38. ఉష! అట మేఘ జాలములు నుత్తర మందున తోచెనిట్టులన్:👇
  "వృషభము వచ్చి నిల్చినది వృశ్చికపుచ్ఛము మీఁదఁ "
  జూడుమా!
  శషభిష లాడుచున్నదట శంకర వాహన మాపసోపలన్
  ముషికిలు మీర పేడనిడ ముచ్చట మీరగ తోకనెత్తుచున్ :)

  రిప్లయితొలగించండి