7, మార్చి 2018, బుధవారం

సమస్య - 2618 (చీమ ముద్దాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను"
(లేదా...)
"చీమయె ముద్దులాడె నల  శీతమయూఖునిఁ జిత్ర మయ్యెడిన్"

86 కామెంట్‌లు:

  1. కల్వకుంటల ధీరుడు గర్వముగను
    పోరి సాధించ తెలగాణ కోరికలను
    సకల జీవులు రంజిల్ల చంద్రునింట
    చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను :)

    రిప్లయితొలగించండి
  2. కలియు గంబున వింతలు కలవు మెండు
    కలను గాంచెను గగనాన కాపు రమ్ము
    వెలుగు వెన్నెల కాంతుల జిలుగు మురిసి
    చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్ర ముగను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      స్వప్నవృత్తాంతపు మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  3. బాలుడొకడు కాగితముపై,వన్నెకాడు

    చందమామ చిత్రము గీచె చక్కగాను!

    కనెను చంద్రుని బొమ్మని కపిశమొకటి

    చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్ర ముగను


    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘వనపర్తి☘

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కపిశము అంటే ఒక రంగు. మీరు "కపిశ యొకటి" అనండి.

      తొలగించండి

  4. విష్ణు మాయగ జీవన వీధి నాట
    కంబు ! తరచిచూడ జిలేబి గాన్పడి మజ
    చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను!
    మాయ తొలగు నెప్పుడు పెరుమాళ్ళ కెరుక !

    శుభోదయం!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. అందములు చిందు దివ్యమౌ నాలయమున
    విశ్వమోహననటరాజవిగ్రహంబు;
    స్వామి మెడలోని పూదండ సరసనున్న
    చీమ ముద్దాడె జంద్రుని జిత్రముగను.

    రిప్లయితొలగించండి
  6. శంకరాభరణం...07/03/18..బుధవారం
    సమస్య: చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్ర ముగను
    **** **** *** *** *
    తే.గీ.
    శ్రమజీవి యేది నుడువు చక్కగాను?

    బిడ్డ నేమిజేసెను తల్లి ప్రేమతోడ?

    రాహు వెవరిని మ్రింగె గర్వంబుచేత?

    చీమ ,ముద్దాడెఁ ,జంద్రునిఁ జిత్రముగను




    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘వనపర్తి☘

    రిప్లయితొలగించండి
  7. చిత్రకారుడు గీయగా చిత్రపఠము
    విన్ను పై గ్రహముల మేళవించి ప్రీతి
    నంబుజన్ముని పై మచ్చ నశన మనుచు
    చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చిత్రపటము' అనండి.

      తొలగించండి
  8. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2618
    సమస్య :: *చీమయె ముద్దులాడె నల శీతమయూఖుని చిత్ర మయ్యెడిన్.*
    నేలపై ఉండే చీమ నింగిలో ఉండే చంద్రుని ముద్దులాడింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: *కిందముడు* అనే ముని తాను తన భార్య జింక రూపాలను ధరించి శృంగారక్రీడలో ఉండగా వేటకై అడవికి వచ్చిన పాండురాజు ఆ జింకలపై బాణప్రయోగం చేసి మునిశాపమునకు గుఱి యయ్యాడు. కామరూపులైన దేవతలు కూడా కోరికతో ఇతర రూపాలను పొందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే చంద్రుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోహిణీ నక్షత్రంతో కలసి పిపీలికల రూపాలలో విహరించినట్లు భావిస్తే చీమ యైన రోహిణి చంద్రుని ముద్దులాడింది అని కల్పించి చెప్పే సందర్భం.

    ఏమనవచ్చు *కిందమ* మునీంద్రుడు జింకగ మారె భార్యతో
    కామము నంద, దేవతలు గాంతురు కోరికఁ గామరూపమున్,
    ప్రేమగ తార చంద్రుడు పిపీలికలై విహరించుచుండగా,
    *చీమయె ముద్దులాడె నల శీతమయూఖుని చిత్ర మయ్యెడిన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (7-3-2018)

    రిప్లయితొలగించండి
  9. అంద మైన ట్టీ చిత్ర ము నల రు నట్లు
    చిత్ర కారు డు గీచె ను శీత కరుని
    పటము పై ప్రాకె చీమల బారు నందు
    చీమ ముద్దాడె చంద్రుని చిత్ర ము గను

    రిప్లయితొలగించండి
  10. కొండ మల్లయ్యను కొలువ కుటపు లెల్ల
    నమసములు బెట్టుచూ వేసినారు పూల
    దండలు మెడలో,దానిలో దాగి నట్టి
    చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బెట్టుచూ' అనడం గ్రామ్యం. 'సమసములు బెట్టుచును" అనండి.

      తొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    "పాముల దాల్చినాడు ,వృషభమ్మును బూన్చెడువాడు , హస్తికిన్
    బామునకూర్ణనాభికిని భద్రతఁ గూర్చినవాడు , పాకెదన్
    ప్రేమగ దేహమందని" పిపీలిక *పాదము బట్టి* పైకి రాన్
    చీమయె ముద్దులాడె నల శీతమయూఖునిఁ , జిత్ర మయ్యెడిన్ !
    చీమకు దక్కె ముక్తి! శివసేవలు వ్యర్థము గావు నమ్ముడీ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. కొడుకు పేరు చంద్ర....

      గుక్కపెట్టెను బాలుండు గుట్టినదని
      చీమ , ముద్దాడె చంద్రుని చిత్రమనగ
      తల్లి , యతడూరుకొనెను ! వాత్సల్యమహిమ !
      మాతృప్రేమను మించిన మందు కలదె ?!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. సమస్యాపాదలేఖనములోని దోషమును సవరించితిని... మన్నింపుడు 🙏🙏

      కొడుకు పేరు చంద్ర....

      గుక్కపెట్టెను బాలుండు గుట్టినదని
      చీమ , ముద్దాడె చంద్రుని చిత్రముగను
      తల్లి , యతడూరుకొనెను ! వాత్సల్యమహిమ !
      మాతృప్రేమను మించిన మందు కలదె ?!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  12. పరమ కుగ్రామ వాసియౌ బాలు డొకడు
    పఠనమున జేసి జిల్లాకు పాలకునిగ
    పదవి నందగ ప్రజలెల్ల పలికి రిట్లు
    చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను.

    రిప్లయితొలగించండి
  13. ఎన్నికలలను నాయకులేమి జెప్పి
    రెన్ని కలలను కళ్ళకు యెట్లు గట్టి
    రా పలుకుల సామ్యము జూడ యనగ వచ్చు
    "చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఎన్నికలలోన... కనులకు నెట్లు.. జూడ ననగవచ్చు..." అనండి.

      తొలగించండి
    2. ఎన్నికలలోన నాయకులేమి జెప్పి
      రెన్ని కలలను కనులకు నెట్లు గట్టి
      రా పలుకుల సామ్యము జూడ ననగ వచ్చు
      "చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను"

      తొలగించండి


  14. నామజపమ్ములన్ గనుచు నమ్ముచు నిత్యము భక్తి తోడుగన్
    నీమము తప్ప కన్ బతుకు నీడ్చుచు కన్నుల ముందు గాను వి
    శ్వామృత మున్తృణమ్మని సుశారదుడిన్మదిలోన్జిలేబి, య
    ర్చీమయె ముద్దులాడె నల శీతమయూఖునిఁ జిత్ర మయ్యెడిన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అర్చీమయె'...?

      తొలగించండి


    2. అర్చి - కాంతి కిరణము

      అర్చీమయె - ఆ కాంతి కిరణము -

      సరియేనాండీ ?


      జిలేబి

      తొలగించండి
  15. .కోమల భావ బంధము లు గొప్పగ చిత్తము న న్ జనింప గ న్
    ధీమతి నేత గా జనుల దివ్య శుభా శ య సిద్దికోస మై
    నీ మ ము తో శ్రమించి నిశ నిద్ర వ శుoడగు చంద్ర బాబు ని న్
    చీమ యె ముద్దు లాడెను శీత మయూఖుని చిత్ర మ య్యే డి న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొన్ని టైపాటు లున్నవి.

      తొలగించండి
  16. ఎంతటి సజీవ చిత్రమ్మి దేమనందు?
    చంద్ర మోహను బుగ్గన సలుపెడీమ
    వాస్త వమ్మని భ్రమచెంది వచ్చి చేరి
    చీమ ముద్దాడె చంద్రుని చిత్రముగను.
    ****)()(****
    (సలుపెడి + ఈమ ;ఈమ = పుడు;వ్రణము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సలుపెడి + ఈమ' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
  17. భామను వెంట బెట్టుకొని బందరు లోనొక ప్లానిటోరియమ్
    ప్రేమగ వెళ్ళినాను,తెర పెక్కు గ్రహమ్ముల జూపువేళ లం
    దామెయె, చూపె చీమను సితాంశువు పైకదలాడ వేడుకన్
    జీమయె ముద్దులాడె నల  శీతమయూఖునిఁ జిత్ర మయ్యెడిన్

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  18. చీమ ముద్దాడె జంద్రుని జిత్రముగను
    బాపు గీచిన చిత్రము భళిర యనుచు
    దేలియాడిరి సంతోష ధేనయందు
    చూచు వారలా చిత్రంపు చోద్యమునకు

    రిప్లయితొలగించండి
  19. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. భామకు ప్రేమమీర దన పాశము దెల్పగ గామరూపుడై
    శ్యామల వర్ణుడా తిధిని చాటుగ రోహిణి గౌగిలింపగా
    నామె ధరించు నా కుసుమహారపు బువ్వుల దాగియు న్ననా
    "చీమయె ముద్దులాడె నల  శీతమయూఖునిఁ జిత్ర మయ్యెడిన్"

    రిప్లయితొలగించండి
  21. గోముగ చంద్రయానమున గొప్పగ శ్రీహరికోట యందునన్
    నీమము వీడకన్ చెలగి నీటుగ రాకెటు దద్దరిల్లగా
    మామ పిపీలకమ్మరిగి మంకుగ దూకగ చందమామపై
    చీమయె ముద్దులాడె నల శీతమయూఖునిఁ జిత్ర మయ్యెడిన్


    శీతమయూఖిని ఉష్ణోగ్రత 100 డిగ్రీలు సెంటిగ్రేడు... అది వేరే విషయం :)

    రిప్లయితొలగించండి
  22. ఏమని జెప్ప నోపునిక నీకలి కాలమునందు జూ డగా
    చీమయె ముద్దులాడె నల శీతమయూఖుని జిత్ర మయ్యెడిన్
    భామరొ దీనిఁజూడగను బాపు య గీచె ను నట్లుగా జుమీ
    చీమల రూపమున్దనరె శీత మయూఖుడు రోహిణుల్ నటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "బాపుయె గీచిన యట్లుగా.. రోహిణుల్ గనన్" అనండి.

      తొలగించండి
  23. చెవులపిల్లి దర్పమ్మునఁ దివిరి తిరుగ
    వింత సొగసుల నీనుచుఁ జెంత సేరి
    యేల తగను నే నంచును వాల మెక్కి
    చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను


    ఏమిల భారతీయులమ యెన్నఁడు నల్పము కాదు శాస్త్ర సం
    గ్రామము లందు నేరికినిఁ గాలిడి టెక్కెము చంద్రు సీమపై
    భీమపు వేగ సంహిత మభీతిని, మానవుఁ డెంత తల్చగం
    జీమయె, ముద్దులాడె నల శీతమయూఖునిఁ జిత్ర మయ్యెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
      'చెంతన్ + చేరి' అన్నపుడు సరళాదేశ ద్రుతకార్యాలు జరుగుతాయి కదా? మీరు గసడదవాదేశం చేశారు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      చెంత (విశేష్యము, ప్రథమా విభక్తి) గా ప్రయోగించి గసడదవా దేశ సంధి నుద్దేశ్యపూర్వకము గానే చేసితిని. సమీపము సేరి యన్నట్లు. ఉచితమేనా తెలుపగోర్తాను.

      తొలగించండి
    3. నేను మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. ఆమోదిస్తున్నాను.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
    5. సుకవి మిత్రులు కామేశ్వరరావు గారూ...నమస్సులు!
      చెంత ప్రథమాంతమైనచో, చెంత యనునది యచటికిఁ జేరినదను నర్థము వచ్చును గదా! అచట... చెంతన్ ... (=చెంతకు) అనుటయే సరియైనది. శంకరయ్య గారు సూచించినదే సమంజసముగాఁ దోచుచున్నది. లేక, మీరేమైన విశేషమైన యర్థముఁ దెలుపఁగోరినచో వివరించఁగలరు.

      తొలగించండి
    6. కవి పుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. చెంత ద్వితీయకు ప్రథమను వాడితిని. వాడిల్లు వెడలెను వలె. తప్పైన తెలుప గలరు.

      బాల.కారక. 24.
      జడంబు ద్వితీయకుం బ్రథమ బహుళంబుగా నగు.
      వాఁడు పూవులు దెచ్చె - వాఁడు పూవులను దెచ్చె.
      ఆకె సొమ్ములు దాల్చె - ఆకె సొమ్ములను దాల్చె.
      వాఁడిల్లు వెడలె - వాడింటిని వెడలె.

      బహుళకముచేఁ దృతీయా సప్తములకు విధించిన ద్వితీయకుం బ్రథమ రాదు.

      తొలగించండి
    7. కావ్య నాటక / క్రమములు పెక్కు సూచితి .. భార. ఆది. 1.10.
      చారుతర మాహాగ్రహారంబు లిచ్చుచు .. భార. ఆది. 1.7

      తొలగించండి
    8. “పొందు” అను నర్థమునఁ జేరు సకర్మక క్రియ. కుందేలు చంద్రునిఁ దానుగా సమీపించ లేదు. సమీపమును బొందినది. విధికృతము. చెంతను పొందినది. ద్వితీయమునకు బదులు ప్రథమ రావచ్చునని నా యూహ.

      తొలగించండి
  24. చీమలఁ వోలె నల్పులునుఁ జేకొని యోగ్య సమాశ్రయమ్ములన్
    గామిత సత్ఫలంబులను గాంచెదరట్లుగ, ప్రేమ మీరగన్
    హైమవతీశు నర్చనము నందొక పుష్పము నాశ్రయించగన్
    చీమయె ముద్దులాడె నల శీత మయూఖునిఁ జిత్ర మయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  25. చంద్ర మౌళికి నభిషేకసమయ మందు
    పూలదారాన దాగియు పూజ జేయ?
    శక్తి యుక్తుల గలిగిన భుక్తి కొరకు
    చీమ ముద్దాడె జంద్రుని జిత్రము గను!

    రిప్లయితొలగించండి
  26. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

    చాన ! నీ ముఖబింబము చందమామ |

    అధర మధువును గ్రోలంగ నాశపడుచు ,

    పీలక మొకటి హాయి జుంబించె | నాహ !

    చీమ ముద్దాడె జంద్రుని చిత్రముగను !

    రిప్లయితొలగించండి
  27. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి



  28. మల్లె పూవులు పరిచిన మంచు పాన్పు

    పైన నెలవంక తారల ప్రతిమలుండ

    పతియు నోరగ  గను చుండ సతిని నచట

    చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను.

    రిప్లయితొలగించండి
  29. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శివుని పటమందు శశికడ శ్రేణి వలెను
    సాగు చీమ లందున నొక సన్నగాడు
    నిలుచుటను గాంచి వాడనె నివ్విధముగ
    చీమ ముద్దాడె జంద్రుని చిత్రముగను
    (సన్నగాడు= చీమ)

    రిప్లయితొలగించండి
  30. తేటగీతి
    శబరి యాతిథ్యమున రామ చంద్రుడచట
    మధుర ఫలముల గొనినంత యధరము సుధ
    చిందెనేమొ? సీత యొడిని సేదఁ దీర
    చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను!

    రిప్లయితొలగించండి


  31. గాంచితి తెలగాణ భళి నే కాన్క గాను
    జనుల కేమిత్తును జిలేబి చాల చాల
    దేశ ప్రగతియను మధుర తేనెలూర
    చీమ ముద్దాడె చంద్రుని చిత్రముగను

    జిలేబి

    రిప్లయితొలగించండి
  32. ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. పీలకమునకు మరియెక పేరు చెపుమ?
    ప్రేమతో తల్లి బిడ్డను నేమి జేసె?
    మృడుడు ధరియించె నెవరిని తొడవు గాను?
    చీమ , ముద్దాడెఁ, చంద్రునిఁ చిత్రముగను..!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రేమతో తల్లి తనబిడ్డ నేమి చేసె" అనండి బాగుంటుంది.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారు..

      పీలకమునకు మరియెక పేరు చెపుమ?
      ప్రేమతో తల్లి తనబిడ్డ నేమి జేసె?
      మృడుడు ధరియించె నెవరిని తొడవు గాను?
      చీమ , ముద్దాడెఁ, చంద్రునిఁ చిత్రముగను..!!!

      తొలగించండి
  34. జోలపాటకన్న జోకొట్టు కథలవి
    చక్కనైన కథలు చదువువేళ
    వెలుగులీను విభుని వింతగా జూచుచు
    చీమ ముద్దాడె చంద్రుని చిత్రముగను.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పురుషోత్తమ రావు గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసింపదగినదే. కాని సమస్య తేటగీతి అయితే మీరు ఆటవెలది వ్రాశారు. మరో ప్రయత్నం చేయండి.

      తొలగించండి
  35. మిత్రులందఱకు నమస్సులు!

    వేమఱు కష్టకార్యముల భీతిలకుండ ముగించుఁ జంద్రుఁడే,
    సోమరియై, జ్వరమ్మునను శుష్కితుఁడై, యొడలెల్ల భారమై,
    తామసవృత్తి మంచమునఁ దాఁ దినఁగా, నశనార్థియై వెసన్
    జీమయె ముద్దులాడె నల శీతమయూఖునిఁ! జిత్ర మయ్యెడిన్?

    [చంద్రుఁడు = శీతమయూఖుఁడు]

    రిప్లయితొలగించండి
  36. ఉత్పలమాల
    కాముడుఁ గన్న పుత్రుడను కైవడి పండగ చంద్రహాసుడున్
    చీమయె ముద్దులాడె నలశీతమయూఖునిఁ! జిత్ర మయ్యెడిన్ 
    భామయె దిద్దగన్ 'విషము' పంచెడు లేఖ వనాంతరమ్మునన్
    సేమము గూర్చెడున్ 'విషయఁ' జేయుచు నాతని భర్తగా గొనన్!!

    రిప్లయితొలగించండి
  37. 1. భామను వెంట బెట్టుకొని బందరు లోనొక *ప్లానిటోరియమ్*
    ప్రేమగ వెళ్ళినాను,తెర పెక్కు గ్రహమ్ముల జూపువేళ లం
    దామెయె, చూపె చీమను సితాంశువు పైకదలాడ వేడుకన్
    *జీమయె ముద్దులాడె నల  శీతమయూఖునిఁ జిత్ర మయ్యెడిన్*


    *చిత్రాలు..*

    2.*దోమ* రవిపైన వ్రాలెను ప్రేమ మీర
    ముద్దు లాడె తారల *నీగ* ముచ్చటగను
    *గొంగళి పురుగు* ప్రాకెను నింగి పైకి
    *చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను*

    ప్రియురాలితో ..ప్రియుడి..సరసము

    3.చీమయె ముద్దులాడె నల  శీతమయూఖునిఁ జిత్ర మయ్యెడిన్
    భామిని! నమ్మవేని, విను! పాడ్యమి రోజున చిన్నబోవు నా
    మామయె !కారణంబిదియె,మాధురులన్ శశి జల్ల భూమిపై
    చీమయె ప్రాకి పౌర్ణమిన జీర్ణము చేయు పదారు రోజులున్

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  38. ఉత్పలమాల
    హోమము జేసినన్ మనకు నో యని బల్కని చంద్రమౌళియే
    భూమికి వచ్చి పాశుపతమున్వరమీయఁగ భిల్లుడౌచు నా
    సామున క్రీడితో నలసి శాంతి యొడిన్ దగ సేదదీరగన్
    చీమయె ముద్దులాడె నలశీతమయూఖునిఁ జిత్ర మయ్యెడిన్!


    రిప్లయితొలగించండి
  39. *7-3-18*
    ............సమస్య
    *"చీమయె ముద్దులాడె నల శీత*
    *మయూఖునిఁ జిత్ర మయ్యెడిన్"*

    సందర్భము: ఒకానొక "చీమల రాయడు" అద్దముమీది కెక్కినాడు (కెక్కినది). పైనున్న చంద్రు డందులో ప్రతిబింబించినాడు. వెంటనే అది తన ప్రేయసిని పిలిచి
    "ఇదుగో! చూశావా! చంద్ర మండలాన్ని చేరుకోగలిగిన తొలి చీమను నేనే! ఏమనుకున్నావో!" అన్నది.
    అది యింకా "నా లాగనే యింపైన రూపంతో మరో చీమకూడా వున్నది. ఎంత విచిత్రమో!" అన్నది.
    తన రూపం తానే చూచుకొని మరో చీమగా భ్రమించింది పాపం!
    అంతే కాదు. చంద్ర మండలంలో కూడ తన లాంటి చీమ ఒకటుం దని భ్రమించడమే గాక దానితో స్నేహం చేస్తే ఎంత బాగుంటుందో అని చంద్రుణ్ణి (శీత మయూఖుణ్ణి), చంద్రునిలో వున్న చీమను ముద్దాడినది.
    (తాను అద్దాన్ని ముద్దాడుతున్న సంగతి తెలుసుకోలేకపోయింది.) ఎంత చిత్రం!!
    ~~~~~~~~~~~~~~~~
    చీమల రాయ డద్దమునుఁ
    జేరి కనెన్ బయినున్న చంద్రునిన్...
    భామను బిల్చి, యి ట్లనియె..
    "బంగరు కొండరొ! చంద్ర మండలం
    బే మరి చేరుకోగలిగి,
    యీ ధరణిన్ దొలి చీమనైతి; నిం
    దేమొ కనంగ నా వలెనె
    యింపగు రూపముతోడ నుండెనే
    చీమ మరొక్క! టెంతటి వి
    చిత్రమొ!" యంచు స్వకీయ రూపమున్
    జీమగ నెంచుచున్ జెలిమిఁ
    జేసికొనన్ దలపోసి, ప్రీతి నా
    చీమయె ముద్దులాడె నల
    శీత మయూఖునిఁ జిత్ర మయ్యెడిన్..

    ..............సమస్య
    *"చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను"*

    *పిపీలికా ప్రణయము*

    సందర్భము: ఒకానొక ఆడు చీమ. దానికి ఈడు వచ్చింది. ఒకానొక మగ చీమ. దానికి కోడె వయ సున్నది.
    రెండూ ప్రేమించుకున్నాయి. చీమ చీమకు ము ద్దిచ్చింది. చీమ ము ద్దెంతైనా ప్రేమ మయము కదా!
    ఆ చీమ ముద్దే *"చంద్రుని"* (చంద్రు డనే పేరు గలిగిన చిత్ర లేఖకుని) *చిత్రము* (పేయింట్) గా కలికి (అందమైన)కుంచె ఆడినది.
    ~~~~~~~~~~~~~~~
    ఈడు వచ్చిన చిన్నారి;
    యి దొక చీమ...

    కోడె వయసున్న ప్రియుడు
    నిం కొక్క చీమ...

    చీమ చీమకు ము ద్దిచ్చె;
    ప్రేమఁ మయము

    *చీమ ము; ద్దాడెఁ "జంద్రునిఁ"*
    *జిత్రముగను*

    కలికి కుంచియ; చిత్ర
    లేఖకు డతండు...

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  40. గోముగ చంద్రశేఖరుని గోడను వ్రేలెడి చిత్రలేఖపై
    సోముని మీదనున్ కణము చూడగ నొక్కటి పంచదారదౌ
    ప్రేమగ పాకి పాకుచును పెన్నిధి జేరుచు మందహాసుడై
    చీమయె ముద్దులాడె నల శీతమయూఖునిఁ జిత్ర మయ్యెడిన్

    రిప్లయితొలగించండి