ఐతే సంస్కృతంలో ఘనరాఘవబాణతతికి కలవరడుచున్ అనండి. లేదా రాఘవు అని తెలుగుచేసినప్పుడు ఘన అని సంస్కృత విశేషణం దాని ముందు ఉంఛలేము అందుకే ఘను రాఘవు అని రెండు మాటలుగా ఘనుడైన రాఘవుని అన్న అన్వయంతో ప్రయోగించండి.
లంకిని : పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879 లంకను కాపాడునట్టి ఒక రాక్షసి. ఇది తఱచుగా లంక అనియే గ్రంథముల యందు వాడఁబడి ఉన్నది. హనుమంతుఁడు సీతను వెదక వచ్చినప్పుడు పట్టణములో చొరనీక ఇది అతనిని అడ్డగించి అతనిచే ఓటుపడియెను.
మొదట్లో కొంత ధార కనబడుతోంది. అభినందనలు. మరింత కృషి అవసరం. 'తునుమంగన్ భళి రామచంద్రు రణమందున్' అన్నది దారుణమైన దోషం! రామచంద్రుణ్ణి యుధ్దంలో చంపగా అని అర్థం వస్తున్నది - శాంతం పాపమ్! 'తునుమంగన్ భళి రామచంద్రు రణమందున్ ఇక్కడనుండి మొత్తం గణపూరణాయాసమే కనిపిస్తోంది. అన్వయం కూడా సరిగా లేదు.
శ్యామల రావు గారూ, ధన్యవాదాలు! ఈనెల మూడవ తేదీన విశాఖపట్నంలో ప్రసాద్ ఆత్రేయ గారింటిలో మరికొందరు కవిమిత్రులతో రోజంతా గడిపాను. అక్కడ మీ ప్రస్తావన వచ్చింది.
అన్వయ సుభగత సందేహాస్పదంగా ఉంది. లంకలో ఉన్నరావణుడికి వినిపించాలంటే ఎలా చివరిపాదంలో ఎవరో ఎక్కడో ఉండి ఎవరితోనో 'హనుమంతుడు లంకకేగి...' అంటూ విలపించుతున్నారని?
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2619 సమస్య :: *హనుమంతుం డదె లంక కేగి విడిచెన్ హా సోదరా! ప్రాణమున్.* హనుమంతుడు లంకకు వెళ్లి ప్రాణం పోగొట్టుకొన్నాడు సోదరా ! అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: హనుమంతుడు లంకకు వెళ్లి ,అంతటా వెతికి సీతాదేవి కనిపించలేదే అని విపరీతంగా బాధపడుతూ , సీతమ్మ జాడ తెలియలేదు అని శ్రీరామునికి చెప్పజాలను. ఇక నేను బ్రతకడం వృథా అని భావించి తన ప్రాణాలను విడిచిపెట్టేందుకోసం ప్రాయోపవేశం చేయాలని అనుకొన్నాడు. నేను మరణిస్తే ఇక శ్రీ రాముడు నన్ను చూడలేడు, నా కోసం కూడా విచారిస్తాడు. లక్ష్మణునితో *ఓ సోదరా! హనుమంతుడు లంకకు వెళ్లి ప్రాణం పోగొట్టుకొన్నాడు* అని చెప్పుకొని విలపిస్తాడు అని ఊహించుకొంటున్న సందర్భం.
అయ్యా, మరీ అంత చాందసంగా సందర్భకథనం చేయకండి అనునిత్యమూ. అత్యవసరం ఐనప్పుడు తప్ప అది అవసరం కాదు సాధారణంగా. అన్వయం కుదరలేదు సరిగా - కొంచెం పరిశీలించి సరిజేయండి.
శ్యామలీయం పేర సూచన లందజేసిన తమరికి నమస్కారములండీ. సందర్భ కథనం వివరణాత్మకంగా ఉందని చాలామంది పాఠకులు తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారండీ. ఇక అన్వయం విషయం :— పద్యంలో మూడవపాదంలో *మేలౌనని* అనే పదానికి బదులుగా *నిట్లౌనని* అని మార్పు చేస్తే అన్వయం మెరుగౌతుందని అనుకొంటున్నానండీ. తమరు అవసరమైన సూచనలు చేసినందులకు తమరికి ధన్యవాదములు.
పునరుక్తి దోషం గమనించండీ - రెండుసార్లు హనుమంతుడిని అదే పేరుతో సంబోధించటంలో. ఇది రామాయణకథావిరుధ్ధమూ వేరేవిధంగా నప్పించే అన్వయం పద్యంలో ఉండకపోవటమూ కారణంగా ఇలా పద్యం కట్టటం ఒప్పదు.
బాసెన్+ అని -> బాసెనని అనే అవుతుంది. నకారద్విరుక్తం సాధ్యం కావచ్చునేమో తెలియదు. నాదృష్టిలో కుదరదు. చివరి భాగంలో రాముని అని చెప్పి, శీలవంతు నస్త్రము చేతన్ అనటం కుదరటం లేదు. గుణశీలరాశి యస్త్రము చేతన్ అంటే బాగుంటుందేమో.
నాగేందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'వెళ్ళిన' అన్నది వ్యావహారికం. 'వెడలిన' అనండి. రెండవ పాదంలో గణదోషం. "కనుగొన వెడలిన హనుమను కన్నీరొలుకన్" అనండి. పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి. "వనమున నెవరో యనిరట" ఈ విధంగా... స్వస్తి!
క్రొవ్విడి వెంకట రాజారావు: శ్రీధరరావుగారూ! నమస్తే! నేను పూరణను పంపిన తరువాత మీపూరణను ఇప్పుడే చూసాను. యాదృచ్ఛికంగా మనిద్దరి పద్యాలలో మొదటి పాదాలు సరిపోలి యున్నాయి. కాపీగా భావించకండి.
జిలేబీ గారూ, మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు. 'వెనుకన్ + ఆతడు = వెనుక నాతడు' అవుతుంది. అక్కడ ద్విత్వనకార ప్రయోగం పోతన, తదితరుల పద్యాలలో అక్కడక్కడ కనిపిస్తుంది. అందువల్ల అటువంటి ప్రయోగం ఎవరైనా చేసినా నేను పట్టుంచుకోకుండా ఉన్నాను ఇంతకాలం. మొన్న విశాఖపట్టణంలో కవిమిత్రులతో సమావేశమైనపుడు ప్రసాద్ ఆత్రేయ గారు అటువంటి ప్రయోగం దుష్టమని శాస్త్రీయంగా వివరించి, వాటిని ప్రోత్సహించవద్దని గట్టిగా చెప్పారు.
ఈశ్వరప్ప గారూ, బ్రతుకు తెరువు కోసం లంకకు వలస వెళ్ళిన హనుమంతు అనే లౌకిక వ్యక్తిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'వెళ్ళ' అన్నది వ్యావహారికం. "వెడల" అనండి.
నాకు బోధపడింది. ఇకనుండి వ్యాఖ్యల మాడ్యులేషన్ ఉంటుంది. వ్యక్తిగతమైన దూషణలకు, వెక్కిరింపులకు ఈ బ్లాగులో స్థానం లేదు. ఈచర్యతో ఎవరినైనా నొప్పిస్తే మన్నించండి.
రవీందర్ గారూ, అర్ధానుస్వారాల గురించి ఒక పాఠం పెట్టాలని కొన్ని సంవత్సరాలుగా అనుకుంటూనే ఉన్నాను. సమయం దొరకడం లేదు. వాటిని ప్రయోగించకున్నా దోషం లేదు. కాని పెట్టకూడని చోట పెడితే దోషమే. కనుక ప్రస్తుతానికి వాటిని ప్రయోగించకండి.
రవి యను కవి ఖమ్మమ్మున కవిరాజనగరము నందు గల గుడిలోనన్ చవులూరు భాషణమ్మిడె రవి చెప్పెను విష్ణు కథల రంజిల్ల జనుల్. (మా ఊరు ఖమ్మం. మా పేట కవిరాజనగర్. అక్కడ సాయిబాబా గుడి ఉంది. అప్పుడప్పుడూ చిన్న ఉపన్యాసాలిచ్చాను.నాపేరు రవి తో చక్కగా రాసుకొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ధన్యవాదం .)
సువిశాలమ్మగు సృష్టి లో త్రిపదముల్ శోభాకృతిన్ బొందుచున్ స్తవనీయమ్ముగ వెల్గు వామనకథన్ సద్దృశ్యమై యొప్పగా రవి, చెప్పెన్ కమనీయవిష్ణుకథలన్ రంజిల్లగా నెల్లరున్ భువి లో కావ్యరసామృతమ్మిదియనన్ పోతన్న పుణ్యాత్ముడై. (వామనుడు తన మూదు అడుగులతో ఆకాసాన్ని ఆక్రమించుకుంటున్న సమయం లో పోలిక కోసం పోతన్న గారు రవిబింబాన్ని వర్ణించారు.ఈ విధం గా సూర్యుని పరం గా చెప్పాను)
సందర్భము: శ్రీ రాముడు సీతా వియోగ దుఃఖం భరించలేక యెంతో ఆందోళనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కలవరిస్తూ సోదరుడైన లక్ష్మణునితో యీ విధంగా అంటున్నాడు. " "ఆంజనేయుడు వెళ్ళాడో! లేదో! అంగుళీయకం యీయనైతే యిచ్చాను. నడుమనే చిక్కుకొని పోయాడో! లంకలో అడుగడుగునా రాక్షస మాయ లుంటా యట! తీరా జానకి జాడ కనుక్కొని వెళ్ళి విషయం వివరిస్తే ఆమె తప్పుగా అర్థం చేసుకున్నదో! ఇదీ ఒక రాక్షస మాయయే యని త్రోసిపారవేసిందో! మారుతి క్షేమంగా తిరిగి రాగలుగుతాడో! లేదో! అతని కేమైనా అనుకోనిది జరిగితే నా కెంత పాపం చుట్టుకుంటుందో! అసలు దేవుడు అనుకూలించా లనుకుంటున్నాడో! లేదో! లక్ష్మణా! నీ వేదో నాతో చెప్పా లని, చెబితే నేను భరించలే నని చెప్పలేకపోతున్నావో! అయ్యయ్యో! నీ వి ట్లంటివో యేమో! "హా! సోదరా! హనుమంతుడు (మనకోసం) లంకకు వెళ్ళి ప్రాణం వదిలాడు." " ~~~~~~~~~~~~~~~~ ఘను డా మారుతి యేగెనో! నడుమ మా ర్గ శ్రాంతుడై చిక్కెనో!..
విని యా జానకి తప్పుగాఁ దలచెనో! విచ్చేయునో! ఈశ్వరుం
డనుకూలింపఁ దలంచునో! తలపడో! అయ్యయ్యొ! నీ వంటివో!
*"హనుమంతుం డదె లంక కేగి విడిచెన్* *హా! సోదరా! ప్రాణమున్"* ----------------------------------------------------------- ఇది పోతన భాగవతంలోని రుక్మిణీ కళ్యాణంలోని "ఘనుడా! భూసురు డేగెనో!" అనే పద్యానికి ఒక ప్యారడీ లాంటి పద్యం. ------------- 2 వ పూరణము:--
*శ్రీ రాముని విలాపము*
సందర్భము: శ్రీ రాముడు సీతా వియోగ దుఃఖం భరించలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కలవరిస్తూ సోదరుడైన లక్ష్మణునితో యిలా అంటున్నాడు. " "గొప్ప దంష్ట్రల (కోరల)తో బొమ ముడులతో కఠినమైన నడవడితో వుండే రాక్షసులు సర్వదా లంకా నగరాన్ని పహరా (బందోబస్తు లేక కాపలా) కాస్తూ వుంటారు. శత్రు దుర్భేద్యమైన పట్టణ మది. అటువంటి లంకలో పడి నా తమ్ముని లాంటి ఆంజనేయుడు యే మౌతాడో కదా! ఈ రీతిగా... హా! సోదరా! "హనుమంతుడు లంక కేగి ప్రాణం పోగొట్టుకున్నాడు." అనే విషాదవార్త యే క్షణాన వినవలసి వస్తుందో! అదే నా భాగ్యమో!" " ~~~~~~~~~ " "ఘన దంష్ట్రా భ్రుకుటీ కరాళ వదనుల్ కాఠిన్య చిత్తైక వ
ర్తనులున్ రాక్షసు లప్రమత్తు లయి ని త్యంబున్ పహారాలచే
తను రక్షింప వెలుంగు లంకఁ బడి నా తమ్ముం డనన్ జాలు పా
సందర్భము: శ్రీ రాముడు శోకం భరించలేక హనుమకు కీడును శంకించినాడు. కాని కాస్త స్తిమితపడగానే శివతత్వమంతా ఆతని హృదయంలో జగజ్జేగీయమానంగా వెలిగిపోయింది. హనుమంతుని యథార్థమైన స్థితి తెలిసివచ్చింది. అప్పు డిలా అంటున్నాడు లక్ష్మణునితో.. " " మహా సముద్రాన్ని సైతం చిన్న గోష్పాద మంతదిగా భావించి లంఘించగలిగిన హనుమంతుని ముందు నూరుగురు రావణాసురులైనా నిలువ లేరు. రుద్రాంశ సంభూతు డాతడు.. నే నెంతో పిచ్చి వాణ్ణి. సీతా వియోగ శోకాన్ని భరించలేక యిలా పలుకవచ్చునా!.. "హనుమంతుడు లంక కేగి ప్రాణం వదిలాడు.." " ~~~~~~~~ కన గోష్పాదముగాఁ దలంచి దుముకం గా జాలు లీలన్ మహా బ్ధిని, నూర్గుర్ దశకంఠులైన మరి బెం బే లెత్తిపోరేమి! రు ద్రుని దివ్యం బగు తేజ మా హనుమ; యెం తో పిచ్చి వాడన్ గదా! ఘన శోకాబ్ధి తరింపలేక పలుకం గా వచ్చునే నే నిటుల్ ! "హనుమంతుం డదె లంక కేగి విడిచెన్ హా సోదరా! ప్రాణమున్"
రిప్లయితొలగించండికనుగొనె జానకి జాడని
హనుమంతుఁడు లంక కేగి, యసువులఁ బాసెన్"
రణమందు రావణుండును
ఘన రాఘవు బాణములకు కలవరపడుతున్
👍👍👍...
తొలగించండిశాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"జాడను... కలవరపడుచున్" అనండి.
అలాగే 'ఘన రాఘవు' అన్నది 'ఘను రాఘవు' అని మార్చండి.
తొలగించండిశ్యామలీయం గారు..
తొలగించండిఘను రాఘవు...ఎందుకనాలనో వివరిస్తారా..?
తొలగించండిఏమా ధిక్కారము ! గురువులనే ప్రశ్నించుటయా :)
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఐతే సంస్కృతంలో ఘనరాఘవబాణతతికి కలవరడుచున్ అనండి. లేదా రాఘవు అని తెలుగుచేసినప్పుడు ఘన అని సంస్కృత విశేషణం దాని ముందు ఉంఛలేము అందుకే ఘను రాఘవు అని రెండు మాటలుగా ఘనుడైన రాఘవుని అన్న అన్వయంతో ప్రయోగించండి.
తొలగించండిమీ వివరణతో నా సందేహము తీర్చినందుకు మీకు నా వేవేల ప్రణామములు...ఇలాగే మా సందేహములు తీరుస్తూ రచనలో నాకు తోడ్పాటు అందించాలని మా ప్రార్థన...
తొలగించండి
రిప్లయితొలగించండివినిపించెన్రామ మహిమ
హనుమంతుఁడు లంక కేగి; యసువులఁ బాసెన్
తునుమగ రాముడు లంకే
శుని! సీతాయణము వినుడు శుభముల బడయన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అది కాదు ధిక్కారము .. జిలేబి
తొలగించండినేర్చుకోవాలనే తపనతో పెద్దలను అడిగిన మమకారము...
తొలగించండిపోనీ లెండి :) జవాబు వచ్చేసె :)
గురువు గారి
వరద వేగం కూడా కూడా తగ్గినట్టుంది :)
మళ్ళీ రేపు ఏమవుతుందో :) గుండెకాయ లబ్బుడబ్బు అంటూ కొట్టేసుకుంటోంది :)
జిలేబి
వనముఁ జెరచి యని సల్పెను
రిప్లయితొలగించండిహనుమంతుడు లంకకేగి, యసువులు బాసెన్
దనుజులు పెక్కురు రావణ
తనయుడు నక్షుడు, లంక దహనమ్మయ్యెన్
చివరి పాదంలో ఆరో గణం తప్పుగా ఉంది...
తొలగించండిఅక్షుడును వుండాలండి...టైపాటు.....సవరించాను మీ సూచనకు ధన్యవాదాలండీ...._/|\_
తొలగించండివిరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వస్తు భావ లింగ వచనైక్యతలు పాటించటంలో గమనికతో ఉండాలండీ. 'యసువులు బాసెన్ దనుజులు పెక్కురు ' అనటం పొరపాటు. వచనైక్యత పోయింది బాసెను అని ఏకవచనంలో చెప్పి, దనుజులు అని బహువచనంలో చెప్పటం కుదరదండి. సరిచేయండి.
తొలగించండిఅలాగే 'తనయుడు నక్షుడు' అన్నది కూడా దోషమే. తనయుడక్షుడు అవుతుంది - విసంధి కుదరదు. మార్చాలిక్కడ. ఉత్త్వసంధిలాంటీ ప్రాథమికాల గురించి జాగరూకతతో వాడండి.
కనుగొనె సీతాదేవిని
రిప్లయితొలగించండిహనుమంతుఁడు లంక కేగి; యసువులఁ బాసెన్
కనివిని యెరుగని విధముగ
చననీయని లంకినమ్మ జంజాటముతో
లంకిని : పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879
లంకను కాపాడునట్టి ఒక రాక్షసి. ఇది తఱచుగా లంక అనియే గ్రంథముల యందు వాడఁబడి ఉన్నది. హనుమంతుఁడు సీతను వెదక వచ్చినప్పుడు పట్టణములో చొరనీక ఇది అతనిని అడ్డగించి అతనిచే ఓటుపడియెను.
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధారాశుధ్ధిగా ఉంది - బాగుంది. విధముగ బదులు విధమున అంటే మరింత కర్ణపేయంగా ఉండేది.
తొలగించండి🙏🙏🙏
తొలగించండి
తొలగించండిహమ్మయ్య జీపీయెస్ ప్యాసై పోయేరు :)
జిలేబి
(సీతాన్వేషణకై వెళ్ళిన హనుమ కోసం వానరుల ఆందోళన )
రిప్లయితొలగించండిఘనులగు వానరులందరు
కనులను దెరచి క్షణమొక యుగముగ హనుమ రా
కను గోరి యిటు లనుకొనిరి
"హనుమంతుడు లంకకేగి యసువుల బాసెన్ ."
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండివినిపించెన్గద రామ నామ మహిమన్ వీరుండు ధైర్యమ్ముగా
హనుమంతుం డదె లంక కేగి ; విడిచెన్ హా సోదరా ప్రాణమున్
తునుమంగన్ భళి రామచంద్రు రణమందున్ రావణుండేనయా !
వినుమా సీతకథన్ శుభమ్ము గలుగున్ వేవేలు నీకున్ సదా !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదట్లో కొంత ధార కనబడుతోంది. అభినందనలు. మరింత కృషి అవసరం. 'తునుమంగన్ భళి రామచంద్రు రణమందున్' అన్నది దారుణమైన దోషం! రామచంద్రుణ్ణి యుధ్దంలో చంపగా అని అర్థం వస్తున్నది - శాంతం పాపమ్! 'తునుమంగన్ భళి రామచంద్రు రణమందున్ ఇక్కడనుండి మొత్తం గణపూరణాయాసమే కనిపిస్తోంది. అన్వయం కూడా సరిగా లేదు.
తొలగించండి
రిప్లయితొలగించండికనుగొనిరి కొత్త కైపద
మును శంకరవర్యులు గద ముగ్ధ జిలేబీ !
గనిపూ రించన్ దగునే
హనుమంతుఁడు లంక కేగి యసువులఁ బాసెన్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జిలేబీ అన్న సంబోధన తరువాత సరళాదేశ, గసడదవాదేశాలు రావు. "కని పూరించన్.." అనండి.
జిలేబీగారు కడు స్వతంత్రులు ఆవిడకు ఎక్కడపడితే అక్కడ తోచిన సంధిని చేసిపారేసే స్వాతంత్ర్యమున్నూ, ఎక్కడ యే సంధినైనా విరిచిపారేసే స్వాతంత్ర్యమున్నూ, సందర్భశుధ్ధీ అన్వయశుధ్ధీ ఉన్నాలేకున్నా తోచినముక్కను తెచ్చి అతికించే హక్కున్నూ స్వార్జితములు. జిలేబీ తెలుగు తెగులులా ధ్వనిస్తే అది ఆవలివారి సమస్య. అందుకే ఆవిడవి గిందాలని పిలిచేది నేను.
తొలగించండి
తొలగించండిగిందాలమ్మ జిలేబీ
కందంబిదికాదు సూవె! గణగణ యనుచున్
డెందపు కైపుల సయి గణ
బంధములన్ వేయనేల పద్యపు రమణీ :)
జిలేబి
జనకుని దుహితను గాంచెను
రిప్లయితొలగించండిహనుమంతుడు లంక కేగి , యసువులఁ బాసెన్
మనమున తలచని రీతిగ
రణమున రాముని శరముల రావణు డకటా
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బాగుంది. తలచని కన్నా తలపని అంటే బాగుంటుంది.
తొలగించండిశ్యామల రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు!
ఈనెల మూడవ తేదీన విశాఖపట్నంలో ప్రసాద్ ఆత్రేయ గారింటిలో మరికొందరు కవిమిత్రులతో రోజంతా గడిపాను. అక్కడ మీ ప్రస్తావన వచ్చింది.
శంకరయ్య గారూ,
తొలగించండిచాలా సంతోషం. ప్రసాద్ ఆత్రేయ గారి మంచి ప్రౌఢకవి. ఆయన మా మేనమామ గారు. అయన మంచి మాటకారి కూడా.
రిప్లయితొలగించండికం:
కనుగొను వాయుసుతు డెవరు?
హనుమంతుడు నెచటి కేగి అనలము సల్పెన్
రణమున రావణుడేమయె?
హనుమంతుఁడు,లంక కేగి,యసువులఁ బాసెన్
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘వనపర్తి☘
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
"కనుగొన" అనండి. 'అనలము సల్పెన్' బదులు "అవనిజ గాంచెన్" అంటే బాగుంటుంది.
"హనుమంతుం డెచటి కేగి యవనిజ గాంచెన్"
తొలగించండిధన్యవాదాలు గురువుగారు...
తొలగించండిబాగుంది. కనుగొన వాయుజు డెవ్వడు అనండి. సర్వలఘువుగా పాదం అందంగా లేదు -నడక కుదరక. ఈ పద్యానికి నా పాఠం:
తొలగించండికనుగొన వాయుజు డెవ్వడు
హనుమంతుం డెచటి కేగి యవనజ నరసెన్
పెనగి దశాస్యుడు నిలచెనె
హనుమంతుఁడు,లంక కేగి,యసువులఁ బాసెన్
పెనగి దశాస్యుడు నిలచెనె...
తొలగించండిఇది ప్రశ్న ఎట్లగును...?వివరిస్తారా...
వనముఁ జెరచి యని సల్పెను
రిప్లయితొలగించండిహనుమంతుడు లంకకేగి, యసువులు బాసెన్
దనుజులు పెక్కురు రావణ
తనయుడు నక్షుడును, లంక దహనమ్మయ్యెన్
విరించి గారూ,
తొలగించండిటైపు దోషాన్ని సవరించారు. బాగుంది.
వచనైక్యత గురించి ఈ పేజీలోన్ చెప్పాను. 'యసువులు బాసెన్ దనుజులు పెక్కురు' అన్నప్పుడు అది చెడిందని గమనించండి.
తొలగించండికనె సీత నశోకవనము
రిప్లయితొలగించండిహనుమంతుఁడు లంక కేగి, యసువులఁ బాసెన్
తన నెదిరించిన సైన్యము
తనియగ మనమున మహీజ తద్దయు ప్రీతిన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"సీత నశోకవనిని" అనండి.
కొంచెం గణపూరణాయాసం కనబడుతోంది. ముఖ్యంగా ఆఖరు పాదంలో.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిరావణశాసనం...
ఘన హర్మ్యమ్ములఁ వృక్షరాజముల లంకావైభవంబున్ గనుం
గొన దగ్ధమ్మొనరించె వానరుడు , మీకున్ శాసనంబిద్దియే !
వినిపింపన్ వలె నాదు కర్ణములకున్ విందౌ సుశబ్దమ్మిటుల్
"హనుమంతుం డదె లంక కేగి విడిచెన్ హా సోదరా ప్రాణమున్"!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"వినిపింపన్ వలె రామ లక్ష్మణుల సంవేదానులాప మ్మిటుల్" అంటే ఇంకా బాగుంటుందేమో?
అన్వయ సుభగత సందేహాస్పదంగా ఉంది. లంకలో ఉన్నరావణుడికి వినిపించాలంటే ఎలా చివరిపాదంలో ఎవరో ఎక్కడో ఉండి ఎవరితోనో 'హనుమంతుడు లంకకేగి...' అంటూ విలపించుతున్నారని?
తొలగించండితునియల్ జేసెను చెట్ల సౌధముల నుత్తుంగా కృతిన్ పొంది యా
రిప్లయితొలగించండిహనుమంతుం డదె లంక కేగి, విడిచెన్ హా సోదరా ప్రాణమున్
ఘనమౌ రాక్షస మూక లన్నియును దుర్గమ్మందు శీఘ్రమ్ముగా
విని లంకేశుఁడు క్రోధనమ్మున కడున్ విభ్రాంతితో వర్తిలెన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'హా సోదరా' అన్న సంబోధనకు అన్వయం?
లక్ష్మణుడు కలగని ఆకలలో రామునితో చెప్పినట్లు
తొలగించండిమరలా వచనైక్యత గురించి ఇక్కడా చెప్పాలి. 'ప్రాణమున్ ...రాక్షస మూక లన్నియును' అనటం కుదరదు.
తొలగించండివని లో కనుగొనె సీత ను
రిప్లయితొలగించండిహనుమ oతుడు లంక కేగి ;యసు వు లు బాసె
న్న ని లో రాముని శర ము లు
తను వున లంకే శు ను ర ము తాకిన కత న న్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బాసె న్ననిలో' అని నకారద్విత్వం అంత బాగోలేదు. ద్వితీయార్థంలో అన్వయం సిధ్ధంగా కాక సాధ్యంగా మిగిలటం విచార్యం.
తొలగించండిపనిమంతుడు గన నవరొకొ?
రిప్లయితొలగించండిహనుమయె కనుగొనె నెటులనొ యవనిజ జాడ
న్ననిలోన రావణుండే;
"హనుమంతుఁడు ; లంక కేగి ; యసువులఁ బాసెన్!
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"గన నెవరొకొ" టైపాటు.
గణపూరణాయాసం మాత్రమే నాకు దిట్టంగా కనిపిస్తోంది!
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2619
సమస్య :: *హనుమంతుం డదె లంక కేగి విడిచెన్ హా సోదరా! ప్రాణమున్.*
హనుమంతుడు లంకకు వెళ్లి ప్రాణం పోగొట్టుకొన్నాడు సోదరా ! అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: హనుమంతుడు లంకకు వెళ్లి ,అంతటా వెతికి సీతాదేవి కనిపించలేదే అని విపరీతంగా బాధపడుతూ , సీతమ్మ జాడ తెలియలేదు అని శ్రీరామునికి చెప్పజాలను. ఇక నేను బ్రతకడం వృథా అని భావించి తన ప్రాణాలను విడిచిపెట్టేందుకోసం ప్రాయోపవేశం చేయాలని అనుకొన్నాడు. నేను మరణిస్తే ఇక శ్రీ రాముడు నన్ను చూడలేడు, నా కోసం కూడా విచారిస్తాడు. లక్ష్మణునితో *ఓ సోదరా! హనుమంతుడు లంకకు వెళ్లి ప్రాణం పోగొట్టుకొన్నాడు* అని చెప్పుకొని విలపిస్తాడు అని ఊహించుకొంటున్న సందర్భం.
కన నైతిన్ గద సీతజాడ ఘన లంకాపట్టణ మ్మందు, నే
రను దుర్వార్తను జెప్ప రామున, కిటన్ ప్రాయోపవేశమ్ము జే
సిన మే లౌనని, రామదూత తలచెన్ ‘’శ్రీ రామచంద్రుండు నన్
గనకుండున్, విలపించు, లక్ష్మణుని వీకన్ గాంచి తా నిట్లనున్
*హనుమంతుం డదె లంక కేగి విడిచెన్ హా సోదరా ప్రాణమున్.’’*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (8-3-2018)
ఆహాఁ! అద్భుతః!!
తొలగించండిమీకు మీరే సాటి!!!
👌🏻💐🙏🏻
సహృదయులు శ్రీ ps Rao విట్టు బాబు గారికి హృదయపూర్వక ప్రణామాలు.
తొలగించండికోట రాజశేఖర్ గారూ,
తొలగించండినేటి మీ పూరణ అత్యద్భుతంగా ఉన్నది. అభినందనలు.
విట్టుబాబు గారూ,
తొలగించండిఅద్భుతః అన్న ప్రయోగం తప్పు. అదేదో సినిమాలో చమత్కారం కోసం అలా ప్రయోగించారు.
నిజానికి అది అకారాంత నపుంసక శబ్దం 'అద్భుతమ్'.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండిఅయ్యా, మరీ అంత చాందసంగా సందర్భకథనం చేయకండి అనునిత్యమూ. అత్యవసరం ఐనప్పుడు తప్ప అది అవసరం కాదు సాధారణంగా. అన్వయం కుదరలేదు సరిగా - కొంచెం పరిశీలించి సరిజేయండి.
తొలగించండిశ్యామలీయం పేర సూచన లందజేసిన తమరికి నమస్కారములండీ. సందర్భ కథనం వివరణాత్మకంగా ఉందని చాలామంది పాఠకులు తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారండీ. ఇక అన్వయం విషయం :—
తొలగించండిపద్యంలో మూడవపాదంలో *మేలౌనని* అనే పదానికి బదులుగా *నిట్లౌనని* అని మార్పు చేస్తే అన్వయం మెరుగౌతుందని అనుకొంటున్నానండీ.
తమరు అవసరమైన సూచనలు చేసినందులకు తమరికి ధన్యవాదములు.
(మెఱుగౌతుందని)
తొలగించండికనగా నేమియు జేసెను
రిప్లయితొలగించండి"హనుమంతుఁడు లంక కేగి; యసువులఁ బాసె"
న్ననదగు భామిని యెవరో?
అనలము నుంచెన్ నగరము; నది లంకిణియే!
విట్టుబాబు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్యం కృతకంగా అనిపించింది.బహుకారణాలు.
తొలగించండివినుటకు బాధగ నుండెను
రిప్లయితొలగించండిహనుమంతుడు లంకకేగి యసువులబాసెన్
హనుమంతుడుచంపెనుగద
కనుచుండగరాక్షసాదిఖలులనుననిలోన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పునరుక్తి దోషం గమనించండీ - రెండుసార్లు హనుమంతుడిని అదే పేరుతో సంబోధించటంలో. ఇది రామాయణకథావిరుధ్ధమూ వేరేవిధంగా నప్పించే అన్వయం పద్యంలో ఉండకపోవటమూ కారణంగా ఇలా పద్యం కట్టటం ఒప్పదు.
తొలగించండివనమున కనుగొనె సీతను
రిప్లయితొలగించండిహనుమంతుడు లంకకేగి ; యసువులు బాసె
న్ననిలంకేశుడు రాముని
యనుపమ గుణాంబునిధిని హస్తంగతుడై
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదంలో గణదోషం. 'హస్తంగతుడై' అన్న ప్రయోగం అంత బాగా లేదు. సవరించండి.
అవును ఆచార్యా! హడావుడిగా వ్రాశాను. హస్తంగతుడై నాకు కూడ నచ్చలేదు!
తొలగించండిసవరిస్తాను! ధన్యవాదములు!🙏🙏🙏🙏
వనమున కనుగొనె సీతను
తొలగించండిహనుమంతుడు లంకకేగి ; యసువులు బాసె
న్ననిలంకేశుడు రాముని
యనుపమ గుణశీలవంతు నస్త్రము చేతన్
బాసెన్+ అని -> బాసెనని అనే అవుతుంది. నకారద్విరుక్తం సాధ్యం కావచ్చునేమో తెలియదు. నాదృష్టిలో కుదరదు. చివరి భాగంలో రాముని అని చెప్పి, శీలవంతు నస్త్రము చేతన్ అనటం కుదరటం లేదు. గుణశీలరాశి యస్త్రము చేతన్ అంటే బాగుంటుందేమో.
తొలగించండికందం
రిప్లయితొలగించండిచనుదెంచ దుష్టశక్తియె
తను వారధిఁ గట్ట నాప తక్షణమే రా
మునిఁ వేడుచు మోదఁగ నా
హనుమంతుడు, లంక కేగి యసువులఁ బాసెన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ పద్యం ఇంకా బాగా వస్తుందనిపిస్తోంది. మరొక ప్రయత్నం చేయగలదా? తను వారధి కట్ట వంటి ప్రయోగాలు కళగట్టటం లేదు.
తొలగించండిశ్యామలీయం గారికి ధన్యవాదములు. సవరణను పరిశీలించ ప్రార్థన.
తొలగించండిచనుదెంచి దుష్టశక్తియె
తను వారధిఁ గట్టఁ జూడ తడకట్టగ రా
ముని వేడుచు మోదఁగ నా
హనుమంతుడు, లంక కేగి యసువులఁ బాసెన్
తన వారి క్షేమ మరయుచు
రిప్లయితొలగించండినని నిత్యము సలుపుచుఁ దనదౌ సంగర నీ
తినిఁ బూని ప్రభాకరుఁ డను
హనుమంతుఁడు లంక కేగి యసువులఁ బాసెన్
[ప్రభాకర్ కు కూడా పోరులో హనువు దెబ్బ తిని యుండవచ్చును.]
కని యాసీతను శోకమూర్ఛిత నశోకక్ష్మాజ మూలమ్మునన్
వన విధ్వంసము సేసి రాక్షసవరవ్రాతమ్ముఁ జెండాడఁగన్
హనుమంతుం డదె లంక కేగి, విడిచెన్ హా సోదరా ప్రాణమున్
ఘనుఁ డా యక్ష కుమారుఁ డాసురుఁడు లంకానాథ పుత్రుండలన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిఒక్క ప్రభాకరన్ మాత్రమే కాదు... దవడలు కలిగిన మనమూ హనుమంతులమే.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఅవునండి. హనుమత్ కదా!
కనియెన్జివరకు సీతను
రిప్లయితొలగించండి"హనుమంతుఁడు లంక కేగి, యసువులఁ బాసెన్
మనుజాసనయోధులు ప
వనతనయుని ఘన పిడికిలి వాటుల తోడన్
కృష్ణసూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కర్తృపదమైన యోధులు బహువచనం. క్రియాపదం పాసెన్ ఏకవచనం. 'మనుజాశన' అన్నది సాధువు. 'ఘన పిడికిలి' అన్నది దుష్టసమాసం. సవరించండి.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,
( రావణుడు మాయా లక్ష్మణుడై రాముని కలవరపరుచుట. )
" హనుమంతుం డదె లంక కేగి విడిచెన్ హా ! సోదరా ప్రాణముల్
మన ప్రాణం బగు నట్టి మారుతి - హనూమంతుండు లేకుండగన్ ,
మన మింకన్ మను టెట్లు ? " తల్లి " యునికిన్ గన్గొంచు నెవ్వా రికన్
మనకున్ దెల్పెద " రంచు , పంక్తిముఖు - డా మాయా సుమిత్రాత్మజుం
డనె శ్రీరాముని తో నటించు చత డత్యాందోళనాకారమున్
{ " తలి " = " వదిన " ; ఆకారము = భయ సంతోషాదులతో
గూడిన ముఖ వికారము }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మనమున తలచెను రాముడు
రిప్లయితొలగించండికనుగొన వెళ్ళిన హనుమను, కన్నుల కన్నీరొలకగన్
వనమున ఎవరో అనిరట
హనుమంతుడు లంక కేగి యసువుల బాసెన్
పూజనీయులు... శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
నాగేందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వెళ్ళిన' అన్నది వ్యావహారికం. 'వెడలిన' అనండి.
రెండవ పాదంలో గణదోషం. "కనుగొన వెడలిన హనుమను కన్నీరొలుకన్" అనండి. పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి. "వనమున నెవరో యనిరట" ఈ విధంగా... స్వస్తి!
కనుగొనెను సీత జాడను
రిప్లయితొలగించండిహనుమంతుడు లంక కేగి! యసువులు బాసె
న్ననయము లంకను గాచెడి
వనచరి లంకిణి యచట పవనసుతు చేతన్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండివనజాక్షి సీతను గనియె
హనుమంతుఁడు లంక కేగి ,యసువులఁ బాసెన్
క్షణమున నక్షకుమారుడు
ననిలజుచేజిక్కితానశోకములోన్.
జనకుని నెవ్వరు గాంచిరి?
పనిగట్టుకునెచటగాల్చె పవనజుడచ్చో
దునుమగ నక్షుండాజిన
హనుమంతుఁడు లంక కేగి యసువులఁ బాసెన్.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. ఈ రెండు పద్యాలలోని దోషాలపై నా వ్యాఖ్యను వాట్సప్ సమూహంలో గమనించండి.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికనుగొనెను సీత జాడను
హనుమంతుడు లంకకేగి; యసువుల బాసెన్
దనుజులు పెక్కురు మారుతి
ఘనముగ వనమున చలిపిన కదనము నందున్
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిశ్రీధరరావుగారూ! నమస్తే! నేను పూరణను పంపిన తరువాత మీపూరణను ఇప్పుడే చూసాను. యాదృచ్ఛికంగా మనిద్దరి పద్యాలలో మొదటి పాదాలు సరిపోలి యున్నాయి. కాపీగా భావించకండి.
రిప్లయితొలగించండిఅనిలాత్మజుడన నెవరో?
వెనుకన్నాతడెచట చని వెదికెను సీతన్ ?
తన కర్మగ రావణుడో?
హనుమంతుఁడు; లంక కేగి; యసువులఁ బాసెన్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
'వెనుకన్ + ఆతడు = వెనుక నాతడు' అవుతుంది. అక్కడ ద్విత్వనకార ప్రయోగం పోతన, తదితరుల పద్యాలలో అక్కడక్కడ కనిపిస్తుంది. అందువల్ల అటువంటి ప్రయోగం ఎవరైనా చేసినా నేను పట్టుంచుకోకుండా ఉన్నాను ఇంతకాలం. మొన్న విశాఖపట్టణంలో కవిమిత్రులతో సమావేశమైనపుడు ప్రసాద్ ఆత్రేయ గారు అటువంటి ప్రయోగం దుష్టమని శాస్త్రీయంగా వివరించి, వాటిని ప్రోత్సహించవద్దని గట్టిగా చెప్పారు.
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిపద్యంలో మూడు అరసున్నాలు అనవసరమైనవే. అక్కడ అవి రాకూడదు.
తనవారి సౌఖ్యమెంచియు
రిప్లయితొలగించండిమనదేశము విడచి వెళ్ళ?మనుగడకొరకై
అనుకొనని సంఘటనలచే
హనుమంతుడు లంకజేరి యసువులు బాసెన్
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిబ్రతుకు తెరువు కోసం లంకకు వలస వెళ్ళిన హనుమంతు అనే లౌకిక వ్యక్తిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వెళ్ళ' అన్నది వ్యావహారికం. "వెడల" అనండి.
రిప్లయితొలగించండిఇదిగో శ్యామలరాయలు !
సదనంబందున జిలేబి చకచక హనుమం
తు దరువు వీర విహారము
పదవే వెనువెంట వేయ పద్యంబొకటిన్ :)
జిలేబి
ఏమీ బోధపడలేదు!
తొలగించండినాకు బోధపడింది. ఇకనుండి వ్యాఖ్యల మాడ్యులేషన్ ఉంటుంది. వ్యక్తిగతమైన దూషణలకు, వెక్కిరింపులకు ఈ బ్లాగులో స్థానం లేదు. ఈచర్యతో ఎవరినైనా నొప్పిస్తే మన్నించండి.
తొలగించండి
తొలగించండి:)
జిలేబి
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిఅర్ధానుస్వారాల గురించి ఒక పాఠం పెట్టాలని కొన్ని సంవత్సరాలుగా అనుకుంటూనే ఉన్నాను. సమయం దొరకడం లేదు.
వాటిని ప్రయోగించకున్నా దోషం లేదు. కాని పెట్టకూడని చోట పెడితే దోషమే. కనుక ప్రస్తుతానికి వాటిని ప్రయోగించకండి.
శంకరాభరనంకి మోడరఎషన్ పెట్టించినవ్ జిలేబి :)
రిప్లయితొలగించండిguruvaryulaku namassulu.
రిప్లయితొలగించండిరావణునకు విభీషణుని హితోపదేశం :
రిప్లయితొలగించండిమత్తేభవిక్రీడితము
వినుమా చెప్పఁగ! రామచంద్రుడనగన్వీరుండు! దేవుండు! నా
వినతిన్ జానకి వీడ మేలగునయా!విడ్డూరమౌరీతిగా
మునుపున్ వారధి గట్టువేళ నసురున్మోదంగ యోధుండునౌ
హనుమంతుండదె, లంక కేగి విడిచెన్ హా సోదరా! ప్రాణమున్!!
శ్యామలీయంగారు పైసమస్యను పూరించి దోషరహితమైన మార్గమును చూపించిన మాబోటి వాళ్ళకు ప్రయోజనం ఉంటుంది. వారి విమర్శలతో పద్యమును కూడా ప్రసాదించమని ప్రార్థన.
రిప్లయితొలగించండిరవి యను కవి ఖమ్మమ్మున
రిప్లయితొలగించండికవిరాజనగరము నందు గల గుడిలోనన్
చవులూరు భాషణమ్మిడె
రవి చెప్పెను విష్ణు కథల రంజిల్ల జనుల్.
(మా ఊరు ఖమ్మం. మా పేట కవిరాజనగర్. అక్కడ సాయిబాబా గుడి ఉంది. అప్పుడప్పుడూ చిన్న ఉపన్యాసాలిచ్చాను.నాపేరు రవి తో చక్కగా రాసుకొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ధన్యవాదం .)
ధనికొండ వారూ,
తొలగించండిబాగుందండి మీ ఆత్మాశ్రయమైన పూరణ. అభినందనలు.
(మీ పూరణను ఈనాటి సమస్య క్రింద పోస్ట్ చేసాను)
సువిశాలమ్మగు సృష్టి లో త్రిపదముల్ శోభాకృతిన్ బొందుచున్
రిప్లయితొలగించండిస్తవనీయమ్ముగ వెల్గు వామనకథన్ సద్దృశ్యమై యొప్పగా
రవి, చెప్పెన్ కమనీయవిష్ణుకథలన్ రంజిల్లగా నెల్లరున్
భువి లో కావ్యరసామృతమ్మిదియనన్ పోతన్న పుణ్యాత్ముడై.
(వామనుడు తన మూదు అడుగులతో ఆకాసాన్ని ఆక్రమించుకుంటున్న సమయం లో పోలిక కోసం పోతన్న గారు రవిబింబాన్ని వర్ణించారు.ఈ విధం గా సూర్యుని పరం గా చెప్పాను)
ధనికొండ వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
*8-3-18* సమస్య
రిప్లయితొలగించండి*"హనుమంతుం డదె లంక కేగి విడిచెన్*
*హా సోదరా ప్రాణమున్"*
*శ్రీ రాముని విలాపము*
సందర్భము: శ్రీ రాముడు సీతా వియోగ దుఃఖం భరించలేక యెంతో ఆందోళనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కలవరిస్తూ సోదరుడైన లక్ష్మణునితో యీ విధంగా అంటున్నాడు.
" "ఆంజనేయుడు వెళ్ళాడో! లేదో! అంగుళీయకం యీయనైతే యిచ్చాను. నడుమనే చిక్కుకొని పోయాడో! లంకలో అడుగడుగునా రాక్షస మాయ లుంటా యట!
తీరా జానకి జాడ కనుక్కొని వెళ్ళి విషయం వివరిస్తే ఆమె తప్పుగా అర్థం చేసుకున్నదో! ఇదీ ఒక రాక్షస మాయయే యని త్రోసిపారవేసిందో! మారుతి క్షేమంగా తిరిగి రాగలుగుతాడో! లేదో! అతని కేమైనా అనుకోనిది జరిగితే నా కెంత పాపం చుట్టుకుంటుందో!
అసలు దేవుడు అనుకూలించా లనుకుంటున్నాడో! లేదో!
లక్ష్మణా! నీ వేదో నాతో చెప్పా లని, చెబితే నేను భరించలే నని చెప్పలేకపోతున్నావో!
అయ్యయ్యో! నీ వి ట్లంటివో యేమో! "హా! సోదరా! హనుమంతుడు (మనకోసం) లంకకు వెళ్ళి ప్రాణం వదిలాడు." "
~~~~~~~~~~~~~~~~
ఘను డా మారుతి యేగెనో! నడుమ మా
ర్గ శ్రాంతుడై చిక్కెనో!..
విని యా జానకి తప్పుగాఁ దలచెనో!
విచ్చేయునో! ఈశ్వరుం
డనుకూలింపఁ దలంచునో! తలపడో!
అయ్యయ్యొ! నీ వంటివో!
*"హనుమంతుం డదె లంక కేగి విడిచెన్*
*హా! సోదరా! ప్రాణమున్"*
-----------------------------------------------------------
ఇది పోతన భాగవతంలోని రుక్మిణీ కళ్యాణంలోని "ఘనుడా! భూసురు డేగెనో!" అనే పద్యానికి ఒక ప్యారడీ లాంటి పద్యం.
-------------
2 వ పూరణము:--
*శ్రీ రాముని విలాపము*
సందర్భము: శ్రీ రాముడు సీతా వియోగ దుఃఖం భరించలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కలవరిస్తూ సోదరుడైన లక్ష్మణునితో యిలా అంటున్నాడు.
" "గొప్ప దంష్ట్రల (కోరల)తో బొమ ముడులతో కఠినమైన నడవడితో వుండే రాక్షసులు సర్వదా లంకా నగరాన్ని పహరా (బందోబస్తు లేక కాపలా) కాస్తూ వుంటారు. శత్రు దుర్భేద్యమైన పట్టణ మది.
అటువంటి లంకలో పడి నా తమ్ముని లాంటి ఆంజనేయుడు యే మౌతాడో కదా!
ఈ రీతిగా... హా! సోదరా! "హనుమంతుడు లంక కేగి ప్రాణం పోగొట్టుకున్నాడు." అనే విషాదవార్త యే క్షణాన వినవలసి వస్తుందో! అదే నా భాగ్యమో!" "
~~~~~~~~~
" "ఘన దంష్ట్రా భ్రుకుటీ కరాళ వదనుల్
కాఠిన్య చిత్తైక వ
ర్తనులున్ రాక్షసు లప్రమత్తు లయి ని
త్యంబున్ పహారాలచే
తను రక్షింప వెలుంగు లంకఁ బడి నా
తమ్ముం డనన్ జాలు పా
వని యే మౌనొ! విషాదవార్త వినుటే
భాగ్యంబొ! యీ రీతిగా..
*"హనుమంతుం డదె లంక కేగి విడిచెన్*
*హా సోదరా ప్రాణమున్"*"
-------------------------------------
పహారా= (తెలంగాణలో) కాపలా
పహరా= (రాయలసీమలో)కాపలా
------------------
3 వ పూరణము:--
*"హనుమంతుం డదె లంక కేగి విడిచెన్*
*హా సోదరా ప్రాణమున్"*
*హనుమత్తత్వము*
సందర్భము: శ్రీ రాముడు శోకం భరించలేక హనుమకు కీడును శంకించినాడు. కాని కాస్త స్తిమితపడగానే శివతత్వమంతా ఆతని హృదయంలో జగజ్జేగీయమానంగా వెలిగిపోయింది. హనుమంతుని యథార్థమైన స్థితి తెలిసివచ్చింది. అప్పు డిలా అంటున్నాడు లక్ష్మణునితో..
" " మహా సముద్రాన్ని సైతం చిన్న గోష్పాద మంతదిగా భావించి లంఘించగలిగిన హనుమంతుని ముందు నూరుగురు రావణాసురులైనా నిలువ లేరు. రుద్రాంశ సంభూతు డాతడు.. నే నెంతో పిచ్చి వాణ్ణి. సీతా వియోగ శోకాన్ని భరించలేక యిలా పలుకవచ్చునా!..
"హనుమంతుడు లంక కేగి ప్రాణం వదిలాడు.." "
~~~~~~~~
కన గోష్పాదముగాఁ దలంచి దుముకం
గా జాలు లీలన్ మహా
బ్ధిని, నూర్గుర్ దశకంఠులైన మరి బెం
బే లెత్తిపోరేమి! రు
ద్రుని దివ్యం బగు తేజ మా హనుమ; యెం
తో పిచ్చి వాడన్ గదా!
ఘన శోకాబ్ధి తరింపలేక పలుకం
గా వచ్చునే నే నిటుల్ !
"హనుమంతుం డదె లంక కేగి విడిచెన్
హా సోదరా! ప్రాణమున్"
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
భవిష్య పురాణం: 👇
రిప్లయితొలగించండికనుమా! సోదర! కాల్చెరా భవనముల్ కాకుత్స విఖ్యాతికై
హనుమంతుం డదె లంక కేగి;...విడిచెన్ హా సోదరా! ప్రాణమున్
ఘనమౌ ప్రీతిని శంకరాభరణమున్ గాఢమ్ముగా హత్తుచున్
దినమున్ రాత్రి ప్రభాకరుండలయకే దీర్ఘంపు శ్వాసమ్ముతో!