5, మార్చి 2018, సోమవారం

సమస్య - 2616 (కాలు కడు యాతన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాలు కష్టపెట్టె గ్రామజనుల"
(లేదా...)
"....కాలు కడు యాతనఁ బెట్టెను గ్రామవాసులన్" (ఛందోగోపనం)
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

61 కామెంట్‌లు:

  1. ఉ:

    నివ్వెరజెందిరందరును నేటికి రోడ్లు,కరెంటు లేకయున్

    త్రవ్విన చుక్కనీరు పడదాయెను,లేదుర పాఠశాలయు

    న్నెవ్వడు గెల్వ గ్రామమునకేమి ప్రయోజనమయ్యె గాంచగా

    నవ్విధ బంధకాలు కడు యాతన పెట్టెను గ్రామవాసులన్ !

    రిప్లయితొలగించండి
  2. పచ్చనైన భూమి ;పసిడి పంటల నొసగు ;
    కాయగూరలిచ్చు కల్పతరువు ;
    స్వార్థపరులు సలుపు సంకుచితపు పాత
    కాలు కష్టపెట్టె గ్రామజనుల .

    రిప్లయితొలగించండి
  3. మిరప పంటకింక మీరును ధరయంచు
    మోదమంద - వాన ముంచివేసె:
    లిప్స తీరునట్లు లేకపోయిన అమ్మ
    కాలు కష్టపెట్టె గ్రామజనుల!
    లిప్స = కోరిక

    రిప్లయితొలగించండి

  4. ఎండ మాడ్చె తలను వెంట తగులుకొనె
    కర్మ యున్ను నేడ్వగ సమయమును
    లేదు! మీదు శక్తి లేదు ఆపైన మో
    కాలు కష్ట పెట్టె గ్రామ జనుల !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. కష్ట పడిన రౌతు కలలందు తేలుచు
    తిండి కొరత లేదు మెండు ధరలు
    కుంభ వృష్టి కురియ కోరినం తనెజాత
    కాలు కష్ట పెట్టె గ్రామ జనుల

    రిప్లయితొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    కోనసీమ లేత కొబ్బరి నీళ్లును
    తాటి ముంజె కల్లు తాటిచాప
    వంటి వాటిఁ జంపి వచ్చిన స్ప్రైటు లి...
    మ్కాలు కష్టపెట్టె గ్రామజనుల !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. నిజంగానే ? :)

      స్ప్రయిటు స్పిరిటు లేగదా ములుగు బంగారము ప్రభుతకు :)


      జిలేబి

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      *****
      ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ జ్వరం తగ్గిందా?

      తొలగించండి
    3. ఎదుటనె వేపమండలును నింపగు రక్తము నిమ్మకాయలున్
      పదిలముగాగ నిల్పి , ప్రతి పల్కును గట్టిగనొత్తి పల్కుచున్
      బెదరగ భూత మాంత్రికులు భీతిల జేయ , జనాళి జూపుచో
      నదరుచు పూనకాలు , కడు యాతన పెట్టెను గ్రామవాసులన్
      !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి


  7. వసతులు లేవు మాకు సయి వాసిగ జీవిత మున్సృశించగా
    దసలయిపోయినాము విధి దారుణ మై నిలువంగ ముంగటన్
    కసమస కాదు చందురుడ! కావలె పంటకు మద్దతుల్ సదా
    యసవస పంప కాలు కడు యాతన పెట్టెను గ్రామవాసులన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి

  8. ఆ.వె.
    చేను లెండిపోయె చెరువుల నీరము
    లేక ; పాఠశాల లేదు చదువ;
    తరచి చూడగ వివిధ ప్రగతి ప్రతిబంధ
    కాలు కష్టబెట్టె గ్రామ జను

    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘వనపర్తి☘

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2616
    సమస్య :: *...... కాలు కడు యాతన బెట్టెను గ్రామవాసులన్.*
    పద్యపాదంలో ముందు ఉండవలసిన కొన్ని అక్షరాలను దాచియుంచి ఇలా సమస్యను ఇవ్వడాన్ని *ఛందో గోపనం* అని అంటారు.
    గ్రామంలో ఉండేవారిని ఒక కాలు కష్టాల పాలు చేసింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: అందరి దగ్గర గొప్పగా ప్రశంసలు అందుకొన్న ఒక వంటవాడు గర్వంతో, లెక్కలేనితనంతో, శుచి శుభ్రతలను లెక్కపెట్టకుండా షడ్రసోపేతమైన విందు భోజనాలను తయారు చేశాడు. శుచి లేకపోయినా రుచి బాగా ఉండటంతో గ్రామంలోని వారంతా సంతోషంగా ఇష్టంగా ఆ విందు ఆరగించారు. ఐతే వంటవాడు శుభ్రత పాటించని కారణంగా ఆహారమంతా విషమైపోయింది. అందువలన అక్కడ భోజనం చేసిన వారి కందరికీ కడుపునొప్పి వాంతులు మొదలయ్యాయి. అలా ఆ వంటవాడి వంట *కాలు* గ్రామవాసులకు యాతన కలిగించాయి అని శుచి శుభ్రత ల గుఱించి విశదీకరించే సందర్భం.

    జోతలు గన్న పాచకుడు శుభ్రత లేకనె వంట జేయుచున్,
    చేతము పొంగ షడ్రుచుల సిద్ధము జేసెను భోజనాదులన్,
    ప్రీతి భుజింపగా నుదర వేదన, వాంతులు గల్గ సాగెగా!
    *ఆతని వంటకాలు కడు యాతన బెట్టెను గ్రామవాసులన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (5-3-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'శుభ్రత లేకయె' అని కదా ఉండాలి.

      తొలగించండి
  10. పాక్షికంపు దృష్టి పరిపాలన oబున
    కలిగి యున్న నేత కక్ష కట్టి
    సాయ పడక తాను సాగించు ఘన నాట
    కాలు కష్ట పెట్టు గ్రామ జనుల

    రిప్లయితొలగించండి
  11. మేటి జనులువారు కపటమెరుగ లేరు
    కూటి కొఱకు కష్టపడుటె కోరగలరు
    పట్నవాసి వ్యాపకముల వలన కరువు
    కాట "కాలు కష్టపెట్టె గ్రామజనుల"

    రిప్లయితొలగించండి
  12. మంచినీటి కొరత మశకమక్షికబాధ
    విద్యలేని తనము వెంటనుండ
    మనుజులవ్వ నిత్య మధుపాన ప్రియులుగ
    కాలు కష్టపెట్టె గ్రామ జనుల

    కాలు = కాలుడు

    రిప్లయితొలగించండి
  13. మొక్కు బడులు బలు లవెక్కువై యుండగా
    నంత్ర తంత్ర మందు నాశ పెరుగ
    నను స రించు చుండు నట్టి మూఢ పు నమ్మ
    కాలు కష్ట పెట్టె గ్రామ జనుల

    రిప్లయితొలగించండి
  14. అన్నదమ్ములంద రానందమయులౌచు
    కలిసి యుండ బలము కలిగె నాడు
    విడుట చేత నేడు విశద మాస్తులపంప
    కాలు కష్టపెట్టె గ్రామజనుల.

    రిప్లయితొలగించండి
  15. మూఢ నమ్మకాల మొదలు బెట్టుచు నుంద్రు
    మూఢులైన జనుల మోసగింప
    నవని లోన ఖలులు, నట్టివౌ పలు నమ్మ
    "కాలు కష్టపెట్టె గ్రామజనుల"


    రిప్లయితొలగించండి
  16. పగలు రేయి యనక పథికుల బాధించి
    కండలూడదీయు కరుణ లేక
    వీధులందు తిరుగు భీతిగొలుపు శున
    కాలు కష్టపెట్టు గ్రామజనుల

    రిప్లయితొలగించండి
  17. దయ యొకింత లేని తప్పుల కుప్పయౌ
    పచ్చి పాలసుండు పానకాలు
    గ్రామ కరణ మయ్యి కఠినము గను పాన
    "కాలు కష్టపెట్టె గ్రామజనుల"

    రిప్లయితొలగించండి
  18. చెప్పినట్లుచేయడెప్పుడు మాపాన
    కాలు,కష్ట పెట్టె గ్రామజనుల
    జిలిపితనము బాటు చేష్టల తోడను
    నొకరి పైననొకరి నుసిరి గొల్పి

    రిప్లయితొలగించండి
  19. రిప్లయిలు
    1. గోపాలుని పెంచిన యశోదపై వ్రేపల్లె గొల్లభామల ఆరోపణలు:
      ఉత్పలమాల.
      పిల్లలు నీమెకే గలుఁగు వేడుక గోముగఁ బెంచినంతఁ దా
      చల్లను పాలు మీగడలఁ జానల మానస చోరుడౌచు వ్రే
      పల్లియ స్త్రీల చీరలను పట్టుకు పోవడె? యీ యశోద వౌ
      యల్లరి పెంపకాలు కడు యాతన బెట్టెను గ్రామవాసులన్!

      తొలగించండి
    2. మనోహరమైన పూరణ సహదేవుడుగారూ! అభినందనలు!

      తొలగించండి
  20. వాస్తవమైన ప్రేమమున భ్రాతలు నాడు సమష్టి జీవులై
    నిస్తులమైన వైభవము నిత్యసుఖంబుల నంది యుండగా
    ప్రస్తుత మీ సమాజమున వ్యష్టి కుటుంబము లౌట నక్కటా
    యాస్తుల పంపకాలు కడు యాతనఁ బెట్టెను గ్రామవాసులన్.

    రిప్లయితొలగించండి


  21. చెంగట నాసుపత్రియును చేరగ లేదు! జనాళి బాధలన్
    చంగముగాను దీర్చెడు సుచక్షువులున్ సయి లేరు నేడిటన్
    డెంగు విసూరితమ్ముగన డెందము కందగ వాడవాడలా
    యంగట ఊచకాలు కడుయాత న బెట్టెను గ్రామవాసులన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. వీతభయంబుతోడరవి వేవురి సాయముబొందకుండగన్
    మాతకుతమ్ముడైనరఘు మామయపంచగనత్తరిన్గన
    న్నాతని పంపకాలు కడుయాతన బెట్టెను గ్రామవాసులన్
    బాతగ నుండుచిహ్నములుమారుచు గ్రొత్తవికన్పడచ్చటన్

    రిప్లయితొలగించండి
  23. సంతతమ్ము త్రాగి వింత ధోరణుల వా
    క్రుచ్ఛుచు నపనిందలు పరుల పయి
    ధూర్తుఁడు కపటుండు దుండగుం డగు పాన
    కాలు కష్ట పెట్టె గ్రామ జనుల


    ఎక్కిన గద్దె యిచ్చు నిఁక నేరికి నైనను మత్తు ధాత్రినిం
    జక్కని వాఁడు గ్రామసభ సన్మతిఁ బాలన సేయు నంచు మేల్
    మిక్కుటమై చెలంగునని మీఱిన నమ్మక ముంచి చేయగా
    నక్కట సంతకాలు కడు యాతనఁ బెట్టెను గ్రామవాసులన్

    రిప్లయితొలగించండి
  24. తిరుగుచుండునొక్క దెయ్యమ్ము రాత్రులన్
    జనులు బయట తిరుగఁ జంపుననుచు
    నడరుచుండెనెల్లరజ్ఞానమున నమ్మ
    కాలు కష్టపెట్టె గ్రామజనుల

    రిప్లయితొలగించండి
  25. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
    వ్యాకరణ విశేష పరిశీలన:

    లేక + ఎ= లేకయె సాదువు. ద్రుతాంతము కాదు కనుక లేకనె యసాధువు..
    లేకను: లేకుండగను విశేషార్థమున సాధువే.
    “లేకను” ఇక్కడ లేకను ద్రుతాంతము కాదు. లేక, ను లు రెండు పదముల సమ్మేళనము. అర్థ విశేషమున వచ్చిన “ను”.

    లేకను +ఎ: అన ద్విరుక్త దోషము. ను విశేషార్థమే ఎ కూడా యదియే కదా.

    నామ సర్వ నామంబులకును గళ లగు నవ్యయంబులకును గడపల సముచ్ఛయార్థవిశేష పాదపూరణంబుల యందు “ను” శబ్దంబు తఱచుగ నగు. కళ లగు ననుదదంత శబ్దము మీఁద నయ్యడది యు వర్ణ పూర్వకంబు విభాషనగు. మఱియు నది శేష షష్టి యందు యొక్క లోపించు నపుడు లాగమాంత బహు వచనంబు మీదను సముచ్చయమునం జూపట్టెడి. --- ప్రౌఢ. వ్యా. శబ్ద. 116.

    అనఘ యిదియేటి తపమే
    మనుపమదుఃఖితుల మగుట నాధారము లే
    కను సంతానోచ్ఛేదం
    బున వ్రేలెద మధమ లోకముల తెరువు సనన్ భార. ఆది. 2. 141.

    ఊఱడకం దిగిచి.. (ఊఱడకను = ఊఱడకయును) భార. ఆది. 4. 19

    రిప్లయితొలగించండి
  26. మిక్కుటమైన వర్షమది మీరినగాలుల
    జోడుతోడుగన్
    ముక్కలు చెక్కలవ్వగను ముద్దుగగట్టిన
    కొంపగోడులున్
    చక్కని నావలన్ వలల జాలరి సంపద
    నుప్పెనన్నదే
    తుక్కుగ జేయగా బతుకు తూలిన వైనము ఖేదమివ్వగా
    నక్కట జ్ఞాపకాలు కడుయాతన బెట్టెను గ్రామవాసులన్!

    రిప్లయితొలగించండి
  27. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అధిక పంట లొచ్చి యానంద మొందెడి
    రైతుల దరి జేరు క్రేతలెల్ల
    ఫలమునకు దగు ధర పంచకుండిన పంప
    కాలు కష్టపెట్టె గ్రామ ప్రజల
    (క్రేత=దళారి)

    రిప్లయితొలగించండి
  28. నోట్లు వచ్చెననుచు ఓట్లేయ ప్రజలెల్ల
    పాట్లు బట్టుకొనును పట్టుబట్టి
    దోమకాటు లాగ “దొరవారి తగుబూట
    కాలుకష్టపెట్టె గ్రామజనుల”|
    2.కాదన రెవ్వరేనియని కార్మికు లందరునొక్కటయ్యు నా
    వేదన చేతనందరును విజ్ఞతలందునబావిదవ్వగా?
    ఆదరి తవ్వకాలుకడుయాతన బెట్టెనుగ్రామవాసులన్
    సోదర సోదరీ మణులచూపులు సంతస మాయె నీటితో

    రిప్లయితొలగించండి
  29. వింత గు వర్తులై జనులు వెర్రి గ నమ్ముచు మూఢ చిత్తు లై
    సుంత వివేక ము న్ వదలి జోతల న ర్ప ణ జేయువార లై
    చింత లు దీర్ప దేవతల చెంత ను జేరియు మొక్కు చుండగా
    నంత ట పూనకాలు కడు యాతన పెట్టె ను గ్రామ వాసు ల న్

    రిప్లయితొలగించండి
  30. ఆటవెలది
    ఉనికి దెలిపి రనుచు నుగ్రవాదుల మూక
    లూరి మీద దూక నులికి పడగ
    యువకులఁ గొని పోయి యురి వేసెడు నరాచ
    కాలు కష్టపెట్టె గ్రామజనుల!

    రిప్లయితొలగించండి
  31. తగిన సమయమందు ధరను వర్షము లేక
    చేనులెండి పోయి చేటుదెచ్చి
    తినగ మెతుకు లేక ధిషణిన్ కరువుకాట
    కాలు కష్ట బెట్టె గ్రామ జనుల!!!

    రిప్లయితొలగించండి
  32. మిత్రులందఱకు నమస్సులు!

    (మిక్కిలి దుష్టుఁడైన యొక చోరుని కృత్యములు, గ్రామవాసులందఱం దల్లడపెట్టిన సందర్భము)

    ఆయత దుష్టచేష్టల నహర్నిశ విత్త సమార్జనమ్ముఁ దాఁ
    జేయుచు, నెల్లవేళలనుఁ జిత్తమునందు భయమ్ముఁ బెంచి, స
    ద్ధ్యేయము లేక, ఘోరమగు హింసలఁ బెట్టెడి రేరిహాణు న
    న్యాయపుఁ గూహకాలు కడు యాతనఁ బెట్టెను గ్రామవాసులన్!

    రిప్లయితొలగించండి
  33. ఎయ్యెడ జూడ దోమలవి యిట్టటు గాంచగ సంచరించుచున్
    చయ్యన కాటు వేయుగద సర్వ విధమ్ముల రోగ కారులౌ
    నయ్య! మలేరియా గునియ హాని కరమ్మగు డెంగ్యువట్లుగా
    నయ్యయొ! బోదకాలు కడు యాతనబెట్టెను గ్రామవాసులన్

    రిప్లయితొలగించండి
  34. వానలసలు లేక పంటలు పాడయ్యె

    పంటచేతి కందు బాట లేక
    ఋణము మిగిలిపోయె పృథ్వియందున కాట

    కాలు కష్టపెట్టె గ్రామజనుల.


    2.పత్తి పంట వేయ పండును విరివిగా

    తెల్ల పసిడి యనుచు నుల్లమందు

    మురిసి యెరువులేయ ముసిరె కరువు కాట

    కాలు కష్టపెట్టె గ్రామజనుల.


    3.ఊరి చివర చేరె నుగ్రభూత మనుచు

    జనులు భీతి జెంద శాంతి చేయ

    వచ్చె మాంత్రికుండు వట్టి మూఢపు నమ్మ

    కాలు కష్టపెట్టె గ్రామజనుల.


    4.ఊరి చెరువు నందు నుత్పాత మొదవంగ

    నీరు వాడుచుండ నెమ్మదిగను

    నాశమగుచు నుండ నారోగ్య మట బోదె

    కాలు కష్టపెట్టె గ్రామజనుల.


    5.జరుగు చుండె పోరు జలమునకై భువిన్

    రాష్ట్రములకు నడుమ రచ్చ హెచ్చె

    వల్లమాలినట్టి వ్యర్థములౌ పంప

    కాలు కష్టపెట్టె గ్రామజనుల.


    6పగలు రేయి యనక పంటపొలములందె

    కంట నిదురలేక కాపు కాయ

    పంట పాడు చేయ వచ్చెను గద కీట

    కాలు కష్టపెట్టె గ్రామజనుల.


    వట్టి=పనికిమాలిన,వ్యర్థమైన

    రిప్లయితొలగించండి
  35. శిస్తులు కట్టకుండ కడు శీఘ్రముగా సమకూర్చ సొమ్ముతా
    మస్తుగ వర్తకమ్మునను మాన్యతవీడి కుమారులందరున్
    మస్తకమందు పెల్లిదమగు మచ్చరమున్ గొని కీచులాడగా
    నాస్తుల పంప కాలు కడు యాతన పెట్టెను గ్రామ వాసులన్

    రిప్లయితొలగించండి
  36. డా.పిట్టాసత్యనారాయణ
    ఐదు రోజులచట నానగ బొడ్రాయి
    రాలిన పూలు, రారండి యిటకు
    ఉండలేని వసతి నండజే‌సిన నమ్మ
    కాలు కష్ట పెట్టె గ్రామ జనుల!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      నమ్మకాలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. ఆర్యా}పిట్టా}నుండి}
      రాలినట్టిపూలు,రండి యిటకు!
      ఆర్యా, పద్య పాదం లో , వచన కవితలో లా రూపకాన్ని ఇమిడించడంలో పడి ,మరచితిని, సవరణను స్వీకరించండి.

      తొలగించండి
  37. డా.పిట్టాసత్యనారాయణ
    బోలెడశాస్త్ర వాక్కులవి బూనెను వాని బరీక్ష సేయరా
    పాలకు వందిమాగధులె బాడిరి; "నమ్మకయున్న నాశమం"
    చేలనొ మభ్య బెట్టిరిల శోధన జేయని విజ్ఞునింట ద
    య్యాలకు పూనకాలు కడు యాతన బెట్టెను గ్రామవాసులన్

    రిప్లయితొలగించండి

  38. ............సమస్య
    *"కాలు కష్టపెట్టె గ్రామజనుల"*

    సందర్భము: లంకలోని యశోక వనంలో ప్రవేశించిన ఆంజనేయుడు తనను రామదూత యని నమ్మలేకపోతున్న సీతా దేవికి విశ్వరూపం చూపించాడు.
    (చుక్కలు తలపూవులుగా నక్కజముగ మేను బెంచి.. అని మొల్ల రామాయణం)
    అప్పుడు అంత పెద్ద లంకా పట్టణం చిన్న గ్రామం (పల్లెటూరుగా) గా కనిపించింది. సీతాన్వేషణం పూర్తి యయింది. రావణాదులకు తమ బల మేమో చూపించా లని అశోక వన విధ్వంసాన్ని సృష్టించాడు. కొలువు కూటంలో రావణునికి సముచిత సమాధానం చెప్పాడు. రావణుడు ఆంజనేయుని తోకకు ని ప్పంటింపజేశాడు. దానితోనే ఆ స్వామి లంకా దహనం గావించాడు.
    దీని కంతకూ సీతమ్మ వారి శోకాలే కారణం. ఆ శోకాలే గ్రామ(లంక) ప్రజలను కష్టపెట్టాయి కదా! ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    చూచె విశ్వ రూప సుందరున్ మారుతిన్

    కలికి సీత ; చిన్ని గ్రామ మయ్యె

    లంక ; దహన మయ్యె; నింక సీతమ్మ శో

    కాలు కష్ట పెట్టె గ్రామజనుల..

    2 వ పూరణము:-

    సందర్భము: సులభము. కందకము అంటే కోట చుట్టూ వుండే లోతైన అగడ్త. శత్రువులు దాన్ని దాటి కోటను చేరకుండా వుండడానికి గాను కందకంలోని నీళ్ళలో మొసళ్ళను కూడా వదలే వా రట.
    పాన యోగ్యములు కాని ఆ నీళ్ళు యిప్పుడు దోమల కాశ్రయాలై ప్రజల యారోగ్యానికి భంగకరములుగా పరిణమిస్తున్నాయి.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    *గద్దువాల* లోన కమనీయమైనది

    రాజుగారి కోట; రాను రాను

    మురుగు నీరు చేరి, ముసురు దోమల కంద

    కాలు కష్టపెట్టె గ్రామజనుల..

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    5.3.18
    --------------------------------------
    3 వ పూరణము:-

    సందర్భము: అపరిశుభ్రతయే అన్ని రోగాలకు మూలం. ఆరు బయట మల మూత్ర విసర్జనం అంటు రోగాలకు ముఖ్య కారణం.
    దేశాధినేత లిప్పు డీ విషయంపై దృష్టి సారిస్తున్నారు. శుభం. సామాన్య ప్రజానీకం కూడా తగు రీతిగా స్పందించి సహకరింతురు గాక!
    ~~~~~~~~~~~~~~~~
    *స్వచ్ఛ భారతమ్ము* సర్వజ నారోగ్య

    దాయకమ్ము గాదె ధరణిమీద!

    ఆగనట్టి యంటు రోగమ్ములు రక ర

    కాలు కష్ట పెట్టె గ్రామ ప్రజల..

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    5.3.18
    --
    ..........సమస్య

    *"..కాలు కడు యాతనఁ బెట్టెను గ్రామవాసులన్"* 

    సందర్భము: లంకలోని యశోక వనంలో ప్రవేశించిన ఆంజనేయుడు తనను రామదూత యని నమ్మలేకపోతున్న సీతా దేవికి విశ్వరూపం చూపించాడు.
    (చుక్కలు తలపూవులుగా నక్కజముగ మేను బెంచి.. అని మొల్ల రామాయణం)
    అప్పుడు అంత పెద్ద లంకా పట్టణం చిన్న గ్రామం (పల్లెటూరుగా) గా కనిపించింది. సీతాన్వేషణం పూర్తి యయింది. రావణాదులకు తమ బల మేమో చూపించా లని అశోక వన విధ్వంసాన్ని సృష్టించాడు. కొలువు కూటంలో రావణునికి సముచిత సమాధానం చెప్పాడు. రావణుడు ఆంజనేయుని తోకకు ని ప్పంటింపజేశాడు. దానితోనే ఆ స్వామి లంకా దహనం గావించాడు.
    హనుమంతుడు లంకలో కాలు మోపినాడు అంతే! లంకకు చేటుకాలం దాపురించింది. ఆయన మోపిన కాలు ఆ గ్రామ (లంకా నగర) వాసులను నరక యాతనకు గురి చేసింది కదా!
    ~~~~~~~~~~~~~~~
    ఒప్పుగ నింగి చుక్క లవి
    యొక్కొకటే సిగ పూవు గాగ తా
    నప్పటి కప్పుడే పెరిగె
    నా కపివర్యుడు విశ్వరూపుడై
    గొప్పది స్వర్ణలంక ప్రభఁ
    గోల్పడి తోచెను చిన్ని గ్రామమై
    యప్పడు రామ దూతఁ గనె
    నా జనకాత్మజ; యంజనీ సుతుం
    డప్పుడు మోపె కాలు; కడు
    యాతన బెట్టెను గ్రామ వాసులన్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    --------------------------------------
    అప్పడు= తండ్రి స్వామి దేవుడు

    రిప్లయితొలగించండి
  39. స్వచ్ఛభారతమ్మె స్వాభిమానంబని
    తెలిసి నడవ వలయు తెలివి తోడ
    పట్టనట్టుయున్న పల్లియలో బోద
    కాలు కష్టపెట్టె గ్రామజనుల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాధవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పట్టనట్టు+ఉన్న = పట్టనట్టున్న' అవుతుంది. యడాగమం రాదు. "పట్టనట్టు లున్న..." అనండి.

      తొలగించండి
  40. భీతిని దండుదండులను వీధుల నిండ్లను చూచుచుండగా
    కోతుల మూకలన్ తరుమ కోరుచు నొక్కటి కొండముచ్చునున్
    నేతగ నెన్నుకొన్ బడిన నీరజ నాయుని వేడుకొన్గ తా
    మాతని సంతకాలు కడు యాతనఁ బెట్టెను గ్రామవాసులన్

    రిప్లయితొలగించండి