అంశము - సీతారాముల కళ్యాణం
ఛందస్సు- చంపకమాల
న్యస్తాక్షరములు...
మొదటిపాదం 4వ అక్షరం - భ.
రెండవపాదం 12వ అక్షరం - ద్ర.
మూడవపాదం 15వ అక్షరం - గి.
నాల్గవపాదం 20వ అక్షరం - రి.
(లేదా...)
ఛందస్సు - ఆటవెలది
నాలుగు పాదాల చివరి అక్షరాలు వరుసగా భ - ద్ర - గి - రి ఉండాలి.
కడు శుభముల్ వెలార్చుచు సుఖప్రద దంపతులార్య సేవితుల్
రిప్లయితొలగించండిపుడమి ననంత శోభలను భద్ర సుమంగళ మూర్తి మంతులై
యొడలును పుల్కరింపగ సమున్నతులై గిరిరాజమందు సం
దడిగను రామ,భూమిజలు ధన్య వివాహమునందు భూరిగన్.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఇక్కడ 'గిరిరాజ' మంటే భద్రాచలమని మీ అభిప్రాయమా?
ఔనండీ ధన్యవాదాలు మెదడుకు పదును పెట్టే పిధంగా ఉన్నది మీరిచ్చిన న్యస్తాక్షరి ధన్యోస్మి
తొలగించండిరెండవ పాదము యతి తప్పినది
తొలగించండిపు - భ
రిప్లయితొలగించండిభళిర భళీ !అయోనిజకు భద్రుని తోడుగ పెండ్లి వేడుకల్
తళతళ శోభలన్ గొలుపు తంద్రము భవ్యముగా! జిలేబియా !
గళగళ పాడు దామిక సుఖమ్ముగ గింగురు లైన తీరులన్
మిళితము గాంచి పాటలను మేలుకొనంగ జనుల్ వయారియా !
శుభోదయం
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండి🙏శ్రీరామనవమి శుభాకాంక్షలు🙏
వరశుభలక్షణుండదె వివాహము చేకొనుచుండె మంగళ
స్వరములు మ్రోగ , సీత గుణసాంద్రను రాముడు భద్రశైలమం..
దరయగ రండు! దేవతలు నందరు నింగిని జేరి జూచి సం...
బరమును పొందుచుండిరి శుభంబులు గల్గును జూచువారికిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండివచ్చితిమి వచ్చితిమి చూడగాను
వేడుకల భద్రాద్రికిన్ !
జిలేబి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరామచంద్రమూర్తి రమణీయ ఘనశోభ
తొలగించండినవనిజాత గనగ నతని ముద్ర
మనసునందు దోప నునుసిగ్గుల శుభాంగి
మురియ , పెండ్లి వేడ్క బుధులు గనిరి !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండినేటి అంశము :: న్యస్తాక్షరి - *భ ద్ర గి రి* అనే నాలుగు అక్షరాలు క్రమంగా నాలుగు పాదాలలో 4 , 12 , 15 , 20 వ స్థానాలలో వచ్చేటట్లు పద్యం వ్రాయాలి.
ఛందస్సు :: *చంపకమాల*
విషయం :: సీతారాముల కళ్యాణం
సందర్భం :: శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా , శ్రీ మహాలక్ష్మి సీతమ్మగా , విరజానది గౌతమీ నదిగా దివి నుండి భువికి అవతరించగా ఆ వైకుంఠము భద్ర్రాచలంగా విరాజిల్లుచుండగా ఇప్పుడు భద్రగిరిలో శ్రీ సీతారామ కల్యాణం జరిగింది అని విశదీకరించే సందర్భం.
భక్త రామదాసుగా ప్రసిద్ధి వహించిన కంచెర్ల గోపన్న తన దాశరథీశతకంలో
శ్రీ రమ సీత గాగ, నిజ సేవక బృందము వీర వైష్ణవా
చార జనంబు గాగ, విరజానది గౌతమిగా, వికుంఠము
న్నారయ భద్ర శైల శిఖరాగ్రము గాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ! కరుణా పయోనిథీ!
అని వర్ణించారు.
ఆ విషయాన్నే న్యస్తాక్షరి పద్యంలో యథాశక్తి నాలుగు పాదాలలో ప్రస్తావిస్తూ, శ్రీ సీతారాముల కల్యాణ విషయాన్ని మరియు న్యస్తాక్షరి లో ఇవ్వబడిన * భ ద్ర గి రి * అనే నాలుగు అక్షరాలను ఐదవ పాదంలో సమకూర్చడం జరిగింది.
వరుడు భవాబ్ధితారకుడు వచ్చెను విష్ణువు రాముడౌచు, సం
బరమున లక్ష్మి వచ్చినది భద్రము లీయగ సీతయౌచు, నా
విరజయు గౌతమీ నదిగ ప్రీతిగ నీ గిరి చెంత జేరె , దా
నరయగ నేడు భద్రగిరి యయ్యె వికుంఠము భద్రు కోరికన్,
పరిణయ మాడె భద్రగిరి వాసిగ రాముడు సీత నిచ్చటన్.
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (26-3-2018)
అద్భుతమైన పూరణ అవధానిగారూ! అందుకోండి జేజేలు!💐💐💐🙏🙏🙏
తొలగించండి
తొలగించండిఅద్భుతమండీ రాజశేఖర్ గారు
జిలేబి
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
డా.పిట్టాసత్యనారాయణ}
రిప్లయితొలగించండినవమిని భ*ద్రమౌ తిథిని నాదు గృహంబున జేతు బెళ్లి, యో
భవహర రామ!భూమిజ, సుభద్ర*త నిచ్చెడు తల్లి! యా జనా
ర్ణవమును జేర, వృద్ధుడ, విరాగిన తద్గి*రి నెక్కలేను, నే
సవరణ జేసికొంచునను,చాలగ రావలెనంచు బోరి*తిన్
బవరము జీవితమ్ము నగుబాటుల పేదల పూజలందరే!!
డాపిట్టాసత్యనారాయణ నుండి
రిప్లయితొలగించండి3వ పాదంలో "విరాగిని"గా టైపాటును ద.చే సవరించ గలరు,ఆర్యా.
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పెళ్లి' సాధువు కాదు. "పెండ్లి" అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండిఅమోఘం !
జిలేబి
జనుల’భ’యమ్ము బొంద శివచాపము ద్రుంచి సుధన్వి రాము పా
తొలగించండివని, భువిజాత, కోమలి, సుభ’ద్ర,’ సలక్షణగాత్ర జానకిన్
ఘనమగు రీతి దేవతలుగాంచుచు నిం’గి’ని సూనల సోన జిల్కగా
ననుమతినీయ దండ్రియు సహర్షము బెండిలియాడె గో’రి’కన్
సీతాదేవి గారూ,
తొలగించండిబాగున్నది మీ పూరణ. అభినందనలు.
'రాము' అని డుప్రత్యయం లేకుండా ప్రయోగించారు. "శివచాపము ద్రుంచిన రాఘవుండు పా..." అనవచ్చు కదా! మూడవ పాదంలో గణదోషం. 'నింగిని బూల జల్లగా' అందామా?
ధన్యవాదములు గురుదేవా! సవరించెదను!
తొలగించండిజనుల’భ’యమ్ము బొంద శివచాపము ద్రుంచిన రాఘవుండు పా
వని, భువిజాత, కోమలి, సుభ’ద్ర,’ సలక్షణగాత్ర జానకిన్
ఘనమగు రీతి దేవతలుగాంచుచు నిం’గి’ని బూల జల్లగా
ననుమతినీయ దండ్రియు సహర్షము బెండిలియాడె గో’రి’కన్!
నమస్సులు!🙏🙏🙏
జనులు భజింప భక్తిగ నిజాంతరమందున ధీరశాంతుడై
రిప్లయితొలగించండివనజదళాయతాక్షులను భద్రమొనర్చుచు జీవకోటికిన్,
జనకజవంక ప్రేమ వెదజల్లుచు సాగిన రమ్యదృశ్యమౌ
నినకులసోముడైన రఘువీరువివాహ మపూర్వమేరికిన్.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండిపుడమి భవoబయెన్ హరి యె మో దము చెందగ శిష్ టు లె ల్లరు న్
రిప్లయితొలగించండిచెడు యగు దైత్య యూధ ము ను ఛి ద్రము చే సె ను రామ చం ద్రుడై
కడు గొని సీత రాము ల కు కాంతుల తో గిరి వె ల్గుచుండగా
తడ య క పెండ్లి యౌ జనులు ధన్య త తో ముద మందు చేరి యు న్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చెడు + అగు' అన్నపుడు యడాగమం రాదు.
చె డు గ గు అని సవరణ చే య డ మై న ది గురువు గారూ
తొలగించండిఅందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిసీసము:
మంచి పనులజేయ మనసులో తలపోయ
మారీచ సోదరుల్ మసినిబూయు
చూడ గట్టితలపు సుగ్రీవమున గోర
వాలిపోవు ప్రతిగ వాలిగాడు
పుణ్యకార్యమొకటి బూనిసేయుదమన్న
కుంభకర్ణుని మత్తు కూడియుండు
చక్కటినిర్ణయమ్మొక్కటే వలెనన్న
తలలు పదిగమొల్చి దాడిసేయు
ఆటవెలది:
నోరు విల్లు గాగ తీరుగా వేయగా
నారివోలె దలచి నాల్క తోడ
రామనామ మనెడు రమ్యమౌ బాణమ్ము
బాధలన్ని దొలగి భవిత వెలుగు .
గోలి వారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఘనమగు భవ్యరూపమును గాంచగ వచ్చితి నీదు పెండ్లిలో
రిప్లయితొలగించండిప్రణతులు జానకీవిభుడ! భద్రగిరీశ! నిశాట నాశకా!
దినమును రాత్రి నీదయను దేవర! సాగితి సత్య మార్గమున్
మనుపుము మోక్షమిమ్మునిను మందిరమందునఁ జూచు వారికిన్
అన్నపరెడ్డివారూ...మొదటిపాదం నాల్గో అక్షరం "భ" కావాలి గదా! పరిశీలించగలరు. సరిచేయగలరు.
తొలగించండిగురువర్యులకు నమస్సులు ధన్యవాదములు. సవరిస్తాను
రిప్లయితొలగించండిఘన విభవమ్మునేటి శుభకార్యము గాంచుట నెంచిచూడగన్
రిప్లయితొలగించండిప్రణతులు జానకీసహిత భద్రగిరీశ! పలాశి వైరి! యీ !
దినమున నీదు పెండ్లిగన దివ్యపు లోగిలి భక్తిఁ జేరితిన్
మనుపుము మోక్షమిమ్మునిను మందిరమందునఁ జూచు వారికిన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ (సవరించిన) పూరణ బాగున్నది. అభినందనలు.
dear sir very good blog and very good content
రిప్లయితొలగించండిOnline Telugu News
రిప్లయితొలగించండిశివుని విల్లు విరువ శ్రీరామునకు శుభ
మంగళములు కలుగ మనసు భద్ర
మయ్యె సీతకచట మధురోహలు రేగి
మురిసి మాల వేసె భూకుమారి/భూమిపుత్రి.
ఉమాదేవి గారూ,
తొలగించండిబాగున్నది మీ పూరణ. అభినందనలు.
మూడవ పాదం చివర గణదోషం. "మధురోహలే రేగి" అనండి.
తెలుగు భవిష్యతానిధిగ తేజము నింపెడిరామభద్ర!ప్రో
రిప్లయితొలగించండిబ్ధలమున రామదాసుకవి భద్రత కీర్తనలందు పెళ్ళి లో
తలతురు భక్తకోటి తమదర్శనమున్ గిరిశోభయందునన్
నిలచిరి పెళ్లిపందిటన నీదయకై పరమాత్మకోరికై
దయచేసి రెండవపాదాన ప్రోద్భలమున అనిచదువప్రార్థనగురువుగారికివిన్నపము
రిప్లయితొలగించండిఈశ్వరప్ప గారూ,
తొలగించండిబాగున్నది మీ పూరణ. అభినందనలు.
"పందిటను... కోరికన్" అనండి.
రిప్లయితొలగించండిభద్ర! సీత యిదియె ! పరికించు మా సుభ
ద్రయగు నేలచూలి రామచంద్ర!
గివపు దీపమయ్య! గేస్తువై వెలిగి గి
రి కొనుమయ్య నిపుడె రేకగ దరి!
ఇయం సీతా మమ సుతా
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిన్యస్తాక్షరాలను ఆద్యంతాలలో నిలిపి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...కొనుమయ్య యిపుడె" అనండి.
చం.మా.
రిప్లయితొలగించండిసకల "భ"యాలు రూపడచు చక్కని రాఘవ రమ్ము రమ్య రూ
ప కలికి సీతతోడ మరి భ"ధ్ర" నగమ్ముకు;నీ వివాహ వే
డుకలను భూజనావళి కడున్ రహితో "గి"రి జేరి గాంచరే!
చక చక శక్తి యుక్తులను చక్కగ నివ్వుము జూచు వా"రి"కిన్
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘ వనపర్తి☘
సవరణ పద్యము...
తొలగించండిశాంతిభూషణ్ గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇక్ష్వాకు ప్రవ రాబ్ధి సింధుజుఁడు దైత్యేంద్రక్షయార్థైక జ
తొలగించండిన్మ క్ష్వేడా స్వన సత్య వాక్చతుర సంభావ్యుండు ధానుష్కుఁడున్
సక్ష్వింక వ్రజ భాను సూన సఖుఁడున్ సద్ధర్మసత్పాలుఁడున్
సుక్ష్వేళాత్త గళాంబికా పతి దయాంశు శ్రేణి లబ్ధుండు ప్రా
ప్త క్ష్వేళి ద్విష పుంగ వానురతినిం బ్రార్థింతు సీతాపతిన్
అజ నిభ సంయ మీంద్రుఁడు మహాత్మ వసిష్ఠుఁడు స్వర్ణ పాలికాం
తొలగించండిబుజ నిభ బైజిక ప్రవరముల్ ద్రవ పూర్ణ ఘటాదు లుంచఁగన్
సుజప సుభాషణమ్ములను సుందరుఁడే గిరిజా నికాశ సీ
త జనకుఁ డిచ్చె రామునకు ధాత్రిజ నందఱు మెచ్చఁ బేరిమిన్
ఉత్తరంపుఫాల్గు నోత్తమ మతి శుభ
లగ్న మందు జనక రాజు భద్ర
లక్షణ భరణీజ రామచంద్రకొను గి
ర లనె భద్ర మగును జెలఁగి యడరి
... భ
.. భ ద్ర
...భ ద్ర గి
..భ ద్ర గి రి
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. ముఖ్యంగా నామగోపన విధానంలో చేసిన రెండవ పూరణ అనన్యసామాన్యం. అభినందనలు.
పూరణలను అనుసరించిన శ్రీరామస్తుతి దుష్కరప్రాసతో అద్భుతంగా ఉన్నది.
మీ పద్యాన్ని చూసిన తర్వాత ఈ సమస్య తోచింది. "ఇక్ష్వాకు కులాబ్ధి చంద్రుఁ డీ కృష్ణుండే" (లేదా...) "ఇక్ష్వాక్వన్వయ దుగ్ధవార్ధి శశయౌ నీ కృష్ణుఁడే చూడఁగన్".... ఎలా ఉంటుంది?
భయ్యా ఇలా దుష్కర ముష్కురులతో జనాల్ని ఏల బాదేస్తారు ? తెలుగులో రాయకూడదూ ?
తొలగించండిఅమ్మా జిలేబీ గారూ,
తొలగించండిఇదేదో సరదాకు అనుకున్న సమస్య. బ్లాగులో ఇవ్వడం లేదు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిసమస్యలు రెండు నత్యుత్తమముగా నున్నవి.
“..దుగ్ధవార్ధి శశియౌ..” నని కదా మీ యభిప్రాయము.
ప్రయత్నము చేసెదను. ఇప్పటికే యీ ప్రాస నైదు పాదములకు కుదిర్చితిని కష్ట పడి.
కామేశ్వర రావు గారూ,
తొలగించండిఅద్భుతమైన శ్రీరామ స్తుతి పద్యాన్ని ఎందుకు తొలగించారు?
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పద్య మున్నది కదా. తొలగించ లేదు.
తొలగించండిఅవునండీ.. ఉన్నది. గమనించలేదు.
తొలగించండిపూజ్యులు కవిశేఖరులు కామేశ్వరరావు గారికి ప్రణామాలు! మీ రామస్తుతి పద్యానికి తాత్పర్యం చెబితే మా బోంట్లకు మహదానందంగా ఉంటుంది! వివరించ ప్రార్ధన!🙏🙏🙏
తొలగించండిఇక్ష్వాకు ప్రవర అబ్ధి సింధుజుఁడు: ఇక్ష్వాకు కుల మను సముద్రమునకు చంద్రుని వంటి వాఁడు ;
తొలగించండిదైత్య ఇంద్ర క్షయ ఏకార్థ జన్మ: రావణ వధయే కారణముగ జన్మ కలవాఁడు;
క్ష్వేడా స్వన: సింహ గర్జన వంటి కంఠ ధ్వనితో;
సత్య వాక్చతుర సంభావ్యుఁడు: సత్య వచనములు పలుకుట యందు నిపుణుఁడు, పూజ్యుఁడు;
స క్ష్వింక వ్రజ భాను సూన సఖుఁడు: కోతుల సమూహముతో నున్న రవి పుత్రుఁడు, సుగ్రీవుని సఖుఁడు;
సద్ధర్మ సత్పాలుఁడు:ఉత్తమ ధర్మమును శ్రేష్ఠముగఁ బాలించు వాడు;
ప్రాప్త క్ష్వేళి ద్విష పుంగవ అనురతి: లభించిన సర్పములకు శత్రువులలో శ్రేష్ఠుఁడు, గరుత్మంతుని ప్రేమ కలవాఁడు;
సీతా పతిని బ్రార్థింతును.
రామ లక్ష్మణు లింద్ర జిత్తుని నాగాస్త్ర బంధితు లై నపుడు గరుడుఁడు వచ్చి వారిని విముక్తలను జేయును.
మన్నించాలి. అబ్ధిసింధుజుడు అన్నది అంత ఒప్పుగా అనిపించటం లేదు. ఆక్షేపించటం అనుకోకండి. అంత తెలిసిన వాడను కాను. కేవలం తెలుసుకొనటానికే ప్రస్తావించటం. ధన్యవాదాలు.
తొలగించండిపూజ్యులు కామేశ్వరరావుగారికి నమఃపూర్వక ధన్యవాదములు!🙏🙏🙏
తొలగించండిశ్యామలీయం గారూ,
తొలగించండిధన్యవాదాలు. ఆ సందేహం నాకు కూడ కలిగింది.
కామేశ్వర రావు గారూ,
తొలగించండిఅక్కడ "ప్రవరాబ్ధి పూర్ణశశి..." అంటే ఎలా ఉంటుంది?
పూజ్యులు శంకరయ్య గారికి విజ్ఞులు శ్యామల రావు గారికి వందనములు.
తొలగించండిసింధువు, సముద్రము నందు పుట్టిన వాఁడు , చంద్రుఁ డని ప్రయోగించితిని. ఇక్ష్వాకు కులమును కూడా సముద్రముతో బోల్చితిని కదా యని.
మీరన్నట్లుగా ధారా భంగముగనే తోచుచున్నది.
గురువు గారి సూచన చక్కగా నమరినది. దానినే గ్రహించు చున్నాను. ధన్యవాదములు.
చిన్న సవరణ:
తొలగించండిఇక్ష్వాకు ప్రవ రాబ్ధి పూర్ణ శశి దైత్యేంద్రక్షయార్థైక జ
న్మ క్ష్వేడా స్వన సత్య వాక్చతుర సంభావ్యుండు ధానుష్కుఁడున్
సక్ష్వింక వ్రజ భాను సూన సఖుఁడున్ సద్ధర్మసత్పాలుఁడున్
సుక్ష్వేళాత్త గళాంబికా పతి దయాంశు శ్రేణి లబ్ధుండు ప్రా
ప్త క్ష్వేళీ ద్విష పుంగ వానురతినిం బ్రార్థింతు సీతాపతిన్
హరుని విల్లు విరచి యతివ సీతను శుభ
రిప్లయితొలగించండికరముగ రఘు రాము డరయ భద్ర
ముగ కరము నిడుకొని మురిసి పోయె లతాంగి!
నవ వధూవరులు పరవశులైరి!
శ్రీధర రావు గారూ,
తొలగించండిబాగున్నది మీ పూరణ. అభినందనలు.
"విరిచి... నిడుకొన మురిసిపోయె..." అనండి.
మిత్రులందఱకు శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిహరిని(భ)వక్త్రుఁ డా గురున కంజలి సేసి, యనుజ్ఞ నొంది, క
ర్వరియగు తాటకన్ దునిమి, భ(ద్ర)ముగా శిలఁ దన్విఁ జేసి, సం
బరపడి కౌశికుండు నడువన్, దను నేఁ(గి), విదేహఁ జేరియున్,
హరువిలుఁ ద్రుంచి, జానకిని హర్షమునన్ మనువాడెఁ గూ(రి)మిన్!
మధుసూదన్ గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. బాలకాండను ఒక పద్యంలో నిక్షిప్తం చేసారు. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండిఅద్భుతమైన పూరణండీ మధుసూదన్ గారూ! 🙏🙏🙏🙏
తొలగించండిధన్యవాదాలండీ సీతాదేవి గారూ!
తొలగించండిఅందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిచంపకమాల
ముని కభయమ్మువై! పదము మోపి నహల్యకు రూప దాతవై!
ధనువు ధరించుచున్ సమహితా! ద్రవిణమ్మున ద్రుంచ వీరుడై
కనుబొమ వింటినారి తెగి గాంచిన రాగిణి సీత చూపులున్
నినుగని తూపులై వలపు నెయ్యము జేసెడు వాడి కోరికన్
వినతుల దెల్ప జానకిని పెండిలి యాడిన రామ! కావరా! !
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
మీరు కూడా మధుసూదన్ గారి వలె ఒక పద్యంలో బాలకాండను చెప్పారు.
మీ పూరణ బాగున్నదండీ గుండా వారూ!
తొలగించండిమీ నాల్గో పాదం చివర ... వాడి కోరికన్ ... దీనిని మార్చి, నీవు కోరి, సీ/తను మనువైతి భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ! అంటే ఎలా వుంటుంది?
గురుదేవులకు మరియు శ్రీ గుండు మధుసూదన్ గారికి ధన్యవాదములు. శ్రీ మధుసూదన్ గారి సూచన బాగున్నది.
తొలగించండి
రిప్లయితొలగించండిఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో శనివారము 31.03.2018 నాడు ప్రసారము కాబోయే
సమస్య:
మాటలు రాని వాని పలు మాటలు పద్యములయ్యె వింతగన్!
**** *** **** **** **** **** **** **** ***
నా పూరణ
*** *** *** *
ఉ.మా.
చాటువుగాను పద్యములు చక్కగ జెప్పెడు నొక్క తాతయున్!
మాటలు ముద్దు ముద్దుగను మాధురి పౌత్రుడు పల్కుచుండగా
వాటిని మోదమొందుచును పద్యములల్లుచు జెప్పె మేటిగన్
మాటలు రాని వాని పలు మాటలు పద్యములయ్యె వింతగన్!
-ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
డా.పిట్టాసత్యనారాయణ
తొలగించండిశాంతి భూషణ్ కు కృతజ్ఞతలతో...
చాటుగ నక్షరమ్మొకటి చయ్యన నొక్కిన, పైని "బారు"పై
వాటముగా బయల్పడిన వచ్చియురాని పదంబు జార్చి యా
రాటమునూని చూపెనట "రా,యిటు తాత" యటంచు బాల యా
కూటములెన్నొ రూపకపు కూర్పులు జువ్వున జావళీలయెన్
మాటలు రాని వాని పలు మాటలు పద్యములయ్యె వింతగన్!
(కంప్యూటర్ కవిత్వం నేపథ్యంగా)
వర్షే వర్షే కల్యాణం
రిప్లయితొలగించండివినుత భవాబ్ధితారకుడు వీరశిఖామణి రాఘవేంద్రుడా
వనజదళాయతాక్షిని, సుభద్రను,కోమలగాత్రి జానకిన్
కనుగవ నిండ జూడగ సుకార్యము వేగిర పాటు నొందెడిన్
జనుల విశేషపుణ్యమన చక్కగబెండిలియాడె గూరిమిన్!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ధన్యోస్మి! గురుదేవా! ప్రణామాలు!🙏🙏🙏
తొలగించండిమీ పూరణ చాల బాగున్నదండీ సీతాదేవి గారూ! అభినందనలు!
తొలగించండిధన్యవాదాలండీ!🙏🙏🙏
తొలగించండిశ్రీవిళంబి యందు"శ్రీరాముడికిశుభ
రిప్లయితొలగించండిశోభ!సీతపెళ్లి!చూడ భద్ర
తందుజరిగె ప్రజల దర్శించియనగ?గి
రీశుడెంచునట్లు శ్రీ రామయనిరి!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భద్రత + అందు' అన్నపుడు సంధి లేదు. చివరి పాదంలో గణదోషం. అన్వయం కూడా పొసగినట్లు లేదు. సవరించండి.
తలప భయం కరమ్మెయగు తాటకి దున్మియు నొక్కపెట్టునన్
తొలగించండిబలిమిని ధర్మము న్నిలిపి భద్రత గూరిచి;కొల్వు కూటమున్
విలునవ లీలగనన్ విఱిచి వింతగ; వేగిరమే సులోచనన్
గెలిచి వివాహ మాడెగద క్షేమము గల్గగ చక్రధారియే!
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"విలు నవలీలగన్..." టైపాటు.
ఆటవెలది
రిప్లయితొలగించండియజ్ఞ రక్షఁ జేయు నసమాన్యఁపు ప్రతిభ
శివుని విల్లు పైన చేతి ముద్ర
జానకి కను బొమల సారంగము విరిగి
యొప్ప రాము నచట నొక్కటైరి
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంశము - సీతారాముల కళ్యాణం
రిప్లయితొలగించండి*న్యస్తాక్షరి*
ఛందస్సు - ఆటవెలది
నాలుగు పాదాల చివరి అక్షరాలు వరుసగా "భ - ద్ర - గి - రి "ఉండాలి.
*ఆ.వె**
సీత పూల మాల చేతబూనుచు శుభ
దామమిదియనుకొని రామచంద్ర
వరుడినోరకంట పరికించెను లతాంగి
రాజ్య ప్రజలు గని పరవశు లైరి
...............✍చక్రి
చక్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వరుని నోరకంట.." అనండి.
రిప్లయితొలగించండిమునిక'భ'యమ్ము నిచ్చుచు ను ముప్పును గూర్చెడి దానవేంద్రులన్
వనమున దిర్గుచుండగ నుప'ద్ర'వమున్ యొనరించు దైత్యులన్
దునుమగ నెంచి రాముడట దూరముగా'గి'రికీలు కొట్టుచున్
పరుగులు దీసె దానవుడు ప్రాణభయంబున తాను నూ'రి'కిన్
బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని సీతారాముల కళ్యాణ ప్రసక్తి లేదు.
'ఉపద్రవమున్ + ఒనరించు = ఉపద్రవము నొనరించు' అవుతుంది. యడాగమం రాదు. "..నుపద్రవమే యొనరించు..." అనండి.
కవి మిత్రులారా ఈరోజు పూరించవలసిన సమస్య 'శ్రీరాముడు శివుని వేడె సీతా సుతుడై '-గోటేటి శివరామ కృష్ణ .
రిప్లయితొలగించండిలేదా 'శ్రీరాముని శివుడు వేడె సీతాసుతుడై "
రిప్లయితొలగించండిశివరామ కృష్ణ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
కందంతో పాటు వృత్తపాదాన్ని కూడ ఇస్తున్నాను కదా... "శ్రీరాముండు త్రినేత్రు వేడెను గదా సీతమ్మకున్ బుత్రుఁడై" లేదా... "శ్రీరామున్ శివుఁ డెంతొ వేడెను గదా సీతమ్మకున్ బుత్రుఁడై" అంటే ఎలా ఉంటుంది?
సవరించినందుకు గురువర్యులకు ధన్యవాదములు .సమస్యను పూరణలకోసం పోస్ట్ చేయగలరు .
తొలగించండిగురువుగారు నేను ఇచ్చిన సమస్య ఎప్పుడు ఇస్తారు ?
తొలగించండిభద్రగిరి నివాసి బహుదివ్యమౌశోభ
రిప్లయితొలగించండిద్రవిడ దేశమందు తనదు ముద్ర
గిరికి ప్రభువు పాడు కీర్తనల మరగి
రిక్కలందు చంద్రు రీతి నడరె
* బరగి
తొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి న్యస్తాక్షరం 'రి' కదా? మీరు 'రె' వేసారు.
గురువుగారికి నమస్సులు! అడరి అంటే అసంపూర్ణంగా ఉంటుందని! క్రియాపదముతో ముగియవలెనని! పాద ఆద్యంతాలలో న్యస్తాక్షరాలను ఉంచాలనే ప్రయత్నంలో చివరి అక్షరం కుదరలేదు!🙏🙏🙏🙏🙏
తొలగించండి*26-3-18 న్యస్తాక్షరి
రిప్లయితొలగించండి1,2,3,4 పాదాలలో వరుసగా 4,12,15,20 వ స్థానాలలో భ,ద్ర,గి,రి అని రావాలి.చంపకమాల
*శ్రీ సీతా రామ కల్యాణం*
సందర్భము: శ్రీ లక్ష్మియే సీతగా శ్రీ హరియే రాముడుగా అవతరించినారు. వారి కల్యాణం యీనాడే! అది లోక కల్యాణమే కాని వేరు కాదు. ఆ పెండ్లిని స్మరిస్తే వింటే పాల్గొంటే యేమేమి ప్రయోజనాలు సిద్ధిస్తాయో యీ పద్యంలో చెప్పబడింది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఇల శుభముల్ వరించును, ర
హిన్ జన సంతతి శాంతి సౌఖ్యముల్
నిలిచి హసించు, వ్యర్థ మగు
నిద్రలు వేగ నశించు, మంచి వా
నలు కురిపించు, పంటలు క
నంగను లోగిలిలోన మించు.. శ్రీ
లలనయె సీత, శ్రీ హరియె
రాముడు; పెండిలి నేడె వారికిన్..
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
26.3.18
------------------------------
ఆటవెలది.. 1 వ పూరణము:--
......న్యస్తాక్షరి
1,2,3,4 పాదాంతాలలో భ,ద్ర,గి,రి అని రావాలి. ఆటవెలది
*శ్రీ సీతా రామ కల్యాణం*
సందర్భము: శ్రీ లక్ష్మియే సీతగా శ్రీ హరియే రాముడుగా అవతరించినారు. వారి కల్యాణం యీనాడే! అది లోక కల్యాణమే కాని వేరు కాదు. ఆ పెండ్లిని స్మరిస్తే వింటే పాల్గొంటే సకల శుభాలూ సిద్ధిస్తాయి. అశుభాలు తొలగిపోతాయి అని చెప్పుకుంటారు. అదే ఈ పద్యంలో చెప్పబడింది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
వినినఁ జాలుఁ బెండ్లి వింతలైన యశు *భ*
ము లవి తొలగుచుండుఁ, బొసగ భ *ద్ర*
ము లవి కలుగుచుండు.. ముచ్చటగను నే *గి*
చెట్టబట్టె నేడు సీత శౌ *రి*
2 వ పూరణము:--
1,2,3,4 పాదాంతాలలో భ,ద్ర,గి,రి అనే
అక్షరాలు రావాలి. ఆటవెలది
*శ్రీ సీతా రామ కల్యాణం*
సందర్భము: శ్రీ లక్ష్మియే సీతగా శ్రీ హరియే రాముడుగా అవతరించినారు. వారి కల్యాణం ఈనాడే!...
కనక కలస మని కోపర రూరే
సుచి సుగంధ మంగల జల పూరే
నిజ కర ముదిత రాయఁ అరు రానీ
ధరే రామ కే ఆగే ఆనీ ....
(శ్రీ రామ చరిత మానసము.. తులసీదాసు.. బాలకాండ 323 వ దోహా తర్వాత 3 వ చౌపాయి పేజి 249)
పడహి బేద ముని మంగల బానీ... (వేద మంత్రాలను ఋషులు పఠిస్తూ వుండగా..)
అని కొనసాగుతుంది.
అనేకులకు తెలియని విషయం... జనకుని పట్టపురాణి సునయనా దేవి.. సీతా రాముల వివాహంలో వాళ్ళిద్దరూ బంగారు కలశాలతో మంగళ జలాలను తెచ్చి రాముని పాదాలు కడిగినారు.
~~~~~~~~~~~~~~~
సునయనయు జనకుడు ఘన కనకపు కుంభ
ములను మంగళ జలములను భద్ర
ముగను వేదములను
మునులు జదువ.. నేగి,
రామ చరణ సుమములను కడిగిరి
3 వ పూరణము:--
*శ్రీ సీతా రామ కల్యాణం*
సందర్భము: శ్రీ లక్ష్మియే సీతగా శ్రీ హరియే రాముడుగా అవతరించినారు. వారి కల్యాణం ఈనాడే!...
ముమోద జనకో లక్ష్మీం
క్షీరాబ్ధి రివ విష్ణవే 55
(లక్ష్మిని విష్ణువు కొసంగినపుడు క్షీర సముద్రునివలె సంతోషించినాడు.)
యజ్ఞ భూమి విశుద్ధ్యర్థం
కర్షతో లాంగలేన మే
సీతా ముఖాత్ సముత్పన్నా
కన్యకా శుభ లక్షణా... 59
(యజ్ఞ భూమిని శుద్ధి చేయడానికి దున్నుతూ వుంటే నాగలికి తగిలి దొరికింది యీ కన్యక.) అన్నాడు జనకుడు.
అధ్యాత్మ రామాయణము.. బాల కాండము
6 వ సర్గ పుట 54
~~~~~~~~~~~~~~~
చూచి, యజ్ఞ భూమి శుద్ధిఁ జేయగ శుభ
లక్షణ దొరికె నిటులను... సుభద్ర
యగును సీత; యిత్తు హరికి లక్ష్మి నొసగి
నటుల.. ననె జనకుడు హర్షపు ఝరి...
🖋~డా.వెలుదండ సత్యనారాయణ