21, మార్చి 2018, బుధవారం

సమస్య - 2629 (కోడిని నొక బాపనయ్య...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్"
(లేదా...)
"కోడిని బ్రాహ్మణుం డొకఁడు గోరి భుజించె జనుల్ నుతింపఁగన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

126 కామెంట్‌లు:

  1. చేడియ దసరా పండుగ
    నాడా శర్కరను గాచి నందులు చిలుకల్
    జీడీ లాదులు చేయగ
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్


    చేడియ యనురాగంబున
    వేడుక మీరంగ శనగ పిండిని గొనుచున్
    పోడిమిని జేసి యుంచ ప
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. ఓడక నిట్రుపవాసము ;
    వేడుక నీశ్వరు స్మరణము పెల్లుగ కాగా
    వాడిన దేహము తోడ ప
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్ .

    రిప్లయితొలగించండి
  3. గాడుపు తండ్రి వదలకన్
    వాడిగ వానను కురియగ , వాసిత కోరన్
    పాడియని వేడి వేడిప
    "కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గాడుపు తండ్రి'....?

      తొలగించండి
    2. గాడుపు తండ్రి = గగనము అంధ్ర భారతి

      తొలగించండి
  4. ఆడుచు కేరం బోర్డును
    పాడుచు మాయాబజారు పాటలు వడిగా
    వేడిది కమ్మని యుల్లిప
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      కేరంబోర్డు, మాయాబజారు పాటలు, వేడి ఉల్లిపకోడి... అబ్బో... అద్భుతమైన కాంబినేషను! చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
  5. మైలవరపు వారి పూరణ


    కోడి యనంగనీశ్వరుని కుక్కుట రూపము , వాడి కత్తులన్
    బాడియె కోసి వండుటన పాపము,! దీనిని నేను బెంచెదన్ ,
    వేడి పదార్థముల్ గలవు వేలకు వేలని , రక్షఁ జేయుచున్
    కోడిని ., బ్రాహ్మణుం డొకఁడు గోరి భుజించె జనుల్ నుతింపఁగన్" !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ విరుపుతో అద్భుతంగా ఉన్నది. వారికి అభినందనలు.
      వారి పూరణలను ఇక్కడ ప్రకటిస్తున్న ప్రభాకర శాస్త్రి గారికి ధన్యవాదాలు!

      తొలగించండి
  6. మూర్ఖులు పలికిన మాటలకు బ్రాహ్మణుని స్పందన


    పాడియని బల్కె నెవ్వడు ,
    వాడికి పిండమును బెట్ట ,వాడికి కూర్తున్
    పాడెను, తెలుపుము ఎక్కడ
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'తెలుపుము + ఎక్కడ = తెలుపు మెక్కడ' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు. "తెలుపుం డెక్కడ" అనండి.

      తొలగించండి
  7. మొదటి పద్యములో గాడుపు తండ్రి = గగనము ఆంధ్ర భారతి ఉవాచ

    రిప్లయితొలగించండి
  8. మాడిన వంటలు తినితిని
    వేడుక బుట్టిన శాస్త్రి వెడలెను వసతిన్
    వేడిగ చేసిన యుల్లిప
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "వేడుక పుట్టంగ శాస్త్రి..." అనండి.

      తొలగించండి
  9. మాడిన వంటలు తినితిని
    వేడుక పుట్టంగ శాస్త్రి వెడలెను వసతిన్
    వేడిగ చేసిన యుల్లిప
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్

    రిప్లయితొలగించండి
  10. చూడగ చోద్యమెటులను చె
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్!
    వేడిది మంచి రుచిగల ప
    కోడి మఱొక బాపనయ్య కోరి భుజించెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతి భూషణ్ గారూ,
      చెకోడి, పకోడీలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2629
    సమస్య :: *కోడిని బ్రాహ్మణుం డొకడు గోరి భుజించె జనుల్ నుతింపగన్.*
    కోడిని ఒక బ్రాహ్మణుడు ఇష్టంగా తిన్నాడు.అందరూ అతనిని మెచ్చుకొన్నారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ఒక కోయదొర అడవిలోనుండి కొన్ని మూలికలను తెచ్చి వాటిలో *గావుకోడి* అనే మూలికావిశేషాన్ని గుఱించి విశేషంగా తెలియజేస్తూ ఉండగా ఆ గావుకోడిని ఒక బ్రాహ్మణుడు భుజించాడు అని చెప్పే సందర్భం.

    వేడి యడంగు, శూల లవి వీడును, సత్యము సర్వ రోగముల్
    బూడిదయౌ, నపూర్వమగు మూలిక యిద్దియె నమ్మకమ్ముతో
    వాడుడు గావుకోడి నని పల్కుచు కోయ యొసంగుచుండ నా
    *కోడిని బ్రాహ్మణుం డొకడు గోరి భుజించె జనుల్ నుతింపగన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (21-3-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోట రాజశేఖర్ గారూ,
      గావుకోడి మూలికతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  12. నా డొక మిత్రుడు రాగా
    చే డి య రుచి కర పు వంట చెన్ను గ వండన్
    పాడి గ సఖుని న్ గూడి ప
    కోడి నొక బాపన య్య కోరి భుజించె న్

    రిప్లయితొలగించండి
  13. వాడని పువ్వులతోడను
    పోడిమి నగవుల మొగమున పొందుగ గూర్చన్
    వేడిగ చేడియ చేతి ప
    కోడినొక బాపనయ్య కోరి భుజించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా!నమస్సులు!

      పాఠాంతరము:

      గాఢపు టనురాగంబున
      వీడని చిరునగవుతోడ విందుగ గూర్చన్
      వేడిగ చేడియ చేతి ప
      కోడినొక బాపనయ్య కోరిభుజించెన్!

      తొలగించండి
    3. సీతాదేవి గారూ,
      బాగున్నది మీ పూరణ పాఠాంతరం. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యవాదములు గురువర్యా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
  14. నాడేమో గుడ్డ నతిరి,
    నేడేమో కోడి యనెను, నీచపు బలుకుల్
    వాడుట యేలా,యెచ్చట
    కోడి నొక బాపనయ్య కోరి భుజించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "గుడ్డ నతిరి"...? టైపాటా?

      తొలగించండి
  15. కోడలు పుట్టిన రోజని
    వేడుకలే జరుప జనుల విందుకు బిలువన్
    వేడిగ నటగల యుల్లిప
    కోడిని నొకబాపనయ్య కోరిభుజించెన్

    రిప్లయితొలగించండి

  16. వేడగ దన బ్రియ సతినే
    వాడుకగా జేసె వివిధ వంటకములనే
    వేడిగ కఱజఱ లాడు ప
    "కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్"

    రిప్లయితొలగించండి
  17. వాడిన బతుకులు మావే,
    దాడుల నీరీతి జేయ ధర్మము గాదే
    వేడెదను దెల్పు మెచ్చట
    కోడి నొక బాపనయ్య కోరి భుజించెన్

    ఒక బ్రాహ్మణుని ఆవేదన

    రిప్లయితొలగించండి
  18. దాడికి *నాగమ*బంపెను--
    పాడెను గాయత్రి,వేద,పైతృక పనసల్--
    మాడిన వంటక మేమయె?
    కోడిని-నొక బాపనయ్య--కోరి భుజించెన్.

    *నాగమ*= పలనాటి నాగమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అయినా మాడిన వంటకాన్ని కోరి భుజించడం?

      తొలగించండి
    2. డబ్బు పట్టి కొన్న వస్తువును పారవేయటం ఇష్టంలేక అన్నం పరబ్రహ్మ స్వరూపమని

      తొలగించండి
  19. మాడెను గారెల్ జూడగ,
    వీడెన్ బూరెలు విరివిగ ,వేదన గలుగన్
    కూడుకు బదులుగ యుల్లిప
    కోడిని నొక బాపనయ్యకోరి భుజించెన్

    రిప్లయితొలగించండి
  20. వేడుకలో సంబరముగ
    యాడంబరమందు శర్కరాకృతులిడగా
    నాడుచు పాడుచు నందొక
    "కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సంబరముగ। నాడంబర..." ఆనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారూ..
      మూడోపాదంలో 'ఆడుచు పాడుచు నందున' అంటే బావున్నట్టనిపించింది. ఒకే వాక్యంలో రెండుసార్లు "ఒక" వచ్చిందనీ...☺️

      🙏🏻

      తొలగించండి
  21. మాడునకేదోలోపము
    వాడుకలోమిగులరాగవైద్యులు సెప్పన్
    జేడియతావండీ యగ
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అయితే చికెన్ తింటే పోయే రోగాలున్నాయన్న మాట!

      తొలగించండి
  22. పాడియె దీ నిమీకు నిట బంధన జేయుట పాపమౌనుగా
    వీడుడు ధర్మమంచు నొక వీరుడు దానిని బట్టెగట్టిగన్
    దాడిని జేయ వారలును దాలిమి నాతడు బెంచుచున్
    కోడిని బ్రహ్మణుండొకడు కోరి భుజించె జనుల్ నుతింప గన్
    స్వయంవరపు అప్పారావు
    విశాఖపట్నం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అప్పారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "..నాతడు దెచ్చి పెంచుచున్" అనండి.

      తొలగించండి
  23. వేడుక మీర బంధువుల పెళ్ళికి వెళ్ళిన విప్రులయ్యెడన్
    కూడు భుజించు వేళ సమకూరిన షడ్రసయోగ్యశాకముల్
    గూడిన వంటలందుఁ దన కోరికలూర 'ప'కారపూర్వమౌ
    కోడిని బ్రాహ్మణుండొకడు కోరి భుజించె జనుల్ నుతించగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ 'పకార పూర్వ కోడి' పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. జాడలు దప్పుచు బతికిరి
    మూఢులగుచు మసలుచుండె మూర్ఖత్వమునన్!
    ఈ డంబమె ఖర్మ గదర
    "కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్!!"

    రిప్లయితొలగించండి
  25. వేడుక యొప్పగన్ జరిగె విందువినోదము లుప్పతిల్లగన్
    నేడు వివాహమే మదిని నిండుగ హర్షము పొంగిపొర్లగన్
    పాడిగ శర్కరన్ వివిధ పక్షుల రూపము సంతరించగా
    పోడిమి వంటకమ్ములను పొంకము మీరగ జేయ వాటిలో
    "కోడిని బ్రాహ్మణుం డొకఁడు గోరి భుజించె జనుల్ నుతింపఁగన్"

    రిప్లయితొలగించండి
  26. వేడుకగా సభన్ జరుప విప్రులు భూరిగ నొక్క పాతదౌ
    మేడకు జేరిరంట, తరిమెన్నట పిల్లల తోడతిర్గెడిన్
    కోడిని బ్రాహ్మణుండొకఁడు, గోరి భుజించె జనుల్ నుతింపగన్
    వేడిగ నున్నపాయసము వేపుడు కూరల తోడ నన్నమున్

    రిప్లయితొలగించండి
  27. ఓడిన వారు తినాలే
    వేడి సెగల చికెను బుచికి! వేడ్కగ పందెం
    బాడబులు గట్ట నోడుచు
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తినాలే' అనడం వ్యావహారికం. "ఓడినవారలు తినవలె..." అనండి.

      తొలగించండి
  28. చూడగనే నోరూరెడు
    వేడిపదార్థములగాంచి విజ్ఞత మరిచెన్
    తా డబ్బులు చెల్లించి ప
    కోడిని నొకబాపనయ్య కోరిభుజించెన్

    రిప్లయితొలగించండి
  29. కం:-
    వేడుకలరంగ భామిని
    వాడుకకొలదిన్పచించె వంటకమొకటిన్
    కానగ గుమగుమలాడు ప
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్ !!!

    @ మీ పాండురంగడు*
    ౨౧/౦౩/౨౦౧౮

    రిప్లయితొలగించండి
  30. మడిలోపూజకొరకు చని
    కడునాకలి కలుగ నచట, కమ్మని రుచితో
    మడిగట్టుకు వండగను ప
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్

    రిప్లయితొలగించండి
  31. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    ఒక బ్రాహ్మణునకు భయంకరమగు క్షయ సోకింది . డాక్టరు Confirm

    చేశాడు . అతని మిత్రుని సలహా మేరకు ప్రాణాలు కాపాడుకొనుటకు

    మందులతో పాటు మాంసం గ్రుడ్లు తిన్నాడు . ఈ సందర్భంలో ఆ

    బ్రాహ్మణుడు చక్కగా కోడిమాంసం భుజించాడు .



    వాడె ముఖమ్మునం గళ | కపాల మయెం దల | కాళ్ళు జేతులున్

    మాడుచు నీసవోయెను | కనం బడె డొక్కల మక్కె లన్నియున్ |

    పాడెకు సిధ్ధ మైతివి | బవళ్ళును రేలును కాస మెంతయున్

    వీడక యుండె నిన్ | క్షయథువే యిది యంచు వచించె వైద్యుడే |

    వాడు మి కౌషధమ్ములను , పధ్ధతిగా | బిశితంబు - నండముల్ ,

    పోడిమి నెల్లయున్ దిరిగి పొంద , మెసంగుము గొంకు లేక | యీ

    పాడు కులప్రచారములు ప్రాణము నిల్పునె ? నీదు సంతతిన్

    జేడియ నయ్యొ ! దుఃఖిలిగ జేతువె ? యంచు హితుండు చెప్పగా

    కోడిని బ్రాహ్మణుం డొకడు గోరి భుజించె జనుల్ నుతింపగా


    { మాడు = ఎండిపోవు ; కాసము = దగ్గు ; క్ష య థు వు = క్ష య ;

    పిశితము = మాంసము ; ప్రచారము = ఆచారము , వ్యవహారము ;

    రిప్లయితొలగించండి
  32. కం:-
    వేడుకలలరగ భామిని
    వాడుకకొలదిన్పచించె వంటకమొకటిన్
    కానగ గుమగుమలాడు ప
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్ !!!

    @ మీ పాండురంగడు*
    ౨౧/౦౩/౨౦౧౮

    రిప్లయితొలగించండి
  33. ఉత్పలమాల
    వేడుక జేయ మిత్రులొక వేదికి రమ్మని బిల్చినంతటన్
    తోడుగ బోవుచున్ మిగుల తుష్టిని విందున గారవమ్ములన్
    వీడక సున్నితమ్ముగను విజ్ఞత జూపుచుఁ ద్రోసి కోడిఁ జేఁ
    గోడిని బ్రాహ్మణుం డొకఁడు గోరి భుజించె జనుల్ నుతింపఁగన్

    రిప్లయితొలగించండి
  34. కందం
    వేడుకలన నరుదెంచఁగ
    వీడక నాతిథ్య మిడఁగ విజ్ఞత తోడన్
    గూడదనుచు బిరియాని ప
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్

    రిప్లయితొలగించండి
  35. కోడిని బ్రాహ్మణుం డొకఁడు గోరి భుజించె జనుల్ నుతింపఁగన్"
    వేడుక యాయెగా నదియవేవురి నోటను ,పాడియే వినన్
    కోడియ మాంసహా రముగ,కూడుగ జేయుట ధర్మమా ? కనన్
    కోడిని బ్రాహ్మణే తరులు గోరుచు తిందురు సత్యమే గదా!

    రిప్లయితొలగించండి
  36. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  37. మాడిన పేగులన్ బసిని మంటల ద్రోయగ సాంప్రదాయమున్
    స్వీడను దేశమందున నొక శీతలకాలపు సంజవేళ దా
    నోడగ శాకపాక మది నోచక దీనత నొంటరౌటచే
    కోడిని బ్రాహ్మణుండొకడు కోరి భుజించె
    జనుల్ మెచ్చగన్!

    అచటి జనుల్ మెచ్చగన్!
    విశ్వామిత్రుడంతటి వాడు కుక్కమాంసం భుజించాడు, ఆకలి తాళలేక!🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "దేశమందు నొక..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములాచార్యా! పొరపాటున ‘న’ యెక్కువగా పడింది! 🙏🙏🙏

      తొలగించండి
    3. చివరి పాదములో జనుల్ నుతింపగన్ గా చదువ ప్రార్ధన!

      తొలగించండి
  38. పోడిగ వండి ప్రేమమున భోజ్యములన్నియుఁ బెట్టవిందునన్
    వేడగ ముఖ్య స్నేహితుడు వేడుకతో జని మిత్రునింట చే
    కోడిని బ్రాహ్మణుం డొకఁడు గోరి భుజించె, జనుల్ నుతింపఁగన్
    చేడియ లందరున్ కలసి చేసిరి నృత్యము సంతసమ్ముతో

    రిప్లయితొలగించండి
  39. కూడలిలో నడ యాడెడు
    తాడపు నీహారికల సతమతల పోరున్,
    వేడిని తాళన గుంపన
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      క్షమించండి. పూరణ భావం అర్థం కాలేదు. వివరించండి.

      తొలగించండి
    2. వేడుక దాగుడు మూతల
      నాడుచు లేమరొ జిలేబి నటనలవేలా?
      వీడగ బ్లాగును మీరలు
      కాడయినట్లుండె గుండె గాఢపుచెలిమిన్!

      చాలమందికి.....😊😊😊

      తొలగించండి
  40. నాడీవ్యవస్థ కది నతి
    వేడిమి తగ్గించ గలుగు|విలువగు మందే
    చూడుము తినమన?శ్రీలం
    కోడినినొక బాపనయ్య కోరిభుజించెన్.

    రిప్లయితొలగించండి
  41. పాడియు పంటలున్ గలుగు పల్లొక నేతను నెన్నుచుండగా
    గాడిద కమ్యునిస్టుదిగ, కాంగ్రెసు చిహ్నము మేకయై తథా
    కోడియె భాజపాదియుగ కొండొక గుర్తును కానగా నహా
    కోడిని బ్రాహ్మణుం డొకఁడు గోరి; భుజించె జనుల్ నుతింపఁగన్

    భాజపా = భారతీయ జనతా పార్టీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పల్లె/పల్లి + ఒక... అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. "... గలుగు నూరొక" అనండి.

      తొలగించండి
  42. మూడు దినాల ముచ్చట ప్రమోదనందున నుండ?పందిటన్
    నాడుచు “చిన్ని” బావననె-అక్కయు బెట్టె పకోడి కొడియే
    చూడుమటన్ననవ్వుచును.”చోద్యమునందున రాత్రినిద్రలో
    కోడిని బ్రాహ్మణుండొకడు గోరి భుజించె జనుల్ నుతింపగన్| { బ్రాహ్మడియూహకలలో}

    రిప్లయితొలగించండి
  43. శ్రీకంది శంకరయ్యగురువర్యులకు
    శ్రీలంకోడిని=శ్రీలంకలోనివాసమున్నవాడుఅన్నభావాన వ్రాసినది

    రిప్లయితొలగించండి
  44. ఉల్లిపాయలు తినగూడ దుర్వి యందు
    విప్రులనుచును చెప్పుచున్ వింతగాను
    నీరజాక్షి చేయపకోడి నినొక బాప
    నయ్య కోరిభుజించెన్ నియమము వీడి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      కందపాదాన్ని తేటగీతిలో ఇమిడ్చి చెప్పిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. విరించి గారూ,
      కందపాదాన్ని తేటగీతిలో ఇమిడ్చి చెప్పిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  45. గోడలు దాఁటుచుఁ బాఱుచుఁ
    గోడి యొకటి మాయమైన ఘోరముగ నటన్
    వాఁ డలరి పట్టెఁ, జూపఁగఁ
    గోడిని నొక బాపనయ్య, కోరి భుజించెన్


    పాడిగ వేద మంత్రములఁ బన్నుగ నేర్చిన వారి నందునన్
    వేఁడఁగ భోజనమ్మునకుఁ బేర్మిని సత్కుల జాత భోక్తయే
    లేఁ డన రాదు, తన్ను నట లేపఁగ ముంచి పొగడ్త లందునం
    గోడిని, బ్రాహ్మణుం డొకఁడు గోరి భుజించె జనుల్ నుతింపఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  46. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువుగారికి నమస్కారములు. నిన్నటి పూరణను దయతో మరొక్కమారు పరిశీలించగలరు.

    కోవెలకు రాననెడి పతి
    భావమ్ము నెడపిన యువిద భార్గవి గుడిలో
    యావరుని నిల్పి ననె నా
    దేవుడు చనుదెంచె నిటకు దీవెనలిమ్మా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "గుడిలో। నావరుని నిల్పి యనె.." అనండి.

      తొలగించండి


  47. వేడిగ చేసితి తిను చే
    గోడీలన వలదటంచు కోరగ తమితో
    చేడియ ముదమున చేయ ప
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్.

    మూఢత్వమేల మడిగా
    వేడిగ చేసితి తినమన భేషజమేలా
    వీడుము ఛాందసమనగ ప
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్.

    వేడుకగా చక్కెరతో
    చేడియలెల్లరు నుచేరి చెక్కెర బొమ్మల్
    వాడుకగాచేయగ నొక
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్.

    వేడిగ వండెను ముదిత ప
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్
    కాడున దెచ్చిన కోడిని
    వేడగపతి వండె వనిత వేడుకతోడన్.

    వాడుకగాను పర్వముల బాగుగ చేయగ కజ్జికాయలన్
    తోడుగ బాదుషాలనట తుష్టిగ వడ్డన చేసి చక్కగా
    వీడకనన్నియాకునను వేయగ వద్దనకుండగా నుచే
    కోడిని బ్రాహ్మణుం డొకఁడు గోరి భుజించె జనుల్ నుతింపఁగన్.

    రిప్లయితొలగించండి
  48. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పోడిమి తోడన్నాతడు
    కూడున కలగల్పుగ సమకూర్చిన నంజున్
    వేడిగ రుచితో నున్న ప
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తోడన్నాతడు' .. ఈ ద్విత్వనకార ప్రయోగాన్ని కొందరు పెద్దలు నిరసిస్తున్నారు. పోతన విస్తారంగా తన కావ్యాలలో ప్రయోగించాడంటే అవన్నీ ప్రక్షిప్తాలంటున్నారు. కనుక మనం సాధ్యమైనంత వరకు దానిని ప్రయోగించకుండా చూద్దాం. అక్కడ "పోడిమితో నాతడు తన। కూడున..." అనవచ్చు కదా!

      తొలగించండి
  49. కోడిని వేగమే తినిన కోటి వరాహము లిత్తుమంచు పూ
    బోడియె చెప్ప,పందెమున, పొందుటకై ,యొక పేద బ్రహ్మణుం
    డాడుచు పందెమే గెలిచె;డబ్బును పొందగ తప్పలేదకో
    *కోడిని బ్రాహ్మణుం డొకఁడు గోరి భుజించె జనుల్ నుతింపఁగన్*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తప్పలేదు పో" అనండి.

      తొలగించండి
  50. డా.ఎన్.వి.ఎన్.చారి 9966610429
    వాడుకగా దినంబచట పాడుచు నాట్య ము జేయుచున్ శుచిన్
    జీడి ఫలంబులన్నొసగి చిత్రప్రసాదమొ సంగుచున్ భక్తిన్
    గాడిని పెట్టుచున్ ప్రజల గాచుచు నుండగ కుక్కుటేశ్వరున్,
    కోడిని బ్రాహ్మణుండొకడు గోరి, భుజిం చె జనుల్ మెచ్చగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఎన్వీయెన్ చారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర గణదోషం. "ప్రసాద మొసంగి భక్తితో" అనండి.

      తొలగించండి
  51. మిత్రులందఱకు నమస్సులు!

    వేఁడి యెసంగ దేహమున, వేడఁగ వైద్యునిఁ, జెప్పె నిట్టులన్,
    "గాఁడ యొకండె మందు; మఱి, కాంచఁగ నుల్లికిఁ పైనఁ దెల్లనై
    కాఁడకు నంటి యుండుఁ బువు ఘాటగు వాసనఁ గల్గియుండు; నా
    కాఁడనుఁ దిన్నచోఁ దొలఁగు గాత్రపు వేండ్ర" మటంచు వెంటనే,
    తోడుగఁ బోయి, కాడలనుఁ ద్రుంచియు వేగమె, "యుల్లికోడి" నీన్,
    "కోడి"ని, బ్రాహ్మణుం డొకఁడు కోరి భుజించె, జనుల్ నుతింపఁగన్!

    [ఉల్లికోడి = ఉల్లిమొక్క నుండి బయలుదేఱి చివర తెల్లని పూవు పూయు పొడుగైన కాడ]

    రిప్లయితొలగించండి
  52. డా.పిట్టాసత్యనారాయణ
    పేడికి నంగస్తంభన
    పోడిమి నిలబెట్ట మాంస భోక్తగ జేయన్
    వాడెను హల్వా రూపున
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  53. నాడెమగు జీడిపప్పుకు
    పోడిమితోశెనగపిండి పొత్తుగ జేరన్
    కోడలు జేసిన వేడి ప
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్!!!

    రిప్లయితొలగించండి
  54. *21-3-18*....సమస్య
    కోడిని బ్రాహ్మణుం డొకఁడు
    గోరి భుజించె జనుల్ నుతింపఁగన్

    *కుక్కుట ధ్వజుడు*

    సందర్భము: శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ప్రతిరోజూ వెళ్ళి దర్శనం చేసుకొనే బ్రాహ్మణు డొకడు ఎంతో భక్తితో భార్యతో యిలా అంటున్నాడు.
    "నే నీ రోజు స్వామినాథుని (సుబ్రహ్మణ్య స్వామిని) దర్శించుకున్నాను. వేడి వేడి ప్రసాదం లభించింది. చూడవే! తినవే!"
    మళ్ళీ యి ట్లన్నాడు..
    "నేడు కుక్కుట ధ్వజుని
    (సుబ్రహ్మణ్య స్వామిని) ఆ స్వామి ధ్వజం మీద వెలిగే కోడిని చూడ నోచినాను."
    తర్వాత ఆ బ్రాహ్మణుడు హాయిగా ప్రసాదాన్ని భుజించినాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "నే డిదె స్వామి నాథ విభు
    నే కనుగొంటి, లభించెఁ జూడవే!

    వేడి ప్రసాద మిద్ది, తిన
    వే!" యని, యి ట్లనె "నేడు నోచితిన్

    చూడగ కుక్కుట ధ్వజుని,
    సొంపయినట్టి ధ్వజాన వెల్గు నా

    కోడిని".. బ్రాహ్మణుం డొకఁడు
    గోరి భుజించె జనుల్ నుతింపఁగన్

    2 వ పూరణము:--

    *కుక్కుటేశ్వరుడు*

    సందర్భము: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో భక్తితో రెక్కలమీదనే ప్రదక్షిణం చేసిన కోళ్ళ గుంపులకు ముక్తిని ప్రసాదించి నాడు కాబట్టి కుక్కుటేశ్వరు డనే పేరిట పరమేశ్వరు డారాధింప బడుతున్నా డన్నది జగద్విదితమే!
    (అగస్త్యమహర్షి వ్యాసునికి భీమఖండ క్షేత్ర మాహాత్య్మమును వివరిస్తూ ఈ క్షేత్రం గురించి చెప్పారు. ఆలయ ప్రాంగణంలో ప్రసిద్ధమైన పాదగయా తీర్థ మున్నది. కుముద హిత కోటి సంకాశ!కుక్కుటేశ!.. అనే మకుటంతో ఒక శతకమూ వున్నది.)
    ఇక్కడ లింగరూపంలోను కోడి కనిపించడం విశేషమే!
    ఒక బ్రాహ్మణుడు నిష్ఠతో *కుక్కటేశ్వరుడు* అనే కోడిని జనులు పొగడేటట్టుగా భజించినాడు. ఐతే..
    *"భజించె"* అని వ్రాయడానికి బదులు మా పిల్లవా డేమో *"భుజించె"* అని వ్రాసినాడు.
    "కోడిని బ్రాహ్మణుం డొకఁడు గోరి భుజించె జనుల్ నుతింపఁగన్"
    అనే విధంగా ఇది తయారయింది.. కాబట్టి ఇదొక అచ్చు తప్పుగా నిర్ణయించి తీర్మానించడమైనది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    నేడు పిఠాపురంబునను
    నిష్ఠమెయి న్గన *"కుక్కుటేశు* డన్

    కోడిని బ్రాహ్మణుం డొకడు
    కోరి భజించె జనుల్ నుతింపగన్..

    వేడుకగా *"భజించె"* నన
    వీడు లిఖించె *"భుజించె"* నం చిటుల్..

    "కోడిని బ్రాహ్మణుం డొకఁడు
    గోరి భుజించె జనుల్ నుతింపఁగన్"

    ~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  55. డా.పిట్టాసత్యనారాయణ
    వాడన స్పర్ధ బెట్టిరి యవారిత రీతిని గెల్వ బిల్చుచున్
    "పాడిని బ్రోచి కుక్కుటము భాసుర లీలను దిన్న పారుకే
    జూడగ లక్ష రూకలను జోడుగ నిత్తుమ"టన్న, పానకం
    బాడిన శర్కరన్ మలచి భక్షిశ(బత్తిస)1 రూపున నున్నయట్టి యా
    కోడిని బ్రాహ్మణుండొకడు కోరి భుజించె జనుల్ నుతింపగన్!
    (1.తిరునాళ్ళలో వరి పేలాల(ఏకుడుపేలాల)తో పంచే శర్కర బొమ్మ.)

    రిప్లయితొలగించండి
  56. డా.పిట్టాసత్యనారాయణ
    వాడన స్పర్ధ బెట్టిరి యవారిత రీతిని గెల్వ బిల్చుచున్
    "పాడిని బ్రోచి కుక్కుటము భాసుర లీలను దిన్న పారుకే
    జూడగ లక్ష రూకలను జోడుగ నిత్తుమ"టన్న, పానకం
    బాడిన శర్కరన్ మలచి భక్షిశ(బత్తిస)1 రూపున నున్నయట్టి యా
    కోడిని బ్రాహ్మణుండొకడు కోరి భుజించె జనుల్ నుతింపగన్!
    (1.తిరునాళ్ళలో వరి పేలాల(ఏకుడుపేలాల)తో పంచే శర్కర బొమ్మ.)

    రిప్లయితొలగించండి

  57. ......సమస్య
    కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్

    సందర్భము:
    *సరదా పూరణంగా తీసుకోవచ్చు*
    వ్యావహారికం గ్రాంథికం అనేవి మరచి పోయి పూర్తిగా మనం మాట్లాడుకునే మాటల్లో రాస్తే పద్యం ఎలా తయారౌతుం దన్న దానికి యిది ఉదాహరణగా పనికిరావచ్చు.
    వా డెట్లాగూ ఓ.డీ. యిస్తడు. ప్ర.తె.మ.. అంటే.. ప్రపంచ తెలుగు మహాసభలు. వాటికి వెళ్ళడానికి *ఓ.డీ. ని కోరి* భుజించినాడు గబగబా.. బయలుదేరే తొందరలో...
    (భాషాపరమైన అభ్యంతరా లుంటే వుండవచ్చుగాని ఏ అశ్లీలార్థకమూ యిందులో లేకపోవడం గమనార్హం)
    ~~~~~~~~~~~~~~~
    వా డెట్లా ఓ డిస్తడు..

    ఈ డా డెందుకు తినేది యీణ్ణే తిందం

    వేడిగ.. అంటూ ప్ర.తె.మ.ల

    కోడిని నొక బాపనయ్య కోరి, భుజించెన్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  58. కోడలు శేషురెడ్డిదహ! కోరిక తీరగ క్రుక్కి మెక్కెగా
    కోడిని;...బ్రాహ్మణుం డొకఁడు గోరి భుజించె జనుల్ నుతింపఁగన్
    వేడి పకోడి నాదటను వీడుచు కమ్మని యుల్లిపాయలన్
    తాడును పేడులేని తన తాతల రీతులు మీరజాలకే

    రిప్లయితొలగించండి