15, మార్చి 2018, గురువారం

సమస్య - 2626 (రంభను బెండ్లియాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రంభను బెండ్లాడెను రఘురాముఁడు ప్రీతిన్"
(లేదా...)
"రంభను బెండ్లియాడె రఘురాముఁడు తానటు సీత మెచ్చఁగన్"
(డా॥ జి.యం. రామశర్మ గారి 'శతావధాన వైజయంతి' గ్రంథం నుండి)

88 కామెంట్‌లు:

  1. అంభోరుహ నేత్రుండట
    శంభుని చాపమ్ము విరిచి జనకుని సుతయౌ
    బింబాధర భూలోకపు
    రంభను పెండ్లాడెను రఘు రాముడు ప్రీతిన్.

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ

      జృంభితధైర్యబాహుబలి చిత్తజకోటిమనోహరుండు , ని...
      ర్దంభగుణప్రపూర్ణుడు శరాసనమెక్కిడి ద్రుంచి , వీరుడై
      బంభరవేణి భర్తృపదపద్మ నిరంతర సేవనైక సం...
      రంభను బెండ్లియాడె రఘురాముఁడు తానటు సీత మెచ్చఁగన్" !!

      బంభరవేణిన్.... భర్తృపదపద్మ నిరంతర సేవనైక సంరంభను సీతన్.... అని అన్వయం...

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారికి నమస్సులు.
      🙏🏻
      ఇక్కడ 'సంరంభ'కు అర్థమేమిటండీ...

      తొలగించండి
    3. పతిసేవకై 'తొందరపడుచున్న' అనియేనా

      తొలగించండి
    4. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    5. శ్రీ విట్టు బాబు గారికి నమోవాకములు.. మీది.. నాది.. ఒకే కవి హృదయం.... నమోనమః.. శ్రీ శాస్త్రి గారికి ధన్యవాదాలు కూడా....

      తొలగించండి
    6. ఈ పద్యం పాఠాంతరంతో మరింత సొగసు గా ఉంటుందని చిరు సవరణ...
      మన్నించండి 🙏

      జృంభితధైర్యబాహుబలి చిత్తజకోటిమనోహరుండు , ని...
      ర్దంభగుణప్రపూర్ణుడు శరాసనమెక్కిడి, విష్ణురూపుడై
      బంభరవేణి భర్తృపదపద్మ నిరంతర సేవనైక సం...
      రంభను బెండ్లియాడె రఘురాముఁడు తానటు సీత మెచ్చఁగన్" !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    7. మైలవరపుగారి పూరణ అద్భుతముగ నున్నది! ఆర్యా! స్త్రీల దృష్టితో మూడవపాదాన్ని యిటులనిన నెట్లుండును?

      బంభరవేణి భర్తృముఖపద్మ నిరంతర వీక్షణైక సం రంభను
      😊😊😊🙏🙏🙏

      తొలగించండి
    8. భర్తృపద పద్మ సేవ (పదము) మీకు నచ్చినట్లు లేదు. ఈ డా. సీత దేవి గారికి నచ్చక పోయిన నా జానకీ సతి కదే యిష్టము.

      తొలగించండి
    9. శ్రీమతి సీతాదేవి గారికి నమస్సులు... మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను... అయితే లక్ష్మీస్వరూప సీత అని స్ఫురించుటకొరకు అలా అనాల్సి వచ్చిందని మనవి..( పైగా మీరు సీతాదేవి... మీరేది నచ్చితే అలాగే... అభ్యంతరమేముంది...
      నమోనమః 🙏👇

      జృంభితధైర్యబాహుబలి చిత్తజకోటిమనోహరుండు , ని...
      ర్దంభగుణప్రపూర్ణుడు శరాసనమెక్కిడి, విష్ణురూపుడై
      బంభరవేణి భర్తృముఖపద్మ నిరంతర వీక్షణైక సం ..
      రంభను బెండ్లియాడె రఘురాముఁడు తానటు సీత మెచ్చఁగన్" !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    10. ఆర్యా! నిరంతర ముఖపద్మ చింతన, వీక్షణ కూడ తక్కువైన ఉపాసనలు కాబోవు!
      “అనంగజనకాపాంగ వీక్షణాయై నమోనమః”
      “నిజభర్తృ ముఖాంబోజ చింతనాయైనమోనమః” లలితాస్టోత్తర శతనామావళి!
      కొత్త పెళ్ళికూతురుకు భర్తృసేవ చేయాలనే ఆకాంక్ష కన్న ముఖ వీక్షణ కుతూహల మెక్కువుండునవి నా భావన!
      మీ జానకమ్మకైనా జనని జానకీమాతకైనా మానవ జన్మ యెత్తినందున సహజమని భావించెదను!🙏🙏🙏🙏

      తొలగించండి
    11. ధన్యవాదములు మురళీకృష్ణగారూ! అవధానిగనుక పృచ్ఛక హృదయం అర్ధం చేసుకున్నారు! నా పేరు సీతాదేవి అయినంత మాత్రమున నేనేమీ ఆ సీతీమాత సరి అనుకోవడం లేదు!
      సరదాగా వ్రాశానంతే! 🙏🙏🙏

      తొలగించండి
    12. సీతాదేవి గారు సవరణలను సూచించే స్థాయికి ఎదిగారు. నిజంగా ఎంతో సంతోషంగా ఉంది.

      తొలగించండి
    13. ధన్యోస్మి గురుదేవా! అంతా మీ ఆశీర్వాదబలమే!!🙏🙏🙏🙏

      తొలగించండి
    14. కంది శంకరయ్య గారు ఉవాచ:

      మురళీకృష్ణ గారూ, ఈ సవరణ మీ సౌజన్యాన్ని, వినయాన్ని తేటతెల్లం జేస్తున్నాయి. స్వస్తి!

      తొలగించండి
    15. వినియుంటి శంకరులవా..
      రనిరని యిది సమ్మతమ్మె ? "రంభనుపెండ్లా...
      డెనురఘురాముడుప్రీతిన్
      గనుమని "వినినంత మదికి కష్టము గల్గెన్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    16. కంది శంకరయ్య గారు ఉవాచ:

      మురళీకృష్ణ గారూ,
      సమస్యాపాదాన్ని స్థానాంతరంలో ప్రయోగించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  3. అంబర కేశుని సోదరి
    అంబరమును వదలి భూమి యవతారమును
    న్నింబుగ నిట దాల్చిన భూ
    రంభను పెండ్లాడెను రఘురాముడు ప్రీతిన్.
    అంబరకేశుడు = శివుడు
    ఇంబుగ = ఆనందముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వామన కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భూమి నవతారమునే। యింబుగ..." అనండి.

      తొలగించండి
  4. శంభా! నలకూబరుడే
    రంభను బెండ్లాడెను; రఘురాముఁడు ప్రీతిన్
    శంభుని విల్లును ద్రుంచగ
    కుంభిని వోలుచు నడచెడి కుజను రమించెన్

    కుంభిని = ఏనుగు
    కుజ = సీత

    రిప్లయితొలగించండి
  5. సంభవమా యిది యప్సర
    రంభను , పెండ్లాడెను రఘురాముఁడు ప్రీతిన్
    కుంభిని పుత్రిక సీతను
    శంభుని విల్లును ద్రుంచి శాస్త్రీ యముగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పూరణలో పూర్వార్థం భావం అసంపూర్ణంగా ఉన్నది. నాల్గవపాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. సంభవము కాదు నచ్చెర
      రంభను , పెండ్లాడెను రఘురాముఁడు ప్రీతిన్
      కుంభిని పుత్రిక సీతను
      శంభుని ధనువును ద్రుంచి శాస్త్రీయముగన్

      తొలగించండి
  6. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2626
    సమస్య :: *రంభను పెండ్లియాడె రఘురాముడు తా నటు సీత మెచ్చగన్.*
    సీత మెచ్చుకొంటూ ఉండగా శ్రీ రాముడు రంభను పెళ్లి చేసికొన్నాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ధర్మ స్వరూపుడైన శ్రీరాముడు రావణాసురుని సంహరించిన తరువాత సీతాసమేతుడై అయోధ్య చేరుకొన్నాడు.
    దేవతలు మునులు ప్రజలు అందరూ ఇక మనం కోరుకొనే రామరాజ్యం వస్తుందని ఆనందిస్తూ ఉండగా శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగింది. కోసలదేశ రాజ్య లక్ష్మిని శ్రీ రాముడు వరించగా సీతాదేవి కూడా తన భర్తయైన రఘురాముని ఎంతగానో మెచ్చుకొన్నది అని విశదీకరించే సందర్భం.

    శంభుడు, బ్రహ్మయున్, సురలు, సాధులు, పౌరులు సంతసింప, ని
    ర్దంభుడు ధర్మమూర్తి యట దాల్చె కిరీటము, కీర్తిమంతమౌ
    కుంభిని రామరాజ్య మన, కోసల రాజ్య రమాఖ్య సత్క్రియా
    *రంభను బెండ్లియాడె రఘురాముడు తానటు సీత మెచ్చగన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (15-3-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన పూరణ అవధానిగారూ!
      నిర్దంభుడు పదప్రయోగము రామునికి చక్కగా సరిపోయింది! నమోనమః! 🙏🙏🙏🙏

      తొలగించండి
    2. సీతమ్మ వారు మెచ్చగన్ ధన్యుడ నైతిని.

      తొలగించండి
    3. శ్రీ Ps Rao విట్టు బాబు గారికి ప్రణామాలు.

      తొలగించండి
    4. కోట రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  7. బింబాధర జానకి పరి
    రంభిత సుగుణగణరాశి రాకేందుముఖిన్
    బంభరవేణిని మను సం
    రంభను పెండ్లాడెను రఘురాముడు ప్రీతిన్!

    మను సంరంభము = పెండ్లి యనగనేర్పడు తొట్రుబాటు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మను సంరంభను' అన్నపుడు 'మను' అంటే?

      తొలగించండి
    2. నమస్సులు గురువర్యా! పైన వివరణ యిచ్చితిని మనువు యనగ పెండ్లి కనుక పెండ్లియనే తడబాటుతో కూడిన జానకినియని నా భావన!
      సరియైన దేనా?

      తొలగించండి

    3. దంభము హెచ్చగామదిని దానవ వీరుడు లంకపాలుడే
      కుంభిని పుత్రికన్ వనిని కూటపు నీతిని దొంగలించగా
      జృంభిత శౌర్యశాలియగు శ్రీవిభుడాతడు భండనమ్మునన్
      ఢింభుడు రావణున్ దునిమి ఠీవి నపార మమోఘమౌ యశో
      రంభను బెండ్లియాడె రఘురాముడు తానటు సీతమెచ్చగన్

      తొలగించండి
    4. సీతాదేవి గారూ,
      మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      మీ మొదటి పూరణలో 'మనువు' అన్నది తెలుగు పదం. అందులోని 'వు' తొలగించి 'మను సంరంభను' అని సమాసం చేయరాదు.

      తొలగించండి
    5. ధన్యవాదములాచార్యా! సవరించెదను!🙏🙏🙏

      తొలగించండి
    6. శంభుశర భంగమున, పరి
      రంభిత సుగుణగణరాశి రాకేందుముఖిన్
      యంబర మంటిన ఘన వి
      భ్రంభను పెండ్లాడెను రఘురాముడు ప్రీతిన్!

      తొలగించండి
  8. శుంభద్వీరుడు రాముడు
    శంభుని వింటిని నడిమికి శకలమొనర్చెన్ ;
    గుంభిజ ; నవచైత్ర శుభా
    రంభను పెండ్లాడెను రఘురాముడు ప్రీతిన్ .

    రిప్లయితొలగించండి
  9. కుంభి ని రాజ కుమారు లు
    శంభు ని శర ము ను విరువ క చతికిల పడ గా
    సంబర మున విరిచి యు భూ
    రంభ ను పెండ్లాడెను రఘు రాముడు ప్రీతి న్

    రిప్లయితొలగించండి
  10. గాంభీర్యమె రూపెత్తిన
    దంభము లెన్నడు బలుకని దశరథ సుతుడే
    శంభో! యందమున విజిత
    "రంభను బెండ్లాడెను రఘురాముఁడు ప్రీతిన్."
    ***)(***
    (విజిత రంభ = అందమున రంభను గెల్చిన సొగసు కత్తె)

    రిప్లయితొలగించండి
  11. దంభముఁజూపిరి పలువురు
    శుంభద్రాజన్యు లచట! శుభమని హరువిల్
    కుంభించిఁద్రుంచి సీతన్,
    రంభనుఁబెండ్లాడెను రఘురాముడు ప్రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సీతను పెండ్లాడాడు సరే... మరి 'రంభను' అన్నదానికి అన్వయం?

      తొలగించండి
    2. సీతయే రంభ ఆమె అపురూప లావణ్యవతి సౌందర్యవతి కనుక రంభ అని తలంచటం నాభావన

      తొలగించండి
    3. అటువంటప్పుడు "సీతారంభను" (సీత అనే రంభను - రూపకం, లేదా రంభవంటి సీతను - ఉపమానోత్తర పద కర్మధారయం) అనవచ్చు. 'సీతన్ రంభను' అంటే ఇద్దరినీ అనే అర్థం వస్తుంది.

      తొలగించండి
  12. డింభక! నలకూబరుడే
    రంభనుబెండ్లాడెను,రఘురాముఁడు ప్రీతిన్"
    శంభుని ధనువును విరిచియు
    రంభయు,సీతమ్మసతిని రహిచే పట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని 'రంభయు' అన్నదానికి అన్వయం?

      తొలగించండి
  13. శంభుని విల్లును కనుగొని
    జృంభించి మునిపనుపునను ఛేదించి దృతిన్
    శాంభవినిన్ గొలుచు మనో
    రంభను బెండ్లాడెను రఘురాముఁడు ప్రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధృతిన్'... టైపాటు.

      తొలగించండి
  14. కందం
    శంభుని వింటిని ద్రుంచుచు
    నంబుజ నేత్రజనితంపు నంబుకమంటన్
    జృంభిత సౌరభ హృత్సం
    రంభను బెండ్లాడెను రఘురాముఁడు ప్రీతిన్

    రిప్లయితొలగించండి
  15. బంభర వేణియున్మరియుబాదపపుష్పపు సౌకుమార్యమున్
    దంభము లేశమాత్రమయినదానొడగూడకయుండునా

    రంభను బెండ్లియాడె రఘురాముఁడు తానటు సీత మెచ్చఁగన్
    శంభుని జాపమున్విరుగసారెనులాగ ఫెళ్ళనంగగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      రెండవ, నాల్గవ పాదాలలో గణదోషం. అన్వయదోషం కూడా ఉంది. మరో ప్రయత్నం చేయండి.

      తొలగించండి
  16. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    శంభుడు సారసోద్భవుడు సర్వదివౌకస సంచయమ్ము > ని

    ర్దంభ గుణాధికున్ రఘుకులాధిపు సన్నుతి జేయు చుండ సం

    రంభవిహీనుడై హరశరాసన భంగ మొనర్చె || నప్పు డా

    బంభరవేణి - జానకిని - పావన రూపిణి (న్) - నిర్మల స్మరా

    రంభను > బెండ్లియాడె రఘురాముడు తా నటు సీత మెచ్చగన్


    స్మరము = ప్రేమ , ప్రణయము , [ ఆంధ్ర భారతి ]

    స్మరారంభను= ప్రణయ సంకల్పము గల దానిని

    రఘుకులాధిపుడు , శరాసనము = అఖండశబ్దము లైనందున

    { రెండవ - మూడవ పాదములలో అఖండ యతి చేకూర్చడ మైనది }

    రిప్లయితొలగించండి
  17. ఢింభుడొకడు పలికె నిటుల,
    రంభను బెండ్లాడెను రఘురాముఁడు ప్రీతిన్"
    స్తంభమున బుట్టె స్కందుడు.
    శంభుసుతుడు రమను బిల్చె సరసంబాడన్

    రిప్లయితొలగించండి
  18. అంభోజాక్షుఁడు ఘనుఁడు వి
    జృంభిత నయనారవింద సీతాసతి నా
    యంభోజానన రుచి జిత
    రంభను బెండ్లాడెను రఘురాముఁడు ప్రీతిన్


    శంభుని విల్లు ద్రుంచి భుజ సత్వ మహాత్ముఁడు మేటి ధన్వి యా
    రంభ మనంగ దైత్యవర రావణ హత్యకుఁ జిత్త మందునన్
    శాంభవి నిల్పి యున్న సతి జానకి సమ్మద సత్రపా స సం
    రంభను బెండ్లియాడె రఘురాముఁడు తానటు సీత మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  19. జృంభిత కేసరీంద్రుడు యశోభరితుండగు రామచంద్రుడా
    కుంభిని పుత్రికన్ కుసుమ కోమలినిన్ వెస మెచ్చి చాపమున్
    సంభరితమ్ముగా విరిచి సద్గుణ శాలురు బల్కినంతటన్
    రంభను బెండ్లియాడె రఘురాముఁడు తానటు సీత మెచ్చఁగన్

    దోష పరిహరణకు ఒక్కొక్క పర్యాయం ముందుగా
    అరటి చెట్టుతొ వివాహం చేస్తారుట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని మీరు చెప్పిన వృత్తాంతం అవాల్మికం కదా!

      తొలగించండి
  20. శంభుని చాపము యెత్తగ
    ఆంభర వాసులును మెచ్చ?నానందమ్మున్
    బంబర వేణియు సీతా
    రంభను బెండ్లాడెను రఘురాముడు ప్రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చాపము నెత్తగ" అనండి. 'అంభరవాసులు'...? "మెచ్చ నానందమునన్" అనండి.

      తొలగించండి
  21. శంభుని విల్లటు విరువగ
    కుంభిని జనులెల్ల మెచ్చ కోమలి సీతన్
    జృంభిత నుతగుణ వర ప్రా
    రంభను బెండ్లాడెను రఘురాముఁడు ప్రీతిన్

    రిప్లయితొలగించండి
  22. ఉత్పలమాల
    అంబరమంటు గోపురము నాలయమందున రామమూర్తికిన్
    సంబరమంది భద్రగిరి సార్థక మౌనటు తీర్చు గోపడే
    బంభర వేణియౌ కమల వారిజ నేత్రయె నొప్ప యౌవనా
    రంభను బెండ్లియాడె! రఘురాముఁడు తా నటు సీత మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి



  23. శంభుడు పెండ్లాడెను తా

    రంభను, బెండ్లాడెను రఘురాముఁడు ప్రీతిన్

    శంభుని విల్లునువిరిచి

    యంభోరుహనయననచట నందరు జూడన్.



    శంభుడు బ్రహ్మచారిగను శాంతత తోడను చెంత చేరి తా

    రంభను బెండ్లియాడె రఘురాముఁడు తానటు సీత మెచ్చఁగన్

    శంభుని విల్లుద్రుంచితను సర్వులు మెచ్చుచు నుండయవ్వనా

    రంభను పెండ్లియాడెను సురాసుర లెల్లరు జూచుచుండగాన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      కాని రెండింటిలోను 'శంభుడు రంభను పెళ్ళాడటం' అర్థం కాలేదు.
      మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. "శంభుని విల్లును విరిచియు? నంభోరుహ..." అనండి.
      రెండవ పూరణలో 'తను' అన్న ప్రయోగం సాధువు కాదు. "విల్లు ద్రుంచియును" అనండి.

      తొలగించండి
  24. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

    రిప్లయితొలగించండి

  25. ..........సమస్య
    *రంభను బెండ్లాడెను*
    *రఘురాముఁడు ప్రీతిన్*

    *సీతా శక్తి*

    సందర్భము: వెలిగిపోయే శక్తియే సీత. శక్తి అంటే పరాశక్తి; ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి. అంతే గాక ఉత్సాహ శక్తి, ప్రభు శక్తి, మంత్ర శక్తి.
    సీత చెలరేగిన దుష్కార్యాలతో కూడిన రావణాది రాక్షసుల జీవితాలను హరించే ఆరంభం కలిగినది. చక్కని గుణగణాలయొక్క పరీరంభం కలిగినది. పరీరంభం లేదా పరిరంభం అంటే కౌగిలింత.
    అటువంటి సీతాదేవిని రఘు రాముడు పెండ్లాడినాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    శుంభత్ శక్తిని, సీతను

    జృంభిత దుష్కృత్య దనుజ జీవన హర ణా

    రంభను, సుగుణ గణ పరీ

    రంభను బెండ్లాడెను రఘు రాముఁడు ప్రీతిన్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  26. రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ మొదటి పాదం చివర అరసున్న అవసరం లేదు.

    రిప్లయితొలగించండి
  27. పట్టాభిషేకముతో ( విశ్వంభర ) కీర్తి కన్యకను వివాహమాడినాడనే అర్థముతో........

    దంభము లేనివాఁడు సతతమ్మును ధర్మ పరాయణత్త్వ సం
    రంభత యున్నవాఁడు గుణ లక్షణ తత్త్వమెరుంగువాఁడు వి
    శ్వంభర నామధేయుఁడయి శాశ్వత కీర్తి సుకన్యకా సమా
    రంభను బెండ్లియాడె రఘురాముఁడు తానటు సీత మెచ్చఁగన్

    ధర్మము = ధర్మము, విల్లు
    గుణము = సద్గుణము, వింటిత్రాడు

    రిప్లయితొలగించండి
  28. క్రొవ్విడి వెంకట రాజారావు:

    జృంభించుచు సభ నందున
    శంభుని చాపమ్ము విఱిచి సంతోషముతో
    కుంభినీ సుత సీతా
    రంభను బెండ్లాడెను రఘురాముడు ప్రీతిన్

    రిప్లయితొలగించండి

  29. ....సమస్య
    *రంభను బెండ్లాడెను*
    *రఘురాముఁడు ప్రీతిన్*

    *సీతాగ్ని*

    సందర్భము: శంభుని మిత్రుడు.. విష్ణువు. నరునిగా దిగి వచ్చినాడు. అతడే రాముడు. శంభుని భక్తుడు రావణుడు. అసురుడుగా తయారైనాడు.
    వారిద్దరి నడుమ అగ్ని భగ్గు మన్నది. ఆ అగ్నియే సీత. ఆమెనే రఘురాముడు పెండ్లాడినాడు. ఆమె లేకపోతే ఆ యిద్దరి నడుమ వైరమే లేదు కదా!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    శంభుని మిత్రుడు నరు డట!

    శంభుని భక్తు డసురు డట!

    జనకుడు దున్నన్

    సంభవ యట! సీ తాగ్న్యా

    రంభను బెండ్లాడెను రఘు

    రాముఁడు ప్రీతిన్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  30. అంభము పోసి పెంచుచును హాయిగ హృత్తున తోటమాలి తా
    రంభను బెండ్లియాడె;... రఘురాముఁడు తానటు సీత మెచ్చఁగన్
    శంభుని విల్లుద్రుంచుచును సాగె నయోధ్యకు శంకలేకయే...
    దంభము వీడి పల్కెదను దైవము తోడుగ తెల్గుకష్టమే!

    అంభము = నీళ్ళు
    రంభ = అరటి చెట్టు

    రిప్లయితొలగించండి