(శివ పరివార స్తుతి)
శరణు పినాకపాణి సుత! శక్తిధరాగ్రజ! ఎల్క వాహనా!
శరణు కరాళి! కాళి! శివ! శక్తి! శివప్రియ! సింహ వాహనా!
శరణ ముమాపతీ! శివుడ! శక్రుడ! గోపతి! నంది వాహనా!
శరణు విశాఖుడా! గుహుడ! శక్తి సుతా! ఫణిభుక్కు వాహనా!
(శ్రీ వల్లభ వఝుల అప్పల నరసింహమూర్తి గారి చిత్ర మాలిక స్పూర్తితో)
కవి :
పూసపాటి కృష్ణ సూర్య కుమార్
ఎల్కవాహనా?
రిప్లయితొలగించండిఫణిభుక్కువాహనా?
ఈ సమాసాలు చింత్యం.
శ్యామలీయము గారికి నమస్కారములు చిత్ర బంధరచనలో సంపూర్ణ వ్యాకరణ బద్ధముగా వ్రాయటము కొద్దిగా కష్ట తరము అయినను మీ సూచన ఆమోదించవలెను నా శక్తి మీర తదుపరి బంధములో మార్పు చేసి మీ మన్ననలు అందుకొంటానని నా చిరు ఆశ
రిప్లయితొలగించండి