20, మార్చి 2018, మంగళవారం

సమస్య - 2628 (దేవుఁడు చనుదెంచె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా"
(లేదా...)
"దేవుఁడు వచ్చినాఁ డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్"
(డా. జి.ఎమ్. రామశర్మ గారి 'శతావధాన వైజయంతి' గ్రంథం నుండి)

121 కామెంట్‌లు:

  1. కోవెల ముఖమును జూడడు,
    దేవుని యెప్పుడు దలచని దీనుడు, తల్లీ
    సేవక మనమున నాపతి
    "దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "దేవుని నెప్పుడు..." అనండి. "సేవక మనమున" అర్థం కాలేదు.

      తొలగించండి
  2. మైలవరపు వారి పూరణ


    అగ్నిద్యోతనుడు కృష్ణునితో...

    భావమునందు బాహ్యమున బాయని కృష్ణపదానురక్తియే
    శ్రీ వనితాస్వరూపమయి చిత్రము రుక్మిణిగా జనించె దే...
    వా ! వినిపింప ప్రేమ నను బంపెను ! దాసుడు వీడు నీకు , భూ...
    దేవుఁడు వచ్చినాఁ డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. వారికి అభినందనలు.

      తొలగించండి
    2. మురళీకృష్ణగారి భూ దేవ ప్రయోగమతి విశిష్టముగ నున్నది! 🙏🙏🙏

      తొలగించండి
    3. శ్రీమతి సీతాదేవి గారికి... శ్రీ శాస్త్రి గారికి ధన్యవాదాలు 🙏🙏

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి


    4. సైనికుని భార్య... దేవాలయంలో...

      ఆవల నుగ్రవాదమునకంచున ప్రాణములొడ్డి , దేశ ర...
      క్షా విధి నిర్వహించు ఘన సైనికుడీతడు , బిడ్డ పెండ్లిలో
      దీవెనలీయ నేటికరుదెంచెను, జల్లగ జూడుమమ్మ ! మా
      దేవుఁడు వచ్చినాఁ డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    5. శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారికి నమస్సులు...( శ్రీ వెలుదండ వారికి 🙏 వారి బాటలోనే..)

      లేవనుమానమ్ములు వా
      ణీ విలసిత హృద్య పద్య నిర్మాత యనన్
      జీ వీ సుబ్బాన్విత సహ
      దేవుడు చనుదెంచెనిటకు దీవెనలిమ్మా !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  3. నా వలపుల రేడనుచును
    బావను పెండ్లాడితినిగ పన్నుగ నేడే
    త్రోవను వెదకుచు కామపు
    దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా!

    రిప్లయితొలగించండి
  4. సేవయె పరమార్థమ్మని
    భావన జేసియు సమాజ ప్రక్షాళనకై
    కోవిదులే మెచ్చెడు యొక
    "దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా"

    రిప్లయితొలగించండి
  5. నావను నడుపుచు నేటికి
    నావలి తీరమ్ము జేరు యాత్రికులను తా
    సేవింప దలచి మన సహ
    దేవుడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా.

    రిప్లయితొలగించండి
  6. (కంసవధానంతరం కృష్ణుడు దేవకీదేవితో )
    దేవకిమాత !కనుగొనుము
    భావన నిను నిలుపుకొనుచు భక్తిగ నీదౌ
    సేవ యొనర్పగ నిటు బల
    దేవుడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా !

    రిప్లయితొలగించండి
  7. సేవలు జేయుచు నిరతము
    శీవము ధరియించి నట్టి శివునే కొలిచెన్
    పావని పార్వతి ప్రియమగు
    దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      శివుణ్ణి దీవించమని పార్వతికి చెప్తున్నారా?

      తొలగించండి
  8. దేవుని నమ్మని నా పతి
    గావుమనుచు నిన్ను వేడె కాకృత్యముతో!
    బ్రోవుము మనసారగ నా
    దేవుడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాకృత్యముతో' అన్నది ఇక్కడ అంత బాగా లేదు. "నిన్ను వేడగా వచ్చె నిదే" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. దేవుని నమ్మని నా పతి
      గావుమనుచు నిన్ను వేడగా వచ్చె నిదే!
      బ్రోవుము మనసారగ నా
      దేవుడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా!

      తొలగించండి
  9. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    రేవుకు బోయెను పొద్దు
    న్నే వుతికెను మురికి గుడ్డ లెన్నో నమ్మా
    నావాడే వాడు నన్ను నమ్మిన నా పతి
    దేవుడు,చనుదెంచె నిటకు దీవెన లిమ్మా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చారి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      కాని 'పొద్దున్నే' అనడం వ్యావహారికం. 'ఉతికెను'ను 'వుతికెను' అనరాదు. మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  10. దేవకి వసుదేవునకనె
    తావకవంశాంకురంబు తనయుడు మనకున్
    పావనచరితుడు జనులకు
    దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా.

    రిప్లయితొలగించండి
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2628
    సమస్య :: *దేవుడు వచ్చినా డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్.*
    దేవుడు వచ్చినాడు. ఈ దేవుని దీవించండి దయతో అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: విదర్భ దేశ రాజకుమారి యైన రుక్మిణి శ్రీ కృష్ణుని ప్రేమించింది. తనను వివాహం చేసికొమ్మని ప్రేమ సందేశాన్ని కృష్ణునికి పంపింది. తనను తీసికొని వెళ్లేందుకు శ్రీ కృష్ణుడు వచ్చినట్లు అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుని ద్వారా తెలిసికొనింది. ఆ రుక్మిణి తన మనోరథం నిర్విఘ్నంగా నెరవేరేటట్లు దీవించమని ఉమకు {గౌరీ దేవికి} విన్నవించుకొనే సందర్భం.

    నా వినతిన్ గ్రహింపు ముమ! నాకు హరిం బతి సేయు మమ్మ ! నన్
    బ్రోవ దలంచినా డతడు, పూజ్యుడు మెచ్చెను నా గుణోన్నతిన్,
    పావనమూర్తి రాక్షస వివాహమునం గొనిపోవ గోరి, నా
    *దేవుడు వచ్చినాడిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (20-3-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోట రాజశేఖర్ గారూ,
      మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. అద్భుతమైన పూరణ అవధానిగారూ! అభినందనలు!🙏🙏🙏

      తొలగించండి
  12. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    రేవుకును బోయె నుదయము
    నే విధిగా నుతికె గుడ్డ లెన్నో నమ్మా
    నావాడేనా ప్రియ పతి
    దేవుడు,చనుదెంచె నిటకు దీవెన లిమ్మా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చారి గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు
      "గుడ్డ లెన్నో యమ్మా" అనండి.

      తొలగించండి
  13. చేవగల పండితుఁడు భూ
    దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా
    గోవిందుని ప్రియ కోడల
    కావించ వధానమిచట కమనీయముగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు ధన్యవాదములు.

      తొలగించండి
    3. బహు చక్కని పూరణ రెడ్డిగారూ! భూదేవుని పదాన్ని విశిష్టంగా ప్రయోగించారు! 💐💐💐

      తొలగించండి
  14. స్వర్గంలో దేవేంద్రునితో నందమూరివారు

    దేవుని వేషములెన్నియొ
    ఠీవిగ ధరియించి యొప్పి ఠీకుగదానే
    కావగ నాంధ్రుల మానము
    దేవుడు యరుదెంచె నిటకు దీవెనలిమ్మా!

    సరదాగా! 😊

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సినిమా దేవుడు' అంటే ఇంకా బాగుంటుందేమో?

      తొలగించండి
  15. గురుదేవులకు నమస్సులు! వట్టి సినిమా దేవుని గానే గాక ముఖ్యమంత్రిగా తెలుగువారికి గౌరవము తెచ్చి ప్రజలకు ఆరాధ్యుడైనాడని భావన!🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  16. ఠీవిగ నడుగో పాఠక
    దేవుఁడు చనుదెంచె నిటకు,దీవెనలిమ్మా!
    కావుము వాణీ!చదువరు
    లేవురు పదివేలు నాకు నేర్పడు నటులన్.

    రిప్లయితొలగించండి
  17. కుచేలుడు:

    సావాసంబది మిత్రమ
    నీవెంచెదవని గురిగొని నీరజవదనా
    నైవేద్యమునిడ నీభూ
    దేవుడు యరుదెంచె నిటకు దీవెనలిమ్మా!

    బాధల నివేదన!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కావగ నీవుగాకమరి కంజదళేక్షణ వేరులేరుగా
      యీవివె రూపుగట్టనిట నీవుగ నాదగు ప్రాణ మిత్రమా
      చేవను గోలుపోయిన కుచేలుని బ్రోవగ సాంజలించు భూ
      దేవుడు వచ్చినాడిటకు దీవెనలిమ్ము కృపారసమ్మునన్!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
  18. భావము నిర్మల మగు పతి
    దేవుడు చనుదెంచె ని ట కు దీవెన లిమ్మా
    పావని గిరిజా ! హిమ జా !
    కావుము మము దేవ దేవి కారుణ్య ము న న్

    రిప్లయితొలగించండి
  19. సేవలు జేయు వేళ, నరసింహుని *యాదగిరీశుఁజూచియున్*
    సేవకు డొక్కడచ్చటను శీఘ్రముగా శివమెత్త,భక్తులే
    కావగ బిల్చె నర్చకుల,గైకొని మంత్ర జలమ్ము చల్లగన్
    "దేవుఁడు వచ్చినాఁ డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్"

    రిప్లయితొలగించండి
  20. కావగ సంస్కృతిన్ భువిని కాంచెను పుట్టుక బ్రహ్మ పంపునన్
    దేవళమందునన్ హరిని తేల్చుచు పూజల నిల్చు నిత్యమున్
    కావుము వాని జీవితము కాంచ సుఖమ్ములు వృత్తిలోన భూ
    దేవుఁడు వచ్చినాఁ డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్

    రిప్లయితొలగించండి
  21. మిత్రులందఱకు నమస్సులు!

    [రుక్మిణీదేవి పనుపున శ్రీకృష్ణుని చెంత కేఁగిన యగ్నిద్యోతనుని మాటలు]

    "దేవ! మురారి! నీదు గరిడిం జన నంపిన రుక్మిణిం దగన్
    గావఁగఁ గోరుచుంటినయ! కన్య వివాహము చేది రాజుతోఁ
    దా వెలయింప రుక్మియె కడంగఁగ, మిమ్ము వరించినట్టి యా
    యౌవని, నిన్, దనన్ బరిణయమ్మునఁ గొంటకుఁ గోర, వీఁడు, భూ
    దేవుఁడు వచ్చినాఁ డిటకు! దీవెన లిమ్ము కృపారసమ్మునన్!!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణతో....

      "దేవ! మురారి! నీదు గరిడిం జన నంపిన రుక్మిణిం దగన్
      గావఁగఁ గోరుచుంటినయ! కన్య వివాహము చేది రాజుతోఁ
      దా వెలయింప రుక్మియె కడంగఁగఁ, గృష్ణు వరించి తంచు, దీ
      నావన! నిన్, దనన్ బరిణయమ్మునఁ గొంటకుఁ గోర; వీఁడు, భూ
      దేవుఁడు వచ్చినాఁ డిటకు! దీవెన లిమ్ము కృపారసమ్మునన్!!"

      తొలగించండి
    2. మధుసూదన్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  22. కావలిలో నుద్యోగము
    పావనుడారంగనాధుభజియించుటకున్
    దేవుళ్ళమ్మా! నాపతి
    దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా"

    రిప్లయితొలగించండి
  23. వలలుని వేషములో నున్న భీమసేనుఁడు యతి వేషములో నున్న ధర్మరాజు తో గుంభనముగా పల్కు వచనములు:


    ద్రోవది వనజాక్షి చనును
    భూవర సైరంధ్రి యనఁగ ముద్దుల మాద్రే
    యావరజుఁ డగ్రజా సహ
    దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా


    ఈ వసుధా కుమారి కిల నేలనొ యిట్టి విపత్తు లుగ్రముల్
    రావణ దైత్య బాధ లివి రాదు సహింపగ దేవ నా కిఁకం
    బావని తెల్ప వృత్తమును భర్గ మహేశ శివా మదీయ హృ
    ద్దేవుఁడు వచ్చినాఁ డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వరరావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  24. పావన మాయెగా గృహము పండుగ పూటను మిక్కుటమ్ముగా
    పూవులు పండ్లతో విరిసి భూరిగ గారెలు చక్కిలాలతో
    చావడి లోనికిన్ వెలసి చక్కని జంగపుటెద్దుపై మహా
    దేవుఁడు వచ్చినాఁ డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్

    రిప్లయితొలగించండి
  25. కందం
    శ్రీవాణీ! వాగ్దేవీ!
    భావంబున నిన్ను నమ్మి బాసర నందున్
    సేవల తరియించఁగ సహ
    దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      ఆత్మాశ్రయమైన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. చిన్న సవరణతో

      కందం
      శ్రీవాణీ! వాగ్దేవీ! 
      భావంబున నిన్ను నమ్మి బాసర యందున్
      సేవల తరియించఁగ సహ
      దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా!

      తొలగించండి
  26. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    ( ఒక దేవాలయము లోని పూజారి దేవుని నీ విధంగా కోరుకున్నాడు =
    -----------------------------------------------------------------------------------------------------

    దేవుడు లేడని తిట్టిన నాస్తికుడు - నిన్నటి దుర్ఘటనలో రెండు చేతులు

    తెగిన వాడు - బావురు మంటూ నీ దగ్గరికి వచ్చినాడు స్వామీ !

    దయతో దీవించి వానిని కాపాడు మయ్యా !


    ఆ + మ హ + అ దే వు డు = ఆ మ హా నా స్తి కు డు
    * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *


    కోవెల నర్చకుం డిటుల గోరెను దేవుని c బూజ సేయుచున్ ---->

    " దేవుడు లే డటంచు నతి తెల్విగ , దిట్టతనాన దిట్టియున్ ,

    నీవు శమింపు మయ్య " యని , నిన్నటి దుర్ఘటనంబు నందునన్

    బావురు మన్నవాడు - నిరుబాహువు లూడిన వాడు - నమ్మహా

    దేవుడు - వచ్చినా డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్



    అ దే వు డు = నా స్తి కు డు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుమూర్తి ఆచారి

      ధ న్య వా ద ము లు గు రు దే వా !

      తొలగించండి
  27. భావన భక్తినిగని?మా
    దేవుడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా
    జీవన మనుగడ కొరకై
    ఆవాహన మంది నట్టి యమ్మకు మ్రొక్కన్|
    2.జీవనసార సంపదలు జేరనివేళన?”నక్కజిత్తుగా
    గావగ బాబ రూపుడుగ గన్పడె నొక్కడుమోసమెంచ?యా
    దేవుడు వచ్చినాడిటకు|”దీవెనలిమ్ముకృపారసమ్మునన్
    గావుమటంచు వేడుటకు గాంచనమెంచెనుకార్య సిద్ధికై”|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "వేళను" అనండి.

      తొలగించండి
  28. బ్రోవ కవుల శంకరుడై
    నీ వసుధను కవుల సతము నింపుగ వ్రాయన్
    న్నావిష్కరింప తెనుగున,
    దేవుడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      నన్ను మునగచె ట్టెక్కిస్తున్నారు.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
      "శంకరుడై। యీ వసుధను..." అనండి.

      తొలగించండి
    2. గురువర్యులకు ధన్యవాదములు. సవరిస్తాను.

      తొలగించండి
  29. ఉత్పలమాల
    నీవిల లేని దెక్కడని నిక్కము బల్కితి దేవ! దేవ! త
    ద్భావము నమ్మలేక నిను స్తంభము నందున జూడగోరినన్
    నీవట నుందువంటి, హరి! నిన్గను ముచ్చట దీరఁగన్ పితా
    దేవుఁడు వచ్చినాఁ డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పితాదేవుడు' అన్న ప్రయోగం సాధువు కాదు. "ముచ్చట దీరఁ దండ్రియౌ। దేవుఁడు..." అనండి.

      తొలగించండి
    2. ఉత్పలమాల
      నీవిల లేని దెక్కడని నిక్కము బల్కితి దేవ! దేవ! త
      ద్భావము నమ్మలేక నిను స్తంభము నందున జూడగోరినన్
      నీవట నుందువంటి, హరి! నిన్గను ముచ్చట దీర నప్పడౌ
      దేవుఁడు వచ్చినాఁ డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్! 

      తొలగించండి
  30. కోవెలగాను చేసి తన గుండెన నిల్పుచు నాదు రూపమున్
    దేవతగాను కొల్చెనను, ధీరుడు సద్గుణ శీలుడైన నా
    బావను పెండ్లియాడితిని ప్రాజ్ఞులు మెచ్చెడు రీతిగాను, నా
    దేవుడు వచ్చినాడిటకు దీవెనలిమ్ము కృపారసమ్మూనన్

    రిప్లయితొలగించండి
  31. ద్రుతరాష్ట్రునకు విదురుడు చెప్పుమాటలుగా నూహించి...

    కోవిదు డాతడే, సకల గోజన రక్షకుడై చరించెడి
    న్నా వసుదేవపుత్రుడిల యందరి మేలును గోరువాడెయౌ
    పావన మూర్తి పాండవుల పక్షము నుండియె రాయబారిగా
    దేవుడు వచ్చినాడిటకు దీవెనలిమ్ము కృపారసమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "చరించుగా। నా వసుదేవ..." అనండి.

      తొలగించండి
    2. అలాగే "గుండెను నిల్పుచు..." అనండి.

      తొలగించండి
  32. క్రొవ్విడి వెంకట రాజారావు:

    భవునికి ససి గూడుటకై
    శివ నారాధించెడి సతి సేక్తన్నునుచుచున్
    సవురుగ నమించి ననె నా
    దేవుడు చనుదెంచె నిటకు దీవెనలిమ్మా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మన్నించాలి... మీ పూరణ అర్థం కాలేదు. 'సేక్తన్నునుచున్'...? 'నమించి యనె' అని కదా ఉండవలసింది?

      తొలగించండి
    2. గురువుగారూ! నమస్కారములు.
      భర్త ఆరోగ్యంకోసం పార్వతీదేవిని పూజించే భార్య భర్తను అక్కడుంచి నమస్కరిస్తూ తనభర్త నీవద్దకు వచ్చినందున దీవెనలిమ్మని కోరడం దీనిలోని భావం. మీకు తెలుసుగదా!
      సేక్త=భర్త; ఉనుచుచున్= ఉంచుచు
      నమించి యనె అన్నది సరియైనది. నాపొరబాటును సరిదిద్దుకుంటాను.
      ఇంకా తప్పులుంటే తెలుపగలరు. లేదా పద్యాన్ని మారుస్తాను. ఈ పఫ్యం ప్రయాణంలో ఉండగా వ్రాసినది.

      తొలగించండి
    3. బాగుంది మీ వివరణ. 'సేక్త' నాకు క్రొత్తపదం. ధన్యవాదాలు.
      "సేక్త నునుచుచున్" అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  33. డా.పిట్టాసత్యనారాయణ
    బావురుమనిరో మాతా!
    పావకుడై నోట్లు లేని పాలన దెచ్చెన్
    కోవకు నర మోడీ గా
    డ్దేవుడె చనుదెంచె నిటకు దీవెన లిమ్మా!
    (భారతమాతకు జనుల విన్నపము)

    రిప్లయితొలగించండి
  34. డాక్టర్}పిట్టా}సత్యనారాయణ
    (మెర్ మన్ జననము..వార్త)
    చావడు లేవడీ శిశువు చక్కని దేహము, మాత! చేపకౌ
    భావము కాళ్ళు తోకయయి బాహువు జాచియు బుట్టె గర్భమం
    దీ వరుసన్నిహంబున నదే పనిగా జనియింతురో,యిదో
    దేవుడు వచ్చినాడిటకు దీవెనలిమ్ము కృపారసంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. డాక్టర్}పిట్టానుండి}
      ఆర్యా, ఈ వారం ఆకాశవాణి సమస్య మిత్రులెవరైనా తెలుపుతారా!

      తొలగించండి
    3. నేను వినలేదు. ఎవరో చెప్పారు కాని గుర్తు లేదు.

      తొలగించండి
  35. శ్రీకృష్ణుడు అదితితో

    పావని, దేవేంద్ర జనని!
    దేవారి నరకు వధించి తెచ్చితి దుద్దుల్
    సేవకుడీ సత్యాపతి
    దేవుడు యరుదెంచె నిటకు దీవెనలిమ్మా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మనోజ్ఞమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యోస్మి గురువర్యా! మీ నుంచి మంచి ప్రశంస వినాలనే నా కృషి ఫలించింది! 🙏🙏🙏

      తొలగించండి
  36. కావగ జనులందఱినీ
    పావన నందుని గృహమున బాలుడొకండున్
    దావెలసె గనగ రారే
    దేవుడు యరుదెంచె నిటకు దీవెనలిమ్మా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అందరినీ' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. "జనులందఱ త।త్పావన... బాలు డొక డిదే। తా వెలసె..." అనండి.

      తొలగించండి
  37. రుక్మిణీదేవి పంపగా వచ్చిన
    అగ్ని ద్యోతనుడు మదిలో అనుకొంటున్నట్టుగా

    ఆవనితామణి పంపగ
    నేవచ్చితినయ్య శౌరి,నీదరిశనమున్
    దేవతలకలభ్యము భూ
    దేవుడు చనుదెంచె నిటకు దీవెనలిమ్మా.

    రుక్మిణి పార్వతీదేవితో చెబుతున్నట్టు

    నావిన్నపమును విని యా
    గోవిందుడె వచ్చునంట కూరిమి తోడన్
    కోవెల చేరితి నిటునా
    దేవుడు చనుదెంచె నిటకు దీవెనలిమ్మా.

    రిప్లయితొలగించండి
  38. నావలె దుఃఖ మొంది చరణమ్ముల వాలెడు దీనకోటినిన్
    బ్రోవగ గట్టి కంకణము భూరి ధనమ్మును బోసి నిల్పె దీ
    నావనసన్నిధానమును హాయిని గూర్చగ మాకు రామ! ఆ
    దేవుఁడు వచ్చినాఁ డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్.

    రిప్లయితొలగించండి
  39. .......సమస్య
    *"దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా"*

    *తులసీదాసు-1*

    సందర్భము: చాలా కాలానికి తులసీదాసు తన గ్రామానికి చేరుకున్నాడు.
    "తులసీ దాసు పుట్టినపుడు ఏడువలే దట! "రామ! రామ!" అన్నాడట! ఎక్కడెక్కడో తిరిగి ఈ నాటికి మళ్ళీ పుట్టిన వూరైన మన వూరికి *తులసీ దాసు* అనే మహోన్నతమైన పేరు గడించి తిరిగి వచ్చినాడు. అతడే మన పాలిటి దేవుడు. అతణ్ణి మనసారా దీవించండి."
    అంటూ గ్రామీణులు పుర ప్రముఖులతో పెద్దలతో అంటున్నారు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    బావు రనడు; పుట్టినపుడె

    యా వర కవి "రామ! రామ!" యనెఁ ;
    దులసీ దా

    సై వాడే మన పాలిటి

    దేవుఁడు చనుదెంచె నిటకు..
    దీవెన లిమ్మా!

    *తులసీ దాసు-2*

    సందర్భము: తులసీదాసు పుట్టింది మూలా నక్షత్రంలో.. పుట్టగానే తల్లి మరణించింది. కుటుంబానికి అరిష్టం.. అని తండ్రి వదలి వేశాడు. ఒక దాది పెంచింది. ఆమె కూడా కొన్నాళ్లకే చనిపోయింది. పుట్టగానే 'రామ రామ' అనడం వల్ల అతణ్ణి "రామ్ బోలా.." అని పిలిచేవారు.
    ఆ తులసీ దాసే ఈ వేళ మన వూరికి మన పాలిటి దేవుడై తిరిగి వచ్చినాడు. అతణ్ణి మనసారా దీవించండి."
    అంటూ గ్రామీణులు పుర ప్రముఖులతో అంటున్నారు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఆ వేళ మూల; పుట్టెను...

    తీవరమగునట్లు తిట్లు
    దినె "రామ్ బోలా"..

    యీ వేళను మన పాలిటి

    దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా!

    ~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  40. .......సమస్య
    *"దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా"*

    *తులసీ దాసు- 3*

    సందర్భము: "తులసీదాసు జీవితమంతా రామమయ మైపోయింది. ధన్యుడైనాడు సుమా! అతడు పవిత్రమైన గంగా తీరంలో పుట్టినాడు. ఈ "హరిపూర్.." అతని వూరు.
    ఈ వేళ మన వూరికి మన పాలిటి దేవుడై తిరిగి వచ్చినాడు. అతణ్ణి మనసారా దీవించండి."
    అంటూ గ్రామీణులు పుర ప్రముఖులతో పెద్దలతో అంటున్నారు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    జీవనము రామ విభవము;

    పావన గంగా తటమున
    ప్రభవము; "హరి పూర్"

    కీ వేళను మన పాలిటి

    దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా!

    *తులసీ దాసు- 4*

    సందర్భము: "తులసీదాసు నష్ట జాతకు డంటూ అందరూ అసహ్యించుకున్నారు. కాని ఏకాకిగా ఎక్కడెక్కడో తిరిగి వరాహ క్షేత్రంలో నరహరి దాస్ అనే భక్తుని ఆశ్రయాన్ని సంపాదించుకున్నాడు. కాశీలో "శేష సనాతనుడు" అనే పండితుని వద్ద అనేక శాస్త్రాలు నేర్చుకున్నాడు. గొప్ప పండితుడయ్యాడు. ఆ మహానుభావుడు హిందీలో దాదాపు 39 గ్రంథాలు వ్రాశాడు. అందులో హనుమ దనుగ్రహానికి రా మానుగ్రహానికీ పాత్రుడై "హనుమాన్ చాలీసా" అనే నిత్య స్మరణీయమైన స్తోత్రాన్ని "రామ చరిత మానసము" అనే రామ కథాత్మకమైన మహా గ్రంథాన్నీ విరచించి భారత జాతికి చిర స్మరణీయుడైనాడు." అని గుర్తుకు తెచ్చుకున్నారు.
    "ఈ వేళ ఆ "తులసి"యే పుడమికి దిగిన దేవునివలె కీర్తింప బడుతూ యిక్కడకు వచ్చినాడు. అతణ్ణి మనసారా దీవించండి."
    అంటూ గ్రామీణులు పుర ప్రముఖులతో పెద్దలతో అంటున్నారు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    భావింప "నష్ట జాతకు

    డే వీ" డని యీసడించిరే!
    వర కవితా

    కోవిదుడై "తులసి" పుడమి

    దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి


  41. *సహదేవుడు-5*

    సందర్భము: శ్రీ వాణిని ప్రార్థించినాడు. ఆ దేవి కరుణతో మనోహరమైన భావాన్నీ వాగ్వైభవాన్నీ ప్రసాదించింది.
    (ప్రసాదించలే దంటారా! మీకు చదువుల తల్లి మీద పూర్ణ విశ్వాసం లేనట్టే!)
    కాబట్టి ఇక పద్యాన్ని పరిశీలించి గుణా లేవీ? దోషా లేవీ? అనకండి.
    సహదేవుడు గారొచ్చారు. మనసారా దీవించండి. ఈ సహ దేవుడు జి.వి.ఎస్.ఎస్ సహ దేవుడు (శ్రీ గుండా వెంకట సుబ్బ సహ దేవుడు గారు)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    శ్రీ వాణిని బ్రార్థించెను

    భావము వాగ్విభవ మొసగె...

    పద్యమున గుణా

    లేవీ యన కమ్మా! సహ

    దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  42. దేవీ భార్గవి విను చెడు
    సావాసములను మరగుచు సంసారంబున్
    తావిడిచి చనిన నాపతి
    దేవుడు చనుదెంచె నిటకు దీవెనలిడుమా.

    రిప్లయితొలగించండి


  43. సేవల చేసెడి భాగ్యము
    కోవరమాయెన్ యశోదకున్ కొంగుధనం
    బై! వైకుంటమును విడిచి
    దేవుడు చనుదెంచె నిటకు దీవెనలిడుమా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యశోదకున్ + కొంగు' అన్నపుడు సరళాదేశం జరిగి 'యశోదకున్ గొంగు' అవుతుంది. 'వైకుంఠము' ... టైపాటు.

      తొలగించండి
  44. శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారికి నమస్సులు...( శ్రీ వెలుదండ వారికి 🙏 వారి బాటలోనే..)

    లేవనుమానమ్ములు వా
    ణీ విలసిత హృద్య పద్య నిర్మాత యనన్
    జీ వీ సుబ్బాన్విత సహ
    దేవుడు చనుదెంచెనిటకు దీవెనలిమ్మా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  45. "చందాలంటూ భలే ప్రచారం వందలు వేలూ తమ ఫలహారం"

    దేవుచు మూఢభక్తులను తేరకు వచ్చు ధనమ్ముకోరుచున్
    దేవుని కోసమే నిడుడు త్రిప్పట తీరును మీకటంచుచున్
    త్రోవలు కాయు వంచకుల దుంపలు త్రెంచగ భాగ్యనగ్రినిన్
    దేవుఁడు వచ్చినాఁ డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్

    రిప్లయితొలగించండి