22, మార్చి 2018, గురువారం

సమస్య - 2630 (దుగ్ధపయోధి మధ్యమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ"
(లేదా...)
"దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో"
(గతంలో ఎన్నో అవధానాలలో అడిగిన ప్రసిద్ధ సమస్య)

106 కామెంట్‌లు:

  1. తామసమున దూర్వాసుడు తన్నె హరిని,
    భంగ పాటు కలిగి లక్ష్మి పరిహరించె
    వేగముగ నాధుని విడచి విష్ణు పురము,
    "దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ

    రిప్లయితొలగించండి
  2. మద్దూరి రామమూర్తి అవధాని గారి పూరణ....

    స్నిగ్ధ వచోవిలాస ! సరసీరుహ గర్భ సతీ కటాక్ష స
    మ్యగ్ధృత శేముషీ విరచితాష్ట వధాన మఖ ప్రహృష్ట స
    ద్వాగ్ధిషణాఢ్య !ధన్యగుణ ! ప్రశ్నకు సందియమందినాడ నే
    దుగ్ధ పయోధి మధ్యమున దుమ్ములు రేగెనొ ? చోద్యమయ్యెడిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మద్దూరి వారూ,
      పృచ్ఛకుని ఎంత గొప్ప విశేషణాలతో సంబోధించారు!
      మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  3. (దేవదానవుల క్షీరసాగరమథనం)
    అమృత మాశించి సురలును నసురతతియు
    విసుగులేకుండ నిలబడి వివిధరీతి
    లోలచిత్తత తరువంగ రొంపపట్టి
    దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ.

    రిప్లయితొలగించండి
  4. ఎన్ని చీకటి రాత్రులొ మొన్న నిన్న
    నెన్ని భీకర రణముల నెదురుకొనెనొ
    చరిత భారత దేశపు తరచి చూడ
    దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భరతదేశపు చరితను తరచి చూడ" అంటే ఇంకా బాగుంటుందేమో?

      తొలగించండి
  5. మనసనెడు క్షీర సాగర మందు గాంచ
    మానవత్వమను సురలు దానవులను
    స్వార్థమే సతము మధింప ఫలిత మదియె
    దుగ్ధసాగరమునరేగె దుమ్ము లెన్నొ.

    రిప్లయితొలగించండి
  6. స్నిగ్ధ మనోహరం బగు సీత మదిని
    యడవి కేగెడు సమయాన కడలి మించు
    ఘోర నుత్తుంగ తరంగ ఘోష యనగ
    దుగ్ధ సాగరమున రేగె దుమ్ము లెన్నొ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      చక్కని పూరణ. అభినందనలు.
      మొదటి, మూడవ పాదాలలో గణదోషం. "స్నిగ్ధ సుమనోహరం బగు..." అనండి. 'ఘోర + ఉత్తుంగ = ఘోరోత్తుంగ' అవుతుంది. నుగాగమం రాదు. సవరించండి.

      తొలగించండి
    2. స్నిగ్ధ సుమనోహరం బగు సీత మదిని
      యడవి కేగెడు సమయాన కడలి మించు
      ఘోరోత్తుంగ తరంగ ఘోష యనగ
      దుగ్ధ సాగరమున రేగె దుమ్ము లెన్నొ

      తొలగించండి
  7. మైలవరపు వారి పూరణ

    ధిగ్ధరణీధరమ్మున మథింప జనించెను తుంపరల్ మహా..
    దుగ్ధపయోధి మధ్యమునఁ , దుమ్ములు రేగెనదేమి చిత్రమో
    స్రగ్ధరులైన దైత్యులకు , చల్లగ దాక ముఖమ్ములందు , సం...
    దిగ్ధతఁ బాశమున్ వదలి , తీసిరి పర్వులు నాల్గుదిక్కులన్ !!

    దుమ్ములు కావు... తుమ్ములు

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. అద్భుతమైన తుమ్ముల పూరణ!!🙏🙏🙏

      తొలగించండి
    3. ధన్యవాదాలండీ 🙏

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    4. దుమ్ముకు తుమ్మొచ్చెన్నిట!
      తుమ్మగ తుంపరలు దగిలి దుగ్ధపయోధి
      న్నమ్మైలవరపు వారే
      సమ్మోహన సామ్యరూప సరసము జూపెన్!!
      🙏🏻

      తొలగించండి
    5. మురళీ కృష్ణ గారు నమస్సులు. మంచి పద్యము నందించినారు. కాని మంచి పూరణ కానేరదని నా యభిప్రాయము.
      అర్థానుస్వారమున్నపుడు “తుమ్ములు”, లేనిచో “దుమ్ములు”. సమస్యా పాదములో లేని యర సున్నను బాద మధ్యమునఁ జేర్చిన నియమ భంగమే కదా.

      తొలగించండి
    6. గురుతుల్యులు శ్రీ పోచిరాజు వారికి ప్రణామాలు...మీ ఆక్షేపణ సరియైనదే..

      అయినను ఉచ్చారణమునందు భేదము లేకుండుటచే వ్రాసితిని..

      ఒక విలక్షణమైన అర్థభేదం ధ్వనిస్తున్నట్లు తోచి అట్లు వ్రాసితిని..
      దీనిని పూరణముగా గాక మంచి పద్యముగా పరిగణింపవలసినదిగా కోరుచు.... నమస్సులతో...... మురళీకృష్ణ

      తొలగించండి
    7. శివుడు సితవర్ణుడై దోచె క్షీరవార్ధి
      యనగ , నలదిన భస్మలేపనము లేచె
      దుమ్ముగా గేళిఁ , దోచె ప్రదోషమిట్లు
      దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

  8. ఆ.వె.

    క్షీరసాగరమును మరి చిలికినపుడు

    కలువ మిత్రుడు, సుధ పుట్టె ఘనముగాను;

    వ్యర్థ విషము,రొదలు బుట్టె యందు;కనగ

    దుగ్ధసాగరమునరేగె దుమ్ము లెన్నొ.

    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘ వనపర్తి☘

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...బుట్టె నందు..." అనండి.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి

    3. క్షీరసాగరమును మరి చిలికినపుడు

      కలువ మిత్రుడు, సుధ పుట్టె ఘనముగాను;

      వ్యర్థ విషము,రొదలు బుట్టె నందు;కనగ

      దుగ్ధసాగరమునరేగె దుమ్ము లెన్నొ.

      🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
      ☘ వనపర్తి☘

      తొలగించండి
  9. మనసు నవనీతమగును !సమ్మాన్య చరిత!
    ధవుడు దుర్మార్గుడై యామె దరికి రాడు
    విధి విలాసముఁజూడ నివ్వెఱలుఁగల్గు!
    'దుగ్ధ సాగరమున రేగె దుమ్ము లెన్నొ.'

    రిప్లయితొలగించండి
  10. యోగనిద్రనున్న యోగిమనవిహారి
    కర్ణజాతులయ్యి కావరమున
    తండ్రితోడ ననిని తలపెట్ట పావన
    దుగ్ధ సాగరమున దుమ్మురేగె!

    ఆర్యా! పొరబాటు! ఆటవెలది అనుకున్నాను!
    మరల వ్రాసెదను తేటగీతి!🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుధనుగోరి జిలుక సురాసురులు వార్ధి
      నమృతకరుడుదయించగా నద్భుతముగ
      కలువరేని కతన కలుగ చలువయెంతొ
      దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ!

      తొలగించండి
    2. దుగ్ధపయోధి నందునతి థూర్తులు దారుణ రీతికీర్తియన్
      దుగ్ధత కోరగా ననిని ద్రుంచగ లేకయె శౌరివారి సం
      దిగ్ధత నాదిశక్తిదగు దీవెన గన్గొని వేడగాను యా
      ముగ్ధయె తోడుగానడువ మచ్చటదీరగ వానిద్రుంపగన్
      దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో!

      తొలగించండి
    3. మథుకైటభుల తలలనుండి మేదిని యేర్పడిందని పురాణము!🙏🙏🙏

      తొలగించండి
    4. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ భావంలో కొంత సందిగ్ధత. 'దుగ్ధత కోరగా' అంటే? 'వేడగాను + ఆ' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    5. ధన్యవాదములు గురుదేవా! కీర్తిపొందాలనే దుగ్ధతో (అసూయ, ద్వేషములతో) యుద్ధాన్ని కోరారని భావన! దుగ్ధను అంటే సరిపోతుందా? దుష్కర ప్రాసయైనందున పాట్లు!🙏🙏🙏🙏

      తొలగించండి
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2630
    సమస్య :: *దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో.*
    పాలసముద్రంలో చిత్రంగా దుమ్ములు చెలరేగినాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: అమృతంకోసం దేవతలు రాక్షసులు కలసి పాలసముద్రాన్ని చిలికేటప్పుడు ఆ సముద్రంలోని జలచరాలలో కొన్ని మరణించాయి. అస్థిపంజరాలుగా మారినాయి. ఆ జలచరాల ఎముకలు పైకి విసరివేయబడుతూ ఉన్నాయి అని విశదీకరించే సందర్భం.

    దగ్ధము గాగ వైర, మమృతమ్మును గోరుచు వార్ధి జిల్కగా
    స్నిగ్ధమనస్కులై దనుజ నిర్జరు లాశగ జేర, ప్రేక్షకుల్
    ముగ్ధులు గాగ , వారిచరముల్ నశియింపగ , పైకి లేచుచున్
    *దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో ?*
    {దుమ్ములు = ఎముకలు}
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (22-3-2018)

    రిప్లయితొలగించండి
  12. భేద భావాలు పొడ సూపి పెద్ద వైన
    చిత్త మల్ల కల్లో ల మై చింత నొ oదు
    తండ్రి తలచె న దేలకో తగని భంగి
    దుగ్ధ సాగ రము న రేగె దుమ్ము లేన్నో

    రిప్లయితొలగించండి
  13. దేవ దానవు లిరువురు దీక్షతోడ
    నమృత ముకొరకు పాలసం ద్రమును జిలుక
    "దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ
    కల్ప వృక్షము లాదిగా గాకయికను

    రిప్లయితొలగించండి
  14. దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో"
    స్నిగ్ధమ నంబుతో నరయనేదియు గాదుగనబ్బురమ్మహో
    దుగ్ధము జిల్కగా వెడలె దోరము గామృత జీవరాసులే
    దగ్ధము లైపయో ధినట తోరముగాగను రేగెదు మ్ములున్

    రిప్లయితొలగించండి
  15. నాటకీయత యేపార నాడు దివిని
    పలు ఘటనలకు నెలవాయె పాల కడలి
    ధర్మ స్థాపనా దీక్షకు దారి తీసి
    "దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధర్మ స్థాపనా' అన్నపుడు 'ర్మ' గురువై గణదోషం. "ధర్మమును నిల్పు దీక్షకు..." అందామా?

      తొలగించండి
  16. డా.పిట్టాసత్యనారాయణ
    స్నిగ్ధులు జేరి మోడికిని జే యన నిండు సభా సమాజమే
    స్నిగ్ధ మనోహరంబె;మరి నీటను నోట్లను మంటవెట్టగా
    దగ్ధము గాదు కీర్తి యనె,తత్తర పాటున; నేడు పాడిగా
    దుగ్ధ పయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
  17. డా.పిట్టాసత్యనారాయణ
    సప్త సంద్రములానిన స్థలిని దిరుగ
    నేస్తమెక్కడ?చూపుకే; నెనరు చెదరె
    భారతీయులు బలియైరి "పంచశీల
    దుగ్ధ సాగరము"న రేగె దుమ్ము లెన్నొ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  18. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    నా ప్రశాంత సంసారమునందు జొచ్చి
    బాధ పెట్టుచు బెదిరించె పడతి యొకతె
    ఫేసుబుక్కున నను బుక్కు జేసి మాదు
    దుగ్ధ సాగరమున రేగెదుమ్ములెన్నొ

    రిప్లయితొలగించండి
  19. స్వార్ధ చింతన చేత భూసారమంత
    పీల్చి పిప్పి జేసి మురికి పెంపు జేసి
    నదులలోన జేర్చిరిగ మానవులు నవియె
    తోయధిన్జేరగా జలదోష మయ్యె
    "దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ"

    రిప్లయితొలగించండి
  20. ఉత్పలమాల
    ముగ్ధము రూపమే గనగ ముచ్చట కూరిమి మీరగా ననన్
    స్నిగ్ధము నామెమోము దరి చేరగ సిగ్గుల మోహమే నగున్
    దగ్ధము చేయ కోరికలు దంతుని ఊసులు మాపినా శివున్
    దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో
    Dr H Varalakshmi Anantha Chandham group

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. హెచ్. వరలక్ష్మి గారూ,
      'శంకరాభరణం' బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సిగ్గుల మోహమే" అనండి. 'మాపినా' అనడం వ్యావహారికం. "మాపినన్" అనండి.

      తొలగించండి
  21. రాష్ట్ర మది చీలెను బుచికి ! రావలసిన
    డబ్బులు బుచికి! చంద్రన్న డాబు సరిగ
    విసిరెను సవాలు భాజ్పాకు వెరసి ఆంధ్ర
    దుగ్ధ సాగరమున రేగె దుమ్ము లెన్నొ!

    రిప్లయితొలగించండి
  22. అమృతముకొరకు పోర సురాసురులట
    దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ
    మోహినిగ వచ్చి శౌరి సమ్మోహపరచి
    రక్కసులను వంచించి సురలనుఁ గాచె

    రిప్లయితొలగించండి
  23. కలి యడు గిడఁగ ద్వేషము సెలఁగె భువినిఁ
    గూలె సంసారములు పెక్కు ఘోరముగను
    సఖుల మధ్య చోద్యమ్ముగ సఖ్యత చెడె
    దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ


    స్నిగ్ధత బూని చిల్కఁగను శీఘ్రమ పుట్టె హలాహల మ్మటన్
    దగ్ధము లయ్యె మత్స్యములు తామర సంభవ షండ మెల్ల సం
    దిగ్ధము కల్గె దైత్య సుర ధీర వరేణ్యుల కంత భీతినిన్
    దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలుఁగు వ్రాయుట మఱచిరి తెలుఁగు ప్రజలు
      పెట్ట నర సున్న మఱచిన వింత నిచట
      “దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ”
      దుమ్ము లయ్యెను జూడుమ తుమ్ము లన్ని

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      ఇక తుమ్ములు, దుమ్ములు గురించి....
      మీ వాదన సమంజసమే.
      అయితే నేను కావాలనే అక్కడ అర్ధానుస్వారం పెట్టలేదు. ఒక అవధానంలో పృచ్ఛకుడు ఈ సమస్యను ఇచ్చాడనుకుందాం. అంటే మౌఖికంగా చెప్పాడు. విన్న అవధాని అక్కడ అరసున్న ఉన్నదా? అని అడగలేదు. అడగకపోవడానికి కారణం అరసున్నతో తుమ్ములు గానో, అది లేకుండా దుమ్ములు గానో పూరించడానికి సానుకూలంగా ఉంటుందని! నేను కూడా మిత్రులు తుమ్ములు, దుమ్ములు అని దేనితో పూరించినా స్వీకరిస్తున్నాను. మన మిత్రులలో ఎక్కువమంది అర్ధానుస్వారాన్ని తమ పద్యాలలో ప్రయోగించడం లేదు కదా!

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  24. దుగ్ధపయోధి చిల్కుతరి దుర్భర మై హరి నంజుఁ గ్రక్కగా
    దగ్ధము చెందె నంగణము తద్దయు వేగ భయంకరమ్ముగా
    దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె, నదేమి చిత్రమో
    స్నిగ్ధత చూపి శంకరుడు శీఘ్రము గాగొనె కాలకూటమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అంగణము' అంటే ముంగిలి అని అర్థం. మీరే అర్థంలో ప్రయోగించారు?

      తొలగించండి
    2. అంగణము : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979 Report an error about this Word-Meaning
      సంస్కృత విశేష్యము
      1. ఇంటిముందు చోటు, ముంగిలి.
      2. ప్రదేశము.

      తొలగించండి
  25. ముగ్ధమనోహరమ్ములన పుల్కలు రేపుచు కాంత కుల్కులే
    దగ్ధము జేయకాంతుని హృదజ్జువులన్,వడి కామకేళికై
    ముగ్ధను మోహవారధిని ముంచుచు తేల్చెడి వేళలందు,హా
    *దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో*

    2.సురలసురులు మంథరము, వాసుకిని బట్టి,
    చిల్క గనమృతమునుగోరి క్షీర ములను
    వెడెలె హాలాహలమచట వెఱచి రంత
    దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'హృదజ్జువు'...?

      తొలగించండి
  26. తేటగీతి
    అందఁగ సుధ మందర కవ్వమౌచుఁ జిలుక
    దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ
    క్రుంగు చుండె లోనికనుచు రంగడెరిగి
    కర్మఫలమంద తోడ్పడె కమఠమౌచు.

    రిప్లయితొలగించండి
  27. దుగ్ధద వల్ల గాధిజుడు దుష్కర రీతితపమ్ము జేయగన్
    దగ్ధము జేయ నెంచుచును దల్మియె మేనక నంప నప్పుడున్
    స్నిగ్ధమనోహరమ్మయిన నెచ్చెలి మోమును గాంచ మౌనికిన్
    దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  28. పాడిపసువులపాలతో బ్రతుకుచుండ?
    భార్యపిల్లలు బెరుగంగ భార్యపోరు
    ఆశదోషాలు బెంచగ?నంతరాన
    దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ

    రిప్లయితొలగించండి
  29. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సింధువు నమృతము కొఱకై చిలుకునపుడు
    కామధేనువు, వెలిచెట్టు, రామ గాక
    దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ
    వాటి నడచె హరిహరులు వాసి మీఱ
    (వెలిచెట్టు= కల్పవృక్షము; రామ= లక్ష్మి )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      క్రియాపదం అడచె ఏకవచనమై, కర్తృపదం హరిహరులు బహువచన మయింది.

      తొలగించండి
    2. వాటి నడఁచిరి హరిహరుల్ వాసి మీఱ అంటే సరి!

      తొలగించండి
    3. శ్రీ గుండు మధుసూదన్ గారికి నమస్సులు. కృతజ్ఞతలు

      తొలగించండి
  30. రిప్లయిలు
    1. మిత్రులందఱకు నమస్సులు!

      [రచ్చబండయొద్ద నిరువురు పండితులు శాస్త్రచర్చ చేయుచుండఁగా నక్కడఁ జేరిన గొల్లవాండ్రది యర్థముగాక నోళ్ళువెళ్ళఁబెట్టిన సందర్భము]

      వాగ్ధృతశేముషీద్వితయపండితతర్కవితర్కలక్షణో
      ద్దగ్ధితశాస్త్రసంభరితదారుణచర్చలు సాఁగుచుండఁగా
      "దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేఁగె నదేమి చిత్రమో?
      దగ్ధమయెన్ మన" స్సనుచుఁ దల్లడమందిరి దోగ్ధలత్తఱిన్!

      తొలగించండి
    2. మధుసూదన్ గారూ,
      అద్భుతమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
  31. దగ్ధపరాక్రమార్భటివిదగ్ధభటాంఘ్రిసముత్థధూళి, వై దగ్ధచమూసమూహములు దార్కొన పైకెగసెం దదీయసం
    దిగ్ధసముద్రసైన్యకృతధిక్కృతగోగ్రహణాజి, నట్లుగా
    దుగ్ధపయోధిమధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో?.

    రిప్లయితొలగించండి
  32. పాల కడలిని మధియించ లీలగాను
    వచ్చు వాటిని సమముగ పంచుకొనగ
    సురలు నసురుల మధ్యన జరిగి వాదు
    దుగ్ధ సాగరమున రేగె దుమ్ము లెన్నొ!!!

    రిప్లయితొలగించండి
  33. ఉత్పలమాల

    స్నిగ్ధపు సూర్యవంశమను క్షీర సుధాంబుది శౌరి రాముడై
    ముగ్ధుల జేయు రాజగుచు భూమిని నేల జనాళి కోరికన్
    దుగ్ధ స్వభావ మేర్పరచి ద్రుంచఁగ మంధర కైక చిత్తమున్
    దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుధాంబుధి' టైపాటు. 'దుగ్ధ స్వభావ' మన్నపుడు 'గ్ధ' గురువై గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

      స్నిగ్ధపు సూర్యవంశమను క్షీర సుధాంబుధి శౌరి రాముడై
      ముగ్ధుల జేయు రాజగుచు భూమిని నేల జనాళి కోరికన్
      దుగ్ధ వికార భావనల ద్రుంచఁగ మంధర కైక దాసియై
      దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో!

      తొలగించండి
  34. నాటి పాల సంద్రము వోలె నేటి చట్ట
    సభయు కల్లోలమై శాంతి సన్నగిల్లె
    రాజకీయము వేడెక్కి రచ్చ కెక్కె
    దుగ్ధ సాగరమున రేగె దుమ్ములెన్నొ!

    రిప్లయితొలగించండి
  35. దుగ్ధపయోధి నందునతి థూర్తులు వేడుక గీర్తినందెడిన్
    దుగ్ధను కోరగా ననిని ద్రుంచగ లేకయె శౌరివారి సం
    దిగ్ధత నాదిశక్తిదగు దీవెన గన్గొని సన్నుతించ నా
    ముగ్ధయె తోడుగానడువ మచ్చటదీరగ వానిద్రుంపగన్
    దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో!

    ఆర్యా! సవరించిన పూరణ పరిశీలించ ప్రార్ధన!
    దుగ్ధ = అసూయ, ద్వేషము

    రిప్లయితొలగించండి
  36. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  37. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  38. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో ప్రాస తప్పింది. సవరించండి.

    రిప్లయితొలగించండి

  39. .......సమస్య
    దుగ్ధ సాగరమున రేగె దుమ్ము లెన్నొ..

    *రుక్మిణి హృదయం పాల సముద్రం*

    సందర్భము: జీవు డేనాటికైనా దేవునితో సంయోగం చెందాల్సిందే! అలా సంయోగం చెందనీయకుండా అడ్డు వచ్చే అన్య భావా లన్నీ జన్మ పరంపరలోనికి లేదా కష్టాలలోనికే తోసివేస్తాయి.
    అటువంటి ఆలోచనలు ధూళి లాంటివి. ఆ ధూళి తెరలు కన్నులకు కమ్ముకున్నట్టైతే కంటి కెదురుగా వున్నప్పటికీ సత్యం కనిపించదు. సత్య స్వరూపుడే కదా పరమాత్ముడు!
    రుక్మిణి అన్నయైన రుక్మిది యిదే మనస్తత్వం. అందుకే రుక్మిణిని శిశుపాలుని కిచ్చి వివాహం జరిపింతా మనుకున్నాడు.
    రుక్మిణి హృదయమేమో పాల సముద్రం లాంటిది. అందులో ఆ దుమ్ము ముసురు కుంటున్నది. ఐతేనేం! చింతించాల్సిన పని లేదు.
    ఎందుకంటే పాల సముద్రంలో ఎవరు శయనిస్తారో చెప్ప నక్కర్లేదు. కృష్ణ పరమాత్ముడే అందులో హాయిగా పవళించి వున్నాడు. ఆతడు సహజంగానే క్రీడా మయుడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేవి ఆయనకు నిత్య కృత్యాలే! ఆయనే అన్నీ చూచుకోగలడు.
    (రుక్మిణి జీవునికి, కృష్ణుడు దేవునికి ప్రతీకలు.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    జీవ దేవ సంయో గాన్య భావ ధూళి

    కనుల గమ్మిన సత్యంబు గాన నీదు...

    రుక్మి తత్వం బదే గదా! రుక్మిణి హృది

    దుగ్ధ సాగరమున రేగె దుమ్ము లెన్నొ..

    అయిన నే మాయె, నందులో హాయి మీర

    కృష్ణ పరమాత్మ పవళించు, క్రీడ నెరపు

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి