గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2620 సమస్య :: *రవి చెప్పెన్ కమనీయ విష్ణుకథలన్ రంజిల్లగా నెల్లరున్.* విష్ణుకథలను సూర్యుడు చెప్పినాడు అని అనడం ఈ సమస్యలోని విశేషం. సందర్భం :: ఏడు రోజులలోనే భవ రోగాన్ని పోగొట్టుకొని మోక్షాన్ని పొందాలని అనుకొన్న పరీక్షిత్ మహారాజునకు, ఇతర మునులకు, సాధువులకు వ్యాస భగవానుని కుమారుడు, నైమిశారణ్య మునుల ముఖములనే పద్మములకు సూర్యుని వంటివాడు అగు శుకయోగి పవిత్రమైన విష్ణుకథలతో కూడియున్న భాగవతాన్ని జనరంజకంగా చెప్పినాడు అని విశదీకరించే సందర్భం.
విట్టుబాబు గారూ, సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** జిలేబీ గారూ, జె.కె. భారవి అని రాఘవేంద్ర రావు చిత్రాలు అన్నమయ్య, రామదాసు మొదలైన వాటికి స్క్రీన్ ప్లే రాసిన వ్యక్తి. రామదాసు చిత్రంలో కోయదొరగా కనిపిస్తాడు.
రవి యను కవి ఖమ్మమ్మున కవిరాజనగరము నందు గల గుడిలోనన్ చవులూరు భాషణమ్మిడె రవి చెప్పెను విష్ణు కథల రంజిల్ల జనుల్.
(మా ఊరు ఖమ్మం. మా పేట కవిరాజనగర్. అక్కడ సాయిబాబా గుడి ఉంది. అప్పుడప్పుడూ చిన్న ఉపన్యాసాలిచ్చాను.నాపేరు రవి తో చక్కగా రాసుకొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ధన్యవాదం .)
భాస్కరమ్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'కన్గోవగా; అన్న ప్రయోగం సాధువు కాదు. "మెచ్చు నత డంచున్ గాంచగా ధారుణిన్" ఆనండి. 'యోగీంద్ర భారతి' అంటే మీ భావం?
...సమస్య *"రవి చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్"*
*కట్టు కథలు* (సరదా పూరణం)
సందర్భము: రవి మురళి విష్ణు సహాధ్యా యులు. రవి యెప్పుడూ కట్టు కథలు కల్పించి చెప్పే వాడు. ఒకనాడు మురళి విష్ణుతో యిలా అంటున్నాడు.. " విష్ణూ! రవి కథలు చెబుతూ వున్నాడు.. చూశావా! కథలు.." ~~~~~~~~~~~~~~~~~~~~~~~ రవి మురళి విష్ణు క్లాస్మే ,
ట్సవిరళముగఁ గట్టు కథల సంధించు నిలన్
రవి; మురళి విష్ణుతో ననె..
"రవి చెప్పెను విష్ణు! కథలు... రంజిల్ల జనుల్
2 వ పూరణము:--
*ఆ రవి - ఈ రవి*
సందర్భము: ఆ రవి లోకంలో చీకటి తొలగిస్తాడు. ఈ రవి యనగా శుకుడు సంసార మనే చీకటి తొలగిస్తాడు. అందుకోసం విష్ణు కథలు చెబుతాడు. ~~~~~~~~~~~~~~~ భువిఁ జీకటి బాపు నతడు
రిప్లయితొలగించండివివిధ రకములైన కథలు,
రవి చెప్పెను, విష్ణు కథలు, రంజిల్ల జనుల్
మవురి వలె నతడు బల్కుల,
జవాది నద్ది యనుదినము చక్కగ సుమ్మీ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవిరళముగ కవనమ్ములు
రిప్లయితొలగించండిసవివరము తెలుపె నంట సంతస మొప్పన్
కవులందరి కంటె మిన్నగ
రవి చెప్పెను విష్ణు కధలు రంజిల్ల జనుల్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
రెండవ, మూడవ పాదాలలో గణదోషం. "సవివరముగ తెలిపెనంట... కవులందరిలో మిన్నగ..." అనండి.
తొలగించండిఅవిరళముగ కవనమ్ములు
సవివరముగ తెలిపె నంట సంతస మొప్పన్
కవులం దరిలో మిన్నగ
రవి చెప్పెను విష్ణు కధలు రంజిల్ల జనుల్
కవులందరిలో కరుణపు
రిప్లయితొలగించండికవి ; భక్తిసమంచితకవి ; కమనీయంబౌ
కవితలనిడు పోతన ; కవి
రవి చెప్పెను విష్ణుకథలు రంజిల్ల జనుల్ .
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండివివరంబిద్ది! జనాళి మేలు బడయన్ వేవేల గాధల్ మనో
జవమై గట్టిరి సూవె పండితులు దేశంబందు నేర్వన్ జనుల్ !
కవివర్యుండత డౌత, భాగవతమున్ కవ్వంబునన్చిల్కుచున్
రవి చెప్పెన్ కమనీయ విష్ణుకథలన్ రంజిల్లఁగా నెల్లరున్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఘనద ర్శకధీ రుండగు
రిప్లయితొలగించండిమన రాఘవుడా నెపమున మన్నన పొందన్
సువిధమ్ముగ నా కవి భా
"రవి చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్"
పొరపాటు.
రిప్లయితొలగించండితొందరపాటు. గురువుగారు. మన్నించండి
విట్టుబాబు గారూ,
తొలగించండిపద్యం బాగుంది. కాని రాఘవేంద్ర రావుకు, భారవికి సంబంధం?
అన్నమయ్య రామదాసు కధా విస్తరణ చేసినది భారవి గారే కదా!
తొలగించండిగురువుగారూ....పద్యంలో ప్రాస తప్పింది కదా.. అందుకే మన్నించమన్నా!!
🙏🏻
ఓహో.. మీరు ఆ భారవిని ప్రస్తావించారా? బాగుంది.
తొలగించండిమీ పద్యంలో ప్రాసదోషాన్ని నేను గమనించలేదు. సవరించి మరో పూరణ పెట్టండి.
వివరమ్మది దెలియును కద
రిప్లయితొలగించండియవనిక నా రామదాసు యన్నమ చరితల్
సువిధమ్ముగ నా కవి భా
"రవి చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్"
రిప్లయితొలగించండికవివరుడాతడు ! మేలౌ
రవి! చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్
మవురి వలె బల్కులను జే
ర్చి వివరముగ సయి జనులకు రించోళీనన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సయి సుజనుల రించోళి యనన్" అంటే బాగుంటుందేమో?
వివరమ్మది దెలియును కద
రిప్లయితొలగించండియవనిక నా రామదాసు యన్నమ చరితల్
సువిధమ్ముగ నా కవి భా
"రవి చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్"
పవన సుతునకు సివములను
రిప్లయితొలగించండిరవి చెప్పెను, విష్ణు కథలు రంజిల్ల జనుల్"
భువనమున సూతుడు దెలిపె గ
ద విరామము లేక బహువి దంబులతోడన్
సూర్యకుమార్ గారూ,
తొలగించండి'పవనసుతునకు సివములను రవి చెప్పెను' అర్థం కాలేదు.
మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
సివములు అన్న వేదములు గదా.వ్యాకరణము ఇత్యాదులు రవి నేర్పించారు గదా అని నా భావన
తొలగించండిపవన సుతునకు సివములను
రిప్లయితొలగించండిరవి చెప్పెను, విష్ణు కథలు రంజిల్ల జనుల్"
భువనమున సూతుడు దెలిపె గ
ద విరామము లేక బహువి దంబులతోడన్
రిప్లయితొలగించండివివిధ రకములైన కథలు,
రవి చెప్పెను, విష్ణు కథలు, రంజిల్ల జనుల్
మవురి వలె నతడు బల్కుల,
జవాది నద్ది యనుదినము చక్కగ సుమ్మీ !
జిలేబి
రవి యను హరి దాసొ కరుడు
రిప్లయితొలగించండిచ వు లూ రించె డు విధము న చక్కని రీతి న్
త వి లి యు శ్రోత లు కోరగ
రవి చెప్పెను విష్ణు కథ లు రంజిల్ల జనుల్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒకే వాక్యంలో 'రవి' రెండుసార్లు పేర్కొనబడ్డాడు.
"హరిదాసు పేరు రవి గద!" అనండి.
భువి "వనపర్తి" ప్రజలు కే
రిప్లయితొలగించండిశవ కథలను వినదలంచి చక్కని కవి "భా
రవి"ని పిలవగ,వెడలి "భా
రవి" చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్!
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"భా।రవిని పిలిచిరి, వెడలి భా।రవి..." అనండి. లేకుంటే ఒకే వాక్యంలో భారవి పునరుక్తమవుతుంది.
భవహరమై భువి వాసుల
రిప్లయితొలగించండిసువిధమగు పథము దెలుపుచు సుజనుల జేయన్
కవికుల తిలకుండగు భా
రవి జెప్పెను విష్ణుకథలు రంజిల్ల జనుల్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅవిరళముగ శంకరునికి
జవాదు లద్ది సయిదోడు జడనిధి తల్పున్
చవులూరు విధముగను భై
రవి చెప్పెను విష్ణు కథలు, రంజిల్ల జనుల్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధవళాయత సద్యశుడును
రిప్లయితొలగించండిస్తవనీయుడు పండితుండు చాగంటి ఘనుం
డవిరళ రుచివైభవమున
రవి చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2620
సమస్య :: *రవి చెప్పెన్ కమనీయ విష్ణుకథలన్ రంజిల్లగా నెల్లరున్.*
విష్ణుకథలను సూర్యుడు చెప్పినాడు అని అనడం ఈ సమస్యలోని విశేషం.
సందర్భం :: ఏడు రోజులలోనే భవ రోగాన్ని పోగొట్టుకొని మోక్షాన్ని పొందాలని అనుకొన్న పరీక్షిత్ మహారాజునకు, ఇతర మునులకు, సాధువులకు వ్యాస భగవానుని కుమారుడు, నైమిశారణ్య మునుల ముఖములనే పద్మములకు సూర్యుని వంటివాడు అగు శుకయోగి పవిత్రమైన విష్ణుకథలతో కూడియున్న భాగవతాన్ని జనరంజకంగా చెప్పినాడు అని విశదీకరించే సందర్భం.
భవ రోగమ్మును బాప, భాగవతమున్ బల్కెన్ మహా యోగియై,
స్తవనీయమ్ముగ నా శుకుండు, కృపతో సంసార నిర్ముక్తుడై,
భువిలో సత్కవి, నైమిశాఖ్య సువనీ మున్యాస్య రాజీవ భా
*రవి చెప్పెన్ కమనీయ విష్ణుకథలన్ రంజిల్లగా నెల్లరున్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (9-3-2018)
తొలగించండి--నైమిశాఖ్య సువనీ మున్యాస్య రాజీవ భారవి!
చాలా బాగుందండీ రాజశేఖర్ గారు!
జిలేబి
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
సహృదయులు జిలేబీ గారికి హృదయపూర్వక ప్రణామాలు.
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి భక్తిపూర్వక ప్రణామాలు.
తొలగించండిశివకథను రమ్యముగ భా
రిప్లయితొలగించండిరవిచెప్పెను; విష్ణుకథల రంజిల్ల జనుల్
కవి పోతన యందించెను
శ్రవణానందముగ మిగుల సరళపుశైలిన్!
సీతాదేవి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏🙏
తొలగించండివివరమ్మది దెలియును కద
రిప్లయితొలగించండియవనిక నా రామదాసు యన్నమ చరితల్
సువిధమ్ముగ నా కవి భా
"రవి చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్"
తొలగించండిఈ భారవి ఎవరండీ ?
జిలేబి
విట్టుబాబు గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
జె.కె. భారవి అని రాఘవేంద్ర రావు చిత్రాలు అన్నమయ్య, రామదాసు మొదలైన వాటికి స్క్రీన్ ప్లే రాసిన వ్యక్తి. రామదాసు చిత్రంలో కోయదొరగా కనిపిస్తాడు.
అన్నమయ్య, రామదాసు, ఓం నమో వేంకటేశాయ సినిమాల కథా విస్తరణ, ఆదిశంకర సినిమా దర్శకుడు ఐన జె.కె. భారవి :)
తొలగించండినేను.... పరుగులో వెనకబడ్డా!! గురువుగారే గెలిచారు. :-)))
తొలగించండి
తొలగించండిఓం నమో వేంకటేశాయ! నొప్పు రాఘ
వేంద్రునికి ప్రతారికలపై వేడ్క గాన
నిద్దరన నాయికల బెట్టి నిమ్మళముగ
చిత్రమును జూపగ జిలేబి చిగురు బోడి !
జిలేబి
సువిధమ్ముగ జేకే భా
తొలగించండిరవి......
:)
'జిలేబీ' రాఘవేంద్రుడు
తొలగించండి😀
సరస సురస జిలేబి మీ సరి యెవరని
తొలగించండికందం
రిప్లయితొలగించండిభువికిన్ దిగె నందకమే
ప్రవిమలముగ నన్నమయ్య పాత్రను గొనుచున్!
స్తవనీయ పదకవన కై
రవి చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్! !
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ కోట రాజశేఖర్ గారూ! మీ పద్యం - అందులోని సమాసం చాలా బాగా నచ్చాయండి. నా చిన్ని అనువాదం ఆర్యా వృత్తంలో.
రిప్లయితొలగించండిభవ తారక భాగవతే
శుక మునినా నైమిశాఖ్య మహావనీ।
మునీ ముఖాస్య కమల భా
రవినా కథితాః ముకుంద కథాః।।
చిటితోటి విజయకుమార్ నాగపూర్.
చిటితోటి వారికి నమస్సులు!
తొలగించండిఅవధానిగార్ పూరణా, దానిననుసరించి విజయకుమార్ గారిపూరణా రెండూ మనోహరంగా ఉన్నాయి! అభినందనలు, నమస్సులు!🙏🙏🙏🙏🙏
తొలగించండిశ్లోకం లోని మూడవ పాదమును
తొలగించండి*ముని ముఖ్యాస్య కమల భా*
అని చదువ ప్రార్థన.
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సరవిన్ + చెప్పెను = సరవిఁ జెప్పెను' అని ద్రుతసంధి రూపం.
ధనికొండ రవిప్రసాద్ గారి పూరణ.....
రిప్లయితొలగించండిరవి యను కవి ఖమ్మమ్మున
కవిరాజనగరము నందు గల గుడిలోనన్
చవులూరు భాషణమ్మిడె
రవి చెప్పెను విష్ణు కథల రంజిల్ల జనుల్.
(మా ఊరు ఖమ్మం. మా పేట కవిరాజనగర్. అక్కడ సాయిబాబా గుడి ఉంది. అప్పుడప్పుడూ చిన్న ఉపన్యాసాలిచ్చాను.నాపేరు రవి తో చక్కగా రాసుకొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ధన్యవాదం .)
ధనికొండ వారూ,
తొలగించండిబాగుందండి మీ ఆత్మాశ్రయమైన పూరణ. అభినందనలు.
భవబంధము విడనాడిన
రిప్లయితొలగించండిదివిజస్థానంబుగలుగు దిరముగననుచు
న్నవిరళపదజాలముతో
రవిచెప్పెను విష్ణుకధలు రంజిల్లజనుల్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిభవసాగరతరణములని
కవివర! సూతుండు కృష్ణ కమనీయ కథా
ప్రవిమల గగనోద్భాసిత
రవి చెప్పెను విష్ణుకథలు రంజిల్ల జనుల్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ జ్వరం ఎలా ఉంది?
Typhioid కీ pnumonia కీ antibiotics మ్రింగుచున్నాను. జ్వరతీవ్రత కీ కూడా. కొంచెం better. వారం రోజులలో కోలుకోగలను పూర్తిగా
తొలగించండి🙏🙏🙏
తొలగించండిజీపీయెస్ వారు
ఈ పంచచామరాన్ని పూరించండి జ్వరం హాం ఫట్ అని పారిపోతుంది
జ్వరమ్ము వీడు వీడుమా సజావు గాన నేనెగా
జిలేబి
కవిరాజై జగమెల్ల మెచ్చునతడే కన్గోవగా ధారుణిన్
రిప్లయితొలగించండిస్థవనీయుండగు నట్టి శ్రీశుక మునిన్ ధ్యానించి ప్రార్థింపగన్
వివరమ్మై చనురీతి భాగవతమున్ విన్పించి యోగీంద్ర భా
*రవి చెప్పెన్ కమనీయ విష్ణుకథలన్ రంజిల్లగా నెల్లరున్.*
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కన్గోవగా; అన్న ప్రయోగం సాధువు కాదు. "మెచ్చు నత డంచున్ గాంచగా ధారుణిన్" ఆనండి. 'యోగీంద్ర భారతి' అంటే మీ భావం?
యోగీంద్ర భా*రవి* మునులలో ప్రకాశించే సూర్యుని
తొలగించండివంటి వాడు
భువి మోక్ష దాయకమ్ములు
రిప్లయితొలగించండివివరమ్ముగ మాఠరుండు విశ్రుతములు , బ్ర
హ్మవిదులు గాని నుడువ లే
రవి, చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్
[లేరు+అవి = లేరవి]
సువిశాలాంచిత భారతావనికి నీశుండుం బరీక్షిన్మహా
సవనానీక రతుండు శాపగత విశ్రాంతుండు దా వేడఁగన్
వివరం బేర్పడ నేడు ఘస్రములు భూ విఖ్యాత వైయాసి ధీ
రవి చెప్పెం గమనీయ విష్ణుకథలన్ రంజిల్లఁగా నెల్లరున్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిభువిలో రవియనునాతడు
రిప్లయితొలగించండిచవులూరగ పాఠములను చక్కగ తెలుపున్
కవిరాజులెల్ల వ్రాయగ
రవి చెప్పెను విష్ణుకథలు రంజిల్ల జనుల్ !!
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవధానములను చేయుచు
రిప్లయితొలగించండిప్రవిమలపు పురాణములను పఠియించుచు కే
శవ మందిరమున, బుదుఁడౌ
రవి చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
రిప్లయితొలగించండిసమస్యా పాదమును “ రవి చెప్పెం గమనీయ... “ అని సవరించిన బాగుండునని నా యభిప్రాయము.
కామేశ్వర రావు గారూ,
తొలగించండినిజమే! నేను మిత్రులు పంపిన సమస్యను అలాగే కాపీ పేస్ట్ చేయడం వల్ల జరిగిన పొరపాటు అది. ధన్యవాదాలు.
లవకుశు స్తుతులు మధువులూ
రిప్లయితొలగించండిరవి చెప్పెను విష్ణు కథలు, రంజిల్ల జనుల్
వివశులయిరి విని యా హరి
యవతారుని రాముని కథ నశ్రువు లిడుచున్ ||
రఘురామ్ గారూ,
తొలగించండిపూరణ బాగున్నది.
కాని పూర్వార్ధంలో అన్వయలోపం ఉంది. "లవకుశుల స్తుతులు సుధలూ । రవి చెప్పిరి..." అనండి.
శివ ,విజయుల వాదును భా
రిప్లయితొలగించండిరవి చెప్పెను, విష్ణుకథలు రంజిల్ల జనుల్
ప్రవచించెను చాగంటియె
యవిరళమగు రీతి యశము నందుచు భువిలో!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి(రసధుని అడ్మిన్ ధనికొండ రవిప్రసాద్ గారి గురించి...)
కం:
దివిజేశులు దీవించగ
రవివలె రాజిలు "రసధుని" రంగమునందున్
చవులూరంగ ఘన సుకవి
రవి చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్!
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘వనపర్తి☘
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిధనికొండ వారిని ప్రశంసిస్తూ మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.
రవి శశి యను కవులందున
రిప్లయితొలగించండిరవి చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్
శివ గాధలు శశి బలికెను
కవనముననె బలికిరపుడు ఘనమగు రీతిన్
నిన్నటి సమస్యకు నా పూరణ
వనమున కనుగొనె సీతను
హనుమంతుఁడు లంక కేగి; యసువులఁ బాసె
న్నినకుల వంశజు రాముని
గని రణమొనరించి గూలె గద రావణుడే
తే 07 /3 /2018 దీ నాటి సమస్యకు నా పూరణ
చంద్ర కాంతము నందున చంద్రు డనుచు
జీడిపలుకు నమర్చెను చిన్న దొకతె
జోరుగా సాగు చీమల బారు లోన
చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండిచవులూరించెడు పండుగా దివిని కంజారుండు దీపింపగన్
పవమానాత్మకుడంద గోరి యొగయన్ వారించ బ్రహ్మాదులున్
స్తవనీయమ్మగు విద్యనేర్పు గురువై శాస్త్రోక్తులన్ బల్కుచున్
రవి చెప్పెన్ కమనీయ విష్ణుకథలన్ రంజిల్లఁగా నెల్లరున్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిపోతన భాగవత శైలి:
రిప్లయితొలగించండిచెవికింపై రసవంతమై భువిని సౌశీల్యంబు పెంపొందగా
రవిచంద్రాక్షుడు సర్వవ్యాపి దయ నార్తత్రాణు గోవిందువౌ,
కవితా వైభవ ద్రాక్షాపాకగతి సాకల్యంబుగా ధీప్రభా
రవి చెప్పెం, గమనీయ విష్ణుకధలన్
రంజిల్లగా నెల్లరున్!
ద్రాక్షపాకగతి గా చదువ ప్రార్ధన!
తొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సర్వవ్యాపి' అన్నపుడు 'ర్వ' గురువై గణదోషం. 'ద్రాక్షాపాక'మనడమే సాధువు. కాని గణభంగమౌతుంది.
గురువుగారికి నమస్సులు! చాల తప్పులే దొర్లాయి! క్షమించండి! మత్తేభ , శార్ధూలాలింకా మచ్చిక కాలేదు!
తొలగించండిసవరించిన పూరణ:
చెవికింపై రసవంతమై భువిని సౌశీల్యంబు పెంపొందగా
రవిచంద్రాక్షుడు సర్వయోని దయ నార్తత్రాణు గోవిందువౌ,
స్తవనీయంబగు కావ్యరీతి నతివిస్తారంబుగా ధీప్రభా
రవి చెప్పెం, గమనీయ విష్ణుకధలన్
రంజిల్లగా నెల్లరున్!
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిహవణికమగు సూక్తులతో
సవురుగ పౌరాణికమగు సత్కథలెల్లన్
ప్రవచించుచు నాటి తమిని
రవి చెప్పెను విష్ణుకథలు రంజిల్ల జనుల్
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవసరమగు మంచికి భా
రిప్లయితొలగించండిరవి చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్
శ్రవణానందము నింపెడి
కవితలతో భక్తి బెంచె!కర్మను మాన్పన్ !
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికవియౌ భారవి వ్రాసెను
సవివరముగ భారత కథ సంస్కృత మందున్
రవి గాంచని వింతల నీ
రవి చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్.
ప్రవచనములు చేయగ నట
రవియను వ్యక్తియరుదెంచె రహితో తానున్
భువిలో జనములు మెచ్చగ
రవి చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
...సమస్య
రిప్లయితొలగించండి*"రవి చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్"*
*కట్టు కథలు*
(సరదా పూరణం)
సందర్భము: రవి మురళి విష్ణు సహాధ్యా
యులు. రవి యెప్పుడూ కట్టు కథలు కల్పించి చెప్పే వాడు.
ఒకనాడు మురళి విష్ణుతో యిలా అంటున్నాడు..
" విష్ణూ! రవి కథలు చెబుతూ వున్నాడు.. చూశావా! కథలు.."
~~~~~~~~~~~~~~~~~~~~~~~
రవి మురళి విష్ణు క్లాస్మే ,
ట్సవిరళముగఁ గట్టు కథల
సంధించు నిలన్
రవి; మురళి విష్ణుతో ననె..
"రవి చెప్పెను విష్ణు! కథలు...
రంజిల్ల జనుల్
2 వ పూరణము:--
*ఆ రవి - ఈ రవి*
సందర్భము: ఆ రవి లోకంలో చీకటి తొలగిస్తాడు. ఈ రవి యనగా శుకుడు సంసార మనే చీకటి తొలగిస్తాడు. అందుకోసం విష్ణు కథలు చెబుతాడు.
~~~~~~~~~~~~~~~
భువిఁ జీకటి బాపు నతడు
రవి; చెప్పెను విష్ణు కథలు
రంజిల్ల జనుల్...
భవ మను చీకటి బాపగ
రవి యన దగు నతడు శుకుడు
రాజునకుఁ గృపన్..
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
అవతారమ్ముల నెత్తి దుష్టజన సంహారమ్మునే సల్పుచున్
రిప్లయితొలగించండిభువిభారమ్మును ద్రుంచినట్టి ఘన యంభోజాక్షు డొక్కండిలన్
భవరోగమ్ముల దీర్చువాడనుచు సద్భావమ్ముతో నాడు భా
రవిచెప్పెన్ కమనీయ విష్ణుకథలన్ రంజిల్లగా నెల్లరున్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅవిరళముగ కృషి సలిపిన కవి యాతడు పండితుండు కమనీయముగన్, చెవి యొగ్గియు వినుచుండగ, రవి చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్.
తొలగించండిజనార్దన రావు గారు,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండికవులన్ సత్కవి పోతరాడ్విదితుఁ డీ క్షాంతిన్ బ్రమోదింపఁ గే
శవుపై భక్తియుఁ జేతమందుఁ గదురన్ సంప్రీతుఁడై ధీరుఁడై
కవితన్ గూర్చెర యాంధ్ర భాగవత; మా గ్రంథమ్ము విన్మంచు మా
"రవి" చెప్పెన్ కమనీయ విష్ణుకథలన్ రంజిల్లఁగా నెల్లరున్!
స్వస్తి
మధురకవి గుండు మధుసూదన్
శివునిన్ పార్థుని పోరు కమ్మగను తా చిత్రించి వర్ణించి భా
రిప్లయితొలగించండిరవి చెప్పెన్;..కమనీయ విష్ణుకథలన్ రంజిల్లఁగా నెల్లరున్
చవినిన్ పోతన చెప్పెగా ముదముతో చైతన్యమొప్పారగా...
కవిరో! నేనివి చద్వలేదు గదరా కాసింత కూసింతనున్ :)