17, మార్చి 2018, శనివారం

సమస్య - 2626 (గగనమ్మున నొక్క చేఁప...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్"
(లేదా...)
"గగనమునందు చేఁప కడు గంతులు వేసెను చిత్ర మెట్లగున్"
(డా. జి.ఎమ్. రామశర్మ గారి 'శతావధాన వైజయంతి' గ్రంథం నుండి)

94 కామెంట్‌లు:

  1. గగనమ్మున మేఘములను.
    సొగసున పలు చిత్రములను చూడుము సఖియా!
    అగుపించెను కడు వింతగ
    'గగనమ్మున నొక్క చేప గంతులు వేసెన్'

    రిప్లయితొలగించండి
  2. జగమంత యధర్మంబె క
    నగ;వింతలు జరిగె యగము నాశన మవగన్!
    ఖగము సరస్సున నీదెను,
    గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యగము'? ఒకవేళ 'అగము' అనుకుంటే "జరిగె నగము' కావాలి.' అవగన్' అన్న ప్రయోగం సాధువు కాదు. సవరించండి.

      తొలగించండి
  3. సగిలేరున సుడిగాలియె
    యగణిత వేగమున నెగసె నంబరమునకున్
    దగులు కొనగ జలచరములె
    'గగనమ్మున నొక్క చేప గంతులు వేసెన్'
    ****)()(****
    సగిలేరు = ఒక నది పేరు.

    రిప్లయితొలగించండి
  4. మోవి తాకిపలుకుచుండు ముదము తోడ
    నొకటి , మోవిని తగులక పొరలు చుండు
    నొకటి, మదినుంచి నడరుచు నుండు నొకటి,
    గణయతి ప్రాసనియమము గలవి మనతె
    లుంగు పద్యముల్, సతము వెలుగుచు నుండు
    చండ కరుడున్న వరకు నీ జగతిలోన

    రిప్లయితొలగించండి
  5. సొగయుచు వెన్నెల వెలుగులు
    జగమంతయు పరవశించి జాతర సేయన్
    పొగరున పొంగెడు కడలిని
    గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
  6. స్వగణంబుల గోల్పోవుచు,
    వేగిని తా విడచివైచి వేగిరపడుచున్
    వగరుచు చేరగ నీరధి
    గగనమ్మున నొక్క చేప గంతులు వేసెన్.
    వేగిని=నది, నీరధి=సముద్రము.
    నదిని వదలి సముద్రము జేరిననొక చేప, బాధ మరిచిపోయి సంతోషముతో గంతులు వేసెనని భావము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వామన కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదాన్ని గురువుతో ప్రారంభించారు. మిగిలిన పాదాలు లఘువులతో ప్రారంభమయ్యాయి. సవరించండి.

      తొలగించండి

  7. ఖగపతి తిరుగును జలమున,
    గగనమ్మున నొక్క చేప గంతులు వేసెన్,
    యుగము చివరి దినములలోన్
    జగమున కల్గు బహుచిత్ర సంఘట నమ్ముల్

    రిప్లయితొలగించండి
  8. రెండవ పూరణ....
    కం:
    అగుపడగను కడు కనువిం

    దుగ వాసంతపు సొబగులు,తోషము తోడన్

    ఖగము విహారము జేసెను

    గగనమ్మున ,నొక్క చేప గంతులు వేసెన్!

    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘వనపర్తి☘

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ


    మదనుడు మీనకేతనుడు....

    అగుపడుచుండె మావి తరులందముగా చిరు పిందెలన్ గనన్ ,
    మగువలనవ్వులట్లు మరు మల్లెలు విచ్చెను ! మా మనోజుడే
    జగములనేలు రేడని వసంతముఁ గాంచుచుఁ దా ధ్వజస్థయై
    గగనమునందు చేఁప కడు గంతులు వేసెను చిత్ర మెట్లగున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన పూరణ మురళీకృష్ణగారూ!
      వసంతాగమనాన్ని మనోజ్ఞంగా వర్ణించారు
      అభినందనలు!💐💐💐

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  10. సొగసులు చిందు మేఘములు చుక్కల మించెడి యందమున్
    యుగముల నుండిమారని శుభోదయ వేళల నాకశంబున
    న్నగణిత రూపముల్వెలయు నాజుకు బొమ్మల సృష్టి జేయగా
    గగనము నందు చేఁప కడు గంతులు వేసెను చిత్ర మెట్లగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "మించెడినట్టి యందమున్" అనండి. అలాగే "వేళల నాకసంబులో నగణిత..." అనండి.

      తొలగించండి

    2. సొగసులు చిందు మేఘములు చుక్కల మించెడినట్టి యందమున్
      యుగముల నుండిమారని శుభోదయ వేళల నాకశంబులో
      నగణిత రూపముల్వెలయు నాజుకు బొమ్మల సృష్టి జేయగా
      గగనము నందు చేఁప కడు గంతులు వేసెను చిత్ర మెట్లగున్

      తొలగించండి
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: *గగనము నందు చేప కడు గంతులు వేసెను చిత్ర మెట్లగున్*
    *ఆకాశంలో ఒక చేప గంతులు వేస్తూ ఉంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: బ్రాహ్మము అనే కల్పం ముగిసి పోయే కాలంలో ప్రళయం ఏర్పడి సముద్రజలాలు ఆకాశానికి చేరుకొన్నాయి. బ్రహ్మదేవుని ముఖమునుండి వెలువడిన వేదాలను హయగ్రీవుడు (అశ్వవక్త్రుడు) అనే రాక్షసుడు అపరించాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు మత్స్యావతారాన్ని ధరించి హయగ్రీవుని సంహరించి వేదాలను సంరక్షించాడు. లోకాలకు మేలు చేకూర్చాడు. ఆసమయంలో ఆకాశం చేరిన సముద్ర జలాలలో భగవంతుడు చేప రూపంలో ఉండి ఆనందంతో గంతులు వేశాడు. కాబట్టి ఆకాశంలో చేప గంతులు వేయడం విచిత్ర మెలా ఔతుంది అని ప్రశ్నించే సందర్భం.

    అగణిత బ్రాహ్మ కల్ప ప్రళయమ్మున సంద్రము నింగిజేర, వే
    దగణము నశ్వవక్త్రు డను దానవుడే హరియింప, మత్స్యమై
    పగ నతనిన్ వధించి హరి భద్రము గూర్చిన యట్టి వేళ నా
    *గగనము నందు చేప గడు గంతులు వేసెను. చిత్ర మెట్లగున్ ?*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (17-3-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోట రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. 17.3.18 నా పూరణ పద్యమునకు
      *శ్రీ చిటితోటి విజయకుమార్ గారి సంస్కృత అనువాద శ్లోకమును* గమనింప ప్రార్థన.

      అగణిత బ్రాహ్మ కల్ప ప్రళయమ్మున సంద్రము నింగిజేర, వే
      దగణము నశ్వవక్త్రు డను దానవుడే హరియింప, మత్స్యమై
      పగ నతనిన్ వధించి హరి హర్షము నందిన యట్టి వేళ నా
      *గగనము నందు చేప గడు గంతులు వేసెను. చిత్ర మెట్లగున్ ?*

      బ్రాహ్మాన్తే ప్రళయే మహోగ్రధృతినా పస్పర్శ ఖం సాగరో
      వేదస్తేనమరిం నిహత్య కు-హయగ్రీవం జలేష్వంబుధేః
      యో భద్రం జగతాం హరి ర్విహితవాన్ మీనావతారే తదా
      కల్పాన్తే *గగనే ననర్త జలధౌ మత్స్యః కథం విస్మయః?*
      *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.*

      తొలగించండి
  12. సొగసుగ నొక నావికునకు
    గగనమ్మున మీనరాశి కనిపించంగా
    పొగరుగ తరంగమాడగ
    గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
  13. అగణితరీతిలో గగనమందునఁబూవులు బూసినట్లుగా
    నిగదితమౌను, సత్కవులు నేర్పున వర్ణనఁజేయు పట్టులన్
    జగమునఁగ్రాంతదర్శుల కసంభవ మన్నది లేని కైవడిన్
    గగనము నందు చేప గడు గంతులు వేసెను చిత్రమెట్లగున్

    రిప్లయితొలగించండి
  14. నగలును మేడల నిచ్చుచు
    వగలాడికి ప్రేమజూప పరవశమున యా
    మగువకు నాశలె పెరిగెను
    గగనమ్ముననొక్క చేఁప గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పరవశమున నా తగువు..." అనండి.

      తొలగించండి
  15. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,


    ఖగ మొకటి ఝషము c బట్టుచు ,

    గగన పథము నందు సాగగా , నకటా య

    స్త గమనమున గిలగిల యని

    గగనమ్మున నొక్క చేప గంతులు వేసె‌న్ ! !


    { అస్త గమనమున = మరణ దశ లో }

    రిప్లయితొలగించండి
  16. అగుపడ కరిమబ్బులగుమి
    గగనమ్మున, నొక్కచేప గంతులు వేసెన్
    తగినంత జల్లు గురిసి స
    రగున పొలుపొదవు హ్రదమని రంజితమతియై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువుగారు వ్యస్తులా? అస్వస్థులా? వారి క్షేమసమాచారాల గురించి తెలిపిన బాగుండును🙏🙏🙏

      తొలగించండి
    2. వ్యస్తులు.. నిన్నటి వారి మెసేజి :

      ******************************************
      కంది శంకరయ్యమార్చి 17, 2018 12:23 AM
      కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు ఉదయం చిక్కడపల్లిలో ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుండి నేరుగా చందానగర్ వచ్చి కవిసమ్మేళనంలో పాల్గొని ఇంతకు ముందే నెలవు చేరాను. అందువల్ల మీ పూరణలను సమీక్షించడం వీలు కాలేదు
      ఒక్కటి మాత్రం నిర్ద్వందంగా చెప్తాను. ఈనాటి దత్తపది పూరణలలో అందరూ తమ సృజనాత్మకతను స్పష్టం చేస్తూ చక్కని పద్యాలు చెప్పారు. అందరికీ అభినందనలు, ధన్యవాదములు.
      *********************************************
      ఉగాది సందర్భంగా ఎన్నో సాహితీ కార్యక్రమములు!

      తొలగించండి
    3. ధన్యవాదములు!! బహు సంతోషం!

      అయితే రేపు న్యస్తాక్షరి ఖాయం!!😊😊😊

      తొలగించండి
    4. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు
      ఈరోజు, రేపు కూడ సాహిత్య కార్యక్రమాలలో వ్యస్తుడనే. ప్రస్తుతం సిద్దిపేట బస్సులో ఉన్నాను.

      తొలగించండి
    5. ధన్యవాదములు గురుదేవా! మీ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని మా ఆకాంక్ష! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
    6. ఎగసిన నాగరీక జనులెంచిన జీవన రీతులన్నహో
      యగణిత కూటవాయువులు నాకసమందున చెంగలించగా
      నగరము లందువర్షమున నామ్లము తోజల జంతువుల్బడన్
      గగనమునందు చేపకడు గంతులు వేసెను చిత్రమేటికిన్!?

      తొలగించండి
  17. అగుపడు ముంగిటముగ్గులు
    మగువకు సంక్రమణమందు!మదిలో గదులున్
    సొగసుల గాలిపటంబట
    గగనమ్మున నొక్క చేప గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
  18. ఎగిరె నుప గ్రహ మొక్క టి
    ప్రగతి న్ సూచించు రీతి ప్రాణుల తోడ న్
    సొగసు గ గనపడన ప్పుడు
    గగనం బు న నొక్క చేప గంతు లు వేసె న్

    రిప్లయితొలగించండి
  19. (యంత్రపు ఊయలలో బాలరాయలను ఆడిస్తున్నశ్రీకృష్ణదేవరాయలు)

    అగణితవిక్రముండు; విజయాన్వితతేజుడు; కృష్ణరాయడే
    సొగసుల పుత్రకుండు కనసొంపగు జాలపు తూగుటూయలన్
    జిగిబిగినుండ; చిర్నగవు చిందగ మీటను త్రిప్పినంతనే
    గగనము నందు చేఁప కడు గంతులు వేసెను చిత్ర మెట్లగున్?

    రిప్లయితొలగించండి
  20. అగణిత నావికాదళ జలాంతరగాముల పాటవమ్ములన్
    జగములు జూచి మ్రాన్పడవె;సంద్రము నుండి విహంగమై వడిన్
    గగనతలమ్మునన్నెగిరి కాచును భారత యంతరిక్షమున్
    *గగనమునందు చేఁప కడు గంతులు వేసెను చిత్ర మెట్లగున్*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భారత + అంతరిక్షము = భారతాంతరిక్షము' అవుతుంది కదా?

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువర్యా.. సవరణతో

      అగణిత నావికాదళ జలాంతరగాముల పాటవమ్ములన్
      జగములు జూచి మ్రాన్పడవె;సంద్రము నుండి విహంగమై వడిన్
      గగనతలమ్మునన్నెగిరి కాచును భారత వాయువర్త్మమున్
      గగనమునందు చేఁప కడు గంతులు వేసెను చిత్ర మెట్లగున్

      తొలగించండి
  21. మగువను పెండ్లాడ దలచి
    మగటిమ గల యర్జునుండు మత్స్యపు యంత్ర
    మ్ముగనుచు నచ్చెరు వొందెన్
    గగనమ్ముననొక్కచేప గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
  22. సొగసుగ నావికుండొకడు సుందర రీతిని దుర్భిణిన్ గనన్
    గగనమునందు నొప్పుచు వికాసిగ మీనపు రాశినిన్ భళా
    పొగరు తరంగ మొక్కటి దభోయని నావను నూపగా నహా
    గగనమునందు చేఁప కడు గంతులు వేసెను చిత్ర మెట్లగున్

    రిప్లయితొలగించండి
  23. కందం
    దిగి వచ్చెడు హరిఁ జూపఁగఁ
    దగు వరుస దశావతార దర్శన మెంచన్
    సగపడు చిత్రీకరణన్
    గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్!

    ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

    రిప్లయితొలగించండి
  24. ఖగుని పయి మేఘమునుగని
    గగనమ్మున, నొక్క చేఁప గంతులు వేసెన్
    తగు వర్షముకురియు, త్వరిత
    ముగ కొలనులలోన నీరము కలుగునంచున్

    రిప్లయితొలగించండి
  25. మగధీరుఁడు భీభత్సుఁడు
    తెగ నఱుకఁగ మత్స్య యంత్ర దివ్య ఝషమునుం
    బగులఁగ హృదయము గిరగిర
    గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్


    పగలును బంతముల్ సహజ భావములే కద ప్రాణి కోటికిం
    దగిన ముహూర్త మెంచ నిది తథ్యము సేయుఁడు పెండ్లి నింపుగన్
    మృగశిర యుక్తమౌ మకర నిష్ఠిత లగ్నమునం దనంగనే
    గగనమునందుఁ జేఁప కడు గంతులు వేసెను చిత్ర మెట్లగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వరరావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  26. మగువ స్వయంవరంబచట మాన్యులు చేరిరి మత్స్యయంత్రమున్
    మగటిమ తోడ గొట్టి సుమమాలిని పొందదలంచు కాంక్షతో
    సుగుణము లందు మేటి బలసూదన సూదుడు విప్రుడై గనన్
    గగనము నందు చేప కడు గంతులు వేసెను చిత్రమెట్లగున్

    రిప్లయితొలగించండి
  27. సొగసులకుప్ప లక్షణను జూచుచు నోరగ మత్స్యయంత్రమున్
    నగవుల నందనందనుడు నాట శరమ్మున డాయు నత్తరిన్
    సుగమము నాకు ముక్తి యిక చూడను జన్మల నంచు హర్షయై
    గగనమునందు చేఁప కడు గంతులు వేసెను చిత్ర మెట్లగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      లక్షణా పరిణయ ప్రస్తావనతో పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  28. జగమంత యధర్మంబె క
    నగ;వింతలు జరిగె యుగము నాశనమొందన్!
    ఖగము సరస్సున నీదెను,
    గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
  29. చంపకమాల (సరసీ)
    చంపకమాల
    భగభగ మండు వేసవికి భగ్గున నీరము లావిరయ్యెనే
    సగపడ లేదు లేదని విచారము నంద సరస్సునందునన్
    పొగలకు మంచు వర్షముల మోయుచు మేఘములాడ వేడుకన్
    గగనము నందు, చేఁప కడు గంతులు వేసెను చిత్ర మెట్లగున్?

    రిప్లయితొలగించండి
  30. ఎగురుదురట నరులిక ! ; కలి
    యుగమందున జలము పొంగి యుర్వి మునుగగా
    గగనము నంటగ జలనిధి
    గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
  31. నమస్కారములు
    ఆకాశవాణి వారి పూరణల వివరములను తెలుపగలరు . '' కొత్త సమస్యను వివరించ గలరు "

    రిప్లయితొలగించండి
  32. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,

    [ రథముపై ఆకాశములో మన్మథుడు వెళుతూ వుంటే ఆతని

    రథకేతనము పైన గల మీనము ఎగురుతూ వుంది ]


    మగువల ‌ - పురుషుల హృదయము

    లు గదల్చు గద ఝషకేతుడు | రథమునన్ సా

    గగ మింటన్ గుసుమశరుడు ,

    గగనమ్మున , నొక్క చేప గంతులు వేసెన్


    { ఝషకేతుడు = రథకేతనము పై చేప గుర్తు గలవాడు , మన్మథుడు ‌ }

    రెండవపాదంలో యతి ----> లు = డు

    రిప్లయితొలగించండి
  33. డా.బల్లూరి ఉమాదేవి

    17/3/18

    నగధరశౌరి దయతో క్రీడియు,

    గగనమ్మున దిరుగు చేప గన్నుల గొట్టన్

    అగణిత శౌర్యము చూపుచు

    గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్"*

    రిప్లయితొలగించండి
  34. నేటి శంకరాభరణం సమస్య
    "గగనము నందు చేపఁగడు గంతులు వేసెను చిత్రమెట్లగున్."––––
    గగనతరంగతుంగసురగంగ మునుంగు నభంగభంగిమ
    న్నిగనిగన్ దళ్కులందెనయు నేత్రయుగమ్ముల మీనులయ్యెడన్
    ఖగవిధమొప్పు నట్లెగయఁ,గావ్యరసోచితవర్ణనమ్ములన్
    గగనమునందు చేపఁగడు గంతులు వేసెను చిత్రమెట్లగున్.

    రిప్లయితొలగించండి
  35. మిత్రులందఱకు నమస్సులు!

    జగదభిపాలనందనులు,శౌర్య విదగ్ధులు, చక్రవర్తు లా
    యగణితసంభ్రమద్భ్రమరయత్నితవిస్ఫురమత్స్యయంత్ర మి
    మ్ముగఁ దెగవ్రేయఁగా, వడిని ముందునకున్ దుముకం జనంగ, నా
    గగనమునందుఁ జేఁప కడు గంతులు వేసెను! చిత్ర మెట్లగున్?

    రిప్లయితొలగించండి
  36. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు
    'గనము' నకు ముందు అరసున్న ఎందుకు?

    రిప్లయితొలగించండి


  37. *సూర్య నమస్కారం*

    సందర్భము: అంతులేని ఆకాశం పరబ్రహ్మ స్వరూపం. అది నిరాకారం. ఉదయిస్తున్న బాల సూర్యుడు సాకార (దైవ) రూపాలకు ప్రతీక. నిగనిగ లాడే చేప ఒక సాధకు డనుకోవచ్చు.
    ఆ చేప ఉదయ సూర్యుణ్ణి చూచి (సాధకునివలె) ప్రణమిల్లుతున్నదా అన్నట్టు గగనానికి లేచి లేచి నీళ్ళలోకి పడిపోతున్నది.
    అది నింగిలో గంతులు వేస్తున్నట్టు కనిపిస్తున్నది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    అగుపడనట్టి మేరగల
    యాకస మయ్యది బ్రహ్మమే యగున్

    జిగిబిగి మించు బాల రవి
    చె ల్వగు రూపు ధరించు దేవుడౌ...

    నిగనిగ చేప సాధకుడు..
    నింగి రవిన్ గని మొక్కెనో యనన్

    గగనమునందు చేఁప కడు
    గంతులు వేసెను చిత్ర మె ట్లగున్?

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  38. *17-3-18* 2 వ పూరణము:--
    ..........సమస్య
    *"గగనమునందు చేఁప కడు*
    *గంతులు వేసెను చిత్ర మెట్లగున్"*

    *అర్జునుడే గాలవుడు*

    సందర్భము: ద్రౌపది స్వయంవరం. రాజ ఠీవి గల రాజ కుమారు లెందరో ద్రుపద మహారాజు కొలువులో వున్నారు.
    ఆ కొలువే ఒక సరోవరం. కుంతి పుత్రుడైన అర్జునుడు చేపలు పట్టే జాలరి (గాలవుడు). చిరునవ్వుతో అతడు గురి చూచి బాణ మనే గాలం వేసినాడు.
    మత్స్య యంత్రంలో బిగించబడిన చేప నింగిలో గంతులు వేస్తున్నది.
    గాలవుడు= జాలరి
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    అగణిత రాజ ఠీవి గల
    యయ్యల కొ ల్వను నా సరస్సులో

    మొగమున కొత్త న వ్వెదియొ
    మొల్కల నెత్తెడు గాలవుం డనం

    గ గురి కుదిర్చి బాణ మను
    గాలము వేసెను కుంతి పుత్రు డా

    గగనమునందు చేఁప కడు
    గంతులు వేసెను చిత్ర మె ట్లగున్?

    3 వ పూరణము:--

    *స్వయంవర యుద్ధం*

    సందర్భము: ద్రౌపదీ స్వయంవరం. స్వయంవరమే ఒక యుద్ధ మనుకుంటే యెలా వుంటుందో చూదాం! అప్పుడు యుద్ధంలో పార్థు డున్నాడు. పార్థ సారథి యెలాగూ వుంటాడు. ఇక్కడ పార్థునికి శత్రువు చేప.
    పార్థుడు చేపను చూశాడు. తర్వాత నగవు లొలికే పార్థ సారథి ముఖం చూశాడు. ఇక కార్యారంభం చేయొ చ్చనుకున్నాడు. ఎంతో వినమ్రతతో బాణం వేశాడు.
    ఇంక మత్స్యం నింగిలో గంతులు వేయడంలో చిత్ర మే మున్నది?
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    అగణిత వైభవం బగు స్వ
    యంవర యుద్ధమునందు పార్థుడే

    జగములు మెచ్చ చేప యను
    శత్రువు గన్గొని, పార్థ సారథిన్

    నగవులు చింద గన్గొని, వి
    నమ్రతతోడను వేసె బాణమున్...

    గగనమునందు చేఁప కడు
    గంతులు వేసెను, చిత్ర మె ట్లగున్?

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  39. 17.3.18 నా పూరణ పద్యమునకు
    *శ్రీ చిటితోటి విజయకుమార్ గారి సంస్కృత అనువాద శ్లోకమును* గమనింప ప్రార్థన.

    అగణిత బ్రాహ్మ కల్ప ప్రళయమ్మున సంద్రము నింగిజేర, వే
    దగణము నశ్వవక్త్రు డను దానవుడే హరియింప, మత్స్యమై
    పగ నతనిన్ వధించి హరి హర్షము నందిన యట్టి వేళ నా
    *గగనము నందు చేప గడు గంతులు వేసెను. చిత్ర మెట్లగున్ ?*

    బ్రాహ్మాన్తే ప్రళయే మహోగ్రధృతినా పస్పర్శ ఖం సాగరో
    వేదస్తేనమరిం నిహత్య కు-హయగ్రీవం జలేష్వంబుధేః
    యో భద్రం జగతాం హరి ర్విహితవాన్ మీనావతారే తదా
    కల్పాన్తే *గగనే ననర్త జలధౌ మత్స్యః కథం విస్మయః?*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.*

    రిప్లయితొలగించండి
  40. మగటిమి మత్స్య యంత్రమును

    తెగి పడగను నరుడు కొట్ట దిగువకు వేగన్

    తెగ మెచ్చుకొనగ నందరు

    గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్.

    రిప్లయితొలగించండి
  41. సొగసగు మీనరూపముది షోకుగ చంద్రుడు కైటునొక్కటిన్
    నగవుచు నెగ్రవేయగను నందము నొందుచు నిశ్చలమ్ముగా
    జగనుడు గుర్తు రాగనహ జంకుచు చేతులు వణ్కసాగగా
    గగనమునందు చేఁప కడు గంతులు వేసెను చిత్ర మెట్లగున్

    రిప్లయితొలగించండి