గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2637 సమస్య :: *కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్.* కాలికి కాటుక పెట్టుకొన్నది. గజ్జెలు కళ్లకు కట్టుకొన్నది ఒక యువతి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: మా ఇంటికి రా, మా ఇంటికి రా అని అంటూ కృష్ణుని గోపికలు ప్రతిరోజూ పిలిచేవారు. ఈ రోజు మీ ఇంటికి వస్తాను అని కృష్ణుడు ఒక గోపికకు మాట యిచ్చాడు. వెంటనే ఆ గోపిక కృష్ణుడు తన యింటికి వస్తున్నాడు గదా అన్న సంతోషంతో పారవశ్యాన్ని పొంది *నేను గబ గబ తయారుకావాలి* అని అనుకొని తొందరపాటు వలన గాజులను వేలికి తొడుగుకొన్నది. బొట్టును బుగ్గన పెట్టుకొన్నది. కాటుక కాలికి పెట్టుకొన్నది. గజ్జెలు కళ్లకు కట్టుకొన్నది అని విశదీకరించే సందర్భం.
*31-3-18* సమస్య కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్
*నర్తకీ మణి*
సందర్భము: ఒక నర్తకి యే విధంగా ధరించిం దని ఒక బాల మరొక బాలికను అడిగింది వెంట వెంటనే. ఐనా ఆ చిల్లపిల్ల చకచకా తడుముకోకుండా సమాధానం చెప్పింది తన దారిలోనే.. సంభాషణ మెలా సాగిందో చూడండి.
చిన్నపిల్ల క్రమంగానే జవా బిచ్చింది. "కాటుకన్ బులిమి.." అనగానే చెప్పే జవాబును వినకుండానే గజ్జెల విషయం అడిగింది బాల. ఐనప్పటికీ కాటుక పులిమిం దెక్కడనో చెప్పిగాని మరో అంశాన్ని చెప్పా లనుకోలేదు బాలిక. అందుకే "కన్నుల.." అని చెప్పిన తరువాతనే "గజ్జెలు?.." అన్న ప్రశ్నకు "కట్టె వింతగన్ గాలికి" అని తడుముకోకుండా చెప్పింది. అంటే ప్రశ్నించేవాళ్ళు హడావుడి పడుతున్నా చెప్పింది పూర్తిగా వినకుండానే మరో ప్రశ్న సంధిస్తున్నా తాను మాత్రం నింపాదిగా సరిగ్గా జవాబు చెబుతూనే వుంది ఆ చిన్నారి. భేష్! ~~~~~~~~~~~~~~~~~~~~~~~ లీలగ నర్తకీమణి "ధ రించిన దె?" ట్లని వెంట వెంటనే బాల యొకర్తు తా నడిగె.. భాషణ మిట్టిది.. " పూసి లత్తుకన్ గాలికి, కాటుకన్ బులిమి..." "గజ్జెలు?", " కన్నులఁ.. గట్టె వింతగన్ గాలికి"... సక్రమంబుగనె కాదె జవా బిడె చిన్న పిల్లయున్!..
మరొక పూరణము:--
..సమస్య కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్
సందర్భము: ఆ గోపికకు మాధవుని మీద మనస్సు నిలిచి పోయింది. మరలిరా నన్నది. పరధ్యానంలో.. ఏమరుపాటుతో ఆ నర్తకి కాలికి కాటుక పెట్టుకున్నది. కన్నులకు గజ్జెలు కట్టుకోబోయింది. "బేలా! ఇ దేల?" అంటే "నా కేం తెలుసు? ఆ కళాలోలునికే తెలుసు." అన్నది. నేను కేవలం కళాకారిణిని మాత్రమే! ఆ కళను ఏనాడో భగవదర్పితం చేశాను. కళతో ఆనందించేవాడు కృష్ణుడే గనుక అతనికే తెలుసు.. అని ఆమె ఆంతర్యం. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ బాలిక కృష్ణుని మది నిడి,
సందర్భము: ఆ గోపికకు మాధవుని మీద మనస్సు నిలిచి పోయింది. మరలిరా నన్నది. పరధ్యానంలో.. ఏమరుపాటుతో ఆ నర్తకి కాలికి కాటుక పెట్టుకున్నది. కన్నులకు గజ్జెలు కట్టింది. "బేలా! ఇ దేలనే!" అంటే "నా మది గోపాలునిమీదనే నిలిచిపోయింది" అన్నది. "ఇది తగునా!" అంటే "నా కేం తెలుసు? ఆ కళాలోలునికే తెలుసు." అన్నది. నేను కేవలం కళాకారిణిని మాత్రమే! ఆ కళను ఏనాడో భగవదర్పితం చేశాను. కళతో ఆనందించేవాడు కృష్ణుడే గనుక అతనికే తెలుసు.. అని ఆమె ఆంతర్యం. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్ బాలిక.. "యేలనే!" యనగ "పన్నుగ నా మది నిల్చిపోయె గో పాలుని మీదనే!" యనియె.. "పాడియె నీ కిది!" యన్న " నా కళా లోలునికే కదా యెఱుక! లో టెది నా?" కనె.. కృష్ణ చింతనన్..
మరొక పూరణము:--
సందర్భము: లోకంలో వుండే కళ లన్నింటికీ మూలం పరబ్రహ్మమే! ఆనం దాన్వేషణలో నరుడు క్రమంగా కొన్ని దశలు దాటి లలిత కళల నాశ్రయిస్తాడు. ఐహిక సుఖా లన్నిటినీ అవి మరపిస్తాయి. అక్కడే ఆగకుండా క్రమంగా ముందుకు వెళితే ఏ కొద్దిమంది పుణ్యాత్ములకో పరతత్వంలో రుచి దొరుకుతుంది. అందులో ఆనందించడం అలవాటైతే సరసంగా అంతవరకు కనిపించిన కళ లన్నీ నీరసంగా కనిపించడం మొదలు పెడుతాయి. లౌకికము లన్నీ నిస్తేజములుగా కనిపిస్తాయి. పరతత్వ మొక్కటే జగజ్జేగీయమానంగా వెలుగుతూ వుండగా జీవుడు లోకా న్నంతా విస్మరించడం జరుగుతుంది. ఎందుకంటే అనుక్షణం ఆత్మానందంలో మునిగి తేలుతూ వుంటాడు. తానే ఆనంద స్వరూపు డైపోతున్నాడు కాబట్టి ఆనందంకోసం మరొక దాన్ని ఆశ్రయించడం కుదర దప్పుడు. అందుకే గోపిక కాలికి కాటుక పులిమిన దని, కన్నులకు గజ్జెలు కట్టిన దనీ పేర్కొనబడింది. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ మూలము లోకమందు గల భూరి కళావళి కెల్ల బ్రహ్మమే! మేలుగ బ్రహ్మమందున ర మింపగ నేర్చిన వాని కీ కళల్ చా లనిపించు నీరస ద శన్ బ్రకటించును గోప కాంత తాఁ గాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్..
రిప్లయితొలగించండిఅదిగో బ్యాక్ ప్యాక్ మేధా రమణి దేశవిదేశాల తిరుగుచు తేలగిలబడెన్ !
గోల తిరిగె గుండ్రముగా
మేలగు జీవితము కొరకు మేధస్సదియే
తేలగిలబడ మతిమరిచి
కాలికి కాటుక, కనులకు గజ్జెల నుంచెన్!
జిలేబి
ఎందుకండీ పాపం అంతగా తిప్పుతున్నారావిణ్ణీ!?
తొలగించండిఏమయినా..ఇక్కడ సరసపు విఱుపులలో మిమ్ములను మించిన వారు లేరు.
🙏🏻💐
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
తొలగించండిఆహా జిలేబి అనగానే గుండ్రము గానుండును :) కావున గోల గోళాకారము గా తిరుగును !
నెనరుల్స్ సహిత
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివేలిమి బొట్టును పెట్టగ
రిప్లయితొలగించండికాలికి , కాటుక కనులకు , గజ్జెల నుంచెన్
బాలిక సంతస మొందిన
లాలనముగ సద్దు జేసి లాస్యము జేయన్
బాలిక రంగులు వేసెన్
రిప్లయితొలగించండికాలికి,కాటుక కనులకు,గజ్జెలనుంచెన్.
లీలగ నాట్యంబాడగ
మ్రోలను సంగీత వాద్యములు రవళింపన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి(ప్రియుడైన కర్పూరవసంతరాయలు కొమరగిరి ప్రభుని గురించి ఆలోచనాలోచన
తొలగించండిఅయిన రాజనర్తకి లకుమాదేవి)
వాలిన యూర్వశి బోలెడి
యా లకుమయె కొమరగిరి మహాప్రభువరుని
న్నాలోచనల న్నిలుపుచు
కాలికి కాటుక, కనులకు గజ్జెల నుంచెన్.
ఆలియె తా బారాణిని
రిప్లయితొలగించండికాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్
వాలుజడ కుచ్చులకు నవి
మ్రోలుచు నాట్యంబు సేయ మోహమె పుట్టెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిగోలల కెల్ల హైటెకు రగుల్కొన జీవిత మందు బోయెనే
రాలుబడేను ముఖ్యమని రాసి జిలేబియు బెంగుళూరుకున్
వేళకు తిండి లేకయు కవేలము చిక్కుచు సన్నవాఱుచున్
కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్
జిలేబి
పాపం! మరో జిలేబి ఎండమావులలో చిక్కుకు డస్సిపోయింది!! ప్చ్!!!
తొలగించండి😐
తొలగించండిE- జిలేబి అన్న మాట :)
బెంగుళూరు మహానగరే :)
జిలేబి
రిప్లయితొలగించండికం
లోలాక్షి రజిత మువ్వలు
కాలికి,కాటుక కనులకు,గజ్జెలనుంచెన్
మేలుగ కర యుగళములకు,
హాళిగ హారములు కంఠమందు ధరించెన్
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘ వనపర్తి☘
రజత...
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిలీలలు చిత్తసీమ , మురళీస్వరముల్ చెవులన్ , మనోజ్ఞ గో...
పాలుని రూపు దోప కనుపాపల , దన్మయమంది గోపికా
బాల యొకర్తె దాల్చెను విపర్యయరీతిని సర్వభూషలన్
కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిఅద్భుతః
జిలేబి
మనోహరమైన పూరణ!!🙏🙏🙏
తొలగించండిరాడాయనే చెలి గోపాలుడు..
తొలగించండిచూడ చక్కని వాడు తోడూ నీడే వాడు
మైలవరపువారి గోపికాభిసారికా బాల అద్భుతము!
🙏🏻
జిలేబీ గారికి.. సీతాదేవి గారికి... ప్రభాకరులకు ధన్యవాదాలండీ 🙏🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅత్తమీద కోపం...దుత్తమీద.. ( పాతసామెత)
తొలగించండిఅత్తమీద కోపం.. అత్తమీదే... ( కొత్త సామెత )
" *ఏలనొ ? కోడలంచు నను హింసనుబెట్టుచునుండె* , *నా పయిన్*
*జాలియె లేదులేద*" ని విచారమునన్ *కసి బూని* రాతిరిన్
లీలగ నత్త నిద్రగొన , నెమ్మది యందము భగ్నమై జనన్
కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్ !!
(కసి దీర... పాఠాంతరం)
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిఆహా మైలవరపు వారు కూడా జిలేబీయమై పోతున్నారు :)
అదురహో గుండమ్మా :)
జిలేబి
మురళీకృష్ణుల పద్యం చిన్నికృష్ణుని అల్లరిచేష్టలను గుర్తు తెచ్చింది!
తొలగించండిఅత్తారోడళ్ళ జడలు ముడివేయడం, కోడలు మూతికి వెన్న రాయడం ....ఇత్యాది!
చాల బాగుంది! అభినందనలు! 👏👏👏😊😊😊
కోడళ్ళు
తొలగించండిలీలగ నిటలీదేశపు
తొలగించండిబాలిక మన కోడలయ్యె బంధుత్వముచే !
నేలాగుననో తెలియక
కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ధన్యవాదాలండీ శ్రీ విట్టు బాబు గారూ నమోనమః 🙏🙏
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2637
సమస్య :: *కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్.*
కాలికి కాటుక పెట్టుకొన్నది. గజ్జెలు కళ్లకు కట్టుకొన్నది ఒక యువతి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: మా ఇంటికి రా, మా ఇంటికి రా అని అంటూ కృష్ణుని గోపికలు ప్రతిరోజూ పిలిచేవారు. ఈ రోజు మీ ఇంటికి వస్తాను అని కృష్ణుడు ఒక గోపికకు మాట యిచ్చాడు.
వెంటనే ఆ గోపిక కృష్ణుడు తన యింటికి వస్తున్నాడు గదా అన్న సంతోషంతో పారవశ్యాన్ని పొంది *నేను గబ గబ తయారుకావాలి* అని అనుకొని తొందరపాటు వలన గాజులను వేలికి తొడుగుకొన్నది. బొట్టును బుగ్గన పెట్టుకొన్నది. కాటుక కాలికి పెట్టుకొన్నది. గజ్జెలు కళ్లకు కట్టుకొన్నది అని విశదీకరించే సందర్భం.
ఏలగ కృష్ణమూర్తి తన యింటికి వచ్చు నటంచు , గోపికా
బాల సుపారవశ్యమున బాడుచు , తొందరపాటు చేత దా
వేలికి గాజులన్ దొడిగి , వేడుక బొట్టును బెట్టి బుగ్గపై,
*కాలికి కాటుకన్ బులిమి, గజ్జెలు కన్నుల గట్టె వింతగన్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (31-3-2018)
తొలగించండిఅద్భుతః ! కృష్ణ తత్త్వము !
జిలేబి
అద్భుతమైన పూరణ! 🙏🙏🙏
తొలగించండిసహృదయులు
తొలగించండిజిలేబి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కోట రాజశేఖర్.
శ్రీమతి సీతాదేవి గారూ! హృదయపూర్వక ధన్యవాదాలమ్మా.
తొలగించండివాసకసజ్జిక తన్మయత్వం!
తొలగించండిఅద్భుతము కోటావారూ!
🙏🏻💐
నేటి నా సమస్యాపూరణ పద్యానికి *శ్రీ చిటితోటి విజయకుమార్* గారి అనువాదం (సంస్కృత శ్లోకం)
తొలగించండిమాం ధన్యాం కురుతాదిమం మమ గృహం కృష్ణః పునీతం తథా
కిం కుర్యామధునేతి గోపతరుణీ గానే స్థితా తన్మయా
దంగుళ్యాం వలయే సుగన్ధ తిలకం గండస్థలే సంభ్రమాత్
పాదే రంజక కజ్జలం చ విదధౌ నేత్రే సఖీ నూపురాన్.
శ్లోక రచన :: *శ్రీ చిటితోటి విజయకుమార్ కలకత్తా.*
సహృదయులు శ్రీ విట్టు బాబు గారికి హృదయపూర్వక ప్రణామాలు.
తొలగించండిమేలగు చెప్పులు దేనికి?
రిప్లయితొలగించండిలీలగ నేదిడు సొబగును లీలావతికిన్?
కాలికి నర్తకి సొంపుగ
కాలికి; కాటుక కనులకు; గజ్జెల నుంచెన్.
అవధానుల బాటలో 🙏🙏🙏
రిప్లయితొలగించండిసాలంకృతయై వనమున
లీలామోహను గలియగ రేగినకోర్కెన్
దూలుచు మైమరచి యువిద
కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్
మేలము లాడుచు మరదలు
రిప్లయితొలగించండికాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్,
మేలుగ మెట్టిన వదినకు,
గోలగ నలుగురును జేరి గొల్లున నవ్వన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితోలు అగనాళ్ళు వేటికి?
రిప్లయితొలగించండిలోలనయన మోమునకు వెలుగు నిడు నేదో ?
కాలికి నటి యేముంచెన్ ?
"కాలికి, కాటుక కనులకు, గజ్జెల నుంచెన్
మేలౌ లక్ష్మిని జేయుచు
రిప్లయితొలగించండిబాలిక టెంకాయ నొకటి బహురూపిణిగా
వ్రేలికి గాయమ్మవగా
కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్
ఫ్యాషన్! ఫ్యాషన్!! ఫ్యాషన్!!!
రిప్లయితొలగించండికంటికేం ఖర్మ! పొట్టమీద నాలుక మీద ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకుంటున్నారు గజ్జెలు 🤣
లీలలె జూడుమా నవియె లేమల చిత్ర విచిత్ర పోకడల్
చేలపు పీలికల్ సొగసు చిందునటంచు ధరించు రీతులన్
మేలని జెప్పుచున్ తనువు మీదను ముద్రలు వేసుగొంచు నా
"కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్"
లాలనగా నొకతె చెలికి
రిప్లయితొలగించండికాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్
"లీలావతి"మానసిక రు
జాలయ మందున నదేమి యచ్చరువౌనా?
***)(***
{మానసిక రుజాలయము = పిచ్చాసుపత్రి}
మాలిని ధరించి లత్తుక
రిప్లయితొలగించండికాలికి, కాటుక కనులకు, గజ్జెల నుంచెన్
మ్రోలను నటరాజ ప్రతిమ
మేలగు నర్తనము జేయు మిన్నగు కాంక్షన్
మేలుగ పారాణి నలది
రిప్లయితొలగించండికాలికి - కాటుక కనులకు -గజ్జెల నుంచె న్
బాలిక నాట్యము నాడగ
రా లె ను కుసుమాలు మీద రంజిలు భంగి న్
నేటి నా సమస్యాపూరణ పద్యానికి *శ్రీ చిటితోటి విజయకుమార్* గారి అనువాదం (సంస్కృత శ్లోకం)
రిప్లయితొలగించండిమాం ధన్యాం కురుతాదిమం మమ గృహం కృష్ణః పునీతం తథా
కిం కుర్యామధునేతి గోపతరుణీ గానే స్థితా తన్మయా
దంగుళ్యాం వలయే సుగన్ధ తిలకం గండస్థలే సంభ్రమాత్
పాదే రంజక కజ్జలం చ విదధౌ నేత్రే సఖీ నూపురాన్.
శ్లోక రచన :: *శ్రీ చిటితోటి విజయకుమార్ కలకత్తా.*
తొలగించండివామ్మో ! శార్దూలంలో సంస్కృతానువాదం !
జిలేబి
🙏🙏🙏🙏🙏🙏🙏
తొలగించండిబాలిక పారాణి నిడుచు
రిప్లయితొలగించండి"కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్"*
మేలుగ మడమల చెంతన్
తాలయకారునివలెనట తాండవమాడెన్
ఆలియు దాల్చుచు మువ్వలు
కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్
మేలగు వడ్డాణమునకు
లీలగ నాట్యమునుచేయ లీలావతియున్
కేలుకు గాజులు,మట్టెలు
కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్
వాలుజడలోన ముదిత
పూలను దాల్చి తలపైన భూషణముంచెన్
కందం
రిప్లయితొలగించండిబాలిక కరమాన్చుచు మో
కాలికి, కాటుక కనులకు, గజ్జెల నుంచెన్
వాలుగఁ గూర్చొని కాళ్లకు,
పూలను దలఁ దురిమె 'బాపు బొమ్మ' యనంగ!
లోలాక్షి నిదుర నుండగ
రిప్లయితొలగించండిలీలామానుషుడగుహరి ప్రేముడితోడన్
చేలముల తొలుగ జేయుచు
కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిఆలము నల్ల భాగ్యపపహాస్యము కై తగు చర్య గైకొనన్
బాలముకుందునట్లు ప్రతిభన్ గనబర్చ విదేశ దేశపుం
చేలము మార్చి బర్యటన జేసిన తత్పరతన్ గనంగ తా
కాలికి కాటుకం బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిబాలుని గ్రమపుటలంకా
రాలను జొప్పించ గురువు;"రాయడు"(శిష్యుడు)బల్కెన్
"మేలగు నక్రమ మరయన్-
"కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్"
(గురువుగారు, అక్రమాలంకారము ఉండదని తెలుప వలసి యుండెను.తరగతిలో'క్రమాలంకారమునకు ఉదాహరణలు యిచ్చిన తరువాత జరిగిన సన్నివేశము)
మ్రోలను జేరి సరాగము
రిప్లయితొలగించండిహేలా లీలా వినోదియె ప్రమోదముగం
జూలాలికిఁ దా నాలికిఁ
గాలికి, కాటుక కనులకు, గజ్జెల నుంచెన్
వాలుగ కంటి మానవతి పాటలగంధి మనోధి నాథుఁడే
శీలుఁడు నాదు మిత్రుఁడును జెప్పెద నాతని ప్రేమ గాధ నీ
కాలికి కాటుకం బులిమి గజ్జెలు కన్నులఁ గట్టె వింతగన్
వీలుగఁ బాద యుగ్మమున వేనలి పైనను గారవమ్మునన్
[నీకు+ఆలికి =నీకాలికి; కన్ను = నెమలి పురి కన్ను]
మేలుగ పారాణిని తన
రిప్లయితొలగించండికాలికి, కాటుక కనులకు, గజ్జెల నుంచెన్
ౙాలుగ, జూడగ లీలగ
బోలుచు నటరాజు భంగి పొసగి నటించెన్!
లీలల జూపగన్ భువికి శ్రీపతి వచ్చెను కృష్ణు రూపుడై
రిప్లయితొలగించండిపాలను వెన్నలన్ గొనుచు వల్లవ కాంతల తోచరించుచున్
శాలలలోన నిద్రగొను చక్కని భామల, నవ్వులాటకై,
కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్
ఉత్పలమాల
రిప్లయితొలగించండితాళగ లేక రుక్మిణికి దక్కెను పారిజమంచు కుందుచున్
వాలఁగ శయ్యపై నలిగి భామిని, కృష్ణు శిరంబు తాకఁగన్
గాలికి, కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగ
న్నాలియటంచు సత్య నయనాళి వినంబడె యశ్రు గర్జనల్!
(అన్వయము సరియేనా అన్న విషయము బుధజనులు పరిశీలించి తెలియజేయ ప్రార్థన)
నీలిమ” కమ్మబొమ్మగొన?నిత్యసుఖాలను బంచుయమ్మలా|
రిప్లయితొలగించండిజాలిగాముద్దులున్ నిడుచు చక్కటి రూపును మార్చనెంచియున్
కాలికి కాటుకన్ బులిమి గజ్జెలుకన్నులగట్టె వింతగా
మాలిని నవ్వగా?దెలసి మామకు జూపెను మౌన భాషతో|
రిప్లయితొలగించండికాలము సానుకూలమయి కర్షక జీవులు కాడిపట్టగా
చేలవి గాలికూగుచును చిక్కని కంకుల
భారమవ్వగా
తేలుచు సంబరం బునను దీరుగ
రైతులు యెడ్లబండికిన్
కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్!
బండి కాలు= చక్రము
కన్ను = బండి చక్రము
కాటుక = కందెన
చక్రమునకు మధ్యలో నల్లని కందెన రాసి గజ్జెలు కడతారు!
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండినేలను నున్న మట్టిఁ దిని, నెమ్మదిగా నడయాడు తమ్ముఁ డా
మ్రోలను నాడుచుండఁ గని రోహిణి సూతి యశోదఁ జేరియున్
మాలిమిఁ దెల్పఁగా, హరి యమాయకునట్లు నటింప నేడ్చుచున్
గాలికిఁ గాటుకన్ బులిమి, గజ్జెలు కన్నులఁ గట్టె వింతగన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపై పూరణమునకే కొన్ని సవరణములు చేసి, మఱలఁ బ్రకటించుచుంటిని:
తొలగించండినేలను నున్న మట్టిఁ దిని, నెమ్మదిగా నడయాడి, కృష్ణుఁ డా
మ్రోలను నాడుచుండఁ, గని రోహిణి సూతి, యశోదఁ జేరియున్,
మాలిమిఁ దెల్పఁగా, హరి యమాయకునట్లు భ్రమింప నేడ్చుచున్,
గాలికిఁ గాటుకన్ బులిమి, గజ్జెలు కన్నులఁ గట్టె వింతగన్!
లీలలు జెప్పగా తరమ,రీతి రివాజులు మారెగా, సినీ
రిప్లయితొలగించండిమాలవి సాంప్రదాయముల మట్టిని గల్పగ నేడు ముగ్ధలే
వేలము వెఱ్ఱిగా తమదు వేషము మార్చిరి వింతరీతులన్
*కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
[ప్రియునిఁ జేర నువ్విళులూరుచున్నట్టి మాలతియను నొక ప్రియురాలి కృత్యము]
రిప్లయితొలగించండి(2)
మాలతి యిడె నూనియ లల
కాలికిఁ, గాటుకఁ గనులకు; గజ్జెల నుంచెన్
గాలికి; విరహమ్మోపం
జాలక ప్రియ సంగమేచ్ఛఁ జనె సన్నిధికిన్!
మేలుగ నిడె పారాణిని
రిప్లయితొలగించండికాలికి, కాటుక కనులకు, గజ్జెల నుంచె
న్నాలి పదములకు, మానిని
నీలి కురులకు విరజాజి నిక్కుల తొడిగెన్!
*31-3-18* సమస్య
రిప్లయితొలగించండికాలికి కాటుకన్ బులిమి
గజ్జెలు కన్నుల గట్టె వింతగన్
*నర్తకీ మణి*
సందర్భము: ఒక నర్తకి యే విధంగా ధరించిం దని ఒక బాల మరొక బాలికను అడిగింది వెంట వెంటనే. ఐనా ఆ చిల్లపిల్ల చకచకా తడుముకోకుండా సమాధానం చెప్పింది తన దారిలోనే.. సంభాషణ మెలా సాగిందో చూడండి.
"పూసి లత్తుకన్ గాలికి, కాటుకన్ బులిమి..."
"గజ్జెలు?"
" కన్నులఁ.. గట్టె వింతగన్ గాలికి"
చిన్నపిల్ల క్రమంగానే జవా బిచ్చింది. "కాటుకన్ బులిమి.." అనగానే చెప్పే జవాబును వినకుండానే గజ్జెల విషయం అడిగింది బాల. ఐనప్పటికీ కాటుక పులిమిం దెక్కడనో చెప్పిగాని మరో అంశాన్ని చెప్పా లనుకోలేదు బాలిక. అందుకే "కన్నుల.." అని చెప్పిన తరువాతనే "గజ్జెలు?.." అన్న ప్రశ్నకు "కట్టె వింతగన్ గాలికి" అని తడుముకోకుండా చెప్పింది.
అంటే ప్రశ్నించేవాళ్ళు హడావుడి పడుతున్నా చెప్పింది పూర్తిగా వినకుండానే మరో ప్రశ్న సంధిస్తున్నా తాను మాత్రం నింపాదిగా సరిగ్గా జవాబు చెబుతూనే వుంది ఆ చిన్నారి. భేష్!
~~~~~~~~~~~~~~~~~~~~~~~
లీలగ నర్తకీమణి "ధ
రించిన దె?" ట్లని వెంట వెంటనే
బాల యొకర్తు తా నడిగె..
భాషణ మిట్టిది.. " పూసి లత్తుకన్
గాలికి, కాటుకన్ బులిమి..."
"గజ్జెలు?", " కన్నులఁ.. గట్టె వింతగన్
గాలికి"... సక్రమంబుగనె
కాదె జవా బిడె చిన్న పిల్లయున్!..
మరొక పూరణము:--
..సమస్య
కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్
సందర్భము: ఆ గోపికకు మాధవుని మీద మనస్సు నిలిచి పోయింది. మరలిరా నన్నది. పరధ్యానంలో.. ఏమరుపాటుతో ఆ నర్తకి కాలికి కాటుక పెట్టుకున్నది. కన్నులకు గజ్జెలు కట్టుకోబోయింది.
"బేలా! ఇ దేల?" అంటే "నా కేం తెలుసు? ఆ కళాలోలునికే తెలుసు." అన్నది. నేను కేవలం కళాకారిణిని మాత్రమే! ఆ కళను ఏనాడో భగవదర్పితం చేశాను. కళతో ఆనందించేవాడు కృష్ణుడే గనుక అతనికే తెలుసు.. అని ఆమె ఆంతర్యం.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
బాలిక కృష్ణుని మది నిడి,
*కాలికి కాటుక, కనులకు గజ్జెల నుంచెన్..*
"బేలా! యేల?" యన "కళా
లోలునికే యెఱుక!" యనియె లోలాక్షి వెసన్..
31-3-18...సమస్య
రిప్లయితొలగించండికాలికి కాటుకన్ బులిమి
గజ్జెలు కన్నుల గట్టె వింతగన్
సందర్భము: ఆ గోపికకు మాధవుని మీద మనస్సు నిలిచి పోయింది. మరలిరా నన్నది. పరధ్యానంలో.. ఏమరుపాటుతో ఆ నర్తకి కాలికి కాటుక పెట్టుకున్నది. కన్నులకు గజ్జెలు కట్టింది.
"బేలా! ఇ దేలనే!" అంటే "నా మది గోపాలునిమీదనే నిలిచిపోయింది" అన్నది.
"ఇది తగునా!" అంటే "నా కేం తెలుసు? ఆ కళాలోలునికే తెలుసు." అన్నది.
నేను కేవలం కళాకారిణిని మాత్రమే! ఆ కళను ఏనాడో భగవదర్పితం చేశాను. కళతో ఆనందించేవాడు కృష్ణుడే గనుక అతనికే తెలుసు.. అని ఆమె ఆంతర్యం.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
కాలికి కాటుకన్ బులిమి
గజ్జెలు కన్నుల గట్టె వింతగన్
బాలిక.. "యేలనే!" యనగ
"పన్నుగ నా మది నిల్చిపోయె గో
పాలుని మీదనే!" యనియె..
"పాడియె నీ కిది!" యన్న " నా కళా
లోలునికే కదా యెఱుక!
లో టెది నా?" కనె.. కృష్ణ చింతనన్..
మరొక పూరణము:--
సందర్భము: లోకంలో వుండే కళ లన్నింటికీ మూలం పరబ్రహ్మమే! ఆనం దాన్వేషణలో నరుడు క్రమంగా కొన్ని దశలు దాటి లలిత కళల నాశ్రయిస్తాడు. ఐహిక సుఖా లన్నిటినీ అవి మరపిస్తాయి.
అక్కడే ఆగకుండా క్రమంగా ముందుకు వెళితే ఏ కొద్దిమంది పుణ్యాత్ములకో పరతత్వంలో రుచి దొరుకుతుంది. అందులో ఆనందించడం అలవాటైతే సరసంగా అంతవరకు కనిపించిన కళ లన్నీ నీరసంగా కనిపించడం మొదలు పెడుతాయి. లౌకికము లన్నీ నిస్తేజములుగా కనిపిస్తాయి. పరతత్వ మొక్కటే జగజ్జేగీయమానంగా వెలుగుతూ వుండగా జీవుడు లోకా న్నంతా విస్మరించడం జరుగుతుంది.
ఎందుకంటే అనుక్షణం ఆత్మానందంలో మునిగి తేలుతూ వుంటాడు. తానే ఆనంద స్వరూపు డైపోతున్నాడు కాబట్టి ఆనందంకోసం మరొక దాన్ని ఆశ్రయించడం కుదర దప్పుడు.
అందుకే గోపిక కాలికి కాటుక పులిమిన దని, కన్నులకు గజ్జెలు కట్టిన దనీ పేర్కొనబడింది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
మూలము లోకమందు గల
భూరి కళావళి కెల్ల బ్రహ్మమే!
మేలుగ బ్రహ్మమందున ర
మింపగ నేర్చిన వాని కీ కళల్
చా లనిపించు నీరస ద
శన్ బ్రకటించును గోప కాంత తాఁ
గాలికి కాటుకన్ బులిమి
గజ్జెలు కన్నుల గట్టె వింతగన్..
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
మేలగు కన్నియన్ వలచి మెచ్చుచు దెచ్చుచు రోమునుండి తా
రిప్లయితొలగించండికూలుగ హస్తినాపురికి కోడలి వంచును తల్లిజూపుచున్
బాలుడు భారతీయతను వందన మిమ్మన పోపులమ్మ తా
కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్