3, మార్చి 2018, శనివారం

సమస్య - 2614 (రామా నీ వలనన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్"
(లేదా...)
"రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్"
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

64 కామెంట్‌లు:


 1. భామ జిలేబి విడువదయ !
  జాము పొడువక మునుపే సజావుగ వేయు
  న్తా మారు పద్యములనయ !
  రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. కామము క్రోధము మోహము
  ప్రేమలు భక్తియు విముక్తి ప్రేరేపణలున్
  నీ మూలమునే! తారక
  రామా! నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్!

  రిప్లయితొలగించండి
 3. ఏమా వింతిది వినుటకు
  శ్యామాం గుడు సౌమ్యుడంట శంభుడె కాడా
  భామినుల పలుకు లందున
  రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్

  రిప్లయితొలగించండి
 4. హా!మా యీ పుట్టుకలిట
  కామా, లేకుండ కలుగ కారణ మీవే
  ప్రేమన్ జూపగ లేవా
  రామా! నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 5. రావణుడు రాముని బాణముచే కూలిన పిదప పశ్చాత్తాపమున పలికిన పలుకులుగా

  కాముకుడనై సుదతియౌ
  భామను తెచ్చితిని నాడు పాపాత్ముడనే
  యేమని చెప్పుదు నిప్పుడు
  రామా! నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్

  రిప్లయితొలగించండి 6. నీ మూర్తిన్ మది లోన నిల్పితినయా నీమమ్ము నే తప్పకన్
  భాముండున్ పొడు వంగ లేదయ సభాప్రాంగమ్ము లోపద్యముల్,
  నామానాన భజించి గట్టితిని తన్మాత్రమ్ములన్వేయుచున్
  రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్ !

  హరి ఓం తత్సత్

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నామానాన...
   గురువుగారికి కోపమొస్తుంది :-))

   తొలగించండి

  2. అబ్బే ! రాదనుకుంటా :)

   మానా - విద్యార్థులకు వ్రాత కుదురుటకై వ్రాయు ఒజ్జబంతి.

   జిలేబి

   తొలగించండి
  3. ఏమూర్తమ్మున జేరితిన్నిచటహా! యేమాఱి గోముంగ నే
   నేమాత్రమ్మెరుగంగలేను విరుపుల్ నేనీ జిలేబీయముల్ :)
   నీ మూలమ్ముననే సమస్యనిటుల న్నీరీతి పూరించితిన్...
   రామా! నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్!

   తొలగించండి

  4. బ్రాహ్మీమూర్తఫలమ్మిదే కవివరా పద్యమ్ము పారున్ భళీ !


   ఇవ్వాళ్టి ఆకాశవాణి విశేషాలేమిటండి జీపీయెస్ వారు ?


   జిలేబి

   తొలగించండి
  5. చాలా శంకరాభరణ కవుల పేర్లూ పద్యములూ విన్నామని విన్నాను. మీ పేరూ, సీతాదేవి పేరూ, రాజేశ్వరి నేదునూరి గారి పేరూ విన్నారట. నా పేరు లేదుట :(

   *****************************

   "వచ్చెనుగాది పర్వమిల భాద్రపదాన చిగుళ్ళు వేయగన్"

   (నేడిచ్చిన ఆకాశవాణి హైదరాబాద్ వారి సమస్య)

   తొలగించండి


  6. ->>>మీ పేరూ, సీతాదేవి పేరూ, రాజేశ్వరి నేదునూరి గారి పేరూ విన్నారట

   The Amazons of Shankarabharana :)

   జిలేబి

   తొలగించండి


  7. ఇచ్చిరిగా జిలేబి సయి మెచ్చెడు రీతిని కైపదమ్ముగా
   నచ్చెరు విద్ది తారలట నాకస మందున బారుగానగన్
   తచ్చన కాదు సూవె మజ తంత్రము కాదు భళారె చిత్రమై
   వచ్చె నుగాది పర్వమిల, "భాద్రపదా" న చిగుళ్ళు వేయగన్!   *భాద్రపదా - పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర
   ఉగాది ఉత్తరాభాద్ర లో వస్తోంది


   జిలేబి

   తొలగించండి
  8. అందరి పూరణలలరిస్తున్నవి.🌹🙏🙏🌹

   తొలగించండి
  9. డా.పిట్టాసత్యనారాయణ
   పచ్చని గడ్డితో దొలుత బార్వతి పుత్రు గణేశు పూజలో
   నచ్చపు విద్యకే గణన లందగ జేయ వసంత సంతయే
   హెచ్చునె సర్వ సంపదల హేళన జేసెడి జ్ఞాని కైవడిన్
   వచ్చె నుగాది పర్వమిల భాద్రపదాన చిగుళ్ళు వేయగన్

   తొలగించండి
 7. కోమల భక్తి ని గల్గియు
  నీ మము తో మందిర మును నిర్మించి తి నే
  పామరు డైచెర నుంటి ని
  రామా ! నీచే ఘ టి ల్ల్లే ప్రారబ్ధం బు ల్

  రిప్లయితొలగించండి
 8. మైలవరపు వారి పూరణ

  సుగ్రీవుడు...

  నా మానమ్మున దుఃఖమందుచు వనాంతస్సీమ నేనుండగా
  నీ మైత్రిన్ గని , నీవె రక్ష యని నేనేమేమొ భావించితిన్
  రామా ! నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్ ,
  బూ మాలన్ ధరియింతు నన్ రణమునన్ బోల్చంగ శక్యమ్మగున్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 9. పామరుడనె తప్పి తెలివి
  భామను పంపితి వడవికి బాధ్యత యనుచున్
  ఏమా ధర్మపు సూక్ష్మము
  "రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్"

  రిప్లయితొలగించండి
 10. మారీచ ఉవాచ:
  రామా! నీ బాణపటిమ
  తామసమున విస్మరించి తగుదుననుచునే
  లేమను భ్రమియింపగొనగ
  రామా! నీచే ఘటిల్లె ప్రారబ్ధంబుల్!

  రిప్లయితొలగించండి
 11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2614
  సమస్య :: *రామా! నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్.*
  ఓ శ్రీ రామా! నీ వలన నాకు ప్రారబ్ధములు (నా కర్మ ఫలితాలు) కలిగినాయి కదా అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  ప్రారబ్ధములు అంటే గత జన్మలో మనం చేసిన మంచి చెడు పనులకు సంబంధించి ఈ జన్మలో అనుభవింపబడే సుఖ దుఃఖాలు అని చెప్పవచ్చు. గొప్పగా ఆరంభించబడిన పనులు అని కూడా చెప్పుకోవచ్చు.
  భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచెర్ల గోపన్న శ్రీ రామునితో ఓ రామా! నేను మహాత్ములైన కామాంబకు లింగన మంత్రికి కుమారుడుగా జన్మించాను. కమల అనే సాధ్విని వివాహ మాడినాను. రఘునాథ భట్టు గారికి శిష్యుడనైనాను. నీకు దాసుడనై రామదాసు అని పేరు పొందినాను. ఈ భద్రాచలంలో నీ కోసం గుడి కట్టినాను. నా యోగ క్షేమాలు చూస్తావని నీ పాదాలను పట్టుకొని నీకు సేవ చేస్తున్నాను. నీ మీద కీర్తనలు వ్రాసినాను. నీ పేర దాశరథీ శతకాన్ని రచించినాను. ఐతే ఆశ్చర్యం కలిగే విధంగా నాకు ఇప్పుడు జైలుశిక్ష వేసి నీవు నన్ను బాధపెడుతూ ఉన్నావు. నీ వల్లనే నాకు ఈ సుఖ దుఃఖాలు ఏర్పడ్డాయి అని దీనంగా మొఱ పెట్టుకొనే సందర్భం.

  కామాంబాఖ్యకు లింగమంత్రికిని నే కంచెర్ల గోపన్నగా
  భూమిన్ బుట్టితి, పత్నిగా కమల నన్ బూజింపగా, సద్గుణ
  స్తోముండౌ రఘునాథ భట్టునకు శిష్యుం డన్న పేరందితిన్,
  నేమంబొప్పగ రామదాసుగ గుడిన్ నీ కోసమే కట్టితిన్,
  క్షేమ మ్మందగ నీదు పాద యుగమున్ సేవింప చేపట్టితిన్,
  స్వామీ ! కీర్తన లెన్నొ వ్రాసి, శతకం బందించితిన్ భక్తితో,
  నే మాశ్చర్యము ! జైలుశిక్ష నిడి న న్నీరీతి బాధింతువా ?
  *రామా ! నీ వలనన్ ఘటిల్లెను గదా! ప్రారబ్ధముల్ నేటికిన్.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (3-3-2018)

  రిప్లయితొలగించండి
 12. మేమెరుగము నీలీలలు
  కామితముల దీర్చి మరల కరుణింపంగ
  న్నేమో మఱి కల్పింతువు
  "రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్"

  రిప్లయితొలగించండి
 13. భూమ మదికముగ గలిగెను
  రామా నీచే, ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్
  యేమరు పాటున నీకున్
  నీమము తో బూజ మరువ నిశ్చల మందున్

  రిప్లయితొలగించండి
 14. కామా? నీపద దాసుల
  మీమా?నీవేమడిగిన నిష్టము తోడ
  న్నేమీ వెతలివి మాకును?
  "రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్"

  రిప్లయితొలగించండి
 15. నా మానమ్మున నేను పోక నెదియో నా భక్తియన్ చిట్టులన్
  నీ మేనిన్ మరి నీదు ధర్మసతి మేనిన్ భూషణాల్ దించితిన్
  నా మేనంతయు దెబ్బలన్ నవసెగా నన్ గావగా లేని ఓ
  రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్
  (రామదాసు గారు తానీషా చెరలో దెబ్బలు భరించ లేక రాముణ్ని ఇలా దెప్పి పొడవటం మనకు తెలిసినదే )

  రిప్లయితొలగించండి


 16. ఏ మాత్రము నే చెప్పను
  రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ము
  ల్లీ మానుష జన్మాదిగ
  తామసి గా నిను తెలియని తనమదియె సుమా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. ఏమో ఋణమును దీర్చగ
  నీ మానవ జన్మ నేనదెత్తితి నయ్యా!
  నీమాయలె సకలమ్మును
  "రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్"
  ****)()(****
  ఋణాను బంధ రూపేణ పశుపత్నీ సుతాలయ౹
  ఋణ క్షయే క్షయం యాంతి కా తత్ర పరివేదనా౹౹

  రిప్లయితొలగించండి


 18. కామాంధుండయి రావణుండవనిజన్ కార్కశ్యమున్జూపుచున్
  నీమంబున్విడియోగిరూపమున తానేమార్చి గొంపోయె నీ
  వా మారీచుని లేడిగాను తరుమన్ వాపోవ హా లక్ష్మణా!
  రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. స్వాములకు సేవ యనుచునె
  మామూకను రక్కసులని మంట గలిపితే !
  నీ మూలమున గదా వని ?
  రామా ! నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  తల్లి ధరణికిన్ పతియై
  ముల్లోకుల గాచు హరియె, ముని శిష్యుండై
  మెల్లగ సీతకు భర్తయె
  నల్లుఁడు మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే

  రిప్లయితొలగించండి
 20. శ్రీరామునకు వనవాసం, భరతునకు పట్టాభిషేకం చేయఁ గోరిన కైకేయి తో దశరధ మహరాజు :

  శార్దూలవిక్రీడితము

  భామా! నీవిడు సాయమంద ననిలోప్రాప్తించె సంపత్తి! యా
  హోమమ్మున్ సఫలమ్ము జేయ నిల వంశోద్ధారకుల్ గల్గిరే !
  రామున్ కానల కంప కైక! తగునే ప్రాణాలఁ దీయంగ మా
  రామా! నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్! !

  రిప్లయితొలగించండి
 21. క్షేమంబౌ మృదు జీవనమ్ము గొనుచున్ జిష్ణున్నుపాసించుచున్
  సామమ్మౌ దిశలోన నింత దనుకన్ సంతోషమున్ బొందితిన్
  నీమార్గమ్మున జేరి నా రమణయున్ నీల్గంగ పణ్యాంగనా
  రామా! నీవలనన్ ఘటిల్లెను కదా ప్రారబ్ధముల్ నేటికిన్

  రిప్లయితొలగించండి
 22. నే మోసముతో వర్తిలి
  భూమిజఁ గొంపోయి యామె పొందును గొన నా
  రామముననుంచి పోరితి
  రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్

  రిప్లయితొలగించండి
 23. భీమావేశము సూపగ
  గ్రామం బందునఁ జెడితిమి కన్నా పుత్రా
  యేమని చెప్పుదు నయ్యో
  రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్


  బ్రహ్మర్షి విశ్వామిత్రుఁడు రామునితో నన్న మాటలు:


  ఏ మాత్రమ్మును దోష ముండ దిట రాజేంద్రాత్మజా ధర్మమే
  లేమం జంపఁగ నాదు వాక్యమున విశ్లేషించి యీ తాటకన్
  భామా హత్య పురస్సరమ్ముగను సంభావ్యంపు దైత్యాంతముల్
  రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్

  [ ప్రారబ్ధములు = ప్రారంభింపఁబడినవి]

  రిప్లయితొలగించండి
 24. ప్రేమను గట్టితి నాలయ
  మేమియు నిక జాలి లేద ?యీనా పైన
  న్నేమీ యిడుమలు సెప్పుమ !
  రామా ! నీచే ఘటిల్లె ప్రార భ్ధమ్ముల్


  రిప్లయితొలగించండి
 25. కోమా రాతిని నాతిగ
  సామాన్యుడు రామచంద్ర చైతన్యముకున్
  ధీమాగా నహల్యనె
  రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్ !

  రిప్లయితొలగించండి
 26. "అండజానిచ జారుజానిచ స్వేదజానిచోద్భిజ్జానిచ అశ్వ గావః పురుషా హస్తినో యత్కించేదం ప్రాణి జంగమంచ పతత్రిచ యచ్చ స్థావరం సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానేత్రో లోకః ప్రజ్ఞా ప్రతిష్ఠా ప్రజ్ఞానం బ్రహ్మ"


  సరదా సరదాకు సీరియస్ గా (తప్పులు తడికెలతో సద్బుద్ధితో వ్యావహారిక భాషలో)

  ఇచ్చట "రామ" శబ్దం అవతార పురుషుడైన "ప్రకృతి" గా భావించ మనవి...

  *******************************

  చీమల్ దోమలు తేనెటీగ క్రిములున్ చేమంతి పూబంతులున్
  పాముల్ కోతులు సింహమేనుగులిటన్ భల్లూక భేలమ్ములున్
  భామల్ ప్రేమికులన్ చిదాత్మ ఘనియౌ ప్రజ్ఞాన బ్రహ్మమ్మునన్
  రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్!

  రిప్లయితొలగించండి
 27. స్వామీ !మదినిను దలచుచు
  నీమముతో నీకు గుడిని నిలిపితి ధరలో
  యేమని వచింతు? దశరథ
  రామా! నీచేఘటిల్లె ప్రారబ్ధమ్ముల్!!!

  రిప్లయితొలగించండి
 28. కందం
  ఈ ముదిమిని కానలలో
  నేమరకనె వేచితి! నిక యిన్నాళ్లకు నీ
  దౌ మోముగనె శబరి, శ్రీ
  రామా! నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్!

  రిప్లయితొలగించండి
 29. [03/03, 06:44] Nvn Chary: రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్"

  (లేదా...)

  "రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్"
  [03/03, 08:52] Nvn Chary: కామాదుల్ నశియించుచుండు మదిలో కల్గంగ సద్భావముల్
  రామా నీ వలనన్; ఘటిల్లెనుగదా ప్రారబ్ధముల్ నేటికిన్,
  మా మా పూర్వపు మంచి చెడ్డ ఫలముల్ , మాకున్ !దయాసాగరా!!
  రా !మా పంకిలముల్ తొలంగు నటులన్ రామా! సదా కావరా !!

  రిప్లయితొలగించండి
 30. ఏమాయె న్నలనాటి బాస లకటా ఏమాయె మా సొమ్ములున్
  కామా ఆంధ్రులమైన మేము తమకున్ కాదందురా బంధమున్
  ఓ మోదీ హితుడైన చంద్రుడ గదా యొక్కింత నన్ జూడ మా
  రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్.

  రిప్లయితొలగించండి
 31. ఏమాత్రము నేఁ జెప్పిన
  యేమాటయు వినవు తెత్తువీసంకటముల్
  శ్రీమతి వినవే యయ్యో
  రామా! నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్

  రిప్లయితొలగించండి


 32. అందరి పూరణలలరి
  స్తోందండి కవివరులార ! శోభస్కరమై
  డెందంబానందంబును
  సందోహంబున బడసెను చక్కగ సుమ్మీ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 33. ఏమాత్రము వెనుదీయక
  నీమముగాజేయుదపము, నీరుగజేతున్!
  ఆమారు యత్న మిదయ్యో!
  రామా, నీచే ఘటిల్లె బ్రారబ్ధముల్!

  ఓమాఱు చేసిచూసెద
  కామారి తపమునెట్లు ఘాతముజేతున్!!
  ఒ మార మిదిమాను, మయ్యో
  రామా, నీచే ఘటిల్లె బ్రారబ్ధముల్!
  రిప్లయితొలగించండి
 34. రామానీచే ఘటిల్లె బ్రారబ్ధమ్ముల్

  సమస్యనుటంకించుటలో
  పొరబడితిని
  సవరణ

  రిప్లయితొలగించండి
 35. రామా నిన్నే కొలిచితి
  యేమా యెనునీదు ప్రేమ యేమరు పాటున్
  నామా టపెడచె వినిడిన
  రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్

  రిప్లయితొలగించండి
 36. కామిత సుఖముల్ శ్రీరఘు
  రామా! నీచే ఘటిల్లె ; ప్రారబ్ధమ్ముల్ నామది నేమరి జేసితి పామరుడను పూర్వజన్మ ఫలితమ్మేగా !

  రిప్లయితొలగించండి

 37. ..........సమస్య
  రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్

  సందర్భము: భరతు డొక గొప్ప రాజు. ఎంతో కాలం పాలించి అరణ్యాని కేగి తపస్సు కొనసాగించాడు. శ్రీ హరి భక్తుడై నాడు. జడ భరతు డని పేరందినాడు.తల్లి చనిపోయిన ఒక లేడి పిల్లను తెచ్చి పెంచుకుంటూ విపరీతమైన మోహంలో పడిపోయినాడు. మరణ సమయంలోను దానినే తలచుకుంటూ కన్ను మూశాడు. మళ్ళీ జన్మలో లేడిగా పుట్టాడు. పుణ్యంవల్ల పూర్వ జ్ఞానం కలిగి బాధా తప్త హృదయంతో లేడి నుద్దేశించి ఇలా అంటున్నాడు.

  రామ= పెద్ద దుప్పి
  వామాక్షి=అందమైన కన్నులు కలది
  ~~~~~~~~
  వామాక్షి లేడి సొబగున
  కా ముని మోహపడి లేడియై పుట్టి యనెన్
  ధీమంతుడు జడ భరతుడు..
  "రామా! నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్"

  .........సమస్య
  రామా నీ వలనన్ ఘటిల్లెను గదా
  ప్రారబ్ధముల్ నేటికిన్

  సందర్భము: శ్రీ రామ చంద్ర మూర్తి కారాగారంనుండి విముక్తుడైన రామదాసుతో యిలా అంటున్నాడు...
  "నీవల్లనే యీ ప్రారబ్ధా లన్నీ కలుగుతున్నాయి రామా!" అంటావే! ప్రారబ్ధాలను నశింపజేసే వాడినే గాని కలిగించే వాడిని కాదు గదా!
  పిచ్చివాడా! నాకు ప్రత్యేకంగా మీ మీద కోపం యెందు కుంటుంది? నీ కీ మర్యాదలు ( జైలు శిక్షలు మొదలైనవి) నీ వింతకు ముందు చేసుకున్న పాప ఫలాలు. అవి యిప్పుడు అనుభవానికి వచ్చినవి. ఈ రోజుతో తీరిపోయినవి. కాబట్టి సంతోషించు. మళ్ళీ నీకు జన్మ అనేది లేదు.
  (పాపకర్మ చేసుకుంటే మరో జన్మ వుంటుంది గాని వున్న దుష్కృతం నశించిపోతే యెందు కుంటుంది?)
  బాకీ తీరిపోయింది. ఇది సంతోషం. మళ్ళీ బాకీ యెట్లాగూ చేయవు. ఇంకా సంతోషమే!"
  ~~~~~~~~
  "రామా! నీ వలనన్ ఘటిల్లెను గదా
  ప్రారబ్ధముల్ నేటికిన్..
  స్వామీ!" యందువె! పిచ్చివాడ! నశియిం
  పన్ జేయుదున్ గాని, నే
  నే మీకున్ గలిగింతునే! కినుక నా
  కే లుండు మీ మీద? నీ
  కీ మర్యాదలు పూర్వ దుష్కృతఫలా,
  లీ నాటికిన్ దీరె; నీ
  కీ మీదన్ మరి జన్మ యెక్కడిది? బా
  కీ తీరిపోయెన్ జుమీ!"

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  3.3.18
  ---------------

  రిప్లయితొలగించండి
 38. నేమముతో నిను గొల్చితి
  నేమరపాటదియు లేక నిశ్చల మతితో
  తామసమదిహెచ్చినదో
  రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్.

  నామము లనుచేయించితి
  కోమలమగుతొడవులుంచి కూరిమి తోడన్
  నేమురిసితినోరామా
  రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్.

  కామితము లెల్ల దీరెను
  రామా నీచే .ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్.
  నామునుపటి కాంక్షలు మరి
  నామూర్ఖపు నిర్ణయములు నన్నిటు ముంచెన్.

  రిప్లయితొలగించండి
 39. డా.పిట్టాసత్యనారాయణ
  కామార్తుండొకడన్న మాట ఋజువే?కారాదు శాస్త్రంబుగా
  లేమల్ కన్నెలె? విద్యలందరె యిలన్?లేబ్రారయపుం పొందులే?
  ఏమా ధర్మము?సీత క్రుంగె ధరలో,యిప్పట్టునన్ స్త్రీలకే
  రామా నీ వలనన్ ఘటిల్లెనుగదా ప్రారబ్దముల్ నేటికిన్!

  రిప్లయితొలగించండి
 40. డా.పిట్టాసత్యనారాయణ
  లేమా! నీ పుట్టుకనున్
  కామాతుర వగుదొ, లేదొ కలయో నిజమో?
  భూమీశుని పతి సీతకు
  రామా! నీచే ఘటించె ప్రారబ్దంబుల్!

  రిప్లయితొలగించండి
 41. డా.పిట్టా
  లేబ్రాయపున్ గాచదివేది టైపాటు ‌వరణతో

  రిప్లయితొలగించండి
 42. నామమ్ నీదియె తారకమ్ము గదరా! నా భాగ్యనగ్రమ్మునన్
  సామాన్యంబగు వాన కుర్వగనె మమ్ సాధించి బాధించువౌ
  జాముల్ట్రాఫికు ముర్కి కాల్వలవి జంజాటమ్ము కేటీయుడౌ
  రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్

  రిప్లయితొలగించండి