శ్రీ కృష్ణ ప్రార్ధన
(క)మలనాభా! పోత ! గరుడ వాహన! (కా)లగమ్యా! గదాగ్రజ! కైటభారి
(క)మలాక్ష!దైత్యారి!అమర వందిత!(మ)ధు సూధనా! హేమాoగ!సోమ గర్భ!
(క)రివేల్పు! భూజాని ! తరిదాల్పు! (చ)క్రి నందకి! నీరజోదర! దానవారి
(క)పిల!జగన్నాధ!గరుడి రవుతు(వే)దగర్భా! పరంధామ! గట్టు తాల్పు
(క)ర్మేశ ! పుండరీ కాక్ష! పురుష వరా! (గా)నలోలా ! వర్దమాన! శేషి!
శ్రీ(క)రా!విక్రమా!శ్రీ జాని!వనమాలి! (లో)కనాధ! పెరుమాళ్ళు!యమ కీల!
(క)పి! పురాణ పురుష !కంసారి!(స)రసిజనాభ! దామోదర! నాగ శయన!
(క)న్నయా !వెన్నదొంగా!యతి!విరజ!(కా)లపురుషా!మురభిత్తు!లచ్చి మగడ!
(క)మల నయన! ధర్మి!గరుడ ధ్వజా!(మీ)నరూపుడా !వంశీధరుడ! సిరిపతి!
( క)స్యప రూప!చక్రాయుధా! మధునిషూ ద(ను)డా!పురంధరా! తాత తాత!
(క)రి నేస్తి! శ్రీధరా !కంబుపాణీ! నేత! (చ)క్ర ధారీ! హరీ! సంకు దారు!
(క)రుణాంత రంగా!జగపతీ శుభాం(గా)! వరాహమూర్తి!శిఖండి!రమ్య నేత్ర!
దేవకీ సుతా! గోపాల! దీన బాంద
వా! జగద్రక్షకా!సూరీ! వాసు దేవ!,
కాచు మయ్య చక్రీ వేణు గాన లోల సర్వ కాలమీ దీనుని చల్ల గాను
ఇది సీస పద్యము శ్రీకృష్ణ ప్రార్ధన : (క) అను అక్షరము మధ్యలో బంధింప బడినది క అక్షరంతో సీస పద్యములోని పాదములు మొదలు అవుతాయి (ఒక్క పాదములో తప్ప ) . ముందుగా క తో 1 వ గడి (బాణము గుర్తు గల)లో నుంచి మొదలు పెట్టాలి (కమల నాభా) అన్న పదము తో మొదలు పెట్టి గరుడ వాహన దగ్గిర ఆపి పైన గల (కా) తో కలుపుకొని (కాలగమ్యా) అని
చదువుకొంటూ క్రిందకు వచ్చి మరల (క) తో కలుపుకొని ప్రక్క గడిలో పాదము చదువుకోవాలి అలా 12 వ గడిలో (రమ్య నేత్ర) అని చదివి క్రింద ప్రమిదలోని తేట గీతి మొదటి పద్యపాదము (దేవకీ సుతా) తో మొదలు పెట్టి (వాసు దేవా) అని పదము తోటి ముగించాలి ఈ బంధములో విశేషము తేట గీతి లోని చివరి రెండు పాదములు పైన దళ మల కొసలలో బంధించ బడినవి (వాసు దేవ) చదివిన తర్వాత 1 వ దళము కొసలో గల (కా) తో తిరిగి మొదలు పట్టి వరుసగా (కాచుమయ్య చక్రీ , వేణుగాన లోల సర్వ కాల మీ దీనుని చల్ల గాను) అని ప్రతి అక్షరము కలిపి చదివితే పద్యము ముగుస్తుంది
బంధ కవి పూసపాటి కృష్ణ సూర్య కుమార్