26, నవంబర్ 2018, సోమవారం

సమస్య - 2857 (వలలునిఁ గీచకుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వలలునిఁ గీచకుఁడు సంపె వర విక్రముఁడై"
(లేదా...)
"వలలునిఁ జంపెఁ గీచకుఁ డవక్ర పరాక్రముఁడై రణంబునన్"

89 కామెంట్‌లు:

 1. తెలియుము ఇషాని చరితము
  బలిసిన చర్చిలును గాంధి పచ్చడి చేసెన్
  కలకాదిది యెట్లన్నన్:
  వలలునిఁ గీచకుఁడు సంపెఁ బటు విక్రమునన్ :)

  రిప్లయితొలగించండి
 2. ప్రభాకర శాస్త్రి గారూ,
  అర్థాంతరన్యాసాలంకారంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి


 3. అల సైరంధ్రి నెవరినయ
  పిలిచె? వలచితినని నెవడు భీతిని గొల్పెన్ ?
  అలవోకగ భీముడతని?
  వలలునిఁ; గీచకుఁడు; సంపెఁ బటు విక్రమునన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. కలలను తేలెడి తమ్ముని
  వలదని వారించె సుధేష్ణ వాదన పెంచెన్
  మలినపు బుద్ధికి బలితము
  వలలునిఁ, గీచకుఁడు,సంపె వర విక్రముఁడై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. పద్యంలో అన్వయదోషమూ ఉన్నది. సవరించండి.

   తొలగించండి
 5. ( ఏ పాత్రవేసినా ఎలా అభినయించినా తిరుగులేదనుకొన్న
  ఒక సినిమాహీరో తానే సినిమాతీసి కీచకపాత్ర వేశాడు . )
  సలలితశిష్టధర్ములగు
  సద్గుణధుర్యులు పాండవేయులన్
  గలవర మింత లేక కడు
  గర్హణ సేయుచు ; దుష్టబుద్ధి యౌ
  చలనపు చిత్రనాయకుడు
  చయ్యన కీచకపాత్ర వేయుచున్
  వలలుని జంపె గీచకు డ
  వక్రపరాక్రముడై రణంబునన్ .

  రిప్లయితొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  తలచుచు జేరెనెవ్వరిని ద్రౌపది కీచకబాధ .,? నుగ్రుడై
  వలలుడు ముష్టిఘాతముల బాఁదుచు కీచకునేమి చేసెడిన్ ?
  ఖలుడన నెవ్వడౌను ? గనగానెటులుండును క్రీడి .,? యన్నచో
  వలలునిఁ., జంపెఁ., గీచకుఁ డ ., వక్ర పరాక్రముఁడై రణంబునన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వలలుడు వంటవాడగుట పాపము! డబ్బుల బంచలేడు , దా
   నిలబడె గెల్వనెన్నికల నీతిగ ., నావలి వాడు కీచకుం..
   డిల ధనవంతుడౌట కురిపించెను మద్యము సొమ్ములన్ ,! తుదిన్
   వలలునిఁ జంపెఁ గీచకుఁడ ., వక్ర పరాక్రముఁడై రణంబునన్ !!

   కీచకుడ....కీచకుడే

   వక్ర పరాక్రముడై... దుస్తంత్రము గలవాడై

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. మైలవరపు వారి రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. బలిమిని వలలుడు పిడిగ్రు...
   ద్దులఁ గీచకు ముద్దఁజేయ., దూలుచు" *జంపన్*
   *వలదని ప్రాధేయపడగ*
   *వలలుని కీచకుడు*" సంపె వరవిక్రముడై !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 7. చలి చీమజంపెపామును
  బలవంతులుకలిబలమునబలహీనులునై
  విలపించంగను, కలలో
  *"వలలునిఁ గీచకుఁడు సంపె వర విక్రముఁడై"*

  రిప్లయితొలగించండి
 8. ద్రౌపది తో నర్జునుడు
  కలలెపుడు కల్లలౌఁ గద
  పలుకకు మశుభపు పలుకులు భయకంపితయై
  కలవరపాటు విడు మెచట
  వలలునిఁ గీచకుఁడు సంపె వర విక్రముఁడై?

  రిప్లయితొలగించండి

 9. సందర్భము - డ్రామా రాయుళ్ళు హీరోయిన్‌పై మోజుపడి :)


  మిలమిల లాడు కంజముఖి మెల్తుక యౌనటి మించుగంటియా
  తిలకిని పైన మోజుగని తిన్నదరక్క భళారె దారిలోన్
  కలవరకంప యై నటులు కక్షల తీర్చుకొనంగ మారగా
  వలలునిఁ జంపెఁ గీచకుఁ డవక్ర పరాక్రముఁడై రణంబునన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తిలకి' ? 'అరక్క' అన్నది వ్యావహారికం. 'కలవరకంప' దుష్టసమాసం!

   తొలగించండి

  2. :)

   తిలకిని - స్త్రీ

   కలవరకంప - jumbled

   ఆంధ్రభారతి ఉవాచ

   అరక్క - వేరేపదం దొరక్క :)


   జిలేబి

   తొలగించండి


  3. తిలకమిడదు నుదుటఁదిలకినీ తిలకంబు." [భాగ.(రుక్మిణీ) 54]

   ఆంధ్రభారతి

   తొలగించండి
 10. విలపించెడు ద్రౌపదిఁ గని
  ఖలు సంహార మొనరింప కదలియె రాగన్
  లలనగ భావించె నపుడు
  వలలునిఁ గీచకుడు, సంపెఁ బటు విక్రమమున్.

  రిప్లయితొలగించండి
 11. ఛలజనకూటకృత్యముల జాడలు తేటమొనర్చు ధీరులన్


  బలమునఁ జంపి తా దొరల భంగినిఁ జట్టమతిక్రమించు వా


  రలె యిల ఖ్యాతి నొందిరి, నిరాశ్రయసజ్జనభారతమ్ములో


  వలలుని జంపెఁ గీచకు డవక్రపరాక్రముడై రణంబునన్.

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.

  రిప్లయితొలగించండి
 12. సవరించిన పూరణ
  కలలను తేలెడి తమ్ముని
  వలదని వారించ నెంచి వాదన పెంచెన్
  మలినపు బుద్ధిని బ్రమపడి
  వలలునిఁ, గీచకుఁడు,సంపె వర విక్రముఁడై

  రిప్లయితొలగించండి
 13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2857
  సమస్య :: ‘వలలునిఁ జంపె కీచకుఁ డవక్ర పరాక్రముడై రణంబునన్’ .
  *వలలుని అంటే భీముని కీచకుడు చంపినాడు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: అజ్ఞాతవాస సమయంలో విరాట మహారాజు కొలువులో భీముడు వలలుడుగా ఉండినాడు.
  *యుద్ధంలో వలలుడు అవక్ర పరాక్రమంతో కీచకుని చంపినాడు* అనే వాక్యాన్ని కర్మణి ప్రయోగంలోనికి మార్చి వ్రాయండి అని ఉపాధ్యాయుడు చెప్పగానే మెట్టమొదట నేనే వ్రాయాలి అని తొందరపడిన ఒక విద్యార్థి వ్యాకరణ దోషము గుఱించి తెలియని కారణంగా *యుద్ధంలో వలలుని అవక్ర పరాక్రమంతో కీచకుడు చంపినాడు* అని వ్రాసినాడు అని విద్యార్థి వ్రాసిన పొరపాటును గుఱించి విశదీకరించే సందర్భం.

  ‘వలలుడు జంపె కీచకు నవక్ర పరాక్రముడై రణంబునన్’
  కలఁగక దీని మార్చు డిక కర్మణి వాక్యముగా ననంగనే;
  తొలుత నొకండు వ్యాకరణ దోష మెఱుంగక మార్చె నిట్టులన్
  ‘వలలునిఁ జంపె కీచకుఁ డవక్ర పరాక్రముడై రణంబునన్’ .
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (26-11-2018)

  రిప్లయితొలగించండి
 14. క్రమాలం కారం లో _____
  బల భీముని వేష మె దియ?
  వలచె ను ద్రౌపది నెవరొకొ ? బ వరము నందున్
  తలచిన ప్రతిన గ వైరుల
  వలలుని : గీచకుడు ; సంపె బల విక్రము డై;;

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. ఖలుడగుదండనాయకుడు గామముతోగులకాంతపొందుకై
  వలపుతలంపునెత్తినిడిభామనుగౌగిలిజేర్చభీముడున్
  *"వలలునిఁ జంపెఁ; గీచకుఁ డవక్ర పరాక్రముఁడై రణంబునన్"*
  నిలిచినమారుతిన్ గనియనేకవిధంబులబోరి గూలినన్
  బలుకరెమోహనాగమదిబల్లిదునైననుగాటువేయదే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర్ గారూ,
   విరుపుతో మీ పూరణ ప్రశస్తంగ్గా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 16. డా.పిట్టా సత్యనారాయణ
  కలిగిన దేవుని గొలువక
  బలిమిని శబరీశు బట్టి వంచన జేయన్
  కలికాల సంప్రదాయమె
  "వలలుని గీచకుడు జంపె వర విక్రముడై"

  రిప్లయితొలగించండి
 17. వలలుడటంచు నెంచియును వానిని భీమునిగా నెరుంగకన్,
  దెలియక ద్రౌపదిన్ వలచి తెంపరియై , యొక బాహ్యరూపమౌ
  "వలలునిఁ జంపెఁ గీచకుఁ , డవక్ర పరాక్రముఁడై రణంబునన్"
  వలలుని లోని భీముడిక వచ్చెను కీచకునిన్ వధింపగన్
  (వలలుడు అనేది బాహ్యరూపం. మూర్ఖుడైన కీచకుడు తన కామం వలన బాహ్యరూపమైన వలలుణ్ని చంపి అసలైన భీముణ్ని బతికించి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు కనుక సమస్య లో ఇచ్చినది యథార్థమే కదా !)

  రిప్లయితొలగించండి
 18. పలికె శకారుడే యిటుల పాండితి జూడనొకింత లేకయే
  "పెలుచన రావణాసురుడు పేడిని నాజిని ద్రుంచలేదొకో!
  కలహము సంభవింప నల కర్ణుడు కృష్ణుని సంహరించెగా
  వలలునిఁ జంపెఁ గీచకుఁ డవక్ర పరాక్రముఁడై రణంబునన్"
  ****)()(****

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   శకారుని ఆశ్రయించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 19. కులపర్వత సమదేహుడు
  బలగర్విత సింహబలుడు బాహు బలమునన్
  పలువురు వీరుల వినా
  వలలుని,కీచకుడు చంపె వరవిక్రముడై!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. ఆర్యా! వీరులను వినా అని ఉండాలి. టైపాటుకు మన్నించండి!నమమస్సులు!

   తొలగించండి
 20. రెండవ పూరణ
  వలలుడటంచు పిల్చెదము వానిని వంటల వాడు కాన , నా
  వలలుడు పేదవాడగుట వాని సతిన్ గని కీచకున్ బలెన్
  వలపున దింపె నొక్క ధనవంతుడు భారత గాధ మారగా
  వలలుని జంపె కీచకు డవక్రపరాక్రముడై రణమ్మునన్

  రిప్లయితొలగించండి
 21. నలుడెవని సమము వంటల?
  వలచెను ద్రౌపది నెవడొకొ వంకర బుద్ధిన్?
  యల విజయుడాజి నరులను
  వలలునిఁ ;గీచకుఁడు ;సంపె వర విక్రముఁడై"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నలు డెవని బోలు వంటల... బుద్ధిన్ అల...రిపులను...' అనండి.

   తొలగించండి
 22. బలమున మల్లయోధులను బల్వుర గెల్చితి నేనటంచు నీ
  తలపున మోదమంది నను తాకగ నెంచితి వేని మేదినీ
  తలమున పాచకా! జనులు తల్చెద రిట్లు వినమ్రశీలురై
  వలలునిఁ జంపెఁ గీచకుఁ డవక్ర పరాక్రముఁడై రణంబునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫణికుమార్ గారూ,
   బహుకాల దర్శనం!
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. గురువుగారూ నమస్సులు ధన్యవాదములు నేను మధ్యలో రెండు సార్లు విదేశీయానము చేయుటలోనూ మఱియు ఇతరమైన ఆఫీస్ వ్యవహారాలలోనూ వ్యస్తంగా ఉండడము, తరువాత నాన్నగారికి బైపాస్ చేయించవలసి రావడంతోనూ తీవ్రమైన ఒత్తిడిలో ఉండడం వలననూ పద్య పూరణలు ప్రయత్నించుటకు కూడా మనసు రాలేదు ఈశ్వరానుగ్రహంతో తిరిగి పరిస్థితులు చక్కబడడంతో చాలా కాలము తర్వాత ఈ రోజు చూడాలనిపించి శంకరాభరణం తెరవడం జరిగింది. మీ వాత్సల్యమునకు ధన్యవాదములు

   తొలగించండి
 23. ఉలటావ్రాసిరియిచ్చట
  వలలునిగీచకుడుసంపెవరవిక్రముడై
  కలవరపడకుడుసెప్పుదు
  వలలుడెగీచకునిజంపెపండితవర్యా!

  రిప్లయితొలగించండి
 24. కలవర బరిచె బలయుతుడు
  వలలునిఁ గీచకుఁడు; సంపె వర విక్రముఁడై
  నలభీముడు గోపావే
  శ లసద్గరిమన్ మురారి శరణొందియదే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'విక్రముడై యల భీముడు... శరణము గనియున్' అనండి.

   తొలగించండి
 25. కందం
  కలతఁబడిన సైరంధ్రియె
  యెలమిన్ బిలువంగవచ్చి యెగబడి చీరన్
  తొలగించి వింతఁ గాంచఁగ
  వలలునిఁ గీచకుఁడు, సంపె వరవిక్రముడై

  రిప్లయితొలగించండి
 26. కలవరపాటుజెందుచునుగాపురుషుండునుబోలెబల్కితే?
  వలలునీజంపెగీచకుడవక్రపరాక్రముడైరణంబునన్
  వలలుడెజంపెగీచకునవక్రపరాక్రముడైరణంబునన్
  వలలునిశక్తినెప్పుడునవారితబల్మిని బెర్గుచుండుగా

  రిప్లయితొలగించండి
 27. తెలివిగ బలుకుము, నెచ్చట

  వలలుని కీచకుడు చంపె వర విక్రముడై,

  కలలో నైన జరుగునా,

  తలతిక్క పలుకుల తోడ తగులును దెబ్బల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తెలివిగను బలుకు మెచ్చట' అనండి.

   తొలగించండి
 28. చలచల కాగుచు నుండఁగఁ
  బలు విధ శాక నిచయములు వాఁడివి యౌ కో
  ల లమాంత మెగిరి యకటా
  వలలునిఁ గీచకుఁడు సంపె వర విక్రముఁడై

  [వలలుఁడు = వంటవాఁడు; కీచకము = వెదురు; కీచకుఁడు = మూర్తీకృత వెదురు]


  లలిత విరాట రాజ్యమును లాలన లీలగఁ జేయు చుండి వీ
  రు లల పరాక్రమించిన శిరోదళన మ్మొనరించి ధాత్రినిం
  గల నృప సింహ విక్రమ నికాయము నుద్ధతి, దక్క నొక్కనిన్
  వలలునిఁ, జంపెఁ గీచకుఁ డవక్ర పరాక్రముఁడై రణంబునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   ఎప్పటి వలెనే మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
  3. కోలలమాంతము - సంపె- కీచకుఁడు : వచన సమన్వయ భంగ మగు నేమో యను సందేహము.
   కోలలు వెదురు కోలలు కాబట్టి చంపిన వాడు కీచకుఁ డన్న(వెదురు) భావముతో సవరణను దిలకించ గోరెదను.


   చలచల కాగుచు నుండఁగఁ
   బలు విధ శాక నిచయములు వాఁడివి యౌ కో
   లలు వెదురివి యెగురఁగ నా
   వలలునిఁ గీచకుఁడు సంపె వర విక్రముఁడై

   తొలగించండి
 29. రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 30. డా. పిట్టా సత్యనారాయణ
  విలవిలలాడె ద్వౌ సభలు వీక్షణకే బ్రజకైన వాణియై
  జెలగగ కోర్టులే విరియ జిహ్వకు దా(తా)ళము వేయు పద్ధతిన్
  చలమున నన్ని వ్యాజ్యముల చర్చకు ద్రిప్పకె తీర్పులివ్వగా
  "వలలుని జంపె కీచకుడవక్ర పరాక్రముడై రణంబునన్"

  రిప్లయితొలగించండి
 31. వినిపించగరామునికథ
  హనుమంతుడు తానువచ్చెఆద్యక్షుండై,
  అనుచరగణమదిజూడగ
  కనిపించిరికోతులవలెగవివరులెల్లన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 32. వలపుల పలుకులు జిలుకుచు
  పలుమారులుపరవశించిపర్వముతోడన్,
  చెలియని దలచుచు కౌగిట
  వలలునిగీచకుడుసంపెవరవిక్రముడై
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాధాకృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 33. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అమ్మ కల:👇

  కలవరమౌచు భాజపయె కాంగ్రెసు ధాటికి బిక్కచావగా
  విలవిల వోయి భీములహ వీధులు గొందులు పట్టిపారగా
  బలిసిన మోడినిన్ తరిమి పప్పుయె కొట్టెను బాదుబాదుచున్:
  "వలలునిఁ జంపెఁ గీచకుఁ డవక్ర పరాక్రముఁడై రణంబునన్"...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ వ్యంగ్యాత్మక పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 34. లలనవలన భీమునిలో
  వలలుని గీచకుడు సంపె వర విక్రముడై
  ఇల రెచ్చిరచ్చలో పల
  మలినుని భీముండు సంపె మానము కొరకై

  కీచకుని పనులచే వలలుని లోపల ఉన్న వంటవాడిని చంపి భీముడిని కీచకుడు బయటకు తీసుకు వచ్చాడు .... చచ్చాడు అనే అర్థం తో

  రిప్లయితొలగించండి
 35. పలికెడి నాయకుడట్లుగ
  విలువగుయెన్నికలముందు విషయములట్లున్
  కలగనిన తాగుబోతనె
  వలలుని గీచకుడుసంపె!వరవిక్రముడై!

  రిప్లయితొలగించండి
 36. పిలిచె, దురాత్మకుండనిక పీచ మడంచ మటంచు కృష్ణ యా
  వలలునిఁ, జంపెఁ గీచకుఁ డవక్ర పరాక్రముడై రణంబునన్
  దలపడ నేమి దేహమున దార్ఢ్యము గల్గిన భీముడప్పుడున్
  ఖలుడను మల్లయుద్ధమున కామిని పొందును గోరినందుకై.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని కొంత అన్వయ దోష మున్నది.

   తొలగించండి
 37. కలరీధరాతలంబున
  బలవంతులె కీచకులయి పాలించంగన్
  విలయమ్మునకేయిదియౌ
  వలలునిఁ గీచకుఁడు సంపె వర విక్రముఁడై!"

  రిప్లయితొలగించండి
 38. లలన కతమున నెదురు కొనె
  వలలునిఁ గీచకుఁడు ; సంపె వర విక్రముఁడై
  బలశాలి భీమ సేనుడు
  ఖలుడౌ నా కీచకుడిని కర్కశ రీతిన్.

  రిప్లయితొలగించండి


 39. తెలియని మూర్ఖుండొక్కడు
  "వలలుని గీచకుండు సంపె వరవిక్రముడై"
  యిలనన నదియొక వార్తై
  పలువిధములుగా తలచిరి పండితులెల్లన్.

  రిప్లయితొలగించండి
 40. చంపకమాల
  పలుమరు చెప్పితిన్ వినగ భావము మారక యుండనిట్టులన్
  "వలలుడుఁ జంపె కీచకు నవక్ర పరాక్రముఁడై రణంబున“
  తలగొని మ్యూజియమ్మునను దప్పక పెట్టగ నిట్టులంటివే
  "వలలునిఁ జంపెఁ గీచకుఁ డవక్ర పరాక్రముఁడై రణంబునన్"

  రిప్లయితొలగించండి