4, నవంబర్ 2018, ఆదివారం

సమస్య - 2836 (హలమున రాఘవుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్"
(లేదా...)
"హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్"

68 కామెంట్‌లు:

  1. జలమున వారధి పన్నుచు
    సులువుగ శ్రీలంక జేరి స్తుత కీర్తుండై
    కిలకిల బిలబిల కోలా
    హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      ఇక ఈరోజు పూరణల కోలాహలమే...
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కిలకిల కోతుల కోలాహలమున" అంటే ఇంకా బాగుంటుందేమో?

      తొలగించండి

    2. ఏమండోయ్ జీపీయెస్ వారు

      మీ పద్యాన్ని నిన్న సమస్యా పూరణ లో ఆకాశవాణి ప్రసారం చేసారు తెలుసా ?


      జిలేబి

      తొలగించండి
    3. విన్నాను. అది కందివారి రెకమెండేషన్ దర్శనం. పై వారం ధర్మ దర్శనం :)

      తొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    లలితమనోహరుండు , శుభలక్షణుడిద్ధర ధర్మమూర్తిగా
    వెలిగెడి రామమూర్తి రణవీథిని వింటినినెక్కుపెట్టుచో
    ప్రలయభయంకరుండగును ., పాపి దశాస్యు వధింపఁ జేరి సిం...
    హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఖలునికి తనువున తన కౌ
      శలమున శరములు రుధిరపు చారల జేయన్ ,
      పొలమును దున్నిన రీతిని
      హలమున ., రాఘవుడు రాక్షసాధిపుఁ జంపెన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


      తొలగించండి
  3. పొలమును రైతులు దున్న రె
    హలమున; రాఘవుడు రాక్షసా ధ ము జంపెన్
    చలమున చెలరేగి కపులు
    బలముగ తోడై నిలువగ బ వర ము నందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. ఛలమున సీతం జెరగొని
    యల రావణు డేగె లంక, నద్భుతరీతిన్

    బలిమిని ధనురంచితదో

    హలమున రాఘవుడు రాక్షసాధిపుఁ జంపెన్.

    కంజర్ల రామాచార్య.
    కోరుట్ల

    రిప్లయితొలగించండి
  5. (1)
    పొలదిండి మూక మిక్కిలి
    కలవరపడ, సురలు పొగడఁగన్, వీక్షింపన్
    మలద్రిమ్మరు లటఁ గోలా
    హలమున, రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్
    (2)
    ఛలమున రావణుండు ధరజాతను సీతను దొంగిలించి సిం
    హలమున నుంచె, నామెకయి యద్రిచరాధిపు సాయమంది దో
    ర్బలమును జూపి దానవ కులంబు వినాశనమందఁ జేసి దో
    హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్.

    రిప్లయితొలగించండి
  6. గురువులకు నమస్కారాలు..
    సరదాగా....

    చలికాలమందు చలియే
    పులివలె భయపెట్టుచుండ పూరణ నెటులన్
    కలమున లిఖింతు,మెటులన్
    హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్ ?

    రిప్లయితొలగించండి


  7. విలుకాడతడు జిలేబీ
    యలుపెరుగని వీరుడతడు యమగండడహో
    కలకలమనంగ కోలా
    హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2386
    సమస్య :: హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్.
    *హలముతో అంటే నాగలితో రఘురాముడు రావణుని చంపినాడు యుద్ధంలో* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: తండ్రిమాట కోసం అడవికి వెళ్లిన ధర్మమూర్తి శ్రీ రామచంద్రుడు తన భార్యయైన సీతను కోల్పోయి, రావణాసురుని చౌర్యమును గుఱించి తెలిసికొని, వైదేహి కోసం అంతటా వెదకి, తమ్మునితో వానర సైన్యంతో కలసి సముద్రం దాటి, లంకకు వెళ్లి జానకీసాధ్వికి విముక్తిని, రావణునికి ముక్తిని ప్రసాదించదలచి ఆ సింహళ దేశంలో యుద్ధభూమిలో ఆ రాక్షస రాజైన దశకంఠుని సంహరించినాడు అని శ్రీ రాముని పరాక్రమాన్ని సచ్చరిత్రను కీర్తించే సందర్భం.

    లలనను గోలుపోయి, ఖల రావణ చౌర్యముఁ దా నెఱింగి, భూ
    తలమున సీతకై వెదకి, తమ్మునితో ఘన వానరాళితో
    జలధిని దాటి, లంకఁ జని, సాధ్వివిముక్తిని జేయ గోరి సిం
    హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (4-11-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. అద్భుతం!

      "ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనం..."

      తొలగించండి
    3. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి ప్రణామాలు.

      తొలగించండి
    4. పెద్దలు
      శ్రీ గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారికి
      హృదయపూర్వక ప్రణామాలు.

      తొలగించండి
  9. పొలతిని యెత్తుకు బోయెడు
    బలుడగు రావణునిదునుమ వానర మొనతో
    జలధిని వారధి నిడి సిం
    హలమున రాఘవుడు రాక్షసాధకు జంపెన్!!!

    మొన = సైన్యము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పొలతిని నెత్తుకు...' అనండి.

      తొలగించండి
  10. బలిమిని లంకేశుం డిన
    కుల వథువును దొంగలించ కుపితుండై యా
    మలదిరుగు వారి కోలా
    హలమున రాఘవుడు రాక్షసాధిపు జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'వధువును' అనండి.

      తొలగించండి
  11. గురువు గారికి నమస్సులు
    వెలుగొందె బలరాముడు
    హలమున రాఘవుడు రాక్షసాధిపుఁ జంపెన్,
    లలితాంబ కృపచేతన్
    వలపున్ స్మరియింతు యోగవరిష్ట మునులన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమస్యాపాదంలో తప్ప మిగిలిన మూడు పాదాలలో గణదోషం. "వెలుగొందెను బలరాముడు...లలితాంబ కరుణచేతన్... యోగవరులగు మునులన్" అనండి.

      తొలగించండి
  12. కలకంఠి నపహరించిన
    మలినాత్ముని, కపి సహాయమది రాగ మహా
    బలమున నాహవమున దో
    హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కపి సహాయ మందుకొని మహా..' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. గురువు గారు వందనములు... సవరించాను

      కలకంఠి నపహరించిన
      మలినాత్ముని, కపి సహాయమందుకొని మహా
      బలమున నాహవమున దో
      హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్


      🙏🙏🙏🌹🌹🌹

      తొలగించండి
  13. పలు దినములు పోరాడియు,
    తెలియగ తుది వాని గుట్టు ధీరత్వమునన్
    చెలగెడి వానర కోలా
    హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్

    రిప్లయితొలగించండి
  14. నేటి శంకరా భరణము సమస్య

    హలమున రాఘవుడు రాక్షసాధిపు జంపెన్

    ఇచ్చిన పద్య పాదము కందము

    నా పూరణము సీసములో

    లవకుశులకు వాల్మీకి మహర్షి రామ కధను చెప్పు సందర్భము

    హల సుతను పరిణయ మ్మాడి, జనకు డాదేశించ వనిచేరి, దేహి యనిన
    సుగ్రీవునకు దయ చూపి,వాలిని చంపి, హనుమ సాయముతోడ నవనిజ పొడ
    కనుగొని, కోతిమూకలు వారదిని కట్ట, తారిషమును దాటి దారుణముగ
    మొన చేసి, సిం(హలమున రాఘవుడు రాక్ష సాధిపు జంపెన్) భృశము బడసి,
    లంక లోని సీతను చూసి శంక బడసి,
    వమి పరీక్షను బెట్టి, ధ్రువ కయి బట్టి
    పురము జేరెనని పలికె, పొలము తెంకి
    లవకుశులకు రామ కధను లక్షణముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      రామాయణ కథాసార్ంతో సీసపద్యంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. satyanarayana@gmail.com
    డా పిట్టా ‌సత్యనారాయణ
    నరుడై రాక్షసుల జంపుట అసాధ్యము గనుక అవతార పురుషుడైనను రాఘవుడు నరుని వలెనే కలత జెంది రావణుని సంహరించెనను భావన:
    బలగము వానర మూకలు
    జలనిధి దాటంగనాయె జనకజ చెరకౌ
    కలకలము బాప నరు వి
    హ్వలమున రాఘవుడు రాక్షసాధిపు జంపెన్

    రిప్లయితొలగించండి
  16. కం.
    జలధిని వంతెన దాటుచు
    విలపించెడు జనకసుతను విడిపింపంగా
    తల,నాభిని గొట్టియు సిం
    హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్ .

    రిప్లయితొలగించండి
  17. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,


    ఖలుడగు రావణాసురుడు క్ష్మాసుత గైకొని పోవ , శోక వి

    హ్వలుడయె రాము | డప్పు డల పావని సీతమ జాడ దెల్ప , దో

    హలమున రాఘవుండు దనుజాధిపు జంపెను సంగరమ్మునన్ |

    బలుడ నటంచు నీల్గి పరభార్యల గోరగ ,‌ మృత్యుదేవి కౌ

    గిలి బడి నీల్గి తీరు నను కేవల సత్యమె రామ గాధయౌ ! !


    ( నీల్గు = గర్వపడు , గిలగిల తన్నుకొని చచ్చు ;‌ )
    .

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  18. satyanarayana@gmail.com
    డా. పిట్టా సత్యనారాయణ
    చలమున నన్ని మూకలిట జాలగ నేకమునయ్యి రాష్ట్రపున్
    బలగపు పెంపునెన్ని బహు బాసల జేయగ లక్ష్య మొక్కటే
    ఇలనిక జంద్రశేఖరుని యీప్సితమున్ జెరపంగ; గాని వే
    జల,గృహ,కాంతి శక్తినిడి సాగెను రైతుల బాంధవుండునై
    "హలమున రాఘవుండు దనుజాధిపు జంపెను సంగరంబునన్"
    (ఎలక్షైనుల లో తెరాస గెలిచినట్లు ఊహించి నట్టి భావనలో)

    రిప్లయితొలగించండి
  19. జలనిధి జలనిధితోడం
    గలహించిన రీతిఁ బోరు ఘనముగ జరుగం
    దిలకింపఁగ సురలు గుతూ
    హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్.

    రిప్లయితొలగించండి
  20. ఛలమున రావణాసురుడు జానకి నార్తిని మోహమగ్నుడై

    బలిమిని బట్టి లంక గొని పారెను వంచకభిక్షుకాకృతిన్,

    విలయవిజృంభమాణభయవిహ్వలవర్షశరప్రశస్తదో

    హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరమ్మునన్.

    కంజర్ల రామాచార్య.
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  21. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'తలకొక..' అనండి.

    రిప్లయితొలగించండి
  22. కందం
    కలలోని రామచంద్రుడు
    తొలగించఁగ వచ్చె చెరను తోషము మీకున్
    గలుఁగనఁ ద్రిజట, కుజ కుతూ
    హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్

    చంపకమాల
    తొలఁగును బాధలన్నియును తోషము గల్గును మీకు, లంకకున్
    చెలగుచు వచ్చె రాముడని చెప్పెడు నా త్రిజటన్ప్రమోదమున్
    గలుఁగగ జానకీసతియె గాంచుచు మోమున జూపెడున్ కుతూ
    హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్

    రిప్లయితొలగించండి


  23. జలధిని దాటుచు సీతా
    లలామ నట కావనెంచి లంకాపురిపై
    ఛలమున దండెత్తుచు సిం
    హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్.

    రిప్లయితొలగించండి
  24. పలువురువద్దువద్దనగపాపముపండగనందిశాపమే
    తలపులతల్పుతెర్వగవిధాతకులస్తుడుబుద్ధిహీనుడై
    కులసతిబట్టితెచ్చెవిధిగోర్కెకసాధ్యములేదులేదు దో
    "హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్

    రిప్లయితొలగించండి
  25. ఇలలంకానగరపుపతి
    బలగరువముతోబ్రజలనుబాధించంగన్
    దలపడిదనదగుకోలా
    హలమునరాఘవుడురాక్షసాధముజంపెన్

    రిప్లయితొలగించండి
  26. కులవధువునువంచనచే
    విలువలబోనాడితెచ్చె విధివంచితుడై
    కులమునకుతెగులని గుతూ
    హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్"

    రిప్లయితొలగించండి
  27. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అల బలరాము డెందునట హాయిగ దున్నెను తా పొలమ్మునున్?...
    హలమున;...రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్
    కిలకిల కోతు లెల్లరును క్రిందను మీదను గెంతుచుండగా...
    విలవిల రాక్ష సాధములు వెక్కుచు నేడ్వగ గోలగోలగా...

    బలరాముడు = రైతు పేరు

    రిప్లయితొలగించండి
  28. క్రొవ్విడి వెంకట రాజారావు

    పొలసున సీతను వెరజిన
    ఖలుడా లంకాధిపతిని కపివీరులతో
    కలసి వెడలి ననిలో దో
    హలమున రాఘవుడు రాక్షసాధిపు జంపెన్

    రిప్లయితొలగించండి
  29. తలకొని తండ్రి యాజ్ఞ మది, తద్దయు ప్రీతిని పోయి కానకున్
    కలువలదాయ వంశజుడు గాదిలి పత్నిని గూడి యుండగా
    విలువల వీడి రావణుడు వేదవతిన్ హరియించ కిన్క, దో
    హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్

    రిప్లయితొలగించండి

  30. శంకరాభరణం...
    4, నవంబర్ 2018, ఆదివారం

    సమస్య

    "హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్"



    నా పూరణ..చంపకమాల
    ***** **** **** **** ***

    అల దశగ్రీవుడా వసుమతాత్మజ జానకి మోసగించుచున్

    కలుషపు బుద్ధి తోడతను గైకొని తాచనె;కోసలేశుడున్

    జలధిని మారుతాది కపి జాలము గూడియు దాటినంత సిం

    హలమున రాఘవుండు దనుజాధిపు జంపెను సంగరంబునన్

    🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷వనపర్తి🌷


    రిప్లయితొలగించండి
  31. కలహము రాచరికమ్మున
    కలకలమై కదలెకొల్వు కారణమేదో!
    కలహము త్రెంచగ కోలా
    హలమున రాఘవుఁడు రాక్షసాధిపుజంపెన్!!
    --------యెనిశెట్టి గంగా ప్రసాద్
    కామారెడ్డి
    **రాక్షసాధిపుడు=కలకలము సృష్టించిన వాడు,ప్రజాకంటకుడు
    రాఘవుడు=రాజు లేదా శిష్టరక్షకుడు

    రిప్లయితొలగించండి
  32. దేవిక
    ------

    బలిమిగ నిల్వ సోదరుడె భవ్య శుభమ్మును గూర్చ; వానరు
    ల్విలసిత మైత్రి జాటెగద వీకను జూపి నమేయ వీరులై ;
    అలఘు బలమ్మె రామునికి నండగ నుండగ నివ్విధమ్ము; దో
    హలమున రాఘవుండు దనుజాధిపు జంపెను సంగరంబునన్ !

    రిప్లయితొలగించండి
  33. "పొలమును దున్నెను పోతన
    హలమున"!" రాఘవుడు రాక్షసాధిపుజంపెన్
    కలమున భాగవతంబున
    దెలిపెను శ్రీరామశక్తి దీప్తినినిలుపన్!

    రిప్లయితొలగించండి
  34. కల నైనఁ దలంచఁడు పది
    తల లున్నట్టి దనుజుండు దర్పంబెసఁగన్
    విలసిత సంగర కౌతూ
    హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్


    సలలిత సూర్య వంశ విల సత్పురు షోత్తమ రామ నామ హృ
    ద్విలసిత దేవ మౌని వర విప్ర గణార్చిత భాసితుండు వి
    హ్వల ఖర దూష ణాది పల లాశన మారక బాణమన్ హలా
    హలమున రాఘవుండు దను జాధిపుఁ జంపెను సంగరంబునన్

    రిప్లయితొలగించండి
  35. అలదశకంఠుడయ్యెడలయందఱబాధవెట్టదానదో
    హలమునరాఘవుండుదనుజాధిపుజంపెనుసంగరంబునన్
    నమలుడుదీర్ఘబాహుడునునార్తులరక్షకుండుగనౌగదా
    సులభతరుండుభక్తులకుశుధ్ధమనస్కుడుజూడరాముడే

    రిప్లయితొలగించండి
  36. దేవిక
    ------
    నిన్నటి పూరణ
    -----------

    తా విడిపోవ పుత్రుడట తత్తరపాటున నొక్క జాతరన్
    ఆవహ దుఃఖ తీవ్రతయె నాకసమంటగ వేదనమ్మునన్
    బావురుమంచు నేడ్చు తరి పాంథుని వెంట సుతుండు రాగ; దీ
    పావళి పండుగన్ జరుపనౌ గద పున్నమి నాటి రాతిరిన్ !

    దేవత బోలు భార్య కొక దిగ్భ్రమ గల్గెడు వ్యాధి రాగ; తా
    బావురుమంచు దుఃఖమున బాష్పములున్గురియంగ ; దైవమా
    కావుమటంచు వేడుకొన ;కామితమే నెరవేరగాను దీ
    పావళి పండుగన్ జరుపనౌ గద పున్నమి నాటి రాతిరిన్ !

    రిప్లయితొలగించండి
  37. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఛలమున రావణాసురుడు జానకి నెత్తుకు పాఱిపోవగా
    తలచని నా విపత్తునకు తామసమొందుచు లంక జేరి కో
    తుల సహకార సాయముల తోడ ప్రతాపము జూపు చుండి దో
    హలమున రాఘవుండు దనుజాధిపు జంపెను సంగరంబునన్

    రిప్లయితొలగించండి


  38. విలవిల లాడి చచ్చిరి సువీజుడి భక్తుని కింకరుల్ వెసన్
    మలమలలాడి రచ్చట రమాప్రియు డేనడ చంగ యుద్ధమం
    దు!లగన మయ్యె చావునకు దుర్మతి యైనిలువన్, జిలేబి, దో
    హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి

  39. గగనం గగనాకారం
    సాగరస్సాగరోపమః౹
    రామరావణయోర్యుద్ధం
    రామరావణయోరివ౹౹
    ***)()(***
    ఈశ్లోకాన్ని పండితులైన మామిత్రు లెంతగానో ప్రశంసించే
    వారు.రాముడప్రమేయుడు,రామ రావణ యుద్ధమప్రమేయము.

    రిప్లయితొలగించండి
  40. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    *"హలమున రాఘవుండు దనుజాధిపుఁ
    జంపెను సంగరంబునన్"*

    సందర్భము: రామకథ సర్వం యిందులో చేతనైనంతవరకు చెప్పడం విశేషం..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    అల జనియించి, శైవ ధను
    వల్లన వంచి, హసించి, సీత న
    ర్మిలి వరియించి, కానలఁ జ
    రించి, పురంధ్రికినై తపించి, యా
    వల వెదికించి, వారిధిని
    వారధినే వెలయించి, మించి, సిం
    హలమున రాఘవుండు దను
    జాధిపుఁ జంపెను సంగరంబునన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    4.11.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  41. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్

    సందర్భము: శివుడు హాలాహలం మింగినాడు. ఏ శోకమూ ఎవరిమీదా ఏ కోపమూ లేవు. ఏ దుష్ట శిక్షణా జరుగలేదు. లోక రక్షణం జరిగింది (సాక్షాత్తుగా).
    త్రేతాయుగంలో రాముడూ మింగినాడు. ఐతే అది సీతా విరహ మనే హాలాహలం. దానితో ఆయన శోక జలధిలో మునిగినాడు. వారధి నిర్మించే వేళ సముద్రునిపై కోపాన్నీ ప్రదర్శించినాడు.
    ఎవరికీ ఏ అపకారమూ చేయని ఆ ధర్మమూర్తి ఆ నెపంతో రాక్షసాధిపుడైన రావణుని సంహరించవలసి వచ్చింది. తన ప్రయోజనంతోబాటు లోక కల్యాణమూ సిద్ధించింది (పరంపరితముగా).
    ఐతే రాముడు సతీ వియోగ విషాన్ని మింగ దలచినాడు. దాని కారణంగా రావణ సంహారం జరిగింది. ఎట్లైనా దుష్ట శిక్షణ ద్వారా చుట్టూ తిరిగి చివరికి లోకోపకారమే జరిగింది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    అల శివుడు మ్రింగ హాలా
    హలమును.. జగదవన మాయె..
    నటు వలె మ్రింగన్
    దలచియు సతి విరహ హలా
    హలమున రాఘవుఁడు రాక్ష
    సాధిపుఁ జంపెన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    4.11.18
    -----------------------------------------------------------
    శ్రీ సూరం శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలతో..

    రిప్లయితొలగించండి