డా. పిట్టా సత్యనారాయణ మదుపులు బెట్టి యాంగ్లపు సమంబగు భాషయెలేదటందువో బదులుగ "నమ్మ","యావు"మరి భక్తిని"నీశ్వరు"డంచు నేర్పు మా(అమ్మ,ఆవు,ఈశ్వరుడు,అ,ఆ,ఈ లను నేర్పుటకు తెలుగు భాషలో) గదులను వేసి యర్భకుల గాకుల జేయగ"సేబు"(Apple)కర్ర(Bat)లా చదువులు బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు,వద్దురా!
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2846 సమస్య :: చదువులు బాలబాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా. *చదువులు పిల్లల తెలివితేటలను పాడుచేస్తాయి. బాల బాలికలను చదివించవద్దు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: చదువు వినయాన్ని ఇస్తుంది. వినయము పాత్రతను [యోగ్యతను] ఇస్తుంది. పాత్రత వలన క్రమంగా ధనము ధర్మము సుఖము సిద్ధిస్తాయి అని మహాకవి విష్ణుశర్మ సమకూర్చిన *హితోపదేశము* అనే గ్రంథంలో ప్రస్తావికలో (ఉపోద్ఘాతంలో) 6 వ శ్లోకంలో చెప్పబడియున్నది. ఆ శ్లోకం ఇదే. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతామ్। పాత్రత్వాద్ధనమాప్నోతి ధనాద్ధర్మం తతస్సుఖమ్।। నాటి చదువులు వినయాన్ని ఇచ్చేవి. ఐతే నేటి చదువులు వినయాన్ని ఇవ్వకుండా గర్వాన్ని కలిగిస్తున్నాయి. అందువలన వినయాన్ని నీతిని సంస్కారాన్ని నేర్పని నేటి చదువులు వద్దు. ఇటువంటి ఇప్పటి చదువులు బాల బాలికలకు ఉన్న జ్ఞానాన్ని కూడా పాడుచేస్తున్నాయి. ఈ చదువులు వద్దు అని విశదీకరించే సందర్భం.
చదువులు చక్కగా వినయ సంపద నీయ క్రమక్రమమ్ముగా నది యిడు పాత్రతన్ ధనము నంతట సౌఖ్యము నాడు, నేటి యీ చదువులు పాత్రమౌ వినయ సంపద నీయవు గాన, వద్దు యీ చదువులు, బాలబాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా. కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (14-11-2018)
సవరణతో గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2846 సమస్య :: చదువులు బాలబాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా. *చదువులు పిల్లల తెలివితేటలను పాడుచేస్తాయి. బాల బాలికలను చదివించవద్దు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: చదువు వినయాన్ని ఇస్తుంది. వినయము పాత్రతను [యోగ్యతను] ఇస్తుంది. పాత్రత వలన క్రమంగా ధనము ధర్మము సుఖము సిద్ధిస్తాయి అని మహాకవి విష్ణుశర్మ సమకూర్చిన *హితోపదేశము* అనే గ్రంథంలో ప్రస్తావికలో (ఉపోద్ఘాతంలో) 6 వ శ్లోకంలో చెప్పబడియున్నది. ఆ శ్లోకం ఇదే. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతామ్। పాత్రత్వాద్ధనమాప్నోతి ధనాద్ధర్మం తతస్సుఖమ్।। నాటి చదువులు వినయాన్ని ఇచ్చేవి. ఐతే నేటి చదువులు వినయాన్ని ఇవ్వకుండా గర్వాన్ని కలిగిస్తున్నాయి. అందువలన వినయాన్ని నీతిని సంస్కారాన్ని నేర్పని నేటి చదువులు వద్దు. ఇటువంటి ఇప్పటి చదువులు బాల బాలికలకు ఉన్న జ్ఞానాన్ని కూడా పాడుచేస్తున్నాయి. ఈ చదువులు వద్దు అని విశదీకరించే సందర్భం.
చదువులు చక్కగా వినయ సంపద నీయ క్రమక్రమమ్ముగా నది యిడె పాత్రతన్ ధనము నంతట సౌఖ్యము నాడు, నేటి యీ చదువులు పాత్రమౌ వినయ సంపద నీయవు గాన, వద్దు యీ చదువులు, బాలబాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా. కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (14-11-2018)
బరువు మోసి మోసి పరభాష నేర్వగ
రిప్లయితొలగించండిబాల్య మంత కరుగు పరుగు కంటె
ఉన్న యూరు విడచి కన్నతల్లిని వీడ
వలదు, చదువు బాల బాలికలకు
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బలిమి నిడక మదికి భక్తి రక్తి నిడక
రిప్లయితొలగించండికలల నిడక హృదికి కమ్మ గాను
కలిమి నూడ్చి పితల కలవర పరచెడి
వలదు చదువు బాల బాలికలకు
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పసివయస్సునుండి బహుపుస్తకాలను
రిప్లయితొలగించండివీపుమీద మోయు విధము నిచట
కనగ బాధ కలుగు వినుడు భారంబు కా
వలదు చదువు బాల బాలికలకు.
మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఆ.వె.
రిప్లయితొలగించండినేటి బాలలకవని నిరక్షరాస్యత
వలదు, చదువు బాల బాలికలకు
చీకటి పయనమున వేకువ నొసగును
చదువు లేని బ్రతుకు సాధ్యమగునె!
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిసదమల వేదవాఙ్మయ విశాల మహావిభవమ్ము ., సాహితీ
సదనము ., భారతీయజనసమ్మతమౌ మన ఆర్షవిద్యనే
చదువుము ., జ్ఞానమబ్బును , ప్రశాంతత గల్గును , నమ్ము , మ్లేచ్ఛపుం...
జదువులు బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపాలుగారునట్టి పసిమొగ్గలౌ వార
తొలగించండిలైదు వత్సరమ్ములైన లేవు !
బడికి పోవునట్టి వయసు రాకుండనే
వలదు చదువు బాల బాలికలకు !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మంచి చెడ్డ లరసి మర్యాద నేర్పక
రిప్లయితొలగించండిచిలుక పలుకు నటుల చేటు గూర్చు
మమ్మి దాడి య నె డు మాటలు నేర్పగా
వలదు చదువు బాల బాలికల కు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గట్టి చదువు వలయు బట్టి చదువిలలో
రిప్లయితొలగించండివలదు, చదువు బాల బాలికలకు
ఙ్ఙాననేత్రమగును జ్ఞానరాజ్యమునేల,
చదువుకన్నమిన్న జగతిగలదె!
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఐదు వత్సరాల కక్షరాభ్యాసంబు
ఆడుకొనగ వదులు మంత వరకు
నర్స(Nursery)రంచు,క్రేజు(craze) నరయకు మాలోపు
వలదు చదువు బాలబాలికలకు
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అదనపు భోగ లాలసకు నాశగ దూరపు కొండ కోనలన్
రిప్లయితొలగించండిపదిల మటంచు జేరుకొని బాధల నొందుచు చింత నొందగా
వదలని దేశ మోహమున బాసిల జేసెడి సాప్టు వేరులౌ
చదువులు బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సారరహితచదువు సర్దుబాటుమహిమ
రిప్లయితొలగించండిమర్మమరయనట్టిమమతసమత
నడత స్వార్థరహిత నమ్రతనిడనిది
వలదు,చదువుబాలబాలికలకు
శంకర్జీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చదువులు నేడు కొన్ని విషసంస్సృతి నేర్పును చెడ్డదారిలో
రిప్లయితొలగించండిగదితములై, యమూల్యమగు కాలము వ్యర్థమొ నర్చుఁ, బ్రాణమున్
వదలగఁ మూలహేతువగు, వద్దిక పుత్రవియోగకారులౌ
చదువులు బాలబాలికలకు జ్ఞానము నాశమొనర్చు వద్దురా.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిమదుపులు బెట్టి యాంగ్లపు సమంబగు భాషయెలేదటందువో
బదులుగ "నమ్మ","యావు"మరి భక్తిని"నీశ్వరు"డంచు నేర్పు మా(అమ్మ,ఆవు,ఈశ్వరుడు,అ,ఆ,ఈ లను నేర్పుటకు తెలుగు భాషలో)
గదులను వేసి యర్భకుల గాకుల జేయగ"సేబు"(Apple)కర్ర(Bat)లా
చదువులు బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు,వద్దురా!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
చెడ్డ దారిఁజూపి చేటునుఁదెచ్చెడు
రిప్లయితొలగించండివెఱ్ఱి చదువు వేల? కుఱ్ఱకుంక!
నీతి,రీతి,లేని నికృష్టు లెందుకు?
"వలదు చదువు బాల బాలికలకు"
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిసదమలరీతి జన్మభువి ;
రిప్లయితొలగించండిజన్మము నిచ్చిన తల్లిదండ్రులన్ ;
కొదవలు లేని తెల్వినిడు
గుర్వును ; గోవును ; తోటి ప్రాణులన్ ;
జెదరని ధర్మశీలమును
జెల్వుగ జూచుట నేర్పనట్టి యా
చదువులు , బాలబాలికల
జ్ఞానము నాశ మొనర్చు వద్దురా !
జంధ్యాల వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పదవులుజీతబత్తెమనిభావినిభావనసేయనేల యా
రిప్లయితొలగించండిచదువులుశీలహీనమయి స్వార్థపుసౌధలబంధియైవ్యథన్
రొదనెదనించిబంధమును త్రుంచు మహత్తరవృత్తివిద్యలా?
*"చదువులు బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా"
శంకర్జీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
విద్యలెన్ని చదివి విర్ర వీగినగాని
రిప్లయితొలగించండిఅసలు విద్య లేక అవకతవక
హరిని తెలియు విద్య హారము, యదిలేక
వలదు చదువు బాల బాలికలకు
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'హారము + అది' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "హారమె యదిలేక" అనండి.
హృదయ వికాసమున్ గొలుపు రీతిగ జక్కగ నుండగావలెన్
రిప్లయితొలగించండికదలిక తెచ్చిపెట్టి భువి కర్కశ బుద్ధుల మార్చగా వలెన్
పదుగురి మేలుకోసమై సతము పాటుపడంగనె ; యట్లు గానిచో
"చదువులు బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపదవుల నెక్కి చెప్పెదరు ఫారెను వద్దిక, నాంగ్ల భాష,యా
చదువులు బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా
తదితరముల్ యటంచు, భళి తాము ప్రజాతిని నంపుచున్ జనా
న దెసదెసల్ జిలేబులవ! నమ్మకు నమ్మకు నమ్మకయ్యరో!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఇతరముల్ + అటంచు' అన్నపుడు యడాగమం రాదు. 'ప్రజాతిని / ప్రజాళిని' టైపాటా?
రిప్లయితొలగించండిరాజకీయ మెల్ల రాణించు కేంపసు
వలదు, చదువు బాల బాలికలకు
జ్ఞాన నేత్ర మును సజావుగ విప్పగ
మేలు కల్గు నమ్మ మేటిగాన!
జిలేబి
జిలేబి గారు:
తొలగించండిఒక మాటు వరూధిని చూడండి...
జిలేబి గారూ,
తొలగించండిమీ యీ తాజా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిబరువు బ్యాగులేల బడిపిల్లలకనుచు
కార్పొరేటు బడులకంపుచుంద్రు
నడుము వంచు చదువునాణ్యమైనదికాదు
వలదు చదువు బాలబాలికలకు!!
గంగాప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2846
సమస్య :: చదువులు బాలబాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా.
*చదువులు పిల్లల తెలివితేటలను పాడుచేస్తాయి. బాల బాలికలను చదివించవద్దు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: చదువు వినయాన్ని ఇస్తుంది. వినయము పాత్రతను [యోగ్యతను] ఇస్తుంది. పాత్రత వలన క్రమంగా ధనము ధర్మము సుఖము సిద్ధిస్తాయి అని మహాకవి విష్ణుశర్మ సమకూర్చిన *హితోపదేశము* అనే గ్రంథంలో ప్రస్తావికలో (ఉపోద్ఘాతంలో) 6 వ శ్లోకంలో చెప్పబడియున్నది.
ఆ శ్లోకం ఇదే.
విద్యా దదాతి వినయం
వినయాద్యాతి పాత్రతామ్।
పాత్రత్వాద్ధనమాప్నోతి
ధనాద్ధర్మం తతస్సుఖమ్।।
నాటి చదువులు వినయాన్ని ఇచ్చేవి. ఐతే నేటి చదువులు వినయాన్ని ఇవ్వకుండా గర్వాన్ని కలిగిస్తున్నాయి. అందువలన వినయాన్ని నీతిని సంస్కారాన్ని నేర్పని నేటి చదువులు వద్దు. ఇటువంటి ఇప్పటి చదువులు బాల బాలికలకు ఉన్న జ్ఞానాన్ని కూడా పాడుచేస్తున్నాయి. ఈ చదువులు వద్దు అని విశదీకరించే సందర్భం.
చదువులు చక్కగా వినయ సంపద నీయ క్రమక్రమమ్ముగా
నది యిడు పాత్రతన్ ధనము నంతట సౌఖ్యము నాడు, నేటి యీ
చదువులు పాత్రమౌ వినయ సంపద నీయవు గాన, వద్దు యీ
చదువులు, బాలబాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (14-11-2018)
కోట వారూ,
తొలగించండినేటి విద్యావిధానంలో లోపాలను ఎత్తి చూపిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
సవరణతో
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2846
సమస్య :: చదువులు బాలబాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా.
*చదువులు పిల్లల తెలివితేటలను పాడుచేస్తాయి. బాల బాలికలను చదివించవద్దు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: చదువు వినయాన్ని ఇస్తుంది. వినయము పాత్రతను [యోగ్యతను] ఇస్తుంది. పాత్రత వలన క్రమంగా ధనము ధర్మము సుఖము సిద్ధిస్తాయి అని మహాకవి విష్ణుశర్మ సమకూర్చిన *హితోపదేశము* అనే గ్రంథంలో ప్రస్తావికలో (ఉపోద్ఘాతంలో) 6 వ శ్లోకంలో చెప్పబడియున్నది.
ఆ శ్లోకం ఇదే.
విద్యా దదాతి వినయం
వినయాద్యాతి పాత్రతామ్।
పాత్రత్వాద్ధనమాప్నోతి
ధనాద్ధర్మం తతస్సుఖమ్।।
నాటి చదువులు వినయాన్ని ఇచ్చేవి. ఐతే నేటి చదువులు వినయాన్ని ఇవ్వకుండా గర్వాన్ని కలిగిస్తున్నాయి. అందువలన వినయాన్ని నీతిని సంస్కారాన్ని నేర్పని నేటి చదువులు వద్దు. ఇటువంటి ఇప్పటి చదువులు బాల బాలికలకు ఉన్న జ్ఞానాన్ని కూడా పాడుచేస్తున్నాయి. ఈ చదువులు వద్దు అని విశదీకరించే సందర్భం.
చదువులు చక్కగా వినయ సంపద నీయ క్రమక్రమమ్ముగా
నది యిడె పాత్రతన్ ధనము నంతట సౌఖ్యము నాడు, నేటి యీ
చదువులు పాత్రమౌ వినయ సంపద నీయవు గాన, వద్దు యీ
చదువులు, బాలబాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (14-11-2018)
శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు
తొలగించండిహృదయపూర్వక ప్రణామాలు.
ఛండామార్కుల గురుకులంలో పిల్లలకు ప్రహ్లాద బోధ:
రిప్లయితొలగించండిముదమును గూర్చుచున్ తుదకు ముక్తినొసంగెడి మేలుమార్గమౌ
సదమల విష్ణునామమును చక్కగనే భజియించ మేలురా
బెదరెదరేల రండి! ఘన వేలుపు శ్రీహరి నెంౘకున్న నా
*"చదువులు బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా"*
*చండామార్కులు
తొలగించండివిట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పారి తోషకములు పాచిబోయిన కూడు
రిప్లయితొలగించండిపదవులెన్ని యున్న పరము గాదు
దేవ దేవు గనక దేనికయ్య వలదే
వలదు చదువు బాల బాలికలకు
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సార మెఱుగు నట్టి చదవులే చదువులు
రిప్లయితొలగించండికరుణ రసము గలుగు కవిత కవిత
హితము గూర్ప కుండ హీనమై యున్నచో
వలదు చదువు బాల బాలికలకు
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వలదు భక్తి, వలదు ఫాలనేత్రుని పూజ
రిప్లయితొలగించండివలదు జ్ఞానమింత, వలదు ముక్తి
వలదు! బుద్ధిఁ బెంచు, వాసినిచ్చును కదా
*"వలదు చదువు బాల బాలికలకు"*
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని సమస్యాపరిష్కారం అయినట్టు లేదు.
బెదరక పాఠశాలలకు ఫీజులకయ్యెడి డబ్బుఖర్చుకున్
రిప్లయితొలగించండికుదరదు లేనివారమని కూలికి పంపుట భావ్యమంచు మీ
హృదయమునందు తల్చవలదెవ్వరు సంఘమునందు నేర్పకన్
*"చదువులు, బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా"*
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
చదువుకొనే విద్యార్థుల చేతిలో అరచేతిని మించిన
వెడల్పు touch screen సెల్ఫోనులు అవసరమా ?
సెల్ఫోనులు మేలు కన్నా కీడు ఎక్కువ కలిగిస్తాయి
తెలుసా !
.................................................................
చదువుకొనంగ గష్టపడి చక్కని వృత్తులు లభ్యమౌ గదా |
చదువుకొనన్ బ్రశస్తమగు సంస్కృతి యబ్బును జీవితమ్మునన్ |
చదువక - సెల్లులో కన నసహ్యపు బొమ్మల , గేమ్సు నాడినన్ ,
చదివిన నెప్డు ప్రేమికుల చాట్సును , నీ బ్రతు కెల్ల భగ్నమౌ ||
చదువుము పాఠ్యముల్ సతము | సభ్యత గూర్చని యట్టి
తుఛ్ఛపుం
జదువులు బాల బాలికల ఙ్ఞానము నాశ మొనర్చు వద్దురా !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
సీసములో నా పూరణము
రిప్లయితొలగించండికాంచ కుంటిమి గద కావు కావ నని కాకుల నీ ధరణి లోన,కుక్క లెచట
నున్న భౌభౌయను నన్ని వేళల లోన,మ్యావ్,మ్యావ ను చునుండు మరువ కుండ
మాతృభాష నెపుడు మార్జాలములు నెచట వసించు చున్నను,టక్కులాడి
పరభాష యన్నచో ప్రాకులాడుచు నుండు మన
తెలుగు జనత, మాత రొమ్ము
పాలు గుడుచుచు తన్నెడి పాత కులన
వచ్చునుగ, మహిలో నట్టి వారలను,శి
వము నిడగ లేని భాషలు వమ్ము గాదె,
వలదు చదువు బాల బాలికలకు
పూసపాటి కృష్ణ సూర్య కుమార్, బంధకవి,గుంటూరు
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విదితము జేయునేదొ యదె
రిప్లయితొలగించండివిద్యగ సంఘమునందు నొప్పగన్
కదిలెడు కాలమందు ప్రతి
కంపన నిచ్చెడు శాస్త్ర నైపుణిన్
మది గొనలేక తద్విభవ(తద్విషయ)
మాతృక గానగలేని దృష్టిలో
చదువులు బాలబాలికల
జ్ఞానము నాశమొనర్చు వద్దురా!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య :-
రిప్లయితొలగించండివలదు చదువు బాలబాలికలకు
*ఆ.వె**
స్వేచ్ఛగా తిరిగెడు సీతాకొక చిలక్కు
సంకెలలను వేసి జైలునుంచి
మంచి ర్యాంకు కొరకు మనసున వొత్తిడి
వలదు చదువు బాల బాలికలకు
....................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సీతాకోక'ను 'సీతాకొక' అన్నారు. 'చిలక్కు' అనడం వ్యావహారికం.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపిల్లల ననయమ్ము బేలలుగా పెంచ
వలదు! చదువు బాలబాలికలకు
లోక కలన మిచ్చి లుంఠించు ననువుగా
కాన వారికెల్ల కలుపు దాని
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిచదివియు బాల్యమందు కడు చక్కగ
విద్యలు నేడు పెద్దలై
వదులుచు న్యాయ ధర్మముల పాపులు చోరులు లంచగొండులై
మదమున ముంచిరీ రహి సమాజమునున్ ;కన విద్య వ్యర్థమే!
చదువులు బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా
🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
🌷వనపర్తి🌷
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ....
రిప్లయితొలగించండినశ్వరమగు చుండె నైతిక విలువులు
నేటి విద్యలోన నిజము సుమ్మి
జ్ఞాన, నియమ, నీతి హీన మయిన విద్య
వలదు చదువు బాల బాలికలకు.
గండూరి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అడ్డగాడిదవలె నడయాడుచుండుచో
రిప్లయితొలగించండివలదుచదువుబాలబాలికలకు
చదువువలననగునుసత్పురుషునిగను
చదువులేనియతడుచవటయెగద
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పిన్న లకట వీరిఁ బేర్మినిఁ జూడంగ
రిప్లయితొలగించండివలయు సుమ్మి వీడఁ బాడి కాదు
చెందకుమ నిరాశ చెప్పుము, కోపము
వలదు, చదువు బాల బాలికలకు
చదలునఁ దిర్గు పక్షులకు శాస్త్రము సెప్పిరె యెవ్వరేని యీ
యుదక వసుంధరా చర మృగోత్కరముల్ వినెనే వచింప కీ
పదుగురు చెప్పు చుంటిరని పశ్చిమ దేశము లందు మర్మపుం
జదువులు, బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు, వద్దురా
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
పదుగురు పోవు బాటలను పట్టుకు పోవుచు క్యాలిఫోర్నియన్
వదలక గ్రీను కార్డునకు వంగుచు పెట్టుచు వంద దండముల్
కుదువలు పెట్టి యాస్తులను కుంపటి రాజుట యేకలక్ష్యమౌ
చదువులు బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా :)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
పదునుగజేయునెప్పుడునుభారముగాదలంచకున్నచో
రిప్లయితొలగించండిచదువులుబాలబాలికలఙ్ఞానము,నాశమొనర్చువద్దురా
యదనపుభోగలాలసతలన్నియు,జీవితమేకృశించురా
చదివినమంచివారుగనుఙ్ఞానముబెంచుమనీషులౌదురే
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం.
చదువులె దివ్యనేత్రములు, సంస్కృతి సభ్యతఁ నేర్పగావలెన్
రిప్లయితొలగించండిజదువులె, భావికాలసుఖసాధకమార్గముఁ జూపగా వలెన్
జదువులె, జీవహానికరజాతిసమాజవినాశహేతులౌ
జదువులు బాలబాలికల జ్ఞానము నాశమొనర్చు వద్దురా!.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
స్వార్థచింత చేత చదువులుగొనిబెట్టి
రిప్లయితొలగించండికట్నకానుకలకు కట్టబెట్టి
పదవులెంచి పాపభాగ్యంబులాశించ
వలదు చదువు బాలబాలికలకు
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విపణి వీధులందు విత్తమార్జింపగ
రిప్లయితొలగించండిసాధనములు పాఠశాలలయ్యె
వత్తిడులను బెంచి ప్రాణంబు దీయగా
వలదు చదువు బాల బాలికలకు.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిస్త్రీ పురుషులు చూడ సృష్టిన్ సమానమే
రిప్లయితొలగించండిలేదు బేధమనుచు లెస్సఁ బలికె
జ్ఞానమున్నఁ జాలు గతి మారు కద - యేల
వలదు చదువు బాల బాలికలకు ?
వదలక వేద వాజ్ఞ్మయ వివర్ధితమై బహుళ ప్రశస్తమై
సదమల భక్తి తత్త్వ విలసన్ముఖమౌ మన యార్ష విద్యచే
ముదమును శాంతియున్ గలుగు, పుణ్య నిధానము ప్రాచ్యమున్ వినా
చదువులు బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా
యేలవలదు చదువు బాల! బాలికలకు ?
రిప్లయితొలగించండిసంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
విద్య వినయ మొసగి విజ్ణత పెంచుచు
రిప్లయితొలగించండినీతి నియమ ము లను నేర్పు చుండ
వలదు చదువు బాల బాలికల కనుచు
పలుకు టుచిత మగునె ప్రాజ్ను లార!
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికూడుగుడ్డ కొరకు, కూడబెట్ట ధనము
రిప్లయితొలగించండిపరులదేశములకు నరుగు చుండ
వలదు చదువు బాల బాలికలకునంచు
పలుక న్యాయమగున తెలుపుడయ్య?
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చదువుల జేప్పువారమని చక్కని మార్కుల దెచ్చుచున్ సదా
రిప్లయితొలగించండిమొదటగ నిల్చువారమని మోసము జేయుదు కాణముల్ గదా
చదువులనమ్ము నట్టి ఘన సంస్థల బట్టివిధానమందునన్
జదువులు బాలబాలికల జ్ఞానము నాశమొనర్చు, వద్దురా!
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వలదు చదువటంచు వసుధలో నెపుడన
రిప్లయితొలగించండివలదు చదువు బాల బాలికలకు
వలయు నైతికతను వాసిగా పెంచెడు
చదువు వలయు సతము జగతి యందు.