6, నవంబర్ 2018, మంగళవారం

సమస్య - 2838 (నరక హంతకుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నరక హంతకుండు గరళగళుఁడు"
(లేదా...)
"నరక నిహంత యయ్యెఁ గద నాగగళుం డగజాత మెచ్చఁగన్"

96 కామెంట్‌లు:

  1. కైటభాంత కుండు! కరినేస్తి!వెన్నుడా
    నరక హంతకుండు, గరళగళుఁడు!
    నాగ భూష ణుoడు! నటరాజు! సతతము
    నవని లోన మదన హంతకుండు,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కరినేస్తి' దుష్టసమాసం. సవరించండి.

      తొలగించండి
  2. తల్లి జంపె నంట తనయుడు నరకుని
    పూర్వ జన్మ శాప పున్నె మనగ
    మారు డనగ వాని మట్టుపర చెనంట
    నరక హంత కుండు గరళ గళుఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శాప పున్నెము' దుష్టసమాసం. "శాపపు ఫల మనగ" అనండి.
      కొంత అన్వయలోప మున్నది.

      తొలగించండి
  3. చింతా రామకృష్ణారావు గారి పద్యం.....

    కవన కుతూహలంబు కలుగంగ సమస్యలనిచ్చుచుండు ప్రా
    భవమున శంకరయ్య. కవిపాళిని పెంచెడి కల్పవల్లిగా.
    కవుల మనంబులంగెలుచు కందిగనీవయి కాచు మమ్ములన్
    ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

    రిప్లయితొలగించండి
  4. అరయగ తెలియునుర సరిగ కృష్ణుండగు
    నరక హంతకుండు; గరళగళుఁడు
    వరలుచుండు గదర పార్వతీశుడగుచు...
    పరువు బోవు నిటుల ప్రశ్నలిడగ :)

    రిప్లయితొలగించండి


  5. దీపావళి శుభాకాంక్షలతో



    సత్య భామ తోడు సమితిని కృష్ణుడు
    నరక హంతకుండు, గరళగళుఁడు
    కొండచూలి తోడు గుబ్బలివిలుకాడు
    మదనరిపువు గాదె మదిరనయన!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. చరకు డనెడివాడు నరకుడన్ మిత్రున
    కనియె వరములంది యాకసమున
    దిరుగు దుష్టులైన త్రిపురదైత్యులకును
    నరక! హంతకుండు గరళగళుఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      నరక శబ్దాన్ని సంబోధనగా చేసిన మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  7. (నరకాసురారి- త్రిపురాసురారి)
    గరుడుని పైన నేగి హరి
    కర్కశభావుడు శిష్టపీడుడౌ
    నరకనిహంత యయ్యె గద ;
    నాగగళుం డగజాత మెచ్చగన్
    బురహరుడయ్యె దుర్మదవి
    మోహితదైత్యుల జీల్చివైవగా
    మురహరినే శరమ్ముగను
    పోడిమి నేసి ప్రయోగదక్షతన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  8. నిరతము జీవకోటులకు నిస్తులపీడలు గూర్చుచుండి యీ
    ధరపయి దుర్మదాంధుడయి దైత్యబలంబున సంచరించ నా
    హరి యట కృష్ణుడై నిలిచి యంగనతోడ మహాహవంబునన్
    నరక నిహంత యయ్యెఁ గద నాగగళుం, డగజాత మెచ్చఁగన్"

    రిప్లయితొలగించండి
  9. చన్ను మొనల లోని ఛందము తోడుగ
    పూతన యసువులు యపూపము వలె
    ఆరగించెను లయ కారుండు, వాడమ్మ
    నరక హంతకుండు గరళగళుఁడు

    🙏🙏🙏🌹🌷🌹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...యసువుల నపూపము వలె' అనండి.

      తొలగించండి
    2. గురువు గారికి వందనము... సరి చేసాను
      🙏🙏🙏🌹🌹🌹

      చన్ను మొనల లోని ఛందము తోడుగ
      పూతన యసువుల నపూపము వలె
      ఆరగించెను లయ కారుండు, వాడమ్మ
      నరక హంతకుండు గరళగళుఁడు

      తొలగించండి


  10. అరయగ రెండు గాధలివి! హంతకులయ్యిరి పుణ్యపూరుషుల్
    సరసన ప్రాపు సత్య యన సంగరమందున నల్లనయ్య తా
    నరక నిహంత యయ్యెఁ గద, నాగగళుం డగజాత మెచ్చఁగన్
    మరుని భళా,జిలేబి తునుమాడెను ధ్యానము నడ్డగింపగా


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. (అరయగ పూరణాగతిని నంజయ జూపిన పద్ధతిన్ భళా!
    విరిసిన మందహాసమును విట్టగు నేనిక పూర్తి చేసెదన్)

    వరములనేకముం గలుగ వారిజ నేత్రల మోహమందునన్
    ధరకును భారమై సుతుడు దానవ చేష్టలఁ బెల్లుమీఱగన్
    హరి తన దారఁ గూడి చనె నా రణమందున విక్రమించుచున్
    *"నరక నిహంత యయ్యెఁ గద, నాగగళుం డగజాత మెచ్చఁగన్"*

    రిప్లయితొలగించండి
  12. నరక చతుర్దశి శుభాకాంక్షలతో...

    ఆ.వె
    నరులు జరుపుచుంద్రు నరకచతుర్దశి
    హరియె కాగ నరక హంతకుండు,
    కామహంతకుండె గాని మనకు కాడు
    నరకహంతకుండు గరళగలుడు.

    రిప్లయితొలగించండి
  13. మహామాయ గూడి మదనారి ముదమున
    సర్వ లోకములను చక్కబెట్టు
    నెంచి చూడ నతడె యెల్లరి యజ్ఞాన
    నరక హంతకుండు గరళగళుడు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదం మొదటి గణం (మహా) వగణ మయింది. అక్కడ హగణం కాని, నగణం కాని ఉండాలి కదా?

      తొలగించండి
    2. అవును గురువుగారూ! మహిత మాయ యనిన సరిపోవునా?

      తొలగించండి
  14. సత్య తోడు రాగ శౌరి యయ్యె ను గద
    నరక హంత కుండు ; గరళ గ ళుడు
    భక్త సులభు డ గు చు భవ బంధ ములు బాప
    గిరిని వా స ముండు గిరిజ తోడ

    రిప్లయితొలగించండి
  15. మురహరి తోడ సత్యయును ముద్దుగబోయెనుఁజూడవచ్చు సం
    గరమని, శౌరి మూర్ఛిలగ కౌశలతన్ కరమందువిల్లుతో
    నరియగు ధరాత్మజున్ దునిమి యద్భుతరీతిని కోమలాంగి తా
    నరక నిహంత యయ్యెఁ గద నాగగళుం, డగజాత మెచ్చఁగన్
    (నాగగళుండు, అగజాత ఇద్దరు మెచ్చుకొనగా

    రిప్లయితొలగించండి
  16. మైలవరపు వారి పూరణ

    నారదుడు నరకునికి హితోపదేశం చేసినట్లు భావించి....

    నరక ! నిహంత యయ్యెఁ గద నాగగళుం డగజాత మెచ్చఁగన్
    బురమథనమ్మునందు , దలపోయుము దైవమె కాలరూపుడౌ!
    కరుణను చిందు చూపులవి కర్కశదృక్కులునౌను ! కృష్ణుడే
    హరి యను దైవమౌ , గనననంతుని నంతముఁ జేయ శక్యమే ?!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

    2. *నీలకాయు* డొకడు *నీలకంఠు* డొకడు
      *భుజగశాయి* యొకడు *భుజగధరుడు* !
      *మురహరి* యననొకడు *పురహరి* యొక్కడు ,
      *నరకహంతకుండు ., గరళగళుడు*!!

      తొలగించండి
  17. సత్యభామాపతి!శకటారి!వ్రజ మోహనుండు గోపాల బా లుండు యాద
    వుండు (నరక హంతకుండు, గరళ గళుఁ డు!) పురారి! చంద్ర చూడుడు! నభవుడు!
    బుడిబుడి తాల్పుడు !బూచులరాయుడు !జలధి తూ ణీరుoడు !జంగమయ్య
    తరచి చూడగ పుష్ప ధన్వుని తనకన్ను తోపరి మార్చెను, తండ్రి యాజ్ఞ
    మేర ముని వాటికకుచేరి మిన్ను లోన
    రక్కసు లిరువురన్ చంపె రాఘ వుoడు
    తెలుసు కొనుము, మీరు యనుచు పలికె నంత
    పాఠశాలలో ముదముగా పంతు లొకడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణసూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మీరు + అనుచు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "మీర లనుచు" అనండి.

      తొలగించండి
  18. దుష్ట పాలనమును తొలగించనెంచగ
    అవతరించె హరియునవనిలోన
    పాపహరణమునకు పాలకులే వీరు
    నరకహంతకుండు,గరళగళుడు!!

    రిప్లయితొలగించండి
  19. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2838
    సమస్య :: నరక నిహంత యయ్యె గద నాగగళుం డగజాత మెచ్చగన్.
    *నరకుని శివుడు చంపినాడు. అప్పుడు పార్వతి మెచ్చుకొన్నది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: వరదుడు భక్తవత్సలుడు పశుపతి ఐన బోళాశంకరుడు. హాలాహలమును తాను మ్రింగి అందఱి ప్రాణములను కాపాడిన మహాదేవుడు. ఐతే లోక కల్యాణ కారిగా ప్రశాంత మూర్తిగా కనిపించే పరమ శివుడు ఒక్కొక్కప్పుడు ప్రళయ కాల రుద్రుడై లయకారకుడై దుష్టశిక్షణ చేస్తాడు.
    తారకాసురుని కుమారులు అగు విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు అనే ముగ్గురు రాక్షసులు మయుడు నిర్మించి యిచ్చిన మూడు నగరములలో ఉంటూ లోకములను పీడిస్తూ ఉండగా ఆ త్రిపురములను త్రినేత్రుడు తన పాశుపతాస్త్రముతో ముక్కలు ముక్కలుగా నరకి వేశాడు. త్రిపుర నిహంత అయ్యాడు. అప్పుడు ప్రక్కనే ఉన్న పార్వతి తన భర్తయైన ఆ త్రిపురాంతకుని గొప్పగా మెచ్చుకొన్నది అని త్రిపురాసుర సంహార ఘట్టమును విశదీకరించే సందర్భం.

    వరదుడు భక్తవత్సలుడు భర్గుడు ప్రాణము నిల్పు నొక్కచో,
    కరుణను వీడి యా విలయ కాలుడె ప్రాణము దీయు నొక్కచో,
    పురములు లోక పీడ నిడ పూర్తిగ వాటిని నుగ్గు జేయ వే
    నరక, నిహంత యయ్యె గద నాగగళుం డగజాత మెచ్చగన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (6-11-2018)

    రిప్లయితొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తపము నందు మునిగి తన్మయ మొందంగ
    మరులు గొల్ప నెంచి మసలి నట్టి
    పచ్చవింటి వాని భస్మమ్ము గావించె
    నరక హంతకుండు గరళ గళుడు

    రిప్లయితొలగించండి
  21. జనుల దుర్గతులను, జనన మరణములు
    పాప పుణ్యములను, పాహి పాహి
    యనగ బాపు వాడు అరయ శివుడు మన
    నరక హంతకుండు గరళగళుఁడు

    🙏🙏🙏🌹🌷🌹

    రిప్లయితొలగించండి
  22. ధరకు హరివరమిడి ధరజుజంపించి యే
    పేర్వడిసె?హరుండు పెన్జలధి జ
    నించిన గరళముగొని వరలె నేపేర?
    నరకహంతకుండు;గరళగళుడు

    రిప్లయితొలగించండి
  23. భేదమేమివలదు ప్రియముగా నిద్దర
    గొలువుడయ్య మీదు కోర్కెదీర
    మిత్రులిరువురెపుడు, మెచ్చగాలోకాలు
    నరక హంత కుండు, గరళ గళుఁడు

    రిప్లయితొలగించండి
  24. క్రొవ్విడి వెంకట రాజారావు:

    హరియట సత్యభామను సహాయముగా గొని లోకులు సంతసించగన్
    నరక నిహంత యయ్యెగద; నాగగళుండగజాత మెచ్చగన్
    కరివదనున్ ఘనమ్ముగ విఘాత గణమ్ములకెల్ల నీశుగా
    నరుసముతోడ నిర్ణయ మొనర్చెను నందరి యొప్పు తోడుతన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  25. ఒకరు గీత నుడివి యుపకార మొనరింప
    గరళ మాని యొకరు కరుణ జూపె
    నిష్ట దైవములుగ సృష్టపరతు నేను
    నరక హంతకుండు ; గరళగళుఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'స్పష్టపరతు' టైపాటు.

      తొలగించండి
  26. గురువు గారికి నమస్కారములు. సవరించిన పద్యం:

    హరియట సత్యభామను సహాయముగా గొని లోకమెంచగన్
    నరక నిహంత యయ్యెగద; నాగగళుండగజాత మెచ్చగన్
    కరివదనున్ ఘనమ్ముగ విఘాత గణమ్ములకెల్ల నీశుగా
    నరుసముతోడ నిర్ణయ మొనర్చెను నందరి యొప్పు తోడుతన్

    రిప్లయితొలగించండి
  27. satyanarayana@gmail.com
    డా. పిట్టా సత్యనారాయణ
    అయ్యగారి గుండు యచ్చము శివలింగ
    మన్నరీతి ముడిడ హా!యిదేమి?
    విరుపు కథ మరొకటి విప్పెనా"ముప్పాళ"(రంగనాయకమ్మ)
    "నరక హంతకుండు గరళగళుడు?!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గుండు + అచ్చము' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. 'ముడిడ'?

      తొలగించండి
  28. satyanarayana@gmai.com
    మొర యది భిక్ష(భవతి భిక్షాందేహి)కోసమని ముద్దుగ జేరెను యన్నపూర్ణ నా
    కరమున గొన్న యన్నమున కాశిని జేసెడు కృత్యమేమిటో?
    అరయును మృత్యువాత బడ నందరి పాపము బాపు చర్యయే
    నరక--నియంత యయ్యెగద నాగగళుండగజాత మెచ్చగన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..జేరెను + అన్నపూర్ణ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

      తొలగించండి

  29. సతిని గూడినట్టి చక్రధారి మహిని
    నరక హంతకుండు! గరళ గళుడు
    తపము చెఱచె ననుచు తక్షణమె తనదు
    కన్ను తెఱచి జంపె కాముని గద!

    గురువర్యులకు నమస్సులు, నిన్నటి నా పూరణ ను కూడా పరిశీలించ ప్రార్థన. ధన్యవాదములు.

    మాతలకే మాత జగ
    న్మాత యనగ వాణి, యుమ, రమల కలయికగా
    ప్రీతిని మనమున దాల్చుచు
    మాతలు మువురైన నొక్క మాత గొలుతువా!

    రిప్లయితొలగించండి
  30. వరలగలోకశుద్ధికిభవాఘముయాగము ముప్పురంబులు
    న్మరుడుజలంధరాంధకులమానుషచేష్టలుబంధనమ్ములున్
    కొరకగరానికొయ్యలనకూళలు లోకములోనహెచ్చ తా
    నరక,నిహంతయయ్యెగద నాగగళుండగజాతమెచ్చగన్

    రిప్లయితొలగించండి
  31. నందనందనుండునాగశయనుడుసు
    నరకహంతకుండు,గరళగళుడు
    నాగభూషణుండునాబరగుచునిల
    భక్తకోటినెపుడురక్తిజూడు

    రిప్లయితొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మరువగ లేని పద్ధతిని మంచిగ కృష్ణుడు సత్యభామతో
    నరక నిహంత యయ్యెఁ గద;...నాగగళుం డగజాత మెచ్చఁగన్
    బరువు సమస్య లిచ్చుచును వందలు వేలును కందివర్యుడై
    మురియుచు నుండు మోదమున ముచ్చట మీరగ భాగ్యనగ్రిలో :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      రోజుకు సగటున 150 పద్యాలను పరిశించే నాకు మోద మెక్కడిది?

      తొలగించండి
    2. "శంకరుడు" అనగా మోదమునిచ్చువాడు. మీకు లేనిది మాకెలా ఇస్తారు సార్!

      😊

      తొలగించండి
  33. అమ్మ దిద్దె నపుడు బొమ్మను కాపుంచ
    కాపు గాయుచుండె గడప వద్ద
    అడ్డ గించి నపుడు ఆగ్రహమునతల
    నరక హంత కుండు గరళ గళుడు
    కొరుప్రోలు రాధాకృష్ణారావు




    రిప్లయితొలగించండి


  34. శిష్టరక్షణమును చేయ నవతరించె
    నరక హంతకుండు గరళగళుడు
    తాలయకరుడగుచు ధరణి సంరక్షించు
    ననరతమను చుందు రార్యులెల్ల.
    రెండవ పూరణ.

    భక్త జనుల బ్రోచు పరవాసుదేవుడీ
    నరక హంత కుండు. గరళగళుడు
    గిరిజ గూడి సతము కేళిని సలుపుచు
    దురితములను బాపు ధూర్జటి కద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'అనరతము' అన్న పదం లేదు. 'అనారతము' ఉన్నది.

      తొలగించండి
  35. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    నరక హంతకుండు గరళగళుఁడు

    సందర్భము: శ్రీ కృష్ణుడు నరకాసురు నితో చివరి మాటగా ఇలా అంటున్నాడు.
    "నేను సాక్షిమాత్రుణ్ణే! శివుని యాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు గదా! నే నెవణ్ణి నిన్ను చంపడానికి? గరళ కంఠుడే చంపేవాడు.. చివరి క్షణంలో శివుణ్ణి తలుచుకో!"

    ఒకే భావం రెండు భిన్నమైన పద్యాల్లో చెప్పడం యిందులోని విశేషం.
    మొదటిది ఆటవెలది..
    రెండవది తేటగీతి..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "నేను గాదు.. శివుని యానతి లేకుండఁ
    జీమయయినఁ గుట్టునే! మరువకు..
    నరక! హంతకుండు గరళ గళుడు సుమా!
    శివునిఁ దలచుకొనుము చివరి క్షణము" 1

    "శివుని యానతి లేకుండఁ జీమయయినఁ
    గుట్టునే! నిన్నుఁ జంపగాఁ గోరఁ.. గాని,
    మరువక శివుని స్మరియించు నరక! హంత
    కుండు గరళ గళుడు సుమా!
    కువలయమున" 2

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    6.11.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. ఆటవెలది పాదాన్ని తేటగీతిలో ఇమిడ్చిన రెండవ పూరణ ప్రశంసనీయం. అభినందనలు.

      తొలగించండి
  36. పరఁగి తిక్కన హరిహర నాథ యంచును
    జేసె రచన నపుడు చిత్త మలర
    భేద మనఁగ లేక వెల్గుదు రిద్దఱు
    నరక హంతకుండు గరళ గళుఁడు


    నరముని దేవ సంఘముల నైరృతి నాథులు దుష్ట చిత్తులై
    యురువుగ నేఁచు చుండగ బలోద్ధతి నీశ్వరుఁ డుత్సహించగన్
    నరహరి దైత్యు లా త్రిపుర నాముల శ్రీపతి బాణ రూపుఁడై
    నరక నిహంత యయ్యెఁ గద నాగ గళుం డగ జాత మెచ్చగన్

    [నరక (న్) =నఱకఁగ); కదన అగ గళుండు: యుద్ధ మను చెట్టు ధూపమును పీల్చు వాఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  37. విదురుడు సుయోధనుని తో శ్రీకృష్ణపరమాత్మ గురించి చెబుతూ...

    ఆటవెలది
    తెలియ వయ్య నీవు, త్రేతాయుగమ్మున
    మూర్తులిద్దరు భువిఁ బుట్టి రనఁగ
    ఇనకుల తిలకుడును హనుమంతుడను వారు
    నరకహంతకుండు, గరళగళుఁడు
    ** ** **
    చంపకమాల
    తరుణుల మానముల్ గొనఁగ తాళగ లేకను పక్షినెక్కుచున్
    నరకుని ద్రుంచుచున్ భువికి న్యాయము గూర్చెడు నాశయమ్ముతో
    మురహరి సత్యభామఁగొని పోరున కేగియు గూల్చినంతటన్
    నరక నిహంత యయ్యెఁ గద, నాగగళుం డగజాత మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  38. దురమున సందియమ్మ! బువి దుష్టుల దున్మ విచారమేమి?, నీ

    వరయగ వీరభూపవరవంశజు వయ్యుఁ , గిరీటి! యా నిశా

    చరపరభక్తులందు వరసత్త్వవిగర్వితదుష్కృతమ్ము నో

    నర! కని, హంత యయ్యె గద! నాగగళుం డగజాత మెచ్చగన్.

    కంజర్ల రామాచార్య.
    కోరుట్ల.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  39. ఇహము పరము నొసగు నీశ్వరు డాతడు
    పరమ యోగి బృంద వరదు డతడు
    పాప పంకిలమున తాప నరక హంత
    కుండు! గరళ గళుడు! కొలుతు వాని!

    రిప్లయితొలగించండి
  40. ఇరవుగసత్యభామనుమహీధరరాజులుమెచ్చునట్లుగా
    నరకనియంతయయ్యెగద,నాగగళుండగజాతమెచ్చగ
    న్గరళముద్రాగెనయ్యెడలగాదిలికోడలిమానసంబుదా
    యరమరకేదియున్గనకహాయిగనుండెనునాక్షణంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దా నరమర...' అనండి.

      తొలగించండి
  41. నందనందనుండు నవనీత చోరుడే
    నరక హంతకుండు, గరళగళుడు
    తపము నడ్డుకొనెడు తామరతూపరిన్
    బూదిగాను మార్చె క్రోధనమున!!!

    రిప్లయితొలగించండి
  42. కరివరదుడె గాక కంసారి హరి యయ్యె
    నరక హంతకుండు; గరళగళుఁడు
    సురను నెమకు చుండి సురల సురులు త్రవ్వ
    నరుగు దెంచ విషము నారగించె

    నిన్నటి సమస్యకు నా పూరణ

    మాతయి త్రిమూర్తు ల సతిగ
    నాతల్లియె రూపుదాల్చె ననెదరు దుర్గన్,
    యే తీరున నడిగితి రిటు
    మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా ?

    రిప్లయితొలగించండి
  43. సవరణతో

    శిష్టరక్షణమును చేయ నవతరించె
    నరక హంతకుండు గరళగళుడు
    తాలయకరుడగుచు ధరణి సంరక్షించు
    నందు రార్యు లెల్ల రనవరతము

    మరొక పూరణ

    సత్యతోడ తాను సంతసాన మరలె
    నరకహంతకుండు,గరళగళుడు
    నాగభూషణుండు నగజాత తోగూడి
    తాండవమ్ము నాడు తపన తోడ

    మరొక పూరణ

    గోప బాలుడన్న గోవిందు డన్నను
    నరహంతకుండు ,గరళ గళుడు
    గ్రోలి విషము తాను కూర్మితో యలనాడు
    కోరి నట్టి సురల కోర్కె దీర్చె.

    రిప్లయితొలగించండి
  44. గు రు మూర్తి ఆ చా రి
    .,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    ధర గల మానవావళిని తాపస సంతతి ఖేదపెట్డగన్

    సరస ధరాంశ భూత యగు సత్య రథంబున గూరుచుండ , సం

    గరమున ద్రుంచ గల్గె నరకాసురు గృష్ణుడు | కాన శౌరి యే

    నరక నిహంత యయ్యె గద || నాగ గళుం డగజాత మెచ్చగన్

    గరళము గ్రోలి విశ్వముల గాచెను | కావున స్త్రీలు లేనిచో :--

    పురుషుడు చేయ జాలడు స్వబుధ్ధిగ నెట్టి కార్యమున్ ‌! !


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`~~~~~~```

    రిప్లయితొలగించండి
  45. ఆటవెలది
    వెంట నడిచి నట్టి వేణుగోపాలుండు
    పాశుపతము నిడిన పరమశివుడు
    క్రీడిఁ గెలువ నెంచి కృపను పంచిన వారె
    నరక హంతకుండు, గరళ గళుఁడు

    రిప్లయితొలగించండి
  46. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    నరక హంతకుండు గరళ గళుఁడు

    *అశ్రు నివాళి*

    సందర్భము: మాన్యశ్రీ కపిలవాయి లింగమూర్తి గారు ఈ నాటి సాయంత్రం.. దివిజ కవివరు గుండియల్ డిగ్గు రనగ.. అమర పురి కేగినారు.
    ఎన్నో సాహితీ దీపాలను వెలిగించిన ఆ దీపం దీపావళి నాడు ఆరిపోయింది.
    వారి ఆత్మకు శాంతి కలుగు గాక!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    *దివ్య లోకములకు దీపావళిన్ బిల్చు*

    *కొనిరి లింగ మూర్తి గురుని బ్రీతి..*

    *బ్రాహ్మి.. పద్మ.. గౌరి.. పద్మ సంభవుడును..*

    *నరక హంతకుండు.. గరళ గళుఁడు..*

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    6.11.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి