3, నవంబర్ 2018, శనివారం

సమస్య - 2835 (దీపావళి పండుగన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దీపావళి పండుగను జరుప నగుఁ బున్నమికిన్"
(లేదా...)
"దీపావళి పండుగన్ జరుపనౌఁ గద పున్నమినాటి రాతిరిన్"
(ఛందోగోపనం)
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

103 కామెంట్‌లు:

  1. భావకుడైన భర్త తన భార్యకు జెప్పెనమాస రాత్రిలో
    నీ వసుధా తలమ్ముఁ గన యింపగు శోభనొసంగు నట్టి దీ
    పావళి కాంతులే గనగ పౌర్ణమి వెన్నెల తీరునెంచ దీ
    పావళి పండుగన్ జరుప నౌ గద పున్నమి నాటి రాతిరిన్

    రిప్లయితొలగించండి
  2. విరించి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    '...గన నింపగు' అనండి.

    రిప్లయితొలగించండి
  3. పావనమైన మాసమది, భర్గునిరాణికి దీక్షబూనుచున్
    సేవలు చేయు కాలమది, శ్రీప్రద, మాశ్వయుజంబు, దానిలో
    నావల నంత్యమందు కడు హర్షము గూర్చెడి రోజు "దర్శ", దీ
    పావళి పండుగన్ జరుపనౌగద పున్నమి! నాటి రాతిరిన్.

    దర్శ = అమావాస్య

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    పావనమైన మాసమిది , పండుగయౌ ప్రతిరోజు , దీపముల్
    కోవెల ప్రాంగణమ్ములను గొప్ప వెలుంగులు జిమ్ముచుండు , రా...
    వే ! వదినా ! మనోజ్ఞమగునే శుభకార్తికమందు , కోటి దీ....
    పావళి పండుగన్ జరుపనౌఁ గద పున్నమి నాటి రాతిరిన్" !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.
      ప్రభాకర శాస్త్రి గారూ, మీ పూరణను నిన్న మన అంజయ్య గారు ఆకాశవాణిలో పఠించారు.

      తొలగించండి
    2. వేవెలుగుల్ రహింప వినువీథిని జువ్వలు వెల్గ చీకటుల్
      లేవను రీతి, భీతి లవలేశము లేకయె చిచ్చుబుడ్లనె
      న్నో వెలిగింప , కాంతులిలనొప్పును , సంబరమంది దివ్య దీ...
      పావళి పండుగన్ జరుప ., నౌఁ గద పున్నమి ., నాటి రాతిరిన్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. మైలవరపు వారి రెండవ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  5. (నవ్వుల వెన్నెల వెలుగులలో దీపావళి )
    దేవిని సత్యభామ గొని
    దీప్తసుదర్శనచక్రహస్తుడై
    కావరధూర్తుడా నరకు
    ఖండన జేసిన వాసుదేవు సం
    భావన సల్పు పౌరజన
    వాహిని వెన్నెలనవ్వులందు , దీ
    పావళి పండుగన్ జరుప
    నౌ గద పున్నమినాటి రాతిరిన్ .

    రిప్లయితొలగించండి
  6. ఆవల కార్తికమన దీ
    పావళి పండుగను జరుప నగుఁ ;...బున్నమికిన్
    దీవెన లిచ్చెడి లక్ష్మిని
    కోవెలలో నింటి లోను కొనియాడవలెన్

    రిప్లయితొలగించండి
  7. నేటి సమస్య (దీపావళి పండుగను జరుప నగుఁ బున్నమికిన్)

    నా పూరణము సీసములో

    ఏమది? మీకు నేనెన్ని మారులు తెలిపితిని,పూజలు గణపతికి చవితి
    నాడు చేతురు,చైత్ర పాడ్యమి నాడు చేతు రుగాది పండుగ, సిరుల నిడెడు
    వరలక్ష్మి వ్రతము శ్రావణమున జరుగుగా ,నమవశ నాడు ఘనమ్ముగ జరు
    పవలె (దీపావళి పండుగను, జరుపనగుఁ బున్న మికినె)ల్లరు గద యిత్ను
    వునకు పండుగ హోలిని, వనిత లెల్ల
    నట్ల తద్డెను జరుపగా నగును తదియ
    దినమున , యని పంతులొకడు తెలిపె పాఠ
    శాల లోని వటువులకు సంత సముగ

    యిత్నువు = మదనుడు

    రిప్లయితొలగించండి
  8. పావనయాదవాన్వయు డపారకృపాకరుడొంచెభూసుతున్
    దేవునికంజలించజగతిన్ ప్రజలుత్సవమాచరింత్రుదీ
    పావళి పండుగన్ జరుపనౌఁ గద ;పున్నమినాటి రాతిరిన్
    సేవలు విశ్వనాథుకగు శ్రేయపుకార్తికమాగమించుటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్జీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వంచు'ను 'ఒంచు' అనడం మాండలికం. "కృపాకరు డేచె భూసుతున్" అనండి.

      తొలగించండి
  9. నిన్నటి శంకరాభరణము సమస్య ఒక్క సారి పరిశీలించండి గురువు గారు

    సమస్య
    మంచి బెంచు వారు మందమతులు
    ఆటవెలది పాదము
    నా పూరణము సీసములో

    రాముని అరణ్య వాసమునకు పంపమని కైక దశరధుని అడుగగా అప్పుడు దశరధుడు ఓ కైకా నీ కోరిక నేను ఎప్పుడైనా తీర్చను అన్ననా రాముడిని నీ కన్న కొడుకు కన్నా మిన్నగా చూచు కొన్నావు. ఈ బుద్ది నీకు పుటినది గాదు. ఎవరో నిన్ను
    ప్రోద్బలము చేస్తున్నారు. మాటలమంచి (తీయని మాటలు చెప్పి చెరుపు చేయు వారు) ఒట్టి అవివేకులు వారి వలన నీవు నష్ట పోవద్దు. నీ మంచి మనసు బెట్టి ఒక్క సారి ఆలోచించమని కైకను ఆ దశరధ భూపతి వేడెను అను భావన.

    నీదు కోరిక తీర్చ నే నెపుడైనను కాదంటి నా? కలకంఠి! రామ
    భద్రుని నీ కన్న బాలుని కన్న నదికముగా లాలించితివిగద? మరి
    నేడునీ కేమయ్యె? నీబుద్ది కాదిది, మానినీ, మాటల (మంచి బెంచు
    వారు మందమతులు), వారి వలన నీవు నష్ట పోదువెపుడు, యిష్ట సఖియ

    మాట విని చెడి బోకుమా, మనసు బెట్టి
    నొక్కమారు విచారమును సలుపు వలె
    ననుచు వేడుకొనెను కైక నా దశరధ
    భూపతి మనసులో బాధ నాపుకొనుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఎపుడు + ఇష్ట' అన్నపుడు యడాగమం రాదు. 'సకియ' అన్న పదం ఉంది. 'సఖియ' లేదు. "పోదు వెప్పు డిష్టసఖిది" అనండి. "సలుపవలె" అనండి.

      తొలగించండి
  10. కావగ లోకముల్ హరి యు కాంతయు తోడుగ రాగ తామనిన్
    చేవ ను జూపు చున్ నరకు జీవము లన్ హరి యింప నుర్వి దీ
    పావళిపండుగ న్ జరుప నౌ గద పున్నమి నాటి రాతిరి న్
    భావము జేయ గా దగును భాసిలు దీపపు వెల్గు లీ న గన్

    రిప్లయితొలగించండి
  11. భావన లందుఁ జీకటులు పారగ, క్రొత్తవెలుంగురేకలుం

    జీవనమందు పెంపొదవ, చేకురి సౌఖ్యము, లుల్లసిల్ల, దీ

    పావళి పండుగన్ జరుపనౌగద పున్నమివాటి రాతిరిన్

    భూవలయమ్ము దీప్తిఁ గొను బోలిక, నుల్లము లుల్ల సిల్లగన్.

    కంజర్ల రామాచార్య.
    కోరుట్ల.జిల్లా జగిత్యాల.

    రిప్లయితొలగించండి

  12. పండుగరోజుకైన చేరుతామని ఫ్లైటెక్కి డిలే యై వచ్చిన పెనిమిటితో :)



    మావా! ఫ్లై టు డిలేతో
    నీవొచ్చితివయ! జిలేబిని! కనులు కాచెన్
    రావయ్యా! నీకని దీ
    పావళి పండుగను జరుప నగుఁ బున్నమికిన్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగు బాగు...

      1979 మే లో తుఫాను వచ్చి నా పెండ్లికే నేను లేటయ్యే ప్రమాదం కొద్దిలో తప్పినది ;)

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. పావని సత్యభామ విలు బట్టుచు తేకువ, లోకవాసులన్

    గావ దలంచి క్రూర నరకాసురునిన్ వధియించినంత దీ

    పావళిచే యమావసయె పౌర్ణమి వెల్గులు జిందె నంత, దీ

    పావళి పండుగన్ జరుపనౌ గద పున్నమి నాటి రాతిరిన్!


     ~ ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  14. జవరాలినగవుకై యవనివల్లభులేమి చేయనుత్సాహించరోయిజగతి
    నిజమబద్దంబని కుజనులబుధులుగా
    పున్నమి నమవసటన్న సబబు
    పరగదీపావళి పండుగను జరుప
    నగుఁ బున్నమికినన్న నవ్వరెవరు
    సతికిహితమొనర్చెపతులమాటేచెల్ల నర్థనారీశ్వరుడయ్యెమృడుడు
    అయ్యలారాకళత్రపుటాగడముల
    నొంప శ్రేయస్కరపుదారి యుచితమిదియె
    సభలకోర్టులజననేలసంఘమందు
    ఇంటి గుట్టు లంకకుచేటునెరుగవొక్కొ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్జీ గారూ,
      ఛందో వైవిధ్యంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. దేవతలన్ నిరంతరముఁ దిప్పలుపెట్టుచు నున్న దైత్యునిం
    బావనియైన సత్య తునుమాడిన రోజు ప్రజాళి మెచ్చి దీ
    పావళి పండుగన్ జరుపనౌఁ గద! పున్నమి నాటి రాతిరిన్
    పూవిలుకాని చెయ్దముల మోదము కల్గును పత్ని సంగతిన్

    రిప్లయితొలగించండి
  16. పావన కార్తిక మాసము
    తావచ్చు ననుచు నమాస తన్మయు రాలై
    వేవెలు గులనీనగ దీ
    పావళి పండుగను జరుప నగుఁ బున్నమికిన్

    రిప్లయితొలగించండి


  17. (దొంగ స్వగతం)
    ఈవసుధా స్థలిన్ ముసర నిమ్ముగచీకటులెల్లచోటులన్
    దేవుడమాసనిచ్చెఁగద తిప్పలు లేకనె దోచనిండ్లలో
    నా వరమైన వాసరము వ్యర్థముఁ జేసిరి పండుగంచు
    "దీ
    పావళి పండుగన్ జరుపనౌఁ గద పున్నమి నాటి రాతిరిన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి




  18. శంకరాభరణం..03/11/2018
    సమస్య:

    దీపావళి పండుగను జరుప నగు బున్నమికిన్

    నా పూరణ: కందము
    *** **** *** *** **** ***
    చావగ నరకుడు రహి దీ

    పావళి పండుగను జరుప నగు; బున్నమికిన్

    శ్రావణమున ఘనముగ "రా

    ఖీ" వేడుకలను జరుపుము కెరలు శుభమ్ముల్

    🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కైపుగ కార్తికమున దీ
    పావళి పండుగను జరుపనగు; బున్నమికిన్
    పావన త్రిమూర్తి పూజను
    వావిరియౌ భక్తి గలిగి పాటించవలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      దీపావళిని కైపుగ జరపడం...?

      తొలగించండి
    2. కైపు అంటే విధము అన్న అర్థంలో ఆ పదాన్ని వాడాను గురువుగారు

      తొలగించండి
  20. కం॥
    ఆవెలుగుల ముందరలో
    నావెన్నెల చిన్నబోవు నమవస నాడున్
    భావము సెప్పగ నిల "దీ
    పావళి పండుగను జరుప నగుఁ బున్నమికిన్"

    రిప్లయితొలగించండి
  21. డా. పిట్టా సత్యనారాయణ
    కోపోద్రిక్తత గొనిరా
    పాపాత్ముని నరకు జంప బైపడు పర్వం
    బేపాటి క్షేమకరమౌ
    దీపావళి జర్ప నగు నదే బు(పు)న్నమికిన్
    (బాణసంచా ప్రేలుళ్ళకు,బాలల కంటి వెలుగులను హరించే దుర్వార్తలకు
    న్యాయ స్థానాలే చలించిన వేళ)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమస్యాపాదాన్ని కొంత మార్చారు?

      తొలగించండి
  22. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2835 (ఛందోగోపనము)
    సమస్య :: దీపావళి పండుగన్ జరుపనౌఁ గద పున్నమినాటి రాతిరిన్.
    దీపావళి పండుగను పౌర్ణమి రోజున జరుపుకోవాలి. అమావాస్య రోజున కాదు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటిగా శివతేజంగా జ్యోతిర్లింగంగా ఆధ్యాత్మిక ధామంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడులో తిరువణ్ణామలై పేరున వెలసిన పుణ్యక్షేత్రం అరుణాచలం. భక్త సంరక్షకుడైన శివుడు అరుణగిరిగా మూర్తీభవించిన దివ్యప్రదేశం. ప్రతి పున్నమికీ అక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది. కార్తీక పౌర్ణమి నాడు ఐతే ఇంకా విశేషం. ఆ రోజున ఆ కొండ అంతా దీపాలతో వెలిగిపోతూ ఉంటుంది.
    దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్।
    దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే।। అనే శ్లోకాన్ని చెప్పుకొంటూ భక్తులు అందరూ అక్కడ దీపాలను వెలిగిస్తారు. నాయనా! ఎలాగైనా సరే నీవు ఆ అరుణాచలం వెళ్లు. అక్కడ కార్తీక పౌర్ణమి నాడు రాత్రివేళ దీపాల వరుసను వెలిగించు. శివానుగ్రహమును సంపాదించు అని ఒక వృద్ధుడు ఒక యువకునికి ఉపదేశం చేసే సందర్భం.

    పావక లింగ రూపము శుభ మ్మరుణాచల మాశ్రితావళిన్
    గావ శివుండు నిల్చె గిరిగా, నట పున్నమియే ప్రశస్తమౌ
    నే విధి నైన నేగి వెలిగింపుము కార్తిక మాసమందు దీ
    పావళి, పండుగన్ జరుపనౌఁ గద పున్నమినాటి రాతిరిన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (3-11-2018)

    రిప్లయితొలగించండి

  23. కావగలోకమున్నరకుగాసిలిబెట్టుటకారణంబె దీ
    పావళిపండుగన్జరుపనౌగద,పున్నమినాటిరాతిరిన్
    బావనగంగలోమునిగిఫాలశశాంకునిగొల్చువారికిన్
    నావసుధాధరుండిడునునాయువుముక్తినిదప్పకుండగన్
    -

    రిప్లయితొలగించండి
  24. క్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువుగారూ! నిన్నను తమరితోనే ఉండుట వలన పూరణ చేయలేదు. ఇప్పుడు పూరిస్తున్నాను. దయతో పరిశీలించగలరు.

    పరుల హితము గోరి పరపగు విధమున
    సాగ కుండ సతము సాగు నట్టి
    స్వార్థపరులు నడరు సంఘము నందున
    మంచి బెంచు వారు మందమతులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  25. క్రొవ్విడి వెంకట రాజారావు:
    మన గ్రూపులో హైదరాబాదులో ఉండే సంస్కృత పండితులెవరున్నారు?

    రిప్లయితొలగించండి


  26. పోవలె నమ్మ నౌకరికి పోవలె నమ్మ జిలేబి నేవెసన్!
    తావిని జేర్చ వచ్చితి సుతారముగా పువుబోడి !రావె! నా
    భావిని!కోపమేల! సఖి! ఫ్లైటుడిలేయయె! రమ్మ!కొమ్మ!దీ
    పావళిపండుగన్జరుపనౌగద,పున్నమినాటిరాతిరిన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి


  27. ఆ వనజోదరుండు నరకాసురుడిన్ మడచంగ సూవె, దీ
    పావళి పండు గన్జ రుప నౌఁగద!, పున్నమి నాటి రాతిరిన్
    భావిని! దివ్వె లన్నిటిని బారుగ దీర్చుము కార్తికంబునన్,
    కోవెల వెల్గు జేర మన కోశము లెల్ల సుదీప్తి గాంచునే !


    దీపావళి
    శుభాకాంక్షలతో

    జిలేబి

    రిప్లయితొలగించండి
  28. వేవెలుగులు పంచగ దీ
    పావళి పండుగను జరుపనగు,పున్నమికిన్
    దీపార్చనలను చేసిన
    కోవెల లందున విడువక కూరును సిరులున్
    [11/3, 9:58 AM] Dr Umadevi B: రెండవ పూరణ
    డా.బల్లూరి ఉమాదేవి.

    దేవీ వినుమమ వస దీ
    పావళి పండుగను జరుపనగు ,పున్నమికిన్
    దీవనల కోరుచు భక్తులు
    దేవాలయమునకునేగ తీరును వగపుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ మూడవ పాదంలో గణదోషం. "దీవెనల గోరి భక్తులు" అనండి.

      తొలగించండి
  29. పావన మాసమిద్ది పద భక్తిని యీశ్వర పూజ సేసి గో
    దావరి తీరమేగి మినుఁ దారక నాథుడు తోడురాగ నా
    దైవము మెచ్చు రీతి నది దాపున కార్తిక శోభ హెచ్చ "దీ
    పావళి పండుగన్ జరుపనౌఁ గద పున్నమినాటి రాతిరిన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భక్తిని నీశ్వర పూజ' అనండి.

      తొలగించండి
  30. కందం
    చావఁగ నరకుండని దీ
    పావళి పండుగను జరుప నగుఁ, బున్నమికిన్
    లేవింతటి వెల్గులనన్
    భావన దివ్వెలమరి యమవాసయె మెరయన్

    ఉత్పలమాల

    ఆవహమందు గూల్చ నరకాసురుఁ గృష్ణ చతుర్దశిన్ సతీ
    దేవకి కన్నవాడు గొని దేవిని నాశ్వయుజమ్ము నందు దీ
    పావళి పండుగన్ జరుపనౌఁ గద పున్నమి నాటి రాతిరిన్
    భావనఁ జేయఁ బోలి యమవాసయె వెల్గగ దీపకాంతులన్

    రిప్లయితొలగించండి
  31. satyanarayana@gmail.com
    డా. పిట్టా సత్యనారాయణ
    సంచితద్రవ్యమెంత?సరి సంతును బెంచు విధానమేది? యే
    వంచన జేయకే బ్రతుకు వంకల దీర్తు నటన్న దీక్ష;"నీ
    వుంచుకొనంగ నేననను వుంచుము నాదియు నీదె పొమ్ము" రా
    యంచల బోలు నాప్రజలు యాచన జేయరు సాధు వృత్తినిన్
    కొంచెము స్వార్థమున్ యెరుగకుండగ కూరిమి బంచ లౌక్యమే?!
    మంచిని బెంచు వారలిల మందమతుల్గద యెంచి చూడగన్

    రిప్లయితొలగించండి
  32. పావనమైయొప్పెడు దీ
    పావళి పండుగను జరుపనగు పున్నమికిన్
    పావన మూర్తీ!చీకటి
    త్రోవలు తొలగగ వెలిగెడు దీపావళులే!!

    రిప్లయితొలగించండి
  33. ఈవారములోనేదీ
    పావళిపండుగజరుపనగుబున్నమికిన్
    బావనగంగాతీరపు
    టావళినేమెట్టభూమినంబకునిడుమా

    రిప్లయితొలగించండి
  34. satyanarayana@gmail.com
    డా. పిట్టా. సత్యనారాయణ
    కోపోద్రిక్తత గొనిరా
    పాపాత్ముని నరకు జంప బైపడు పర్వం
    బేపాటి క్షేమకరమో
    దీపావళి జర్పనగునదేపున్నమికిన్

    రిప్లయితొలగించండి
  35. యావన్మంది జనులుదీ
    పావళి పండుగను జరుప నగుఁ బున్నమికిన్
    పావన శివనామంబును
    పావకుడిని దలచి గోర పాప హరణమున్

    దీపాల పండుగ దీపావళి.. కార్తీక పౌర్ణమి నాడూ దీపాలు వెలిగిస్తారు🙏🙏🙏🌹🌹🌹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దలచి కోర బాప హరణమున్' అనండి.

      తొలగించండి


  36. నేటి ఆకాశవాణి సమస్యా పూరణ - నిర్వహణ బండకాడి అంజయ్య గారు లంకె :)


    https://varudhini.blogspot.com/2018/11/3rd-nov-2018.html


    జిలేబి

    రిప్లయితొలగించండి
  37. పులిపాక సావిత్రి,నరసరావుపేట

    కోవిద,ధీర,సత్య,నరకున్ వధియింపగ పొంగె హర్షముల్
    కైవసమయ్యె శాంతి మయ కాంతులు--కాకర,చిచ్చు బుడ్లు సం
    భావిత రమ్య దీధితులు పర్వెడు చంద్రికలో యనంగ, దీ
    పావళి పండుగన్ జరుప నౌఁగద పున్నమి నాటి రాతిరిన్.

    రిప్లయితొలగించండి
  38. ఆ పగ లంతయు నతి ని
    ష్ఠా పరులై యౌపవస్త సన్ముక్తులు నై
    యేపుగఁ గార్తికమున దీ
    పావళి పండుగను జరుప నగుఁ బున్నమికిన్

    [ దీపావళి నాడు జరిపెడు బాణసంచా సంబరము]


    పావన భూమి భావితర భవ్య జనావలి వృద్ధిఁ జెంద సం
    భావన నీయ సమ్మదము భద్ర సమీరణ భూ నభః కృపీ
    టావరణమ్ము లెవ్విధిని వ్యర్థము సెందవొ యట్టి రీతి దీ
    పావళి పండుగన్ జరుపనౌఁ గద పున్నమి నాటి రాతిరిన్

    [దీపావళి నాడు రాబోవు కార్తికపు పున్నమి రాత్రి కూడ.
    సమీరణ భూ నభః కృపీ టావరణములు = వాయువు, పృధ్వి, యాకాశము, నీళ్ళు కూడిన యావరణము. అగ్నిని దీపావళి బాణసంచు లెవ్వియు నాశనము సేయ లేవు కదా!]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  39. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ***************************

    Fair & Lovely Cream రాయక ముందు:

    ఆకాశవాణి సమస్యా పూరణ:
    (కేవలం కంది వారి నవ్వులకు)

    నావల కాదు శంకరయ నాణ్యముగా విరువంగ లేకయో!
    ఆవల కార్తికమ్మనగ నచ్చటి రాతిరి చీకటందు దీ
    పావళి పండుగన్ జరుపనౌఁ గద;...పున్నమి నాటి రాతిరిన్
    దీవెన లిచ్చెడిన్ సిరికి దీపపు పూజలు చేయగా వలెన్!

    ****************************

    రాసిన తర్వాత:


    కంది శంకరయ్య గారి సవరణ పిదప:
    (అరసున్నలు గమనించెదరు గాక)


    నా వలనన్ సుసాధ్య మగునా యిటఁ బూరణ సేయఁ బూనఁగా
    నావలఁ గార్తిక మ్మనఁగ నప్పటి రాతిరి చీకటందు దీ
    పావళి పండుగన్ జరుపనౌఁ గద; పున్నమి నాటి రాతిరిన్
    దీవెన లిచ్చు శ్రీసతికి దీపపు పూజలఁ జేయఁగా వలెన్.





    రిప్లయితొలగించండి


  40. ఆ విల విలయేడ్పులు నీ
    మోవివిరుపు పారిజాతములకై ? విడుమా
    రావమ్మ సత్య! సయి దీ
    పావళి పండుగను జరుప నగుఁ బున్నమికిన్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  41. శ్రీవనజోదరుండు తన ప్రేయసి యయ్యెడు సత్యభామతో
    కావరి భూసుతున్ దునిమి క్షాంతిని గావగ మానవాళియే
    దీవియ లుంచ, పర్వణియె దీపిలు నిండుగ పౌషి వోలె, దీ
    పావళి పండుగన్ జరుపనౌఁ గద పున్నమి నాటి రాతిరిన్..!!!

    రిప్లయితొలగించండి

  42. భావన నిండుగా పతితపావను డుండగ దీప కాంతులే
    జీవము నింపుకున్న శశి చిందెడి వెల్గుల వోలె ధాటిగా
    నావల నీవలన్ పుడమి కందము గూర్చుచు నుండ దివ్య దీ
    పావళి పండుగన్ జరుపనౌ గద పున్నమి నాటి రాతిరిన్!

    గురువర్యులకు నమస్సులు. నిన్నటి నా పూరణను కూడా పరిశీలింప గోరుతాను.
    ధన్యవాదములు.
    నీతి నియమములను ప్రీతితో పాటించి
    మంచి బెంచు వారు మందమతులు,
    కల్ల లాడు వారె ఘనులు, వాస్తవముల
    దెలియ నట్టి జనుల దృష్టి లోన!

    రిప్లయితొలగించండి


  43. పావన మైన వేళ! విడు పట్టిన పట్టును సత్య! మానవే
    నీ వలుకన్ శుభాంగి! పరిణేతను! తెచ్చెద పారిజాతమున్
    నీ వన మందు నాటెదను!నిత్యము కొప్పున గూర్తు! రమ్మ! దీ
    పావళి పండు గన్జ రుప నౌఁగద పున్నమి నాటి రాతిరిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  44. గురువు గారికి నమస్సులు
    పావన చరితలగుదు దీ
    పావళి పండుగను జరుప, నగున్ బున్నమికిన్
    శ్రావణ మేఘము ,లంకన
    రావణునిచరిత సురాది రమణు తెగడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అగుదురు' అనవలసింది 'అగుదు' అన్నారు. చివర "రమణులు తెగడన్" అని ఉండాలి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  45. వచ్చే వారానికి ఆకాశవాణి, హైదరాబాదు వారి సమస్య....
    "లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై"
    మీ పూరణలను 8-11-2018 గురువారం సాయంత్రంలో క్రింది చిరునామాకు మెయిల్ చేయండి...
    padyamairhyd@gmail.com

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. నయగారంబుల తోడు గాను రమణీ నారీమణీ నాజిలే
      బియ! సాకారము జేసుకొందమిక శోభిల్లన్ రతిన్, మాధురీ
      శయనాగారమిదే శుభాంగి సుఖమౌ సంపర్కముల్గాన నా
      లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై!


      జిలేబి

      తొలగించండి
    2. మాంసాహార పూరణలను గవర్నమెంటు వారొప్పరు...

      తొలగించండి

    3. :)

      శాకాహారమె మాకు మేలు వలదే సంపర్క సంభోగముల్ :)

      జిలేబి

      తొలగించండి
    4. చీకాకౌదురు బండికాడి వరుడః శృంగారముంజూడగా

      తొలగించండి
  46. satyanarayana@gmail.com
    డా. పిట్టా. సత్యనారాయణ
    ఆ యమవాస్యనున్ బహుళ యార్భటమొప్పు టపాసులే యిలన్
    గాయమె కాదు యర్బకుల కన్నులు జిట్లగ జేయు వేళలై
    న్యాయ విశాల సౌధముల నానెను వాని నిషేధ సూచికల్;
    స్వీయ నిబంధనల్ జెలగ వెన్నెల చల్లదనంపు నాసరా
    న్హాయిగ దివ్వె పర్వమది నౌగద పున్నమి నాటి రాతిరిన్

    రిప్లయితొలగించండి