23, నవంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2854 (చల్లని నీటిచే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్"
(లేదా...)
"చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో"

71 కామెంట్‌లు:



  1. యా అల్లా !



    అల్లా! యేమందునయా
    సల్లాపముల నిను మరచి సాగించితినే
    నుల్లాసముగా బతుకును
    చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      దైవ విస్మృతి వల్ల వైపరీత్య మంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  2. మైలవరపు వారి పూరణ


    నల్లనివాడు రాడు , నయనమ్ములు కాయలు గాచె , సుంతయున్
    బిల్లనగ్రోవి సద్దు వినిపింపదు , రాధ వియోగవేళలో
    మల్లెలు నిప్పురవ్వలయి మంటలు రేపుచునుండె , నామెకున్
    చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. నిప్పుతోటి చెలగాటం ముప్పు తెచ్చి పెడుతుందనీ..
      తానందుకు సాక్ష్యమనీ
      టపాకాయ చెబుతుంది...

      పిల్లలు టపాసులను గొని
      యల్లరిఁ గాల్చంగఁ జేతులందున బేలెన్ !
      చల్లిరి యిసుకను , కడిగిరి
      చల్లని నీరముల., నొడలు సర్వము గాలెన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  3. జిల్లున హీటరు లేకయె
    డిల్లిని స్నానమును జేయ డిస్సెంబరులో
    కల్లయు గాదయ శంకర!
    చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      ఢిల్లీలో డిసెంబరులో చన్నీటి స్నానం... దుర్భరమే!
      చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. ఇల్లను చీకటి లోపల
      నుల్లము రంజిల్లు రీతి నోహో యనుచున్
      కల్లలు నిజములు తెలియక
      చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్

      తొలగించండి
    2. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  5. పిల్లల తోడు మైమరిచి భీకర మౌ జలపాతమందు నే
    నల్లన బోవ కింద పడి నా వపువెల్లను గాయమయ్యె! హా!
    చల్లని నీటిచే నొడలు సర్వము గాలె, నదేమి చిత్రమో
    యుల్లము నందు కొంచియపు యుత్తలపాటది లేదు చూడగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా సత్యనారాయణ
    పుల్లల పందిరి ఛండీ,
    మెల్లన గాలికిని మండె మిడి‌సి పడుచు నీ
    ఇల్లుకు ముందే తాళమ?
    చల్లని నీరమున నొడలు సర్వము గాలెన్

    రిప్లయితొలగించండి
  7. తన ప్రీయసి 'అమృత'నూహించుకొంటూ----

    ఉల్లము రంజిల్లగ,నే
    నల్లన విరహాగ్ని వేగ'నమృత'వచ్చెన్
    ఎల్లలు లేవానందపు
    చల్లని నీరమున నొడలు సర్వముఁగార్డెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. 'అమృత' నగణం. అక్కడ "వేగ 'నమృత'యె వచ్చెన్" అనండి.

      తొలగించండి
  8. తల్లడ మందిoచు కరణి
    యల్లరి చిల్లర గ దిరుగి యతి శయ రీతి న్
    కల్లలు పలుకుచు నొక డనె
    చల్లని నీ రము న నొ డ లు సర్వము గాలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చిల్లరగ దిరిగి' టైపాటు.

      తొలగించండి
  9. డా.పిట్టా సత్యనారాయణ
    భల్లున తెల్లవార నట పాతవి నోట్లైవి భగ్గుమన్నవా?
    పెల్లికి యిల్లు ఖర్చులకు పెంపెరలాడుచు నోర్చుకొంటిమా?
    ఒల్లని కూరనుప్పువలె యిప్పటి యింధన ఖర్చు బెంపులా?
    చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా నుండి
    ఆర్యా,మొదటి పాదంలో "నోట్లవి"గా చదువ గలరు.

    రిప్లయితొలగించండి
  11. (శకుంతల విరహవేదన - అనసూయాప్రియంవదల
    ఆవేదన )
    కల్లల నేర్వనట్టి మన
    కాంత శకుంతల శాంతమందగా
    మెల్లగ తామరాకులను ,
    మేలగు చందనచారుచర్చలన్ ,
    తెల్లని కల్వలన్ బరచి
    తీర్చుద ; మెంతటి విప్రలంభమో !
    చల్లని నీటిచే నొడలు
    సర్వము గాలె ; నదేమి చిత్రమో !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జంధ్యాల వారూ,
      మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  12. మెల్లగ పిల్ల తెమ్మెరలు మేలము లాడుచు నాకశంబు నన్
    తెల్లని చుక్కలే మురిసి తేకువ లేకను దొంగ చాటు గా
    నుల్లము సంతసించ గను నూహల దేలుచు మైకమొం దగా
    చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  13. పిల్లనగ్రోవి మ్రోగ నెద పెల్లుబుకెన్ దమకమ్ము రాధకున్,

    ముల్లుల వోలె వెన్నెలలు, ముడ్చిన పూవులు నిప్పులట్లుగన్,

    మెల్లన వీయు మారుతము మిన్నగ నేర్చెడు గ్రీష్మతాపమై,

    చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో?.

    కంజర్ర్ల రామాచార్య.
    కోరుట్ల‌









    రిప్లయితొలగించండి
  14. ఉల్లములుల్లసిల్ల జనులొద్దిక కార్తికపున్నమందు రం
    జిల్లగపున్నెముంగొనగ జేయరెతానము తీర్థయాత్రలన్
    బిల్లలుతల్లులున్ బెరిమ వెన్నుని పాదజలమ్ము,నెత్తిపై
    నెల్లరుపోసుకుందురుమహేశుని జూచి,యెడందతోచదే
    "చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో"

    రిప్లయితొలగించండి
  15. అల్లనపూవిల్తుని తల
    పెల్లవధూవరులగల్పు విధి,విరహంబే
    యొల్లెల్లగాల్చ గన్నెకు
    *చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్*

    రిప్లయితొలగించండి
  16. చల్లని కార్తీ కమ్మున
    వెల్లువ,గాదీ,పకాంతి విరజిమ్మంగా
    ఉల్లము రంజిల ప్రియసఖి
    చల్లని నీరమున నొడలు సర్వముఁగాలెన్!!

    రిప్లయితొలగించండి
  17. అల్లుడు స్నానమాడుటకు నత్త యొసంగెను వేడి నీటినే ,
    చల్లిన మాత్రమున్ కలుప జాలదె చల్లని నీర ! మింతయున్
    "చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో"
    అల్లుడు వేడి చూచుకొను నంతటి బుద్ధియు లేని వాడొకో !

    రిప్లయితొలగించండి
  18. ఉల్లము రంజిల జలకము
    జల్లుల క్రిందను గొనంగ స్నానపు గదిలో
    జిల్లని విద్యుత్తాకగ
    చల్లని నీరమున నొడలు సర్వము గాలెన్

    రిప్లయితొలగించండి
  19. కల్లలు చెప్పుచుండె తన కాయముఁ గాల్చగ నేను పెట్టినా
    నల్లన వేడినీటినని యత్తయె, నన్నిటులాడిపోయుచుం
    డెల్లెడలన్ మగండ కను మింతయు వేడియె లేనియట్టి యీ
    *"చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో"*

    రిప్లయితొలగించండి
  20. పిల్ల యొకతె గారాముగ
    తల్లికి ననె "పిల్లిబొమ్మ తగులబడె పొయిన్
    మెల్లగ దానిని తడుపుము
    చల్లని నీరమున ; నొడలు సర్వముఁ గాలెన్"

    రిప్లయితొలగించండి
  21. తల్లడ బెట్టగ తమకము
    పిల్లయొకతె రగిలిపోయె పెనుమోహమునన్
    కొల్గగ మునిగిన నారదు
    చల్లని నీరమున ; నొడలు సర్వముఁ గాలెన్"

    రిప్లయితొలగించండి
  22. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2854
    సమస్య :: చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో?
    *చల్లగా ఉన్న నీటివలన ఒళ్లంతా కాలిపోయింది. ఇది విచిత్రంగా ఉంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
    సందర్భం :: ప్రస్తుత కాలంలో ఇళ్లల్లో ఆధునిక సౌకర్యాలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి. స్నానపు గదిలో పిడిని ఇటు వైపు త్రిప్పితే షవర్ లో నుండి చన్నీళ్లు వస్తాయి. పిడిని అటు వైపు త్రిప్పితే అదే షవర్ లో నుండి కొన్ని క్షణాలు చన్నీళ్లు వచ్చి ఆ తరువాత వేడినీళ్లు వస్తాయి. ఈ విషయం తెలియని బిడ్డ పిడిని అటు వైపు త్రిప్పింది. షవరు లో నుండి మొదట చన్నీళ్లు ఆ తరువాత సెగలు గ్రక్కే వేడినీళ్లు వచ్చినాయి. బిడ్డకు ఒళ్లంతా కాలింది.
    “వెంటనే ఈ బిడ్డను తడపాలి *చల్లని నీటితో. ఒళ్లంతా కాలింది.* అంతా విచిత్రంగా ఉంది” అని చెల్లి కోసం అక్క తపించే సందర్భం.

    చల్లని నీరిడున్ షవరు చక్కగ నిట్టులు త్రిప్ప , వేడినీ
    రల్లన వచ్చెడిన్ సెగల నట్టులు త్రిప్పగ; నట్లు త్రిప్ప మా
    చెల్లికి కాలెగా, తడుప జెల్లును దీని శరీర మెల్ల నీ
    చల్లని నీటిచే, నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో?
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (23-11-2018)

    రిప్లయితొలగించండి
  23. మెల్లగ సున్నపుబట్టీ
    పల్లమునందుండునపుడు వానయురాగా?
    తల్లడమందెడి వేడికి
    చల్లని నీరమున నొడలు సర్వముగాలెన్

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. లల్లీ!యేమనిజెప్పుదు
      బల్లిదమౌమహిమకలుగుబదరీనాధన్
      నల్లదెతానముజేయగ
      జల్లనినీరముననొడలుసర్వముగాలెన్

      తొలగించండి
  25. అల్లదెగొల్లబాలకుడునల్లదెనల్లనిమేఘమల్లె,నా
    యుల్లముఝల్లుఝల్లనగనొల్లదునాల్క,తటిల్లతాభ్రమై
    యెల్లరుదెల్లబోవతనువెల్లనుముల్లయివాయిమూగయై
    "చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో"

    రిప్లయితొలగించండి


  26. మెల్లగ మార్ద్వీకమ్మను
    కల్లున, ప్రియమగు సురభిని కల్యపు మధువై
    సల్లాపముల కుకభమను
    చల్లని నీరమున నొడలు సర్వముగాలెన్ :)


    నారదా!
    జిలేబి

    రిప్లయితొలగించండి
  27. ఉల్లముసంతసిల్లుటకునూర్పులువోవనుగారణంబునన్
    నల్లదెబద్రినాధమునహర్షముతోడనుదానమాడగా
    జల్లనినీటిచేనొడలుసర్వముగాలెనదేమిచిత్రమో
    కల్లలుగాదునాపలుకుకార్మికలోకమునట్లెచెప్పెగా

    రిప్లయితొలగించండి
  28. ఉల్లమునజేరి మదనడు
    పెల్లుగ కామమును పెంచి వేదనపెట్టన్
    మల్లెల పందిరి చేరువ
    చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్

    రిప్లయితొలగించండి
  29. కల్లయుఁ గపటం బెఱుఁగక
    పిల్లది గుండమునఁ బడ గుభిల్లున మంటల్
    పెల్లుబికి కాలు చుండగఁ,
    జల్లని నీరమున, నొడలు సర్వముఁ గాలెన్

    [చల్లని నీరమున = నీళ్ళు చల్ల కుండమిచే]


    చెల్లునె నీకు నక్కట విచిత్రపుఁ జిందులు నివ్విధంబుగా
    నల్లరి సేయ నిత్తరిని నందఱు బిత్తఱ పోవఁ జల్లఁగం
    బెల్లగు వేడి నీటిని గుభిల్లున చల్లని నీటి నక్కటా
    చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎవరికీ తోచని అర్ధాలను వెలికి తీయడంలో మీకు మీరే సాటి ఆర్యా! నమస్సులు!!🙏🙏🙏

      తొలగించండి
    2. ధన్యవాదములు డా. సీతా దేవి గారు. నమస్సులు.

      తొలగించండి
    3. పోచిరాజు వారికి పద నమస్కృతులు . అత్యద్భుతమైన పూరణము ! !

      తొలగించండి
    4. గురుమూర్తి ఆచారి గారికి ధన్యవాదములు, నమస్సులు.

      తొలగించండి
  30. ఎల్లరుకు మునగ భద్రము?
    పిల్లలు యుష్ణపు యుదకము పిరమున మునగన్
    తెల్లగఁజేయుము యేమగు?
    చల్లని నీరమున; నొడలు సర్వముఁ గాలెన్

    రిప్లయితొలగించండి
  31. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మల్లెలు జాజులన్ కొనుచు మాలగ నల్లుచు ముత్తుకూరులో
    పల్లియ భామకున్ ప్రియము భళ్ళున మీరగ నేను వేయగా
    కళ్ళెపు పేడ నీరములు కన్నియ జల్లుచు నవ్వుచుండగా
    చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో :)

    రిప్లయితొలగించండి
  32. కల్లలెరుంగనట్టి నిజ కాంతుడు పోవ విదేశయానమున్
    మల్లెలవాసనల్ మదిని మత్తునముంచగ రాత్రివేళలో
    నుల్లములోన నంగభవుడూష్మముపెంచగ, తానమాడినన్
    చల్లని నీటిచే, నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  33. జిల్లుమనుచుండె సీతున
    చల్లని నీరమున నొడలు; సర్వము గాలెన్
    ఒళ్ళు చురుకుచురు కుమనుచు
    పెల్లుగ నార్తినొనరించె వేసవి నందున్

    రిప్లయితొలగించండి
  34. తెల్లని చీరనుఁ గట్టిన
    మల్లెలుఁ జుట్టిన సతిఁ గని మదనుని శరములు
    మెల్లగఁ దాకిన వేళన
    చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్

    -నాగ చైతన్య

    రిప్లయితొలగించండి
  35. అల్లిన జడనెత్తి సఖుం
    డల్లరి తనమున మెడపయి నధరము లాన్చన్
    జల్లు కురియు వేళ సతికి
    చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్

    రిప్లయితొలగించండి
  36. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ....

    అల్లరి భర్తతో నతివ యాడెన సత్యము నవ్వులాటకున్
    చల్లని నీళ్ళు తోడితిని స్నానము జేయుమ టంచు చెప్పి తా
    నల్లన వేడి నీరు నిడె, యాతడు స్నానము జేయుచుండ నా
    చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
  37. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తల్లడ బఱచెను శీతము
    చల్లని నీరమున! నొడలు సర్వము గాలెన్
    మెల్లగ లేచిన మంటలు
    పెల్లుబుకుచు మీదకొచ్చి పెనగొని నంతన్.

    రిప్లయితొలగించండి
  38. తుళ్ళుచు కొండక్రిందకును దూకెడి నీటను మున్గ జల్లనెన్
    చల్లని నీటిచే నొడలు సర్వము; గాలెనదేమి చిత్రమో
    ఫెళ్ళున గాయగా జ్వరము వేడుక వెంటను వెక్కిరించుచున్
    పిల్లడి తల్లిదండ్రులట బేలగ దైవము
    మొక్కుకోవగన్

    రిప్లయితొలగించండి
  39. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పెల్లుబికెడి తమకమ్మున
    వల్లభు నెంచుచు తిరిగెడు పడతికి మదిలో
    చల్లారని విరహముపై
    చల్లని నీరమున నొడలు సర్వము గాలెన్.

    రిప్లయితొలగించండి
  40. జల్లది మెల్లగా గురియు చల్లని వేళను మల్లెతోటలో
    నల్లరి బావవచ్చి పరిహాసము లాడుచు పాము వంటి నా
    యల్లిన వేణినెత్తి విరహమ్మును తాళగ లేక ముద్దిడన్
    చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
  41. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్

    సందర్భము: "బయటకు చల్లా లనుకున్నాను గాని ఓపిక లేకపోయింది (చన్నీళ్ళేమో ప్రస్తుతం లేవు అందులో కలుపడానికి).
    ఈలోపల (ఏమరుపాటుగా) పిల్లవాడు స్నానానికి మొదలెట్టాడు. చల్లకుండావున్న ఆ (వేడి) నీటిచేత వాడి ఒళ్ళంతా కాలిపోయింది."
    అంటున్నది ఓ తల్లి పొరుగిం టావిడతో..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    చల్లుద మని యోపనయితి..
    చల్లని నీరు కలుపకయె స్నానముఁ జేయన్
    బిల్లడు మొదలిడె.. బయటకు
    చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    23.11.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  42. నా ప్రయత్నం :

    కందం
    పెళ్లైతే చల్లబడును
    పిల్లాడని చేసినారు, పీల్చఁగ సతియే
    నల్లిగ జీతముఁ జాలక
    చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్

    ఉత్పలమాల
    పిల్లడు వేడిమీద నొగి పెద్దలఁ జూసిన లెక్కచేయడే
    పిల్లనుఁ గట్ట చల్లబడు పిచ్చితొలంగునటంచుఁగట్టరే
    నల్లిగ మారిపీల్చ నను నాదగు జీతము చాలకుండగన్
    చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
  43. తెల్లని బూడిద కడుగర
    చల్లని నీరమున, నొడలు సర్వము గాలెన్
    నల్లని కంఠపు దేవర
    యిల్లొదిలి మసనము తిరుగ యింపది యేలా?

    రిప్లయితొలగించండి