27, నవంబర్ 2018, మంగళవారం

సమస్య - 2858 (నల్లఁగా నున్న మల్లెల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నల్లఁగా నున్న మల్లెల నాతి దాల్చె"
(లేదా...)
"నల్లఁగ నున్న మల్లెలను నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్"

86 కామెంట్‌లు:

 1. తల్లి పుట్టిన దినమని తనివి తీర
  కొల్ల గొట్టుచు మనమును కూర్మి మీర
  పిల్ల లందరు చేరుచు ప్రేమ తోడ
  నల్లఁగా నున్న మల్లెల నాతి దాల్చె

  రిప్లయితొలగించండి


 2. కల్ల బొల్లి మాటలనెడు కలువకంటి
  తేటగీతిలో పదముల తెక్కరముగ
  చేర్చి పద్దియ మల్లెను, చేవలేని
  నల్లఁగా నున్న మల్లెల నాతి దాల్చె!


  జిలేబి పద్దియము :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. కన్నుల కలికి పెట్టును కాటుకెపుడు
  నల్లగానున్న, మల్లెల నాతి దాల్చె
  సొగసు గ కురులందు తరచి చూడ
  నిత్యము మగ ధీరుల మదిని సడపు గొన


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  అల్లన సింగరేణి గనియందలి కార్మికురాలు చేతితో
  నల్లగ మల్లెదండ ., నలుపంటెను పూలకు , నిల్లు చేరి , తా
  జల్లని రేయి భర్త సరసమ్మున బిల్వగ సెజ్జ జేరుచున్
  నల్లఁగ నున్న మల్లెలను నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 5. మల్లెలనుఁబోలు తెల్లని మనసుఁగల్గు
  పిల్లలను నల్లవారల నుల్లమందు
  ప్రేమఁజూపుచు మాత శోభింప నిల్పె
  నల్లగానున్న మల్లెల నాతిఁదాల్చె.

  రిప్లయితొలగించండి
 6. ( స్వామిసేవ కోసం పుష్పమాలికలు కడుతున్న గోదాదేవి)

  ఉల్లము నందు కృష్ణుని మ
  హోన్నతరీతిని నిల్పుకొన్న యా
  తెల్లనితల్లి గోద తన
  తీయని యూహల దేలిపోవుచున్ ,
  గొల్లగ పెద్దదండలను
  కోరిక లూరగ , ప్రేమమీరగా
  నల్లగ ; నున్న మల్లెలను
  నాతి ముదంబున దాల్చె గొప్పునన్ .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జంధ్యాల వారూ,
   ఆముక్తమాల్యదా ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగ ఉన్నది. అభినందనలు.

   తొలగించండి

  2. ఈ మధ్య కాలంలో ఆ ముక్త మాల్య దగా చాలా పాపులర్ అయినట్టుంది

   అంతా బ్లాకే :)


   జిలేబి

   తొలగించండి
 7. డా. పిట్టా సత్యనారాయణ
  నల్ల,తెల్ల విభేదపు నాశమునకు
  తెల్లవారల "బ్లాకుల"దీర్చి దిద్ద
  పిల్లబాపల భవితకు బీట(పీట)వేసి
  నల్లగా నున్న మల్లెల నాతి దాల్చె(ఆఫ్రికనులను USAలో బ్లాకులందురు)

  రిప్లయితొలగించండి

 8. Top to toe you know we do same color :)  కల్లయె కాదు ! మేకపు దుకాణము లే కనకాంగు లెల్లరిన్
  తెల్లగ నల్ల గాను సయి తీర్చగ, ఫేషను సారసాక్షులన్
  మెల్లగ మార్చి వేసె నయ ! మేచక మెల్లెడ గాను తీర్చగా
  నల్లఁగ నున్న మల్లెలను నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. మొదటి రాత్రికి వల పు ల మూట గట్టి
  చేర వచ్చె ను పెనిమిటి చిత్త మల ర
  కొన్న మల్లెలు వాడ గా కోర్కె మీర
  నల్ల గా నున్న మల్లెల నాతి దాల్చె

  రిప్లయితొలగించండి
 10. డా.పిట్టా సత్యనారాయణ
  తెల్లయె పేలవంబన నదేమిటొ దీర్ఘ విచార ధారలో
  నల్లని కృష్ణు గొల్చియు ననైతిక వీక్షణలార్ప జూడరీ
  కల్ల జగత్తులో చరితకౌ నలుసన్నది తుడ్చి వేయగా
  నల్లగ నున్న మల్లెలను నాతి ముదంబుగ దాల్చె గొప్పునన్

  రిప్లయితొలగించండి
 11. పారిజాతము వృక్షము కోర దలచి సత్యభామ కోపము తో నలిగి తన పడక టింటిలో పడుకొనగా, కృష్ణ భగవానుడు అంత పురముకు వస్తాడు. నిత్యమూ వెలుగుతో నిండి ఉన్న అంత: పురము ఎందుకు కాంతి తప్పెనో , సుగంధ భరితములు వెదజల్లుతూ పడకటిల్లు ఉండ లేదేమి చెలులతో కిల కిలా రవములు చేయు పురము లో అవి ఏమియు లేవేమి నిత్యమూ ఎదురోచ్చి స్వాగతము పలుకు భార్య రాలేదేమి కురులన్ని విరబోసు కుని నల్లటి మల్లెలని ఏల
  నేడు దాల్చెను అకటా ఏమి అయింది అనుకొనుచు సత్య భామ వద్దకు భయము గా కృష్డుడు చేరెను అను భావన
  (చిరు కాంతులలో చీకటి మాటున తెల్లని మల్లెలు నల్లగా ఆ శకటారి కి కించిత్తు కన పడెను)


  నిత్యము వెలుగుతో నిండెడి సౌధము కాంతులు తప్పిన కతన మేమి?
  చెలులతో తిరుగెడు స్త్రీగృహ మీనాడు కలకల లేలలేక కణి మణిగె?
  సౌగంధ భరితము సతతము వెదజల్లు పడకిల్లు నేడేల బడిని తప్పె?
  యెదురొచ్చి నవ్వేటి యిందు వదన కేమి జరిగెనో? కురులందు సరిగె లేని
  నల్లగానున్న మల్లెల నాతి దాల్చె
  నేల? నేడేమి జరిగేనో నీల వేణి
  కి? నకటా యను కొని దేవకీ సుతుండు
  సత్య భామ వద్దకు జేరె శంక తోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'లేక కణి మణిగె'? వచ్చిని ఒచ్చి అన్నారు.

   తొలగించండి
 12. కవన మల్లుట తెలియని కాంతు డొకడు
  సతిని గాంచుచు పలికెను సరస మనుచు
  కాళి రూపము నీదని కలత పడకు
  నల్లఁగా నున్న మల్లెల నాతి దాల్చె

  రిప్లయితొలగించండి
 13. అల్లన నీలనీరదసమంచితదేహవిరాజమానునిన్

  నల్లని వాని గోపలలనామణి కౌగిటఁ జేర్చు నంత ధ

  మ్మిల్లము నందుఁ బూవులు సమేధితకృష్ణవినీలకాంతులన్

  నల్లగ నున్న మల్లెలను నాతి ముదంబున దాల్చెఁ గొప్పునన్.

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 14. కట్నమాశయు మగనికి కశినిబెంచ
  అలిగియున్నట్టి వాడికి వలపులుంచి
  మలుపు దిప్పెడి వాసనల్ మరలు బంచ?
  కాంతజడయందు పువ్వులేకారణంబు
  తలగడందుననలిగినా?విలువగనుక
  నల్లగానున్నమల్లెలనాతిదాల్చె

  రిప్లయితొలగించండి
 15. తెల్లముఁ జేయనెంచితిని తీరును శంకర! బ్లాగు(గుంపు)లోపలన్
  జల్లెడఁ బట్టి చూచినను జాలము సేయుచుఁ గానుపించులే
  యుల్లము సంతసింపగను యుక్తినఁ జేసిన పూరణమ్ములన్
  *"నల్లఁగ నున్న మల్లెలను నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్"*

  రిప్లయితొలగించండి
 16. మాకు ఇక్కడ నల్లరంగులో ఉండే పూలు కూడా దొరుకుతాయి. జన్యు మార్పిడి తో రంగులు మార్చి చాలా రకాల పూలు పూయిస్తారు వీళ్ళు. అయితే వాటికి సువాసన కాదు, ఏ వాసనా ఉండదు. ఆ నేపధ్యంలో,

  కల్లయు కాదురా యమెరికా తన పంటల జన్యు మార్పిడిన్
  నల్లని మల్లెపూవులను నచ్చిన తెల్లని యాడవారికై
  పెల్లున పెంచిరా దొరలు పేరుకి, వాసన లేని వాటి నా
  నల్లఁగ నున్న మల్లెలను నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్!

  రిప్లయితొలగించండి
 17. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2858
  సమస్య :: నల్లఁగ నున్న మల్లెలను నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్.
  *నల్లగా ఉండే మల్లెపూలను ఒక యువతి సంతోషంతో తన కొప్పులో అలంకరించుకొన్నది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: ప్రతిరోజూ మల్లెపూల మాలలతో దేవుని పూజిస్తున్నాము కదా! ఈ రోజు అనుకోకుండా మనకు మొల్లపూలు బంతిపూలు కలువపూలు కనకాంబరం పూలు దొరికినాయి. కాబట్టి మల్లెపూలను ప్రక్కనబెట్టి ఈ పూలను మాలలుగా కట్టి పూజకు ఉపయోగించుదాము అని స్నేహితురాండ్రు మాట్లాడుకొని పూలమాలలు కట్టడం పూర్తి చేశారు. అలా మాలల నల్లగా (మిగిలి) ఉన్న మల్లెలను ఒక యువతి సంతోషంగా తన కొప్పులో అలంకరించు కొన్నది అని విశదీకరించే సందర్భం.

  మల్లెల బూజ జేసితిమి మాలల గట్టుచు నిన్ని రోజు, లీ
  మొల్లల బంతులన్ కలువపూవుల నీ కనకాంబరాల నే
  డల్లన పూజ జేసెద మటంచు సఖుల్ వెస వాటి నార్తితో
  నల్లఁగ ; నున్న మల్లెలను నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (27-11-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజశేఖర్ గారూ,
   సమస్యాపూరణలో ఎప్పుడూ మీరు ప్రత్యేకతను చాటుకుంటారు అద్భుతమైన పూరణ. అభినందనలు.

   తొలగించండి


 18. ఆ ముక్త మాల్య దగా :)

  జిలేబి ఆటవిడుపు

  జీపీయెస్ వారికంకితం :)  అల్లన ముక్తుడైన ఘనుడా విజయుండు, దవుండు, మాల్య తా
  చల్లగ నుండ గా నతడి చక్కని కింగ్ఫిష రిచ్చటన్ భళా
  పల్లకిసేవ పొందెగద! భారత దేశపు రాజ్య లక్ష్మి, హా!
  నల్లఁగ నున్న మల్లెలను, నాతి, ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. మంచి విరుపుతో పూరించారు, అవధాని గారు !

  రిప్లయితొలగించండి
 20. మల్లె పూవులు వీశెడు మగడు తేగ
  నాలి భక్తితో చక్కని మాల నల్లె
  పూజ కొఱకు నవ్విధమున పూల మాల
  నల్లఁగా నున్న మల్లెల నాతి దాల్చె
  ***)()(***
  (మాల నల్లగా మిగిలిన మల్లెలు తాను దాల్చెనని భావము)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తేగ' అన్న ప్రయోగం సాధువు కాదు. "మగడు తెచ్చె" అనండి.

   తొలగించండి
 21. నల్లని వాని, ముష్కరుల నాశము జేసెడి దొడ్డవానియం
  దుల్లము జేర్చి పూజ గొని యొప్పుగ తెల్లని స్వచ్ఛమైనవౌ
  మల్లెల భూషణంబిడి సుమంబుల రెండవ నాడు తీసియున్
  నల్లఁగ నున్న మల్లెలను నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్

  రిప్లయితొలగించండి
 22. అంధుడనిదృతరాష్ట్రుబెండ్లాడనాడు
  గట్టెగంతల గాంధారి కనుల,కటులె
  మగడుకాటుకకొండని మనసొసంగి
  *నల్లగానున్నమల్లెలనాతిదాల్చె*

  రిప్లయితొలగించండి
 23. తెల్లమునయ్యెమల్లెలిలతెల్లన, నల్లగమారెనెట్లనన్
  గల్లలెరుంగరర్భకులు,గాటుకదిద్దుచు ముద్దరాలి బొ
  మ్మల్లనవేసిమల్లియలమాలనలంకృతిజేయుచుండ వా
  రల్లరిజేయుచున్ పెనము నచ్చటవైవ,గనంపడెన్నదే
  *"నల్లఁగ నున్న మల్లెలను నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్"*

  రిప్లయితొలగించండి
 24. రాధ కేశ సౌందర్యము రాణ నొప్పె
  నల్లటి కురుల గాంతికి నల్ల బారె
  శయన మందిరము, కలిగె శంక హరికి
  నల్లఁగా నున్న మల్లెల నాతి దాల్చె?

  రిప్లయితొలగించండి

 25. మరో ఆటవిడుపు

  మాల్య పింకి లాల్వాణి వివాహము :)


  మల్లియ లార! నా విజయ మాల్యుడు దేశము వీడెనంచు మీ
  రెల్లరు దుఃఖమొందిరకొ? రెక్కల విప్పక వాడిపోయిరో
  నల్లగ? లాల్వణీ వధువు నాగజమున్ ధరియించి జోడుగా
  నల్లఁగ నున్న మల్లెలను, నాతి, ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 26. తెల్లగా నున్న మల్లెల దెచ్చియుంచ
  సంధ్య వేళను పూజకు సాగనెంచి
  మల్లెలన్నియు చేకొని మంచి దండ
  నల్లఁగా , నున్న మల్లెల నాతి దాల్చె

  నిన్నటి సమస్యకు నా పూరణ

  కలగని సుధేష్ట బలికెను
  వలలునిఁ గీచకుఁడు సంపె వర విక్రముఁడై
  విలపింపకు మని పతి యనె
  వలలుడె కీచకుని జంపె వాస్తవ మిదియే

  రిప్లయితొలగించండి
 27. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  నల్లఁగా నున్న మల్లెల నాతి దాల్చె

  సందర్భము: పిల్ల మల్లెలు మొల్లలు తేగా..భక్తురాలైన తల్లి మొల్లలే తాజాగా వున్న వని, అవే మల్లికార్జును నర్చించడానికి బాగుంటా యని, మొల్ల మాల నల్లి... వున్న మల్లెలను తాను ధరించినది.
  మరో విశేషం.. ప్రాసతో కూడిన తేటగీతి
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  పిల్ల దెచ్చెను మల్లెలు మొల్ల లెల్లఁ..
  దల్లి మెచ్చెను తాజావి మొల్ల లనుచు..
  మల్లికార్జును నర్చింప మొల్ల మాల
  నల్లఁగా... నున్న మల్లెల నాతి దాల్చె

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  27.11.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 28. సమస్య :-
  "నల్లఁగా నున్న మల్లెల నాతి దాల్చె"

  *తే.గీ**

  పాల మనసుతో ప్రేమను పంచు భర్త
  నల్లఁగా నున్న, మల్లెల నాతి దాల్చె
  ప్రేమను కురిపించగ రాత్రి ప్రేమతోడ;
  రంగు ముఖ్యము గాదని రమణి దెలిపె
  ..................✍చక్రి

  రిప్లయితొలగించండి


 29. ఆహా ! ఇవ్వాళ ఆటవిడుపులే విడుపులు :)


  అల్లన కౌలు బాపడు, సనాతన ధర్మపు వారసుండటన్
  నుల్లము పొంగ జంద్యమును నోములుపండునటంచు గోత్రమున్
  తెల్లగ తేటతెల్లముగ తెల్పగ భాజప బిక్కవోవగా
  నల్లఁగ, నున్న మల్లెలను, నాతి, ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 30. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అల్లన గాంచరో వనిత యాశలు పెంచుచు భాగ్యనగ్రిలో
  బల్లలు గుద్దుచున్ పలుక భళ్ళున నెన్నిక భాషణమ్ములో
  కల్లలు బొల్లులన్, వినగ గ్రక్కున సిగ్గున వాడిపోవుచున్
  నల్లఁగ నున్న మల్లెలను నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్

  రిప్లయితొలగించండి
 31. అల్లదెమెల్లమెల్లగ నయాచిత పున్నెమునల్లనయ్య!యీ
  యుల్లముఝల్లుఝల్లనపయోధరమైతనువెల్లపొంగ ధ
  మ్మిల్లమువీడ విస్మృతి గభీరపెదందెలు ఘల్లుఘల్లనన్
  పిల్లనగ్రోవిసత్క్వణముబిల్చినదాయన రాధభావన
  *"న్నల్లఁగ; నున్నమల్లెలను నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్"*
  *మూడవ పూరణ*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర్జీ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు
   'గభీరపు టెద యందెలు' అనడం సాధువు.

   తొలగించండి
 32. గురువు గారికి నమస్కారములు. రెండు రోజులుగా నేను ఊరిలో లేకపోవుటచేత పూరణలు పంపలేక పోయినాను. వాటిని ఈరోజు పూరణతో కలిపి పంపుతున్నాను. దయతో పరిశీలించ గలరు.
  1. 25-11-2018:
  ఘనులగు బుధులకు బహుమతు
  ల నిడెడి కార్య మడరించు రాయుని సభకున్
  చనుదెంచుచు సందడిగా
  కనిపించిరి కోతులవలె గవివరు లెల్లన్
  26-11-2018:
  చెలి సైరంధ్రిగ నెంచెను
  వలలుని గీచకుడు! సంపె వర విక్రముడై
  సెలయుచు నర్తన శాల
  న్నలికిడి లేకుండ భీముడతి నేర్పరియై
  27-11-2018:
  మందిరము లోని కృష్ణుని మది దలచుచు
  పూజ సేయగ దెచ్చిన పూవులు గొని
  యుల్లసము నొందుచు వాటి నొక్క దండ
  నల్లగా! నున్న మల్లెల నాతి దాల్చె

  రిప్లయితొలగించండి
 33. !కొల్లగొట్టినధనముతోగూతుకొఱకు
  మల్లెపూవులుగొనగనుమండిలోన
  రంగురంగుల తోడనురంగవల్లి
  నల్లఁగా నున్న మల్లెల నాతి దాల్చె"

  రిప్లయితొలగించండి
 34. అల్లనరాజశేఖరుడెయావలవేసెనునేరియేరుచున్
  నల్లగనున్నమల్లెలను,నాతిముదంబునదాల్చెగొప్పునన్
  నుల్లముసంతసిల్లగనునొప్పుగదేవగమల్లిపూవులన్
  మల్లెలుదానొనర్చుగద మత్తునుజిత్తవికారమున్సదా

  రిప్లయితొలగించండి
 35. పుల్లసరోజ నేత్రునకు మోదముతోడ గళమ్ము నందునన్
  మొల్ల గులాబి చంపకపు పువ్వల మాలఘటించి, దండ తా
  నల్లఁగ, నున్న మల్లెలను నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్
  చల్లని వెన్నెలన్ విభుని సంగడి జేర మనోజ కేళికై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు అసనారె

   తొలగించండి
 36. ఎల్లెడను జెల్ల చెదరయి మల్లె లెల్ల
  నచ్చటఁ బడియుండఁగ నెండ నబల యరసి
  కొల్లలుగ నున్న పువ్వులఁ గూర్చ మాసి
  నల్లఁ గా నున్న మల్లెల నాతి దాల్చె


  వెల్లువ గాఁగ సౌరభము వింతగ నెల్లెడ వేశ్మ మందు శో
  భిల్లుచు మంద మారుతము వీవ మనోహరమై భృశమ్ముగన్
  సల్లలితాంగి సేరి సరసమ్ముగ నింపగు దండ నెమ్మి దా
  నల్లఁగ, నున్న మల్లెలను, నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 37. మువ్వగోపాలునిగనిన ముదిత యొకతె
  ముద్దు మురిపాలు గనుచును మోదమంద
  మురళి మెడలోని మల్లియ నేలరాల
  నల్లఁగా నున్న మల్లెల నాతి దాల్చె"*

  రిప్లయితొలగించండి
 38. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  నల్లఁగా నున్న మల్లెల నాతి దాల్చె

  సందర్భము: "అమ్మ పూలు పండ్లు తెమ్మన్నది. ఇంట్లోనేమో మల్లె పూలు వుండనే వున్నవి. డబ్బు దండుగ" అంటూ నల్లని ద్రాక్ష పండ్లు మాత్రం తెచ్చింది కూతురు.
  ఇంట్లో వున్న మల్లెలను గృహిణి ధరించినది.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "అమ్మ పూలను పండ్లను దెమ్మనె గద!
  ఇంటిలో మల్లె లున్నవిలే!" యటంచుఁ
  గూతు కొనితెచ్చె.. మెరసెను గుత్తి ద్రాక్ష
  నల్లఁగా... నున్న మల్లెల నాతి దాల్చె

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  27.11.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 39. తెల్లని మల్లెపూవులను తెచ్చుచునుండగ పూలబుట్టలో
  నల్లరి పిల్లవాడచటనాటలనాడుచు బొగ్గులేయగా
  తెల్లగనున్న పూవులనె తీసికొనెన్ పడవైచి బొగ్గులన్
  *"నల్లఁగ నున్న మల్లెలను, నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్"*

  రిప్లయితొలగించండి
 40. నా ప్రయత్నం :

  తతేటగీ
  అక్క, పిన్నమ్మ వదినమ్మ లరసి తనను
  పెళ్లి కూతును జేయఁగ నుల్లమలరఁ
  దీర్చ తల్లి ప్రేమగఁ గొని పేర్చి వరుస
  నల్లఁగా నున్న మల్లెల నాతి దాల్చె

  ఉత్పలమాల
  ఉల్లము జల్లనన్ వధువు నొప్పెడి రీతి నలంకరించగన్
  గళ్లవి చాలవంచు నటఁ గాంచిన వారలుఁ బల్కుచుండగన్
  తల్లియె ప్రేమతో తనయ దాల్చఁగఁ దెచ్చియుఁ గూర్చఁ జిక్కగా
  నల్లఁగ నున్న మల్లెలను నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్


  రిప్లయితొలగించండి
 41. నల్లగా నున్న , మల్లెల నాతి తాల్చె,
  ఇచ్చకము తోడ పోరని రెచ్చ గొట్టె
  నలుపు, తెలుపను భేదమ్ము దలచ మాని
  కుర్రవా డామె ప్రేమలో కూరుకొనియె
  (నల్లగా నున్న = నల్లగా ఉన్నప్పటికి . అఖండయతి వాడకుండా ఈ అర్థం లో పూరించాను)

  రిప్లయితొలగించండి
 42. (2)తే.గీ: మగువ యొకతె యమ్ముచు నుండ మల్లె పూలు
  చనువుతో భర్త ఎటులనో సరస మాడి
  నల్లగా నున్న మల్లెలనాతి దాల్చె
  నెత్తిపై తన ఇల్లాలి నొత్తిగించి .
  ( ఇక్కడ నల్లగా నున్న మల్లెలనాతిని నెత్తిపై తాల్చాడు అని భావం . ఆమె మల్లె పూలు అమ్ముతుందని చెప్పాను కనుక ఆమెని మల్లెల నాతి అన్నాను. )

  రిప్లయితొలగించండి