22, నవంబర్ 2018, గురువారం

సమస్య - 2853 (మోస మొనరించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును"
(లేదా...)
"మోసముఁ జేయువారలకె మ్రొక్కఁ దగున్ సుజనుల్ హితార్థులై"

94 కామెంట్‌లు:

  1. వంచకేశ్వర నాముడై వసుధనేలు
    నృపతి యాదేశములు చేసె "నిత్య మిచట
    చోరవరులను మైత్రికై చేరవలయు,
    మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును"

    రిప్లయితొలగించండి
  2. తెలతెల్ల వారే మెట్ట వేదాంతం:

    ఎరిక లేకయే వచ్చుట నెచటి నుండి
    యెరిక లేకయే పోవుట నెచటి కోను
    తెలియ నీయక మమ్ముల తిక్క బెట్టి
    మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఎరుక లేకయే వచ్చుట యెచటి నుండి। యెరుక లేకయే పోవుట యెచటికొ మరి..." అనండి.

      తొలగించండి


  3. సత్యము పలుక వలెనమ్మ సరసి, కాని
    సత్య మైన నప్రియమును సాటి వారి
    మేలు కొరకు తెలుపక జమిడిగ నైన
    మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  4. శ్వాసయు వీడుదాక భవ సాగర మందున తప్ప దే సఖీ
    కాసుల గోల! నీ వలన కాదది! సాధ్యముగున్ జిలేబియా
    మోసముఁ జేయువారలకె; మ్రొక్కఁ దగున్, సుజనుల్, హితార్థులై
    వేసము వేయకన్ తమ చవిన్ సయి చూడని సాటివారికిన్!


    జిలేబి

    ఏమండోయ్ !ఈ వారపు ఆకాశవాణి సమస్య యే మి టి? చెప్పగలరు

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. రాజేశ్వరి నేదునూరినవంబర్ 21, 2018 9:08 PM

      విద్యలు లేని మానవుడె విజ్ఞుడుగా జనమాన్యతన్ గనన్
      ఆకాశవాణి వారి సమస్య


      కంది శంకరయ్యనవంబర్ 21, 2018 11:09 PM

      ..... జనమాన్యతన్ గనున్.

      తొలగించండి
    2. జిలేబి గారూ,
      మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  5. గాలి లో విభూతి ని దీసి కల్లి బొల్లి
    మాటల ను జెప్పి భక్తుల మనసు దోచి
    వెలుగు కపట పు బాబాల వెంట బడు చు
    మోస మొనరించు వారికే మ్రొక్క దగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కల్లబొల్లి' అని కదా ఉండాలి.

      తొలగించండి
  6. దేవిక
    -----

    ఉన్నదాని లేదని యంచు యుత్తరించి
    లేని విషయమ్ము నున్నదంచు నెగడించి
    యుక్తి తోడ జెప్పి కవులే యొరపు గాను
    మోసమొనరించు; వారికే మ్రొక్కదగును!

    రిప్లయితొలగించండి
  7. మైలవరపు వారి పూరణ

    ఈసునసూయలన్ గలిగి యిద్ధర స్త్రీ ముని ధేను వృద్ధ సం..
    త్రాసపరాయణత్వమతి దారుణకృత్యములాచరింపగా
    దోసముగాదు మోసమున ద్రుంచగ వారల , దైత్యవర్గమున్
    మోసముఁ జేయువారలకె మ్రొక్కఁ దగున్ సుజనుల్ హితార్థులై !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓటు వేయుట మనకు విధ్యుక్తధర్మ
      మండ్రు , మా వాడ నిల్చిరభ్యర్థులనగ !
      పరమదుష్టులు ! వారిలో స్వల్పమైన
      మోసమొనరించు వారికే మ్రొక్కవలయు !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. కలియుగము నందునఁ దరిగె విలువలన్ని
    యిమ్ముగలిగించు వారల నమ్మరెవరు
    వంచన సలుపు నేతతో పనులు జరుగ
    మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును

    రిప్లయితొలగించండి
  9. ఊరకేమధుకైటభులోర్వకమును
    విధినివిధులనిమగ్ను గవ్వించహరిని
    వేడె,హరిజగద్దితమయ్యుపీచమణచె
    "మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును"

    రిప్లయితొలగించండి
  10. మీసము దువ్వుచున్ దలకు
    మించిన కోర్కెల రేపువారికిన్
    వీసము మేలు గల్గదు ; త
    పించెడి శిక్షలు దప్పవెప్పుడున్
    మోసము జేయువారలకె ;
    మ్రొక్కదగున్ సుజనుల్ హితార్థులై
    కాసుల వీడి వంచితుల
    కామన దీర్చెడి నాయకాళికిన్ .

    రిప్లయితొలగించండి
  11. సమస్య :-
    "మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును"

    *తే.గీ**

    వేదనాభరితుడగుచు విశ్వమునకు
    రక్షకుడగుచు పండించు రైతులకును;
    మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును
    మరల మోసము జేయక మంచి కొరకు
    ......................✍చక్రి

    రిప్లయితొలగించండి
  12. బాసనువేసమున్ప్రజలబాగునుమర్చి మరింతలాభమై
    దోసముకాదునేతలిల దుర్భరవాక్కులసుద్దపూసలై
    యాసలరేపవచ్చువినయంబున సేవలొనర్చిమేల్గొనన్
    దాసులమంచువచ్చెడువదాన్యులనేరచరిత్రులన్ సదా
    *"మోసముఁ జేయువారలకె మ్రొక్కఁ దగున్ సుజనుల్ హితార్థులై"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్జీ గారూ, (మీ పేరు బ్లాగులో ఒకరకంగా, వాట్సప్ లో మరొక రకంగా ఉన్నది. ఎందుకు? మీ అసలు (పూర్తి) పేరు తెలియజేయండి. (డబ్బీకార్, దబ్బీకార్?)
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. Dear brother
    may srinarayananiyam with the strength of lord Narayana complete successfully with the same spirit till the end...All the best

    రిప్లయితొలగించండి
  15. మాటమూటలు బంచెడి మాయగాడె
    నాయకుండైన మనము వినమ్రతందు
    మోసమొనరించు వారికే మ్రొక్కదగును!
    కాంతకట్నాలనాశించు కాంతుడున్న?
    భార్య భరియించితలవంచుతత్వమట్లు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వినమ్రత గను' అనండి.

      తొలగించండి
  16. తెల్ల పంచెను,టోపీని, తిలకములను,
    ఘనముగా కండువా, నల్ల కళ్ళజోడు,--
    పలుకుబడిఁగల్గు వారికి, పాపమైన
    మోసమొనరించు వారికి మ్రొక్కఁదగును?

    రిప్లయితొలగించండి
  17. డా. పిట్టా సత్యనారాయణ
    "అరుగు వాలిని నెదిరించు మ"న్నరాము
    డాట జూచిన సుగ్రీవు డదరి పడడె
    చావు దప్పి మరల నమ్మి జనడె వేడ
    మోసమొనరించు వారికే మ్రొక్క దగును!

    రిప్లయితొలగించండి
  18. డా. పిట్టా సత్యనారాయణ
    వీసము విశ్వసించకను వీరులకైన జయంబురాదు పే
    రాసయె మోస కారణము;రక్షయె ధర్మము దాని బ్రోచగన్
    శాసనమున్నదా తతికి చావడి మధ్యన జావు దప్పునే?(తప్పదు)
    మోసము జేయు వారలకె మ్రొక్క దగున్ "సుజనుల్" హితార్థులై
    (నయీం ఉదంతము నాధారముగా)

    రిప్లయితొలగించండి
  19. గొఱ్ఱెయె కసాయి పొందునే కోరునట్లు
    ప్రజలు నెంచు కొందురు దుష్ట పాలకులనె !
    విబుధు లగువారి బోధయే వినక యెట్లు
    "మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును ?"
    ***)()(***
    (సామాన్య ప్రజల అవగాహనా లేమిపై విజ్ఞుల ఆవేదన)

    రిప్లయితొలగించండి
  20. పాలు పెరుగుల గాజేయు బాలకుండు
    కల్లలాడుట దెలియని నల్లవాడు
    తల్లి మనసుకు నాతడే పిల్లవాడు
    సత్యరూపుడు భ్రమలను నిత్యముంచి
    మోస మొనరించు వానికే మ్రొక్కదగును!

    రిప్లయితొలగించండి
  21. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2853
    సమస్య :: మోసముఁ జేయు వారలకె మ్రొక్కదగున్ సుజనుల్ హితార్థులై.
    *మోసం చేసే వాళ్లకే మ్రొక్కి పూజచేయాలి క్షేమాన్ని కోరుకొనే సజ్జనులు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: *మాతృదేవో భవ.*
    బిడ్డ కడుపు నిండితే తన కడుపు నిండినట్లుగా సంబరపడుతుంది తల్లి. ఆకాశంలో ఉండే చందమామను రమ్మని పిలుస్తూ నీ చేతికి అందిస్తానని నమ్మబలికి కథలు చెప్పి బిడ్డకు కడుపు నిండా అన్నం తినిపిస్తుంది. బిడ్డమేలు కోరి అబద్ధాలు చెప్పి బిడ్డను మోసం చేస్తుంది.
    శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే।
    ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః।।
    వ్యాధిగ్రస్తుడైన వాడు బాధపడుతూ ప్రాణం పోతుందేమో అని భయపడుతూ ఉంటాడు. రోగి చావుకు చాలా దగ్గరలో ఉన్నా కూడా చిరునవ్వుతో పలుకరిస్తూ *నీ కేమీ కాదు. నేను నీ దగ్గఱే ఉన్నాను కదా* అని ధైర్యం చెబుతూ అభయమిస్తాడు ప్రాణదాత యైన వైద్యుడు. రోగి మేలుకోరి అబద్ధాలు చెప్పి మోసంచేస్తాడు. రోగికి అతని బంధువులకు అందఱికీ దేవుడుగా నారాయణుడుగా హరిగా కనిపిస్తాడు.
    అబద్ధాలు చెప్పి మనలను మోసం చేసినా సరే తల్లికి వైద్యునికి తప్పనిసరిగా మ్రొక్కాలి. సజ్జనులు *మాతృదేవో భవ* అని, *వైద్యో నారాయణో హరిః* అని వారికి పూజచేయాలి అని తల్లి గొప్పతనాన్ని గుఱించి వైద్యుని గొప్పతనాన్ని గుఱించి విశదీకరించే సందర్భం.

    ఆసగ చందమామ గని యార్తిని కోరగ, తెచ్చియిత్తు నీ
    కోసము బువ్వ దిన్న యని గొప్పగ బిడ్డకు జెప్పు తల్లియున్,
    వాసిగ రోగి యుండు నను వైద్యుడు, కావున మేలు గూర్చగా
    మోసముఁ జేయు వారలకె మ్రొక్కదగున్ సుజనుల్ హితార్థులై.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (22-11-2018)

    రిప్లయితొలగించండి
  22. తమ్ముని సతి తనకు దుహిత యగును గద

    యని తలచక చెరబట్టిన యన్న ,చావు

    బడసె ,శిక్ష నిడును వేల్పు విడువ కుండ

    మోస మొనరించు వారికే, మ్రొక్కఁ దగును"

    సతము నట్టి రక్షకునకు సర్వ కాల

    మున యని తలచె కపిరాజు ముదము తోడ

    రిప్లయితొలగించండి
  23. సైంధవునిజంప నలనాడు చక్కనైన
    వ్వూహమునుపన్నె విశ్వసమ్మోహనుండు
    మోసగాండ్రనుతొలిగించ దోసమనక
    మోసమొనరించువారికే మ్రొక్క దగును..

    రిప్లయితొలగించండి
  24. ఆకలో యన్న వారికి యాదరమున
    కబళమిచ్చు వారెవరయ? గానలేము
    కలి మహాత్మ్యము! దీర్చయాకలిని యొక స
    మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...దీర్చ నాకలికి నొక...' అనండి.

      తొలగించండి
  25. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును

    సందర్భము: వీళ్ళు మోసగాళ్ళు అని తెలియనంతవరకే వారి చెంత చేరడం.. తెలిసిపోయిందో.. ఇక వారి చెంత చేరరాదు. (ఏ క్షణాన ఏ మోసం పొంచి వుందో అర్థం కాదు.)
    చేరరా దని నిశ్చయించుకున్న తర్వాత నిశ్చింతగా వారికి నమస్కరించవచ్చు. (మన మేదైనా వారినుండి కోరినప్పుడే వారికి అవకాశం కలుగుతుంది మనను మోసగించడానికి.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    అవని మోసగాండ్రని యర్థమైన యపుడు
    చేరగారాదు చెంతకు.. చేరరాదు
    చెంత నని నిశ్చయింప నిశ్చింతతోడ
    మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    22.11.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  26. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఆర్భటమ్మగు పద్ధతి నతిశయించి
    యనృతములతో పదవులొంది ననయమంత
    మోస మొనరించు వారికే మ్రొక్కదగును
    నిపుడు క్రియలలోన జయమది నెలవు కొనగ

    రిప్లయితొలగించండి
  27. దూరముగనుండమంచిదిదురితదూర!
    మోసమొనరించువారికే,మ్రొక్కదగును
    మంచిగోరెడువారినిమనసువెట్టి
    మోసగించినజగతికేముప్పుగలుగు

    రిప్లయితొలగించండి
  28. వీసముగూడజేయకుడుపేర్మినీసాయమునెప్పుడున్భువిన్
    మోసముజేయువాలలకె,మ్రొక్కదగున్సుజనుల్హితార్ధులై
    యేసమయంబునన్బరులయీప్సితమెవ్వడుతీర్చునోదగన్
    నాసమతాభవున్భువినినాదరమొప్పగదప్పకుండగన్

    రిప్లయితొలగించండి
  29. తాపస స్వరూపమున సతత మసత్య
    వాది దోసము గీసము లేదని మఱి
    తిరుగు వానికి నహహా మతి విడనాడి
    మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును!


    బాసలు సేత లన్నియును బాడిగ నొక్క విధమ్ము నుండగన్
    ధీ సహితమ్ము యుక్త మగు దీన జనాళికి దైవ కీర్తనల్
    సేసి సమంచితమ్ముగను సేవ, తలంచక చిత్త మందునన్
    మోసముఁ, జేయు వారలకె మ్రొక్కఁ దగున్ సుజనుల్ హితార్థులై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  30. అమ్మ చూపిన చంద్రుడు అసలు రాడు,
    గోరు ముద్దలు దినిపింప కొసరికొసరి
    మోస గించును తనయుల ముదము తోడ
    మోస మొనరించు వారికే మ్రొక్క దగును
    కొరుప్రోలు రాధాకృష్ణా రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాధాకృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చంద్రుడు + అసలు' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు.

      తొలగించండి
    2. అమ్మ చూపిన చందురుండసలు రాడు
      అనవచ్చా?

      తొలగించండి
  31. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గ్రాసము దొంగిలించుచును ఘాటుగ బీహరు నేలువారికిన్
    మీసము లేకపోయినను మెప్పున బంగలు నేలువారికిన్
    వీసపు భారమెత్తకయె వెన్కగ దేశము నేలువారికిన్
    మోసముఁ జేయువారలకె మ్రొక్కఁ దగున్ సుజనుల్ హితార్థులై...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  32. ప్రజల సొమ్మును దిగమింగ పదవిఁ గోరి
    నోట్లను వెదజల్లి జనుల యోట్లు పొంది
    నీతి లేనట్టి వారలే నేతలైన
    మొసమొనరించు వారికే మ్రొక్క దగును.

    రిప్లయితొలగించండి
  33. బాసలు జేసి నేతలయి బాధలు తీర్చు నెపమ్ముతో సదా
    మోసముతో ప్రజా ధనపు మూటల మ్రింగెడు నేతలీ భువిన్
    వాసిగ పెర్గిరైరి, విషపాములె పాలకు లైన వేళలో
    మోసముఁ జేయు వారలకె మ్రొక్కఁ దగున్ సుజనుల్ హితార్థులై.

    రిప్లయితొలగించండి


  34. గోల్ల వాడల యందున కూర్మి జూపి
    గోపికల మానసమ్ములు కొల్లగొట్టి
    కోకలనపహరించిన కొంటె వాడు
    మోసమొనరించు వారికే మ్రొక్కదగును!_

    రెండవ పూరణ
    వేగ శిక్ష పడవలయు విశ్వముందు
    మోస మొనరించు వారికే, మ్రొక్కఁ దగును
    సాధు సత్పురుషుల కెల్ల చక్కగాను
    వారి దీవెనములె శుభఫలము నొసగు.

    రిప్లయితొలగించండి

  35. వాసియొకింత లేక *హితవాదుల మేమని బల్కుచుంబ్రజల్
    వేసన యోట్లతో గెలిచి వేఱువిధమ్ముగ నేలు చుందురే!
    యాసలు లేకయే జనహితార్థమె యా పెను మోసగాళ్ళనే
    "మోసముఁ జేయువారలకె మ్రొక్కఁ దగున్ సుజనుల్ హితార్థులై"
    ***)()(***
    *(హితవాదులము + ఏము + అని)

    రిప్లయితొలగించండి
  36. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కాని 'సమొనరించు' అంటే?

    రిప్లయితొలగించండి
  37. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  38. బాసల నెన్నియో బఱచి వంచన జేయుచు పట్టమొందుచు
    న్నేసరి నాధిపత్యమున నిత్యము దారుణ యాగడమ్ములన్
    వేసట బెట్టుచుండినను వృత్తిని ప్రోచుట కోసమే గదా!
    మోసము జేయు వారలకె మ్రొక్కదగున్ సుజనుల్ హితార్ధులై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దారుణ యాగడమ్ములు' దుష్టసమాసం. "దారుణ ఘోరకృత్యముల్" అందామా?

      తొలగించండి
  39. సైంధవుడను వధించెదననిఁ గిరీటిఁ
    జేసిన శపథం నిక్కము సేయఁ బూని
    భాస్కరుడు క్రుంకెనని మతి భ్రమను గొల్పి
    మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చరణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. 'శపథం' అనడం వ్యావహారికం.

      తొలగించండి
  40. మారు వేషము నందున్న హరిని గాంచి
    బ్రమసి కూడెను ముక్కంటి బాగు బాగు
    కలియు గంబున కల్లలు ఘనము గాదె
    మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును

    రిప్లయితొలగించండి
  41. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  42. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  43. ముల్లు పెకలించ వలెనన్న ముల్లు వలయు
    దొంగ గుణము వేరు దొంగ యెరుగు
    మోసగించుచు పరులను ముంచు జనుల
    మోసమొనరించు వారికే మ్రొక్కదగును.

    రిప్లయితొలగించండి
  44. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును

    సందర్భము: భార్య పిల్లలు బంధువులు అందరూ నిజానికి మానవుని మోహంలో ముంచే వారే! యథార్థం జ్ఙానికే అవగత మవుతుంది.
    అలా మోహంలో ముంచడమే మోసగించడం. ఐతే ఆ మోసంవల్ల ఒక ప్రయోజనంకూడ వున్నది. అ దే మంటే వైరాగ్యం అంకురించడం. అదే తుల లేని సుఖం.
    అందువల్ల మోసగించేవారికే మొక్కదగును.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    వసుధలో భార్య, పిల్లలు, బంధువులును
    మోహమున ముంతురు నరుని..
    మోస మదియె!
    అలవడును దాన వైరాగ్య..
    మతుల సుఖము..
    మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    22.11.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి