కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"హర్మ్యంబున నెదిగె వటమహావృక్ష మహో"
(లేదా...)
"హర్మ్యంబందున మఱ్ఱిచె ట్టెదిగె నాహా యూర్ధ్వమూలమ్ముగన్"
"హర్మ్యంబున నెదిగె వటమహావృక్ష మహో"
(లేదా...)
"హర్మ్యంబందున మఱ్ఱిచె ట్టెదిగె నాహా యూర్ధ్వమూలమ్ముగన్"
రిప్లయితొలగించండికందివారివ్వాళ సెలవా :)
ధర్మ్యము కలిగిన మోడి, న
ధర్మ్యము తొలగింపగాను తలచె పటేలున్
హర్మ్యము కట్టెను తను! నా
హర్మ్యంబున నెదిగె వటమహావృక్ష మహో!
జిలేబి
సెలవంటూ ఏమీ లేదు. మా ఆశ్రమంలో కొద్ది రోజులుగా చాకలి రావడం లేదు. మాసిన బట్టలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ ఇవాళ స్వయంగా ఉతుక్కొనే కార్యక్రమం పెట్టుకున్నాను. అదన్నమాట అసలు విషయం!
తొలగించండిఅయ్యా రజకుల వారు సెలవు పెట్టకండి మీరు సెలవు పెడితే ఆశ్రమములో గురువు గారు బట్టలుతుకు పనికి బిజీఅయి కష్టమైన సమస్యల్ ఇచ్చి మమ్ము చావ కొడుతారు అందుకే నీకో పద్యము బహుమానము
తొలగించండిరజకా వందన శతములు
నిజముగ చేతును సెలవులు నీవిడ కున్నన్ ,
గజిబిజి సమస్య నిచ్చెన్
బిజిబిజి యనె నొజ్జ పొడలు వెలుకను పరచన్
సారు రేపటి ఆకాశవాణి rehearsal లో ఉన్నారు కామోసు!
తొలగించండి__/\__
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కృష్ణ సూర్యకుమార్ గారూ,
నిజానికి రజకుడు సెలవు పెట్టలేదు. ఇక్కడ పని మానుకున్నాడు. ఆశ్రమ నిర్వాహకులు కొత్త రజకుని కోసం ప్రయత్నిస్తున్నాను. క్రొత్త రజకుడు వచ్చేదాక నాకీ తిప్పలు తప్పవు.
*****
ప్రభాకర శాస్త్రి గారూ,
రేపటి నుండి నాలుగు వారాలు ఆకాశవాణి వారి 'సమస్యాపూరణం' కార్యక్రమాన్ని నిర్వహించేది మన కవిమిత్రులు బండకాడి అంజయ్య గారు. రేపు వారికి మొదటి రోజు కనుక తోడుగా నన్ను రమ్మన్నారు. అంటే రేపు కూడా నేను బ్లాగుకు అందుబాటులో ఉండను.
ధర్మ్యంబున్ విడకయె నై
రిప్లయితొలగించండిష్కర్మ్యంబును గారవించి షట్కర్మలలో...
ధర్మ్యాత్మునిమది శాంతపు
హర్మ్యంబున నెదిగె వటమహావృక్ష మహో!
"ఊర్ధ్వమూల మధః శాఖా"
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ధర్మ్యాచరణుని శాంతపు..." అనండి. బాగుంటుంది.
****
అన్నట్టు... రేపు ఆకాశవాణి సమస్యాపూరణలో మీ పేరు వినిపించే అవకాశం ఉంది.
మీ అనుమతి తీసుకోకుండా, మీకు చెప్పకుండా మీ పూరణను పోస్ట్ చేసాను. మన్నించాలి!
తొలగించండిఅయ్య బాబోయ్! నా సరదా పూరణలు ఆకాశవాణిలోనా? గవర్నమెంటువారొప్పరేమో!
తొలగించండిశతకోటి వందనములు!
రిప్లయితొలగించండిధర్మ్యంబెల్లపుడున్ సఖీ విడువకన్ ధర్మార్థ మోక్షంబు, నై
ష్కర్మ్యంబుల్ మరి తోడుగాన భువిలో షట్కాలముల్వెల్గి సా
ధర్మ్యంబైజను లెల్ల నెమ్మది గనన్ ,ధాత్రిన్ సదా దోచునా
హర్మ్యంబందున మఱ్ఱిచెట్టెదిగె నాహా యూర్ధ్వమూలమ్ముగన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
Party!
తొలగించండిధర్మ్యము లంచును బుద్ధుడు
రిప్లయితొలగించండికర్మ్యపు స్తంభపు భవనము ఘనముగ నిచ్చెన్ ;
మర్మ్యపు మనుజుల మాయల
హర్మ్యంబున నెదిగె వటమహావృక్ష మహో !
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిమఱ్ఱిచెట్టు తలక్రిందులై ఉంది... కనుక మనకు ఆ నీడ రక్షణనిస్తుంది... ఇతరములైన(ఆలోచన)మొక్కల్ని పెరగనివ్వదు... అనే భావంలో.... 🙏
ధర్మ్యమ్మే తన వర్తనమ్మనుచు సత్సంగమ్మునన్ , నిత్యనై...
ష్కర్మ్యమ్యాసక్తి చరించుచున్ ప్రబల విశ్వాసమ్ముతో మోక్షమన్
హర్మ్యంబున్ గొననెంచ రక్షణగ ఛాయన్ నీకు గూర్చన్ వియ..
ద్ధర్మ్యంబందున మఱ్ఱిచెట్టెదిగె నాహా యూర్ధ్వమూలమ్ముగన్"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిAngkorwat temple :)
హర్మ్యంబుల్ భళి కట్టి రచ్చట గదా హాహాయనంగన్ మహా
హర్మ్యంబైనిలిచెన్ గదాగ్రజునికై నంగ్కోరువాటున్ భళా
హర్మ్యంబద్దియె! నాటి ధర్మ మున కాహార్యంబు ! కాంబోడియా
హర్మ్యంబందున మఱ్ఱిచెట్టెదిగె నాహా యూర్ధ్వమూలమ్ముగన్!
జిలేబి
తొలగించండిఇది మర్రిచెట్టో కాదో తెలియదు అయినా హర్మ్యంబు లో చెట్టే ఊర్ధ్వ మూలముగా :)
ఫోటో !
https://en.wikipedia.org/wiki/Ta_Prohm#/media/File:Angkor_SiemReap_Cambodia_Tha-Prom-Temple-01.jpg
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండికాంబోడియా విష్ణుదేవాలయాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిధర్మ్యంబని పోరాడిన
కర్మ్యంబది కలిసిరాక గనరెవ్వరు స
ద్ధర్మ్యంబు మరువ గాంధీ
హర్మ్యంబున నెదిగె వట మహావృక్షమహా!😎😑(ఎవ్వరూ దర్శించ బోని యింటిలో మర్రి మొలుస్తుంది,కాని మర్రి యింటిలో పెంచబడదు)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధర్మ్యంబువీడగురువర
రిప్లయితొలగించండిధర్మ్యంబునగాదెశిబి వధాన్యుడునిల్చెన్
ధర్మ్యుడువటుడైన యశో
హర్మ్యంబుననెదిగెవటమహావృక్షమహో
శంకర్జీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వదాన్యుడు' టైపాటు.
అయ్యా గురుదేవా శుక్రాచార్యా వచ్చినవాడు హరే(ధర్మ్యాత్ము)అయితే కీర్తి వటవృక్షం ఇంట్లో పెరిగినట్లే. దానశీలి శిబి చక్రవర్తినిలోకమింకా తల్చుకుంటుందని బలి తనగురువుతో అన్నాడట
రిప్లయితొలగించండిరమ్మ్యం బైనది లోకము
రిప్లయితొలగించండిమర్మ్యపు మనుజులు మెండు మాయా జీవుల్
కర్మ్యపు పనులందు కల్లలు
హర్మ్యంబున నెదిగె వటమహా వృక్ష మహో
------------------------------
హమ్మయ్య కిట్టించాను, ఎల్లాగో
అక్కయ్యా,
తొలగించండిమీ ప్రయత్నం ప్రశంసింపదగినదే...
ఎక్కడ కిట్టించారు? మొదటి పాదంలోనే ప్రాస తప్పింది. రెండవ, మూడవ పాదాలలో గణదోషం.
సవరించండి.
అవునా ? ఐతే మళ్ళీ రాయాల్సిందే
తొలగించండిదే....వూ....డా ...... ????????????????????
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండికర్మ్యంబే యధికారమాయె జనులే కాగ్ర స్పృహన్ మానినన్
ధర్మ్యంబెచ్చట బట్ట గట్టునయ యాధ్యాత్మ్యంబు నే మర్చితిన్
హర్మ్యాళిన్ గనరావు "రావి"(అశ్వత్థ వృక్షమునకు)కి దశల్, హా(నిట్టూర్పు సూచకము)దప్పె నా "గీత"లో
హర్మ్యంబందున(పాడుబడిన మనస్సున)మర్రి చెట్టెదిగె నాహా యూర్ధ్వ మూలమ్మునన్!😴
(ఊర్ధ్వ మూల మధశ్శాఖ మశ్వత్థం ప్రాహు రవ్యయమ్॥ఛందాంంసి యస్యపర్ణాని యస్తం వేద సవేద విత్...15వఆధ్యాయం భ.గీతలో)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2833
సమస్య :: హర్మ్యం బందున మఱ్ఱిచె ట్టెదిగె నాహా యూర్ధ్వమూలమ్ముగన్.
*వేర్లు పైకి ఉండేటట్లు ఒక మఱ్ఱిచెట్టు ఎదుగుతూ ఉంది ఈ భవనంలో* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: అపూర్వమైన మయసభావైభవాన్ని చూడాలనే కుతూహలంతో దుర్యోధనుడు శకునితోపాటు కొద్దిరోజులు ఆ సభలోనే ఉండినాడు. పాండవులకు ధర్మమార్గంలో సంక్రమించిన ఆ సభ మయసభ మాత్రమే కాదు మాయసభ కూడా. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కనిపించే సందర్భాలు అక్కడ ఎన్నో ఉన్నాయి. సభలోపలనే చెట్లు ఉన్నాయి. నేలపై సమకూర్చబడిన అద్దాలలో చూస్తే చెట్లు తలక్రిందులుగా కనిపిస్తాయి. వేర్లు పైకి ఉండే ఒక మఱ్ఱిచెట్టు అక్కడ నేలపై ఉన్న అద్దాలలో కనిపించింది అని మయసభావైభవాన్ని ఊహించి వర్ణించి చెప్పే సందర్భం.
భర్మ్యంబా యని సంశయింప నొకడున్ భావింపగా లేడిటన్
ధర్మ్యం బియ్యది యెంచ నీ మయసభాతత్వమ్మె, యీ నీటిలో
హర్మ్యం బుండె నధోముఖ మ్మగుచు మాయన్, నేల నద్దాల నీ
హర్మ్యం బందున మఱ్ఱిచె ట్టెదిగె నాహా యూర్ధ్వమూలమ్ముగన్.
(శ్రీ సూరం శ్రీనివాసులు గురువరేణ్యులకు ధన్యవాదాలతో)
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (1-11-2018)
శ్రీ రాజశేఖరావధాని గారికి నమస్సులు.. వారి ప్రేరణ..
తొలగించండిమయసభలో సుయోధనుడు...
ధర్య్మంబే యిది ధర్మనందనునకున్ దర్పంబు జూపింప ?., నీ
హర్మ్యమ్మొక్కటి నీయగా విడిదిగా , నయ్యారె ! యిద్ధాత్రి సా...
ధర్మ్యంబున్నదె దీనికిన్ ?! , కొలను పద్మాకారమా ! నీటిలో
హర్మ్యంబందున మఱ్ఱిచెట్టె దిగె నాహా ! యూర్ధ్వమూలమ్ముగన్ !!
( మఱ్ఱిచెట్టె దిగెను )
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అవధాని వరేణ్యులు
తొలగించండిశ్రీ మైలవరపు మురళీకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. మయసభయే అద్భుతం. దానిని ప్రస్తావించిన పద్యం అద్భుతంగానే ఉంటుంది.
అభినందనలు.
*****
కోట వారి స్ఫూర్తితో మైలవరపు వారి పూరణ కూడ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండిహర్మ్యంబులునిర్మించిరి
రిప్లయితొలగించండిహర్మ్యంబులయందుమిగులహంగులతోడన్,
ధర్మ్యంబుగబోన్సాయటు
హర్మ్యంబుననెదిగె వటమహావృక్షమహో
కొరుప్రోలు రాధాకృష్ణారావు
రాధాకృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధర్మ్యాచారము సాధువర్తనము విధ్వంసంబులై దుష్టసా
రిప్లయితొలగించండిధర్మ్యంబుల్ బువి నెచ్చగా నుపనిషత్సారమ్ము గీతాఖ్యమై
మర్మ్యంబుల్ బ్రవచించ స్వర్చ్యుతవటమ్మై వ్యాప్తి నొందన్ ధరా
హర్మ్యంబందున మఱ్ఱి చెట్టెదిగె నాహా! యూర్ధ్వమూలంబుగన్.
కంజర్ల రామాచార్య.
కోరుట్ల.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు :
రిప్లయితొలగించండిధర్మ్యాత్ముడు నాచార్యుడు
ధర్మ్యంబున నతిశయోక్తి ధర్మము లన్నిన్
రమ్మ్యంబుగ చెప్పుచు ననె
హర్మ్యంబున నెదిగె వటమహావృక్షమహో!
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధర్మ్యపునడకలుదప్పగ
రిప్లయితొలగించండిహర్మ్యంబుననెదిగెవటవృక్షమహో
కర్మ్యంబులోటునగునెడ
హర్మ్యములందెదుగుచుండునవనీజములే
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
హర్మ్యంబందున మఱ్ఱిచె ట్టెదిగె నాహా
యూర్ధ్వ మూలమ్ముగన్
సందర్భము:
ఊర్ధ్వ మూల మధః శాఖ
మశ్వత్థం ప్రాహు రవ్యయమ్
ఛందాంసి యస్య పర్ణాని
యస్తం వేద స వేదవిత్..
భగవద్గీత..15-1
ఎడతెగని సంసారమే ఒక రావి చెట్టు.చెట్టు మూలం పై వైపు తిరిగి వున్నది. ఆది పురుషుడైన నారాయణుడే చెట్టు మూలం.
ఆ చెట్టు కొమ్మలు కింది వైపు తిరిగి వున్నవి. హిరణ్య గర్భుడైన బ్రహ్మ దేవుడే ప్రధానమైన అధఃశాఖ.
చెట్టు ఆకులే వేదాలు.. వాటిని.. సంసార వృక్ష తత్త్వాన్ని సమూలంగా తెలిసిన వాడు వేదార్థాల నెఱిగిన వాడు అని భావం
గీతలో రావి చెట్టు. పద్యంలో మఱ్ఱి చెట్టుగా చెప్పబడింది. వీలయినంతవరకు భావం స్వీకరించబడింది.
హర్మ్యం పరమాత్మ నివాసంగా పేర్కొన బడింది. ఇది మాత్రం కొత్తది. హర్మ్యంలో వృక్షం ఎదుగదు కాబట్టి హర్మ్య ప్రాంగణ మని ప్రయోగించబడింది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
హర్మ్యం బెయ్యది? వేదసారవిదుడౌ
నవ్వాని సంవాస.. మా
హర్మ్యానన్ దరు వేది? యవ్యయమునై
యాడించు సంసారమౌ..
హర్మ్య ప్రాంగణ వృక్ష మూలము గదా!
య వ్వాసుదేవుం డహో!
హర్మ్యంబందున మఱ్ఱిచె ట్టెదిగె నా
హా యూర్ధ్వ మూలమ్ముగన్
✒~డా.వెలుదండ సత్యనారాయణ
1.11.18
-----------------------------------------------------------
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
నేటి సమస్య
రిప్లయితొలగించండి“హర్మ్యంబున నెదిగె వటమహావృక్ష మహో"
కంద పద్య పాదము
నా పూరణము సీస పద్యములో
శ్రీ అది శంకరాచార్యులు చిన్న వయస్సులోనే తల్లి అనుమతి పొంది సన్యాసాశ్రమము స్వీకరించి వేద వేదాంగములు నేర్చుకొని సర్వ విద్యలలో పాండిత్యము సాధించి బుద్ధ మతము కోరల నుంచి భారత జాతిని రక్షించి అద్వైత మతము ప్రక్కకు జనులను నడిపించి
ఎంతో మేలు చేశారు. వారి యొక్క శల్య హర్మ్యము చాలా చిన్నది కానీ అతని నుంచి ఎదిగి అతని కీర్తి విశ్వ ము మొత్తము నలు దిశల వట వృక్షము వలె వ్యాపించినది గదా అను భావన
తల్లి యనుమతీయ తాపసిగా మారి , వేదవేదాంగాలు విచితి చేసి,
భౌద్ద మతము నుంచి భారతా వనిని హైoదవ మతముకు మార్చి శివము నొసగు
నద్వైత మును బోధనము చేసి నట్టియా శంకరా చార్యుని శక్తి యేమి.
తనువను హర్మ్యంబున నెదిగె వటమహావృక్షమహో, మన రక్షకుండు,
శల్య హర్మ్యము లోనుంచి సవతు బుట్టి
విశ్వమoదు నలుదిశల వేళ్ళు పాకె
యనుచు తలబోసే జనులెల్ల యవని లోన
శంకరాచార్యుని ఘనత చాటు చెపుచు
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిదుష్కరప్రాస నుండి తప్పించుకొనడానికి సీసపద్యాన్ని ఆశ్రయించారు. శంకరాచార్యుల ప్రాశస్త్యాన్ని వివరించారు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఘర్మ్యుఁడు ధృతరాష్ట్రునితో. ..
రిప్లయితొలగించండిహర్మ్యంబున నెదిగె వటమహావృక్ష మహో
హర్మ్యంబున యెటుల యెదుగు?
భర్మ్యాశ్వుడు పెంచెననగ, భళియనె రాజున్
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...యెటుల నెదుగు' అనండి.
ధర్మ్యమునెప్పుడు దప్పక
రిప్లయితొలగించండిధర్మ్యమ్మే యూపిరిగను ధరణిని యొక స
ధ్ధర్మ్యాత్ముండిల గాంధీ
హర్మ్యంబున నెదిగె వటమహావృక్ష మహో.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధరణిని నొక..' అనండి.
భర్మ్యమున మయుడు చేసిన
రిప్లయితొలగించండిహర్మ్యంబున నెదిగె వటమహావృక్ష మహో!
ధర్మ్యంబే మామ! మయుని
హర్మ్యంబిచ్చి మనల నిట నవమా నించన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
హర్మ్యము గాన రు పేదలు
రిప్లయితొలగించండిహర్మ్యం బు ల నుండు వార లా దు కొనరు గా
క ర్మ్యము న బుట్ట నేవిధి
హర్మ్యం బున నె ది గెవ ట మహా వృక్ష మహో?
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హర్మ్యంబునకెగసెను గద
రిప్లయితొలగించండిమర్మ్యార్థము తెలియకుండ మలుచుట యేలా?
మర్మ్యంబెరుగని పద్యం
హర్మ్యంబున నెదిగె వటమహావృక్షమహో!!
**మారుతుంట=పద్యము గా పూరించుట.
మారుతుంట అనేది ముద్రణా దోషము.మలుచుట అనునది సరియైనది.
రిప్లయితొలగించండిగంగాప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పద్యం' అనడం వ్యావహారికం. "పద్యము' అనండి.
ఊర్మ్య సరోవర కలి తా
రిప్లయితొలగించండికర్మ్య తరూద్భవ సునందకము పుష్కర సా
ధర్మ్య విపిన కూల మహా
హర్మ్యంబున నెదిగె వట మహా వృక్ష మహో
[విపిన కూల మహా హర్మ్యము = అడవిలోని పెద్ద దిబ్బ యనెడు హర్మ్యము]
సగర చక్రవర్తి కుమారుఁ డసమంజసుని ప్రవర్తనపు సందర్భము. పూర్వ జన్మము లో నతడు మహాయోగి. సామాన్యుఁడు కాదు. మహా వృక్ష సముండే.
ఐర్మ్యమ్ముల్ కలుగంగఁ బౌరులకు సూర్యామ్నాయ హీనుండు సా
ధర్మ్యంబై చెలఁగంగ దైత్యులకుఁ దద్రాజ్యమ్ము నందుండి నై
ష్కర్మ్యంబే నిజ ధర్మ సారమని దుష్కార్య వ్రజోన్మత్తుఁడై
హర్మ్యంబందున మఱ్ఱిచె ట్టెదిగె నాహా యూర్ధ్వమూలమ్ముగన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిహర్మ్యమ్మున గలవారల
రిప్లయితొలగించండిధర్మ్యమునకు చిహ్న మనగ ధరలో వెలసెన్
కర్మ్యమునే సూచించుచు,
"హర్మ్యంబున నెదిగె వటమహావృక్ష మహో"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవిడుపు పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
ధర్మ్యంబందున హైద్రబాదు నగరిన్ ధర్మార్థ కామంబులన్
హర్మ్యంబొక్కటి కట్టనెంచుచును నే హాయిన్ ఋణాల్ జేయగా
ధర్మ్యాత్ముండొక బిల్డరన్న ధనమున్ ధట్టించి పార్పోవ నా
హర్మ్యంబందున మఱ్ఱిచె ట్టెదిగె నాహా యూర్ధ్వమూలమ్ముగన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిబాగున్నది మీ పూరణ. అభినందనలు.
దేవిక
రిప్లయితొలగించండి--------
ధర్మ్యమ్మున్ బలికించి నెప్డు గురువే ధర్మాత్ముడాయెన్; మనో
హర్మ్యమ్మున్ కొలువైన విఙ్ఞుని గనన్ హర్షాశ్రువుల్ జిందె; సా
ధర్మ్యమ్మున్గల శిష్యుడే ఎదగ తా దక్షుండుగా నివ్విధిన్
హర్మ్యంబందున మర్రి చెట్టెదిగె నాహా యూర్థ్వ మూలమ్ముగన్ !
దేవిక గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'...బలికించి యెప్డు' అనండి.
మర్మ్యంబేమన యర్జునా యెఱగు సన్మార్గుండవై ధాత్రి లో
రిప్లయితొలగించండిధర్మ్యంబున్ నిలుపంగ యుద్ధమొక సత్కార్యమ్మదే గాదుటే
కర్మ్యంబున్ విడనాడుచున్ గదనమున్ గాదన్న గాంచగన్
హర్మ్యంబందున మఱ్ఱి చెట్టెదిగె నాహా యూర్ధ్వ మూలమ్ముగన్
(నా ప్రయత్నం నేను చేసాను విజ్ఞులు కవివరేణ్యులే సూచన చేస్తారో అని చకోరిలా యెదురుచూస్తుంటాను మరి...విరించి.)
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మర్మ్యంబేమన నర్జునా...' అనండి. మూడవ పాదం చివర గణదోషం. "...గాదన్నచో గాదనన్" అనండి.
ధర్మ్యంబెట్లగు ధూర్తులంచు దితిసంతానంబునొంపన్హరీ
రిప్లయితొలగించండిధర్మ్యంయుద్ధము దైత్యనాథులకు నాధాతేవరంబీయ ని
ష్కర్మ్యంబయ్యె ఋషీశ శాపమలదాసార్థీశనీమాయపుం
హర్మ్యంబందునమఱ్ఱిచెట్టెదిగెనాహాయూర్ధ్వమూలంబుగన్
హర్మ్యముపై మఱియొక్కటి
రిప్లయితొలగించండిహర్మ్యమ్మును గట్ట నదియె యంబరమంటెన్
హర్మ్యమ్మునె తల దన్నుచు
"హర్మ్యంబున నెదిగె వటమహావృక్ష మహో"