5, నవంబర్ 2018, సోమవారం

సమస్య - 2837 (మాతలు మువురైన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా"
(లేదా...)
"మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే"

108 కామెంట్‌లు:

  1. చేతన రూపిణి యౌచును
    చేతలు చేయించు మాతఁజేకొని కొలుతున్
    ప్రీతిని నామెనె! యడగకు:
    "మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా?"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..రూపిణి యగుచును' అనండి.

      తొలగించండి




  2. एकं सत्

    ఏతావాతా జగతికి
    మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతు,వా
    ణీ! తల్లులెల్లరు సుమా
    జోతల నొకరే గదా ప్రచోదకుల వలెన్!


    जिलेबी

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      అద్భుతమైన విరుపు. పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. యేతీరున ప్రశ్నింతువు
    మాతలు మువురైన నొక్క మాత గొలుతువా?
    చేతన రూపిణి లలితయె
    మాతల కలబోతగాదె మహిమల జూపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      అన్నగారు 'ఇలా ప్రశ్నించకు' అని నిషేధం విధిస్తే, చెల్లెలు గారు 'ఇలా అడుగవచ్చా?" అని ప్రశ్నించారు.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పద్యాన్ని యడాగమంతో ప్రారంభించరాదు. "ఏ తీరున..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ! సవరిస్తాను!

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    జీతముఁ గోరి పద్మజను , సేమము గోరుచు నద్రిపుత్రికన్
    బ్రీతిగ విద్యలన్ గొన విరించిసతిన్ గొలువంగనేల ? నీ
    వాతతభక్తి గొల్వ ముగురమ్మలమూలపుటమ్మ జాలురా !
    మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరన అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఆ తల్లుల రూపము శ్రీ..
      మాత యనుచు దలచి కొలిచి మాన్యుడవైతో !
      చాతురి కలవాడవురా !
      మాతలు మువురైననొక్క మాత గొలుతువా ?!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  5. రాతలు మార్చిన చాలని
    దాతగ తాలక్ష లిచ్చి దైవ మ్ములనే
    ప్రీతిగ కొలిచిన మేలని
    మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా ?

    రిప్లయితొలగించండి


  6. జోతల గొల్వు మూర్తులను జోతల గొల్వుము వారి చక్కియన్
    మాతలు గాను శక్తిగ సమస్తము కాచుచు నిల్చిరే సదా
    సేతలు వారివైనను విశేషము లేమియులేవు యొక్కరే
    మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. భూతల మాకస మతలము
    జ్ఞాతులతో నిండియుండె:జాతుల నడుమ
    న్నూతము మైత్రియెగా!భూ
    మాతలు మువురైన నొక్క మాత గొలుతువా ?

    రిప్లయితొలగించండి
  8. మాత లు మువ్వురి కమ్మగ
    జోత లు గొను చుండు దేవి శుభ దాయిని యై
    యేతీరు న జూడగనా
    మాత లు మువు రైన నొక్క మాత గొలుతు వా !

    రిప్లయితొలగించండి



  9. నా పూరణ: ఉత్పలమాల
    ***** ***** **** **** ****

    భూతములాది పాలితుడు పూజ్యుడు భర్గుడు శూలి యాలియౌ‌,

    ఆ తరిదాల్పు శ్రీ కరుడు నంభుజనాభుడు విష్ణు రాణియౌ,

    ధాత విధాత తాత శుభదాయుడు వాక్పతి బ్రహ్మ భార్యయౌ

    మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే


    🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷వనపర్తి🌷




    రిప్లయితొలగించండి



  10. జోతల నిడవే విరివిగ
    చేతుల మోడ్చి వివిధముగ సేవల తోడన్
    మాతకు మాతకు మాతకు
    మాతలు మువురైన నొక్క మాత గొలుతువా?

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. భూతలమున సిరులొసగెడు
    మాతలు మువు,రైన నొక్క మాతఁ గొలుతువా
    చేతన! యందువె మిత్రమ!
    యాతల్లుల యాత్మ యొక్క టని తెలియవొకో?

    రిప్లయితొలగించండి
  12. satyanarayana@gmail.com
    డా. పిట్టా సత్యనారాయణ
    ఏ తలపున నడిగితివో
    "మాతలు మువురైన నొక్క మాత గొలుతువా?"
    చేతము, పటుతను,కవితల(మహత్వ,కవిత్వ,పటుత్వ సంపదల్..పోతన)
    మాత గదా దుర్గ మనకు మాన్యత నొసగన్!

    రిప్లయితొలగించండి

  13. మైలవరపు వారికి రిటార్టు :)

    Distribution of labour :)


    హా! తేర్చగ వేగిరముగ
    వేతల చెప్పెడు జనాళి వేదనలన్, గా
    దే,తల్లులు మువ్వురయిరి!
    మాతలు మువురైన నొక్క మాత గొలుతువా?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. satyanarayana@gmail.com
    "మాతలు మువ్వురైన నొక మాతను గొల్చుట నీకు భావ్యమే"
    పూత మనస్క!జెప్పితివిపో యిదె భావ్యమటంచు, దుర్గయే
    చేతన,కీర్తి,కావ్యముల సేతకు మూలపుటమ్మ దుర్గ!యీ
    రీతిని ద్రిప్ప బ్రశ్న, విపరీతపు వాక్యమె నోట బల్కగన్

    రిప్లయితొలగించండి
  15. satyanarayana@gmail.com
    డా.పిట్టా నుండి
    ఆర్యా,
    3వ పాదంలో.మూలపుటమ్మ యౌట...గాచదువ ప్రార్థన

    రిప్లయితొలగించండి
  16. మా తలవ్రాతలుబెంచెడి
    మాతలు మువురైన నొక్కమాతగొలుతువా?
    జాతజచక్రముదిప్పెడి
    మాతాశ్రీవాణిచాలు మంచినిబెంచన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జాతక' టైపాటు!

      తొలగించండి
  17. (ఛత్రపతి శివాజీతో తల్లి జిజియా బాయి )
    నీతిని జాతియంతటను
    నింపి సమైక్యమొనర్పు మందరన్ ;
    మాతను నింతవట్టు ; నిక
    మాతగ భారతభూమి నెంచుమా ;
    నేతవు పుత్ర ! నీవు కడు
    నిర్మలబుద్ధివి ; వాణిలక్ష్మ్యుమా
    మాతలు మువ్వురైన , నొక
    మాతనె కొల్చుట నీకు భావ్యమే .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      జిజియాబాయి మాటగా ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  18. రిప్లయిలు
    1. ఆతతజీవరాశులకు నజ్ఞతఁ బాపు వరప్రదాయినిన్,

      సాతతసర్వమాంగళికశక్తిశివానినిఁ గాక, కోర్కెతో

      శ్రీతతిఁ గూర్చు నంచు సిరిఁ జేరి భజింతువు విత్తలుబ్ధువై,

      మాతలు మువ్వురైన నొక మాతను గొల్చుట నీకు భావ్యమా!

      కంజర్ల రామాచార్య
      కోరుట్ల.

      తొలగించండి
    2. రామాచార్య గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  19. ఆతత కాంక్షలన్ గడువ హాటక వర్ణిని నీరజాలయన్
    నూతన వాక్కులన్ బలుక నోటను హాటకగర్భు రాణినిన్
    చేతల నద్భుతమ్ము గన శీతమయూఖపు మౌళి చేడియన్
    జోతల నిచ్చుచున్ గొలువ చోద్యము గాదుగ కార్యదీక్షతన్
    మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే!!

    రిప్లయితొలగించండి
  20. ప్రీతితొ గొల్వగ మాతయె
    నీతనువిచ్చినది తల్లి నీ భాషయెనీ
    మాతయు నీదేశమెనీమాతలుమువురైన నొక్క మాత గొలుతువా!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గంగాప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రీతితొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "ప్రీతిని" అనండి.

      తొలగించండి
  21. కం.
    పోతన చెప్పిన పద్యము
    నేతల్లియు మూలమౌనొ?యీజగతికిన్
    ఆతల్లిని పూజించెద
    మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "...యీ జగములకే । నా తల్లిని..." అనండి.

      తొలగించండి
  22. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2837
    సమస్య :: మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే
    *ముగ్గురు అమ్మలు ఉండగా ఒక అమ్మనే కొలవడం నీకు భావ్యమేనా?* అని అనడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
    సందర్భం :: *మాతృదేవోభవ* అనే వేదవాక్కు లోని అర్థమును తెలిసికొని ఆచరించకుండా, తనపై ఆధారపడియున్న తల్లి అనుమతి తీసికొనకుండా, ఆ తల్లిని పట్టించుకోకుండా వదలివేసి తిరుగుతున్న కౌశికుడు అనే బ్రాహ్మణోత్తముడు కోపంతో చూస్తూ కొంగ మరణానికి కారణమైనాడు. ఒక పతివ్రత మాట ననుసరించి ధర్మసూక్ష్మములను గుఱించి తెలిసికొనేందుకోసం మిథిలా నగరం చేరినాడు. అక్కడ మాంసం అమ్మి జీవించే ధర్మవ్యాధుని ఇంటికి వెళ్లి తల్లిని దైవంగా కొలుస్తున్న ఆ బోయవానిని చూచిఆశ్చర్యపడినాడు. “కొలువదగిన జగన్మాతలు శ్రీ వాణీ గిరిజలు ముగ్గురు ఉండగా నీ మాతను కొలవడం భావ్యమేనా?” అని ధర్మవ్యాధునితో పైకి అనకుండా కౌశికుడు మనసులోనే అనుకొన్నట్లు ఊహించి చెప్పే సందర్భం.

    మాత యనుజ్ఞ గైకొనక, మాత గతిన్ గనకుండ, నా జగ
    న్మాతల మువ్వురిన్ గొలువ నమ్మెడి కౌశికు డేగి, వ్యాధునిన్
    మాతను గొల్చువాని గనినా డట లోన దలంచె నిట్టులన్
    మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే?
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (5-11-2018)

    రిప్లయితొలగించండి
  23. ఏతీరుగ నను బ్రోచెద
    వోతల్లీ! మఱి యని యలవోక ననెదవే!
    సీత,గిరిజ,భారతి యను
    మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా?

    రిప్లయితొలగించండి
  24. కాతరములేద మాధవి?
    మాతలుమువురైననొక్కమాతగొలుతువా
    పాతకముగలుగకుండగ
    మాతలుమువ్వురనుగొలువుమంచియెకలుగున్

    రిప్లయితొలగించండి
  25. మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా

    ఇచ్చినది కంద పద్య పాదము
    నా పూరణము సీసములో

    కుటుంబ సమేతముగా అష్టా దశ శక్తి పీఠములను దర్శిoచున్న ఒకడు ప్రతి అలయములలో అమ్మ వారికి పూజలు చేయించక తన తల్లికి ప్రతి దేవాలయములో పుష్పములతో పూజ చేయు చుండగా అతని భార్య ఏమిటి అమ్మలు ముగ్గురు ఉన్నారు ప్రతి చోట ఆ అమ్మలకు పూజ చేయకుండా మీ అమ్మకు ఒక్క దానికే పూజ చేస్తున్నారని యడుగ తన భార్యతో పలికి పలుకులు .
    ముందుగా అమ్మ అను మాట నా వాక్కుకు నేర్పిన ఆ సరస్వతి మా అమ్మ, బాల్యములో చన్ను బాలు త్రాగించి నేడు అన్నము పెట్టి నాకు ఆకలి తీర్చుతున్నది సాక్షాత్తు ఆ కాశి అన్నపూర్ణమ్మ గదా మా అమ్మ. విద్యా బుద్డులు నేర్పి విద్యకు లక్ష్మి అయి ,నేడు ధన సంపాదనకు మూల కారణము అయిన ధన లక్ష్మి గదా మా అమ్మ, అందువల్ల ముగ్గురు అమ్మల అవతారము మా అమ్మ ఆవిడకే పూజ చేస్తాను అని పలికిన సందర్భము


    శివమిడు (మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతు, వా)క్కుల తల్లి, పల్కు
    జవరాలు గా నాదు జనని, నాకు పలుకు ముందుగా నేర్పెను ముదము తోడ ,
    చన్నుబాలు నిడుచు సంతసముగ నాకు నాకలి తీర్చి నే డన్నమిడుచు
    నన్నపూర్ణమ్మగా నన్ను సాకుచు నుండె, తొలి గురు వై ప్రాత బలుకు నేర్పె
    విద్దెలకు లక్ష్మి గామారి , విత్తమునిడు
    నదిక మేధనొసగె, నాకు నమ్మ యొకతె
    మూడు రూపాల కనబడె, వేడు చుంటి
    నామె నని పలికె నొకడు నాలి తోడ


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      కందపాద సమస్యకు సీసపద్యంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  26. క్రొవ్విడి వెంకట రాజారావు:

    భూతి, ధృతి, చదువు లిచ్చెడి
    మాతలు మువురైన నొక్క మాత గొలుతువా
    రీతిగ నను సచితో నే
    నాతల్లుల గన్న మాత నర్చింతు నంటిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సతితో' టైపాటు!

      తొలగించండి
  27. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. లక్ష్మణుఁడు శ్రీరాముని తో...

    కందం
    ప్రీతిగ పెంచిన కొడుకును
    దైతగ పంపునె వనములఁ దల్లియె? భ్రాతా!
    ఘాతము బాపక ప్రజకున్
    మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా?

    ఉత్పలమాల
    వ్రాతను మార్చఁ జూచి నిను రాజ్యము వీడఁగ కైక దల్చెనే!
    దైతయె యామె గాదె? మరి తక్కిన తల్లుల బాధ కూడదే?
    చేతును కత్తికామె తల చిందఁగ రక్తము! సోదరా! యిలా
    మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. ఆర్యా! ధన్యవాదములు. సవసవరిం పూరణ పరిశీలించ ప్రార్థన

      ఉత్పలమాల
      వ్రాతను మార్చఁ జూచి నిను రాజ్యము వీడఁగ కైక దల్చెనే!
      దైతయె యామె గాదె? మరి తక్కిన తల్లుల బాధ కూడదే?
      ఘాతకు నౌదు నామె తల ఖండన జేయుచు! సోదరా! యిలా
      మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే?



      తొలగించండి
  29. మాతలకు మాత్రిక యొకటె
    మాతలన త్రి, పంచ, సప్త మాతృకలని, యే
    మాత్రము వలదీ ప్రశ్నయు
    మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా


    🙏🙏🙏🌷🌷🌷

    రిప్లయితొలగించండి
  30. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా

    సందర్భము: ఒకానొక ఆచార్యుడు శిష్యుని కిలా చెబుతున్నాడు.
    "నీ కీ లోకంలో ముగ్గురు తల్లులు సుమా! నీ మాతయే కాదు. గోమాత భూమాత కూడా వున్నాయి. ఈ మాతలను ముగ్గురినీ కొలుచుకో! నీకు క్షేమము ఆనందము కలుగుతాయి."
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ప్రీతిగ నీ మాతను, గో
    మాతను, భూమాత గొలువుమా!
    క్షేమంబున్
    జేతో మోదము గలుగును
    మాతలు మువురైన నొక్క
    మాతఁ గొలుతువా!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    5.11.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  31. జోతలివెజగజ్జేతకు
    మాతకుమాతలకుమాతమాతంగసుతౌ
    చేతనజాగృతిబరచె సు
    మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్జీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుత + ఔ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
  32. అమ్మలు ముగ్గురైనా మనసును జాగృతిపరిచిన గురువేకదా మిగతాదేవతల గురించి తెల్యంగజేసింది .అందుకే ఆయమ్మను(విద్య లభిస్తే అన్నిలభించినట్లే)కొలుస్తా

    రిప్లయితొలగించండి
  33. మాత లుమారమాకల లమానుషచేతమొసంగుమాతలై
    నాతిశిరోమణిన్లలితనమ్మగనమ్మినచేతమేమిటో
    కాతరుడన్గన్సకలకామనలిచ్చినమాతమాత హృ
    న్మా
    తలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్జీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాతరుడ న్గన న్సకల' టైపాటు.

      తొలగించండి
  34. రిప్లయిలు
    1. "తల్లీ, తండ్రీ, గురువూ, దైవం అంటారు కదా! పూజింప దగిన వారిలో తల్లికే అగ్రతాంబూలం. ఆతరువాత తండ్రి, గురువు, వీరి తర్వాతనే దైవం. తన స్థితికీ, బుద్ధికీ, జ్ఞానానికీ కారణమైన వీరికి తగిన గౌరవమివ్వలేని వాడు ఎన్ని దైవపూజలు చేసినా ఫలితమేమున్నది. తల్లిదండ్రుల సేవయే మఖ్యమని యెంచినవాడు ప్రత్యేకంగా దైవపూజలు చేయనక్కరలేదు కదా! నీకు విద్య, ఐశ్వర్యము, క్షేమము ఇచ్చే సరస్వతి, లక్ష్మి, పార్వతులైన ముగ్గురు మాతలున్ననూ, వారికన్నా ముందు కన్నతల్లిని సేవించడం భావ్యమే!"

      అనే భావముతో నా పూరణ:

      ఈ తలి దండ్రులున్ గురువు లే తొలి, దైవము వారి పిమ్మటన్,
      నీతులఁ బల్కనేల? స్థిర నిర్ణయమున్ గొని సేవ జేయుమా!
      యీ తను విచ్చి లోకమున నీ స్థితి కామెయె కారణంబయెన్
      *"మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే!"*

      తొలగించండి
    2. విట్టుబాబు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  35. మాతలు మువ్వురటంచును
    నీతలపున నెంచుమయ్య నెమ్మిని నెపుడున్
    మాతయు భూమాతయు గో
    మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా.

    రెండవ పూరణ

    భూతల మందు చూడగను భూసతి లక్ష్మియు శారదల్ సదా
    ప్రీతిని పంచుచుండగను భేదము చూపక కాచుచుండగా
    చేతనమందునిత్యము సుశీలత తోడనుకొల్వుమో సుతా
    మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే

    రిప్లయితొలగించండి
  36. పీతాంబరు నువిద సిరియు
    భూతాత్ముని పత్ని వాణి, పురరిపు సతియౌ
    మాతంగియు, నిల గావగ
    మాతలుమువురైన నొక్కమాత గొలుతువా!!!

    రిప్లయితొలగించండి
  37. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    బాబు! బాబూ! బాబ్బాబూ!:

    మాత యదొక్కటున్నదట మంథర వోలుచు వంగభూమిలో
    మాత యదొక్కటున్నదిట మాయల మారిది నుత్తరమ్ములో
    మాతయె దిల్లినున్నదహ! మంజుల వాణియె కొల్వుదానినే!
    మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. మాత గలదోయి మమతగ!
      మాతయు గలదుత్తరమ్ము మాయావతిగా!
      మాత గలదోయి సోనియ!
      మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా?

      జిలేబి

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      ముగ్గురు ఆధునిక రాజకీయ మాతల గురించిన మీ ఆటవిడుపు పూరణ 'సీరియస్' పూరణగా బాగున్నది. అభినందనలు.
      *****
      జిలేబీ గారూ,
      శాస్త్రి గారి పద్యం చదివినప్పుడు మమత, సోనియా స్ఫురణకు వచ్చారు. ఎంత ఆలోచించినా మాయావతి పేరు గుర్తుకు రాలేదు. మీ పద్యంతో సందేహం తీరింది. మీ పద్యం చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. బతికి పోయాను తిడతారేమోనని భయపద్డాను...ఊరుకోనుండదు గదా నా వక్రబుద్ధి...చక్కగా సీతా సావిత్రీ అనసూయలుండగా...


      __/\__

      తొలగించండి


    4. జీపీయెస్ వారు

      ఇప్పుడే చూసి కామింటినాను :)


      జిలేబి

      తొలగించండి


    5. కందివారు

      ఇంకో మాత జయమ్మ పైకి పోయే. మరో మాత కర్నాటకమ్ములో అగ్రహారంలో బందీ :)

      పంచమాతృకా స్లిమ్ డౌన్ అయిపోయి ముగురమ్మలై పోయేరు


      జిలేబి

      తొలగించండి
  38. ఊతము నొసంగి కాచెడి
    మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా?
    చేతమునిలిపి గృహముఁ గల
    మాతను గొలిచినను ముగురు మాతల కితవౌ

    రిప్లయితొలగించండి
  39. కాతరమేమియున్బడకకామితసంపదలిచ్చునట్టియా
    మాతలుమువ్వురైననొకమాతనెకొల్చుటనీకుభావ్యమే
    మాతలుమువ్వురన్గొలువమంచిగసంపదలిత్తురెప్పుడున్
    మాతకుసాటివారెవరుమచ్చుకునైననుగానరారుగా


    రిప్లయితొలగించండి
  40. నాతిని నీవును, భావా
    తీత పరాశక్తిని హృదుదిత భక్తి మెయిం
    జూతురు సతము జగన్ని
    ర్మాతలు మువురైన నొక్క మాతఁ, గొలుతువా


    ఆతత భార తావనిని నైచ్ఛిక బుద్ధినిఁ జిత్తగించి భూ
    మాతను గొల్వఁ జాలునె సమంచిత రీతిని నిత్యమున్ క్షమా
    తీత వసుంధరల్ భగవతీ కమలా గిరిజా సతీ జగ
    న్మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  41. ఆ ఇంట్లో ముగ్గురమ్మలు. కన్నతల్లికి మాత్రమే నమస్కరిస్కరిస్తాడు కుమారుడు.ఇరువురికికూడ నమస్కరించాలని కన్నతల్లి కుమారునికి చెప్పిన సందర్భము.

    కం.
    ఓతనయ! నీకిది తగదు
    మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా?
    మాతృసమానులె యిరువురు
    వ్రాతకు,శక్తికి,ధనముకు వారే ముఖ్యుల్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధనముకు' అనరాదు. "ధనమునకు" అనడం సాధువు. "వ్రాతకు శక్తికి సిరులకు వారే..." అనండి.

      తొలగించండి
  42. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చేతన తోడ పాటినిడి శ్రేయము గూర్చెడి వాక్కులమ్మయౌ
    బ్రాతిని భోగ భాగ్యములు పన్నుచు నుండెడి లోకమాతయౌ
    భీతి నధైర్యమున్ తరపి విక్రమ మర్పణ జేయు నంబయౌ
    మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే?

    రిప్లయితొలగించండి
  43. గురువు గారికి నమస్సులు
    ఏ తల మందైనను ధీ
    మాతలు మువురైన ,ఒక్క మాత గొలుతువా !
    నీ తల రాతను మార్చువి
    ధాతకు లేదయ్యా లేదయ నొకగుడి తారక రామా

    రిప్లయితొలగించండి
  44. లేదయ్యా రెండు మార్లు పునురుక్తి అయినది .లేదయ చదువ మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధాతకు లేదయ యొకగుడి' అనండి.

      తొలగించండి
  45. జాతకమందుమంత్రియగు చక్కనిలక్షణమున్ననీవిలా
    రోతగచేయుచున్ భజన రోమను భామనె యమ్మయందువే
    భూతలమందునెల్లరను బ్రోచెడి శక్తిని గల్గినట్టియా
    *"మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే"*?

    రిప్లయితొలగించండి
  46. దాతలు యెందరున్న సరి దానము జేయగ సాధ్యమే యటన్
    రాతలు మార్చునో యనుచు లక్షల కోట్లను గుమ్మరిం చినన్
    నేతలు దోచుకొన్న సిరి నేరుగ దేవుని మ్రోలనుంచి యా
    మాతలు మువ్వురైన నొక మాతను కొల్చుట నీకు భావ్యమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దాతలు + ఎందరు = దాత లెందరు' అవుతుంది. యడాగమం రాదు. "దాతలె యెందరున్న" అనండి.

      తొలగించండి
  47. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    మాతలు మువ్వురైన నొక
    మాతనె కొల్చుట నీకు భావ్యమే

    సందర్భము: నేను శ్రీ మేడిచర్ల హరినాగభూషణం కలిసి పని చేశాము గద్వాల డిగ్రీ కళాశాలలో..
    నేను దేవి కరుణా కటాక్షంతో సర్వ మంగళా శతకాన్ని పార్వతీదేవిపైన.. కనకధారా స్తవాన్ని (అనువాదం) లక్ష్మీ దేవిపైన... వాసరాంబా నివేదనాన్ని సరస్వతీ దేవిపైన చాలా కాలం కిందటనే రచించ గలిగినాను.
    మిత్రుడైన హరినాగ భూషణం ఒక్క జమ్ములమ్మ మీద జమ్ములమ్మ శతకం అనే ఒక శతకం మాత్రం రచించినాడు.
    జమ్ములమ్మ గద్వాల ప్రాంతంలోని ఒక గ్రామ దేవత.. పార్వతి యంశ.
    అదే విషయం నే నాతనితో చెబుతూ మువ్వురు తల్లు లుండగా ఒక్క తల్లినే కొలువడం ఏమిటి? తక్కిన తల్లులను కూడ నీ కవిత్వంతో కొలిస్తే శుభం చేకూరుతుంది కదా! అన్నాను.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "ప్రీతిగ సర్వ మంగళను
    శ్రీ కమలన్ మరి వాసరాంబ నే
    గైతలలో స్తుతించితిని
    గాదె! హరీ! మువురమ్మలన్; కళో
    పేతముగా నుతించితివి
    పేర్మిని జమ్ములమన్ మహేశ్వరిన్..
    మాతలు మువ్వురైన నొక
    మాతనె కొల్చుట నీకు భావ్యమే!"

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    5.11.18
    -----------------------------------------------------------
    హరి= హరినాగభూషణం
    వాసరాంబ=బాసరలో వెలసిన సరస్వతి

    రిప్లయితొలగించండి