15, నవంబర్ 2018, గురువారం

సమస్య - 2847 (మార్కండేయుని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్"
(లేదా...)
"మార్కండేయునకున్ సుతుం డగుచు జన్మంబందె సామీరియే"

84 కామెంట్‌లు:

 1. కర్కశ సమస్య కాదిది
  యర్కజు నిద్దరును గెల్చి యశము గడించన్
  తర్కము జేయగ నిట్టుల
  మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్

  అర్కజుడు = యముడు (ఆంధ్రభారతి)

  రిప్లయితొలగించు

 2. మైలవరపు వారి పూరణ

  చిరంజీవిత్వసంపాదనలో ఒకే పోలిక గలవారనే భావంలో.. పూరణ..

  కోర్కెన్ భక్తి రగిల్చి , రామశివభక్తుల్ దీక్షితుల్ కోటి బా...
  లార్కశ్రీతనుశోభితుల్ గొనుచు దైవారాధనాతత్త్వసం...
  పర్కంబున్ చిరజీవులైరి , గుణసంబంధమ్మునన్ జూడగా
  మార్కండేయునకున్ సుతుం డగుచు జన్మంబందె సామీరియే"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు


 3. కర్కంధువునకు దిగకోయ్!
  మర్కటు డే చొక్కునీరు మత్తున పల్కన్
  తర్కంబదేల నొప్పును
  మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్!  నారదా!
  జిలేబి

  రిప్లయితొలగించు
 4. మార్కండేయుడు చేకొనె
  అర్క వివాహము, కపీశు నారాధించెన్
  తర్కము చేయక జనులనె
  మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. బాలకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "తర్కము లేక జను లనిరి" అనండి.

   తొలగించు
  2. సవరించాను గురువు గారు
   మార్కండేయుడు చేకొనె
   అర్క వివాహము, కపీశు నారాధించెన్
   తర్కము లేక జనులనిరి
   మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్

   తొలగించు
 5. డా.పిట్టా సత్యనారాయణ
  తర్కంబేలకొ భక్తిని
  మర్కటమగు పవన సుతుడు, మార్కండేయుల్
  ఊర్కొనుము చిరంజీవులె
  మార్కండేయుని సుతుడుగ మారుతి బుట్టెన్

  రిప్లయితొలగించు
 6. సమస్య :
  మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్

  ( ఉపాధ్యాయుడు శిష్యుడు " మార్కు " ని ప్రశ్నిస్తున్నాడు .
  మార్కు సమాధాన మిస్తున్నాడు . )
  " మార్కు ! శివు డెవని గాచెను ?
  మార్కుల నూటిని నొసగెద ; మరి కేసరికిన్
  గోర్కెల పంట యత డెవడు ? "
  " మార్కండేయుని ; కొడుకుగ మారుతి పుట్టెన్ . "

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జంధ్యాల వారూ,
   ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
 7. తర్కము దెలియని బాలుని
  అర్కజు డటపాశ మేసి ప్రాణము కోరన్
  మర్కట రూపము బోవగ
  మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్
  ---------------------------
  హమ్మయ్య కిట్టించాను. ఇంక గురువాధీనం.

  రిప్లయితొలగించు
 8. అర్కోన్నతి ముని పొందెన్
  మార్కండేయుని కొడుకుగ;మారుతి ఫుట్టెన్
  తార్కిక సారోజ్జ్వలుడై
  పేర్కొనగా రామకార్య వీరుండనగా.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కందంలో 4 పాదాలలో ప్రధమాక్షరాలు దీర్ఘములుగా ఉండటం కోసం 1వ పాదాదిన 'మార్కొనగా' అని సవరించాను

   తొలగించు
  2. ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   అది గురువైతే చాలు. దీర్ఘమే ఉండాలన్న నియమం లేదు. 'అర్కోన్నతి' ప్రయోగించవచ్చు.

   తొలగించు
 9. అర్కుని బిల్లియె మింగెను
  టర్కీలో పేరిశాస్త్రి డాన్సులు జేసెన్
  దర్కింపక విను నుడివెద
  మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్.

  రిప్లయితొలగించు


 10. ఆహా!శార్దూలమా :)  సర్కారెక్స్ప్రెసు నెక్కి క్లైతికికమున్ సంసేవ నల్ జేయుచున్
  సర్కాయింపగ కోర గా జనులకై సారించె మేధావి యీ
  కిర్కట్లన్ సయి గూర్చు కైపదమయా కించిత్తు పూరించుడీ !
  "మార్కండేయునకున్ సుతుం డగుచు జన్మంబందె సామీరియే"


  జిలేబి

  రిప్లయితొలగించు
 11. కార్కశ్యమ్ము వహించితీవు సుకవీ?, కాఠిన్యమౌ ప్రాసనున్

  దర్కింపం బని లేదొ?, భావమదియే?, దండింప మార్గంబిదే?,

  కోర్కెల్ దీరెనె యింత తోన,? నికపై కోపింతువో?, యెట్లుగా

  మార్కండేయునకున్ సుతుండగుచు జన్మం బందె సామీరియున్?.

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   అధిక్షేపాత్మకమైన మీ పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
 12. డా. పిట్టా సత్యనారాయణ
  అర్కుండే గురువాయె బాలకుల సయ్యాటన్ ఫలంబయ్యె సం
  పర్కంబందె ననన్య భక్తిమెయి తా బారెన్ గనెన్ రామునిన్
  తర్కంబేల మృకండ మౌని సుతుడే దా జేరె లింగేశ్వరున్
  మార్కండేయుడు మారుతాత్మజులు సమ్మాన్యుల్ చిరంజీవులై
  మార్కండేయునకున్ సుతుండగుచు జన్మంబందె సామీరియే

  రిప్లయితొలగించు
 13. మ ర్కట బుద్దిని గల్గి యు
  తర్కము లో తానె గొప్ప దక్షుడ ననుచు న్
  కర్కశ ముగపల్కె నొకడు
  మార్కండేయు ని కొడుకుగ మారుతి పుట్టెన్

  రిప్లయితొలగించు
 14. మార్కండేయుడు ఏర్కాడు వాసి...మరి వానికి పెళ్ళవదా...కొడుకు పుట్టడా....మారుతి అని పేరు పెట్టడా...

  తర్కమనర్థము గద మధు
  పర్కము నిడెదను మహేశ! పద్ధతిగను నా
  యేర్కాడను పట్టణమున
  *"మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్"*
  🙏🏻

  రిప్లయితొలగించు
 15. మార్కులు తక్కువరాగా
  మూర్ఖుండని పెళ్లిజేయ మోహినిచేతన్
  కోర్కెలుదీర్చగ తండ్రికి
  మార్కండేయుని కొడుకుగ మారుతిబుట్టెన్

  రిప్లయితొలగించు
 16. తర్కింప మృకండుడు గనె ;
  గోర్కెయె తీరెడి విధముగ కుంతికి నాడే,
  (యెర్కయె జనులందఱికిన్)
  "మార్కండేయుని కొడుకుగ ; మారుతి పుట్టెన్"
  **)(**
  (కుండలీకరణల మధ్యనున్నది Parenthesis)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'Parenthesis'... అంటే?

   తొలగించు
 17. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2847
  సమస్య :: మార్కండేయునికిన్ సుతుం డగుచు జన్మం బందె సామీరియే.
  *హనుమంతుడు మార్కండేయునికి కుమారుడుగా జన్మించినాడు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: హనుమంతుని కేసరీపుత్రుడు అని వాయుపుత్రుడు అని అంటారుకదా! ఎటువంటి తర్కమునకు తావు లేకుండా ఆ అంజనాతనయుని జన్మవృత్తాంతమును చెబుతాను విను. కేసరి వైరాగ్యమును పొంది తన భార్యయగు అంజనాదేవిని జూచి “నీవు వాయుదేవుని సేవించు” అని చెప్పినాడు. ఆమె అట్లు చేయగా ప్రసన్నుడైన వాయుదేవుడు తనయందున్న శివశక్తిని ఆ అంజనాదేవికి ప్రసాదించినాడు. అంతట అంజనాదేవి గర్భవతియై శివాంశతో కుమారుని ప్రసవించింది. అతడే ఆంజనేయుడు అని వాయుపుత్రుడు అని కేసరీసుతుడు అని పిలువబడుతూ ఉన్న హనుమంతుడు. సమీరుని కుమారుడైన ఈ సామీరి సూర్యభగవానుని గురువుగా స్వీకరించి నవ వ్యాకరణములను సకలశాస్త్రములను అభ్యసించినాడు అని సామీరి జన్మవృత్తాంతాన్ని మార్కండేయునికి ఒక మిత్రుడు చెప్పినట్లు ఊహించి చెప్పే సందర్భం.

  “అర్కున్ వ్యాకరణమ్ము నేర్పుమనె విద్యాసక్తుడై, వాయు సం
  పర్కం బందిన యంజనాంబకు మహాభాగ్యమ్ముగా బుట్టె, యీ
  తర్కం బే”లని మారుతిప్రభవ మంతా జెప్పె మిత్రుం డిటుల్
  మార్కండేయునికిన్ “సుతుం డగుచు జన్మం బందె సామీరియే.”
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (15-11-2018)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రాజశేఖర్ గారూ,
   అద్భుతమైన పూరణ. అభినందనలు.

   తొలగించు
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించు
  3. సవరణతో
   గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
   సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2847
   సమస్య :: మార్కండేయునికిన్ సుతుం డగుచు జన్మం బందె సామీరియే.
   *హనుమంతుడు మార్కండేయునికి కుమారుడుగా జన్మించినాడు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
   సందర్భం :: హనుమంతుని కేసరీపుత్రుడు అని వాయుపుత్రుడు అని అంటారుకదా! ఎటువంటి తర్కమునకు తావు లేకుండా ఆ అంజనాతనయుని జన్మవృత్తాంతమును చెబుతాను విను. కేసరి వైరాగ్యమును పొంది తన భార్యయగు అంజనాదేవిని జూచి “నీవు వాయుదేవుని సేవించు” అని చెప్పినాడు. ఆమె అట్లు చేయగా ప్రసన్నుడైన వాయుదేవుడు తనయందున్న శివశక్తిని ఆ అంజనాదేవికి ప్రసాదించినాడు. అంతట అంజనాదేవి గర్భవతియై శివాంశతో కుమారుని ప్రసవించింది. అతడే ఆంజనేయుడు అని వాయుపుత్రుడు అని కేసరీసుతుడు అని పిలువబడుతూ ఉన్న హనుమంతుడు. సమీరుని కుమారుడైన ఈ సామీరి సూర్యభగవానుని గురువుగా స్వీకరించి నవ వ్యాకరణములను సకలశాస్త్రములను అభ్యసించినాడు అని సామీరి జన్మవృత్తాంతాన్ని మార్కండేయునికి ఒక మిత్రుడు చెప్పినట్లు ఊహించి చెప్పే సందర్భం.

   “అర్కున్ వ్యాకరణమ్ము నేర్పుమనె విద్యాసక్తుడై, వాయు సం
   పర్కం బందిన యంజనాంబకు మహాభాగ్యమ్ముగా బుట్టె, నీ
   తర్కం బే”లని మారుతిప్రభవ మంతా జెప్పె మిత్రుం డిటుల్
   మార్కండేయునికిన్ “సుతుం డగుచు జన్మం బందె సామీరియే.”
   కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (15-11-2018)

   తొలగించు


 18. ఆర్కాడు నవాబడుగన్,
  బర్కత్ఖాను కథనల్లె పద్ధతి గానన్
  తుర్కీ దేశంబున నా
  మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్!


  జిలేబి

  రిప్లయితొలగించు
 19. తర్కించిమృకండుడుమృడు
  నర్కేంద్వగ్న్యాక్షునడిగెనాడు?హరుండున్
  అర్కాన్వయార్చకొఱకే
  *"మార్కండేయుని కొడుకుగ ;మారుతి పుట్టెన్"*

  రిప్లయితొలగించు
 20. తర్కము జేయక వినుడా
  మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టె
  న్నర్కజుడు చచ్చి బ్రతుకగ
  మూర్కొని యా పుత్రునపుడు ముద్దుల గురిపెన్

  రిప్లయితొలగించు


 21. శర్కరన మృకండు బడసె
  మార్కండేయుని కొడుకుగ, మారుతి పుట్టెన్,
  నర్కుని కెడ వేదంబును
  తర్కపు శాస్త్రములనేర్చె తరుణి జిలేబీ :)


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శర్కరన'...?

   తొలగించు

  2. శర్కర - చక్కెర

   చక్కెర లాంటి పిలగాడు :)


   జిలేబి

   తొలగించు
 22. మార్కండేయుడు శంకరుం గొలిచి సన్మార్గంబులోనీశు సం
  పర్కంబొంది వరమ్ముతో బ్రతికెనాపై తాఁజిరంజీవిగా
  తర్కంబాడకు మూర్ఖుడా యిది యసత్యంబే యిటుల్ పల్క నే
  *"మార్కండేయునకున్ సుతుం డగుచు జన్మంబందె సామీరియే?"*

  రిప్లయితొలగించు
 23. మర్కట చేష్టలు కావవి
  తర్కము గాదది నిజముగ తనయుడెపోనా
  యర్కుని ప్రేమఫలమ్మగు
  మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్!!"

  రిప్లయితొలగించు
 24. అర్కజుబాశముచుట్టెను
  మార్కండేయుని,కొడుకుగమారుతిపుట్టెన్
  మర్కటమౌయాకేసరి
  కర్కునికిన్సాటియైననంశముతోడన్

  రిప్లయితొలగించు
 25. ఆర్కినణచి గాచె హరుడు
  మార్కండేయుని,కొడుకుగ మారుతి పుట్టెన్
  సర్కముని శక్తికలిగిన
  మర్కటము శివాంసతోడ మహి యంజనకున్!!!
  సర్కము =వాయువు

  రిప్లయితొలగించు
 26. ఆర్కితనయుండు మందుడు,
  మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్"
  ఎర్కగల మాట లినవలె,
  మర్కట సుతుడు శివుడనిచు మకురుడు పలికెన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వినవలె'ను 'ఇనవలె' అన్నారు. 'శివు డనుచు' టైపాటు. 'మకురుడు'?

   తొలగించు
 27. తార్కాణమోకుతర్కమొ
  కర్కశదనుజాధిపుపలుకలుగులు చండా
  మార్కులమతిచెరచననిరి

  *"మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్"*

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శంకర్జీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పలుకలుగులు'?

   తొలగించు
  2. పలుకు+అలుగులు=పలుకలుగులు మాటలనెడు బాణములు చండామార్కుల గుండెలను కలచివేయగ ఏమేమొ పలికారని ఉద్దేశ్యంతో అన్నారు అని పూరణ

   తొలగించు
 28. మర్కట మనిలున కేమగు?
  కర్కశముగనడిగె నతడు గడసరి యౌయా
  తర్కము తెలిసిన సుతుడగు
  మార్కండేయుని, కొడుకుగ మారుతి పుట్టెన్.

  రిప్లయితొలగించు
 29. అర్కానిల సమ తేజుఁడు
  తర్కంబేలఁ జిరజీవ ధన్యుం డరయన్
  మార్కండేయుండొ యపర
  మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్


  సార్కద్యోచర సంచయమ్ములు దివిన్ సంచారముల్ సల్పు సం
  పర్కంబై యుడు చక్రవాళముల సంభావ్యంపుఁ బర్యంతమున్
  బెర్కే లే దన, నంజనీ సతికి సంప్రీతుండు, తుల్యంబునై
  మార్కండేయునకున్, సుతుం డగుచు జన్మంబందె సామీరియే

  [బెరుకు = భేదము]

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   'తుల్యుండునై' అంటే బాగుంటుందేమో?

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
   అవునండి. సవరించెదను. ధన్యవాదములు.

   తొలగించు
 30. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పేర్కొన మృకండు డొందెను
  మార్కండేయుని కొడుకుగ! మారుతి పుట్టెన్
  తర్కంబే లేకుండగ
  మర్కటునిగ రామకార్య మడరించంగన్

  రిప్లయితొలగించు
 31. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  ఊర్కోనుండక శంకరాభరణలో నొక్కింత సాధించితిన్:
  మార్కండేయుడు, మారుతిద్ధరణినిన్ మర్జన్మ లేకుండిరే
  తర్కంబింతయు చేయగా యశమునన్ దాంతమ్ము శాంతమ్మునన్
  మార్కండేయునకున్ సుతుం డగుచు జన్మంబందె సామీరియే

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   దోషాలను తర్కించకుండా ముందే ఆటవిడుపు సరదా పూరణం అన్నారు మరి!

   తొలగించు
  2. సార్! అసలే శార్దూలం. పైగా దుష్కర ప్రాస. పైగా భాగవత పురాణం. ఏమిచేయగలను? మార్కండేయుడనే ఒక నాయకుడికి సామీరుడనే కొడుకు ఉన్నాడనడం ఇష్టం లేదు. నేనేమైనా పోచిరాజు కామేశ్వర రావుగారినా? అది పునర్జన్మలోనే!

   __/\__


   తొలగించు


  3. శార్దూలంబయె పైన దుష్కరపు ప్రాసాయెన్ కవీశా!గురో :)


   జిలేబి

   తొలగించు
  4. పునర్జన్మలో గూడ చిన్నకోరికేనా!
   నన్నయామాత్యునిలా అవ్వాలని కోరుకోండి.

   తొలగించు


  5. చిని చిన్ని కోరికలవే
   ల!నన్నయామాత్యునివలె లక్షణముగ పే
   రును పొందవలెను మరుజ
   న్మని మీరు ప్రభాకర యవనాశ్వ కవీశా :)


   జిలేబి

   తొలగించు
 32. సర్కారొప్పదుశాస్త్రపుస్తకములన్ఛాత్రాళికిన్నేర్పుటన్
  తర్కవ్యాకరణాదులున్విలువలాధ్యాత్మార్ష సాహిత్యసం
  పర్కంబందకనాంగ్లభాషయొడి దౌర్బల్యాంథ్యతన్ బల్కరా?
  *"మార్కండేయునకున్ సుతుం డగుచు జన్మంబందె సామీరియే"*

  రిప్లయితొలగించు
 33. డా.బల్లూరి ఉమాదేవి.

  అర్కజుడు వచ్చె గొనిపో
  మార్కండేయుని,కొడుకుగ మారుతి పుట్టెన్
  మర్కటముగఅంజనకును
  అర్కజు సచివుండనంగ యశమును పొందెన్.

  అర్కజుడు:యముడు(మొదటిపాదం)
  అర్కజుడు:సుగ్రీవుడు(నాల్గవ పాదం

  రిప్లయితొలగించు
 34. తర్కంబేటికి మానుమంటి జనులన్ ధర్మంబు రక్షింపగా
  మార్కండేయుడు నామృకండు సుతుడన్ మన్నించి శ్రీవిష్ణువే
  మార్కండేయునకున్ సుతుండగుచు జన్మంబందె, సామీరియే
  యర్కున్ మించిన తేజమొప్పుచునిల తానావాయు పుత్రుండయెన్

  రిప్లయితొలగించు
 35. కందం
  తర్కము! నాధ్యాత్మిక సం
  పర్కమున గొలువ హరుఁ బిత, బాలుడు రామున్
  పేర్కొని రిట్లున్ భక్తులు
  మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్!

  రిప్లయితొలగించు