16, నవంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2848 (గంగలో మున్గ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గంగలో మున్గఁ బాపముల్ గలుగు పెక్కు"
(లేదా...)
"గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ గల్గుఁ బాపముల్"

42 కామెంట్‌లు:

  1. సంగమేశ్వరు పాదాల సరస నుండి
    చెంగు చెంగున త్రుళ్ళుచు చిందులిడుచు
    వంగభూమికి చేరెడు బహు కలుషిత
    గంగలో మున్గఁ బాపముల్ గలుగు పెక్కు

    రిప్లయితొలగించండి


  2. తొలగు నమ్మ జిలేబియ తొలగు వ్యధలు
    గంగలో మున్గఁ, బాపముల్ గలుగు పెక్కు
    మునిగి వచ్చి పిదప వెర్రి మొర్రిగ జను
    లెల్ల బతుకగాను భలెభలెయని సుదతి !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. చేదు సొరకాయతో గంగ చేరి మునగ
    పుణ్యమేమి వచ్చు పరమ పురుష నీకు?
    నేర ఘోరములనుజేసి నిక్కముగను
    గంగలో మున్గఁ బాపముల్ గలుగు పెక్కు

    రిప్లయితొలగించండి
  4. చిత్త శుద్ధియె లేకను శివుని కొలిచి
    కొంగ జపమును జేయుచు దొంగ చాటు
    పనులు జేసిన మెచ్చడు భర్గు డనగ
    గంగలో "ముల్గఁ "బాపముల్ గలుగు పెక్కు
    -------------------------------
    క్షమించాలి ఎందుకో " ముంగ " సరిగా రావటల్లేదు

    రిప్లయితొలగించండి
  5. ధర్మమును వీడి పూర్వోక్త కర్మలందు
    తప్పు లెంచుచు జగతిలో దైవ మనెడి
    వాడె లేడంచు పలుకువా డాడు నిట్లు
    గంగలో మున్గఁ బాపముల్ గలుగు పెక్కు.

    రిప్లయితొలగించండి
  6. కలకల యంచు కుంద నెద కాపురుషుండొనగూర్చు కృత్యముల్,

    విలవిల లాడగా జనులు విఘ్నమొనర్చగ కార్యభగ్నతన్,

    సులువుగ పుణ్య మెట్లొదవు, చొప్పడు నే యలస్వర్గవాసముల్?

    గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ గల్గు పాపముల్.

    కంజర్ల రామాచార్య.
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  7. దొంగ జపమున విలువలు తుంగఁద్రొక్కి
    పరుల హింసించి,డబ్బులు మరిగి,పెరిగి,
    మీసమును పెంచి సాత్విక మింత లేక
    "గంగలో మున్గఁబాపముల్గలుగు పెక్కు"

    రిప్లయితొలగించండి
  8. నియమ నిష్ట లు వీడియు నీతి మాలి
    ద్రోహ చింతన గల్గియు దుష్టుల గు చు
    మోసము లు చేయు వార లు మూర్ఖుల గుచు
    గంగ లో మున్గ బాపముల్ గలుగు పెక్కు

    రిప్లయితొలగించండి


  9. వలయపు జీవితమ్మిదియె వాసన, కర్మఫలమ్ము,కష్టముల్
    తొలగును, కల్గు పుణ్యమిక, తొందర తొందర గా,నిజమ్ముగా
    గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ, గల్గుఁ బాపముల్
    బలెబలె యంచు జీవితపు బాటన తప్పులు చేయ మళ్ళి సూ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. సలసలలాడు నూనెలను
    సంతత మంపుచు ; నిష్టరీతిగా
    మలినపు కంపుదేహముల
    మత్తుగ గల్పుచు ; సైకతమ్ములన్
    మెలకువ లేక త్రవ్వి జల
    మేధము సల్పెడి ధూర్తవర్తనుల్
    గలగల బారునట్టి సుర
    గంగను మున్గిన ; గల్గు బాపముల్ .

    రిప్లయితొలగించండి
  11. గంగలోన మునగ నేల నంగ నాచి
    వంగముల్లు లాగ, పెరుగు గంగ మురికి;
    అంతరంగ శుద్ధియు లేక, ఆత్మ ద్రోహి
    గంగలో మున్గఁ బాపముల్ గలుగు పెక్కు

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా సత్యనారాయణ
    "ఇలనెటు గానగానగునదెక్కడ దైవమ"టన్న శిష్యునిన్
    బలిమిని నొక్కె నీట"గురు!బైటకు రావలె"నన్నరీతిగన్
    విలవిలలాడి లేచెనట విచ్చె రహస్యము దైవ చింతనన్
    చలమున నన్యభావముల సాగగనీయని సాధనన్ గనన్
    గలగల బారునట్టి"సురగంగ"న మున్గిన గల్గుభావముల్

    రిప్లయితొలగించండి
  13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2848
    సమస్య :: గల గలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ గల్గుఁ బాపముల్.
    గంగలో మునిగితే పాపాలు కలుగుతాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: “విష్ణుపాదోద్భవ యైన గంగ భగీరథప్రయత్నం కారణంగా ఆకాశమునుండి అవతరించి క్రమంగా శంభుని శిరస్సును, హిమాలయాన్ని, భూతలాన్ని, సముద్రాన్ని చేరుకొని అక్కడినుండి రసాతలానికి వెళ్లింది. కపిల వాసుదేవుని కంటిమంటకు భస్మమైన అరవైవేలమంది సగరపుత్రులకు పాపప్రక్షాళనం చేసి వారికి ఉత్తమలోకాలు కలిగేటట్లు చేసింది. మహాత్ములు సాధువులు భక్తులు తనలో మునుగుతున్నందున నిత్యమూ తాను పవిత్రమై ఇతరులను పవిత్రం చేస్తూ ఉంటుంది ఈ గంగానది. పాపాత్ములు స్నానం చేసినప్పుడు వారి పాపాలు ఈ గంగలో మిగిలియుండి మనకు సంక్రమిస్తాయి అని మూర్ఖంగా ఆలోచించకుండా పవిత్ర గంగాస్నానం చేయడానికి రా” అంటూ ఒక మహాత్ముడు గంగానది యొక్క నిత్య పవిత్రతను గుఱించి విశదీకరించే సందర్భం.

    కలి మల దోషు లెల్ల మునుగంగనె వారల పాప మంటుటన్
    గల గలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ గల్గుఁ బాపముల్
    వల దిట స్నానపానమని పల్కకు మూర్ఖత, సాధు సంతు లీ
    జలమున మున్గ గంగ యగు శస్తముగా, మునుగంగ రమ్మురా.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (16-11-2018)

    రిప్లయితొలగించండి
  14. తెలిసి చేసెడుపాపముల్ తెలియనట్లు
    నటనజేసెడు వారలు నాశనంబె
    ఓటమెరుగని ధీరులే ఓడి వీరు
    గంగలో మున్గ బాపముల్ గలుగు పెక్కు

    రిప్లయితొలగించండి
  15. రంగు నీరని దెల్పుచు చెంగట గల
    దొంగ సారాను త్రాగిన ధూర్త కవియె
    భంగ పడ, " పుణ్యము '' లనక బలికె సభను
    గంగలో మున్గఁ ''బాపముల్ '' గలుగు పెక్కు

    రిప్లయితొలగించండి
  16. పరమ శివుని శిరసు నుండి బయలు వెడలు
    పరమ పావనమౌ గంగ పాపహారి
    పాడి కాదీ విధముగను పలుక ;నెట్లు
    గంగలో మున్గఁ బాపముల్ గలుగు పెక్కు ?

    రిప్లయితొలగించండి


  17. మైలవరపువారి పూరణ


    గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ , గల్గుఁ బాపముల్ !!

    లలనలఁ గామదృష్టిఁగని లౌల్యమునందెడు వారు , మద్యమ...
    త్తులు ., ధనచోరులున్ , మునుల దూషణఁ జేసెడి నిత్య దుష్ట క...
    ర్ములు శివలింగమున్ నిలిపి మ్రొక్కినఁ , గొండల భక్తినెక్కినన్
    గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ , గల్గుఁ బాపముల్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేరముల్ చేయువార, వినీతిపరులు ,
      రాజకీయంపు నేతలు , త్రాగుబోతు...
      లనెడి వారలు ముందుగా మునిగినట్టి
      గంగలో మున్గ పాపముల్ గల్గు పెక్కు !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  18. కలగనియేలగుందవలె కాయమనంబునవాక్కుగర్మలన్
    పలువలుతుల్వలైచెలగిపాడొనరించిప్రజల్జలంబులన్
    తలుపులశూలిలీలమతితట్టక జూడకనడ్గకన్వృథా
    "గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ గల్గుఁ బాపముల్"

    రిప్లయితొలగించండి
  19. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటూ త్రికరణశుద్ధిగ ఆత్మసాగరంలో స్నానం చేస్తే పాపనాశనం అని శివుడు సురగంగనుదాల్చడంలోని ఆంతర్యం అనీ ఆబ్రహ్మాన్ని తట్టి,చూచి,అడిగిన అంత ఆత్మసాక్షాత్కారమనీ వృథాగా గంగలో కాదని భావవ్యక్తీకరణ చేశాను

    రిప్లయితొలగించండి
  20. తలపుల లోన గల్మషమె దండిగ గల్గిన మూఢ మానవుల్
    కలుషము నిండియుండి కను గానక వర్తిలు నట్టి వారలున్
    పలుమఱు తీర్థయాత్రలనె బాగుగ నెన్నియొ వేలు జేసినన్
    "గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ గల్గుఁ బాపముల్"

    రిప్లయితొలగించండి
  21. కలవరమొందె నేనుజన కల్మషహారిణి భీష్మమాతనే
    బిలబల పాపులందరు యభీష్టములొందగ నాపదాలనే
    మలిన మొనర్చ; మీకిదియె మాతను సాపెన మిచ్చు చుంటి నే
    గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ గల్గు పాపముల్.

    రిప్లయితొలగించండి
  22. నా ప్రయత్నం :

    తేటగీతి :
    స్నానమున్ జేయు ముందర నదులలోన
    పలుక వలయును మంత్రము వంకలేక
    వినుము దోషమ్ముగా బల్కుచును చివరకు
    గంగలో మున్గఁ బాపముల్ గలుగు పెక్కు

    చంపకమాల
    తెలియుము బాలకా! నదులు తీయక పారుట వల్ల శుద్ధియౌ
    గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ దొల్గుఁ బాపముల్
    పలికితి వేలమార్చి? నువు పల్కఁగ వ్రాసితిఁ దప్పుఁ జూడుమా
    " గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ గల్గుఁ బాపముల్ "

    రిప్లయితొలగించండి
  23. కర్మ బంధాలలో మున్గి కల్మషముల
    నాచరించునరులకిల నంతమగును
    గంగలో మున్గ బాపముల్, గలుగు పెక్కు
    చర్మరోగముల్ కలుషిత జలముఁ మునగ.

    రిప్లయితొలగించండి
  24. పుణ్యములుగల్గుదప్పకపుణ్యపురుష!
    గంగలోమున్గ,బాపముల్గలుగుపెక్కు
    పరులహింసించునాతడుభర్గుడైన
    నిష్టపడకుడుకవులార!హింసజేయ

    రిప్లయితొలగించండి
  25. పలువురిహింసజేసిననుదప్పకనీకునుగల్గుబుణ్యముల్
    గలగలబాఱునట్టిసురగంగనుమున్గిన,గల్గుబాపముల్
    యిలనువసించుబ్రాణులనునేమరుపాటుదనంబునన్గనన్
    నలరెడునుమాశంకరులనర్చనజేసినబోవుపాపముల్

    రిప్లయితొలగించండి
  26. దైవ భక్తు భంగిఁ బరఁగి దారుణములు
    ధర్మ మెంచక క్రూర కర్మమ్ము లెల్ల
    వార కెన్నఁడు సేయఁ బోవ గల వయ్య
    గంగలో మున్గఁ బాపముల్ గలుగు పెక్కు


    వెలవెలఁ బోవ బంధు సఖ బృందము పత్తన వాసు లందఱిం
    బిలుచుచు బిట్టు తిట్టుచును బీడ లొనర్చి చెలంగు చుండ వా
    రల వదన చ్యుత ప్రకట రావ తరంగ సుశాప దాయులౌ
    గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ గల్గుఁ బాపముల్

    [సురగంగ = మద్యమను గంగ]

    రిప్లయితొలగించండి
  27. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    Ganga Action Plan

    కలలనుగంచు నొక్కపరి కాశికి బోవలె గంగనందునన్
    జలముల మున్గి పాపములు జాహ్నవి కిచ్చెదనంచు చూడగా
    పలువిధ కల్మషమ్ములటు పారగ తోచదె నివ్విధమ్మునన్:
    "గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ గల్గుఁ బాపముల్"

    రిప్లయితొలగించండి
  28. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ....

    మిలమిల తెల్ల వారగనె మేలిమి వెల్గుల సోయగంబులో
    పలు పలు రీతి మానవులు పావన జాహ్నవి జేరి, పుణ్యముల్
    గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ గల్గుఁ , బాపముల్
    మలమల మాడిపోయి జయ మంగళ మబ్బును ప్రాణ కోటికిన్.

    రిప్లయితొలగించండి
  29. తొలగిపోవును జనులకు తొందరగను
    గంగలో మున్గ పాపముల్ , గలుగు పెక్కు
    సౌఖ్యములు సంతసమ్ములు జగతిలోన
    కలుషహారిణి సురనదిన్ గనిన చాలు!!1

    రిప్లయితొలగించండి
  30. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    విలవిల లాడుచున్ బరుల విత్తము నందెడు వారు , చెట్ట చె

    య్వుల నొనరించు వారును , బరోపకృతిన్ మది నెంచనట్టి వా

    రలు , గనిపించు దైవ సములన్ - గని పెంచిన యట్టి తల్లిదం

    డ్రులకు నొకింత ప్రేముడిని దోమటి వెట్టుచు సాకనట్టి వా

    రలు మునుగంగ > గాంగ సలిలం బిక కల్మష మయ్యె | గావునన్

    గలగల బారునట్టి సురగంగను మున్గిన గల్గు పాపముల్


    ( దోమటి = అన్నము )


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  31. నాటిగంగానదియన యేనాటికైన
    దోమనాశకకారిణి!"దోషమొసగు
    నేటికాలుష్యమెంతయో చేటుగూర్చ"
    గంగలోమున్గ?బాపముల్ గలుగుపెక్కు!

    రిప్లయితొలగించండి
  32. ధనము సమయమ్ము నెంత వృధా పఱచుచు
    ధర్మ వర్తన వీడి సతమ్ము దుష్ట
    భావములఁ గూడి క్రూరుఁడై బఱగుచు సుర
    గంగలో మున్గఁ బాపముల్ గలుగు పెక్కు


    అలరుచు శంభు శీర్షమున నద్భుత రీతిన జాలువారి లో
    కుల కిల సర్వ కామ్యములు కోరిన రీతి ప్రశస్తమై చనన్
    గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ గల్గుఁ, బాపముల్
    తొలఁగి శుభంబు జేకురు నధోగతి చెందరు లెమ్ము నమ్ముమా !

    రిప్లయితొలగించండి
  33. వరూధిని:
    వలచితినంచు నీకడకు వచ్చియె వ్రాలిన యప్సరాగ్ర కో
    మలినొకొ కౌగిటన్ నిలిపి మన్నన సేయక ధర్మపన్నముల్
    బలుకుచు, లేక భూతదయ, పారుడ ద్రోతువె? కర్కశాత్ములా
    గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ, గల్గుఁ బాపముల్.

    రిప్లయితొలగించండి
  34. పలికెద రైరి పెద్దలిల పాపికి యైనను ముక్తి కాశిలో
    వెలసిన విశ్వనాథుఁ మది వేడుచు చెంతన తీర్థరాజమౌ
    గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ గల్గుఁ , బాపముల్
    దొలగును స్వార్థమున్ గలుగు దుర్మతి కైనలభించు సద్గతుల్

    రిప్లయితొలగించండి
  35. హిరణ్య బాహువు కురులలో కూర్చుండి ధరణి లో నడయాడు సరస సురల,
    హిరణ్య గర్భుని చరణము లోనుంచి బుట్టిన ఘనమైన పొడుగు మడుగు ,
    హిరణ్మయుని వర కర కమండలమున చేరిన పుణ్య భగీరధసుత,
    మూడులోకములందు ముచ్చట గా తిరుగాడెడు తల్లి గగన నిమగ్న,

    తొలుగు చుండు పాపములు జనులకు నట్టి
    గంగలో మున్గఁ, బాపముల్ గలుగు పెక్కు,
    నేడు కలుషిత మైనట్టి నీటి లోన
    మునిగి జలకములాడగ మనసు బెట్టి

    రిప్లయితొలగించండి
  36. డా.పిట్టా సత్యనారాయణ
    కలుష పూరిత నదులు నీగన్న సుడులు
    నాటి హిమజల సంపత్తి నాశనమయె
    నెంచరే పాపమే వ్యాధి నేడు చూడ
    గంగలో మున్గ బాపముల్గల్గు పెక్కు

    రిప్లయితొలగించండి
  37. డా. పిట్టా ‌సత్యనారాయణ
    కలుషితమాయె చాలదని కాలియు కాలని పీన్గులీడ్చుటల్
    నెలవులు గొన్న జంతు తతి నిష్ఠగ దిన్న దినాలుబోయె నా
    జల ఋజలెన్న బ్రీతియొకొ జచ్చిన వారికి వ్యాధి రాదు నే
    గలగల బారునట్టి సుర గంగను మున్గిన గల్గు పాపముల్
    (పాపము॥వ్యాధి)పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేన పీడితమ్

    రిప్లయితొలగించండి
  38. ఇంగ్లీకం గల వాడనె
    ఆంగ్లంబున వ్రాసెఁ ,బోతనార్యుండు కృతిన్!
    మంగ్లీ వార్తల వినగ
    న్నాంగ్లమ్మున నవ్విరంట నర్థముగనకన్!!

    **ఇంగ్లీకం=కొంటెతనం.

    రిప్లయితొలగించండి