19, నవంబర్ 2018, సోమవారం

సమస్య - 2851 (బకమునుఁ గబళించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"బకమునుఁ గబళించు బల్లిఁ గనుము"
(లేదా...)
"బకమును మ్రింగుచున్న దొక బల్లి గనుంగొనుమయ్య మిత్రమా"

94 కామెంట్‌లు:

 1. వింత యుగము గాన విడ్డూర ములుమెండు
  బకమును గబళించు బల్లిఁ గనుము
  కరిని మ్రింగె నంట పరవశం బునదోమ
  కుత్తు కందు జేరి కొఱికి కసిగ

  రిప్లయితొలగించండి
 2. సకలము భరియించు శంకరుని తనలో
  చకచక బిగియించె చండి చూడు!
  మకట! యిది యెటులర! నన్నను సరిసరి:
  బకమును గబళించు బల్లిఁ గనుము!

  రిప్లయితొలగించండి
 3. మైలవరపు వారి పూరణ

  చకచక ప్రాకుచుండెనదె సర్పపునోటను దూరె , వింత కా...
  దొకొ ! గరళమ్ము తాకె నదిగో ! భయమింతయులేక , గాంచి త్ర్యం...
  బకుని మనోజ్ఞమూర్తి గుడిపై విలసిల్లగ , మంటయైన యం...
  బకమును మ్రింగుచున్న దొక బల్లి గనుంగొనుమయ్య మిత్రమా !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. బల్లి సజ్జనునకు , బకమేమొ ఖలునకు
   నెన్నికలకు గుర్తులిచ్చినారు !
   ప్రజలు సజ్జనుననకె పట్టము గట్టగా
   బకమును గబళించె బల్లి గనుము !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 4. జగతి పెద్ద వాడు చప్పరించును పిన్న
  వాని కదియె సరియ!బాగు బాగు!
  కీటకముల జేరి కిటికీలదూరు శా
  బకమునుఁగబళించు బల్లిఁగనుము.

  శాబకము=శిశువు

  రిప్లయితొలగించండి
 5. సమస్య :-
  "బకమునుఁ గబళించు బల్లిఁ గనుము"

  *ఆ.వె**

  ముందు చూపు చూచి మునివరుండు పలికె
  వామనుండు వచ్చె బలిని ద్రుంచ
  విశ్వరూప మిపుడు వీక్షీంచ భాగ్యమే
  బకమును గబళించు బల్లి గనుము
  .......................✍చక్రి

  రిప్లయితొలగించండి
 6. ఓగిరం బు కొ ర కు నూగి స లాడు చు
  వె ద కు చుండ దొరక దేది య పు డు
  క్షుదను తాళ లేక కోపాన తనదు శా
  బ క ము ను గబ ళిoచు బల్లి గను ము

  రిప్లయితొలగించండి
 7. మోసపుచ్చ నొకని మోదమ్ము కాబోదు
  తాడి దన్నువాడుఒక్కడుండ
  వాడి తలను దన్నువాడుమరియొకండు
  బకమును గబళించు బల్లిఁ గనుము!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గంగాప్రసాద్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వాడు + ఒక్కడు' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "తాడి దన్ను మనుజు డొక్క డుండ" అనండి.

   తొలగించండి
 8. తికమకనటునిటునతివడి పరుగిడెడు
  కీటకములగాంచి ఖేదమొందె
  చూలియైనగౌళి,బేలగావేచి శా
  బకమునుకబళించుబల్లిగనుము

  కంచివెళ్ళివెండిగౌళినిదాకిన
  మూడుపాపములిలమూడునన్న
  వెళ్ళివచ్చితేను, విజ్ఞులనిరిగతం
  బకమునుకబళించుబల్లిగనుము


  అకము=పాపము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర్జీ గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   అది బంగారుబల్లి కదా? మీరు వెండిబల్లి అన్నారు. అక్కడ 'స్వర్ణగౌళి' అందామా?

   తొలగించండి
 9. వికలమవగ మనసు విధిచేత తలయొగ్గి
  సకల శాస్త్ర విదుడు సత్యవాది
  విరటు కొల్వుజొచ్చె కరకైన కాలము
  బకమును గబళించు బల్లిగనుము

  రిప్లయితొలగించండి
 10. ఆ.వె.
  బకమనంగ నాకు ప్రజలుగా తోచెను
  ప్రజల పాలకుండు బల్లి యనగ
  అధిక పన్నుచేత నందర్ని మ్రింగును
  బకమునుఁ గబళించు బల్లిఁ గనుము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మల్లేశ్వర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అందర్ని' అనడం వ్యావహారికం. "అందరన్ మ్రింగును" అనండి.

   తొలగించండి
 11. చకచకమంచు ప్రాకుచును చయ్యన కీటకముల్ తినన్ దా
  నికటము వచ్చియాగినది నెమ్మదిగా తన కళ్ళు త్రిప్పుచున్
  సకలము మ్రింగవచ్చుననిసంతసమొందుచునాపలేక యు
  *"బ్బకమును, మ్రింగుచున్న దొక బల్లి గనుంగొనుమయ్య మిత్రమా"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి

 12. మందూ భాయ్ :) పక్కన చచ్చిన అలింబకము - తేనెటీగ ను మింగుతున్న బల్లి :)  లకలక మంచు బారుల కలానిధి రాత్రిని మత్తుగాంచినా
  వకొ? కను లెర్ర బోయె తెలవారెను లేవర వేగిరమ్ముగా
  పకపక నవ్వులేలనకొ? పక్కన నీదరి చావగా నలిం
  బకమును మ్రింగుచున్న దొక బల్లి గనుంగొనుమయ్య మిత్రమా!

  జిలేబి

  రిప్లయితొలగించండి


 13. వచ్చె నీశుయాన పక్కన చచ్చెను
  కబళ మునట సన్నికర్షణమున
  గాన గా జిలేబి, గట్టిగ నాయలిం
  బకమునుఁ గబళించు బల్లిఁ గనుము!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'వచ్చె నీశునాన...' అనండి.

   తొలగించండి
 14. చకచక వ్రాసినావు బహు చక్కగ నీవిదె చిత్ర రాజమున్
  మకరము జీవముట్టిపడు మాదిరి యున్నది యెంచి చూడగా
  నకటకటా!కనంగ దడి యారని చక్కని బొమ్మలోని యం
  "బకమును మ్రింగుచున్న దొక బల్లి గనుంగొనుమయ్య మిత్రమా

  రిప్లయితొలగించండి
 15. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పేడియౌ శిఖండి విజయుని రధమెక్కి
  సుర్నదీతనయుని చూచు చుండ
  బవరమాపి నతడు పాలుమాలెనుగదా!
  బకము గబళించు బల్లి గనుము

  మట్టిగోడ నెక్కి మసలుచు నటునిటు
  తిండి కొరకు తాను తిరుగునట్టి
  వడిని దరికి నెగిరి వచ్చిన దోమ శా
  బకమును గబళించు బల్లి గనుము

  రిప్లయితొలగించండి
 16. లక్షణముగ నుండు రాకాసి బల్లులే
  వేల యేండ్ల క్రితము వెలిగె నవియె
  స్పీలు బర్గు తీయు సినిమాలు చిత్రమే
  *"బకమునుఁ గబళించు బల్లిఁ గనుము"*

  రిప్లయితొలగించండి
 17. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య :: 2851
  సమస్య :: బకమును మ్రింగుచున్న దొక బల్లి గనుంగొనుమయ్య మిత్రమా.
  *కొంగను ఒక బల్లి మ్రింగుతూ ఉంది చూడు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: జీవహింస గుఱించి కలవరపడుతున్న వ్యక్తిని జూచి మఱియొకవ్యక్తి “అయ్యా! నీవు బాధపడవద్దు. ఆకలిబాధకు తాళలేక పులి మేకను చంపుతుంది. పాము కప్పను మ్రింగుతుంది. పెద్దచేప చిన్నచేపను మ్రింగుతుంది. అక్కడ ఉన్న బల్లి ఈగను మ్రింగింది. ఆకలి తీఱక దాని పిల్లను కూడా మ్రింగుతూ ఉంది చూడు” అని లోకంలో ఉన్న విచిత్రమైన ధర్మాన్ని గుఱించి విశదీకరించే సందర్భం.

  అకట విచిత్ర మీ జగతి నాకలిబాధకు దాళలేక యం
  తకులుగ మారు జీవు లిది ధర్మమె, కప్పను పాము మ్రింగు, దీ
  నికి వగపేల? మక్షికము నిల్వగ మ్రింగియు వే తదీయ శా
  బకమును మ్రింగుచున్న దొక బల్లి గనుంగొనుమయ్య! మిత్రమా!
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (19-11-2018)

  రిప్లయితొలగించండి
 18. ముసురు వెలసినంత మూగు కీటకముల
  గోరి చేరె మట్టి గోడ పైకి
  యదను కొరకు వేచి యటతిరు గాడు శా
  బకమునుఁ గబళించె బల్లి గనుము.

  రిప్లయితొలగించండి
 19. అడవి లోన బుట్టి అడవిలోన బెరిగి
  బకమునుఁ గబళించు బల్లిఁ గనుము
  ఆటవికపు రీతి రాకాసి బల్లియె
  తెలిసి బతుక నేర్చె తెలివి గాను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 20. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  బకమునుఁ గబళించు బల్లిఁ గనుము

  సందర్భము:
  "చూస్తే చాలు.. ఉపుకాయించి తోక నొక్క సారి విదిలించి దూకి గబుక్కున క్రిములను నోట కఱచుకుంటోంది బల్లి. కళ్ళు నులుముకొని క్రిములను కబళించే బల్లిని చూడు."
  అని ఒకడు తన మిత్రునికి చెబుతున్నాడు.
  ఉపుకాయించి= గబుక్కున పైకి ఎగురడానికి ప్రయత్నించడం.. (పాలమూరు జిల్లా మాండలికం)
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  కాంచినంతఁ జాలుగా! ఉపుకాయించి,
  తోకను విదిలించి, దూకి, క్రిముల
  నోటఁ గఱచుకొనియె..
  నులుముకో నీదు నం
  బకమునుఁ.. గబళించు బల్లిఁ గనుము..

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  19.11.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 21. పూల వనము లోకి పుష్కలముగ జేరె
  తేనె కొరకు కొదమ తేటి ధాటి
  అదను కొరకు వేచి యచట తిరిగెడలం
  బకమునుఁ గబళించె బల్లి గనుము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "తిరుగు నలంబకమును" అనండి.

   తొలగించండి
 22. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,


  గుయ్యి మనుచు వ్రాల గోడపై , మశక శా

  బకమును గబళించు బల్లిఁ గనుము |

  " చిన్న జీవిని పెద జీవి తినును "

  చేతనులకు తిండి చేసిపెట్టితె శ్రీశ ?


  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదాన్ని నాల్గవ పాదంగా, నాల్గవ పాదాన్ని మూడవ పాదంగా మార్చండి.

   తొలగించండి
 23. గోడమీదబ్రాకుచీడపురుగును,శా
  బకమునుగబళించుబల్లిగనుము
  చూచుచుండమ్రింగచోద్యమయాయెను
  బ్రాణిబ్రాణికిలనుభక్ష్యదినుసు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'భక్ష్యదినుసు' అన్నది దుష్టసమాసం. "భక్ష్య మబ్బు" అనండి.

   తొలగించండి
 24. ప్రకటిత మయ్యె నెన్నికలు ప్రాజ్ఞులు మీరని చెప్పి యోట్ల నూ
  రక నిక వేయబోకుడని లక్షల నిచ్చిన నేమి లోకులే
  నకనక లాడిరే పిదప నాయకుఁ దుష్కృత చేష్టలన్ గనన్
  బకమును మ్రింగుచున్న దొక బల్లి గనుంగొనుమయ్య మిత్రమా!

  రిప్లయితొలగించండి
 25. ప్రాతకాలము రాక్షస బల్లులు భువి
  పై వసించెను వేల సంవత్సరములు
  చిత్రకారుడు చూపె నాచిత్రమచట
  బకమునుఁ గబళించు బల్లిఁ గనుము

  రిప్లయితొలగించండి
 26. కొండచిలువ యొకటి కోనేటి చెంతన
  బకమునుఁ గబళించె, బల్లి గనుము
  శయువు చెంతనున్న శలభము నేగాంచి
  మ్రింగ దలచి చేరె మిడుత కడకు

  రిప్లయితొలగించండి
 27. అసువులు వడి వీడె నచ్చట నక్కట
  యొక్క యాడు బల్లి దిక్కు లేక
  పిక్క జారఁ గాంచి బేర్మి సఖి మరణం
  బకమునుఁ గబళించు బల్లిఁ గనుము

  [మరణంబు + అకమును = మరణం బకమును; అకము = దుఃఖము]


  ప్రకటిత మౌను దైవ కృత రమ్య వినోద సులీల లన్నియున్
  సుకరము గాంచఁ బ్రాకృతిక సుందర జంతు నికాయ మంతటిం
  జకచక గోడఁ బ్రాఁకుచును జయ్యనఁ గీటక సంచలత్కదం
  బకమును మ్రింగుచున్న దొక బల్లి గనుంగొను మయ్య మిత్రమా

  [కదంబకము = గుంపు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు (ఎప్పటి వలెనే) వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 28. అకహరతీర్థయాత్రజని యాలయకుడ్యవిచిత్రచిత్రము
  ల్ప్రకటితమైనగాంచితి విభావిభమౌరసభంగిమ
  ల్సకలకళాలవాలమది;సత్వపుజిత్రముచిత్రమయ్యె నం
  బకమును మ్రింగుచున్నదొకబల్లిగనుంగొనుమయ్యమిత్రమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర్జీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
 29. నకనకలాడుచుండుచునునాలుకజూపుచుబ్రాకిపుర్వుశా
  బకమునుమ్రింగుచున్నదొకబల్లిగనుంగొనుమయ్యమిత్రమా!
  తికమకయైనజీవితమతీంద్రియశక్తులగారణంబునన్
  నొకరినినొక్కరీజగతినొవ్వుచునుండుటజర్గుచుండెగా

  రిప్లయితొలగించండి
 30. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  Chuchill (who called Gandhi a half-naked fakir) ఉవాచ: 👇

  తికమక జేసి మమ్ములను తియ్యగ శాంతి యహింసయంచుచున్
  పకపక నవ్వగా ప్రజలు బక్కని తాతయె మ్రింగుచుండగా
  వికలమునయ్యె నా మనసు విన్గనె వార్తను నివ్విధమ్మునన్:
  "బకమును మ్రింగుచున్న దొక బల్లి గనుంగొనుమయ్య మిత్రమా"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అంచు(న్)' అంటే సరి. 'అంచుచున్' అనరాదు. అక్కడ "...యహింస యంచు తా..." అనండి. అలాగే "నా మది వినంగనె వార్తను..." అనండి.

   తొలగించండి
 31. మాంత్రికుండొకండు మహిమలు చూపుచు
  పలుకుచుండె ప్రక్కవానితోడ
  క్షణములోన మారు కర్రయే కొంగగా
  బకమునుఁ గబళించు బల్లిఁ గనుము.

  రిప్లయితొలగించండి
 32. కానుపించనట్టి కాలసర్పంబట
  బకమునుగబళించు!బల్లిగనుము
  కీటకాలుదినుచు కీడునుమాన్పుచు
  దోమదోషములను దొలగజేయు!

  రిప్లయితొలగించండి
 33. అయ్యా,
  మీ సమస్య కు , దానిని పూర్తి చేస్తున్న అక్కలకు, అన్నలకు ముందుగా నా పాదాభివందనాలు. తెలుగు చదవడం, మాట్లాడటం తగ్గిపోతున్న ఈ రొజుల్లొ, తెలుగు మీద ఆసక్తిని కలిగించేలా మీ సమస్య లు, దాని పూరణలు ఉండటం మరింత అభినందనీయం. సమస్య ను ఆసక్తికరంగా పూరిస్తున్న రాజేశ్వరి నేదునూరి గారికి, శాస్త్రి గారికి, సీతాదేవి గారికి, సూర్యనారాయణ గారికి, ప్రసాద రావు గారికి, చక్రపాణి గారికి, జనార్దన రావు గారికి, మీకు, పేరు పేరునా నా నమస్కారములు.
  ఈ సమస్య చదువుతున్నప్పుడు, నాకొక చిలిపి ఆలొచన వచ్హింది గురువు గారు (తండ్రి కంటే ఉన్నత స్థానం అదే కాబట్టి అలా పిలిచాను, ఏమీ అనుకోకండి). "తండ్రి తొలిరాత్రికి, కూతురిని అహ్వానిస్తే" ఇది సమస్య గా వదిలితే, ఎలా పూరిస్తారో చుడాలని ఉన్నాది. తప్పు ఐతే క్షంతవ్యుడను.
  నాకు సమస్య ను పూరించేటంత తెలుగు రానందుకు కొంచెం చింతిస్తు. కనీసం చదివి అర్ధం చేసుకుంటున్నందుకు నన్ను నేను అభినందించుకుంటు, పని బారం వల్ల యెల్లప్పుడు చదవలేక పొతున్నందుకు నన్ను నేను తిట్టుకుంటూ, అప్పుడప్పుడు మాలాంటి వారికోసం పద్య భావాలని కుడా రాయాలని కోరుకుంటూ ఈ పోస్ట్ ని ముగిస్తున్నను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శశిధర్ గారూ,
   చాలా సంతోషం! 'శంకరాభరణం' బ్లాగు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!
   మీరు చెప్పిన భావానికి ఛందోబద్ధమైన సమస్యారూపాన్ని ఇస్తే ఇలా ఉంటుంది.
   "రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్"
   (లేదా...)
   "రమ్మని పిల్చెఁ దండ్రి తొలిరాత్రికి కూఁతును మెచ్చి రెల్లరున్"
   దీనిని రేపే బ్లాగులో ఇస్తున్నాను.

   తొలగించండి
  2. "రమ్మని పిల్చెఁ దండ్రి తొలిరాత్రికి కూఁతును ప్రేమ మీఱఁగన్"

   తొలగించండి


  3. అమ్మడి మగడా రారా
   రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్
   చెమ్మగిలినకన్నులతో
   తిమ్మా రావు సరసన్ సతిగ నిలుపనటన్


   జిలేబి

   తొలగించండి

  4. ఏమండీ కందివారు

   నీహారిక గారికి సవాలు వేస్తున్నారా :)


   జిలేబి

   తొలగించండి
  5. జిలేబీ గారూ,
   తొందరెందుకు? రేపటిదాకా ఆగవచ్చు కదా! :-)

   తొలగించండి

  6. ఆహా ! అయ్యగారు బుట్టలో పడినట్టున్నారు

   రేపేమవబోతోందో !


   నారదా
   జిలేబి

   తొలగించండి
  7. మీ హెచ్చరికతో భయం వేస్తున్నది. సమస్యను మార్చమంటారా?

   తొలగించండి


  8. భయమెందుకండీ

   బస్తీ మే సవాల్ అందాం

   మొన్నే కదా

   రణములె కద పండితులకు రమ్యక్రీడల్ అని నొక్కి వక్కాణించాం

   ఇదే వుంచండి :)


   జిలేబి

   తొలగించండి
  9. సార్! మీరావిడ మాటలు పట్టించుకోకండి...సమస్య బ్రహ్మాండంగా నున్నది...మార్చకండి ప్లీజ్!

   తొలగించండి
 34. తల్లి దండ్రి తోడఁ దనయుఁ డు జూడగ
  ఆంగ్ల చిత్రమొకటి యబ్బురముగ
  ఉత్సుకముగ జూడు కొమరుని తోఁ బల్కె
  బకమునుఁ గబళించు బల్లిఁ గనుము

  -చాగంటి చరణ్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చరణ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "ఉత్సుకతను జూచు కొమరునితో..." అనండి.

   తొలగించండి
 35. సకలము నాదు ప్రజ్ఞయని సంతత డంబపు మాటలాడుచున్
  మకిలమనస్కుడీ ప్రజల మత్తున ముంచుచు గద్దెనెక్కె మూ
  షికములు లోహముల్ తినుచు చెన్నుగ వర్తిలు రాజ్యమందు నో
  బకమును మ్రింగుచున్న దొక బల్లి గనుంగొనుమయ్య మిత్రమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సంతత డంబపు... మకిల మనస్కుడు' దుష్ట సమాసాలు. "సంతత భేషజ వాక్కు లాడుచున్..మకిలపు చిత్తుడీ..." అందామా?

   తొలగించండి
 36. కలత నిద్ర లోన కలగని యొకనాడు
  "బకమునుఁ గబళించు బల్లిఁ గనుము
  కనుమ"ని పలు మాఱ్లు కలవరించెడు బిడ్డ
  నెత్తు కొనెను తల్లి యింపు మీర !

  రిప్లయితొలగించండి
 37. నా ప్రయత్నం :

  శకుని దుర్యోధనునితో...

  ఆటవెలది
  ధర్మమనెడు బకపు తపమది గాంచుడు
  జూదమనెడు బల్లి చొరబడంగ
  ధర్మజుండుమరచు ధర్మమ్ములన్నవి
  బకమునుఁ గబళించు బల్లిఁ గనుము
  ** ** **
  ధర్మరాజు జూదము లో ఒక్కొక్కటి ఓడిపోవుట గని కర్ణునితో ధర్మరాజు...

  చంపకమాల

  మకిలని దెల్సియున్ శకుని మామయె పన్నిన తంత్రమంతయున్
  బకపు తపంపు ధర్మజుఁడు బానిస జూదపు బల్లి పట్టుకున్
  సకలము పోయి తమ్ములును జాలక ద్రౌపది నొడ్డె గాంచుమా
  బకమును మ్రింగుచున్న దొక బల్లి గనుంగొనుమయ్య మిత్రమా!

  రిప్లయితొలగించండి