జిలేబీ గారూ, పిల్ల తెమ్మెరగా కాకుండా సుడిగాలిలా సేవ చేస్తే పతిదేవుడు తట్టుకుంటాడా? మా 'అమ్మణి' ప్రేమ అలాంటిదే కనుక వృద్ధాశ్రమాన్ని ఆశ్రయించాను. చక్కని పూరణ. అభినందనలు.
జిలేబీ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. సాధారణంగా మీ పద్యాలు స్వీయముద్రతో ఆత్మాశ్రయంగా ఉంటాయి. ఇక్కడ 'నీహారిక'ను ప్రస్తావించారంటే అదే మీ అసలు పేరు కాదు కదా!
'శంకరాభరణం' సమస్యలు - సరదా పూరణలు రచన - జి. ప్రభాకర శాస్త్రి వెల - అమూల్యం పుస్తకాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి అందించాలని శాస్త్రి గారి ఉత్సాహం. కావాలసినవారు క్రింది ఫోన్ నెం. నేరుగా కాని, వాట్సప్ సందేశంగా కాని సంప్రదించండి. జి. ప్రభాకర శాస్త్రి - 9849015796 కంది శంకరయ్య - 7569822984
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2852 సమస్య :: రమ్మని పిల్చెఁ దండ్రి తొలిరాత్రికి కూతును ప్రేమ మీఱఁగన్. సందర్భం :: ఒక కుటుంబంలో తల్లి చిన్నప్పుడే చనిపోగా అక్క చెల్లెలిని తన బిడ్డలాగా వాత్సల్యంతో పెంచింది. పెద్ద జేసింది. తన బాధ్యత అనుకొని చెల్లికి పెండ్లి కూడా చేసింది. ఐతే ఆ చెల్లెలు అక్క పట్ల ఏమాత్రం ప్రేమ కృతజ్ఞత లేకుండా పెళ్లిమంటపంలోనే అందఱి సమక్షంలో అక్కను ఉద్దేశించి చాలాసార్లు కోపగించుకొన్నది. చెల్లి మాటలకు బాధపడిన అక్క మనసు విఱిగిపోయింది. పెండ్లికి తరువాత చెల్లికి జరుగబోయే తొలిరాత్రి పండుగకు ముందు అందఱూ ఆశీస్సులు అందిస్తూ ఉంటే ఆ అక్క మాత్రం మౌనంగా ఉండిపోయింది. అప్పుడు తండ్రి తన పెద్దకుమార్తెను చూచి అమ్మా! ఇంతకాలం అమ్మవై పెంచి పెద్దచేసి పెండ్లి కూడా చేసి ఇప్పుడు చెల్లికి జరిగే తొలిరాత్రి పండుగకు ముందు అందఱూ దీవిస్తూ ఉంటే నీవు చెల్లి కోపంతో మాట్లాడిన మాటలను మనసులో పెట్టుకొని మౌనంగా ఉంటున్నావా? దీవించేందుకు రామ్మా అని తన పెద్దకుమార్తెను బ్రతిమలాడే సందర్భం.
8,64,00,00,000 మానవుల సంవత్సరములు బ్రహ్మకు ఒక పగలు (రెండు కల్పములు) రెండు కల్పములు అవిరామముగ సృష్టి చేసిన బ్రహ్మ తొలి రాత్రి సమీపించు తరుణములో మన్మధుని ప్రేరేపణము కలిగి (సరస్వతి = బ్రహ్మ మానస పుత్రిక) శయ్యా సుఖ వాంఛతో తన భార్యను (కూతురు) ను గాంచి ఇలా పలికాడు. అవిరామముగా స్రుష్టిని చేశాను నీవు కూడా నాకు తోడుగా ఉంది ఎంతో సాయము చేశావు నిన్నటితో పగలు పూర్తీ అయినది ఇది తోలి రాత్రి మన్మధుడు నాపై బాణములు కురిపించాడు. ఓ సరస్వతి ఇది తొరి రాత్రి త్వరగా రా అని పిలువ చిరు నగవు నవ్వుచు సరస్వతి అతనిని ఓర కంటితో చూచుచు (బ్రహ్మ కైనా పుట్టు రిమ్మ తెగులు కదా ) మన్మధుడు బాణముల మహీం గదా అని సరస్వతి తలచెను అని భావన
చేసితి సృష్టిని చిద్విలాసముగ నే రెండు కల్పమ్ములు, రెప్ప మూయ క సతము నా తోడుగా నీవు మెలగుచు కరుణతో జీవుల కాచినావు, పగలు పూర్తాయెను, పచ్చవార్వపుజోదు శరములు కురిపించె, శాబ్ది!శుక్ల! త్వరగ రా, రమ్మని తండ్రి పిలిచెఁ దొలి రాత్రికిఁ గూఁతున్ సరసము లాడ,
బ్రహ్మ కోరిక వినినట్టి పలుకు కలికి, చిరు నగవు వదనముపైన చిందులాడ నోర కంటితో చూచుచు మారుని శర ఘాత మహిమ యని తలచె కలవరపడి
మీరూ, నేనే కాదు, మనం అందరం తమతమ శంకరాభరణం సమస్యా పూరణలో నచ్చిన వాటిని ఎన్నుకొని పుస్తకాలుగా ప్రచురించినచో బాగుండునని నా అభిప్రాయం...వారికి చిన్న చిన్న కానుకలుగా...
అలా చేయడం కన్న( చేయకూడదని కాదు) కంది వారి సువర్ణ స్వప్నము బృహత్ సమస్యా పూరణలు పుస్తకము వేస్తే దాన్ని బీట్ చేయడానికి సవాల్ రాబోవు తరానికి వేసినట్టుంటుందండి
డా. పిట్టా సత్యనారాయణ కొమ్మల నాట బొమ్మలని కొంపలుగూల్చు ప్రసార భారతి న్నమ్మిన ముచ్చటై జెలగు, నాతికి న్యాయము దాని పాత్రయే?(కాదని భావము) గుమ్మున శ్రోతలన్ మనుపు గోలయె!నీకది యేల పృచ్ఛకా? "రమ్మని పిల్చె దండ్రి తొలి రాత్రికి కూతును ప్రేమ మీరగన్"(yellow journalism పై నియంత్రణ ఉండాలి)
ఇమ్ముగ సింగా రించుకు
రిప్లయితొలగించండిరమ్మని తండ్రి పిలిచెఁ దొలి రాత్రికిఁ గూతున్
వమ్మగు తడవే యైనను
నెమ్మిని పిలువంగ వలయు నీకై యళియన్
===========================
అళియ = అల్లుడు
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కమ్మని "సువర్ణ సుందరి"
రిప్లయితొలగించండిమామ్మల యుక్తవయసునది మరలన్ వచ్చెన్
గమ్మున టికెట్లు కొంటిని
రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిసినిమా మొదటి ఆటకు కూతుర్ని రమ్మని పిలవటం చక్కని ఆలోచన. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
__/\__
తొలగించండిహాయి హాయిగా ఆమని సాగె
తొలగించండి👌🏻👏🏻🙏🏻💐
G P S vaarU .......
రిప్లయితొలగించండిGood Morning! If you don't have any objection, please mail me your New Jersey postal address. It would be my immense pleasure to send you a tiny gift:
తొలగించండిgps1943@yahoo.com
రిప్లయితొలగించండితల్లి లేని పిల్ల తల్లీతండ్రియై పరిధిని దాటి ఓ అయ్య చేతిలోపెట్టి
తెమ్మర వీవు రమ్మ పరిధిన్ సయి దాటుచు పెండ్లి చేసినా
నమ్మ జిలేబి క్రమ్ముకొను నాధుని మేల్కొని జీవితేశుడిన్
కమ్మగ మార్చుకొమ్మ ! సుడిగాలివలెన్ పతి సేవయేతగున్
రమ్మని పిల్చెఁ దండ్రి తొలిరాత్రికి కూఁతును ప్రేమ మీఱఁగన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిపిల్ల తెమ్మెరగా కాకుండా సుడిగాలిలా సేవ చేస్తే పతిదేవుడు తట్టుకుంటాడా? మా 'అమ్మణి' ప్రేమ అలాంటిదే కనుక వృద్ధాశ్రమాన్ని ఆశ్రయించాను.
చక్కని పూరణ. అభినందనలు.
ఖతర్నాక్ పూరణ జేసిన్రులే!
తొలగించండి😃👏🏻👌🏻🙏🏻
సమ్మరు వేళలం దునను సన్నని జాజులు మల్లెలే యటన్
రిప్లయితొలగించండిజుమ్మని తుమ్మెదల్ సరస జాగర ణంబొన రించగా నిలన్
గుమ్ముగ సోయగం బునను కోరిన భర్తను చేరుకో వలెన్
రమ్మని పిల్చెఁ దండ్రి తొలిరాత్రికి కూఁతును ప్రేమ మీఱగన్
అక్కయ్యా,
తొలగించండిమనోహరమైన పూరణ. అభినందనలు.
dhanya vaadamulu
తొలగించండిబావుందమ్మా మీ పూరణ. నమోనమః.
తొలగించండి🙏🏻🙏🏻
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిdhanya vaadamulu
తొలగించండి
రిప్లయితొలగించండిఅమ్మా ! నీహారిక! రా
రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్,
చెమ్మగిలిన కన్నుల, పతి
తిమ్మని కి శుభాంగి కమ్మతెమ్మర గానన్!
బస్తీ మే సవాల్
జిలేబి పరార్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాధారణంగా మీ పద్యాలు స్వీయముద్రతో ఆత్మాశ్రయంగా ఉంటాయి. ఇక్కడ 'నీహారిక'ను ప్రస్తావించారంటే
అదే మీ అసలు పేరు కాదు కదా!
జిలేబి గారికి జిలేబి యే కాకుండా చాలా మారు పేర్లున్నవి...నిహారిక, బుచికి, ఇత్యాది. వారి అసలు పేరు: "అనామిక"
తొలగించండి
తొలగించండికంది వారు
కాదండోయ్ !
"గజ" తరువాయి రాబోయే ఇవ్వాళ రాబోయే
மாபெரும் புயல் :)
ఏమవుతుందో యేమో !
నారదా
జిలేబి
తొలగించండిజీపీయెస్ వారు !
మంచి కాలం అన్యగామి, వైవియారు , కష్టేఫలి అంటూ ఇంకొన్ని పేర్లు చేర్చలే :)
జె కె :)
జిలేబి
గ్రేట్ తుఫాను...జిలేబీ గారూ!
తొలగించండిపేరుల కేమి కొదవ యార్యాంబా!!! (ఆర్యా? అంబా?)
తొలగించండి
తొలగించండిజగదాంబ :)
జిలేబి
తొలగించండిపోచిరాజు వారి ఉభయము గా ఒక శార్దూలము గిట్టు బాటయ్యె :)
ఆర్యాంబా! కొదవేమి పేరులకు హయ్యారే జిలేబమ్మవో?
సూర్యారావకొ? భాస్కరార్యుడివకో? సోంబేరివో? లేమవో?
పర్యంకంబున నిద్రపోవక సదా బ్లాగింగు లన్ చేయు యై
శ్వర్యా!చెప్పుచు విప్పుమీ ముడిని ఓ బంగారుబోడీ వెసన్!:)
జిలేబి
ఇంకనూ చిదంబర రహస్యమే!!!
తొలగించండి
తొలగించండిఅహహ! జిలేబి ! చిదంబర
రహస్య మే యింకను మదరాసీ మామీ :)
జిలేబి
'శంకరాభరణం' సమస్యలు - సరదా పూరణలు
రిప్లయితొలగించండిరచన - జి. ప్రభాకర శాస్త్రి
వెల - అమూల్యం
పుస్తకాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి అందించాలని శాస్త్రి గారి ఉత్సాహం.
కావాలసినవారు క్రింది ఫోన్ నెం. నేరుగా కాని, వాట్సప్ సందేశంగా కాని సంప్రదించండి.
జి. ప్రభాకర శాస్త్రి - 9849015796
కంది శంకరయ్య - 7569822984
తొలగించండిసరదా ప్రభాకర విభావరి :)
http://varudhini.blogspot.com/2018/11/blog-post.html
జిలేబి
__/\__
తొలగించండిSent two group photos to your yahoo mail...please check
తొలగించండిఅమ్మా! నవరాత్రంబుల
రిప్లయితొలగించండినిమ్మహి కాపాడు తల్లి కింటను బూజల్
నెమ్మది జేతుము నీవును
రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిదేవీ నవరాత్రులలో తొలిరాత్రి! చక్కని భావంతో ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
కం.
రిప్లయితొలగించండిఇమ్ముగ వరించితివి మీ
మమ్మీ తమ్ముని కొడుకును మల్లెల గదికీ
పొమ్మిక సమయము మీరెను
రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్"
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మల్లెల గదికిన్' అనండి.
తమ్ముని వివాహ మయ్యెను
రిప్లయితొలగించండిముమ్మర ముగ శోభ నం పు ముచ్చట దీర్ప న్
సమ్మతి దెలిపిరి నీవును
రమ్మని తండ్రి పిలిచె తొలి రాత్రికి గూతున్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఆవేదనతో...పూరణ
ఇమ్మగు పూరణమ్ము మదినెంచి , సమస్యను జూచినంత భా...
రమ్ముగఁ దోచె గుండె , యనరాని పదమ్ముల గాంచి మాట మౌ...
నమ్మె శరణ్యమన్నది , వినం గడు పాపమటంచునంటి నే (నే....)
రమ్మని(.,) పిల్చెఁ దండ్రి తొలిరాత్రికి కూఁతును ప్రేమ మీఱఁగన్"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అధిక్షేపాత్మకమై ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి( దసరా పండుగకి సకుటుంబంగా రమ్మనమని అమ్మాయిని ఆహ్వానిస్తున్న తండ్రి )
రిప్లయితొలగించండి"అమ్మ ! సుజాత ! వచ్చునుగ
దమ్మ శరన్నవరాత్రు లొక్క వా
రమ్ము దినమ్ములందు ; నిక
రావలె మీరలు తప్పకుండగా ;
వమ్మొనరింప కీపిలుపు
పాడ్యమి నాటికె ; పెద్దపండుగే !
ర " మ్మని పిల్చె దండ్రి తొలి
రాత్రికి కూతును ప్రేమ మీరగా .
జంధ్యాల వారూ,
తొలగించండిశరన్నవరాత్రులకు రమ్మన్న పిలుపుతో మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ !
తొలగించండిఇమ్ముగ చెల్లి వివాహము
రిప్లయితొలగించండినమ్మా! జరిపించి తీవె హర్షముతో చె
ల్లెమ్మకు తోడుగ చనగా
రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తల్లి లేని తన బిడ్డ వీరమ్మను సముదాయిస్తూ
రిప్లయితొలగించండినమ్మినవాడీతడు,నిన్
నెమ్మిని భరియించువాడు,నీ భర్తయె, వీ
రమ్మా!మాయమ్మవుఁగద!
రమ్మని తండ్రి పిలిచెఁదొలి రాత్రికిఁగూతున్.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిఇమ్మగు వాక్యములా యివి
రిప్లయితొలగించండినెమ్మది పోగొట్టె మదిని నేరము గాదా!
సమ్మతమా యిట్టులనుట
*"రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్"*
విట్టుబాబు గారూ,
తొలగించండిఅధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏🏻🙏🏻
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2852
సమస్య :: రమ్మని పిల్చెఁ దండ్రి తొలిరాత్రికి కూతును ప్రేమ మీఱఁగన్.
సందర్భం :: ఒక కుటుంబంలో తల్లి చిన్నప్పుడే చనిపోగా అక్క చెల్లెలిని తన బిడ్డలాగా వాత్సల్యంతో పెంచింది. పెద్ద జేసింది. తన బాధ్యత అనుకొని చెల్లికి పెండ్లి కూడా చేసింది. ఐతే ఆ చెల్లెలు అక్క పట్ల ఏమాత్రం ప్రేమ కృతజ్ఞత లేకుండా పెళ్లిమంటపంలోనే అందఱి సమక్షంలో అక్కను ఉద్దేశించి చాలాసార్లు కోపగించుకొన్నది. చెల్లి మాటలకు బాధపడిన అక్క మనసు విఱిగిపోయింది. పెండ్లికి తరువాత చెల్లికి జరుగబోయే తొలిరాత్రి పండుగకు ముందు అందఱూ ఆశీస్సులు అందిస్తూ ఉంటే ఆ అక్క మాత్రం మౌనంగా ఉండిపోయింది. అప్పుడు తండ్రి తన పెద్దకుమార్తెను చూచి అమ్మా! ఇంతకాలం అమ్మవై పెంచి పెద్దచేసి పెండ్లి కూడా చేసి ఇప్పుడు చెల్లికి జరిగే తొలిరాత్రి పండుగకు ముందు అందఱూ దీవిస్తూ ఉంటే నీవు చెల్లి కోపంతో మాట్లాడిన మాటలను మనసులో పెట్టుకొని మౌనంగా ఉంటున్నావా? దీవించేందుకు రామ్మా అని తన పెద్దకుమార్తెను బ్రతిమలాడే సందర్భం.
“నెమ్మది నీవె పెంచితివి, నిత్యము బిడ్డగ నెంచి చెల్లెలిన్
సమ్మతి పెద్ద జేసితివి, చక్కగ పెండిలి జేసినావు; కో
పమ్మున చెల్లి పల్కెనను బాధను దీవెన లీయకుందువా?
రమ్మ”ని పిల్చెఁ దండ్రి తొలిరాత్రికి కూతును ప్రేమ మీఱఁగన్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (20-11-2018)
కోట వారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
చక్కని భావన చేసినారు.అభినందనలు !
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి ప్రణామాలు.
తొలగించండిశ్రీ గుఱ్ఱం జనార్దన రావు గారికి నమస్కారములు.
తొలగించండిఅమ్మల కమ్మయైన మహిషాసురమర్దని గొల్వ సంప్రదా
రిప్లయితొలగించండియమ్ము నవోక్తరాత్రులు, గృహమ్మునఁ జేయుదు ముత్సవమ్మునున్
బెమ్మిని, యల్లునిం గలసి మీరలు పాడ్యమి నాడె చేరగా
రమ్మని బిల్చె తండ్రి తొలి రాత్రికి కూతును ప్రేమ మీఱగన్.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఅమ్మాయి యుద్వహమ్మయి
తొమ్మిది రాత్రులు గలిగిన తొలిపండుగిదే !
నెమ్మనమున పెనిమిటితో
"రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్"
***)()(***
(నెమ్మనము = నిండు మనసు.నవరాత్రులూ పుట్టింట గడుపుటకు నవ దంపతులనా తండ్రి యాహ్వానించాడు)
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కమ్మని ఙ్ఞాపకముగ తన
రిప్లయితొలగించండిసమ్మతితో పెండ్లి జేసి చక్కని వేళన్
సమ్మోదింపగ జంటను
రమ్మని తండ్రి పిలచె దొలిరాత్రికి కూతున్
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!
తొలగించండిఅమ్మో!యీపద్యమ్ముల
రిప్లయితొలగించండినమ్మనుముమ్మారులమ్మనమ్మకమీయన్
అమ్మదలపుకైతకునిడ
*"రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్"*
కవికి కావ్యము కూతురుగా భావనజేసి,ఆకవిత్వానికి నాందిగా తొలిపద్యానికి భావపుష్టినిమ్మని అమ్మను ఆహ్వానం పలుకుతూ
శంకర్జీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దేవీ నవరాత్రుల సందర్భంగా కూతురుని ఆహ్వానిస్తూ:
రిప్లయితొలగించండిఉ.మా.
బొమ్మల కొల్వుఁ బెట్టెదము పూజకు పూవుల సేకరించి యా
యమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మఁ గొల్తుమో
యమ్మ! బిరమ్ము నీదు పతి యానతి గైకొని పుట్టినింటికిన్
*"రమ్మని పిల్చెఁ దండ్రి తొలిరాత్రికి కూఁతును ప్రేమ మీఱఁగన్"*
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అమ్మా!యిత్తునురూకలు
రిప్లయితొలగించండిరమ్మనితండ్రిపిలిచె,దొలిరాత్రికిగూతు
న్నిమ్ముగదేవాలయమున
కమ్మనుబూజించుకొఱకుహరితోబంపెన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిడాకూ కాట్రేడునకు కొమర్తెను కట్టబెట్టిన తండ్రి పల్కుగా :)
అమ్మో! "గుప్పిట " "శశిధరు
డమ్మా ! వలదనకు మగని డాకూ కాట్రే
డమ్మా! మచ్చిక చేయన్
రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమ్మరొచేయుచుంటినిటయాదిపరాంబికకుత్సవంబునున్
రిప్లయితొలగించండిరమ్మనిబిల్చెతండ్రి తొలిరాత్రికిగూతునుబ్రేమమీఱగన్
నిమ్ముగ తొమ్మిదిన్దినములిచ్చటయుండగవీలుకానిచో
రమ్మికయొక్కరాత్రికినిరాహులుతోడనసంతసింతునున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'.నిట నాదిపరాంబిక... మీఱగా। నిమ్ముగ... లిచ్చట నుండగ... రాహులు తోడను..." అనండి.
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ప్రీతికై
రిప్లయితొలగించండినమ్మిన వారికిన్నెపుడు నండగనుండెడి దుర్గమాతకు
న్నిమ్మగు దేవిరాత్రులను నీమము తోడను బూజసేయగా
రమ్మని బిల్చె తండ్రి తొలి రాత్రికి గూతును ప్రేమమీరగన్
అఖండ యతికి క్క్షమార్పణలు!
తొలగించండిమా తండ్రిగారు జీవించియున్నంత కాలము మా కుమార్తెలకు యీ పిలుపు అందుతూ ఉండేది!!
తొలగించండివమ్మగు జీవితమ్ము మలవాసిని మాతను పూజచేయకే
తొలగించండినమ్మరొ!వీడబోకుమిది యద్భుతకాలము దేవిగొల్వగా
నెమ్మిని పుట్టినింటికిని నీవు కుటుంబము తోడుగా త్వరన్
రమ్మని పిల్చె తండ్రి తొలిరాత్రికి కూతును ప్రేమమీరగన్
సీతాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యోస్మీ గురుదేవా! నమస్సులు!!
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅమ్మకు మన యింటికి గౌ
రమ్మకు నే జేయు పూజలందుండుటకై
యొమ్మికగా నల్లునితో
రమ్మని తండ్రి పిలిచె దొలి రాత్రికి కూతున్
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి నమస్కారములు
తొలగించండి
రిప్లయితొలగించండికూతు- వీధి భాగవతము :)
కూతు లో అప్పుడప్పుడు డోల్బీ ఎఫెక్ట్ కోసం శాకినీ డా కి నీ లను పిలిచే తండ్రి :)
అమ్మా కర్ణపిశాచీ
రమ్మా యని పిలిచెను నిశి రాత్రిని రాలే
దమ్మ! వటయక్షిణీ రా
రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ 'గూఁతున్'
ఈపేర్లెక్కడివంటే నాకు తెలియవు :)
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితొమ్మిది రాత్రులందు కడు దీక్షను బూనుచు నమ్మతోడు నే
నమ్మకు నింటి దేవతకు నార్యకు పూజలొనర్చ దల్చితి
న్నొమ్మికగా తనూభవుడు యోగ్యుడు నల్లుని గూడి వెంటనే
రమ్మని పిల్చె దండ్రి తొలిరాత్రికి కూతును ప్రేమ మీఱగన్.
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి నమస్కారములు
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
రమ్మని పిల్చెఁ దండ్రి తొలి
రాత్రికి కూఁతును ప్రేమ మీఱఁగన్
సందర్భము: కాశీకి చేరుకున్నారు తల్లి తండ్రి కూతురు. బజారుకు వెళ్లిన కూతురుతో యిలా అంటున్నాడు తండ్రి..
"పవిత్రమైన కార్తిక మాసంలో కాశీ చేరుకున్నాం. మూడు రాత్రు లీ క్షేత్రంలో గడుపాలి. మేము ఏక భుక్తమే! ఏవో పండ్లు తిని పడుకుంటాం. నీవు వచ్చేటప్పుడు మరచిపోకుండా పండ్లు తీసుకురా! ఇవాళ తొలి రాత్రి."
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"అమ్మయు నేనుఁ బండ్లు తిని
యట్లె పరుండెద మమ్మ! కాశిలో
నిమ్ముగ కార్తికంబు గద!
యేకమె భుక్తము మూడు రాత్రులం..
దమ్మరొ! వచ్చుచో మరువ
కట్టులె పండ్లును బట్టుకొంచు రా
ర" మ్మని పిల్చెఁ దండ్రి తొలి
రాత్రికి కూఁతును ప్రేమ మీఱఁగన్
✒~డా.వెలుదండ సత్యనారాయణ
20.11.18
-----------------------------------------------------------
డా. వెలుదండ వారూ,
తొలగించండిప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తమ్ముని పెండ్లికి ముందుగ
రిప్లయితొలగించండికమ్మని వంటలు తెలిసిన కారణముననా
తొమ్మిది దినములముందే
రమ్మని తండ్రి పిలిచెఁదొలి రాత్రికిఁగూతున్
గంగాప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండినిన్నటి కందం :)
అమ్మడి మగడా రారా
రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్
చెమ్మగిలినకన్నులతో
తిమ్మా రావు సరసన్ సతిగ నిలుపనటన్
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమ్మోదికుల హితవుపై
రిప్లయితొలగించండిసమ్మతి తెలిపి తనయింట జరిపించుటకై
యిమ్ముగ నల్లుని తీసుకు
రమ్మని తండ్రి పిలిచె దొలిరాత్రికి గూతున్
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమ్మా యిపుడు రయమ్ముగ
రిప్లయితొలగించండిలెమ్మిఁకఁ జెల్లెలి నలంకరించుమ మఱి సీ
తమ్మా మంచి ముహూర్తము,
రమ్మని తండ్రి పిలిచెఁ, దొలిరాత్రికిఁ, గూఁతున్
నమ్ముమ తార తమ్యములు నా జనకుండు తలంపఁ డమ్మ యో
యమ్మరొ కోప మేల నిట నామెను ముందుగఁ దాత పిల్వగం
గమ్మని పేరు సంధ్య తన కన్నియ యామిని కూతు రిల్లు దూ
రమ్మని పిల్చెఁ దండ్రి తొలి, రాత్రికిఁ గూఁతును బ్రేమ మీఱఁగన్
[తొలి = తొల్లి; రాత్రికిఁగూతు = యామిని కూతురు]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
సొమ్ముల నమ్మివేయుచును చూపుల కందని సోయగమ్ముతో
ఝమ్మని నిల్లు కట్టితిని జంకక చేయుచు నప్పుసొప్పులన్
గమ్మున చేరబోవుదము కమ్మగ నిమ్ముము విస్కి వోడ్కతో
రమ్మని పిల్చెఁ దండ్రి తొలిరాత్రికి కూఁతును ప్రేమ మీఱఁగన్!
రమ్మని = రమ్ము + అని (రమ్ము = Old Monk Rum)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిగృహప్రవేశం రోజున మందుతో విందు. బాగున్నది మీ పూరణ. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరాభరణము నేటి సమస్య
రిప్లయితొలగించండిరమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్"
కంద పద్య పాదములో సమస్య
నా పూరణము సీసములో
8,64,00,00,000 మానవుల సంవత్సరములు బ్రహ్మకు ఒక పగలు (రెండు కల్పములు) రెండు కల్పములు అవిరామముగ సృష్టి చేసిన బ్రహ్మ తొలి రాత్రి సమీపించు తరుణములో మన్మధుని ప్రేరేపణము కలిగి (సరస్వతి = బ్రహ్మ మానస పుత్రిక) శయ్యా సుఖ వాంఛతో తన భార్యను (కూతురు) ను గాంచి ఇలా పలికాడు. అవిరామముగా స్రుష్టిని చేశాను నీవు కూడా నాకు తోడుగా ఉంది ఎంతో సాయము చేశావు నిన్నటితో పగలు పూర్తీ అయినది ఇది తోలి రాత్రి మన్మధుడు నాపై బాణములు కురిపించాడు. ఓ సరస్వతి ఇది తొరి రాత్రి త్వరగా రా అని పిలువ చిరు నగవు నవ్వుచు సరస్వతి అతనిని ఓర కంటితో చూచుచు (బ్రహ్మ కైనా పుట్టు రిమ్మ తెగులు కదా ) మన్మధుడు బాణముల మహీం గదా అని సరస్వతి తలచెను అని భావన
చేసితి సృష్టిని చిద్విలాసముగ నే రెండు కల్పమ్ములు, రెప్ప మూయ
క సతము నా తోడుగా నీవు మెలగుచు కరుణతో జీవుల కాచినావు,
పగలు పూర్తాయెను, పచ్చవార్వపుజోదు శరములు కురిపించె, శాబ్ది!శుక్ల!
త్వరగ రా, రమ్మని తండ్రి పిలిచెఁ దొలి రాత్రికిఁ గూఁతున్ సరసము లాడ,
బ్రహ్మ కోరిక వినినట్టి పలుకు కలికి,
చిరు నగవు వదనముపైన చిందులాడ
నోర కంటితో చూచుచు మారుని శర
ఘాత మహిమ యని తలచె కలవరపడి
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కమ్మని కావ్యశర్కరకుకాంతిరసమ్ముబలమ్ముసొమ్మునీ
రిప్లయితొలగించండివమ్మనివేల్పుటమ్మలు తపమ్మొనరించిదయాబ్ధిగ్రుంకిమా
యమ్మగబుట్టినమ్మబ్రతుకమ్మపురంధ్రినులాడిపాడ గౌ
*"రమ్మని పిల్చెఁ దండ్రి తొలిరాత్రికి కూఁతును ప్రేమ మీఱఁగన్"*
చోళరాజు ధర్మాంగదుడు బ్రతుకమ్మపండుగ వచ్చుటకు పూర్వమే బ్రహ్మోత్సవాలకు ముందు దేవతల నాహ్వానించినట్లు పిలుపు ఇచ్చారంటూ పూరించిన సందర్భంలో
శంకర్జీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పురంధ్రినులు' శబ్ద సాధుత్వం విషయంలో సందేహం!
రిప్లయితొలగించండికందివారికి
పుస్తక ప్రచురణకు ఎంత ఖర్చవుతుందో సుమారుగా తెలియ చేయగలరా ?
ఉదాహరణకు - జీపీయెస్ వారి పుస్తకం ఎన్ని పేజీలు
ఎన్ని పుస్తకాలు ప్రింట్ ? ఖర్చెంతవుతుంది రమారమి ?
జిలేబి
Top Secret!
తొలగించండి
తొలగించండి:)
ఇంకొకరు పుస్తక ప్రచురణ చేద్దామా వద్దా అన్న డైలమాలో వున్నారు :) వారికి ఉపయోగంగా రెఫరెన్స్ పాయింటు గా వుంటుందని అడిగా
ఆపై మీయిష్టం
జిలేబి
మీ మెయిల్ కు జవాబిచ్చాను. చూడండి.
తొలగించండి
తొలగించండికందివారికి
జీపీయెస్ వారికి
నమో నమః
జిలేబి
జిలేబి గారు:
తొలగించండిమీరూ, నేనే కాదు, మనం అందరం తమతమ శంకరాభరణం సమస్యా పూరణలో నచ్చిన వాటిని ఎన్నుకొని పుస్తకాలుగా ప్రచురించినచో బాగుండునని నా అభిప్రాయం...వారికి చిన్న చిన్న కానుకలుగా...
తొలగించండిఅలా చేయడం కన్న( చేయకూడదని కాదు) కంది వారి సువర్ణ స్వప్నము బృహత్ సమస్యా పూరణలు పుస్తకము వేస్తే దాన్ని బీట్ చేయడానికి సవాల్ రాబోవు తరానికి వేసినట్టుంటుందండి
Imagine
1116 samasya
For each samasya 10 pooranas
11160 padyams !
Per page 5 padyams
Massive 2000 + pages
Lofty idea is not it :)
జిలేబి
5 poems only for each Samsya...
తొలగించండిఒక్కొక్క సమస్యకు ఐదేసి పూరణల చొప్పున ఎన్నుకొని కొంత పని చేసి ఉన్నాను.. (కొంత అంటే <5%).
తొలగించండి
తొలగించండిSo 1116 pages + forward index etc 1200 pages approx
1200*1000 copies = 12 lakh pages
1 page cost ?
12 lakh pages cost ?
Any working done for base budget ?
జిలేబి
పెండ్లయిన మరునాడే మూఢాలు రావడంతో శోభనం వాయిదాపడడంతో నవదంపతులు ఉద్యోగరీత్యా వెళ్ళిపోయారు. శోభన ముహూర్తం నిర్ణయం కాగానే తండ్రి కూతురును రమ్మన్నాడనే యూహతో.........
రిప్లయితొలగించండిఖమ్మమ్శున నీ శోభన
మిమ్ముగ నేర్పరచితిమిక యేప్రిలు నెలలో
అమ్మా! సెలవును గైకొని
రమ్మని తండ్రి పిలిచెఁ దొలి రాత్రికిఁ గూఁతున్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమ్మా బొమ్మలకొలువట
రిప్లయితొలగించండితిమ్మమ్మే వచ్చిబిలిచె దేనికి రావా?
నమ్మిన నవరాత్రందున
రమ్మనితండ్రిబిలిచె !దొలిరాత్రికి గూతున్
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నవరాత్రి + అందున' అన్నపుడు యడాగమం వస్తుంది. "నవరాత్రులలో" అనండి.
తమ్ముని, నీదుసోదరిని తద్దయు ప్రేమగ పెంచినావు నీ
రిప్లయితొలగించండివమ్మగమారి యల్లుడునహర్నిశమున్ సహకార మివ్వగా
నిమ్ముగపెండ్లియున్ జరిగె నిద్దరికింపుగ చెల్లికోసమై
రమ్మని పిల్చెఁ దండ్రి తొలిరాత్రికి కూఁతును ప్రేమ మీఱఁగన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఎమ్మె పరీక్షలు గలవని
అమ్మయె చెప్పినది ;నీకు నదె విజయముకై
తొమ్మిది రాత్రుల పూజలు
రమ్మని తండ్రి బిలిచె దొలి రాత్రికి గూతున్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండికొమ్మల నాట బొమ్మలని కొంపలుగూల్చు ప్రసార భారతి
న్నమ్మిన ముచ్చటై జెలగు, నాతికి న్యాయము దాని పాత్రయే?(కాదని భావము)
గుమ్మున శ్రోతలన్ మనుపు గోలయె!నీకది యేల పృచ్ఛకా?
"రమ్మని పిల్చె దండ్రి తొలి రాత్రికి కూతును ప్రేమ మీరగన్"(yellow journalism పై నియంత్రణ ఉండాలి)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రేపు ఉ. 11 గం.లకు రాజరాజ నరేంద్ర గ్రంథాలయానికి వస్తున్నారా? వస్తే మీకు మన కవిమిత్రుల పుస్తకాలు ఇస్తాను.
కమ్మని భారతము వినగ
రిప్లయితొలగించండిరమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్
సమ్మతి దెలుపక నాపెయు
గమ్మున తన గదికి పోయె కాంతుని జేరన్
నిన్నటి సమస్యకు నా పూరణ
కృష్ణదేవ రాయ క్షేత్రమునకు పోయి
పండితుఁడ ననుచు బలుక నొకడు
రామ కృషుడపుడు రాపాడు సభలోన
బకమునుఁ గబళించు బల్లిఁ గనుము
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. "పండితుండ ననుచు..." అనండి.
కమ్మని భారతము వినగ
రిప్లయితొలగించండిరమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్
సమ్మతి దెలుపక నాపెయు
గమ్మున తన గదికి పోయె కాంతుని జేరన్
నిన్నటి సమస్యకు నా పూరణ
కృష్ణదేవ రాయ క్షేత్రమునకు పోయి
పండితుఁడ ననుచు బలుక నొకడు
రామ కృషుడపుడు రాపాడు సభలోన
బకమునుఁ గబళించు బల్లిఁ గనుము
ఈ పద్యాలు పైన సత్యనారాయణ మూర్తి గారి పేరున వచ్చాయే? ఇద్దరూ ఒకరేనా?
తొలగించండిడా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఅహరహము ఖాందిశీకుల
షహబాసన పెరిగె జనత సరికాదిదియున్
వహవా ట్రంపుగ మనవలె
సహనమె తొలగింప జేయు శాంతిని సుఖమున్
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిగణముల సంస్కృతోద్భటత గానరటంచు స లక్షణమ్ముగన్
గుణ గణ మెంచినందుననె గొప్పయె ఛందము లేని కావ్యముల్
గణనము దేనికో నదియ గట్టిగ వ్రాయగడంగరే కవుల్
క్షమమున మాయమైనదిల చప్పబడెంగదె పద్య కావ్యపుం
రణములె పండితోత్తముల రమ్యపు క్రీడలు సాహితీ ప్రభన్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'కాందిశీకుల' టైపాటు. "కావ్యపున్ రణములె" అనండి. అక్కడ అనుస్వారం రాదు.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఅహహా యింతటి యై.టి. యున్న ఫలమే యా యై.డి.లే లేకనే
సహ జీవంబన యోగ క్షేమ క్రియలే?సాధ్యంబె యీ పాలనన్
కుహనా పాలిత సంఖ్యలాయుధ ధరుల్ గూల్చన్ బ్రజాలిన్ యిలన్
సహనమ్మే తొలగింప జేయునుగదా శాంతమ్మున్ సుఖంబున్ భువిన్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'యోగ క్షేమ' మన్నపుడు 'గ' గురువై గణదోషం. 'ప్రజాలిన్ + ఇలన్' అన్నపుడు యడాగమం రాదు.
బామ్మకు చెప్పవే కమల వారము రోజులు రాత్రివేళలన్
రిప్లయితొలగించండిగమ్మని కృష్ణలీలలను గాథను గానము చేయుచుండె నీ
తమ్ముడు కోవెలన్, హరికథన్ దొలిసారిగ మీరు వేగమే
రమ్మని పిల్చెఁ దండ్రి తొలిరాత్రికి కూఁతును ప్రేమమీఱఁగన్.
అమ్మకు పూజలు సేయగ
రిప్లయితొలగించండితొమ్మిది రాత్రులు నవవిధ దుర్గమ్మకునై
తెమ్మని పువ్వులు తొలుతగ
రమ్మని తండ్రిపిలిచె తొలిరాత్రికి కూతున్.
గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ....
రిప్లయితొలగించండిఇమ్మహిలోన స్త్రీలు తమ యీప్సితముల్ ఫలియింప జేయ వా
రమ్మ భవాని పూజ లతి యాదృతితోనవ రాత్రులన్ సదా
సమ్ముద మొప్ప జేయుదురు, సత్వర మల్లునితోడ రా
రమ్మని పిల్చె తండ్రి తొలి రాత్రికి కూతును ప్రేమమీరగన్.
అమ్మాతెలుగమ్మకిదే
రిప్లయితొలగించండిసొమ్మగుభాషోత్సవమ్ముసురుచిరకరణిన్
ఇమ్ముగమూన్నాళ్ళుజరుగు
*"రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్"*
[11/21, 11:04 AM] +1 (972) 948-5253: 🙏
రిప్లయితొలగించండికమ్మగ పూజలు చేయుము
తొమ్మిది రోజులు నిశినని తోషము తోడన్
బమ్మయు దెలిపెను కావున
రమ్మని తండ్రి పిలిచె దొలి రాత్రికి కూతున్.