2, నవంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2834 (మంచిఁ బెంచువారు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మంచిఁ బెంచువారు మందమతులు"
(లేదా...)
"మంచినిఁ బెంచువార లిల మందమతు ల్గద యెంచి చూడఁగన్"

59 కామెంట్‌లు:

  1. సత్యవంతు లైన సంఘమ్ము యేమార్చు
    గట్టి మేలు గూర్చు గడుసు లైన
    కలియుగమ్ము లోన కాసులే ముఖ్యమ్ము
    మంచి బెంచువారు మందమతులు

    గురువుగారికి కవి మిత్రులందరికీ అభివాదములు!
    మాతృభూమికి తిరిగి వచ్చేశాను!😊😊😊

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్వాగతం! జననీ జన్మ భూమికి...భాగ్యనగరానికి...

      తొలగించండి

    2. వెల్కం బెకబెక

      దీపావళి ముందస్తు శుభాకాంక్షలు


      జిలేబి

      తొలగించండి
    3. స్వాగతమండి.
      మఱి మాతాపితరులను గలవడానికి పిల్ల లెప్పుడు వస్తున్నారో.

      మరమనుషుల మైనట్లున్నాము. పిల్లలను గని పర దేశములకు దత్తత చేస్తున్నాము. పోనీ లెండి మాతృ గోళమునకే కదా!
      పర గోళములకు పంపు రోజులు కూడా రానున్నవేమో!

      తొలగించండి

    4. అబ్బే!హాయిగా విదేశాలకెళ్ళి నాలుగు ప్రదేశాలను చూసి రాక వాళ్ళను రమ్మని మనమూ హైరానా పడిపోవడమెందుకండీ పోచిరాజు వారు !

      ఛలో ఛలో సబ్ దేష్ దేఖేంగే :)


      జిలేబి

      తొలగించండి
    5. Jilebi jee:

      A decade ago I wrote a piece titled:

      "In Praise of Laziness".

      Bengalis loved it and it was published at once in the "Now & Again" Column of The Statesman, Kolkata (with a picture of an IAS Babu drawn by their artist).

      I thought I was the epitome of laziness since I never bothered to get a passport. My only son proved me wrong...he does have a passport (and has traveled dozens of times) but declined to write the exams to go abroad for higher studies. So we two stay in Mother India.

      Get lazy please!

      http://gpsastry.blogspot.com/2009/10/in-praise-of-laziness.html?m=0





      తొలగించండి

    6. Surprising that such a lazy lubber GPS jee is spinning day and night vrittas and Kandas :)


      Very thought provoking article.

      Reminds lazy days of erstwhile Ami ek jajabor days watching another lazy having hooked for a fish in pond patiently lazy-ly waiting :)

      Cheers
      ಜಿಲೇಬಿ

      తొలగించండి
    7. My lifelong hero (a Tamilian like you) lived 70 good years without caring to dress or even speak...laziest bum of all...

      తొలగించండి
  2. కొంచ మైన నిలను కూరిమి లేకయే
    మించు నాశ తోడ మిన్ను నెక్కి
    సంచి నింపు వారు సందడి జేయగా
    మంచిఁ బెంచువారు మందమతులు

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    కొంచెము నీతిచెప్పగనె కోపమునందు , సభాంతరమ్మునం...
    దెంచడు ద్రోణభీష్మకృపులెందరు చెప్పిన , ధర్మపద్ధతిన్
    పంచడు రాజ్యమున్ , కురునృపాలుడు , దుర్మతి , వాని దృష్టిలో
    మంచినిఁ బెంచువార లిల మందమతు ల్గద యెంచి చూడఁగన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పరుల హితముఁ గోరి పాటుపడెడి వారు .,
      కోరి ఫలము వదులుకొనెడి వారు
      జగతి లోన రెండె జాతులు గలరండ్రు
      మంచిఁ బెంచువారు ., మందమతులు!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. సంచితపూర్వపుణ్యఫలసంపద మానవజన్మమండ్రు , కీ...
      ర్తించుము వాసుదేవుని హరిన్ మది , దేహమనిత్యమంచు భా...
      వించుము , ప్రేమఁ బంచుము పవిత్రమతిన్ చరియించుమల్లదే
      పొంచెను మృత్యుదేవత , విమోహమునన్ గని దీపముండగా
      నెంచుము చక్కబెట్టుకొననింటిని ., మానవ ! యన్న విందువా ?
      మంచినిఁ బెంచువార లిల మందమతుల్గద యెంచి చూడఁగన్!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. కులమతాలు లేవు .భళే!
      మంచిబెంచువారు-మందమతులు రెండేవర్గాలు
      బాగుంది G.P.Shastry గారూ!

      తొలగించండి


  4. పంకజాక్షి వినుమ! పౌరులు జగతిని
    మంచిఁ బెంచువారు, మందమతులు
    కూడ కొంత నాయకుల నెన్నుకొను సమ
    యమ్మునన్ జిలేబి యతనపడక !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. ఆ.వె.
    నీటి కొరకు వారు నిధులన్ని హెచ్చింప
    పచ్చ పైరులన్ని పారునటుల
    నచ్చనట్టివారు నమ్మరు మంచిని
    మంచి పెంచు వారు మందమతులు

    రిప్లయితొలగించండి
  6. స్వార్థ పర త వీడి సమత మమత బం చి
    సర్వ వేళ లందు సత్య మాడి
    మంచి బెంచు వారు మంద మతులు కారు
    మహిత సేవ జేయు మాన్య జనులు

    రిప్లయితొలగించండి


  7. కొంచెము కూడ సందియము కొత్తగ యేల! జనాళి సర్వదా
    మంచినిఁ బెంచువార లిల! మందమతుల్గద యెంచి చూడఁగన్
    కొంచెము కూడ చింతనల కొత్తగ చేయరు గాదె నేతలన్
    దించరు తప్పు చేయ సఖి తీరునకో మన కష్టనష్టముల్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. స్వార్థచిత్తుడగుచు నర్థసాధనఁ జేసి
    భోగ భాగ్యములను బొందువాడె
    కడుసమర్థుడని పొగడెడు జనుల కిల
    మంచిఁ బెంచువారు మంద మతులు.

    రిప్లయితొలగించండి
  9. కలియుగంబు గాన కల్లలాడెడివారు
    స్వార్థపరతతోడ సంచరించు
    వారు బుద్ధిజీవు లౌర! సన్మార్గులై
    మంచి బెంచువారు మందమతులు.


    మించిన స్వార్థభావమున మేదినిపై జరియించువారలున్
    వంచన చేయుచుండుటయె భవ్యపథంబుగ నెల్లవేళలం
    దెంచెడివార లీ కలిని నెంతయు విజ్ఞులు‌, ధర్మవర్తనుల్
    మంచినిఁ బెంచువార లిల మందమతు ల్గద యెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
  10. " ఎంచగ నంతరంగమున
    కెవ్విధి ద్రోహము జేయ ; విష్ణుశో
    భాంచితకావ్యరత్నమగు
    భాగవతమ్మును సింగరేనికిన్
    వంచనబుద్ధి నీయ " నని
    బల్కిన బమ్మెర పోతనార్యుబోల్
    మంచిని బెంచువార లిల
    మందమతుల్గద యెంచి చూడగన్ .

    రిప్లయితొలగించండి
  11. తాయిలాలు జూపితగువాడుచుండిరి
    స్వార్థబుద్దియెయది సమరమదియె
    ప్రజల మేలు గోర పథకాలు కావవి
    మంచిఁబెంచువారుమందమతులు!!

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2834
    సమస్య :: మంచినిఁ బెంచువార లిల మందమతు ల్గద యెంచి చూడగన్.
    *మంచిని పెంచేవాళ్లు మందమతులు కదా* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ఏ పని చేసినా త్రికరణ శుద్ధితో చేయాలి.
    *మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనామ్।*
    *మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనామ్।।*
    అనే సుభాషిత శ్లోకాన్ని మనం వింటూ ఉంటాం కదండీ. మనోవాక్కాయకర్మలలో ఏకత్వం ఉంటే మానవుడు మహనీయుడౌతాడు.
    శ్రీ రామకృష్ణ పరమహంస ఒక పిల్లవాడిని చూచి వాడికి “నాయనా నీవు మిఠాయిలను అతిగా తినడం మానుకో” అనే మంచిమాటను చెప్పదలచి ముందుగా తాను మిఠాయిలను తినడం మానుకొన్నాడు. ఏ పని చేయమని ఇతరులకు చెప్పదలచినాడో ఆ పనిని ముందుగా తానే ఆచరించినాడు.
    నీవు ఇలా చేయి అని చెప్పదలచిన మంచిని తాను ఆచరించకుండా మాటలలో మాత్రమే మంచిని కలిగియుండి మంచిని పెంచాలని అనుకొనేవాడు అజ్ఞాని అవుతాడు. మందమతి అవుతాడు అని విశదీకరించే సందర్భం.

    మంచినిఁ బెంచినాడు గద మాటలఁ జేతలఁ జిత్తవృత్తిఁ దా
    నంచిత రీతులన్ పరమహంస మహాత్ముడు రామకృష్ణు, డా
    మంచిని నాచరింపకయె మాటలు సెప్పుట యందు మాత్రమే
    మంచినిఁ బెంచువార లిల మందమతు ల్గద యెంచి చూడగన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (2-11-2018)

    రిప్లయితొలగించండి
  13. వంచనచేధరాత్మజను పట్టిసరాసరిలంకదెచ్చితే
    గొంచెమువాడుగాడు ధరకుంశుభమిచ్చుజనార్ధనుండు శి
    క్షించజనించెనంటనగ చెల్యనుహేలనొనర్చెరాజహో
    మంచినిఁ బెంచువార లిల మందమతు ల్గద యెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
  14. దైవసంపదలను దల్తురా కలియుగ
    మన్నగడనమిన్నమానవులకు
    _కరుణ_లింగము_యుగపరిధి_గమ్యముసున్న
    మంచిబెంచువారుమందమతులు

    రిప్లయితొలగించండి
  15. మంచిబెంచువారు మందమతులుగారు!
    నీతి నిలుపునట్టి నిష్టపరులు!
    పరులమేలుజేయు పరమాత్మరూపాలు
    ఆశదోషములను నంటరెపుడు!
    ౨) మూడుకోతులట్లు మూగగమారగ?
    చెడునువినరు,గనరు,జెప్పబోరు!
    నీతినిలుపగ!నవినీతి బెంచక
    మంచిబెంచువారు మందమతులు

    రిప్లయితొలగించండి
  16. కలరు భువిని పనుల సలుపుచు సతతము
    మంచిఁ బెంచువారు, మందమతులు
    గా పనులను చేయక తినుచు తుష్టిగా
    పరుల యార్జనమ్ము, తిరుగు వారు

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. మంచి మానవత్వమన్నది లేకను
      మంచిగాను జనుల ముంచుట, తగు
      మంచితములు నేడు, యెంచగ కలిలోన
      మంచిఁ బెంచువారు మందమతులు

      తొలగించండి
  18. మాతృభూమికి వచ్చినమాత!నీకు
    సాదరమ్ముగబలుకుదుస్వాగతమ్ము
    మాతృభూమినిమించినమహియగలదె!
    దివినిగంటెనుగొప్పది,తెలియునుగద,

    రిప్లయితొలగించండి
  19. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    *"మంచిఁ బెంచువారు మందమతులు"*

    సందర్భము: దుష్టులకు సదవకాశం యీయరాదు. ఎప్పు డిస్తామో అప్పటినుంచే దుర్వినియోగం మొద లవుతుంది. (మంచి తనాన్ని వాడుకుంటారు.)
    అప్పుడు మంచివారు మందమతు లనిపించుకుంటారు. బాధపడవలసివస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వుండాలి.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    స దవకాశ మొకటి సద్వినియోగంబుఁ
    జేసికొందు రనుచుఁ జేరి యీయ
    దుష్టులు సలుపుటను దుర్వినియోగంబు..
    మంచిఁ బెంచువారు మందమతులు

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    2.11.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  20. బుధ్ధిమంతులుగనుబూజింపబడుదురు
    మంచిపెంచువారు,మందమతులు
    మఱచిపోదురెపుడుమఱిమఱిచెప్పిన
    కొంచెమైనరాదుగుర్తుతనకు

    రిప్లయితొలగించండి
  21. నేటి శంకరాభరణము సమస్య
    మంచి బెంచు వారు మందమతులు
    ఆటవెలది పాదము
    నా పూరణము సీసములో

    రాముని అరణ్య వాసమునకు పంపమని కైక దశరధుని అడుగగా అప్పుడు దశరధుడు ఓ కైకా నీ కోరిక నేను ఎప్పుడైనా తీర్చను అన్ననా రాముడిని నీ కన్న కొడుకు కన్నా మిన్నగా చూచు కొన్నావు. ఈ బుద్ది నీకు పుటినది గాదు. ఎవరో నిన్ను
    ప్రోద్బలము చేస్తున్నారు. మాటలమంచి (తీయని మాటలు చెప్పి చెరుపు చేయు వారు) ఒట్టి అవివేకులు వారి వలన నీవు నష్ట పోవద్దు. నీ మంచి మనసు బెట్టి ఒక్క సారి ఆలోచించమని కైకను ఆ దశరధ భూపతి వేడెను అను భావన.

    నీదు కోరిక తీర్చ నే నెపుడైనను కాదంటి నా? కలకంఠి! రామ
    భద్రుని నీ కన్న బాలుని కన్న నదికముగా లాలించితివిగద? మరి
    నేడునీ కేమయ్యె? నీబుద్ది కాదిది, మానినీ, మాటల (మంచి బెంచు
    వారు మందమతులు), వారి వలన నీవు నష్ట పోదువెపుడు, యిష్ట సఖియ

    మాట విని చెడి బోకుమా, మనసు బెట్టి
    నొక్కమారు విచారమును సలుపు వలె
    ననుచు వేడుకొనెను కైక నా దశరధ
    భూపతి మనసులో బాధ నాపుకొనుచు

    రిప్లయితొలగించండి
  22. వంచనజేయరెప్పుడునుబాపముజోలికిబోవరెయ్యెడన్
    మంచినిబెంచువారలిల,మందమతుల్గదయెంచిచూడగన్
    మంచినిగూర్చిచెప్పుసరిమాటలువీనులకెక్కనీయకన్
    గొంచెముగూడనాతృతనుగుర్తుకుదెచ్చుకొనంగబూనరే

    రిప్లయితొలగించండి
  23. మంచి తుంచు వారు వంచనా శిల్పులు
    మంచి బాట బోరు యించుకంత
    మంచి లేమియె జగమంత, యెంచగ మరి
    మంచిఁ బెంచువారు మందమతులు

    రిప్లయితొలగించండి

  24. ఇంచుక న్యాయమే దొరుక దీజగతిన్ గలి కాలమందునన్
    మించెను స్వార్థమె య్యెడల మేలను మాటయె మృగ్యమయ్యెడిన్
    వంచక, దుష్ట బుద్ధి గల వారల దృష్టిని యక్కటక్కటా!
    మంచినిఁ బెంచువార లిల మందమతు ల్గద యెంచి చూడఁగన్
    (ధర్మపథమును నమ్ముకొని కష్టాల పాలైన వారి ఆవేదన యిది)

    రిప్లయితొలగించండి
  25. విలువ లన్ని నేడు తలక్రిందు లాయెను
    మానవత్వ మునకు మచ్చ వచ్చె
    పూర్ణ శుంఠ లిలను బూజ్యుల గుచునుండ
    మంచి పెంచు వారు మందమతులు !

    రిప్లయితొలగించండి
  26. పరుల బాగు గొరకు పరితపించు సతము
    మంచిబెంచువారు,మందమతులు
    నవకతవక పనులు ననయమ్ము జేయుచు
    కొక్కిరింతకుధర గురియగుదురు.!!!

    రిప్లయితొలగించండి
  27. త్రుంచుచు ప్రేమబంధముల దోచుచు పేదల వెల్గు నేతలే
    మంచినిఁ బెంచువార లిల, మంద మతు ల్గద యెంచి చూడఁగన్
    వంచన చేయకుండ యను వైన పదమ్మున రాజ్య మేలుచున్
    కాంచుచు తృప్తి పేదలను కాచుట యందు వసించు యోగ్యులే

    రిప్లయితొలగించండి
  28. పొగరు తోఁ దిరుగుచున్న కొడుకును జూచి యొక తండ్రి పలికిన పలుకులు:

    బుద్ధి యున్న వారు వోవు గతులు గావు
    కుల వినాశ మగు సకల జన భయ
    దమ్ముగ బెడిదంపు దౌర్జన్యమును, ముంచి
    మంచిఁ, బెంచువారు మందమతులు


    సంచుల నిండ నింపుటకుఁ జాలును గాంచఁగ గో కలాపముం
    బెంచుట కైన నియ్యది భువిం దగునే మఱి దేశ పౌర స
    త్సంచయ నంద వర్ధకము శాలి సుసస్యము మాని పూసకా
    మంచినిఁ బెంచువార లిల మందమతుల్ గద యెంచి చూడఁగన్

    [పూసకామంచి = ఒక రకమైన గడ్డి, కామంచి గడ్డిలో నొక రకము]

    రిప్లయితొలగించండి
  29. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    లంచము లిచ్చుచున్ ఖలులు రంజిల జేయుచు నేతలెల్లరిన్
    సంచుల నిండుగా నిధులు సందడి లేకయె క్రుక్కి నింపుచున్
    వంచన జేయుచున్ వడిగ వారిధి దాటుచు పారిపోవగా
    మంచినిఁ బెంచువార లిల మందమతు ల్గద యెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
  30. ఆత్మ తత్త్వమెరుగు ఆనంద రూపులు
    మంచిఁ బెంచువారు; మందమతులు
    మంచి బాట వదిలి పంచ మకారాది
    విద్య లనుచు తిరుగు వెర్రి వారు

    రిప్లయితొలగించండి
  31. కుజనులచెలిమెపుడు కూర్చును హానిని
    మంచి పెంచు వారు మందమతుల
    టంచు మాయ చేసి యణగద్రొక్కుదురిల
    ననవరతమటందు రార్యు లెపుడు.

    రిప్లయితొలగించండి
  32. వంచనఁ జేసి లబ్ధిఁ గొను వారె జగత్తున నున్నతస్థితిన్

    మించిరి, జ్ఞాను లట్లుగ నమేయయశమ్ముల నొంది రిద్దె ప్రా

    పంచకరీతి, మేలు నుడువం బెఱ వార సమర్థులైరహో!

    మంచిని బెంచువారిటను మందమతుల్ గద! యెంచి చూడగన్.

    కంజర్ల రామాచార్య.
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  33. డా.పిట్టా సత్యనారాయణ
    చెప్పి యొకటి,దాని జేసి చూపించిన
    మెప్పురాదు భువిని మిడుకు వారె
    గొప్ప కోసమైన కొంత పోరాడని
    మంచి బెంచు వారు మంద మతులు

    రిప్లయితొలగించండి
  34. డా.పిట్టా సత్యనారాయణ
    సంచిత ద్రవ్య మెంత?‌ సరి సంతును బెంచు విధాన మిద్దియే?
    వంచన జేయకే బ్రతుకు వంకల దీర్తు నటన్న దీక్ష;"నీ
    వుంచుకొనంగనే ననను, వుంచుము నాదియు నీదె పొమ్ము "రా
    యంచల బోలునా ప్రజలు యాచన జేయరు సాధు వృత్తినిన్
    కొంచెము స్వార్థమే యెరుగకుండగ గూరిమి బంచ లౌక్యమే?!
    మంచిని బంచు వారలిల మందమతుల్గద యెంచి చూడగన్

    రిప్లయితొలగించండి
  35. ఎంచెద రైరి లోకులు మహీతల మందు ధనాఢ్యు డొక్కడే
    సంచిత జ్ఞానశీలుడని జాతికి నాతడె మార్గదర్శిగా
    నెంచెడు వారికెల్ల ధన మించుక పొందక స్వార్థ శూన్యుడై
    మంచిని బెంచువారలిల మందమతుల్గద యెంచిచూడగన్

    రిప్లయితొలగించండి