28, నవంబర్ 2018, బుధవారం

సమస్య - 2859 (చన్నులు లేని యావులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చనులు లేని యావులు పాలఁ జాల నొసఁగె"
(లేదా...)
"చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్"

83 కామెంట్‌లు:

  1. చిక్క కుండను లండను చేర నిధులు
    బక్క వోయిన రైతులు పంట లొసగ
    కనగ వైపరీత్యమిదియె కంది వర్య:
    చనులు లేని యావులు పాలఁ జాల నొసఁగె

    రిప్లయితొలగించండి
  2. వింత యుగమిది గాంచగ కొంత వరకు
    నీలి వార్తలు వినుటకు నిలయ మయ్యె
    మహిమ లందున ముంచగ మంత్ర మేమొ
    చనులు లేని యావులు పాలఁ జాల నొసగె

    రిప్లయితొలగించండి


  3. అరరె! వేదముల దునిమి నరరె యర్థ
    ములను లాగుచుండిరచట మూల మేమి
    టన్నది తెలియక నరరె టంకుతనపు
    చనులు లేని యావులు పాలఁ జాల నొసఁగె!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...దునిమి యరరె... తెలియక యరరె...' అనండి.

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ


    అన్నలినాయతాక్షుడు మహాత్ముడు పుట్టగ , గొల్లపల్లె ప...
    ల్వన్నెలు సంతరించుకొనె , వాడిన చెట్లకు పూలు పూసె , సం...
    పన్నులునైరి బీదలును , *వార్ధకతన్ రసపూర్ణమైనవౌ*
    *చన్నులు లేని యావులు* బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  5. కన్నుల నెంత జూచినను
    గన్గొనజాలని వింతవింతలన్
    వెన్నులు జల్దరింపగను
    వేలకు వేలుగ సల్పునట్టి యా
    మిన్నగు నైంద్రజాలికుడు
    మెచ్చగ పౌరులు మాయచేయగన్
    జన్నులు లేని యావులు బ్ర
    సన్నత బాల నొసంగె బానెడున్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జంధ్యాల వారూ,
      ఇంద్రజాలంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నద. అభినందనలు.

      తొలగించండి
  6. కన్నులు లేని వాడు పలు గ్రంథములన్ పఠియించె, నోటిలో

    పన్నులు లేని వాడు కటుభక్ష్యములన్ నమిలెన్, సమస్యలో

    నెన్నగ కంది శంకరున కెవ్విధ మైనను సంభవమ్ములై

    చన్నులు లేని యావులుఁ బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  7. [11/28, 06:00] Shankarji Dabbikar: ఆత్మనెరిగినజ్ఞానులీయవనిజనుల
    మోహవల్లికఛేదించముదముగూర్చ
    జేయరెన్నెన్నిమహిమలజేయులనగ
    "చనులు లేని యావులు పాలఁ జాల నొసఁగె"
    [11/28, 06:08] Shankarji Dabbikar: వింటినొకపాటమార్మికావిష్కృతమది
    మూగమాట్లాడు బృందావనాగమమున
    నదియెదేవునిసన్నిధానమటులెయట
    "చనులు లేని యావులు పాలఁ జాల నొసఁగె"

    రిప్లయితొలగించండి

  8. పరలోకములోని ప్రభువా!అంతా నీ దయ!


    అన్నుల మిన్న జీససుని హార్దపు సాచివిలోకితమ్ముగా
    తిన్నగ లేచి మెల్ల నడతెంచిరి పావర లేనివారలే
    కన్నులు లేని వారలు నిఖార్సుగ చూచిరి లోకమంతయున్
    చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. కన్నెల మానసం బునను గారడి జేయుచు మోదమం దగా
    వన్నెలు జూపుచున్ మిగుల భాసుర మొప్పుచు తేజరిల్ల గన్
    కన్నయ చేయలే నిదట కానిప నేమియటంచు దెల్పుమా
    చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్

    రిప్లయితొలగించండి
  10. విన్నదిగన్నదాగలిగవిత్వసమస్యవిచారణన్నగున్
    గన్నులులేనిమావులునగమ్యముజేరెనుచిత్రచిత్రమై
    "చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్"
    మిన్నగచిత్రలేఖనము మేల్భళివాక్కులతప్పుబట్టెయే
    మన్ననుజెల్లుపెద్దలకమాయకబాలునినేర్పుగాంచరా

    రిప్లయితొలగించండి
  11. సాధ్య మయ్యె న సాధ్య మీ జగతి యనగ
    చంద్ర మండల యాత్ర యేసాగెనవని
    కాళ్ళు లేనట్టి వారికి కాళ్ళు వచ్చె
    చను లు లేని యావు లు పాల చాల నొసగె

    రిప్లయితొలగించండి
  12. అధిక లాభముల పుడమి నందు కొనగ
    కృత్రిమపు పాలుతా మపవిత్రమదిని
    సిద్ధమొనరించి మనుజుల సిరులు దోచ
    చనులు లేని యావులు పాలఁ జాల నొసఁగె
    ప్రభుత కనిపెట్టి దుష్టుల వంచు వరకు

    రిప్లయితొలగించండి
  13. పగలు నక్షత్ర కాంతులు బంచినపుడు
    పంచబోకను నోట్లు సర్పంచిగాగ!
    మూర్ఖుడానంద మందున మురిసినపుడు
    చనులులేని యావులు పాల జాలనొసగె!

    రిప్లయితొలగించండి
  14. డా. పిట్టా ‌సత్యనారాయణ
    చనువుగా వోట్ల నడుగుచు జాడ గనని
    తాయిలములను బ్రకటించు దరువు జూడ
    వచ్చు నీ యెన్నికలను సవాళ్ళు విసరు
    చనులు లేని యావులు పాల జాల నొసగు

    రిప్లయితొలగించండి
  15. జన్యు లోపమేమొ! పొడమె చనులు కొన్ని
    యాల గళము నందున జూడ పాల నీవు
    కాని యావిధముగ వాని గళము నందు
    "చనులు లేని యావులు పాలఁ జాల నొసఁగె"

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శిలలు రాగము లొలికించి నలరు జేయ
    ప్రతిమ లారగింపుల నన్ని కతుకు చుండ
    వింతలకు నిలయమ్మగు విశ్వమందు
    చనులు లేని యావులు పాల జాలనొసగె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...లొలికించి యలరజేయ' అనండి.

      తొలగించండి
  17. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2859
    సమస్య :: చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్.
    *చన్నులు లేని {పొదుగు లేని} ఆవులు సంతోషంగా బానెడు పాలనిచ్చినాయి* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: సంస్కృతభాషలోని న్యాయములలో అజా గళ స్తన న్యాయముఅనేది ఒకటి. నిష్ప్రయోజనములు అని చెప్పవలసి వచ్చినప్పుడు పోలిక చెబుతూ ఆడు మేక మెడ క్రింద ఉండే స్తనముల వలె నిష్ప్రయోజనములు అని చెబుతూ ఉంటారు.
    ప్రజాం న రక్షయేద్యస్తు రాజా రక్షాదిభిర్గుణైః।
    అజాగళ స్తనస్యైవ తస్య జన్మ నిరర్థకమ్॥
    రాజు అయినవాడు పోషణ శిక్షణ మొదలైన గొప్ప గుణములను కలిగియుండి ప్రజలను రక్షించాలి. అలా రక్షించలేకపోతే ఆ రాజుయొక్క జన్మ అజాగళస్తనతుల్యమై నిరర్థకము అవుతుంది అని పై శ్లోకమునకు భావం.
    ఆడుమేకవలె మెడ క్రింద నిరర్థకములైన స్తనములను ఆవులు కలిగియుండవు. అజాగళస్తనములను కలిగియుండకుండా ఆవులు సంతోషంగా సమృద్ధిగా పాలను ఇచ్చినవి అని విశదీకరించి చెప్పే సందర్భం.

    చన్నులు పాల నిచ్చు గద సంతతి బ్రోవ, నజా గళస్థమౌ
    చన్నులు పాల నీవు గద, సార్థకతన్ గనజాలవెన్న డా
    చన్ను లహో! యజాళి మెడచన్నుల వోలె నిరర్థకమ్ములౌ
    చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (28-11-2018)

    రిప్లయితొలగించండి
  18. చనులు లేని యావులు పాలఁ జాల నొసఁగె"
    యనెడు మాటలు వింతలేయగును నేడు
    కాని కాబోదు భవితలో కనుట నిజము
    అసహజములే,సహజములై యవతరించ

    రిప్లయితొలగించండి


  19. పిన్నలు ఫీల్డు ట్రిప్పునకు వెళ్ళిరి చూడగ మిల్కు ఫాక్టరిన్
    వన్నియ గాన నాబసిని వర్ణపు భాండములందు పాలు,నో
    తిన్నడు త్రిప్ప గొట్టమును తీరుగ పారగ క్షీరమున్!భలే!
    చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్!


    ಜಿಲೇಬಿ

    రిప్లయితొలగించండి
  20. మూగ వాడు పలుకును,సమ్మో
    హనముగ

    కనులు లేనివాడు జగతి కాంచ గలడు,

    చెమిటి వానికి పనిజేయు చెవులు రెండు

    సంతు కలుగును స్త్రీలకు సరస గతిని


    ఏసు పూజలు జేసిన ఇన్ని కలుగు

    నమ్మవలయును మీరెల్ల నాదు మాట

    చనులు లేని యావులు పాలు జాల నొసగె

    నిన్న యొకచోట, పెట్టెను నిన్న కోడి

    పుంజు నొక్కటి గుడ్లను సంజె వేళ

    జరుగు నెన్నియో వింతలు తిరగు లేక

    నమ్మి పూజించ ఏసును నెమ్మి కలుగు

    ననుచు నొకడు తెలుపుచుండె ఘనత తోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మీరూ కొత్త తీర్థం పుచ్చేసుకున్నారూ :)


      జిలేబి

      తొలగించండి
    2. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిన్న నొకచోట...' అనండి.

      తొలగించండి
    3. ఏసు పాదము (ఏ సుపాదము)ను మ్రొక్కిన తప్పేమీ వా సుదేవుడైనను ఏ సుదేవుడైనను తప్పేమీ లేదు గా

      తొలగించండి
  21. కనులు లేని కాంతామణి గాన లేదు
    మహిషములనుచేపి దలచె మదిన భళిర
    చనులు లేని యావులు పాలఁ జాల నొసఁగె
    రుచిని దెలియని భర్త జుర్రుకొనె వెర్రి

    రిప్లయితొలగించండి
  22. డా. పిట్టా సత్యనారాయణ
    పన్నుల నెన్ని వేసిన సెబాసను వారలె,బొక్కసంబున
    న్నెన్నగ లేని ద్రవ్యముల నీడ్చియు నప్పుల సంఖ్య బెంచ ముం
    దున్న ప్రణాళికల్ బహుగ నోపును నేతల జేబు నింపగా
    చన్నులు లేని యావులు బ్రసన్నత బాల నొసంగె బానెడున్

    రిప్లయితొలగించండి
  23. డా. పిట్టా సత్యనారాయణ
    వన్నెల పూర్ణపున్ బొదుగు వాసిని గానకె సేతపాలవే
    పన్నుగ "మేలు మేల"నుచు పద్యపు సేద్యము మాని "ప్లాస్టికౌ"
    సన్నని బియ్యమున్ గొనుచు సాగెను "మా వచనమ్మ"టన్న నా
    చన్నులు లేని యావులు బ్రసన్నత బాల నొసంగె బానెడున్

    రిప్లయితొలగించండి
  24. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కృతక రసన మిళితమగు పృశ్ని తోడ
    ప్రభుత కన్నులు గప్పుచు పరుల కంత
    మోస మొనరించు తీరుల మ్రుచ్చు లకట
    చనులు లేని యావులు పాల జాల నొసగె

    రిప్లయితొలగించండి
  25. చన్నులు లేని యావులు బ్రసన్నత బాల నొసంగె బానెడున్
    కన్నులు లేని యంధులు బ్రకాశము గొప్పగ గాంచె వేడ్కతో
    మిన్నుల నూతనంబుగ సమీరము వీచెను నేడదే యహో
    వెన్నల దొంగమా హరియె వేగమె రాగను మమ్ముగావగన్

    రిప్లయితొలగించండి
  26. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వన్నువ లేని చందమున పాలకు లల్లన మోసగించుచు
    న్నెన్నిక జేసినట్టివగు నీచ రసాయన మిశ్రమమ్ముతో
    చన్నులు లేని యావులు బ్రసన్నత బాల నొసంగ బానెడు
    న్నన్నటులన్ రసోత్తమము లాయిత జేయుచు నుంటిరే గదా!?

    రిప్లయితొలగించండి
  27. ఉచిత ముచిత మంచు సర్వముచిత మంచు
    జనుల యోట్లుబొంద దలచి స్వర్గ మికను
    చూపెదరరచేత గాదె చోద్యమేమి
    చనులు లేని యావులు పాలఁ జాల నొసఁగె

    రిప్లయితొలగించండి
  28. కవనమెరుగని వారలే కవులు గాగ
    గాన మెరుగని ఖరములే ఘనులు గాగ
    నోరు లేనట్టి కూనలే యారు నేల
    చనులు లేని యావులు పాలఁ జాల నొసఁగె

    రిప్లయితొలగించండి
  29. జన్యు లోపంబు నుదయించె జాలమందు
    చనులు లేని యావులు; పాలు చాల యొసగె
    పూర్ణకుంభము వోలెను పొదుగు గల్గి
    దూడ నేసిన ధేనువు తోషమంది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జన్యులోపాన నుదయించె' అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా!సవరించెదను!

      తొలగించండి
  30. ఎంతవెదికినగనబడవెచటకూడ
    చనులులేనియావులు,పాలజాలనొసగె
    తెలకపిండినిబెట్టుటవలననిన్న
    పౌష్టికాహారమీయగబాలుపెరుగు

    రిప్లయితొలగించండి
  31. నిన్నటి పూరణ:
    ఉల్ల మలరగ భావించి నల్లనయ్య
    తెల్లనౌ సుమముల మాల దీర్చి గొల్చి
    కడవ బెట్టి నిర్మాల్యము కనుల కద్ది
    నల్లగా నున్న మల్లెల నాతి దాల్చె

    రిప్లయితొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వచ్చె వచ్చె నెన్నికలు:👇

    కన్నుల పంట పండగను కానగ రాని కరెంటు కోతలో
    పన్నుగ హైద్రబాదునను భళ్ళున పారెడి మెట్రొరైలుతో
    మిన్నగ చంద్రశేఖరుని మీసము లెత్తిన భాగ్యనగ్రిలో
    చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్

    (మీసములు, చన్నులు, ఊహ్యములే)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  33. మన్నుననెచ్చటన్నరయమచ్చుకనైననుగానరావుగా
    చన్నులులేనియావులు,బ్రసన్నతబాలనొసంగెబానెడున్ నన్నువజెంగలిన్దినుచునాయతరీతినిదూడచేపగా
    గ్రన్ననజేపుచున్మిగులకమ్మనిబాలనునిచ్చునున్సుమీ

    రిప్లయితొలగించండి
  34. ఎన్నగ భక్తిలేక, దినమేవిధి పట్టెడు కూడునొందనై
    అన్నము వండకుంట గృహ మందున కార్తిక సోమవారమున్
    దన్నుగ బట్టనొక్క కవిదంతి రసాత్మకశైవకావ్యముల్
    చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్

    రిప్లయితొలగించండి
  35. మోఱ యెత్తి యెలుఁగు లిడ మీఱి యంత
    నావులకుఁ బగ్గములఁ జేయ వే వదులుగ
    రాటఁ గట్టిన యా మెడ త్రాళ్ళవ పలు
    చ నులు లేని యావులు పాలఁ జాల నొసఁగె

    [నులు = మెలిక]


    చెన్నుగ భూతలమ్మునను జీవ నికాయము గీత నాదముల్
    కన్నులు మూసి కొంచు వినుఁ గమ్మగఁ బాలిడ మాను నం చనం
    బన్నుగ నెంచ నీ వపుడు పాటల నాపి తొలంగ గట్టు నం
    చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్

    [అంచు +అన్ను; అన్ను = పారవశ్యము; సంగీతపుఁ బారవశ్యములో పాలు చేపుట మఱచు నన్న భావము ]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  36. వెన్నెల వేళ నానిశిని వెన్నలచోరుడు వేణువూదగా
    మిన్నుల నంటగా ముదము మేనున బుల్కలురేగగా దమిన్
    కన్నుల నీరుగార్చుచును గాంచుచు నాతని మోరలెత్తుచున్
    చన్నులు లేని యావులు బ్రసన్నత బాల నొసంగె బానెడున్

    చన్నుల లేని యావులు= లేగ దూడలు




    రిప్లయితొలగించండి
  37. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    కృ ష్ణ లీ ల :--

    మొన్నటి చిన్నవాడు గద ! భూధరముం గొనగోట నిల్పె | తా

    కన్నులు గప్పి దొంగ యనగా బ్రతి గేహము జొచ్చు పాలకై |

    పన్నుగ సైగ తోడ దధిపాత్రల శిక్యము నుండి దించు | నా

    యన్నులమిన్న లెల్ల కడు నబ్బుర మందగ వట్టి పడ్డ యా

    చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్


    { శిక్యము = ఉట్టి ; వట్టిపడ్డ = వట్టి పోయిన }


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి గారూ,
      అద్భుతంగా, మనోజ్ఞంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. ప ద న మ స్కృ తు లు గు రు దే వా ! ధ న్య వా ద ము లు

      తొలగించండి
  38. మిన్నగ సేవజేసెదను మీ పద ధూళినటంచు జెప్పి తా
    మెన్నికఁ గెల్వనెంచి యిల హీనుల మాటలు విన్నచాలదే
    కన్నులు లేనివాడు కన గల్గును గాదె సమస్త లోకమున్
    చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్

    రిప్లయితొలగించండి
  39. మాయలెన్నొ తా చూపంగ మాధవుండు
    మరులు గొనగ వ్రేపల్లెలో మగువలెల్ల
    వెన్నదొంగ వేణు రవము వినుచు నచట
    చనులు లేని యావులు పాలు జాల నొసగె.

    రిప్లయితొలగించండి