6, నవంబర్ 2018, మంగళవారం

శకట చక్ర చిత్ర బంధ తేట గీతి

లక్ష్మి దేవి ప్రార్ధన


తేటగీతి 
కలిమి చెలి! సింధు కన్యక! కలిమి భామ!
లక్ష్మి! పద్మవాస! కమలాలయ! రమ!  చల!
సిరి! జలదిజ! పద్మకర! శ్రీ ! శివము నిడుచు
కమల వాసిని  మమ్ముల కాచు నింక
ఇవి అన్ని లక్ష్మి దేవి నామములు
ఈ పద్యములో మధ్య (క)  అను అక్షరము బంధించ బడినది.    పైన కలిమి చెలి దగ్గిర నుంచి పద్యము మొదలై మూడు పాదములు పసుపు పచ్చ గళ్ళలో వస్తాయి నాలుగవ  పాదము మరల పైన (క) దగ్గిర నుంచి మొదలై వృత్తము లోని అక్షరములతో  కలిపి పూర్తి  అవుతుంది   

                                          బంధ కవి పూసపాటి కృష్ణ సూర్య కుమార్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి