18, నవంబర్ 2018, ఆదివారం

సమస్య - 2850 (సహనమె తొలఁగింపఁ జేయు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్"
(లేదా...)
"సహనమ్మే తొలఁగింపఁ జేయును గదా శాంతిన్ సుఖమ్మున్ భువిన్"

59 కామెంట్‌లు:

 1. న్యస్తాక్షరీ వారణ మొక ప్రక్క, నిషిధ్దాక్షరి గజ మొక ప్రక్క, సరస దత్త
  పది తురగమ్మొక ప్రక్క, నసందర్భ సంభాషణమ్ముల సాహినమ్ము 
  నొక ప్రక్క, నాశువు శకటమ్ము నొక ప్రక్క, వర్ణణా శోభిత వారువమ్ము 
  నొకప్రక్క మార్కొన. నొకప్రక్క ఘంటికా శమధుడు నిలువ, శాస్త్రధర స
  మస్యా ధరా భుక్కు మట్టు బెట్ట దలచ, నష్ట దిక్కుల లోన నాటలాడు 
  చదరంగపు క్రీడ సరిపోలు నష్టావధానము, నెదురొడ్డి తనదు శక్తి 
  రంజిల్లు నధ్వాహ(రణములె కద పండితులకు రమ్యక్రీడ) లిలిక లోన, 

  నాట వెలదుల కూర్చుచు నాట లాడి,
  వృత్తముల తోడ చేయుచు నృత్యము బహు
  సుందరముగ, రసజ్ఞుల డెందములను 
  దోచు గా కేళిలో సువిత్తులు సతతము. 

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   అష్టావధాన స్వరూపాన్ని వివర్ంచిన మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
   'నిషిద్ధాక్షరి, చదరంగపు క్రీడ' అన్నపుడు గణదోషం. సవరించండి.

   తొలగించండి
 2. గురువు గారు నిన్నటి పూరణము ఒక్కసారి పరిశీలన చేయండి

  రిప్లయితొలగించండి
 3. ఇహమే శాశ్వతమనుచును
  నహినహి దైవమ్మనుచును నయగారమునన్...
  "అహమిద" మను మాయ మమత
  సహకారము దొలఁగఁజేయు శాంతిని సుఖమున్ ;)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సార్! సమస్యా పాదం మారినది...పాతదే బావుంది :)

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   పూర్వపు సమస్యకు మాయా మమతల నేపథ్యంతో మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
   ఇప్పుడు మార్చిన సమస్యకు మీ క్రొత్త పూరణ నందించండి.

   తొలగించండి
 4. మహనీయుండగు బ్రహ్మనాయడు సదా
  మాధుర్యధుర్యంబుగా ;
  సహజీవంబుగ జాతినే నడుపగా
  సంకల్పసంసిద్ధుడై
  యహమున్ వీడి చరింప సంగరపుటా
  టాడించె నాగమ్మయే ;
  సహనమ్మే తొలగింపజేయును గదా !
  శాంతిన్ సుఖమ్మున్ భువిన్ .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జంధ్యాల వారూ,
   ప్రశస్తమైన ఐతిహ్యంతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 5. మైలవరపు వారి పూరణ

  *కర్ణా* !

  కుహనా ధీ యుతుడౌ సుయోధనుడు నీకున్ రాజ్యమిచ్చెన్ , భయా...
  వహ దుస్తంత్రమునందు వాడుకొన నిన్ పావన్నచందమ్ముగా !
  మహినన్యాయము జూచి స్వార్థమతివై మౌనమ్ముగానుంటివా...
  సహనమ్మే తొలగింపఁజేయును గదా శాంతిన్ సుఖమ్మున్ భువిన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి కృష్ణబోధా రూపమైన పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. చిరుసవరణతో....🙏

   కుహనా ధీ యుతుడౌ సుయోధనుడు నీకున్ రాజ్యమిచ్చెన్ , భయా...
   వహ దుస్తంత్రమునందు వాడుకొన నిన్ పావన్నచందమ్ముగా !
   మహినన్యాయము జూచియున్ జడమతిన్ మౌనమ్ముగానుంటివీ...
   సహనమ్మే తొలగింపఁజేయును గదా శాంతిన్ సుఖమ్మున్ భువిన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  3. బహువిధ ఫలదము సుఖదము
   సహనము భూషణమటండ్రు సజ్జనులిలలో !
   నహముఁ గొన మదిని దొలగగ
   సహనమె , తొలగింప జేయు శాంతిని సుఖమున్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 6. సహనమ్మూనుట శాస్త్రసమ్మతలసత్సౌహార్దసంభూతమౌ

  సహనోపేతయుధిష్ఠిరప్రముఖరాజన్యుల్ యశమ్మొందగన్,

  సహనమ్మేరికి లేదొ, వార లిల విశ్వాసమ్ముఁ గోల్పోవ, దు

  స్సహనమ్మే తొలగింపఁ జేయును గదా శాంతిన్ సుఖంబున్ బువిన్.

  కంజర్ల రామాచార్య.
  కోరుట్ల.

  రిప్లయితొలగించండి
 7. కుహనా నేతల గెలువగ
  మహనీయుడు గాంధి మహిత మార్గ మహింసన్
  వహియించె--వ్యధనుఁజెందెను
  సహనమె తొలగింపఁజేయు శాంతిని సుఖమున్.

  రిప్లయితొలగించండి
 8. నిన్నటి రేడియో సమస్యకు నా పూరణం
  అణువణువున పద గుంభన,
  తృణమేనియు వర్ణనమున దీటై నిల్వన్
  క్షణ మలసట యెఱుగని, ధా
  రణములెఁగద పండితులకు రమ్య క్రీడల్.

  రిప్లయితొలగించండి
 9. అహములు తరుగుచునున్నవి
  దహనముజఠరాగ్నిలోనదశదిశదప్పెన్
  బహుళాన్నముగుడవకన న
  "సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర్జీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాద భావం సందిగ్ధం.

   తొలగించండి
 10. అహమున్నవారికుండదు
  సహనమె, తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్
  సహధర్మచారి మానస
  సహకారమెరుగనిచోట సదనమునందున్ .

  రిప్లయితొలగించండి
 11. మహనీయుల్ధరనేలనేలనిలలో మాయంబగున్ధర్మముల్
  కుహనానేతలకే కలిన్బలముసంకోచమ్మదేలా!మునున్
  సహదేవుంగనిగోవిదుండనె ,సభన్ సచ్చీలురేలేరు ;దు
  "స్సహనమ్మే తొలఁగింపఁ జేయును గదా శాంతిన్ సుఖమ్మున్ భువిన్"

  రిప్లయితొలగించండి
 12. సహనపు యుధిష్టరునకు న
  సహనపు కౌరవులకైన సంపదలున్నన్
  బహువిధ యాశలవలలో
  సహనమె తొలగింప జేయుశాంతిని సుఖమున్

  రిప్లయితొలగించండి
 13. అహరహము స్వార్థ బుద్ధిని
  నిహ పరముల స్పృహయు లేక నీప్సితములతో
  నహమును, షడ్గుణముల పై
  *"సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్"*

  రిప్లయితొలగించండి
 14. మహిలో గల దౌష్ట్యములను
  దహియింపగ సహనమొకటె తప్పని సరియౌ
  నహమును పెంచుచు నుండు య
  "సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్"

  రిప్లయితొలగించండి
 15. అహరహము నేనను స్పుృహ
  గహనమ్మయి యావరింప కనుగానకనే
  వహియింప నహంకృతిని య
  సహనమె తొలగింప జేయు శాంతిని సుఖమున్

  రిప్లయితొలగించండి
 16. సహనమ్ముండిన నిత్యమున్ నరులకున్ సాధ్యమ్ము సాధించగా
  సహవాసమ్మును, భిన్న ధర్మములకున్ సఖ్యంబు గా నుండుటన్
  మహిలోనెల్లరు పెంచుకోవలయునేమాత్రమ్ము తగ్గింపనీ
  *"సహనమ్మే, తొలఁగింపఁ జేయును గదా శాంతిన్ సుఖమ్మున్ భువిన్"*

  రిప్లయితొలగించండి
 17. ఇ హ పరము ల నాశింప క
  రహి గూర్పని పనులు పెక్కు రాక్షస ఫణతి న్
  విహిత ము గా నొ న రింప న
  స హనమె తొలగించు శాంతి ని సుఖ మున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. స హనమె తొ ల గింప జేయు శాంతి ని సుఖ మున్ అని చివరి పాదం సవరణ చేయడమైనది

   తొలగించండి
 18. అహమును జూపుచు బుధులని
  సహకవులని వృద్ధులనక సతతము తానే
  బహు పండితుండననెడి య
  సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్

  రిప్లయితొలగించండి
 19. సహనమ్మన్నది మేలుజేయు గుణమై సౌభాగ్యమే యిచ్చుగా
  యహమున్ ద్రుంచక నదంతు లేని దయినన్నా భావనే కీడగున్
  కుహనావాదుల మాయలోన బడినన్ గోరంత మేల్జేయకే
  "సహనమ్మే తొలఁగింపఁ జేయును గదా శాంతిన్ సుఖమ్మున్ భువిన్"
  ****)()(****
  అతిదానాత్బలిర్బద్ధో హ్యతిమానాత్సుయోధన:!
  వినష్టో రావణో లౌల్యా దతి సర్వత్ర వర్జయేత్ !!
  **)(**

  రిప్లయితొలగించండి
 20. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2850
  సమస్య :: సహకారమ్మె తొలంగజేయును గదా శాంతిన్ సుఖమ్మున్ భువిన్.
  *సహకరించడం అనేది శాంతి సౌఖ్యాలను తొలగిస్తుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: పెద్దకుమారుడైన శ్రీ రామచంద్రునికి పట్టాభిషేకం చేయాలని దశరథ మహారాజు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ విషయాన్ని విన్న మంధర కైకను చేరి అమ్మా! రాముడు రాజైతే మన బిడ్డ భరతుడు ఆ రామునికి దాస్యం చేయాలి. నీవు కాబోయే మహారాణి కౌసల్యకు దాస్యం చేయాలి. దాస్యం చేయడానికి ఇష్టపడకపోతే మనం అంతా అడవులకు వెళ్లాలి. కాబట్టి నీవు నీకు నీ భర్త ఇచ్చిన రెండు వరాలు ఇప్పుడు ఇమ్మని అడుగు. నీ వరాలతో రామునికి వనవాసం, భరతునికి పట్టాభిషేకం సమకూరాలి అని దుర్బోధ చేసింది. ఆ దుర్బోధ వినిన కైక కోరరాని కోర్కెలు కోరి తన భర్త ప్రాణములు పోయేందుకు కారణమై విధవ అయ్యింది.
  కాబట్టి
  వినదగు నెవ్వరు చెప్పిన,
  వినినంతనె వేగపడక వివరింప దగున్,
  కని కల్ల నిజము తెలిసిన
  మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
  అనే సుమతి శతక పద్యాన్ని గుర్తుపెట్టుకో. చాడీకోరుల మాటలు నమ్మవద్దు. నమ్మితే ఆ దుష్ట వాక్కుల సహకారమే నీకు శాంతిని సుఖాన్ని దూరంగా తొలగిపోయేటట్లు చేస్తుంది అని అక్క తన చెల్లెలికి హితమును ఉపదేశించే సందర్బం.

  “వహియించున్ గద రాము డీ భువి, నికన్ పట్టాభిషేక మ్మగున్,
  గహనమ్మేగును బిడ్డడౌ భరతుడే, కైకా!” యనన్ మంధరన్
  కుహనావాదిని గూడి కైక చెడె; నీకున్ ముప్పగున్ దుష్ట వా
  క్సహకారమ్మె తొలంగజేయును గదా శాంతిన్ సుఖమ్మున్ భువిన్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (18-11-2018)

  రిప్లయితొలగించండి
 21. ఇహమునశాంతినినిచ్చును
  సహనమె,తొలగింపజేయుశాంతినిసుఖము
  న్నహమనుభావముగల్గిన,
  నహమునువిడనాడవలయునభవునిగృపకై

  రిప్లయితొలగించండి
 22. అహమేప్రాణినిగ్రుంకజేయుచునుదానాజీవికెల్లప్పుడు
  న్సహనమ్మేతొలగింపజేయునుగదా,శాంతిన్సుఖమ్మున్భువిన్
  సహనమ్ముండినబొందవచ్చునిలనాశాజ్యోతివెల్గుల్లలో,
  నిహమున్శంభునిబూజజేయగనుశివైక్యంబులొందన్నగున్

  రిప్లయితొలగించండి
 23. సహనమ్మే తొలఁగింపఁ జేయును గదా శాంతిన్ సుఖమ్మున్ భువిన్
  ప్రహరీ దాటుచు భారతావనిని హా!*పాక్ తాను కవ్వించగా
  సహియింపన్ దగదెన్నినాళ్ళు పదరా సాగించ యుద్ధమ్మునే
  గ్రహణంబయ్యది వీడి శాంతి సుధలే రంజిల్ల విశ్వమ్మునన్

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 24. ఇహమే శాశ్వత మనుచును
  కుహనా సంస్కారులయ్యి కువలయ మందున్
  నహమును వీడని వారి య
  సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్

  రిప్లయితొలగించండి
 25. సహకార మించు కేనియు,
  వహించ కోర్మి, సలుపంగ వలదం చని తా
  విహరించఁ గోప మూని య
  సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్


  అహ రాద్యంతము దుర్భరాశన సమాహారంబు సాగుం గదా
  యిహ మందున్ జన సంచయమ్మునకు నిట్లీక్షించగన్ రోషని
  ర్దహనప్రాభవ భాసితద్యుతి మనో ధైర్యమ్ము నిండన్, మహా
  సహనమ్మే తొలఁగింపఁ, జేయును గదా శాంతిన్ సుఖమ్మున్ భువిన్

  [మహా +అసహనము = మహాసహనము]

  రిప్లయితొలగించండి
 26. సహనమ్మే గద భూషణమ్మనెడు విశ్వాసమ్మునే గల్గు నీ
  సహకారమ్మును బొంది నేతలయి నిస్వార్థమ్మునే వీడి దు
  స్సహులై దోచెడు నీచులన్ గనుచు నిశ్శబ్ధమ్ముగా యున్న నీ
  సహనమ్మే తొలఁగింపజేయును గదా శాంతిన్ సుఖమ్మున్ భువిన్.

  రిప్లయితొలగించండి
 27. అహరహము హరినికొల్చుచు
  రహితో జీవితము గడుప బ్రతుకున శుభమౌ
  అహమును వీడక యుండు న
  సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్

  రిప్లయితొలగించండి
 28. అహమును వదిలిన మనుజులు
  సహనము ప్రేమయు గలిగిన సౌఖ్యము కలుగున్
  సహనము విడిచిన నరులక
  సహనమె తొలగింప జేయు శాంతిని సుఖమున్

  గొర్రె రాజేందర్
  సిద్దిపేట

  రిప్లయితొలగించండి
 29. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సహధర్మిణి యహమించుచు
  నహర్నిశము కొంపయందు నధికారంబున్
  వహియించు టదియ పతిలో
  సహనమె తొలగింప జేయు శాంతిని సుఖమున్

  రిప్లయితొలగించండి
 30. దేవిక
  ----

  దహియించగ క్షుద్బాధయె
  సహనమ్మును గోలుపోయి కాశిన్ ; సతి యా
  గ్రహమున్ వ్యాసుడె బొందె ; న
  సహనమె తొలగింప జేయు శాంతిని సుఖమున్ !

  రిప్లయితొలగించండి
 31. "సహనము వలయును జనులకు
  దహియించును దౌష్ట్యమున"ని ధర్మజుడనగా
  సహియింపని ద్రోవది యనె
  "సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్"
  (Their view points differ from each other)

  రిప్లయితొలగించండి
 32. "సహనము వలయును జనులకు
  దహియించును దౌష్ట్యమున"ని ధర్మజుడనగా
  సహియింపని ద్రోవది యనె
  "సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్"
  (Their view points differ from each other)

  రిప్లయితొలగించండి
 33. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


  సహనాహింసల బూని పోరి కడకున్ సాధించె స్వాతంత్ర్యమున్

  మహ‌నీయుండగు గాంధి గారు మును | కానన్ సోదరా ‌నీవు లో

  ‌‌నహమున్‌‌‌‌‌ నర్తిల నీక , వర్తిల హితంబౌగా - విలోకింప | ని

  స్సహనమ్మే తొలగింపజేయును గదా శాంతిన్ సుఖంబున్ భువిన్ !

  సహన స్వాంతము మించు‌‌ నట్టి నిశితాస్త్రం బేది యోజింపగన్‌ ? ?


  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 34. గ్రహములు నేవిధి యున్నను
  సహనముతో నున్ననాడె జయమగు మహిలో
  సహకారము కొఱవడిన న
  సహనమె తొలగింప జేయు శాంతియు సుఖమున్!!!

  రిప్లయితొలగించండి
 35. ఇహమున మేలును కూర్చును
  సహనమె,తొలగింప చేయు శాంతిని సుఖమున్
  నహమును చూపుచు సతతము
  కుహనా బుద్ధినిల జూపకువలయమందున్

  రిప్లయితొలగించండి
 36. అహరహ ములుశ్రమి యించగ
  నిహపర ములశాంతి గలుగు నీమము దప్పన్
  కుహనా గారము వీడక
  సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్

  రిప్లయితొలగించండి
 37. నా ప్రయత్నం :

  కురుక్షేత్రయుద్ధమున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో...

  కందం

  అహితుల బాంధవ్యములున్
  దహియింపగ రణము వీడ దలచిన పార్థా!
  విహితమ్ము నెరుగనట్టి య
  సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్
  ** ** **
  మత్తేభవిక్రీడితము

  అహితమ్మౌవిధి దేశపాలనఁపు బాధ్యత్వమ్ము స్వార్థమ్ముతో
  విహితమ్ముల్ నెరవేర్చుటల్ మఱచి నిర్వీర్యమ్ము జేయంగ నే
  మిహిరుల్ జూచియుఁ జూడనట్లు మనినన్ మేధావి వర్గమ్ముదౌ
  సహనమ్మే తొలగింపఁ జేయును గదా శాంతిన్ సుఖమ్మున్ భువిన్  రిప్లయితొలగించండి
 38. అహమును తనువున దాల్చియు
  నహరహమును జిర్రుబుర్రులాడుచు బరులన్
  బహువిధ దూషణజేయు న
  సహనమె తొలగింపజేయు శాంతిన్ సుఖమున్.

  రిప్లయితొలగించండి
 39. అహమును తనువున దాల్చియు
  నహరహమును జిర్రుబుర్రులాడుచు బరులన్
  బహువిధ దూషణజేయు న
  సహనమె తొలగింపజేయు శాంతిన్ సుఖమున్.

  రిప్లయితొలగించండి
 40. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి


 41. తహతహ లాడుచు నెల్లరి
  ని హటాత్తుగ తాకుచుండు నేర్పులు తోడై
  యహముల్ జిలేబి మదిని న
  సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి